
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్‌న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్‌డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్‌గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్‌కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది.