ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్‌తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్‌గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.
లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)
Comments
Please login to add a commentAdd a comment