బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ వల్ల తనకు మంచి పేరు కూడా వచ్చింది. తన ప్రవర్తనుకు కూడా తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.
ప్రియాంక జైన్.. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక ఈసారి తన అందంతో తోటి నటీమణులకు సవాల్ విసిరింది. నీటిలో తడిసిన తన గ్లామర్‌తో కుర్ర కారులో హీట్ పెంచింది. ఒక ఆర్టిస్ట్‌గా ఉన్నందున తనలోని భిన్నమైన షేడ్స్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆమె తెలిపింది.
ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పాపులర్ అయిన అషు రెడ్డి, అరియాన వంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ అందాలతో ఫిదా చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ప్రియాంక జైన్ విడుదల చేసిన వీడియో వారిని తలదన్నేలా ఉందని చెప్పవచ్చు. ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రియాంకలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment