shiva kumar
-
హైదరాబాద్ శివారులో భారీగా కోడి పందేలు.. టీడీపీ నేత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందేల శిబిరంపై దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం నిర్వహించింది టీడీపీకి చెందిన శివకుమార్ వర్మగా గుర్తించారు. ఈ క్రమంలో కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో పది మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగతా వారంతా ఏపీకి చెందినవారే ఉన్నారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టాలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కోళ్ల పందేల శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకున్నారు.అనంతరం, పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోనికి వెళ్లేసరికి పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడంతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో కోడి పందేల నిర్వాహకుడు టీడీపీకి చెందిన భూపతిరాజు శివకుమార్‌వర్మ, పందెంరాయుళ్లు ఎటూ పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. లోకేష్‌తో పాటు పలు సందర్బాల్లో ఫొటోలు దిగిన భూపతిరాజు. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శివకుమార్ 64 మంది పందెం రాయుళ్లు, 80 కోళ్లతో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేళ్లను ఆడించడానికి బెట్టింగ్ రూ.30 లక్షలు పెట్టినట్టు సమాచారం. కోడి పందేలు ఆడుతున్న వారి నుంచి రూ.30 లక్షలు, 80 కోళ్లు, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా ‘నరుడి బ్రతుకు నటన’
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డా. సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా శివకుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో సంపన్న కుటుంబంలో పుట్టిన సత్య అనే పాత్ర చేశాను. ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్న సత్య కొన్ని పరిస్థితుల కారణంగా కేరళలోని ఓ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ సత్యకు ఎవరు తోడుగా నిలిచారు? ఏం జరిగింది అన్నది ఈ సినిమా కథాంశం’’ అన్నారు. నితిన్ ప్రసన్న మాట్లాడుతూ– ‘‘సుహాస్ ‘అంజాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలో నెగటివ్ రోల్ చేశాను. కానీ ‘నరుడి బ్రతుకు నటన’లో ఇందుకు భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. మనిషి తన జీవితంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అనుభూతి చెందుతాడు. ఓ నటుడు కూడా అంతే. ఈ విషయాన్నే ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాం. భావోద్వేగపూరితమైన నటన కనబర్చడానికి స్కోప్ ఇచ్చిన కథ ఇది. ఇక నాకు తెలుగు, తమిళంతో పాటు మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి’’ అని తెలిపారు. -
ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం!
సుమిత్ర చెప్పిన కథ: వాసుకి పిచ్చి పిల్ల. నాకన్నా ఎనిమిదేళ్ళే చిన్నది. అయినా, నా కూతురు స్థానంలోకి వచ్చింది. పొరబాటుగా అంటున్నాను, ఆమె పీడకలలో కూడా ఊహించని మారుటి అమ్మ స్థానంలోకి నేనే బలవంతంగా చొరబడిపోయాను. నా దురదృష్ట జీవితం గురించి చెప్పుకోవటం నా అభిమతం కాదు. నా మూలంగా అతలాకుతలమైన అమాయకురాలు వాసుకి గురించి చెప్పటానికే నా ప్రయత్నం.తనకో బుల్లి తమ్ముడిని ఇచ్చే క్రమంలో, పసిగుడ్డుతో సహా ఆమె తల్లి పై లోకాలకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వాసుకి పసి మనసు తల్లడిల్లిపోయిన ఘడియలు అవి. రెండేళ్లపాటు ఆమెకి ఇంక తన నాన్నతోనే లోకం అయిపోయింది. మాయమైపోయిన అమ్మ మీది ప్రేమ కూడా నాన్న మీదకి మళ్లించుకుని, నాన్న ఇంట్లో ఉన్నంతసేపూ వెన్నంటే ఉండేది. ధన్వంతరిగారు, అంటే వాసుకి నాన్న, ఉద్యోగరీత్యా తరుచూ టూర్లు తిరగవలసి ఉండేది. ఆయన ఊళ్ళోలేనన్ని రోజులూ భయంకరమైన ఒంటరితనం వాసుకిని వణికిస్తూ ఉండేది. అలాగని ఎవరినీ తోడు పిలుచుకోవటమూ ఇష్టం ఉండేది కాదు. ఒక్కతే తన లోకంలో తను బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండేది. ధన్వంతరిగారు ఉద్యోగరీత్యా తరచూ వచ్చే ఊళ్ళలో మాదీ ఒకటి. నా మేనమామ నాగఫణి ఆయనకి సన్నిహితుడు. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా యింట్లోనే ఉండేవారు. ఆయన మాటల్లో అస్తమానూ వాసుకి విషయాలే దొర్లేవి. వాసుకిని నేను చూడకపోయినా, ఆ విధంగా తన విషయాలన్నీ తెలుస్తూనే ఉండేవి. తల్లీ, తండ్రీ లేని నేను నా మేనమామ పెంపకంలో ఉండేదాన్ని. మొదటి నుంచీ చదువు సంధ్యల మీద శ్రద్ధలేకపోవటంతో, టెన్త్ఫెయిలయ్యాక ఇంటికే పరిమితమైపోయాను. చదువుకోవటం లేదనీ, పనీపాటా కూడా సరిగ్గా చేయటంలేదనీ ఎప్పుడూ విసుక్కుంటూ, అడపా దడపా చెయ్యి చేసుకుంటూ ఉండే మామయ్య, నైన్త్సెలవుల్లో నాలో శారీరకంగా మార్పులు చోటు చేసుకోవటం మొదలైనప్పటినుంచీ తిట్టటం, కొట్టటం తగ్గించాడు. నా పట్ల ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుని, హద్దులు మీరిన చొరవనీ ‘అభిమానం’ అనే భావించాను. అయితే, అలా ఎన్నాళ్ళో సాగలేదు. ఒక రోజున జరిగిన పెద్ద గొడవ తరవాత మామయ్య దుబాయి పారిపోయాడు.ఆ విషయం కూడా ధన్వంతరిగారు చెబితేనే నాకు తెలిసింది. ఎప్పటిలాగానే ఏదో టూర్ వెళ్లాడనుకున్న మామయ్య నన్ను వదిలించేసుకుని వెళ్లిపోయాడని తెలిశాక, నేనున్న పరిస్థితికి ఆత్మహత్య తప్ప మరోదారి తోచలేదు. ధన్వంతరిగారే అడ్డు పడకపోతే, అదే నా దారి అయ్యేది. నెల రోజులపాటు తర్జన భర్జనలు పడ్డాక, ధన్వంతరిగారు నన్ను తన జీవితంలోకి తీసుకుపోయారు.ఇదేమిటీ, నా ప్రియమైన వాసుకి గురించి మొదలెట్టి, నా సొదలోకి వెళ్లిపోయాను?నేను వాళ్ళింట్లో ప్రవేశించటం, అదీ ఆమెకి అమ్మగా వెళ్ళటం వాసుకికి పెద్ద షాక్. ఆమెకి నా మీద ద్వేషంతో పాటూ, తన తండ్రి మీద కూడా అసహ్యం జనించింది. నేనూ, ధన్వంతరిగారూ ఏం చెప్పబోయినా వినిపించుకోనంతగా తన చెవులను శాశ్వతంగా మూసి వేసుకుంది. నాతో మాటలే ఉండేవి కావు. వాళ్ళ నాన్నతో కూడా అత్యవసరమయితేనే అతి క్లుప్తంగా మాట్లాడేది. ఇంట్లో తక్కువగా ఉండేలా చూసుకునేది. వెళ్తే కాలేజీ, లేదా ఫ్రెండ్స్ ఇళ్ళలో గడిపేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తనగదికే పరిమితమైపోయేది.ఆఖరికి వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది నెలలకి, నేను చావు బతుకుల్లో హాస్పిటల్ పాలైనప్పుడు, నన్ను చూడటానికి కూడా వాసుకి రాలేదు. ఇంటికి వచ్చాక అయినా పలకరించలేదు. అందుకు నేను ఏమీ అనుకోలేదు, నేనది ఆశించలేదు గనుక. గతుకులబాటలో అతకని బతుకు అలాగే పదేళ్ళ పాటు గడిచింది. వాసుకి చదువు పూర్తయి ఉద్యోగం సంపాయించుకుంది. ఉద్యోగంలో చేరటానికి ఊరు వెళ్ళే ముందు రోజున తన పెళ్లి విషయం ప్రస్తావించారు ఈయన.‘నా పెళ్లి గురించీ, నా బతుకు గురించీ ఇంక మీరు ఆలోచించవద్దు. అసలు కల్పించుకోవద్దు’ అని కరాఖండిగా చెప్పేసింది వాసుకి. నేను మ్రాన్పడిపోయాను. ఆయన దిగులుపడిపోయారు. మర్నాడు వాసుకి వెళ్ళిపోయింది. ఏడాది గడిచింది. ఈ ఏడాదిలోనూ, వాసుకి ఒక్కసారి కూడా తొంగిచూడలేదు. ఫోన్ చేసినా తీసేది కాదు. నాది రాతి గుండె కాబోలు, ఇంకా బతికే ఉన్నాను. ఆయన గుండె మాత్రం అది తట్టుకోలేక ఆగిపోయింది. తండ్రి చివరి చూపుకోసం, చివరిసారిగా ఇంటికి వచ్చింది వాసుకి. దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది, ఇంక నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. ...వాసుకి చెప్పిన కథ:నేను నాన్న గురించి చెప్తాను.. ముందు నేను అమితంగా ప్రేమించిన నాన్న, తరవాత అంతకన్నా ఎక్కువగా ద్వేషించిన నాన్న గురించి. నేను చేసిన దిద్దుకోలేని తప్పు గురించి! తమ్ముడిని తెస్తానని ప్రామిస్ చేసిన అమ్మ, హాస్పిటల్ నుంచి రాకుండా మోసం చేసి, తమ్ముడితో సహా పైకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ నేనూ, ఓదారుస్తూ నాన్నా మిగిలాం. అమ్మంటే నాకు ఆరోప్రాణం. అందరికీ అంతేనేమో! కానీ, అందరమ్మల్లా కాకుండా, తొందరగా వెళ్లిపోయిందని బాధ. అందుకే, అమ్మ మీది ఆరవ ప్రాణాన్ని నాన్న మీదికి మళ్లించుకున్నాను. ఇంక నాకు మిగిలింది నాన్నేగా! అమ్మ చనిపోతే నాన్న దిగులుపడ్డాడా? ఏమో! పడినట్టు కనిపించేవాడుకాదు. ‘నీ కోసమే మీ నాన్న దిగులు దిగమింగుకుని బతుకుతున్నాడు’ అనేవాళ్లూ చుట్ట పక్కాలూ, ఇరుగుపొరుగూ.‘అవునేమో’అనుకున్నాను నేనూనూ, కొన్నేళ్ళ దాకా. ‘ఏమంత వయసు మీరిపోయిందని ఇలా మిగిలిపోతావ్? ఆ పిల్లకయినా ఓ తల్లిని తెచ్చే ఆలోచన చెయ్యి’ అంటూ అయినవాళ్ళు ఇచ్చే సలహాలను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసేవాడు నాన్న.‘దానికి అమ్మ చేతిలో పెరిగే యోగం ఉంటే, వాళ్ళమ్మ అర్ధాంతరంగా కన్ను మూసేది కాదు. మిగిలింది వాసుకి నేనూ, నాకింక వాసూ. ఇదే రాసిపెట్టాడు భగవంతుడు. ఇదే నిర్ణయం నాది కూడా’ అని చెప్పేసేవాడు మారు ఆలోచన లేకుండా. అలాంటి మాటలు వింటున్నప్పుడల్లా నేను నాన్నని గట్టిగా కౌగలించుకుని ఏడిచేసేదాన్ని.అటువంటి నాన్న హఠాత్తుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లు కాదు, నాలుగేళ్ళు గడిచాయేమో, అంతే. ఉద్యోగం పని మీద అప్పుడప్పుడూ ఊరు వెళుతూ ఉండే నాన్న ఓసారి ఊరి నుంచి మా ఇద్దరి మధ్య నిలిచేలా ఓ పెద్ద అడ్డు గోడని తెచ్చాడు. అది ‘అమ్మ’ అని చెప్పాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. పట్టరాని ఏడుపు వచ్చింది. ఆ వ్యక్తి ముందర ఏడవటానికి కూడా అసహ్యం వేసింది.వెంటనే నాగదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాను. అంతటితో ఆగకుండా నా మనసు కూడా మూసేసుకున్నాను. ఆ రోజు నుంచీ నాన్నంటే కూడా అసహ్యం వేసింది. ‘భార్య పోయిన నాలుగేళ్ళకి మరో భార్య మీదికి మనసు పోయింది! మగాళ్ళంతా ఇంతేనా? నాన్నలాంటి మగాళ్లు కూడా ఇంతేనా? నేననుకునే లాగా ఏ నాన్నలూ ఉండరా? రామావతారంతోనే, రాముడి గుణాలూ లోకంలో అంతరించిపోయాయా?’ నాన్న అంత తేలికగా ఎలా బలహీనపడిపోయాడో అర్థం కాలేదు. గీత దాటాడని తెలిశాక, కారణాలు, సంజాయిషీలు వినాలన్న కోరిక కూడా మిగల్లేదు. ఆయన పెట్టిన అడ్డుగోడ మీద నుంచి తొంగి చూడాలని కూడా అనిపించలేదు. నేనే గనక మగపిల్లవాడినయి ఉంటే, ఆరోజే ఇంట్లోంచి పారిపోయేవాడిని. ఆడపిల్లగా నాకు కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయి గనుక, ఆ పని చేయలేదు. ఇంట్లోనే నా చుట్టూ ఇనుప చట్రాన్ని బిగించుకున్నాను. మూతికి చిక్కం కట్టుకున్నాను. అత్యవసరమైతే తప్ప వాటిని సడలించకుండా నెట్టుకు వచ్చాను.అయ్యో, నేను చెప్పదలుచుకుంది నాన్న గురించి కదా, అదే చెప్తాను. నా అభిప్రాయం మారి ఉండకపోతే, నాన్నని అసలు తలుచుకునేదాన్నే కాదు. నాన్న సుమిత్ర పిన్నిని మా ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు కలిగిన ద్వేషం ఆయన పోయాక కూడా తగ్గలేదు, ఇన్నేళ్ల వరకూ.. ఆ ఉత్తరం .. ఇన్నేళ్ళూ అజ్ఞాతంలో ఉండిపోయిన ఆ ఉత్తరం నా కంట పడేవరకూ!ఇప్పుడు నా తొందరపాటు, దురుసుతనం, పెడసరి ప్రవర్తనతో జీవితంలో నేనేం కోల్పోయానో, నన్ను అమితంగా ప్రేమించిన నాన్నకి ఎంత అన్యాయం చేశానో తెలుస్తుంటే, పశ్చాత్తాపంతో మనసు కాలిపోతోంది. నాన్నకి ఇప్పటికైనా ఆత్మశాంతి కలగాలంటే ఏం చేయాలో మాత్రం స్పష్టంగా బోధపడింది. ఆ బోధ కూడా అన్యాపదేశంగా తన ఉత్తరం ద్వారా నాన్న చేసినదే! ∙∙ ధన్వంతరి చెప్పిన కథ: నేనిలా మీతో మాట్లాడవచ్చో, మీకు నా మాటలు చేరతాయో లేదో తెలియదు. మనుషులు మాట్లాడుకుంటారు. నేనిప్పుడు మనిషిని కాదు. ఒకప్పటి మనిషికి ఆశలు తీరని ఆత్మని! అయినా, నా ప్రయత్నం చేస్తాను. నా మిగిలిన ఆశలేమిటో మీకు చెప్పుకుంటాను. నేను ముందుగా చెప్పబోయేది అభాగిని సుమిత్ర గురించి. సుమిత్ర నాకు పరిచయమయ్యింది నాగఫణి దగ్గర. నాగఫణి, తన ఊళ్ళో ఉన్న మా కంపెనీ బ్రాంచ్‌కి హెడ్. నేను కంపెనీ పని మీద తరచూ ఆ ఊరు కూడా వెళ్తుండటం మూలాన నాకు సన్నిహితుడయ్యాడు. సన్నిహితుడయ్యాక అతడి అలవాట్ల వలన దూరమయ్యాడు.. మానసికంగా!నాగఫణికి ఆ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో ఒక గది మా కంపెనీకి గెస్ట్ రూమ్‌గా లీజుకి ఇచ్చాడు నాగఫణి. అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు, కంపెనీ నిబంధనల ప్రకారం ఆ రూమ్‌లోనే నా బస. ఆ ఇంట్లోనే నాగఫణి మేనకోడలయిన సుమిత్ర పరిచయం అయింది. అమాయకంగా ఉండే సుమిత్రకి తల్లిదండ్రులు లేరని తెలిసి బాధ పడ్డాను. ఆమె మీద నాకు జాలిగా ఉండేది. మొదట్లో, నాగఫణి ఆమె చేత ఇంటిపనులన్నీ చేయిస్తూ కూడా, ఆమె మీద దాష్టీకం చలాయిస్తున్నట్టు తోచేది. సొంత మేనకోడలు, అతడి సంరక్షణలో ఉంది కనుక అది సహజం అనుకుని సరిపెట్టుకున్నాను. రెండు మూడేళ్ళ తరవాత ఆమె పట్ల నాగఫణి ప్రవర్తనలో కొంత వికృతి కనిపించసాగింది. అయితే, నాకు సంబంధంలేని విషయం అనుకుని ఊరుకుండిపోయాను. ఉన్నట్టుండి ఆఫీసులో దుమారం చెలరేగింది. నాగఫణి బ్రాంచ్ అకౌంట్ల విషయంలో పెద్ద మొత్తం తేడా కనబడింది. అ బ్రాంచ్ పరిధిలోకి వచ్చే కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు సవ్యంగా కంపెనీ అకౌంట్‌కి జమ కావటంలేదని తేలింది. యాజమాన్యం అతడి నుంచి తేడా వచ్చిన మొత్తం డబ్బు వసూలు చేయటమే కాక, అతడిని ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఆ ఆర్డర్స్ వచ్చేసరికి నేను అతడి ఇంట్లోనే ఉన్నాను. ఆ రాత్రి సుమిత్ర, నాగఫణి మధ్య ఏదో ఘర్షణ జరగటం వినపడింది. మర్నాడు ఉదయమే నేను బయలుదేరి వచ్చేశాను. ఒక వారం తరవాత ఆఫీస్‌లోని నాగఫణి సన్నిహితుల ద్వారా తెలిసింది, ముందునుంచే ప్రయత్నంలో ఉన్న నాగఫణి, ఇది జరగగానే దుబాయి వెళ్లిపోయాడని. సుమిత్ర విషయం తెలియలేదు. ‘ఆమెని కూడా తీసుకు వెళ్లాడేమో’ అనుకున్నాను. తరవాతి వారం ఆ ఊరు వెళ్లినప్పుడు తెలిసింది, నాగఫణికి ఆపాటి ఔదార్యం కూడా లేదని! సుమిత్రను కలిశాను. నాగఫణి ఉద్యోగం పోయిన విషయం గానీ, అతడు దేశం విడిచి వెళ్ళిన విషయం గానీ ఆమెకి తెలియదు! నేను చెప్పగానే భోరుమంది. అప్పుడు చెప్పుకొచ్చింది తన పరిస్థితి. సుమిత్ర అమాయకత్వాన్నీ, నిస్సహాయతనీ ఆసరాగా తీసుకుని, నాగఫణి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. తగిన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి, గత రెండేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగించాడు. కష్టాలు కలిసికట్టుగా వస్తాయన్నట్టు, ఇప్పుడామె గర్భవతి. ఆ విషయం తెలిసి, జాగ్రత్తలు తీసుకోలేదని ఆమెనే నిందించి, ఆ రాత్రి ఘర్షణ పడ్డాడు. ఆమెకి చెప్పకుండా పలాయనమై పోయాడు. విషయం వినగానే నిర్ఘాంతపోయాను. ఏం చేయగలనో తోచలేదు. ‘తొందరపడి ఏమీ చేసుకోవద్దనీ, నేను మళ్ళీ పై వారం వస్తాననీ, ఆలోచించి ఒక దోవ చూపిస్తాననీ’ చెప్పి వచ్చాను.స్వంత ఇల్లు కాబట్టి, నాగఫణి వెళ్లిపోయినా గూడు మిగిలింది సుమిత్రకి. తరవాతి వారం వెళ్ళినప్పుడు, ఆమెను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాను. అప్పటికే సమయం మించిపోయిందనీ, సాధ్యపడదనీ చెప్పింది డాక్టర్. సుమిత్రని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ‘నా పరువు బజార్న పడిపోయింది. ఇంక నాకు చావు తప్ప గత్యంతరం లేదు’ అని హిస్టీరికల్గా ఏడ్చేసింది. నాతో వచ్చేయమన్నాను. ‘వచ్చి, ఏం చేయాలని?’ సూటిగా అడిగింది. వెంటనే సమాధానం దొరకలేదు. ఎంతో ఆలోచించాక చెప్పాను, ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను.. బయటివాళ్ళ కోసం. నీ బిడ్డకి తండ్రిని అవుతాను.. నీ పరువు నిలవటం కోసం. అంతవరకే మన సంబంధం!’ఆమె అంగీకరించింది. మర్నాడు ఇంట్లోనే దేవుడి పటం ముందు ఆమె మెళ్ళో తాళి కట్టి, మా ఇంటికి తీసుకు వెళ్ళాను. చిన్నదైన వాసుకికి సర్దిచెప్పగలను అనుకున్నాను. ఎంత తప్పుగా ఆలోచించానో వాసుకి రియాక్షన్ చూశాక తెలిసివచ్చింది. సుమిత్రని ఆదుకున్నానుగానీ, నన్ను నేను నిప్పుల్లోకి నెట్టుకున్నాను. నా చిన్నారి వాసుకిని అంతులేని క్షోభకి ఆహుతి చేశాను.ఇంతా చేస్తే, సుమిత్రకి తన బిడ్డ కూడా దక్కలేదు. నెలలు నిండుతుండగా తెలియని ఆరోగ్య సమస్య ఏదో ముంచుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడటమే గగనమైపోయింది. అంతవరకూ, ఆ తరవాతా కూడా సుమిత్ర నా యింట్లో మనిషిగా ఉందే గానీ, నా భార్యగా కాదు. ఒక్కనాడు కూడా ఆమె స్పర్శ నేనెరగను. ఆ విషయం నా కూతురికి ఎలా తెలుస్తుంది? నేనేదో వయసు ప్రలోభంలో పడి సుమిత్రని చేసుకున్నాననే ఆమె అభిప్రాయం మార్చలేక పోయాను. చివరికి ఉద్యోగం పేరుతో నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది నా ఏకైక ప్రాణం. తట్టుకోలేకపోయాను.నా నోరు కట్టేసింది. చేతులు కాదుగా! ఒకనాటి రాత్రి కూర్చుని, జరిగినదంతా వివరంగా పెద్ద ఉత్తరం రాశాను. మర్నాడు కొరియర్ చేయాలని అనుకున్నాను. ఉత్తరం మడిచి, టేబుల్ మీద ఉన్న పుస్తకంలో పెట్టాను. అది చదివితే, నా చిన్నారి తల్లి నన్ను అర్థం చేసుకుంటుందనే విశ్వాసం కలిగింది. మనసు తేలిక పడింది.‘ఈ పని ఇన్నాళ్ళూ ఎందుకు చేయలేదా’ అనిపించింది. ‘వెర్రివాడా, నీ మాటలే వినని నీ కూతురు నువ్వు రాసే రాతలు చదువుతుందని అనుకుంటున్నావా? అందగానే చించి పారేస్తుంది’ నా అంతరాత్మ వెక్కిరించింది. నిజమేనేమో!మళ్ళీ నా గుండె బరువెక్కింది. ‘అది తేలికపడితే, ఇక కలిసేది గాలిలోనే’ అని తెలిసే సరికి అంతపనీ జరిగింది. నా ఉత్తరం పుస్తకంలోనే నిక్షిప్తమైపోయింది. ముహూర్తం మంచిది కాదని, నా ఇంటిని ఏడాది పాటు మూసిపెట్టారు. మూసే ముందు కింది వస్తువులనీ, టేబుల్ మీది పుస్తకాలనీ తీసి అటకల మీద సర్దేశారు. నా చివరి ఆశ అక్కడే మూలబడిపోయింది. సుమిత్ర తన ఊరికి వెళ్ళిపోయింది.. వితంతువు హోదా అయినా దక్కిందిగదా!ఏడాది దాటాక ఇల్లు అమ్మకానికి పెట్టింది వాసుకి. అమ్మే ముందు అటకలు ఖాళీ చేస్తుంటే ఆ పుస్తకంలో నుంచి జారిపడిన నా ఉత్తరం, చివరికి చేరవలసిన చేతుల్లోకి చేరింది! ‘నాన్న దస్తూరీ’ అనుకుంటూ ఆబగా ఆ కాయితాలన్నీ చదివేసిన నా చిట్టితల్లి కళ్ళలో ధారాపాతంగా నీళ్లు! ఆత్మకి కనులుంటే నా కళ్ళలోనూ ఊరేవేమో నీళ్ళు!∙∙ రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. పాలసంచీ బయటి గడియకు తగిలించి, తలుపు మూసేసి, తాళం పెట్టుకోబోతున్న సుమిత్ర కాంపౌండ్ గేటు కిర్రుమంటూ మోగిన చప్పుడుకి మూయబోతున్న తలుపు కొద్దిగా తెరిచి, ‘ఇంత రాత్రి వేళ తన ఇంటికి వచ్చేది ఎవరా’ అన్నట్టు ఆ చీకట్లోకి చూసింది.గేటుకీ, వరండాకీ ఉన్న దూరాన్ని దాటి, వరండాలో వెలుగుతున్న నైట్ బల్బ్ వెలుగులోకి వచ్చిన స్త్రీ మూర్తి వాసుకి! సుమిత్ర నివ్వెరపోయింది. తల వంచుకునే మెట్లెక్కి, వరండాలో నిలబడిపోయింది వాసుకి. మాటలు రాని సుమిత్ర ఓరగా తెరిచి ఉన్న తలుపు బార్లా తెరిచి, వాసుకికి దారి ఇస్తున్నట్టు తను ఒక పక్కకి ఒత్తిగిలింది. తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది వాసుకి. తలుపు వేసుకుని వెనక్కి తిరిగిన సుమిత్ర భుజం మీదకు ఒక్క ఉదుటున వాలిపోయింది. ఆమె కన్నీళ్లతో సుమిత్ర భుజం తడిసిపోయింది. సుమిత్ర వాసుకిని రెండు చేతులతో చుట్టేసి, దగ్గరగా హత్తుకుంది. – పి. వి. ఆర్. శివకుమార్ -
నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూశారా?
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. -
ప్రియుడితో ప్రియాంక పెళ్లి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ ప్రియాంక.. సడన్‌గా ప్రియుడితో పెళ్లి!
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్‌న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్‌గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్‌కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది. -
బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే కంటెస్టెంట్స్ ఈ వారంలో కంటతడి పెట్టిస్తున్నారు. ఎప్పుడు హాట్ హాట్‌గా సాగే బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు ఫుల్ ఎమోషనల్‌గా మారింది. మంగళవారం ఒక్క రోజే ముగ్గురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్‌కు రప్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. శివాజీ, అంబటి అర్జున్, అశ్వినికి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. (ఇది చదవండి: మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!) రెండో రోజు కూడా హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియాంక జైన్ ప్రియుడిని హౌస్‌లో తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్‌లో అడుగుపెట్టిన మౌనరాగం సీరియల్ ఫేమ్ శివకుమార్ తన ప్రియురాలికి గులాబీ పువ్వుతో మరోసారి ప్రపోజ్ చేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడిని చూసిన ప్రియాంక తన ప్రేమతో అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఎలా ఉన్నావ్ అంటూ.. తన ప్రియుడిని అడిగింది. నేను ఇలా ఉన్నా అనడంతో.. ఒకరినొకరు చాలా మిస్సవుతున్నామంటూ ఎమోషనలయ్యారు. శివతో మాట్లాడుతూ..'మరీ పెళ్లెప్పుడు అని ప్రియాంక ప్రేమగా అడగడంతో.. నువ్వు బయటకొచ్చిన వెంటనే చేసుకుందాం అన్నాడు. కాదు.. ఇప్పుడే చేసుకుందాం ప్రియాంక అంటూ శివను గట్టిగా మరోసారి కౌగిలించుకుంది. ఆ తర్వాత ఈ జంట దగ్గరకు వచ్చిన శోభా శెట్టి బిగ్ బాస్ ఇచ్చిన సమయం అయిపోయిందని చెబుతుంది. ఇక్కడే ఉండిపోవచ్చా అని బిగ్ బాస్‌ను శోభ అడుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి శివకుమార్‌కు గుడ్ బై చెప్పడంతో ప్రోమో ముగిసింది. కాగా.. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.. బుల్లితెర నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్.. నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు పాత్రలు పోషించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. (ఇది చదవండి: 'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!) -
అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్ హీరో.. ప్రియురాలి కోసమే!
బిగ్‌బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ ప్రారంభమైంది. 14 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఎక్కువ వరకు సీరియల్ నటీనటులే ఉండడం గమనార్హం. వాళ్లంతా పక్కా ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చారు. హౌస్‌లో వాళ్లు ఆడే ఆటకు తగ్గట్లు బయట ప్రమోషన్స్ కూడా ఉండాలని ముందే ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ప్రతీ సీజన్లో కంటెస్టెంట్స్ చేసే పనే. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్స్ కాస్త వెరైటీగా అనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే వైరల్ అయ్యే వీడియోలను కొన్నింటిని షూట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా బయటకు వదులుతున్నారు. తాజాగా బిగ్‌బాస్-7 తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి ఫ్రాంక్ వీడియో 'జానకి కలగనలేదు'సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తను కెరీర్ గాడిన పడింది. వరుసగా సీరియల్స్‌తో స్టార్ నటిగా గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. అంతకు ముందు ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్‌తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసింది. అందులో శివకుమార్ లేడి గెటప్‌లో కనిపించడం గమనార్హం. ప్రియాంక కోసమే తన గెడ్డం తీసేసి అమ్మాయి గెటప్ వేశానని శివకుమార్ చెప్పారు. (చదవండి: నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) వీడియోలో ఏం ఉంది? ప్రియాంకకు తెలియకుండా ఓ మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు శివకుమార్. అనంతరం జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు. తనని తాను ఇందుమతిగా పరిచయం చేసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అయితే గెటప్ అయితే మారింది కానీ.. గొంతు మాత్రం అలానే ఉండడంతో ప్రియాంక ముందుగానే అతన్ని పసిగట్టింది. అయినప్పటికీ అతనికి ఆ విషయం చెప్పలేదు. కాసేపయ్యాక నేను ఎప్పుడో గుర్తుపట్టానని చెప్పడంతో శివ కుమార్ తెల్లముఖం వేశాడు. తాను ఫ్రాంక్ చేద్దామనుకుంటే.. ప్రియాంకనే తనను ఫ్రాంక్ చేసిందని శివ చెప్పుకొచ్చాడు. ఎలా గుర్తుపట్టింది? శివ కుమార్ లేడీ గెటప్ అయితే వేసుకున్నాడు కానీ.. చేతికి ఉన్న ఉంగరాలు, రాఖీ తీసేయ్యలేదు. అలాగే గొంతు మార్చి మాట్లాడడంలోనూ విఫలం అయ్యాడు. దీంతో పరిచయం చేసుకున్న కాసేపటికే ప్రియాంక గుర్తుపట్టేసింది. అయితే ఆ విషయం అతనికి చెప్పకుండా.. చివర్లో చెప్పి షాకిచ్చింది. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని వదిలారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. -
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్‌కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్‌ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్‌ను రామాంతపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!
మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి పరిచయం అక్కర్లేదు. మాటలు రాని మూగ అమ్మాయిగా నటించి అద్భుతహ అనిపించింది. ముంబయికి చెందిన ముద్దుగుమ్మ తెలుగులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చల్తే చల్తే, ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార లాంటి చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మౌనరాగంతో పాటు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో నటించింది. అయితే మౌనరాగం ఫేమ్, సహనటుడు శివకుమార్ మరిహల్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గతంలో వీరిద్దరు చాలా సార్లు హోమ్ టూర్స్ చేస్తూ జంటగా కనిపించారు. వారి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశారు. (ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ) అయితే వీరి పెళ్లి సంగతి పక్కనపెడితే ఆమె నటిస్తోన్న జానకి కలగనలేదు సీరియల్‌ను అర్ధాంతరంగా ఆపేశారు. కొంతకాలంగా ప్రేక్షకులకు తలభారంగా మారడంతో ఎలాగోలా 662 ఎపిసోడ్ వరకు అతి కష్టం మీద లాక్కొచ్చారు. కానీ చివరికీ ఇక నిర్మాతలు కూడా చేతులెత్తేయడంతో సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయక తప్పలేదు. తాజాగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యాబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాము కొత్త ఇంటిలో చేరబోతున్నట్లు వీడియోలో వెల్లడించింది. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆ వీడియోలో చూపించింది. గృహ ప్రవేశానికి వచ్చిన వారందరికీ ప్రియాంక జైన్, శివ కుమార్ కానుకలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ సొంతింటి కల సాకారమైందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఇక ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!) -
వీడియోకాల్ చేసి.. ఉరేసుకొని..
సంగారెడ్డి: ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ దుర్గయ్య కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన శ్రీరాములు కుమారుడు శివ కుమార్(20) పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శివకుమార్ డ్రెస్ కుట్టించుకొని వస్తానని చెప్పి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి సోదరి సోనికి వీడియో కాల్ చేసి తను ఉరి వేసుకుని చనిపోతున్నట్లు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వెంటనే ఇందిరమ్మ ఇల్లు బ్లాక్ నంబర్ 6లోకి వెళ్లగా అప్పటికే రేకుల షెడ్‌కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం అతణ్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడు ఏ కారణంతో చనిపోయాడనే విషయం తెలియదని, మృతుడు తండ్రి శ్రీరాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు.. నిజంగానే విడిపోయారా?
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. టాలీవుడ్ అభిమానుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందులో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్య తన తండ్రి, తమ్ముడితో విడిపోయారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడని.. సూర్యకు ఆయన తండ్రి శివకుమార్‌కు సంబంధాలు సరిగా లేవన్నారు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట వ్యతిరేకించారని.. తర్వాతే కుమారుడి కోసం ఒప్పుకున్నారు. అయితే పెళ్లి తర్వాత జ్యోతికను సినిమాల్లో నటించవద్దని ఆదేశించాడు. అందువల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని బైల్వాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటించడాన్ని శివకుమార్ స్వాగతించలేకపోతున్నారని సమాచారం. దీనివల్లే తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య, జ్యోతిక 2డి అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్నారు. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ సక్సెస్ఫుల్ జంటగా నిలిచిన సూర్య, జ్యోతిక మొదట చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోనే జీవించారు. అయితే ఇటీవలే ఇద్దరూ ముంబైలో కొత్త ఇల్లు కొని సెటిల్ అయ్యారు. -
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ మృతి
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ రాజు (74) విజయవాడలోని డీవీ మేనర్ హోటల్లో శుక్రవారం రాత్రి మృతి చెందటం కలకలం సృష్టించింది. అయితే, ఆయనది సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు పోలీసులు. హైదబాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న శివకుమార్.. ఓ కేసు విషయంలో ఇటీవలే విజయవాడకు వచ్చారు. శనివారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బెల్ కొట్టినా రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది మరో తాళంచెవితో లోపలికివెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు శివకుమార్. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్లూస్ సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి.. కేసుగా నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్ చేసేలా విస్తరణ -
శివకుమార్‌కు ఈడీ సమన్లు
బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో తమ ముందు హాజరుకావాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. ఈడీ సమన్లు జారీచేయడంపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇంకొద్ది రోజుల్లో కర్ణాటకలో ప్రారంభంకానుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలున్నాయి. శాసన, రాజకీయ బాధ్యతలను నేను కచ్చితంగా నిర్వర్తించాలి. ఈడీకి సహకరించేందుకు నేను సిద్ధమే. కానీ, ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లు పంపి వేధిస్తోంది’ అని శివకుమార్ గురువారం ట్వీట్‌చేశారు. ‘భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు వస్తున్న అపూర్వ ప్రజా మద్దతును చూసి ఓర్వలేక కర్ణాటకలో యాత్ర ఏర్పాట్లకు భంగం కల్గించేందుకే మోదీ సర్కార్ ఇలా ఈడీ(ఎలక్షన్ డిపార్ట్మెంట్) ఆఫ్ బీజేపీని రంగంలోకి దించింది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. (చదవండి: హిందీని బలవంతంగా రుద్ధితో ఊరుకోం) -
హృదయాలను హత్తుకుంటున్న పెంచలదాస్ కొత్త పాట
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్టైన్మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రెండో పాటని శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మా కలల పంటగా..పుడితివే కొడుకుగా’అంటూ ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి... ఆలపించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్, దర్శకుడు సతీష్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమా కథ యూనివర్సల్ పాయింట్ కావటంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం.పెంచలదాస్ రాసి, పాడిన పాటకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో... ఈ సాంగ్ కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం’ అని అన్నారు. -
పాన్ ఇండియా చిత్రంగా ‘ఆకాశ వాణి విశాఖపట్టణ కేంద్రం’
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్టైన్మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్నఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.ఎం. అర్జున్ మాట్లాడుతూ.. యూనివర్సల్ పాయింట్‌తో సతీష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ‘‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ చిత్రం డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మేకింగ్‌లో మల్లికార్జున్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కార్తీక్ మ్యూజిక్, ఆరీఫ్ సినిమాటోగ్రఫీ ఇలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు.సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శకుడు సతీష్ బత్తుల అన్నారు. -
విజయవాడలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, ఒకరి మృతి
సాక్షి, విజయవాడ: ఎలక్ట్రిక్ బైకులు కదిలే బాంబుల్లా మారాయి. మంటల్లో చిక్కుకోవడం, చార్జింగ్‌లో ఉండగానే పేలిపోవడం కామన్‌గా మారింది. నిన్నా మొన్నటి వరకు తమిళనాడు, మహారాష్ట్రకే పరిమితమైన ఈ ప్రమాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ ఘటన మరిచిపోకముందే విజయవాడలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ ఇటీవల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. రాత్రి వేళ బెడ్రూమ్లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి మంటలు అలుముకున్నాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే శివకుమార్ మరణించగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. చదవండి: (తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?) -
రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీసిన స్టార్టప్ కంపెనీ!
దినదినాభివృద్ధి చెందుతున్న ఓ స్టార్టప్ కంపెనీకి వచ్చిన ఇబ్బందులు ఇద్దరు రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీశాయి. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూనే ఆసక్తికర పోటీకి తెరలేపారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా పేరొందిన బెంగళూరు సిటీ అనేక స్టార్టప్ కంపెనీలకు పుట్టిల్లు కూడా. హౌసింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌లను ఇక్కడే ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా చొచ్చుకుపోతున్నారు ఆ కంపెనీ సీఈవో రవీశ్ నరేశ్. అయితే ఇటీవల బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయల కొరతపై ఆయన ట్విట్టర్ వేదికగా గళం విప్పారు. బెంగళూరులోని కోరమంగళ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను పన్నులుగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి. ఐనప్పటికీ ఈ స్టార్లప్‌లు ఉన్న ఏరియా అంతా గతుకుల రోడ్లు, కరెంటు కోతలు, అరకొర నీటి సరఫరా వంటి సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నాయి. బెంగళూరు కంటే రూరల్ ఏరియాల్లోనే సౌకర్యాలు బాగున్నాయంటూ ట్వీట్ చేశాడు. రవీశ్ నరేశ్ ట్వీట్‌కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరు వెంటనే హైదరాబాద్‌కి రండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ తెలిపారు. Pack your bags & move to Hyderabad! We have better physical infrastructure & equally good social infrastructure. Our airport is 1 of the best & getting in & out of city is a breeze More importantly our Govt’s focus is on 3 i Mantra; innovation, infrastructure & inclusive growth https://t.co/RPVALrl0QB — KTR (@KTRTRS) March 31, 2022 కేటీఆర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే కర్నాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. మై ఫ్రెండ్ కేటీఆర్.. నీ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నాను. 2023 చివరికల్లా కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అలా జరిగిన మరుక్షణమే బెంగళూరు సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ శివకుమార్ బదులిచ్చారు. శివకుమార్ ట్వీట్‌పై కేటీఆర్ కూడా అదే స్థాయిలో స్పందించారు.. శివకుమార్ అన్న కర్నాటకలో రాజకీయాలు ఎలా ఉన్నాయో నాకు సరిగా తెలియదు. ఎవరో గెలుస్తారో చెప్పలేం. కానీ మీ ఛాలెంజ్‌ని నేను స్వీకరిస్తున్నాను. బెంగళూరు, హైదరాబాద్ సిటీలో అభివృద్ధిలో పోటీ పడాలి. మన యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాలి. మన ఫోకస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి అంశాలపై ఉండాలి కానీ హలాల్, హిజాబ్ లాంటి విషయాలపై కాదంటూ కేటీఆర్ తెలిపారు. Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍 Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT — KTR (@KTRTRS) April 4, 2022 చదవండి: ఇండియన్లంటే అంతే.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న ఆనంద్ మహీంద్రా! -
Karnataka: ఎద్దులబండిలో అసెంబ్లీకి
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును ఖండిస్తూ సోమవారం ఎద్దుల బండిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు విధానసౌధకు ఊరేగింపుగా వచ్చారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలపై భారం వేస్తోందని దుయ్యబట్టారు. ఎద్దుల బండి పోరాటం ద్వారా ప్రజల్లో జాగృతి కల్పించామని తెలిపారు. భారీ సందోహంతో రావడంతో సౌధ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందలాది పోలీసులు మోహరించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. దివంగతులకు సంతాపం శాసనసభా వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం ఇటీవల గతించిన రాజకీయ, సామాజిక ప్రముఖులకు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాగానే సభాధ్యక్షుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. అసంతృప్తి లేదు: యడ్డి బీజేపీ రాష్ట్రాధ్యక్షునితో కలిసి రాష్ట్రమంతటా పర్యటించనున్నట్లు మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా పని చేస్తానని, సంతోషంగానే ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేగా రావడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పక్కన సీట్లో కూర్చోవడానికి స్పీకర్ ఆమోదించారని తెలిపారు. స్వచ్ఛ గాలి ఎక్కడ .. స్వచ్ఛ గాలి పథకంతో బెంగళూరులో రూ.2.67 కోట్లను ఖర్చు చేశారు, స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉందో చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసీ.కొండయ్య పరిషత్‌లో ప్రశ్నించారు. పరిసర మంత్రి ఆనంద్‌సింగ్ తరఫున పరిషత్ నేత కోటే శ్రీనివాసపూజారి సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ గాలి పథకాన్ని బెంగళూరు, దావణగెరె, హుబ్లీ, ధారవాడ, కలబురిగి నగరాల్లో చేపట్టిందన్నారు. 2019 నుంచి 2024 నాటికి గాలిలో ధూళి ప్రమాణాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడమే లక్ష్యమన్నారు. కాగా, చేతనైతే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలను తగ్గించాలని మంత్రి శ్రీరాములు ఆ పార్టీని సవాల్ చేశారు. చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. -
KTR: మాండ్యా మహిళను ఆదుకుంటాం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రం మాండ్యా ప్రాంతానికి చెందిన ఓ మహిళ కుటుంబానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం అందించారు. శశికళ మంజునాథ్ అనే ఆ మహిళకు సాయం చేస్తామని ఆయన కర్ణాటక కాంగ్రెస్ నేత డి.కె. శివకుమార్‌కు హామీ ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. మాండ్యాకు చెందిన మహిళ భర్త హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆస్పత్రి యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పింది. కానీ ఆమె రూ.2 లక్షలు మాత్రమే చెల్లించగలరని, ఈ విషయంలో సాయం చేయాలని డి.కె.శివకుమార్ ఆదివారం తన ట్విట్టర్ అకౌంట్లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. శివకుమార్ అభ్యర్థనపై 36 నిమిషాల్లోనే కేటీఆర్ స్పందించారు. శశికళకు సాయం చేస్తామని భరోసా ఇస్తూ శివకుమార్‌కు రీ ట్వీట్ చేశారు. Shivakumar Garu, Will take care immediately if you can pass on her contact information @KTRoffice get in touch with hospital immediately https://t.co/33ApR5AhCK — KTR (@KTRTRS) May 30, 2021 -
పాల కుమార్
శివకుమార్‌కి టీ స్టాల్ ఉంది. లాక్‌డౌన్‌కి ముందు రోజుకు 600 నుంచి 700 వరకు రాబడి ఉండేది. ఇప్పుడు సగానికి డౌన్ అయిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి డౌన్ కానిది ఒక్కటే. అతడిలోని ‘ఇచ్చే గుణం’. వంబన్లో అందరికీ తెలిసిన భగవాన్ టీ స్టాల్ అతడిదే. పిల్లలకు ఆవు పాలు ఉచితం అందులో. శివకుమార్ వయసు 42. మొదట్లో రైతు కూలీ. కన్న బిడ్డలకు పాలు కూడా కొనలేని రోజులు ఉన్నాయి అతడి జీవితంలో. మరొకరికి ఆ దుర్భరతను రానివ్వకూడదనుకున్నాడు. పేద రైతు కూలీలు ఎక్కువగా ఉండే వంబన్.. తమిళనాడులోని పుదుకొట్టయ్ జిల్లాలో ఉంది. ఆ ఊరి పిల్లలు పాలకు ఏడవకుండా శివకుమార్ ఉన్నాడు. -
సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం
సాక్షి, తిరుమల: టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. సుధా నారాయణమూర్తిపై ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దాంతోపాటు శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..) కాగా, తమిళ నటుడు శివకుమార్ ఓ వీడియోలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారం చేశారు. తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై టీటీడీకి సమాచారం ఇచ్చారు. టీటీడీపై శివకుమార్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జూన్ 30 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంటు సోషల్ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ తెలిపింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా వీరిపై కేసు నమోదైంది. ఫేస్బుక్ పేజీపైనా కేసు: డీఎస్పీ శ్రీవారి ఆలయం, భక్తులపై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.. తెలుగు ఎతిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు) -
పెద్ద చదువు పెద్ద ఆందోళన
ఈ రుణభారం వారి కుటుంబ జీవితం ప్రారంభించడాన్ని ఆలస్యం చేయొచ్చు, కొత్త ఇల్లు కొనడాన్ని వాయిదా వేయొచ్చు, ఉద్యోగ విరమణ తర్వాతి పెట్టుబడులను ప్రభావితం చేయొచ్చు. ఇంతకుమించి, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడంలో వారు పడే మానసిక ఆందోళన వెల కట్టలేనిది. ఏ పెద్ద చదువు లేని వాళ్లు కూడా చెప్పగలిగే అంశం ఏమిటంటే, పెద్ద చదువులు చదివినవాళ్లు పెద్దగా సంపాదిస్తారు అని. దీన్నే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయర్స్ (అమెరికా) సర్వే చేసి మరీ ప్రకటించింది. ఒక సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్లకంటే, అదే సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీనో, డాక్ట రేటో ఉన్నవాళ్లు ఎక్కువ జీతంతో తమ ఉద్యోగాన్ని మొదలుపెడుతున్నారు. అయితే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ పైన్, విస్కా న్సిన్–మాడిసన్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ గ్రాడ్స్కీ మాత్రం ఈ విషయాన్ని ఇంకోలా చూస్తున్నారు. ఈ సోషియాలజిస్టులు కూడా విద్యాధికులు ఎక్కువగా సంపాదిస్తున్నారని ఒప్పుకుంటూనే, ఈ మొత్తం ప్రక్రియలో ఉన్న సంక్లి ష్టత మీద దృష్టి పెడుతున్నారు. గణితం, సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ల్లో మాస్టర్ డిగ్రీ ఉన్నవాళ్లు, అదే సబ్జెక్టు ఆధారిత ఉద్యోగాల్లో యేటా సుమారు 75,000– 79,000 అమెరికా డాలర్ల ప్రారంభ వేతనం పొందు తున్నారు. ఇవే సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్ల కంటే ఈ వేతనాలు సుమారు 10–30 శాతం ఎక్కువ. ఒకవేళ వారు డాక్టరేట్ కూడా చేసివుంటే, వారి కెరి యర్లు లక్ష అమెరికా డాలర్లతో ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. అదే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్ల జీతాలు 62,500–70,000 అమెరికా డాలర్ల మధ్య ఉండొచ్చు. ఈ అంతరాన్ని ‘అడ్వాన్స్డ్ డిగ్రీ వేజ్ ప్రీమియం’ అని పిలుస్తున్నారు జేమ్స్ పైన్, ఎరిక్ గ్రాడ్స్కీ. అయితే, ఎంత పై చదువులకు వెళ్తూంటే అంత అప్పులు అవుతున్నాయి. హైస్కూలు అయిపోగానే అమెరికా విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ చదువుల కోసం సుమారు 13,500 డాలర్ల రుణం తీసుకుం టున్నారు. 6 శాతం వడ్డీతో నెలకు 500 డాలర్ల చొప్పున ఇది రెండున్నరేళ్లు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం ఈ అప్పు 25,000 డాలర్లు ఉంటుంది. అదే 6 శాతం స్థిర వడ్డీతో నెలకు 500 చొప్పున దీన్ని తీర్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు. తర్వాత మాస్టర్ డిగ్రీ కోసం 70,000 డాలర్లు గనక తీసుకుంటే, ఇది మొత్తం తీరడానికి ఇరవై ఏళ్లు పట్టొచ్చు. అయితే, ఈ మొత్తాలు అందరికీ ఏకరీతిలో లేవు. ఉదాహరణకు 2016లో ఎంబీఏ పూర్తిచేసినవాళ్ల రుణం సగటున 66,300 డాలర్లు ఉండగా– సైన్స్, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, థియాలజీ లాంటి చదువుల కోసం దీనికి దాదాపు రెండు రెట్లు, అంటే 1,32,000 డాలర్ల రుణం తీసుకున్నారు. అదే ఆరు శాతం వడ్డీతో నెలకు వెయ్యి డాలర్ల చొప్పున చెల్లించేలా చూసుకుంటే గనక, ఎంబీఏ వాళ్లు ఆరేళ్లలో దీన్ని చెల్లించాల్సి వస్తే, డాక్టరేట్ డిగ్రీవాళ్లు రుణవిముక్తులు కావడానికి కనీసం 18 ఏళ్లు పడుతుంది. మళ్లీ ఈ రుణ భారాలు కూడా అందరూ సమా నంగా మోయడం లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్న ఆఫ్రికన్ అమెరికన్లు, అదే డిగ్రీ చదువుతున్న శ్వేతజాతీయుల కంటే 50 శాతం ఎక్కువ రుణం చేయవలసి వస్తోంది. అంటే సుమారు 11 ఏళ్లు ఎక్కువగా వాళ్లు రుణగ్రస్తులుగా ఉంటున్నారు. మరో వైపు, కేవలం బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ల కంటే, మాస్టర్ డిగ్రీ ఉన్న ఆఫ్రికన్ అమెరికన్ల వేతనాలు సుమారు 30 శాతం అధికంగా ఉంటున్నాయి. అదే పీహెచ్డీ ఉంటే ఈ తేడా 65 శాతం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్వేత జాతి అమెరికన్ల మధ్య ఉన్న అంతరంతో పోలిస్తే, ఈ వేతనాలు వరుసగా 12, 10 శాతాలు అధికం. మొత్తంగా అమెరికా విద్యార్థులు 1.7 ట్రిలియన్ డాలర్ల విద్యారుణం బాకీ ఉన్నారు. ఎంబీఏనో, లా డిగ్రీ లాంటి విద్యార్హతలో వేతనాల్లో పెరుగుదలను ఇస్తాయనేది నిజమే. కానీ దీనితో ముడిపడివున్న ఆర్థిక, సామాజిక, మానసిక అలజడులను పరిగణన లోకి తీసుకోవాలి. ఈ రుణభారం వారి కుటుంబ జీవితం ప్రారంభించడాన్ని ఆలస్యం చేయొచ్చు, కొత్త ఇల్లు కొనడాన్ని వాయిదా వేయొచ్చు, ఉద్యోగ విర మణ తర్వాతి పెట్టుబడులను ప్రభావితం చేయొచ్చు. ఇంతకుమించి, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడంలో వారు పడే మానసిక ఆందోళన వెల కట్టలేనిది.కాబట్టి, పెద్ద చదువుల కోసం ఇంతటి ఆందోళన పడవలసినంతటి విలువైనదా, కాదా తేల్చలేక పోతు న్నామని అంటున్నారు జేమ్స్, ఎరిక్. ఒకటి మాత్రం వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ఏ చదువు కోసం చేసే రుణమైనా ఆ చదువుతో సులభంగా తీరిపోయేలా విద్యావిధానాలు ఉండాలని చెబుతున్నారు. – పి.శివకుమార్ -
ప్రభాస్ చేతుల మీదుగా‘22’ లిరికల్ వీడియో
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘22’.. విభిన్న కథతో వస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తనయుడు శివ కుమార్.బి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో‘మార్ మార్కే జీనా హై’ అనే పాటను టాలీవుడ్ యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ శనివారం విడుల చేశారు. పాట విడుదల అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. 22 మూవీ లిరికల్ వీడియో సాంగ్ చాలా బాగుందని, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. ‘ 22’ కచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పారు. పోలీసు డ్రెస్‌లో రూపేష్ చాలా బాగున్నాడని ప్రశంసించారు. సినిమా బిగ్హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. హీరో రూపేష్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా ఫస్ట్ సాంగ్‌ను ప్రభాస్ లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ నన్ను ఎంకరేజ్ చేస్తూ పోలీస్ డ్రెస్‌లో చాలా బాగున్నావని అనడం ఒక అవార్డులా భావిస్తున్నాను. మంచి లిరిక్స్రాసిని కాసర్ల శ్యామ్‌కి, మంచి సంగీతం అందించిన సాయికార్తీక్‌కి థ్యాంక్స్. కార్తీక్ సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మమ్మత్ని ప్రొత్సహించారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శివకి ధన్యవాదాలు’ అన్నారు. చిత్ర దర్శకుడు శివకుమార్. బి మాట్లాడుతూ ‘ 22-02-2020 రోజున మా ‘22’ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియోను ప్రభాస్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రభాస్ ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు అనగానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సాంగ్ లాంచ్ చేసి, సినిమా కాన్సెప్ట్ గురించి అడిగి తెలుసుకుని, ‘కథలో మంచి డెప్త్ ఉంది. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయండి, తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది’ అని చెప్పి మా టీమ్ అందర్నీ విష్ చేసిన ప్రభాస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అన్నారు. సుశిలాదేవి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సాయికార్తిక్ సంగీతం అందించారు. -
నాకు డబుల్ హ్యాపీ- బి.ఎ. రాజు
ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘నాతో కలిసి శివ చాలా సినిమాలకు పని చేశాడు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా సినిమా చేశాడు.. నాకు బాగా కావాల్సినవాడు, చాలా ప్రతిభ ఉన్నవాడు.. తనపై నమ్మకం ఉంది. ‘22’ సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ సాధించాలి. శివ పెద్ద డైరెక్టర్ కావాలి. రూపేష్ కుమార్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, మారుతిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శివకుమార్ బి. దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘22’. రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలాదేవి నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘22’ చిత్రం టాకీని శివ 35 రోజుల్లో పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ని పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పాటు తన మీద తనకు ఎంతో నమ్మకం ఉండటంవల్లే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేయలిగాడు’ అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ– ‘‘పూరీగారి దగ్గర పనిచేసే అవకాశం ఇచి్చనందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని ఆయన అభినందించారు. ముఖ్యంగా సాయికార్తీక్ నేపథ్య సంగీతానికి బాగా ఇంప్రెస్ అయ్యారు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి శివకి రూపే‹Ùలాంటి హీరో, ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టం. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి రవికిరణ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్.. ఇద్దరూ ఒకే సినిమాకి చేయడం నాకు డబుల్ హ్యాపీ’’ అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ‘‘సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగా చేశారు. రవికిరణ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. షూటింగ్ అంతా చాలా సజావుగా జరిగింది’’ అన్నారు రూపే‹Ùకుమార్ చౌదరి. కెమెరామేన్ రవికిరణ్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడారు. -
నడిచే దేవుడు కానరాలేదా?
రాష్ట్రంలో ఇప్పుడు భారతరత్న పురస్కారంపై వివాదం సాగుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌పై సీఎల్పీ నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేయగా, బీజేపీ మంత్రులు అంతకంటే తీవ్రంగా ప్రతిదాడి సాగిస్తున్నారు. సాక్షి, హుబ్లీ (బెంగుళూరు): నడిచే దేవునిగా ప్రసిద్ధి చెందిన దివంగత తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని గుర్తుకు రాలేదా? పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో నిద్రపోయారా? అప్పుడు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయం అని రాష్ట్ర మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్‌పార్టీపై ధ్వజమెత్తారు. ఆదివారం హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామీజీకి భారతరత్న కచ్చితంగా లభించాల్సిందన్నారు. ప్రస్తుతం తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై డిమాండ్ చేస్తున్నామన్నారు. సిద్ధరామయ్యకు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ‘సిద్ధరామయ్య కాంగ్రెస్‌లోకి ఇటీవలే వచ్చారు. ఎమర్జన్సీ సమయంలో ఇదే సిద్ధరామయ్య ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. అపార ప్రజాసేవ చేసిన శివకుమారస్వామిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. బోఫోర్స్ కుంభకోణాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కానుకగా ఇస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ పరిపాలనను అందిస్తున్నారని అన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ గురించి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. గతంలో ఎలాంటి ప్రకటనలు చేశారో ఆత్మావలోకనం చేసుకుంటే నిరంకుశ ధోరణి ఎవరిదో తేటతెల్లమవుతుందన్నారు. మహదాయిపై చర్చకు సిద్ధం గోవాలో కాంగ్రెస్ ఊరుకుంటే మహదాయి సమస్య తీరుతుందన్నారు. మహదాయిలో గోవా కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తోందన్నారు. మహదాయిపై గోవా సీఎం చర్చలకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మహదాయిపై నోటిఫికేషన్ వెలవడనుందని ఆయన హామీ ఇచ్చారు. సమరయోధులను చులకన చేయొద్దు: సీనియర్ రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర పోరాట యోధుల గురించి చులకనగా మాట్లాడటం మాజీ సీఎం సిద్ధరామయ్యకు తగదని డిప్యూటీ సీఎం గోవింద కారజోళ అన్నారు. హుబ్లీలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముందు చరిత్రను తెలుసుకొని బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. భాషా ప్రయోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన సిద్ధరామయ్య స్వాతంత్య్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించిన వారి పట్ల గౌరవభావంతో మాట్లాడాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం మహానుభావులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఆయన గౌరవానికి మంచిది కాదన్నారు. -
చిత్రాల శివుడు
అతనొక అజ్ఞాత కళాకారుడు. స్పష్టంగా మాట్లాడలేడు కాని అందమైన బొమ్మలకు, అనూహ్యమైన ఘటనలకు ప్రాణం పోయగలడు. గడపలకు, గుమ్మాలకు రంగులు వేయడమైతే పుట్టుకతో వచ్చిన విద్య. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్‌తో ప్రముఖ రాజకీయ నాయకుల బొమ్మలను కూడా సొంతంగానే వేస్తున్నాడు. తన బొమ్మలకు గుర్తింపు కావాలని మూగగానే అభ్యర్థిస్తున్నాడు. గాంధీని గాడ్సే షూట్ చేశాడు. ఇందిరా గాంధీని సెక్యూరిటీ గార్డులే పొట్టన పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాజీవ్‌గాంధీని మానవ బాంబు హతమార్చింది, సంజయ్‌గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. వీటిని తన రంగులలో చిత్రీకరించాడు నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శివకుమార్. రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ జంటను చిత్రీకరించి, సోనియాను అచ్చతెలుగు ఆడపడుచులా నగలతో అలంకరించి, తన సృజనను నిరూపించుకున్నాడు. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శివకుమార్, పది సంవత్సరాల వయస్సు వరకు బాగానే మాట్లాడేవాడు. ‘‘ఏం జరిగిందో ఏమో తెలియదుకాని, పదో ఏట నుంచి మాట పోయింది’’ అంటారు శివకుమార్ తల్లి సాయిలమ్మ. బుచ్చన్న సాయిలమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. శివకుమార్ రెండో సంతానం. ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అనారోగ్యం కారణంగా తండ్రి బుచ్చన్న పది సంవత్సరాల క్రితం మరణించాడు. కుటుంబాన్ని తల్లి ఒంటి చేత్తో పోషించవలసి వచ్చింది. కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పెంచుకొస్తోంది. అన్న మల్లేశ్, చెల్లెలు విజయలక్ష్మి ఇద్దరూ మానసికంగా ఎదగలేదు. ‘‘నాకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం మాత్రమే. మా కుటుంబానికి అండగా ఉండాలంటే, నేను మరింత కష్టపడాలి. ఎవరి సహకారమూ లేకుండానే తలుపులకు రంగులు, గడపలకు ముగ్గులు వేసి, ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అప్పుడప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొని, చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకుల బొమ్మలు వేస్తున్నాను’’ అని చెప్పారు 35 ఏళ్ల శివకుమార్. తమ్ముడు సంజయ్ డిగ్రీ వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబం ఒక పాత ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బొమ్మలను గుర్తించి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుండునని శివకుమార్ ఆశ. – వైజయంతి పురాణపండ ఫొటోలు: గోరటి శ్రీరాములు, సాక్షి, తెలకపల్లి -
ఇంటర్ ఫెయిలే జీవితాన్ని మార్చేసింది
అపజయమే విజయానికి సోపానమంటారు పెద్దలు. అది నిజమేనని నిరూపించారు శివకుమార్ గౌడ్. ఈయనెవరనేదేనా మీ సందేహం. మన జిల్లాకు చెందిన వ్యక్తే. మొదట్లో పరీక్షల్లో ఫెయిలైనా ఆ అపజయాన్నే విజయానికి పునాదిగా మార్చుకుని సక్సెస్ బాట పట్టారు. అంతటితోనే ఆగకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఉన్నతస్థాయిలో నిలబడ్డారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని కుంగిపోకుండా గుండె నిబ్బరంతో విజయం కోసం తపించాలని శివకుమార్ గౌడ్ పిలుపునిస్తున్నారు. సాక్షి, కామారెడ్డి : పరీక్ష తప్పితే కుంగిపోనవసరం లేదు.. పట్టుదలతో చదివితే సక్సెస్ కావచ్చు.. ఉన్నతస్థాయికి ఎదగొచ్చునని రుజువు చేశారు శివకుమార్‌గౌడ్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన శివకుమార్‌గౌడ్ పదో తరగతి వరకు సొంత ఊల్లోనే చదివాడు. ఇంటర్మీడియట్ చదివేందుకు కామారెడ్డి పట్టణానికి చేరుకున్నాడు. 1987–89లో స్థానిక జీవీఎస్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివిన శివకుమార్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌లో ఫెయిలయ్యాడు. అప్పుడు 150 మార్కులకు 53 మార్కులు వస్తే పాస్ అవుతారు. అయితే ఆయనకు 43 మార్కులు మాత్రమే వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యానని కుంగిపోలేదు. కసితో చదివాడు. సప్లిమెంటరీలో రాసి పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. అప్పుడు 643 మార్కులతో ఎంపీసీలో క్లాస్ సెకండ్‌గా, కాలేజీలో థర్డ్ ర్యాంకర్‌గా నిలిచాడు. ఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఆయన్ను ఇబ్బంది పెట్టిందో దాని మీదే ఎక్కువ దృష్టి సారించాడు. డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. 1989–1992 సంవత్సరంలో ఆయన మ్యాథ్స్‌కు సంబంధించి నాలుగు పేపర్లు రాశాడు. రెండింటిలో 150 మార్కులకు 150 మార్కులు, ఒకదానిలో 139, మరొకదానిలో 142 మార్కులు సాధించి కాలేజీలో మంచి గుర్తింపు పొందాడు. 89 శాతం మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. 1992–94లో ఉస్మానియా పరిధిలోని నిజాం కాలేజీలో ఆయన పీజీలో 90 శాతం మార్కులు సాధించి యూనివర్సిటీలో నాలుగో ర్యాంకు సాధించాడు. 1994–96లో నాగార్జన సాగర్‌లో బీఈడీ చదివారు. అక్కడా ఏడో ర్యాంకు సాధించారు. 1996లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన శివకుమార్‌గౌడ్ 2002 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 2002లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై 2012 వరకు రామారెడ్డి, కామారెడ్డి కాలేజీల్లో పని చేశాడు. లెక్చరర్‌గా పని చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. 2008లో అప్లయి చేసిన ఆయ న 2011లో జరిగిన పరీక్షలో నెగ్గాడు. 2012లో ఆయనకు జైళ్ల శాఖ డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్‌లో తరువాత కరీంనగర్లో ఆ తరువాత మహబూబ్‌నగర్‌లో ప్రస్తుతం సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ మార్కులే గ్రూప్–1 సక్సెస్‌కు కారణం.. శివకుమార్‌గౌడ్ గ్రూప్–1లో సక్సెస్ కావడానికి మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులే కారణం కావడం విశేషం. ఇంటర్లో ఏ సబ్జెక్టులో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో, తరువాత అదే సబ్జెక్టు ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాలి. గ్రూప్–1 ఎగ్జామ్‌లో మ్యాథ్స్‌కు సంబంధించి 150 మార్కులు ఉంటాయి. అందులో శివకుమార్‌గౌడ్‌కు 143 మార్కు లు వచ్చాయి. అన్ని మార్కు లు రావడం కారణంగానే గ్రూప్–1 ఉద్యోగం వచ్చిం దని చెబుతారు శివకుమార్‌గౌడ్. విద్యార్థులు కుంగిపోవద్దు.. గెలుపు ఓటములు అనేవి సహజం. టెన్త్, ఇంటర్లో ఫెయిల య్యాన ని కుంగిపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. ఫెయిలైన సబ్జెక్టుకు సం బంధించి మరింత కసితో చదివితే సక్సెస్ కావొచ్చు. ఫెయిల్ అయినవారంతా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ మిగలరు. ధైర్యంగా చదవాలి. ముందుకు సాగాలి. ఫెయిలై సక్సెస్ అయిన వ్యక్తుల్లో నేనొకరిని. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. – శివకుమార్‌గౌడ్, సంగారెడ్డి జైల్ సూపరింటెండెంట్ -
శివ సాయికుమార్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు సీహెచ్ శివ సాయికుమార్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఎంఏ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో రజతాన్ని గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో రాష్ట్రం నుంచి నలుగురు క్రీడాకారుల బృందం పాల్గొనగా శివ సాయికుమార్ పతకాన్ని సాధించాడు. రాష్ట్ర జట్టుకు టి. బాలరాజు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం కార్యదర్శి అబ్దుల్ సత్తార్ జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించిన సాయికుమార్‌ను అభినందించారు. -
కర్ణాటక మంత్రిపై మనీలాండరింగ్ కేసు
సాక్షి బెంగళూరు: ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్యతో పాటు మరికొందరిపై కూడా ఇదే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో శివకుమార్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హవాలా మార్గాల్లో కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరపడం, ఆదాయపన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ బెంగళూరు ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈడీ చర్యలకు దిగింది. ఎస్.కె. శర్మ, సచిన్ నారాయణ్, ఎన్.రాజేంద్ర, ఆంజనేయ హనుమంతయ్యల సహకారంతో మంత్రి శివకుమార్ భారీమొత్తంలో అక్రమంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖ చార్జిషీటులో పేర్కొంది. నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ త్వరలోనే సమన్లు పంపనుంది. ఆగస్టులో ఢిల్లీ, బెంగళూరుల్లోని శివకుమార్ నివాసాల్లో ఐటీ విభాగం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.20 కోట్ల నగదు బయటపడిన సంగతి తెలిసిందే. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష అమలు నిలిపివేత..
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు కార్యదర్శి కె. శివకుమార్ నాయుడికి సింగిల్ జడ్జి విధించిన 30 రోజుల సాధారణ జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ జడ్జి విధించిన రూ.2 వేల జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇది తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రకటించింది. గత వారం సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్‌రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణకు స్వీకరించింది.శివకుమార్ నాయుడు మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బుచ్చయ్య అనే వ్యక్తి తన ప్రైవేట్ స్థలంలో చేపట్టిన కల్యాణ మంటప నిర్మాణ పనుల కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సింగిల్ జడ్జి ఆయనకు జైలు, జరిమానా విధించిన సంగతి విదితమే.దీనిపై శివకుమార్ అప్పీల్ దాఖలు చేయడంతో ధర్మాసనం ఊరటనిచ్చింది. -
యువ కళా కెరటం
జవహర్‌నగర్: ఇటు నృత్యం.. అటు సాహిత్యంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన వేములవాడ శివకుమార్. పేదరికం కళకు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు. నృత్యంతో మొదలైన తన ప్రస్థానం ప్రస్తుతం సాహిత్యం దిశగా సాగుతోంది. ఆల్బమ్స్ సైతం రూపొందిస్తున్నాడు. ఆరో తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకున్న శివ.. ఆ విద్యను పది మందికి అందజేస్తున్నాడు. ఆల్బమ్స్ రూపకల్పన... ఇంటర్ పూర్తి చేసిన శివకుమార్ జవహర్‌నగర్‌లో ‘అమ్మ’ నృత్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. తక్కువ ఫీజులు తీసుకుంటూ నటన, నృత్యంలో శిక్షణనిస్తున్నాడు. శివకుమార్ నృత్య రంగంలో రాణిస్తూనే.. మరోవైపు లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘అమ్మ క్రియేషన్స్’ పేరుతో ‘చెలియా సఖియా.. అందాల పువ్వేదో.. ‘అను అను అనురాగం.. హృదయమా... కళ్లలోనూ కలలే కంటూ’ అనే గీతాలతో ఓ ఆల్బమ్ రూపొందించాడు. భవిష్యత్‌లో సినీ రంగంలో అడుగు పెట్టాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాడు. లిరిక్ రైటర్ కావాలని.. సాధ్యమైనంత వరకు కళను పది మందికి పంచడమే నా ఆశయం. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాశాను. ‘ఇట్స్ మై లవ్’ ఆల్బమ్ విడుదల చేశాను. మ్యూజిక్ యాంకర్ భార్గవ్‌తో రెండు పాటలను చిత్రీకరించాను. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యాంకర్ రవి, లాస్యలతో ఆల్బమ్ రూపొందించాం. భవిష్యత్‌లో సినీగేయ రచయిత కావడమే నా ధ్యేయం. – శివకుమార్ -
టీఎస్‌టీఏ టోర్నీ డైరెక్టర్‌గా శివకుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) టోర్నమెంట్స్ డైరెక్టర్‌గా జె. శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి టోర్నీల నిర్వహణలో అపార అనుభవం కలిగిన రిఫరీ శివకుమార్‌ను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు టీఎస్‌టీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివకుమార్ మినహా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అధికారిక గుర్తింపును పొందిన రిఫరీలు లేకపోవడం విశేషం. 2005 నుంచి టీఎస్‌టీఏ నిర్వహించే పలు టోర్నీలను ఆయన పర్యవేక్షించారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తులు 730 కోట్లు
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కనకపుర నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో ఆయన పేరిట, భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువ 730 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. శివ కుమార్ ప్రస్తుతం కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన తన ఆస్తుల విలువ 251 కోట్లు రూపాయలుగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ దాదాపుగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. వీటిలో బ్యాంకులో అందుబాటులో ఉన్న నగదు విలువ 95 కోట్ల రూపాయలు కాగా, బంగారం, వజ్రాలు, వెండిల విలువ కోటిన్నర రూపాయలు. ఇతర ఆస్తుల విలువ 635.8 కోట్ల రూపాయలు. తన కూతురు ఐశ్వర్య ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలని కూడా శివ కుమార్ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 2017లో పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు శివ కుమార్ సంస్థలపై దాడులు నిర్వహించారు. 100 మందికి పైగా ఐటీ శాఖ అధికారులు చెన్నై, ఢిల్లీ, కర్ణాటకల్లోని శివ కుమార్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో కొన్ని డాక్యుమెంట్లను, కొంత డబ్బును సీజ్ చేశారు కూడా. గత నెలలో శివ కుమార్‌కు ప్రత్యేక కోర్టు షరతులతో కూడా బెయిల్‌ను మంజూరు చేసింది. -
పెళ్లిలో ఘర్షణ, పరారైన పెళ్లికొడుకు
భద్రాద్రి కొత్తగూడెం : ప్రేమించి...ఆనక పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేసి.. మరో యువతి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కరకగూడెం మండలం వెంకటాపురానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శివకుమార్...ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఏటూరు నాగారానికి చెందిన మమత అనే యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. మణుగూరు మండలం రామానుజవారం శివాలయంలో ప్రియుడు శివకుమార్ పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆమె.. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. అయితే మమతపై శివకుమార్ తరఫు బంధువులు దాడి చేశారు. మరోవైపు శివకుమార్ అక్కడ నుంచి పరారవ్వగా, బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ నట్టి శివ కుమార్ (50) శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్చరీ సంఘానికి సేవలందించిన ఆయన మృతి పట్ల తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ సంజీవ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయనతో పాటు హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి పి.అరవింద్ కుమార్ టోలిచౌకి సాలార్జంగ్ కాలనీలోని శివకుమార్ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. శివకుమార్ అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
‘వింబుల్డన్’ విధులకు శివకుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐటీఎఫ్ సర్టిఫైడ్ హోల్డర్ జె. శివకుమార్ రెడ్డి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో లైన్మెన్ అఫీషియల్‌గా విధులు నిర్వర్తించేందుకు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఐటీఎఫ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ వైట్ బ్యాడ్జ్ కలిగిన ఏకైక అఫీషియల్ శివకుమార్ కావడం విశేషం. ఈయన ఇప్పటికే కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ ఇస్లామిక్ గేమ్స్, డేవిస్‌కప్, ఫెడ్ కప్, ఆఫ్రో ఆసియా క్రీడలు, హాప్‌మన్ కప్, ఏటీపీ, డబ్ల్యూటీఏ వరల్డ్ టూర్ ఈవెంట్లు, ఏటీపీ చాలెంజర్, ఐటీఎఫ్ సీనియర్, జూనియర్స్ వంటి పలు టోర్నీలలో విధులు నిర్వహించారు. తాజాగా ప్రఖ్యాత వింబుల్డన్ టోర్నీకి ఎంపికవడంతో శివకుమార్‌ను శాట్స్ ఎండీ దినకర్‌బాబు, రాష్ట్ర టెన్నిస్ సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ బుధవారం అభినందించారు. -
మరో వారంలో ఎంట్రీ!
బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కన్నడ రాజ్‌కుమార్ తన యుడు, ప్రముఖ హీరో శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారనే వార్తను నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయి బాబా అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, ఏ పాత్రలో అనేది వెల్లడించలేదు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నడ మినహా ఇతర భాషల్లో నటించలేదు. మా చిత్రంలో నటించడానికి అంగీకరించిన శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్. వచ్చే వారం నుంచి ఆయన నటించే సీన్స్ చిత్రీకరించనున్నాం. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్. -
'అవినీతిలో కేసీఆర్, చంద్రబాబు పోటీ పడుతున్నారు'
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆరోపించారు. ప్రాజెక్టుల నుంచి చేప పిల్లల పంపిణీ వరకు అంతా అవినీతే అని మండిపడ్డారు. ఆఖరికి సబ్సిడీ ట్రాక్టర్లలోను విచ్చలవిడిగా అవినీతి పాల్పడ్డారన్నారు. అవినీతిలో ఇక్కడ కేసీఆర్, ఏపీలో చంద్రబాబు పోటీ పడుతున్నారని శివకుమార్ తెలిపారు. ఇలాగైతే బంగారు తెలంగాణ సాధ్యం కాదని, బిచ్చమెత్తుకునే తెలంగాణగా మారుందని అభిప్రాయపడ్డారు. -
సంపన్నుల ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. అరెస్ట్!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): చోరీ చేయడం ఆ ఘరానా దొంగకు వెన్నతో పెట్టిన విద్య కాబోలు.. చిటికలో చోరీ చేసి అంతే వేగంగా కనుమరుగయ్యేవాడు. చిక్కడు దొరకడు అన్నట్టు పోలీసులకు దొరకకుండా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. తనకు చోరీ చేయాలని అనిపిస్తే తొలుత తాళాలు వేసిన ఉన్న ఇళ్లపై కన్నుపడుతుంది. పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ నల్లకుంట పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకూ ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న అతగాడిని అరెస్ట్ చేసినట్టు ఆదివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన తిమ్మసముద్రం శివకుమార్ అలియాస్ శివ (27) చిన్నతనంలోనే నగరానికి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో పాఠశాల విద్య పూర్తి చేసుకుని 2005 వరకు దొరికిన పనిల్లా చేశాడు. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడంతో చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలయ్యాక బెంగళూరులో స్థిరపడ్డాడు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి నగరానికి వచ్చి సంపన్నుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడి వెంటనే బెంగళూరు వెళ్లిపోయేవాడు. అదే అలవాటుగా మళ్లీ వచ్చి చోరీకి పాల్పడుతుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి నుంచి 45 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రెండు ల్యాప్‌టాప్‌లు, ద్విచక్ర వాహనం, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల తయారీదారులు వలి పాష (45), నాగూర్ కర్నూల్‌కు చెందిన రామ్ ప్రసాద్ (25)లను అరెస్టు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కమిషనర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
గోదావరిలో ఇద్దరి గల్లంతు
మహదేవ్పూర్(కరీంనగర్ జిల్లా): మహదేవ్పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వాటర్ గ్రిడ్ ఇంజనీర్ శివకుమార్, రవిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
పురానాపూల్‌లో భారీ బందోబస్తు
హైదరాబాద్: పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వెల్లడించారు. విధుల్లో 1500 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది. -
'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం, కొత్తసిటీలో టీఆర్ఎస్ పార్టీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర పార్టీల అభ్యుర్ధులపై దాడి ఇందుకు నిదర్శనమని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల అదుపులో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణం గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తామని అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్ రమణ, శివకుమార్ తెలిపారు. -
నా శీలాన్ని దోచేసి... వదిలేసింది
న్యాయం చేయండి పోలీసులను ఆశ్రయించిన యువకుడు సహజీవనం చేసి, ఇప్పుడు కాదంటోందంటూఆరోపణ బెంగళూరు : నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించి గర్భం దాల్చింది. ఇప్పుడు నన్ను కాదంటోంది. శీలం కోల్పోయిన నేను వేరొకరిని ఎలా వివాహం చేసుకోవాలి. న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడో బాధితుడు. వివరాల్లోకి వెళ్లితే... తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలలుగా సదరు యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో రెండు రోజుల ముందు శివకుమార్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. మొదట్లో వద్దంటున్నా యువతి నాపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసింది. అటుపై నేను తప్పని చెబుతున్నా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించింది. అంతేకాకుండా గర్భవతి కూడా అయింది. అటుపై ఆమె తల్లిదండ్రులు నన్ను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారు. అటుపై కూడా నాతో సంబంధం కొనసాగించింది. ఆమె బాగోగులు కోసం నేను రూ. 5 లక్షల వరకూ ఖర్చు చేశాను. కొంత కాలంగా నా నుంచి దూరంగా ఉంటోంది. ఆమె తల్లిందండ్రులు యువతిని హాసన్‌లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పోయినందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు నా శీలం పోయింది. మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి. ఈ విషయమై యువతిపై రేప్ కేసు పెట్టండంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఈ తరహా కేసులు నమోదు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు సోమవారం మీడియాను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు నా శీలాన్ని ఆమె దోచుకుంది. నాకు న్యాయం చేయండి. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. లేదా ఆమెతో నాకు వివాహం జరిపించండి అని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశాడు. -
యువకుడికి క్రిక్‌బజ్ రూ. 10లక్షల బహుమతి
దుగ్గిరాల(గుంటూరు జిల్లా): ఐపీఎల్ క్రికెట్ పై క్రిక్ బజ్.కాం నిర్వహించిన డ్రీమ్ టీమ్ ఎంపిక స్కీమ్‌లో దుగ్గిరాలకు చెందిన యువకుడు జంపాల శివ కుమార్ జాక్‌పాట్ కొట్టేశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివకుమార్ ఎంపిక చేసిన టీమ్ మొదటి బహుమతి గెల్చుకుంది. ఆదివారం జరిగిన చెన్నై, ముంబాయి జట్ల నుంచి 11 మంది క్రీడాకారులతో ఎంపిక చేసిన జట్టు 389 పాయింట్లు రావటంతో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న 3 వేల జట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం రూ.25 లక్షల బహుమతుల ప్రకటించగా ప్రథమ స్థానంలో నిలిచిన తాను రూ.10 లక్షలు బహుమతికి అర్హత సాధించినట్టు శివకుమార్ చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 30.9 శాతం పన్నులు మినహాయించి, రూ.7.25 లక్షలు ఐదు రోజుల్లో డ్రా చేసుకునే విధంగా అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అందుకు అవసరమైన పాన్‌కార్డు, బ్యాంకు వివరాలను క్రిక్ బజ్ వారు కోరటంతో అన్ని వివరాలు పంపినట్టు తెలిపాడు. క్రికెట్‌పై ఆసక్తే తనకు రూ.10 లక్షలు బహుమతి గెలుసుకునేలా చేసిందని ఆనందం వ్యక్తం చేశాడు. -
'రైతుల ఆత్మహత్యలే బంగారు తెలంగాణా?'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క హామీ అయినా అమలు చేసారా ? అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శివకుమార్ సూటిగా ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడమే బంగారు తెలంగాణా? అంటూ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మే 2న తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ మాత్రమేనని శివకుమార్ చెప్పారు. -
ఆంధ్ర ఇన్నింగ్స్ విజయం
గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఇక నాకౌట్ అవకాశాలు హైదరాబాద్ చేతిలో సాక్షి, ఒంగోలు: పేస్ బౌలర్ దువ్వారపు శివ కుమార్ (5/38) హడలెత్తించడంతో... గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ 136 పరుగుల ఆధిక్యంతో భారీ విజయాన్ని సాధించింది. ఆంధ్ర బౌలర్ల దూకుడుకు ఈ మ్యాచ్ మూడో రోజుల్లోనే ముగియడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 187/8తో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గోవా మరో 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లను కోల్పోయి 198 పరుగులవద్ద ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆంధ్ర బౌలర్ల ధాటికి గోవా బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలువలేకపోయారు. తుదకు 81.4 ఓవర్లలో 214 పరుగులవద్ద ఆలౌటై ఇన్నింగ్స్ ఓటమిని చవిచూశారు. గోవా జట్టులో ఓపెనర్ అమోగ్ దేశాయ్ (112 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 57), వేదాంత్ నాయక్ (82 బంతుల్లో 8 ఫోర్లతో 37) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా... స్టీఫెన్ మూడు, హరీష్, విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ను 548/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌తో రంజీ: హైదరాబాద్ 297/1 సాక్షి, హైదరాబాద్: తన్మయ్ అగర్వాల్ (303 బంతుల్లో 14 ఫోర్లతో 105 బ్యాటింగ్), విహారి (229 బంతుల్లో 19 ఫోర్లు, సిక్సర్‌తో 138 బ్యాటింగ్) సెంచరీలు చేయడంతో... హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ దీటైన జవాబు ఇచ్చింది. మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో వికెట్ నష్టానికి 297 పరుగులు చేసింది. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (9 ఫోర్లతో 48) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కాలంటే చివరిరోజు ఆ జట్టు మరో 215 పరుగులు చేయాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఈ గెలుపుతో ఆంధ్ర ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి. ప్రస్తుతం ఆంధ్ర మొత్తం 29 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉండగా... హిమాచల్‌ప్రదేశ్ 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ఆంధ్ర నాకౌట్ ఆశలన్నీ హైదరాబాద్, హిమాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసి హిమాచల్‌ప్రదేశ్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆ జట్టు 30 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తే మాత్రం ఆంధ్ర జట్టు 29 పాయింట్లతో నాకౌట్ దశకు చేరుకుంటుంది. హిమాచల్‌ప్రదేశ్ 28 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా అస్సాం జట్టు ఇప్పటికే 35 పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందింది. -
‘బోరు’ బాలల కోసం...
నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడిన చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఓ యువకుడు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, ఆంధ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు కన్నుమూశారు. అలాంటి సంఘటనలు టీవీలో చూసిన యువకుడు చలించిపోయూడు. వారి కోసం ఏదో ఒకటి చేయూలని తలిచాడు. ఆ చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నాడు. పళ్లిపట్టు (తమిళనాడు): కాంచీపురం జిల్లా పిళ్లైయార్పాళ్యానికి చెందిన శివకుమార్. పాఠశాల దశ నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం డీఈసీఈ అనే సాంకేతిక విద్య పూర్తి చేసి విదేశంలో నూనె కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడుతున్న చిన్నారులను సురక్షితంగా వెలుపలికి తీసేందుకు మన యంత్రాంగం ఎంత కృషి చేసినా ఫలితం లేదు. ఇలాంటి సంఘటనలు టీవీలో చూసిన శివకుమార్ కరిగిపోయూడు. ఎంతో మంది తల్లిదండ్రుల కడుపుకోతను చూసి చలించిపోరుున శివకుమార్ వారిని ఎలాగైనా ప్రాణాలు కాపడాలని సంకల్పించారు. దీంతో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. పరికరం 85 సెంటీమీటర్ల పొడవు, 35 సెంటీ మీటర్ల వెడ ల్పుతో కూడిన ఈ సాధనం అవసరాన్ని బట్టి పొడవు వెడల్పు పెంచి తగ్గించుకోవచ్చు. ఈ యంత్రం దాదాపు 25 కిలోల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. ఇది వరకే అందుబాటులో ఉన్న పరికరాలు చిన్నారిని గాలి వేగంతో లేదా చిన్నారి సాయంతో మాత్రమే వెలికి తీసేందుకు వీలుపడేది. అయితే యువకుడి సరికొత్త ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి పరిస్థితిని గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా, చిన్నారి మాటలను సైతం ఖచ్చితంగా వినడానికి వీలుగా మైక్‌ను ఆ పరికరంలో అమర్చారు. అలాగే చిన్నారి శ్వాస తీసుకునేందుకు వీలుగా ఆక్సిజన్ సిలిండర్ ద్వారా తీసుకునే అవకాశం సైతం ఉంది. ఈ సరికొత్త ఆవిష్కరణతో బోరుబావిలోని చిన్నారులను కేవలం అర్దగంట సమయంలో సులభంగా ప్రాణాలతో కాపాడవచ్చు. యువకుడి సరికొత్త ఆవిష్కరణను తన ప్రాంతం ప్రజ లకు తెలియజేసే విధంగా నిరుపయోగంగా ఉంటున్న బోరుబావిని ఎంచుకుని ప్రయోగాత్మకంగా వివరించారు. అతని ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని ఎలా కాపాడాలి? అందుకు ఏం చేయాలో తెలుపుతూ తన సరికొత్త ఆవిష్కరణ ఎలా ఉపయోగపడుతుందో చేసి చూపించారు. ముందుగా ఒక చిన్నారి బొమ్మను బోరు బావిలోకి వేశారు.తరువాత ఆ బొమ్మ ఎంత లోతులో ఉంది, ఏ పరిస్థితిలో ఉందో కనుగొనడానికి తాను తయూరు చేసిన పరికరాన్ని బోరుబావిలోకి పంపించారు. దానికి అనుసంధానం చేసిన అత్యాధునిక పరికరంతో చూస్తూ ఆ సరికొత్త యం త్రాన్ని బోరుబావిలోకి దించాడు. అనంతరం ఆ పరికరం ఉన్న దారాల ఆధారంగా ఆ బొమ్మను పట్టుకుని బోరు బావిలోని గోడలు సైతం ఆ బొమ్మకి తగలకుండా పైకి తీసుకొచ్చాడు. ఇంత అద్భుత ప్రయోగం చేసిన శివకుమార్‌ను స్థానికులు అభినందించకుండా ఎలా ఉంటారు. -
సెటిల్మెంట్ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సివిల్ తగాదాల్లో తలదూర్చినందుకు... పోలీసు విభాగం ఇరుకున పడింది. చినికి చినికి గాలివానగా మారిన ఒక కుటుంబ ఆస్తి తగాదా పోలీసు అధికారుల మధ్య చిచ్చు రేపింది. ఈ రాద్ధాంతంలో సీఐ లక్ష్మీబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్, కుటుంబ తగాదాల్లో తలదూర్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ శివకుమార్ ప్రకటించారు. దీంతో దాదాపు కోటిన్నర రూపాయల విలువైన ఈ ఆస్తి తగాదా వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీసు అధికారుల మధ్యనే చిచ్చు పెట్టినట్లయింది. మూడు రోజుల కిందట పెద్దపల్లి డీఎస్పీ, గంగాధర ఎస్సైతో తమకు ప్రాణభయం ఉందని.. తమ కుటుంబానికి సంబంధించిన భూ తగాదాలో తలదూర్చి తమను బెదిరిస్తున్నట్లు గంగాధర మండల కేంద్రానికి చెందిన అన్నతమ్ముళ్లు శ్రీరాం మల్లేశం, శ్రీరాం రవీందర్ నార్త్‌జోన్ ఐజీకి ఆగస్టు 30న ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఐజీ ఈ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా.. ఇదే ఘటనలో వెకెన్సీ రిజర్వులో ఉన్న సీఐని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేయటంతో ఈ సెటిల్మెంట్ల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. గంగాధర పోలీస్‌స్టేషన్‌కు సంబంధం లేని సీఐ లక్ష్మీబాబును సస్పెండ్ చేయటం... ఎస్సై, డీఎస్పీలపై వచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేస్తుంటే ఈయన ఎందుకు ఇరుక్కున్నారు? అనేది సందేహాస్పదంగా మారింది. ఈ ఘటనలో రవీందర్, మల్లేశం ఐజీకి ఫిర్యాదు చేయటం వెనుక సీఐ లక్ష్మీబాబుపాత్ర ఉందనేది ప్రధాన అభియోగం. మరోవైపు బాధితుల్లో ఒకరైన రవీందర్‌కు సీఐకి దగ్గరి దోస్తానా ఉంది. అందుకే వారికి మద్దతుగా ఈ భూ వివాదాన్ని సెటిల్ చేసేందుకు రూ.లక్షల్లో ఒప్పందం చేసుకున్నాడనే అభియోగంపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించటం తగదని... కొద్ది రోజుల్లో తానే చొప్పదండి సీఐగా వస్తున్నానని అప్పుడు ఈ తగాదాను సెటిల్ చేస్తానని సీఐ లక్ష్మీబాబు స్థానిక పోలీసు అధికారులతోనూ ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు గుప్పుమంది. కానీ.. ఈ తగాదాలో అసలు పోలీసు అధికారులు ఎందుకు తలదూర్చారు.. లక్ష్మీబాబు ఒకవైపు వకాల్తా పుచ్చుకున్నట్లు ధ్రువీకరించిన పోలీసు యంత్రాంగం... మరోవైపు మద్దతు పలికినట్లుగా ఫిర్యాదులు ఎదుర్కొన్న ఎస్సై, డీఎస్పీల పాత్ర ఏమిటి? అనేది వెల్లడించలేదు. సెటిల్మెంట్ దందాలో ఒకరి ప్రమేయాన్ని ఒకరిపై తోసిపుచ్చేందుకు పోలీసు అధికారులు ఈ కేసును తమకు అనుకూలంగా మలుచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కొందరిని వెనుకేసుకు వచ్చి.. ఒక్కరిపైనే వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగింది గంగాధర మండలకేంద్రానికి చెందిన శ్రీరాం మల్లేశం, రవీందర్, మధుకర్ ముగ్గురు అన్నదమ్ములు. మల్లేశం, రవీందర్ స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతుండగా... చిన్న కుమారుడు మధుకర్ బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అన్నదమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. పలుమార్లు పంచాయితీలు నిర్వహించుకున్నా పరిష్కారం కాలేదు. జూలై మొదటి వారంలో మధుకర్ తన సోదరులైన మల్లేశం, రవీందర్‌పై గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్, డీఎస్పీ వేణుగోపాల్‌రావుకు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు పంచాయితీ పెట్టడంతోపాటు.. మధుకర్‌కు మద్దతుగా సివిల్ పంచాయితీలో తలదూర్చిన డీఎస్పీ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మల్లేశం, రవీందర్ కలిసికట్టుగా ఐజీకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న ఫోన్‌రికార్డులను సమర్పించారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు మరోవైపు పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్‌తో తన కుమారులకు ప్రాణభయం ఉందని మల్లేశం, రవిందర్ తల్లి లక్ష్మి బుధవారం మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. తన కుమారులతోపాటు తనను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నానా బూతులు తిట్టారని అందులో పేర్కొంది. -
వీడు మామూలోడు కాదు
మోస్ట్ వాంటెడ్ వందల కొద్దీ గొలుసు దొంగతనాలు చర్చనీయాంశమైన శివ ఎన్కౌంటర్ విజయవాడ సిటీ : ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్‌సైకిల్‌పై సహచరుడితో కలిసి వేగంగా వస్తాడు. ఆపై గొలుసు తెంచుకుని పరారవుతాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే ఆయుధాలతో దాడి చేసి భయపెడతాడు. సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి జరిపిన ఎన్కౌంటర్లో హతమైన కొడవలూరి శివకుమార్ అలియాస్ సాంబ నేరం చేసే శైలి ఇది.. దొంగిలించిన సొమ్ముతో ఖరీదైన జీవితం గడపటం శివకు ఇష్టం. రాష్ట్రంలో మోస్ట్‌వాంటెడ్ గొలుసు దొంగ శివకుమార్ ఎన్కౌంటర్ నగర పోలీస్ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని పటమట, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీసుస్టేషన్ల పరిధిలో పలు గొలుసు దొంగతనం కేసులు ఇతనిపై నమోదవ్వడమే ఇందుకు కారణం. ఇతనితోపాటు సహచరుడు మందపాటి జగదీష్‌పై ఇక్కడ 8కి పైగా గొలుసు దొంగతనాల కేసులు ఉన్నాయి. అంతర్జిల్లా నేరస్తుడు నెల్లూరు జిల్లా ఆర్మేనుపాడు గ్రామానికి చెందిన శివకుమార్, సహచరుడు జగదీష్‌పై రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 300కు పైగా గొలుసు దొంగతనం కేసులు ఉన్నాయి. విజయవాడతో పాటు విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. గొలుసు దొంగతనాలకు ముందు అందుకోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వీరు రెక్కీ చేస్తారు. ఆ తర్వాత మోటారు సైకిల్‌పై వేగంగా వెళుతూ వంటరిగా ఉండే మహిళల మెడలో గొలుసులు తెంచుకుపోతారు. వీరి వేగానికి మహిళలు భయోత్పానికి గురై తేరుకునే లోగానే మాయమవుతారు. ఒకవేళ ఎవరైనా వీరిని గమనించి అడ్డుకునేందుకు యత్నిస్తే ఇనుప రాడ్లు, కత్తులతో గాయపరిచి పరారవుతారు. వెంటనే ఆ ప్రాంతం నుంచి మకాం మార్చుతారు. ఇటీవల గొలుసు దొంగతానాలు పెరగడంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు కొన్నాళ్లుగా గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైబరాబాద్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో శివ హతమవ్వడంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విలాసవంతమైన జీవితం శివకుమార్ తరుచూ తానుండే ప్రాంతాలను మార్చుతుంటాడు. గొలుసు దొంగతనాల్లో వచ్చిన సొమ్ముతో ఖరీదైన జీవితం గడుపుతాడు. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటాడు. ఉన్నత వర్గాలకు ఏమాత్రం తగ్గని రీతిలో కార్లు, మోటారు సైకిళ్లు కొనుగోలు చేసి వాడతాడు. మద్యం, మగువలు ఇతని జీవితంలో నిత్యకృత్యం. మగువల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తాడని పోలీసు వర్గాల సమాచారం. గతంలో ఇతణ్ణి రాజమండ్రిలో కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చారు. ముందస్తు సమాచారంతో అక్కడికి వెళ్లిన క్రైం పార్టీ బృందాలు ఇంటిని చూసి లోనికి వెళ్లేందుకు సాహసించలేదు. తమకు వచ్చిన సమాచారం నిజమైనదేనని రూఢీ చేసుకునేందుకు రెండు రోజుల పాటు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా ఆ ఇల్లు శివకుమార్ ఉంటున్నదేనని నిర్థారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలను చూసి వారు అవాక్కయ్యారంటే..అతడి జీవన విధానం ఎంత దర్జాగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. -
ప్రేమించి పెళ్లాడాడు.. పది రోజుల్లోనే గెంటేశాడు..
చిలమత్తూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేసి తనను వదిలించుకోవడానికి ప్రయత్నించడంతో ఓ ఇల్లాలు అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. మండల పరిధిలోని మొరసనపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దంపతులు ఈడిగ సువర్ణమ్మ, వెంకటేశుల కుమారుడు శివకుమార్(25) బెంగళూరులోని బూమర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఊరికి వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో తన మేనమామ కూతురైన సునీత(20)తో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాదిగా ఇరువురూ ప్రేమించుకుంటున్నారు. దీంతో సునీత పెళ్లి ప్రస్తావన తేవడంతో శివకుమార్ కూడా సరేనంటూ పెళ్లి తేదీని నిర్ణయించుకున్నారు. అయితే అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో.. కాదనలేని పెళ్లిని వాయిదా వేస్తూ తప్పించుకుని తిరిగాడు. అతని మోసాన్ని గ్రహించిన సునీత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. అయినా శివకుమార్, అతని తల్లిదండ్రుల మనసు మారలేదు. చేసేది లేక బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరి 10న చిలమత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శివకుమార్‌ను స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇరువురూ మేజర్లు కావడంతో పెళ్లికి ఒప్పించారు. అదే రోజు సాయంత్రం బాగేపల్లిలోని గడిదం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దలు వీరి పెళ్లి చేశారు. కీనీ అతని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వక పోవడంతో భార్యతో పాటు బెంగళూరుకు వెళ్లాడు. అనంతరం పది రోజుల పాటు కాపురం చేశారు. అప్పటికీ తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేని శివకుమార్, భార్యను వదిలించుకోవాలన్న దురుద్దేశ్యంతో ఆమెకు మాయ మాటలు చెప్పి పుట్టింటికి పంపాడు. ఆనక నువ్వంటే అమ్మకు ఇష్టం లేదు.. విడాకులివ్వు.. వేరే పెళ్లి చేసుకుంటా.. లేకుంటే నీకు చేతనైంది చేసుకో.. అంటూ అసలు విషయం వెళ్లగక్కాడు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మండల కుటుంబ సలహా కేంద్రం కమిటీ పాయింట్ పర్సన్ పద్మావతి, సభ్యులు మంజులమ్మ, లక్ష్మిదేవి, పద్మావతి, లక్ష్మిదేవి, రత్నమ్మ, పద్మావతి అండగా నిలిచారు. దీంతో బుధవారం వారితో పాటు ఆ గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో శివకుమార్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. అప్పటికే అత్తారింటి వారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా కొనసాగించారు. శివకుమార్ తన మనసు మార్చుకుని భార్యను ఇంటికి తీసుకెళ్లే దాకా తాము బాధితురాలికి అండగా ఉంటామని, మరో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వదిలేది లేదని మహిళా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. -
ప్రాణం తీసిన సరదా
కాంసానిపల్లి (ఉప్పునుంతల), న్యూస్‌లైన్ : అతను పదో తరగతి విద్యార్థి.. ఇటీవ లే వార్షిక పరీక్షలు రాశాడు.. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో శుభకార్యంలో పాల్గొనడానికి తాతయ్య ఇంటికి వచ్చాడు.. బంధుమిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపాడు.. అది ఎంతోసేపు నిలువలేదు.. వరసకు తమ్ముళ్లతో కలిసి సరదాగా సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన పద్మమ్మ, వెంకటేష్ దంపతులకు కుమారుడు శివకుమార్ (15), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా వీరందరూ హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ బాలుడు నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఇటీవలే వార్షిక పరీక్షలు రాశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో తల్లి సూచన మేరకు శుక్రవారం ఉదయం ఉప్పునుంతల మండలం కాంసానిపల్లిలోని తాతయ్య మాడిశెట్టి నారయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు బంధువుల ఇంట్లో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం వరసకు తమ్ముళ్లు (చిన్నమ్మల కొడుకులు) సతీష్, రాఘవేందర్‌తో కలిసి సమీపంలోని కోరండం బావికి సరదాగా ఈత కోసం వెళ్లాడు. కొద్దిసేపటికే నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఇది గమనించిన ఇద్దరు పిల్లలు వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి విషయాన్ని తాతయ్యతో పాటు గ్రామస్తులకు తెలిపారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని అరగంట పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగి పోయారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చి బాలుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
భారీగా ఎస్సైల బదిలీ
పోలీస్‌శాఖలో బదిలీల జాతరకు తెరలేచింది. జిల్లాలో ఒకేసారి 87 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఎస్పీగా శివకుమార్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఎస్సైల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తుండగా ఎన్నడూ లేనంత ఒకేసారి ఇంత మందిని బదిలీ చేసి రికార్డు సృష్టించారు. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా పోలీస్‌శాఖలో బదిలీల కుదుపు. గతంలో ఎన్నడూ లేని విధంగా 87 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ ఎస్పీ శివకుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీల్లో రాజకీయ, పైరవీల మార్కు స్పష్టంగా కనిపించింది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న 37 మంది ఎస్సైలకు పోస్టింగ్ ఇవ్వడంతోపాటు రెండేళ్ల ఉద్యోగకాలం పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేశారు. రెండు నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చిన వారిని సైతం మార్చారు. పనితీరు బాగున్నా ప్రాధాన్యత కల్పించలేదని పలువురు ఎస్సైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరవీలు లేని వారికి మంచి పోస్టింగులు దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో రానున్న ఎన్నికలు వీరికి పెద్ద సవాల్‌గా మారనున్నాయి. -
గ్లామర్‌తో సంచలనం సృష్టించాలి
పాపులారిటీ కోసం గ్లామర్‌ను ఆశ్రయించి సంచలనం సృష్టిస్తానంటోంది మరాఠి నటి మనీషా. వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ చిత్రం హిట్‌తో పలు అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ కూడా విజయం సాధించింది. మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో అందాలారబోతతో ప్రాచుర్యం పొందుతానంటోందీ బ్యూటీ. మనీషా మాట్లాడుతూ తాను బెంగళూరుకు చెందిన మరాఠీ అమ్మాయినని చెప్పింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్‌లోకి ప్రవేశిం చానంది. ఒక హోటల్లో భోజనానికి వెళ్లినప్పుడు అక్కడ వళక్కు ఎన్ 18/9 చిత్ర హీరోయిన్ అడిషన్ జరిగిందని చెప్పింది. ఆ చిత్ర సహాయ దర్శకుడు శివకుమార్ తనను చూసి చిత్రంలో నటిస్తారా? అని అడిగారని తెలిపింది. అలా తన సినీ తెరంగేట్రం జరిగిందని వివరిం చింది. డర్టీ పిక్చర్ లాంటి చిత్రంలో నటించి సంచలన నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశని, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు మనీషా తెలిపింది. -
శివపల్లిలో కోడిపందేలపై.. ఎస్పీ సీరియస్
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలిగేడ్ మండలం శివపల్లిలో బుధవారం నిర్వహించిన కోడిపందే లపై ఎస్పీ శివకుమార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావుతోపాటు వేలాది మంది ఈ పందేల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తానాబాద్ స్టేషన్‌కు, 8కిలోమీటర్ల దూరంలో ఉన్న జూలపల్లి పోలీసులకు కోడి పందేల గురించి తెలియకపోవడంపై ఎస్పీ మండిపడినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిం దిగా పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావును ఆదేశించినట్లు తెలిసింది. -
రోడ్డు డివైడర్లు తొలగిస్తే కేసులు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జాతీయ, రాజీవ్ రహదారి డివైడర్లను అనుమతి లేకుండా తొలగిస్తే ప్రమాదాల కేసులతోపాటు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శివకుమార్ హెచ్చరించారు. శుక్రవారం హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 105 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారి ఉందని, ప్రత్యేక డిజైన్ ద్వారా డివైడర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కొన్నిచోట్ల గ్రామస్తులు వారికి అనుకూలంగా ఉండేలా డివైడర్లను తొలగించడం తో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలా రాజీవ్, రాష్ట్ర రహదారులపై మూడేళ్లలో 1900మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రహదారి భద్రతపై జనవరి 2, 3, 4 తేదీల్లో రాజీవ్ రహదారి వెంట ఉన్న పోలీస్స్టేషన్లలో అవగాహనసదస్సులు నిర్వహిస్తామన్నారు. రోడ్డుకు అడ్డంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దన్నారు. బ్యాంకులు భద్రత పాటించాలి బ్యాంకులు కనీస భద్రత పాటించాలని ఎస్పీ సూచిం చారు. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఇటీవల కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంక్, ధర్మపురి సహకార పరపతి బ్యాంకుల్లో చోరీలు జరిగాయని వెల్లడించారు. దొంగతనాలు జరిగాక పోలీసులపై భారం వేయడం సరికాదన్నారు. బంగారంపై రుణాలిస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు.. ఇన్సూరెన్స్ సాకుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఆర్బీఐ, పోలీసుల సూచనలు పాటించని బ్యాంకుల్లో చోరీ జరిగితే కేసులు నమోదు చేయబోమని, ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకుంటే పోలీస్ రికార్డులో వంద శాతం రికవరీ అయినట్లు పేర్కొంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై కనీసం విచారణ కూడా చేపట్టబోమని వెల్లడించారు. బ్యాంక్ లో లోపల, బయట, ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్లు ప్రతి వారం ఆయా బ్యాంక్‌లను చెక్ చేసుకోవాలన్నారు. బంగారంపై రుణాలిచ్చే ప్రైవేటు సంస్థలు.. రుణగ్రహీతల వివరాలతోపాటు బంగారాన్ని చాలాకాలం పాటు తాకట్టుపెట్టిన వారి వివరాలను డీఎస్పీలకు ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (పరిపాలన) జనార్దన్‌రెడ్డి, ఓఎస్డీ సుబ్బరాయిడు, డీఎస్పీలు రవీందర్, సత్యానారాయణ, ఉదయకుమార్, పరమేశ్వర్‌రెడ్డి, నర్సయ్య, వేణుగోపాల్‌రావు, కరీంనగర్ రూరల్ సీఐ కమాలాకర్‌రెడ్డి, ఎస్బీఐ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి మరో షాక్
సాక్షి ప్రతినిధి, గుంటూరు తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తెనాలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ తనయుడు, ఏఎస్ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్‌లో తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. దీంతో తెనాలి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. యువకుడు, ఉత్సాహవంతుడైన శివకుమార్ చేరిక పార్టీకి మరింత బలం చేకూర్చుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. శివకుమార్ ఏఎస్ఎన్ పేరిట డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారు. తండ్రి సత్యనారాయణ తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా, తెనాలి శాసనసభ్యునిగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం టీడీపీ నాయకుడిగా వున్న శివకుమార్ 2009 వరకు నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతగా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితులై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తండ్రి మరణానంతరం డిగ్రీ కళాశాల నిర్వహణ బాధ్యతను స్వీకరించి, దానిని పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలుగా విస్తరించారు. శివకుమార్‌తో పాటు పట్టణానికి చెందిన సాయి విద్యాసంస్థల కరస్పాండెంట్ కుదరవల్లి రామ్మోహనరావు, చెన్నుపాటి వెంకటేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ ప్రధాన అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల నుంచి శివకుమార్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆయన నియోజకవర్గంలోని తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మంతనాలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరిక టీడీపీకి భారీగా లోటుగా పరిశీలకులు భావిస్తున్నారు.