సంగారెడ్డి: ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ దుర్గయ్య కథనం ప్రకారం.. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన శ్రీరాములు కుమారుడు శివ కుమార్(20) పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శివకుమార్ డ్రెస్ కుట్టించుకొని వస్తానని చెప్పి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి సోదరి సోనికి వీడియో కాల్ చేసి తను ఉరి వేసుకుని చనిపోతున్నట్లు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వెంటనే ఇందిరమ్మ ఇల్లు బ్లాక్ నంబర్ 6లోకి వెళ్లగా అప్పటికే రేకుల షెడ్‌కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చికిత్స నిమిత్తం అతణ్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడు ఏ కారణంతో చనిపోయాడనే విషయం తెలియదని, మృతుడు తండ్రి శ్రీరాములు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment