ప్రేయసిని వివాహమాడిన హీరో | Mahat Raghavendra Tied Knot With Prachi Mishra | Sakshi
Sakshi News home page

ప్రేయసిని వివాహమాడిన హీరో

Published Sat, Feb 1 2020 5:17 PM | Last Updated on Sat, Feb 1 2020 6:05 PM

Mahat Raghavendra Tied Knot With Prachi Mishra - Sakshi

చెన్నై : బిగ్‌బాస్‌ తమిళ్‌ సీజన్‌ 3 ఫేమ్‌ మహత్‌ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్‌ ప్రాచీ మిశ్రాతో మహత్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్‌ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్‌, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. 

కాగా, పెళ్లి మూడు రోజుల క్రితం మహత్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. అందులో ప్రాచీతో తన జర్నీని వివరించాడు. బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ సినిమాతో మహత్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ ‘బిగ్‌బాస్‌’ షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement