Back Bench Student
-
రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్
Actress Archana Kavi Alleges Rude Behaviour by Kochi Police: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మలయాళ నటి అర్చనా కవి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రస్తుతం సదరు కానిస్టేబుల్‌ను అంతర్గతంగా విచారిస్తున్నట్లు కొచ్చి డీసీపీ వెల్లడించారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్‌తో కలిస బయటకు వెళ్లి వస్తుండగా కానిస్టేబుల్ వల్ల తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఈ సంఘటన తనని ఎంతో బాధించిందని, ఆభద్రత భావానికి లోనయ్యానంటూ వాపోయింది. ఈ మేరకు ఆమె ‘‘నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె ఇద్దరు పిల్లలు కలిసి ఆదివారం సరదాగా బయటకు వెళ్లాం. చదవండి: జీవితాన్ని.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్ తర్వాత అని చెప్పాలి: నటి ఆటోలో రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాం. ఈ క్రమంలో పెట్రోలింగ్‌లో భాగంగా కొచ్చి పోలీసులు మేం వస్తున్న ఆటోను ఆపారు. అనంతరం ‘ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నారని, ఈ పిల్లలు ఎవరూ.. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు’ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేధించారు. మేం ఇంటికి వెళుతున్నామని అని చెప్పిన వినిపించుకోలేదు. ఆ సమయంలో ఆ కానిస్టేబుల్ మమ్మల్ని నమ్మడానికి కూడా రెడీగా లేరు. దీంతో మమ్మల్ని ఇబ్బందికర ప్రశ్నలతో వేధించారు. ఈ ఘటన నన్ను ఎంతో వేధించింది’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై తాను పోలీసులను నిందించడం లేదని, వారి డ్యూటి వారు చేశారంది. చదవండి: ముంబై గ్రాండ్ పార్టీకి విజయ్, రష్మికలకు మాత్రమే ఆహ్వానం? అయితే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనిపై కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నమన్నారు. సినీనటి, పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నామని, రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్.. వారిని ఆపి ప్రశ్నించారన్నారు. ఆ సమయంలో నటి తన ముఖానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల కానిస్టేబుల్ ఆమెను గుర్తు పట్టేలేదని చెప్పారు. ఆ పరిస్థితుల్లో నటి అయినా, సాధారణ మహిళ అయినా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పెట్రోలింగ్‌లో భాగంగా వారి నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారన్నారు. అయితే ఇద్దరు వెర్షన్లు విన్నాక నటి ఈ ఘటన వల్ల ఇబ్బంది పడ్డారని, అభద్రత భావానికి లోనయ్యారని అర్థమైందన్నారు. సెక్యూరిటి, భద్రత ఇవ్వాల్సిన అధికారే వారిని ఇబ్బంది పడేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని, ఈ విషయంలో కావాలంటే సదరు కానిస్టేబుల్‌కు సమాన్లు ఇస్తామన్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. కాగా నటి అర్చనా కవి మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె బ్యాక్ బెంచ్ స్టూడెంట్ హీరోయిన్గా నటించింది. -
ప్రేయసిని వివాహమాడిన హీరో
చెన్నై : బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 ఫేమ్ మహత్ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో మహత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. కాగా, పెళ్లి మూడు రోజుల క్రితం మహత్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అందులో ప్రాచీతో తన జర్నీని వివరించాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాతో మహత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు. -
ఆ క్రికెటర్ కథతో సినిమా తీస్తా!
‘‘మూస ధోరణిలో ఉన్న కథలు నాకిష్టం ఉండదు. అందుకే కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాను. నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరికేంతవరకూ అన్వేషిస్తాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. దర్శకునిగా స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి వినూత్న కథలు తెరకెక్కించిన శ్రీధర్ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ చెబుతూ - ‘‘ఓ క్రికెటర్, ఓ నటి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఇంటర్నెట్ ఎలా మార్చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ ఐదేళ్లల్లో ప్రేక్షకులు ఇలాంటి బోల్డ్ చిత్రాన్ని చూసి ఉండరు’’ అని శ్రీధర్ చెప్పారు. -
అందుకే నిర్మాతగా మారాను :‘మధుర’ శ్రీధర్
‘‘హిందీ రంగంలో సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ తదితరులు దర్శకులుగా కొనసాగుతూనే ఇతర దర్శకులతో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వారి బాటలో మనం ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మాయ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘నా దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహ గీతం’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మంచి కథ కుదిరితేనే దర్శకునిగా చేయాలనుకున్నాను. ఈ నేపథ్యంలో నీలకంఠ చెప్పిన ‘మాయ’ కథ నచ్చి, నిర్మించాను. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉత్కంఠభరితంగా ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ఉంటుంది. రషెస్ చూడక ముందు ఏ, బి సెంటర్స్‌కే పరిమితం అవుతుందన్నవారు, సినిమా చూసిన తర్వాత ‘సి’ సెంటర్స్‌లో కూడా ఆడుతుందన్నారు. ఎమ్మెస్ రాజు, విజయేంద్రప్రసాద్, బోయపాటి శ్రీను రషెస్ చూసి, ‘తెలుగు సినిమాకి మంచి రోజులొస్తున్నాయి’ అన్నారు. అతీంద్రయ దృష్టి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. క్రికెటర్ శ్రీశాంత్ స్ఫూర్తితో ‘సచిన్’, హిందీలో ఘనవిజయం సాధించిన ‘విక్కీ డోనర్’ ఆధారంగా ‘దానకర్ణ’ చిత్రాలు చేయబోతున్నాన’’ని ఆయన తెలిపారు.