జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో? | 70th National Film Awards Winning Movies To Watch In Various OTT Platforms, Here's The List Inside | Sakshi
Sakshi News home page

National Award Winning Movies In OTT: అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ‍ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే?

Aug 16 2024 3:38 PM | Updated on Aug 16 2024 4:29 PM

70th National Awards Movies In Various OTT Platforms

70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)

నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీ

  1. ఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

  2. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

  3. ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్‌లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్‌ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.

  4. ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. 

  5. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

  6. సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో ఉంది.

  7. వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.

  8. కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.

  9. గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్‌లో ఉంది.

  10. ఉ‍త్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.

  11. విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్‌స్టార్‌లో ఉంది.

  12. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

  13. ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

  14. ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్‌స్టార్‌లో ఉంది.

(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement