ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ | Kala Ratri Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Kala Ratri OTT: మలయాళ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో ఓటీటీ రిలీజ్

Aug 16 2024 7:22 PM | Updated on Aug 16 2024 7:26 PM

Kala Ratri Movie OTT Streaming Details

ఓటీటీల వల్ల బోలెడు ఉపయోగాలు. ఇందుకు తగ్గట్లే పలు భాషల్లో డబ్బింగ్ చిత్రాలన్నీ నేరుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. గతేడాది రిలీజైన 'నల్ల నిళవుల రాత్రి' చిత్రాన్ని 'కాళరాత్రి' పేరుతో డైరెక్ట్ ఓటీటీలో తెచ్చేస్తున్నారు.

(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీల్లో ఉన్నాయ్?)

బాబు రాజ్, చెంబన్ వినోద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కాళరాత్రి'.. ఆగస్టు 17 అంటే ఈ శనివారమే ఓటీటీలోకి రానుంది. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. ఒరిజినల్ లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో అది కూడా నేరుగా ఓటీటీలోనే వచ్చేస్తుంది. కాబట్టి వీకెండ్‌లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు.

'కాళరాత్రి' విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం. తక్కువ ధరకే వచ్చేస్తుందని 266 ఎకరాలని తోట కొనడానికి వెళ్తారు. తీరా చూస్తే తోట మధ్యలో గెస్ట్ హౌస్. దీంతో అక్కడ పార్టీ చేసుకుంటారు. అనూహ్య ఘటనలు జరిగి వీళ్లలో కొందరు చనిపోతారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు ఎలా చనిపోతున్నారు అనేదే స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు.

(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement