ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో | Bangalore Days Movie Telugu OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Banglore Days OTT: రానా-సమంత రీమేక్ సినిమా.. ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్

Aug 20 2024 1:44 PM | Updated on Aug 20 2024 2:56 PM

Bangalore Days Movie Telugu OTT Streaming Details

ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు. నెల-నెలన్నరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ సినిమా తెలుగు వెర్షన్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇందులో సమంత, రానా జంటగా నటించడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

2014లో రిలీజైన మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'. దుల్కర్, నివీన్ పౌలి, నజ్రియా, పార్వతి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని 2016లో తమిళంలోకి రీమేక్ చేశారు. ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా, రానా, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీన్ని తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.

దీంతో అప్పటినుంచి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ చేసి, నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. 'బెంగళూరు డేస్' పేరుతో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఒరిజినల్ మలయాళ వెర్షన్ చూడాలంటే హాట్‌స్టార్‌లో ఉంది. సబ్‪‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగానే చూడొచ్చు.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement