తండ్రిగా ప్రమోషన్‌ పొందిన నటుడు..ఫోటోలు వైరల్‌ | Actor Mahat Raghavendra And Prachi Blessed With A Baby Boy | Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాజీ మిస్‌ ఇండియా ప్రాచీ

Published Tue, Jun 8 2021 1:49 PM | Last Updated on Tue, Jun 8 2021 1:49 PM

Actor Mahat Raghavendra And Prachi Blessed With A Baby Boy - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటుడు మహత్‌ రాఘవేంద్ర అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. మహత్‌ భార్య ప్రాచీ నిన్న (సోమవారం) ఉదయం పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని స్వయంగా మహత్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. 'ఈరోజు ఉదయం ఓ అందమైన పిల్లాడిని దేవుడు మాకు ప్రసాదించాడు. చిన్నారి రాకతో నేను, ప్రాచీ ఆనందంలో మునిగితేలుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాన్నగా ఎంతో ఎక్సయిటెడ్‌గా ఉన్నాను' అని ట్వీట్‌ చేశాడు. చిన్నారితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

ఇక మహత్‌ పోస్టుపై స్పందించిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమిళ బిగ్‌బాస్‌-2తో మహత్‌ మరింత పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు డేటింగ్‌ అనంతరం ప్రాచీ, మహత్‌ 2020లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రాచీ మాజీ మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టిన ప్రాచీ ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నారు. 

చదవండి : సమంత గుడ్‌న్యూస్‌ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం!
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిర్చి’ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement