ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆగస్టు 15 నాటికి 50 రోజుల మార్క్ అందుకుంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్లే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?)
గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఆగస్టు మూడో వారంలోనే 'కల్కి' ఓటీటీలోకి రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఓ రోజు ముందే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చింది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో భవిష్యత్, భూత కాలాల్ని చూపించారు. అలానే మహాభారతం ఎపిసోడ్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఆలోవర్ హిట్ టాక్‌తో రూ.1200 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి)
The dawn of a new ERA awaits you 🌅
And this is your gateway into the GRAND world of Kalki⛩️🔥#Kalki2898ADOnPrime🔥, Aug 22#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/9FYs2quk5C— prime video IN (@PrimeVideoIN) August 17, 2024
Comments
Please login to add a commentAdd a comment