Actress Archana Kavi Alleges Rude Behaviour by Kochi Police: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మలయాళ నటి అర్చనా కవి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రస్తుతం సదరు కానిస్టేబుల్‌ను అంతర్గతంగా విచారిస్తున్నట్లు కొచ్చి డీసీపీ వెల్లడించారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌తో కలిస బయటకు వెళ్లి వస్తుండగా కానిస్టేబుల్ వల్ల తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఈ సంఘటన తనని ఎంతో బాధించిందని, ఆభద్రత భావానికి లోనయ్యానంటూ వాపోయింది. ఈ మేరకు ఆమె ‘‘నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె ఇద్దరు పిల్లలు కలిసి ఆదివారం సరదాగా బయటకు వెళ్లాం.
చదవండి: జీవితాన్ని.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్ తర్వాత అని చెప్పాలి: నటి
ఆటోలో రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాం. ఈ క్రమంలో పెట్రోలింగ్‌లో భాగంగా కొచ్చి పోలీసులు మేం వస్తున్న ఆటోను ఆపారు. అనంతరం ‘ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నారని, ఈ పిల్లలు ఎవరూ.. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు’ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేధించారు. మేం ఇంటికి వెళుతున్నామని అని చెప్పిన వినిపించుకోలేదు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ మమ్మల్ని నమ్మడానికి కూడా రెడీగా లేరు. దీంతో మమ్మల్ని ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారు. ఈ ఘటన నన్ను ఎంతో వేధించింది’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై తాను పోలీసులను నిందించడం లేదని, వారి డ్యూటి వారు చేశారంది.
చదవండి: ముంబై గ్రాండ్ పార్టీకి విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం?
అయితే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనిపై కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నమన్నారు. సినీనటి, పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నామని, రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. వారిని ఆపి ప్రశ్నించారన్నారు. ఆ సమయంలో నటి తన ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల కానిస్టేబుల్ ఆమెను గుర్తు పట్టేలేదని చెప్పారు. ఆ పరిస్థితుల్లో నటి అయినా, సాధారణ మహిళ అయినా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదన్నారు.
చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై
అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పెట్రోలింగ్‌లో భాగంగా వారి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారన్నారు. అయితే ఇద్దరు వెర్షన్‌లు విన్నాక నటి ఈ ఘటన వల్ల ఇబ్బంది పడ్డారని, అభద్రత భావానికి లోనయ్యారని అర్థమైందన్నారు. సెక్యూరిటి, భద్రత ఇవ్వాల్సిన అధికారే వారిని ఇబ్బంది పడేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో కావాలంటే సదరు కానిస్టేబుల్‌కు సమాన్లు ఇస్తామన్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. కాగా నటి అర్చనా కవి మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె బ్యాక్ బెంచ్ స్టూడెంట్ హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment