banglore days
-
ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు. నెల-నెలన్నరలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఓ సినిమా తెలుగు వెర్షన్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇందులో సమంత, రానా జంటగా నటించడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)2014లో రిలీజైన మలయాళ సినిమా 'బెంగళూరు డేస్'. దుల్కర్, నివీన్ పౌలి, నజ్రియా, పార్వతి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని 2016లో తమిళంలోకి రీమేక్ చేశారు. ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహా, రానా, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీన్ని తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.దీంతో అప్పటినుంచి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్ చేసి, నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. 'బెంగళూరు డేస్' పేరుతో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఒరిజినల్ మలయాళ వెర్షన్ చూడాలంటే హాట్‌స్టార్‌లో ఉంది. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగానే చూడొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
తరచూ ఇంటికి వచ్చి వేధిస్తున్నాడు: పోలీసులకు ప్రముఖ నటి ఫిర్యాదు
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసెజ్‌లు పంపిస్తూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల నిన్న(డిసెంబర్ 20) అతడిని అరెస్టు చేశారు. కాగా పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా తన వెంటపడి వేధిస్తున్నాడు. చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే.. ఈ క్రమంలో డెలివరి బాయ్ అవతారమెత్తి ఆమెకు తరచూ ఫుడ్ ఫార్శిల్ తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చి రచ్చ చేసేవాడు. దీంతో పార్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వద్దని అతడిని హెచ్చరించిన అతడు వినలేదని ఆమె వాపోయింది. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వస్తుండేవాడని, ఈ క్రమంలో సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే మరొపక్క తన సెల్‌ఫోన్‌కు అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడంటూ నటి పార్వతి పోలీసులతో పేర్కొంది. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి తనని వేధిస్తున్నాడంటూ పార్వతి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే వ్యక్తి తనను తాను లాయర్, ఫిల్మ్ మేకర్‌గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్ని వేధింపులకు గురి చేసినట్లు ఆమె తెలిపింది. కాగా పార్వతి తిరువొత్తు చార్లీ, బెంగళూరు డేస్, టేకాఫ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
రాయ్‌లక్ష్మీ కౌగిలించుకోమంది
తమిళసినిమా: నటి రాయ్‌లక్ష్మి భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యాన్నిచ్చిందని వర్ధమాన నటుడు అర్జున్ పేర్కొన్నాడు. ఎక్స్ వీడియోస్ చిత్రంలో నెగెటివ్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడీయన. ఈయన తొలి తమిళ చిత్రం పుళల్ అట. ఆ తరువాత ఆర్య, బాబీసింహా హీరోలుగా నటించిన బెంగుళూర్ డేస్ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. అందులో నటి రాయ్ లక్ష్మి లవర్‌గా నటించాడు. చాలా మంది నటనపై మోహంతో సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. అర్జున్ రంగప్రవేశమే వేరే మాదిరిగా జరిగిందట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే. నాకు స్వతహాగా బిడియం ఎక్కువ. నా స్నేహితులు కెమెరా ముందు నిలబడి నటిస్తే బిడియం పోతుందని చెప్పి మోడలింగ్ రంగంలోకి పంపారు. ఆ సమయంలోనే విష్ణు అనే మిత్రుడి ద్వారా పుగళ్ చిత్రంలో నటించడానికి డాన్స్, నటన తెలిసిన వారు కావాలన్న విషయం తెలిసి ప్రయత్నించగా అవకాశం వచ్చింది. తరువాత ఎంబీఏ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో ట్రైనింగ్ కోసం రిసెప్షన్లో పనికి జాయిన్ అయ్యా. అలాంటి సమయంలో అక్కడ నటుడు సూర్య చిత్ర షూటింగ్ జరిగింది. అందులో నటించిన రమ్య అనే నటి ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బెంగుళూర్ డేస్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. అలా ఆ చిత్ర అసోసియేట్ సజో సుందర్‌తో స్నేహం ఎక్స్ స్టూడియోస్ చిత్రంలో నటించడానికి కారణమైంది. బెంగుళూర్ డేస్ చిత్రంలో బిడియ స్వభావం కలిగిన నాకు నటి రాయ్లక్ష్మీతో రొమాన్స్ చేసే సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి నెలకొంది. నేను సంశయించడంతో రాయ్లక్ష్మీనే భయపడకు గట్టిగా కౌగిలించుకో అని ధైర్యం చెప్పింది. అంత కంటే కష్టమైన విషయం ఆ చిత్రంలో బాబీసింహతో ఫైట్ సన్నివేశంలో నటించడం. అందుకు చాలా టేక్స్ తీసుకున్నా. ఆ చిత్రాల అనుభవమే ఎక్స్ వీడియోస్ చిత్రంలో కొత్త వాడిగానే తెలియలేదు అనే ప్రశంసలు అందించాయి. ఇకపై కూడా మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను అని అర్జున్ పేర్కొన్నారు. -
టైటిల్ వివాదానికి తెర దించాడు
మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే, కోలీవుడ్‌లో సినీ రంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకే అక్కడి సినిమాలు, సినీ నటులు ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటారు. ఇలా వివాదాల్లో ఇరుక్కున్న ఓ సినిమా ఇప్పుడు బయటపడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగళూర్ డేస్' తమిళ రీమేక్, టైటిల్ వివాదం సద్దుమణిగింది. రానా, ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రీమేక్ సినిమాకు ముందుగా 'అర్జున్ దివ్య మీనాక్షి కార్తీక్' అనే పేరు పెట్టారు. అభిమానులకు ఈ పేరును షార్ట్ కట్లో ఏడీఎంకే అని అలవాటు చేశారు. దీంతో వివాదం మొదలైంది. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు అన్నాడీఎంకే కావటంతో సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమాకు మదగజ రాజా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాను షార్ట్ ఫాంలో ఎమ్జిఆర్ అని పిలవటంతో ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో తమ సినిమా విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అన్న ఆలోచనతో భాస్కర్ తన సినిమా టైటిల్‌ను మార్చేశాడు. ఇప్పటివరకు ఏడియంకేగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'బెంగళూరు నాట్గల్' అనే పేరును ఫైనల్ చేశారు. దీంతో చాలా రోజులుగా నలుగుతున్న టైటిల్ వివాదానికి తెరపడింది.