అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు? | Mahesh Babu In Talks For Voicing The Iconic Role Of Mufasa In Telugu In Upcoming Mufasa The Lion King, Deets Inside | Sakshi
Sakshi News home page

Mahesh Babu: రాజమౌళి మూవీకి ముందే మరో కొత్త ప్రాజెక్ట్‌లో!

Published Sat, Aug 17 2024 7:31 AM | Last Updated on Sat, Aug 17 2024 9:38 AM

Mahesh Babu In Talks For Mufasa Movie Telugu Dubbing

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. పొగడాటి జుత్తు, ఒత్తయిన గడ్డంతో ఈ మధ్యే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ఉండొచ్చు. ఇక రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా సరే ఇది పూర్తయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ఏం చేయడానికి వీలు పడదు. కానీ మహేశ్ మాత్రం మరో క్రేజీ చిత్రంలో భాగం కానున్నాడని తెలుస్తోంది.

2019లో హాలీవుడ్‌లో రిలీజైన 'ద లయన్ కింగ్'.. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలకు మించి వసూళ్లు సాధించింది. ఇప్పుడే ఈ సిరీస్‌లోని మరో మూవీ 'ముఫాసా'. ఈ ఏడాది డిసెంబరు 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ లాంటి బోలెడన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి)

ఈ మూవీ కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పాత్ర ముఫాసాకు బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇతడి కొడుకులు ఆర్యన్, అబ్రామ్‌తోనూ సింబా, బుల్లి ముఫాసా పాత్రలకు డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు తెలుగులో మహేశ్‌తో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో 'ముఫాసా'కి క్రేజ్ ఏర్పడచ్చు. అలానే తెరపై కనిపించనప్పటికీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని మహేశ్ పలకరించే అవకాశముంటుంది. ఈ డబ్బింగ్ చెప్పేందుకుగానూ మంచి మొత్తమే ఆఫర్ చేశారట.

(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement