
ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు పోలీసులను ఆశ్రయించింది. అసభ్యకరమైన మెసెజ్‌లు పంపిస్తూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల నిన్న(డిసెంబర్ 20) అతడిని అరెస్టు చేశారు. కాగా పోలీసుల సమాచారం ప్రకారం.. హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి రెండేళ్లుగా తన వెంటపడి వేధిస్తున్నాడు.
చదవండి: పుష్ప స్పెషల్ సాంగ్‌పై సమంత హాట్ కామెంట్స్, సెక్సీగా కనిపించాలంటే..
ఈ క్రమంలో డెలివరి బాయ్ అవతారమెత్తి ఆమెకు తరచూ ఫుడ్ ఫార్శిల్ తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చి రచ్చ చేసేవాడు. దీంతో పార్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వద్దని అతడిని హెచ్చరించిన అతడు వినలేదని ఆమె వాపోయింది. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వస్తుండేవాడని, ఈ క్రమంలో సెక్యూరిటీతో కూడా గొడవ పెట్టుకునేవాడట. ఇలా కొంతకాలంగా వేధిస్తూనే మరొపక్క తన సెల్‌ఫోన్‌కు అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడంటూ నటి పార్వతి పోలీసులతో పేర్కొంది.
చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్
దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కాగా గతంలో కూడా ఓ వ్యక్తి తనని వేధిస్తున్నాడంటూ పార్వతి 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే వ్యక్తి తనను తాను లాయర్, ఫిల్మ్ మేకర్‌గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్‌ని వేధింపులకు గురి చేసినట్లు ఆమె తెలిపింది. కాగా పార్వతి తిరువొత్తు చార్లీ, బెంగళూరు డేస్, టేకాఫ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment