Sangareddy District News
-
భీఫార్మసీ విద్యార్థిని శివానీ ఆత్మహత్య
సదాశివపేట(సంగారెడ్డి): ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ(17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. రెండు నెలల కిందట సదాశివపేటలోని ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్న శివానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ నాకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టం.. నా తల్లిదండ్రుల అనుమతితో నా అవయవాలను దానం చేయాలని కోరుతున్నా.. నేను లేకున్నా నా అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారమోనని నా ఆశ.. నా చావుకు నేనే కారణం.. దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు పనికిరావని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
మనోహరాబాద్(తూప్రాన్): ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్(24) ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల కిందట వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ప్రశాంత్ కుటుంబ సభ్యులతో కలిసి అల్లాపూర్‌లోని తన అక్క ఇంటికి ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ అందరిని కలిసి తిరిగి ఇంటికొచ్చిన ప్రశాంత్ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన సెల్ఫోన్లో తాను ఎవరినైనా బాధిస్తే క్షమించాలని, అందరినీ వీడి పోతున్నాని మేసేజ్ చేశాడు. ఇది గమనించిన మిత్రులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి బాజాలు మోగాల్సిన చోట.. చావు డప్పులు..
పాపన్నపేట(మెదక్)/వట్పల్లి(అందోల్): పెళ్లి వేడుకలు ఆ గ్రామాల్లో విషాదం నింపాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మన్సాన్పల్లి వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈఘటనతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 40 రోజుల క్రితం స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఇదే రీతిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మరువక ముందే జరిగిన ఘోరాన్ని తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సొంగ రాము పెళ్లి అందోల్‌కు చెందిన మమతతో గురువారం నార్సింగిలో జరగాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. వధువు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లారితే పెళ్లి అనగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో బంధువులతో కళకళలాడిన ఇళ్లు ఒక్కసారిగా మూగబోయింది. విలపించిన కుటుంబ సభ్యులు బూదమ్మ భర్త కిష్టయ్య గతంలోనే మరణించగా, కొడుకు లక్ష్మీనారాయణ కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కూతురు వివాహం జరిగింది. తల్లి మరణంతో కొడుకు ఎకాకిగా మారాడు. కాగా జెట్టిగారి సంగమ్మ భర్త గోపాల్ పక్షవాతంతో బాధపడుతున్నారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు కాగా కొడుకు ఉపాధి వేటలో ఉన్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసే భార్య మరణించడంతో నాకు దిక్కెవ్వరు అంటూ గోపాల్ గుండెలు బాధుకున్నాడు. కాగా రావుగారి ఆగమ్మకు ఒక కూతురు, భర్త మల్లయ్య ఉన్నారు. కూతురు పెళ్లి కాగా మల్లయ్య, భార్య మరణంతో ఏకాకిగా మిగిలిపోయాడు. ఒక్కడినే ఎలా బతికేది అంటూ విలపించాడు. సంగారెడ్డిలో క్షతగాత్రులకు చికిత్స ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 26 మంది గాయపడగా వారందరికీ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి సంగారెడ్డికి తరలించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువ మందికి తలకు గాయాలు కావడంతో స్కానింగ్ కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం! : బీబీ పాటిల్
సంగారెడ్డి: సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్ ఆరోపించారు. మండల పరిఽధి మామిడ్గి గ్రామ శివారులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, పాండురంగారావు పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లప్ప ఆధ్వర్యంలో బసంత్‌పూర్, రాజోల, గంగ్వార్, గణేష్‌పూర్, మామిడ్గి తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. అనంతరం బీబీ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 400 కంటే అధిక స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందన్నారు. తెలంగాణలోనూ బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తనకు మరో సారీ అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు సుధీర్ కుమార్ బండారి, జగన్నాథ్, జనార్దన్‌రెడ్డి, ఓంకార్, మల్లేశం, రాహుల్, సతీష్‌గుప్త, అరవింద్ చౌహన్ పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’.. -
బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్ రావు, సంగమేశ్వర్, చిన్న పటేల్, విష్ణువర్థన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! -
ఉసురు తీసిన కుటుంబ కలహాలు!
సంగారెడ్డి: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంసాన్పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్ఐ గౌస్ కథనం మేరకు.. సంగముల రాములు (52)కు కుమారుడు మహేశ్ ఉన్నాడు. అదే గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని తండ్రి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించాడు. ఇది తెలిసిన అమ్మాయి వర్గపు వారు గురువారం రాములు ఇంటికొచ్చి తమ అమ్మాయికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు శుక్రవారం ఉదయం పాడి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. ఇవి చదవండి: మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు.. -
తన ఆటో ఎక్కకుండా వేరే ఆటో ఎక్కారని..
సిద్దిపేటకమాన్: తన ఆటోలో ఎక్కకుండా వేరే ఆటోలో ఎక్కారని కోపంతో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొంత మంది విద్యార్థులు పొన్నాలలోని వెంకటసాయి నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లడానికి నవ్య, ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం ఉదయం గ్రామం నుంచి సిద్దిపేట పట్టణానికి వచ్చింది. కళాశాలకు వెళ్లడానికి ముగ్గురూ సిద్దిపేట బస్టాండ్ వద్ద దాసరి శ్రీనివాస్ ఆటోలో ఎక్కారు. అక్కడే ఉన్న ఆటోల అడ్డా వారు విద్యా ర్థినులను ఎందుకు ఎక్కించుకున్నావ్.. చార్జీలు తక్కువ ఎందుకు తీసుకుంటున్నావ్ అని శ్రీనివాస్‌తో గొడవ పడ్డారు. శ్రీనివాస్ వెళ్తున్న క్రమంలో పట్టణానికి చెందిన మరో ఆటో డ్రైవర్ బర్రెంకల నవీన్ తన ఆటోతో విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నవ్య రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. మరో విద్యార్థిని మౌనిక స్పృహ తప్పి కిందపడిపోయింది. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నవీన్‌పై చర్యలు తీసుకోవాలని గాయపడిన విద్యార్థిని తండ్రి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
400 ఎంపీ సీట్లు గెలుస్తాం
సంగారెడ్డి : దేశంలో మోదీ హవా కొనసాగుతుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్‌కు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లోనే కాదు 2029లో సైతం బీజేపీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. విద్యావంతులు, మేధావులు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో నిలబడే బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదుల సంరక్షణ చట్టంతో పాటు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, భగవాన్రావ్ పాటిల్, టీ.సత్యనారాయణ, నవాజ్, సమరసింహారెడ్డి, శ్రీనివాస్, దత్తాత్రి, సురేందర్, రామ్మోహన్, బాలరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రికి ఘన స్వాగతం రామచంద్రాపురం(పటాన్చెరు) : సంగారెడ్డిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్‌కు సోమవారం రామచంద్రాపురంలో బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజు బీజేపీలో చేరారు. అనంతరం కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ -
నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే.. : మంత్రి పొన్నం
సంగారెడ్డి: గ్రామీణ యువత క్రీడలను అలవర్చుకోవాలని, క్రీడా స్ఫూర్తి ఐక్యతను ప్రోత్స హిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పోతారం(ఎస్) లో జరుగుతున్న జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను సందర్శించి క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను కూడా చిన్నతనంలో కబడ్డీ మాత్రమే ఆడేదని, ఈ ఊరు నుంచి కబడ్డీ క్రీడాకారులు పోలీసులు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు మడక కృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్‌లు కేడం లింగమూర్తి, బత్తిని సాయిలు, ఎంపీటీసీ భొమ్మగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ రథం అందజేస్తా.. లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్, కరీంనగర్ రెనే ఆస్పత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని సీవీ రామన్ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. శిబిరంలో ప్రముఖ ఛాతీ వైద్యులు, గుండె సంబంధించిన వైద్యులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వసతి కోసం కలెక్టర్, ఆర్డీఓలతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్‌కు నా తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయిలేని అనిత, వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, లయన్స్ క్లబ్ నిర్వాహకులు రాజగోపాల్రావు, కాయిత నారాయణ రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రిని సన్మానించిన ఆర్టీసీ ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఉద్యోగులు శాలువా కప్పి సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017 సంవత్సరానికి సంబంధించి వేతన సవరణ 21 శాతం ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి చదవండి: హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా.. : బీబీ పాటిల్ -
పుట్టింటికి ఎందుకొచ్చావని తల్లి మందలించిందని.. కూతురి విషాదం!
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి.. -
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
చెరువు తూములో పడి వ్యక్తి మృతి
సంగారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన వద్ద మల్లేశం (46) పని నిమిత్తం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి వచ్చాడు. పని ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా సుల్తాన్పూర్ గ్రామ శివారులోని పెద్దచెరువు మైసమ్మ దేవాలయం వద్ద తూము కల్వర్టుపై నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తూములో ప్రమాదవశాత్తు పడి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పుల్కల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గోవిందమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. నిద్రపోయి ప్రమాదవశాత్తు పడిపోవడంతో.. -
హత్య చేసి.. ఆపై తగులబెట్టి..
సంగారెడ్డి: మహిళను దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రం సమీపంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం.. రత్నూరు మండలం గోవిందరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే సునీత (45)కు హత్నూర మండలం మధుర గ్రామానికి చెందిన మాదిగ దత్తయ్యతో రెండు నెలల కిందట పరిచయం ఏర్పడింది. వీరు రెండు, మూడు సార్లు మధుర శివారు దత్తాచల క్షేత్రం గుట్టల్లో కలుసుకున్నారు. కలిసిన ప్రతీ సారీ దత్తయ్య రూ.500, రూ.1,000 సునీతకు ఇచ్చేవాడు. డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన దత్తయ్య గత నెల 31వ తేదీన మద్యం మత్తులో సునీత తలపై బండ రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సునీత కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈనెల 2వ తేదీన హత్నూర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వివాహేతర సంబంధంతో డబ్బు ఎక్కువ అడగడం వల్లే హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. -
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
మద్దూరు(హుస్నాబాద్): ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలోని హనుమతండా గ్రామ పరిధిలోని మహారాజ్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ షేక్యూనూస్ అహ్మద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భానోతు జబ్బర్ కూతురు జ్యోతి(25)ని సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి మండలంలోని భాపన్భాయి తండాకు చెందిన ధారావత్ నరేశ్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. కొద్ది రోజులుగా జ్యోతికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దే ఉంచుకొని హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. జీవితంపై విరక్తి చెందిన జ్యోతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జబ్బర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. మృతురాలికి కూతురు ఉంది. అనారోగ్యంతో వృద్ధుడు రామాయంపేట(మెదక్): ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఝాన్సిలింగాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రె చంద్రయ్య (68) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన చంద్రయ్య రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేషనల్ హైవే అథార్టీకి బదలాయింపు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్–బీదర్ రోడ్డును రహదారిగా గుర్తించి అప్‌గ్రేడ్ చేయాలన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. 15 రోడ్లలో మొదటి ప్రాధాన్యతగా ఆరు రోడ్లను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఆరు రోడ్లలో జహీరాబాద్–బీదర్ రహదారి కూడా మొదటి ప్రాధాన్యతలో ఉంది. దీంతో తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. కొన్ని సంవత్సరాలుగా ఊసేలేని ఈ అంశం మరోసారి చర్చకు రావడంతో రోడ్డు విస్తీర్ణంపై స్థానిక ప్రజలు ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, ఉద్గీర్, మహారాష్ట్రంలోని ఉద్గీర్ పట్టణ ప్రజలు హైదరాబాద్‌కు జహీరాబాద్–బీదర్ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డులో ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. గతంలో ఈ రోడ్డు ఆర్అండ్బీ శాఖ పరిఽధిలో ఉండగా.. దెబ్బతిన్న ప్రతిసారి వెంటనే మరమ్మతులు చేయించేవారు. నేషనల్ హైవే అథార్టీ అధికారులు పట్టించుకోని కారణంగా జహీరాబాద్–బీదర్ రహదారి అధ్వానంగా తయారైంది. గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. నేషనల్ హైవే అథార్టీకి బదలాయింపు జహీరాబాద్–బీదర్ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఉన్న రోడ్డులో నిత్యం రద్దీని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారిగా గుర్తించారు. ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రోడ్డుకు జాతీయరహదారిగా గుర్తించి ఫోర్‌లేన్‌గా విస్తరించేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వెంటనే ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్ హైవే అథార్టీకి బదలాయించారు. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డుకు జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయకపోవడంతో విస్తీర్ణం పనుల్లో జాప్యం జరుగుతుంది. వికారాబాద్–తాండూర్, జహీరాబాద్–బీదర్ వరకు గల 154 కి.మీ రోడ్డుకు కేంద్రం అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధి చేయాలని, తాజాగా మంత్రి కోమటిరెడ్డి వినతిపత్రం ఇవ్వడంతో ప్రజలు ఆశలు చిగురించాయి. మరమ్మతులు చేయించాం జహీరాబాద్–బీదర్ రహదారి తమ పరిధిలో లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలోనే ఈ రోడ్డును ఎన్హెచ్ఏ వారికి బదలాయించాం. రోడ్డు మరమ్మతుల గురించి వారే చూసుకోవాలి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయించాం. –నర్సింలు, డీఈఈ, ఆర్అండ్బీ,జహీరాబాద్ -
గుండెపోటుతో 8వ తరగతివిద్యార్థిని కన్నుమూత
సిద్దిపేటఅర్బన్: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అంబటి మహేశ్ కూతురు లాక్షణ్య (13) సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మాత్ర వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు తగ్గింది. అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది. కాసేపటికి బూత్రూంకు వెళ్లింది ఎంతకీ బయటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని, తీవ్రమైన గుండెపోటు రావడంతోనేనని తెలిపారు. -
సిరుల వరి
సింగూరు నీటితో ఏటా రెండు పంటలు పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు సాగు నీటితో రైతులు సిరులు పండిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితమే కాలువల నిర్మాణం పూర్తయి నిరంతరాయంగా నీరు సరఫరా అవుతుండటంతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. పంట ఉత్పత్తులు కూడా పెరగడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒకప్పుడు కరెంట్ కోసం, వర్షాల కోసం ఎదురు చూసిన వారు కాలువ నీటితో పంటలు పండిస్తున్నారు. సింగూరు కాలువల ద్వారా ఎడమ కాలువ నుంచి సాగు నీరు సరఫరా అవుతోంది. పుల్కల్, చౌటకూరు, అందోల్ మండలాల రైతులు ఏటా రెండు పంటలను పండిస్తున్నారు. కాలువ పరిధిలోని చెరువులను కూడా నీటితో నింపుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు 40 వేల ఎకరాల్లో వరి చేస్తున్నారు. సంవృద్ధిగా నీరు లభిస్తుండటంతో పాటు ఉత్తర భారత దేశం నుంచి కూలీలు ఇక్కడికి వస్తున్నారు. దీంతో నాట్లు వేసే విషయమై కొరత ఉండదు. రసాయనాలను డ్రోన్ల సహాయంతో పిచికారీ, పంట పూర్తయిన తర్వాత వరి కోత యంత్రాలతో సులువుగా నూర్పిడి చేస్తున్నారు. అనంతరం ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటుంది. నగదును రైతుల ఖాతాలోనే సకాలంలో జమ చేస్తుండటంతో వరి సాగుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా ఆయకట్టు పరిధిలో కొత్తగా రైసు మిల్లులు సైతం వెలిశాయి. -
కొట్టారు.. తిట్టారు!
అనురాగ్ యూనివర్సిటీలో చిన్నకోడూరు విద్యార్థిఆత్మహత్యాయత్నం ● అధ్యాపకుల వేధింపులే కారణమన్న కుటుంబీకులు ● గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యం ● పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోచారం: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో బుధవారం ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అధ్యాపకుల వేధింపుల కారణంగానే విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌రెడ్డి ఇక్కడి అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం వచ్చిన మొదటి సెమిస్టర్ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో జ్ఞానేశ్వర్ ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నట్లు తోటి విద్యార్థులు గమనించారు. అందరి ముందు అవమానించడంతో.. ఇదిలా ఉండగా.. హెయిర్ కటింగ్ చేయించుకోలేదని జ్ఞానేశ్వర్‌ను డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ ట్రైనర్ మంగళవారం అందరి ముందు అవమానించడంతో పాటు కొట్టారు. ఇదే విషయాన్ని జ్ఞానేశ్వర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధను వ్యక్తం చేశాడు. రెండు రోజుల్లో యూనివర్సిటీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడతామని నచ్చచెప్పారు. కానీ.. తనకు జరిగిన అవమానం తట్టుకోలేని జ్ఞానేశ్వర్ బుధవారం మధ్యాహ్నం యూనివర్సిటీలోని సీ బ్లాక్ రెండో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశాడు. చికిత్స నిమిత్తం అతడిని యూనివర్సిటీకి చెందిన నీలిమ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి పక్కటెముకలు విరిగినట్లు చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యా యత్నాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిస్థితి విషమించే తరుణంలో సంఘటన గురించి యాజమాన్యం చెప్పడంతో కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రానికే ఆస్పత్రికి చేరుకున్నారు. మొదటి సెమిస్టర్లో ఫెయిల్ అయ్యావని, కళాశాలకు క్రమం తప్పకుండా రావడంలేదని, వచ్చినా ఆలస్యంగా వస్తున్నావని ఏదో ఒక కారణం చూపించి వేధించడంతో జ్ఞానేశ్వర్ తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు జ్ఞానేశ్వర్ బంధువులు ఆరోపించారు. విద్యార్థులను అవమానించి, శారీరకంగా హింసించే హక్కు మీకు ఎవరిచ్చారని అధ్యాపకులను నిలదీశారు. ఆత్మహత్యా యత్నానికి కారకులైన అధ్యాపకులతో పాటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్ఞానేశ్వర్ అన్న సాత్విక్‌రెడ్డి పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. జ్ఞానేశ్వర్‌ను తాము కొట్టలేదని డీన్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. హెయిర్ కటింగ్ చేయించుకోమని ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. -
అతి వేగమే ప్రమాదానికి కారణమా?
● ఆ సమయంలో 30 మంది ప్రయాణికులు ● 23 మందికి గాయాలు,అందులో ఏడుగురికి తీవ్ర గాయాలు ● ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ● రాళ్లకత్వ గ్రామంలో ఘటన ● అతి వేగమే ప్రమాదానికి కారణమా? బస్సు వేగంగా వెళ్తుంది బస్సు రోజూ వేగంగా వెళ్తోంది. ఈ విషయాన్ని చాలాసార్లు ఆర్టీసీ అధికారులకు చెప్పాం. అయినా పట్టించుకోలేదు. వేగంగా బస్సు వెళ్తుండటాన్ని కళ్లారా చూశా. గ్రామాల నుంచి వెళ్తున్న సమయంలో డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలి. : మల్లేశ్, ప్రత్యక్ష సాక్షి, రాళ్లకత్వ జిన్నారం(పటాన్చెరు): అతివేగానికి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇక్కడి నుంచి ఉదయం 7 గంటలకు 30 మంది ప్రయాణికులతో పటాన్‌చెరుకు బయలుదేరింది. రాళ్లకత్వ దాటిన తర్వాత వచ్చిన ఒక మలుపు వద్ద బస్సు వేగానికి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మందికి గాయాలయ్యాయి. అందులో డ్రైవర్ ఎరుకలి బుచ్చయ్య, కండక్టర్ పోచయ్య, ఇమాంనగర్కు చెందిన చిద్రుప్ప పద్మ, సోలక్పల్లికి చెందిన ఇంద్రేశం అక్షిత్‌గౌడ్, నల్లగండ్ల సాయి, నల్లగండ్ల సంజన, సికింద్రాబాద్‌కు చెందిన రాజమన్నోళ్ల లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొంత మందిని ఇంద్రేశంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయారావు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ వేణుకుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం దైవాదీనం, డిపో మేనేజర్ మాధవి, పలువురు రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు. స్టీరింగ్ నట్టు ఊడిపోయింది స్టీరింగ్ నట్టు ఊడిపోవటంతో బస్సు కంట్రోల్ కాలేదు. దీంతో చెట్టుకు ఢీకొంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నా అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తా. : బుచ్చయ్య, డ్రైవర్ -
అప్పులు తీర్చే మార్గం లేక..
రాయపోలు(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోలు మండలం బేగంపేటలో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ కథనం పక్రారం.. గ్రామానికి చెందిన బయ్యారం కృష్ణాగౌడ్ (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు. కిస్తీలు కట్టేందుకు సతమతమవుతున్నాడు కొంతకాలంగా దిగాలుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తూప్రాన్‌కు వెళ్తున్నట్లు చెప్పి బయటికెళ్లి గడ్డి మందు తాగాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి భార్య వర్షకు అప్పులు తీర్చే మార్గం దొరక్క జీవితంపై విరక్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పాడు. వెంటనే ఇంటికి తిరిగొచ్చి వాంతులు చేసుకుంటే వెంటనే గ్రామస్తుల సహాయంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేక.. మద్యానికి బానిసై గజ్వేల్‌రూరల్: ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో చోటు చేసుకుంది. గజ్వేల్ ఎస్ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనగామ నర్సింహులు(33) భార్య ఏడాది క్రితం మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక వేదన గురైన అతను మద్యానికి బానిసయ్యాడు. బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మద్యం తాగొద్దన్నందుకు..మనోహరాబాద్(తూప్రాన్): మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దీపక్ భారతి (35) తన కుటుంబంతో కలిసి మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో అద్దె కుంటున్నాడు. ఇక్కడే ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు తాగొద్దన్నందుకు గాను మనస్తాపం చెంది బుధవారం అద్దె ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పూజ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. పెళ్లి కావడం లేదని తనువు చాలించాడునంగునూరు(సిద్దిపేట): పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కోనాయిపల్లికి చెందిన రజినీకర్‌రెడ్డి (38) హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కావడం లేదని బాధతో మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట గ్రామానికి చేరుకున్న అతడు శివారు ప్రాంతంలోని నిమ్మ బాల్‌రెడ్డి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అందులో మృతదేహాన్ని గుర్తించిన జిడ్డి ప్రవీణ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు.. గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. -
ఫోన్ మాట్లాడుతూ.. ఐదో అంతస్తుపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
పటాన్చెరు టౌన్: నిర్మాణ దశలో ఉన్న భవనం ఐదో అంతస్తుపై నిలబడి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన గణేష్ బతుకుదెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ కాచిగూడకు వచ్చి పెయింటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల నుంచి రామచంద్రాపురం పరిధిలోని వెలమెల గార్డియన్ స్కూల్ డి– బ్లాక్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పని చేసే చోట ఐదో అంతస్తుపై నుంచి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉసురుతీసిన ఆర్థిక ఇబ్బందులు రామాయంపేట (మెదక్): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన మైసంగల సిద్దరాములు (50) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ విషయమై కుమారుడితో గొడవ పడిన సిద్ధరాములు.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని దామరచెరువు గ్రామశివారులో క్రిమి సంహారక మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. వారు ఘటనా స్థలికి చేరుకొని సిద్దరాములును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి వెల్దుర్తి(తూప్రాన్): ఓ ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మణ్(42) 20 ఏళ్లకు పైగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆటోల్లో ప్రయాణికులు చాలా తక్కువగా రావడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండో పెళ్లి చేసుకున్నాడని.. తూప్రాన్: రెండో పెళ్లి చేసుకున్న భర్తపై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివానంద్ కథనం ప్రకారం.. హవేళి ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన షబానా 2019లో తూప్రాన్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో వివాహం జరిగింది. వీరికి కూతురు ఉంది. పెళ్లయిన మూడు నెలల నుంచే అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించినా ఇమ్రాన్ కుటుంబంలో మార్పు రాలేదన్నారు. దీంతో 2022లో హవేళి ఘనపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య షబాన ఫిర్యాదు చేసింది. కామారెడ్డి కోర్టులో విడాకులు, మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ లింగారెడ్డిపేటకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య షబాన ఫిర్యాదు చేసింది. -
పెళ్లయి ఏడాది గడవకముందే విషాదం..
వట్పల్లి(అందోల్): పెళ్లయి ఏడాదైనా గడవకముందే ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతి చెందింది. రోజూ అందరినీ పలకరిస్తూ, కలిసిమెలసి ఉండే ఆమెను అంతలోనే మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అందోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మాసానిపల్లికి చెందిన బంటు పవిత్ర (21) ఆదివారం ఉదయం ఎప్పటిలాగే నిద్రలేచి, వాకిలి శుభ్రం చేసి వాటర్ హీటర్‌తో నీటిని వేడి చేసుకుంది. ఆ నీటితో స్నానం చేసి బట్టలు మార్చుకునే సమయంలో విద్యుత్ సరఫరా అవుతున్న హీటర్ తాకింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన ఆమె పెద్దగా కేక వేస్తూ కిందపడిపోయింది. పక్కనే మంచంపై నిద్రిస్తున్న భర్త నవీన్ లేచి భార్యను పట్టుకోబోయాడు. అతనికీ షాక్ తగిలినట్లు అనిపించడంతో వెంటనే హీటర్ ప్లగ్‌ను తొలగించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పవిత్రను ఆటోలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించాడు. దీంతో అక్కడే ఉన్న భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వందలాదిగా బంధువులు పవిత్ర మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న మృతదేహాన్ని పట్టుకుని తల్లి సుశీల గుండెలు అవిసేలా రోదించింది. ముద్దులు పెడుతూ పవిత్రా.. నువ్వు ఇక లేవా బిడ్డా.. అంటూ ఏడ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా కంటతడి పెట్టారు. తహసీల్దార్ కోసం 3గంటలు నిరీక్షణ పవిత్రను ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె చనిపోయినట్లు అరగంటలో డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నవీన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే స్థానికంగా తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో మృతురాలి బంధువులు 3గంటలు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు డీటీ చంద్రశేఖర్, తహసీల్దారు అంటోనీలు వచ్చి పంచనామా చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బిడ్డకు జన్మనిచ్చి మృతి
చేగుంట(తూప్రాన్): డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కావేటి లత(25)కు ప్రసవ నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు శనివారం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆమె పాపకు జన్మనివ్వగా రక్త స్రావం ఎక్కువ కావడంతో లత ప్రాణాపాయస్థితికి చేరుకొంది. దీంతో బంధువులు మెరుగైన వైద్యంకోసం సికింద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే లత మృతి చెందింది. ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం కుమారుడు జన్మించగా శనివారం పాప పుట్టింది. ఆమె మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా గ్రామానికి చెందిన మహిళ ప్రసవం కోసం వెళ్లి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి లత మృతికి కారణమైన తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి
22 యేళ్లుగా పోరాటం పటాన్చెరు (వట్టినాగులపల్లి) నుంచి మెదక్ వరకు 90 కిలో మీటర్ల రైల్వే లైన్ కోసం 22 యేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఈ లైన్‌కు కోసం రైల్వే మంత్రులకు వినతి పత్రాలు అందజేశాం. 2018లో రైల్వే అధికారులు స్పందించి సర్వే చేసి రూ.1700 కోట్లు అవసరమని అంచనాలు సైతం సిద్ధం చేశారు. కానీ బడ్జెట్లో నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. ఈ సారైనా నిధులు కేటాయించాలని కోరుతున్నాం. – గంగ జోగినాథ్, జోగిపేట్ ఆదాయ పరిమితి రూ.10 లక్షలకు పెంచాలి ప్రస్తుతం ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఆదాయ పరిమితి ఉంది. దీనిని రూ.10 లక్షల వరకు పెంచాలి. అలాగే స్లాబ్రేట్లను సవరించాలి. 80(సీ) పన్ను మినహాయింపు రూ.2.50 లక్షలు ఉంది. రూ.5 లక్షల వరకు పెంచాలి. గృహ రుణ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంచాలి. – వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్ -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వట్పల్లి(అందోల్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్ఐ–2 మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామానికి చెందిన చెప్యాల గోపాల్(38) అప్పులు చేసి ట్రాక్టర్, వరికోత మిషన్ యంత్రాలతోపాటు ఓ కారును కొనుగోలు చేశాడు. అప్పుల భారం రోజు రోజుకూ పెరగడంతో కొంత భూమిని అమ్మినా తీరలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉద యం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నట్లు కనిపించాడు. గోపాల్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో.. పటాన్‌చెరుటౌన్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కథనం ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కళింగగూడెంకు చెందిన పూజారి రామకృష్ణ(35) బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు వచ్చాడు. డీఎన్ కాలనీలో ఉంటూ పాశమైలారం పారిశ్రామిక వాడలోని యూజియా ఫార్మా క్యాంటీన్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నా డు. ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసైన రామకృష్ణ ఇంటికి వెళ్లకుండా, పని చేసే క్యాంటీన్ వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం క్యాంటీన్ స్టోర్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆడుకోవడానికి గేమ్స్ జోన్..
సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్లో రెండు రోబోలను హైదరాబాద్ నుంచి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ రోబోలు చార్జింగ్ బ్యాటరీల సాయంతో పని చేస్తాయి. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్లగానే ముందుగా రోబోలు కస్టమర్లు కూర్చున్న టేబుల్ వద్దకు వెళ్లి ‘నమస్కారం సార్, మేడమ్.. రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్‌కు స్వాగతం. నా పేరు మైత్రీ ఫుడ్ ఆర్డర్ చేయండి సార్ అని పలుకుతుంది. మనకు నచ్చిన భోజనం ఆర్డర్ చేసిన తర్వాత మరో రోబో ఆర్డర్ చేసిన భోజనం ఫ్లేట్లో కస్టమర్ కూర్చున్న టేబుల్ వద్దకు తీసుకొస్తుంది. వేడి వేడి ఆహారాన్ని తీసుకొచ్చాను.. ధన్యవాదాలు సార్ అని చెబుతుంది. ఆడుకోవడానికి గేమ్స్ జోన్.. ఇలా వినూత్న పద్ధతిలో భోజనం వడ్డిస్తూ కస్టమర్లను, భోజన ప్రియులను ఆకర్షిస్తుంది ఈ రోబో 2.0 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పటికే సిద్దిపేటలో ట్రైన్ రెస్టారెంట్‌ను నిర్వాహకులు నడుపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా, కస్టమర్లను ఆకర్షించే విధంగా వినూత్న పద్ధతిలో రోబోలను ఏర్పాటు చేసి వాటి సాయంతో భోజనాన్ని సరఫరా చేస్తూ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రోబో ఫ్యామిలీ రెస్టారెంట్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్స్ జోన్, రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్, హోం థియేటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీకెండ్లో తాకిడి ఎక్కువ.. ఈ రెస్టారెంట్లో ఇతర హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే సాధారణ చార్జీలు ఉంటాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. 20 రోజుల క్రితం ఓపెన్ చేసిన హోటల్‌కు కస్టమర్లు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా వస్తున్నారని, వీకెండ్లో కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. హోటల్లో అన్ని రకాల చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ బిర్యానీలు, ఇతర భోజనాలు, వెజ్, నాన్‌వెజ్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని రోబోలతో ఫొటోలు దిగడానికి, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కస్టమర్లు హోటల్‌కు క్యూ కడుతున్నారు. హోటల్లో కస్టమర్ల వద్దకు ఆహారాన్ని తీసుకొస్తున్న రోబోలు (మైత్రీ) -
‘టీశాట్–నిపుణ’ లైవ్ టెలీకాన్ఫరెన్స్‌కు ఎంపిక
ములుగు(గజ్వేల్): స్కూల్ లీడర్షిప్ అకాడమీ– రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో (టీశాట్–నిపుణ) చానల్ ద్వారా నిర్వహిస్తున్న లైవ్ టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ములుగు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.క్రాంతి కుమారి ఎంపికయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు కేంద్రీకృతంగా, వినూత్న పద్ధతిలో బోధిస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో క్రాంతి కుమారి ఒకరు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి ఉదయ భాస్కర్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారులు అభినందించారు. పొలంలోనే రైతు మృతి గజ్వేల్‌రూరల్: పొలం వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోమటిబండలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉబ్బని అశోక్(35)కు భార్య పోచమ్మతోపాటు ఇద్దరు కొడుకులున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న అశోక్ తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సోమవారం తన పొలంలో వరి నాట్లు వేసేందుకు పొలం గట్లను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు బురద పొలంలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రమాదస్థలానికి చేరుకొని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి ● రూ.55 వేలు, బైక్‌లు స్వాధీనం ● నలుగురు అరెస్ట్, పరారీలో ముగ్గురు సిద్దిపేటఅర్బన్: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి వెల్కటూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారయ్యా రు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.55,179, మూడు బైకులు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించగా వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో వెల్కటూరు గ్రామానికి చెందిన ఆలేటి కృష్ణ, రాచమల్ల కనకయ్య, దుద్దెడ గ్రామానికి చెందిన నర్ర దేశిరెడ్డి, పొన్నాలకు చెందిన లెంకల రవి ఉన్నారు. సిర్సినగండ్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు, కొండపాక గ్రామానికి చెందిన యాదగిరి యాదవ్, మంతూరి మహేశ్ పరారీలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ జహీరాబాద్ టౌన్: చదువుతోపాటు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరి కృష్ణ అన్నారు. పట్టణంలోని బీసీ వసతి గృహంలో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చట్టా లు తోడ్పడుతాయన్నారు. పోక్సో చట్టం, బా లకార్మిక చట్టం, సమాచార చట్టం, జ్యువైనల్ జస్టీస్ యాక్ట్ తదితర చట్టాలపై వివరించారు. బాల కార్మికులు, బాల వివాహా బాధితులను గుర్తిస్తే తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేదా 1098 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సదస్సులో బార్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్‌కుమార్ సాగర్, న్యాయవాదులు బ్రహ్మనందరెడ్డి, మహేశ్, శేఖర్, జగన్, మహేందర్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, వార్డెన్ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో 28 గొర్రెల మృతి
బెజ్జంకి(సిద్దిపేట): కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన శశిధర్ హైద్రాబాద్‌లో నివసిస్తాడు. ముత్తన్నపేటలోని తన వ్యవసాయ భూమిలో గొర్రెల షెడ్డు వేసి కాపరులను పెట్టి సుమారు 170 గొర్రెల పెంపకం చేపట్టాడు. కాపరి రోజులానే శనివారం రాత్రి గొర్రెలను షెడ్డులో ఉంచి ఇంటికెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చేసరికి గొర్లు మృతి చెంది ఉన్నాయి. కుక్కలు దాడి చేయడంతో 28 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు శశిధర్ తెలిపారు. సుమారు రూ.2 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని వాపోయారు. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
హుస్నాబాద్: విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బస్ డిపో వెనుక మారుతి కాలనీకి చెందిన సయ్యద్ సంశీర్కు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సయ్యద్ సాధీక్ అన్వర్ (6) ఇంటిపైన ఇనుప టేపుతో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు ఇంటి వెనుకాల పైనుంచి వెళ్తున్న కరెంట్ వైర్లకు టేపు తాకి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఇంటి పక్కనే తుమ్మ చెట్లు కొడుతుండగా, ఒక్కసారిగా ఇంటి పైనుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే వెళ్లి చూడగా సాధీక్ శరీరం మొత్తం కాలిపోయి మృతి చెందాడు. క్షణాల్లో కుమారుడు విద్యుత్ షాక్‌కు బలికావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఘటనను తెలుసుకున్న సీఐ కిరణ్, ఎస్సై మహేశ్, కౌన్సిలర్ చిత్తారి పద్మ రవీందర్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటిపైన ఆడుకుంటుండగా ఘటన -
గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలోని మంజీర నదిలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్సై డి.మహిపాల్ రెడ్డి తెలిపారు. పొడిచన్పల్లి గ్రామ శివారులో సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభించిందన్నారు. చేపల వేటకు వెళ్లి చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పాపన్నపేట పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతుడు తెల్లటి దోవతి, పసుపు పచ్చ షర్ట్ ధరించి ఉన్నాడని వివరించారు. అనుమానాస్పద స్థితిలో.. రామచంద్రాపురం(పటాన్చెరు): అనుమానస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం భారతీనగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఐజీ కాలనీ గేటు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌ని పిలిపించి పరీక్షించగా ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 50 ఏళ్లు నుంచి 60 ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వంటిపై పసుపు, నలుపు రంగు షర్టు, గ్రే రంగు ప్యాంట్ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. వ్యవసాయ భూమిలో.. నారాయణఖేడ్: నారాయణఖేడ్– రాయిపల్లి రోడ్డులోని ఖేడ్ మండలం జూకల్ శివారులో అంత్వార్ గ్రామానికి చెందిన పుప్పాల మాణయ్య వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. -
కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా..
రైలు ఢీకొని వ్యక్తి మృతి గజ్వేల్‌రూరల్: రైలు ఢీకొని మృతి చెందిన ఘటన గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ శివారు (బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధి)లో ఆదివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావూ నాయక్, బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖాండ్ రాష్ట్రంలోని సిండేఘా తాలుకా, గిర్ద ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ భారీక్(24) మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ సమీపంలో జరుగుతున్న భూగర్భ సొరంగం పనుల్లోని కూలీలకు వంట చేసేందుకు ఏడాది క్రితం వచ్చాడు. వినికిడి లోపం ఉన్న రాజ్‌కుమార్ ఆదివారం కాలకృత్యాల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైలు ప్రమాద విషయం తెలుసుకున్న కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావూనాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
కార్మికుల పొట్టను కొడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారుల కొమ్ముకాస్తోందని
జహీరాబాద్ టౌన్: కార్మికుల పొట్టను కొడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారుల కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో శుక్రవారం నిర్వహించిన కార్మిక యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేఏళ్ల నుంచి కార్మిక, రైతాంగ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. కార్మిక చట్టాల రద్దును ఆపాలని, లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా ఫిబ్రవరి 16న జరుగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, మహీంద్ర యూనియన్ ప్రధాన కార్య దర్శి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం(పటాన్చెరు): మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను నిరసించాలని, 16న దేశవ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంద్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బీహెచ్ఈఎల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమైన విషయం అని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు పెంటయ్య, బాషా, వీరన్రావు, ప్రభాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి కెనాల్లో పడి కార్మికుడు మృతి
సంగారెడ్డి టౌన్: ప్రమాదవశాత్తు నీటి కెనాల్లో పడి కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఫసల్ వాది గ్రామానికి చెందిన ఖదీర్ (36) గణపతి చక్కెర పరిశ్రమలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పరిశ్రమ ఆవరణలో ఉన్న నీటి కెనాల్ లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలుజారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిలల్లు ఉన్నారు. పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకుంటామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఎస్సై రాజేశ్ నాయక్ యాజమాన్యం ఉన్నారు. -
సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కూటిగల్ గ్రామంలో ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర పోస్టర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను సూచించారు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా ప్రాజెక్టులు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్‌లు శుక్రవారం తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపికవ్వగా అందులో రెండు ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయన్నారు. మర్కూక్ మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ దామరకుంటలో 9 తరగతి చదువుతున్న విద్యార్థిని సుష్మ, సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని స్ప్రింగ్ డల్స్ పాఠశాలలో చదువుతున్న రితేష్‌ల ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టులు దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రాణిస్తే, జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక అవుతారని తెలిపారు. విద్యార్థులను గైడ్ టీచర్లు బ్రహ్మయ్య, కృష్ణకుమార్‌లను అభినందించారు. బాల నేరస్తులకు న్యాయ సహాయం సిద్దిపేటకమాన్: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో శుక్రవారం సిద్దిపేట కోర్టులో సమావేశం నిర్వహించారు. జైలులో ఉన్న బాల నేరస్తులను గుర్తించడం, వారికి న్యాయ సహాయం అందించడం అనే అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులో ఉన్న 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న ఖైదీలను గుర్తించి న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. పాన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మద్యం మత్తులో ఆత్మహత్య వెల్దుర్తి(తూప్రాన్): మద్యం మత్తులో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్దుర్తి పంచాయతీ పరిధి ఎల్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కానికె వెంకటేశ్(45) శుక్రవారం ఉదయం లేవలేదు. ఇంటి తలుపులు మూసి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఉరేసుకొని కనిపించాడు. తాగుడుకు బానిసై మద్యం మత్తులో వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
అమ్మో.. కోనోకార్పస్
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లుకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో, పార్క్‌లలో కోనో కార్పస్ చెట్లు విపరీతంగా నాటడడంతో అవి ఏపుగా పెరిగి ఇప్పుడు ప్రజలకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్ల కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్ల తొలగించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని పలు కాలనీ ప్రజలు పేర్కొన్నారు. అలాగే కరీంనగర్‌రోడ్‌లో కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు కొన్ని చెట్లను నరికించారు. ఇలానే పూర్తి స్థాయిలో పట్టణంలోని అన్ని కోనో కార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. –సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్,సిద్దిపేట -
కుస్తీ మే సవాల్
న్యాల్కల్ మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామంలో మైబు సభానీ దర్గా ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. కుస్తీ పోటీల్లో సుమారు 60 మంది పైల్వాన్లు హాజరయ్యారు. చివరకు మహారాష్ట్రాలోని ఉద్గీర్‌కు చెందిన కుతూబ్‌కు మొదటి బహుమతి వరించింది. కుతూబ్‌కు హద్నూర్ ఎస్ఐ రామానాయుడు వెండి కడియం అందజేశారు. ఇతర విజేతలకు ఎస్ఐతోపాటు గ్రామ పెద్దలు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి, శ్రీరామ్ ప్రజా సేనా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, జైనోద్దీన్, షబ్బీర్, అహ్మద్, చాకలి శివకుమార్, శ్రీన్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు. –న్యాల్కల్(జహీరాబాద్ -
సౌత్ జోన్ యోగా పోటీలకు ఎంపిక
గజ్వేల్‌రూరల్: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్‌జోన్ యోగా పోటీలకు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పీఈటీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్‌లో గల పీఎస్ఎన్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఖేలో ఇండియా సౌత్ జోన్ ఉమెన్స్ యోగా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో అంకిత, వైష్ణవి పాల్గొంటారని పేర్కొన్నారు. నాణాలతో త్రివర్ణ పతాకం గజ్వేల్‌రూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు త్రివర్ణ పతాకం ఆకారాన్ని రూపొందించారు. రూ. 33 వేల విలువ చేసే నాణెంలతో 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తేనె టీగల దాడి 15 మందికి గాయాలు చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలో తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చెట్టుకింద వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తులు కూర్చున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అక్కడ కూర్చున్నవారు గాయపడ్డారు. ఇదే సమయంలో హాస్టల్ విద్యార్థులు భోజనం ముగించుకొని బయటకు రాగా తేనెటీగల దాడి కి గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్‌లో పీహెచ్సీ తరలించి వైద్యం అందించారు. ఇందులో నలుగురు విద్యార్థులు, నలుగురు స్థానికు లు ఉన్నారు. నార్సింగి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తేనెటీగల దాడిలో గాయపడి ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులతోపాటు ఇతరులకు వైద్యం అందించామన్నారు. ఆటోను ఢీకొట్టిన బస్సు పటాన్చెరు టౌన్: ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో గురువారం ఉదయం ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న తాత్కాలిక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయలు తీసుకెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. డ్రైవర్ సత్యనారాయణకు తీవ్రగాయాలు కావడంతో పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్‌కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
వలసొచ్చి.. వరి నాట్లు వేసి
దుబ్బాకటౌన్: జిల్లాలో వరి నాట్లు వేయడానికి రైతులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. మొత్తం 48 లక్షల ఎకరాల్లో నాట్లు సిద్ధం కావడం వల్ల కూలీల కొరత ఏర్పడింది. ఇప్పటికే సగం వరినాట్లు పూర్తి అయినా మరో 50 శాతం ఉండడంతో ఎకరానికి రోజుకు 8 నుంచి 10 మంది కూలీలు అవసరం పడుతున్నారు. కానీ, నాటు వేయడానికి కూలీలు దొరక్క బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పురుష కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. ఎకరానికి రూ.5,500 వరకు గంపగుత్తగా మాట్లాడుకొని నాట్లు వేస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కూలి పేరు సిద్దార్థ్. సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో పెద్దగా చేసేందుకు ఉపాధి లేకపోవడంతో 30 రోజుల క్రితం ఆయనతోపాటు మరో 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతానికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి వంటలు చేస్తుండగా మిగతా 12 మంది నాట్లు వేస్తారు. ప్రతి రోజూ 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తామని సిదార్ధ్ చెప్పుకొచ్చాడు. గతేడాది ఏపీలో వేశామని, ఈసారి ఆంధ్రాకు చెందిన వ్యక్తి తెలపడంతో ఇక్కడికి వచ్చామని ఇప్పటి వరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 130 ఎకరాల వరకు నాట్లు వేశామని చెప్పుకొచ్చాడు. బెంగాల్‌కు చెందిన 13 మంది కూలీలు వరినాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. రైతుల పొలాల్లో నారు తీసి వారే వేసుకొని రోజు 5 ఎకరాలకు పైగా నాట్లు వేస్తున్నారు. పొలాల్లో సన్నటి తాడుతో మునుములు కట్టుకొని చూస్తుండగానే టకటకా నాట్లు వేస్తున్నారు. ఎకరం నాటుకు వీరిని తీసుకొచ్చిన మధ్య వ్యక్తి రైతుల నుంచి రూ.5,500 తీసుకుంటున్నాడు. ఇందులో నుంచి బెంగాల్ కూలీలకు రూ.3,500 ఇస్తూ మిగతా డబ్బులతో వీరు ఉండడానికి వసతి, భోజనాలు, వాహనం తదితర సౌకర్యాలు చూసుకుంటున్నాడు. సాధారణంగా ఇక్కడ మహిళలు ఎకరం నాటుకు రూ.6 వేల వరకు తీసుకుంటుండగా, నారు వేసేందుకు మరో రూ.2,000 పైగా రైతులకు ఖర్చు అవుతుంది. దీంతో ఎకరం నాటుకు రైతుకు రూ. 8 వేలు ఖర్చు అవుతుంది. అదే బెంగాల్ కూలీలతో నాటు వేయిస్తే రూ.5,500 మాత్రమే అవుతుంది. ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు రైతులకు ఆదా అవడంతోపాటు కూలీల బాధ తప్పుతుంది. 1.80 లక్షల ఎకరాల్లో పూర్తి.. జిల్లాలో ఈ యాసంగిలో 3.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తారని వ్యవసాయాధికారుల అంచనా ఉంది. ఇప్పటి వరకు 1.80 లక్షల ఎకరాల్లో నాట్లు వేయడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం జోరుగా వరినాట్లు పడుతుండడంతో ఈ నెలలోపు నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి నాట్లు పెరిగే అవకాశం.. జిల్లాలో ఇప్పటికే సగంకు పైగా వరినాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాసంగిలో 3.48 లక్షల ఎకరాల్లో వరినాట్లు అంచనా ఉండగా ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల వరకు నాట్లు పడ్డాయి. కూలీల కొరతతో రైతులు వెద పద్ధతిలో వేసుకున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు, నాట్లేసే యంత్రాలు రావడంతో రైతులకు చాలా బాధలు తప్పాయి. ఈ సారి రికార్డు స్థాయిలో వరినాట్లు వేసే అవకాశం ఉంది. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
శ్రీరాముడి పల్లకీపై బూటు
హత్నూర (సంగారెడ్డి): అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా శ్రీరాముని పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో శ్రీరాముని పల్లకీ సేవ నిర్వహిస్తుండగా ఓ ఇంటిపై నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బూటు విసిరారు. దీంతో రామభక్తులు కోపోద్రిక్తులయ్యారు. బూటు పడిన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రామభక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలోని పండ్ల దుకాణాన్ని దగ్ధం చేశారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ దౌల్తాబాద్ పట్టణమంతా అర్ధరాత్రి వరకు ర్యాలీలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్పీ రూపేష్ కుమార్, పటాన్చెరు డీఎస్పీ, జిన్నారం, సంగారెడ్డి పటాన్చెరు సీఐలు, ఎస్సైలు పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. వారి మాట వినకుండా ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి.. చెప్పు విసిరిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బూటు విసిరిన ఇంటిపైన రాళ్లతో దాడికి దిగారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అయినా నిరసనకారులు వెనక్కు తగ్గకుండా అర్ధరాత్రి వరకు ఆందోళనను కొనసాగించారు. 108 అంబులెన్స్ రప్పించి భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో బూటు విసిరిన కుటుంబ సభ్యులను భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ప్రయత్నం చేశారు. తహసీల్దార్ సంధ్య, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎంతటి వారైనా శిక్షిస్తాం : ఎస్పీ పల్లకీ సేవపై బూటు విసిరిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఎస్పీ రూపేష్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని రామ భక్తులకు హామీ ఇచ్చారు. దౌల్తాబాద్‌లో పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కాషాయ జెండాలకు గిరాకీ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. 500 ఏళ్ల కల సాకారమవుతున్న వేళ రాముడు, హనుమంతుడి బొమ్మలు కలిగి ఉన్న జెండాలను ఇంటిపై ఎగురవేసేందుకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. యువజన సంఘాలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. జెండాల సైజులను బట్టి రూ.50 నుంచి రూ.1000 వరకు లభిస్తున్నాయి. – జహీరాబాద్ టౌన్ -
తెగిన మాంజా కోసం..
గాలిపటం ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారింది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగి గాయాలవుతుంటాయి. అంతేకాకుండా రహదారులపై రాకపోకలు సాగిస్తున్నవారి మెడకు తగిలి గొంతు దగ్గర గాయాలయ్యే ప్రమాదం ఉంది. పతంగులు ఎగురవేసేందుకు నిషేధిత మాంజాను ఉపయోగించకపోవడమే మంచిది. ఎక్కువ మంది పిల్లలు ఈ మాంజానే ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లో విచ్ఛలవిడిగా లభిస్తుంది. సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టడం లేదు. ప్రకటనలు జారీచేసి చేతులు దులుపుకోవడంతో వ్యాపారులు యథేచ్చగా విక్రయిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు ఒక్కోసారి మాంజా తెగి చెట్లు, కరెంటు వైర్లు, భవనాలకు చిక్కుకొని పక్షులకు ప్రాణాంతకంగా మారింది. తెగిన మాంజా కోసం.. విద్యుత్ స్తంభాలకు చిక్కుకున్న తెగిన మాంజా, పతంగులను చేతులు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయకూడదు. విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. విద్యుత్ తీగలపై పడిన దారాలు పట్టుకుని లాగకూడదు, ఇలా చేస్తే విద్యుత్ సరఫరా జరుగుతున్న తీగలు ఒకదానికొకటి తాకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలబారిన పడకుండా ఉంటారు. తగిన జాగ్రత్తలతో.. పట్టణాలు, గ్రామాల్లో పిల్లలు ఇళ్లపైన పతంగులను ఎగురవేస్తుంటారు. పట్టణాల్లో మైదానాలు దూరంగా ఉంటాయి. దీంతో పిల్లలు భవనాలు ఎక్కి పతంగులు ఎగురవేస్తుంటారు. భవనాలకు పిట్ట గోడలు లేకపోవడం, ఉన్నా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎగురవేసే ఆనందంలో ఇవి చూడరు. దీంతో కిందపడే అవకాశం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని పతంగులను ఎగురవేయాలి. తెగిన గాలిపటం కోసం వెనుకా ముందు చూడకుండా వాటి వెనుక పరుగెత్త కూడదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. గాలిపటాలను ఆరు బయట, మైదాన ప్రాంతాల్లోనే ఎగురవేయాలి. పతంగులను ఎగురవేస్తున్న పిల్లలను పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
సంక్రాంతి సందళ్లు..
సంక్రాంతి సందళ్లు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి జోరుగా కనిపిస్తోంది. ఆదివారం భోగిని ఘనంగా జరుపుకున్న ప్రజలు నేడు సంక్రాంతి, రేపు కనుమను కూడా ఇదే స్థాయిలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పట్టణాలతోపాటు మండలాల్లోని గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది. ఏ ఇంటి ముందు చూసిన రంగుల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. యువతులు తీరొక్క ముగ్గులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకరించారు. అలాగే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేస్తూ సంబుర పడితున్నారు. మహిళలు ఇళ్లలో పిండి వంటలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పట్టణాల్లోని వ్యాపారులు పండుగకు అవసరమైన సరుకులు విక్రయిస్తుండడంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రంగులు, చెరుకుగడలు, పండ్లు, పూలు, గుమ్మడి కాయలు, అనుపకాయల, శనక్కాయలు, కాయగూరల వ్యాపారాలతో ఆయా పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. పంటలు పొలం నుంచి ఇళ్లకు చేరే సమయం కావడంతో ఈ సంక్రాంతి పర్వదినాన్ని రైతులు, రైతు కూలీలు సంతోషంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం, ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు ప్రాంతాలకు వెళ్లిన వారు.. అలాగే అవసరాల కోసం పల్లెలను వీడి పట్టణాలకు నివాసాలు మార్చిన వారు సైతం సంక్రాంతికి వచ్చేశారు. -
ఉత్సవ కమిటీ ఏర్పడేనా?
గజ్వేల్/జగదేవ్‌పూర్: జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభమై మార్చి 31వరకు కొనసాగనున్నది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం నెలకొనడం అందోళన కలిగిస్తోంది. జాతర సమయం ముంచుకొస్తుండగా, ఏర్పా ట్లు మాత్రం నామమాత్రంగా సాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఏర్పడేనా? ఐదేళ్లుగా కొండపోచమ్మకు రెగ్యులర్ పాలకవర్గం ఏర్పాటు చేయడం లేదు. జాతరకు ముందు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ మూడు నెలల పాటు పాలకవర్గం పనిచేసేలా తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రభుత్వం మారడం, జాతర సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ కమిటీని ఏర్పాటు చేస్తారా లేదా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవ కమిటీ ఏర్పాటుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే జాతర ఏర్పాట్లపై ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీరు, ఇతర కనీస వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. యాక్షన్ ప్లాన్ ఏదీ? అప్పటి సీఎం, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను 2019 మే నెలలో ప్రారంభించిన సందర్భంలో ఆలయం వద్ద నవచండీయాగం నిర్వహించి అమ్మవారిని దర్శించకున్నారు. ఆదే సమయంలో ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అధికారులు, నేతలు ప్రకటన కూడా చేశారు. ఇదే క్రమంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలుమార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కోసం స్తపతితో ఆలయ మ్యాప్ వేయించారు. కానీ కార్యాచరణకు అడుగు పడలేదు. అలాగే చెరువు సుందరీకరణకు నోచుకోలేదు. -
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని
హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ అన్నారు. గురువారం హత్నూర మండలం సిరిపురం, తెల్లరాళ్లలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, బీఆర్ఎస్ పార్టీ వల్ల పదేళ్లపాటు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అలాగే.. అనారోగ్యానికి గురైన హత్నూర గ్రామ సర్పంచ్ వీరస్వామి గౌడ్ ను వారు పరామర్శించారు. కార్యక్రమంలో పీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అకీమ్, సర్పంచులు వెంకటేశం, ఆంజనేయులు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో
సంగారెడ్డి: జులాయిగా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోలు మండలం ఎల్కల్‌లో చోటు చేసుకుంది. బేగంపేట ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కల్‌కు చెందిన ఎల్లొల్ల చంద్రం కుమారుడు వినయ్ (16) చదువు మానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. స్నేహితులతో జులాయిగా తిరగొద్దని, ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ డిసెంబర్ 29న గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గడ్డిమందు తాగాడు. విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. గమనించి స్నేహితులు కుటుంసభ్యులకు సమాచారం అందించి వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్‌విలాస్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్‌గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్‌లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్‌లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్‌కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్‌లో -
ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు..
ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో షుగర్, బీపీ తదితర వాటితో బాధపడుతున్నారు. పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం ఉచిత యోగాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 421 ఆయుష్ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో యోగా కేంద్రాలను మంజూరు చేసింది. ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా నిర్మించిన యోగా కేంద్రాలు చాలా వరకు నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. – మెదక్ డెస్క్ -
ఇద్దరు తీవ్ర నిర్ణయం! బావిలో దూకి..
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్పల్లి ఎస్ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాగుడుకు బానిసై.. ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి చదవండి: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం! -
TS: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు
జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్‌లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గన్నారపు సుదర్శన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. కాశీంపూర్‌కు చెందిన వడ్ల నర్సమ్మ తన కొడుకుతో కలిసి జహీరాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె బంధువులైన వడ్ల వీరన్న కూతురి పెళ్లి కుదిరింది. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు వెళ్లి ఆ పెళ్లిని ఆపించారు. జహీరాబాద్‌లో ఉంటున్న నర్సమ్మ ఉద్దేశ పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయించి తన కూతురి పెళ్లిని ఆపించిందని వీరన్న కక్ష పెంచుకున్నాడు. పింఛన్ డబ్బు కోసమని 2016 మార్చి 25న ఆమె జహీరాబాద్ నుంచి కాశీంపూర్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఇదే అదనుగా భావించి బంధువులైన వడ్ల ప్రభు(40), వడ్ల ప్రశాంత్(19), వడ్ల వెంకట్(19), వడ్ల సంతోష్(19), వడ్ల రేఖ(28), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ(42), వడ్ల శ్రీకాంత్(17)తో కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నర్సమ్మ కుమారుడు వడ్ల పాండు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సదానాగరాజు, చిరాగ్పల్లి ఎస్ఐ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితులకు పై శిక్ష విధించింది. జరిమాన చెల్లించడంలో విఫలమైతే ఒక సంవత్సరం సాధారణ శిక్షతో పాటు రూ. 500 జరిమాన చెల్లించాలని న్యాయమూర్తి సుదర్శన్ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన చిరాగ్పల్లి, జహీరాబాద్ పోలీసులను ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు. -
తాను చనిపోతూ.. పలువురికి వెలుగునిస్తూ..
రాయికోడ్(అందోల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందాడు. తాను చనిపోతూ అవయవదానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ సంఘటన రోయికోడ్ మండల పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. రాయిపల్లికి చెందిన బి.బీరప్ప (28) ఓ ప్రైవేటు పైనాన్స్ కంపెనీలో ఉద్యోగి. అతను మూడురోజుల క్రితం జహీరాబాద్‌కు ఓ పని నిమిత్తం బైక్ తీసుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఝరాసంగం మండలం కుడిసంగం సమీపం వద్ద రోడ్డు ప్ర మాదానికి గురయ్యాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయలైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలోలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై కుటుంబీకులకు అవగాహన కల్పించారు. దీనికి వారు ఒప్పుకోగా బీరప్ప లీవర్, కిడ్నీలను ఇతర పేషంట్లకు అమర్చుతున్నట్లు డాక్టర్లు చెప్పినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. -
రైతుబంధు, రైతు బీమా కాస్త ఊరట
● చివరి క్షణంలో మిఛాంగ్ తుపాన్ దెబ్బ ● 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల పంట నష్టం ● పత్తి ధర ఢమాల్, నిండా మునిగిన వరి రైతులు ● గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సాగు ● మొదట్లో అనుకున్న స్థాయిలో వర్షాలు ● రైతుబంధు, రైతు బీమా కాస్త ఊరట సిద్దిపేట జిల్లాలో వానాకాలం సాగులో భాగంగా రైతులు 5,27,906 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 3,66,169 ఎకరాల్లో సాగు చేశారు. ఉద్యాన పంటలు అయిన ఆయిల్‌పామ్, మల్బరీ, మామిడి, సపోట, బొప్పాయి, టమాట పంటలతోపాటుగా ఇతర నూతన పంటల సాగుకు రైతులు మక్కువ చూపారు. వణికించిన తుపాన్.. జిల్లాలో వానాకాలం పంటలు చేతికందే సమయంలో మిఛాంగ్ తుపాన్ రైతులను బెంబేలెత్తించింది. వరి పంటను కోసి ఆరబెట్టిన ధాన్యం, అదే విధంగా కోత దశలో ఉన్న వరి పంట అధికంగా దెబ్బతింది. 5 రోజులపాటుగా మిఛాంగ్ తుపాన్ జిల్లాను వణికించింది. దీంతో జిల్లాలో 65,056 మంది రైతులకు చెందిన 51,261 ఎకరాల్లో రూ.51 కోట్ల మేర వరితో పాటుగా ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పత్తి రైతు చిత్తు.. జిల్లాలో పత్తి వేసిన రైతులు ధరతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1.08లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా సేకరించే దశలో ధరలు పడిపోయాయి. 2022లో గరిష్ట ధర రూ.9 వేల వరకు పలికింది. 2023లో మాత్రం రూ.6500 మాత్రమే ఉంది. దీంతో పత్తి రైతులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.60 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాపారులు ఖరీదు చేశారు. టాప్ గేర్‌లో టమాట జిల్లాలో టమాట సాగు చేసిన రైతులకు ఈ సంవత్సరం ఆశించిన ధర కంటే అధిక ధర రావడంతో టాప్ గేర్‌లోకి దూసుకెళ్లారు. జిల్లాలో 700 ఎకరాల్లో టమాటను రైతులు సాగు చేశారు. దీంతో ఎకరకు 18 టన్నుల దిగుబడి వచ్చింది. రెండు నెలలపాటు టమాట ధర రూ.100కు పైగా ఉండడంతో రైతులు తమ కష్టానికి మించి ప్రతిఫలం అందుకున్నారు. ఆదుకుంటున్న రైతుబంధు, రైతుబీమా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సత్ఫలితాలనిచ్చింది. వానాకాలం రైతుబంధుకు గాను 3,19,852 మంది రైతులకు రూ.313.23 కోట్లు అందాయి. కానీ యాసంగి రైతుబంధు ఇప్పటి వరకు 97,777 మంది రైతులకు రూ.20.30 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలో 361 మంది రైతులు మరణించగా వారి కుటుంబీకులకు రూ.18.05 కోట్ల రైతు బీమాను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంట -
కష్టాల కడలిలో జిల్లా రైతులు
● ఏడాది పొడవునా వెంటాడిన అతివృష్టి ● వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం ● పరిహారం ఇవ్వకుండా చేతులెత్తేసిన గత ప్రభుత్వం ● రుణమాఫీ, రైతుబంధు రాక అవస్థలు ● కష్టాల కడలిలో జిల్లా రైతులు జిల్లాలో ఈ సంవత్సరం రబీ సీజన్లో 3.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు వివిధ రకాల పంటలను సాగు చేశారు. తీరా పంట చేతికందే ఏప్రిల్ నెలలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 12, 265 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటానని, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లాలో రూ.12 కోట్ల 25 లక్షల 86 వేల పంట నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ మొత్తాన్ని బాధిత రైతులకు పరిహారం రూపంలో ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ. 8.86 లక్షలు మాత్రమే ఇచ్చారు. కాని రుణమాఫీ.. జిల్లాలో రూ.లక్షలోపు రుణాలకు 1,50,514 మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.912 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 73,026 మంది రైతులకు రూ.366 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ఇంకా 77,488 మంది రైతులకు గాను రూ.546 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.ఈ రుణమాఫీ కోసం నిత్యం బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. దీనికి గాను రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందని రైతుబంధు.. ప్రభుత్వం మారినప్పటికీ ఈ యాసంగి పంట సాగు కోసం రైతు బంధు ఇంకా అందలేదు. జిల్లా వ్యాప్తంగా 3,06,437 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను 2,80,949 మంది రైతులు సాగు చేశారు. వీరికి పాత పద్ధతిన ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.200 కోట్ల 71 లక్షల 74 వేలు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం ఎకరం లోపు ఉన్న 1,11,241 మంది రైతులకు కేవలం రూ. 21 కోట్ల 9 లక్షల 81 వేలు జమ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 90 శాతం నిధులు రావాల్సి ఉంది. ఇప్పటికే సగం మేర వరినాట్లు పూర్తి అయ్యాయి. అన్నదాతలు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గిన ఆయిల్ పామ్ సాగు జిల్లాలో ఎప్పుడు ఒకే రకమైన వరి పంటనే సాగు చేస్తున్నారని, దీని వల్ల భూసారం దెబ్బతింటుందని, వరికి బదులు అధిక లాభాలు గడించే ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాకు 50 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు మంజూరు ఇచ్చింది. ఇందుకోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఆయిల్ పామ్ మొక్కలకు ఎకరాకు రూ. 50 వేలు సబ్సిడీ ప్రకటించారు. 5 వేల ఎకరాలకు తగ్గకుండా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. కానీ కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్లు సంబంధిత ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొన్నారు. -
అయోధ్య రామా.. మమ్ము కనుమా
జిన్నారం(పటాన్చెరు) : అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన స్వామివారి అక్షింతలను మండల కేంద్రం జిన్నారంలో మంగళవారం ఊరేగించారు. మండలంలోని 30 గ్రామాలకు చెందిన అక్షింతలతో కూడిన కలశాలను స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ భక్తులు కలషాలను తలపై పెట్టుకుని వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్‌గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ భోజిరెడ్డి, నిర్వాహకులు రవి, ఆనంద్‌చారి, రాజేందర్‌రెడ్డి, కరుణాసాగర్‌రెడ్డి, బ్రహ్మేందర్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి ఒక మంచి త‘రుణం’
సంగారెడ్డి: హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 481 స్వశక్తి మహిళా సంఘాల్లో 5,106 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో గ్రూపునకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నారు. ప్రతీ సంఘం ప్రణాళికలు రచించుకుంటూ సీనియార్టీ ప్రకారం బ్యాంక్‌లో రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. సభ్యుల ఏకగ్రీవ తీర్మాణంతో అప్పులు తీసుకొని వాటిని కీస్తీల వారిగా అప్పులు చెల్లిస్తూ బ్యాంక్‌లకు నమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (మార్చి 2024)గాను 99 గ్రూపులకు గాను 8.36 కోట్ల రుణాల టార్గెట్ విధించగా, ఇందులో 85 గ్రూపులు రూ.9.80 కోట్లు టార్గెట్‌ను మించి రుణాలు పొందారు. మరో రూ.1.50 కోట్లకు రుణాల ప్రతిపాదనలు పంపినట్లు మెప్మా సీఈఓ రాజు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల కంటే హుస్నాబాద్ మెప్మా అగ్రగ్రామిగా నిలువనుంది. ఈ రుణాలతో మహిళలు ముఖ్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడర్, పాడి పశువుల పెంపకం వంటి యూనిట్లను ఎంచుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వీధి వ్యాపారులకు రూ.కోట్లలో.. హుస్నాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద చేయూతను అందిస్తుంది. ఒక్కో వ్యాపారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాన్ని బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్నారు. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలో వీధి వ్యాపారుల గుర్తింపుపై సర్వే చేసి 1,566 మందిని గుర్తించారు. ఇందులో 1,365 మంది రుణం కోసం దరఖాస్తు చేసుకోగా, 1332 మందికి మొదటి విడతగా రూ.10 వేల చొప్పున రూ.1.33 కోట్ల రుణం మంజూరు చేశారు. రెండో విడతగా 865 మంది వ్యాపారులకు టార్గెట్ చేయగా, 837 మందిని గుర్తించారు. ఇందులో 712 మందికి బ్యాంక్ అధికారులు సమ్మతం తెలుపగా, 690 మందికి రూ.20 వేల చొప్పున 1.38 కోట్లు రుణం అందజేశారు. మూడో విడతలో 161 మందిలో 154 మంది గుర్తించి 150 మందికి రూ.50వేల చొప్పున రూ.75 లక్షల రుణాన్ని బ్యాంక్ అధికారులు మంజూరు చేశారు. ఈ రుణాలను వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, మళ్లీ అధికంగా ఎక్కువ రుణాలు పొందేలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ జిల్లాలోనే టాప్‌గా నిలిచింది. మహిళా సంఘాలు ఆర్థిక పురోగాభివృద్ధికి అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. హుస్నాబాద్‌లోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు టార్గెట్‌ను మించి పొందారు. మరో కోటి రూపాయలు వస్తే జిల్లాలోనే హుస్నాబాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అగ్రభాగాన నిలువనుంది. అలాగే, వీధి వ్యాపారులకు ఇచ్చే పీఎం స్వనిధి రుణాల్లో హుస్నాబాద్ టాప్‌లో నిలిచింది. వీధి వ్యాపారులకు బ్యాంకు అధికారులు రూ.కోట్లలో రుణాలు ఇవ్వడం గమనార్హం. ఆర్థికంగా ఎదగడానికే.. మహిళలు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వారు నచ్చిన యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారు. నెల వారి కిస్తీలు సక్రమంగా చెల్లిస్తూ బ్యాంకులకు నమ్మకం కలిగిస్తున్నారు. అలాగే వీధి వ్యాపారులకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందిస్తున్నాం. జిల్లాలోనే అత్యధికంగా వీధి వ్యాపారులు రుణాలు పొందారు. – రాజు, మెప్మా సీఈఓ, హుస్నాబాద్ -
స్పృహతప్పి ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర విషాదం!
రామచంద్రాపురం: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బీహెచ్ఈఎల్ కాలనీలో శనివా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహెచ్ఈఎల్ కాలనీలో నివాసముండే మదిహాబేగం (19) ఇంటర్మీడియట్ చదువుతుంది. శనివారం రాత్రి తన నివాసంలో చదువుకుంటూ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా.. -
భార్యాభర్తల మధ్య గొడవ! భర్త ఒక్కసారిగా..
పటాన్చెరు: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని పటేల్‌గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందిన రాజుల ధర్మాంజనేయులు (38) పటాన్చెరు మండలం పాశంమైలారం పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ ఖర్చుల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం డ్యూటీ నుంచి వచ్చిన ధర్మాంజనేయులు పిల్లల బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి ధర్మాంజనేయులు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజుల నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి? -
అడవి పందిని ఢీకొట్టిన కారు
కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు అడ్డుగా వచ్చిన అడివి పందిని కారు ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు దులపల్లి చంద్రశేఖర్(26), ఫణీందర్(27), చెన్నకేశవులు, బాల మల్లేశ్, కిషోర్‌కుమార్ కారులో షిర్డీకి బయల్దేరారు. బాచేపల్లి సమీపంలో అడవి పంది రోడ్డుకు అడ్డు రావడంతో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారు పల్టీలు కొట్టి బోల్తా పడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, దులపల్లి చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురిని చికిత్స నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఫణీందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్హేర్ ఎస్ఐ వెంకటేశం తెలిపారు. -
పాత పద్ధతిలోనే సాయం
జహీరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సాయం కోసం జిల్లా రైతాంగం ఎదురు చూస్తోంది. నవంబర్లోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెట్టుబడి సాయం అందించే విషయంలో జాప్యం అవుతూ వస్తోంది. దీంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈనెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం ప్రారంభించింది. అయినా అందరికీ డబ్బులు పడక పోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,16,210 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,14,793 మంది రైతులకు గాను రూ.23.50 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పాత పద్ధతిలోనే సాయం పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో ఎకరాకు రూ.5వేల వంతున రైతులందరి ఖాతాల్లో జమచేసిన విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌కు సైతం రైతుబంధు ఇచ్చే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.7,500 వంతున ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఎకరానికి రూ.5వేల వంతున అందిస్తోంది. పెట్టుబడి కోసం ఇబ్బంది యాసంగిలో పంటలను సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో రైతు బంధు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అప్పులు పుట్టని రైతులు పంటల సాగును ఆలస్యం చేశారు. యాసంగిలో రైతులు ప్రధానంగా ఆలుగడ్డ, గోధుమ, మొక్కజొన్న, చెరకు, ఉల్లిగడ్డ, కూరగాయలను సాగు చేస్తారు. ఆయా పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. -
సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ స్నేహితుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరూ కలిసి సూర్యోదయాన్ని (సన్‌రైజ్) చూడటానికి వెళ్లి సంతోషంతో తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదం తీరని దు:ఖాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు రామ్మోహన్, వినోద దంపతుల కుమారుడు బానోతు శ్రీరామ్(20) జోగిపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇండస్ట్రియల్ విజిట్ కోసం తోటి విద్యార్థులతో కలిసి నగరానికి వచ్చారు. గురువారం రాత్రి మణికొండలో ఉండే క్లాస్మేట్ దితేష్ ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం సన్‌రైజ్ (సూర్యోదయం) చూసేందుకు ఖాజాగూడ పెద్ద చెరువు వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం పెద్ద చెరువు నుంచి లింక్ రోడ్డు గుండా కారులో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ వైపు వస్తున్నారు. మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా చెట్టును, తర్వాత బండరాయిని ఢీకొట్టి అవతలి రోడ్డులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న బానోతు శ్రీరామ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవ్ చేస్తున్న చందానగర్‌లోని గంగారం నివాసి కె.ఉదయ్ సాయి(18), మణికొండకు చెందిన దితేష్(17), రామాయంపేటకు చెందిన వర్షిత్(18), నారాయణఖేడ్‌కు చెందిన వంశీ(18)కి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్‌ఆస్పత్రికి తరలించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో.. పిల్లి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేయగా.. కారు అదుపు తప్పిందని డ్రైవింగ్ చేసిన ఉదయ్ సాయి చెబుతున్నాడు. శ్రీరామ్ ఎగిరి కారు కింద పడ్డాడని, సీటు బెల్ట్ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని పోలీసులు తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే అదుపుతప్పినట్లు భావిస్తున్నారు. అవతలి వైపు రోడ్డులో కారు పల్టీ కొట్టినప్పుడు అటుగా వాహనదారులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొడుకు ఇక లేడని.. డ్రైవర్ ఉదయ్ సాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని శ్రీరామ్ కుటుంబ సభ్యులు చెబుతుండగా, లైసెన్స్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నాకు ఉంది 20 గుంటల భూమి, కూలి పనులు చేస్తూ రెక్కల కష్టంతో కూతురు హిమశ్రీ బీటెక్ చదివిస్తున్నానని, కొడుకు శ్రీరామ్‌ను పాలిటెక్నిక్ చదివిస్తున్నానని తండ్రి రామ్మోహన్ కన్నీరు మున్నీరు అయ్యారు. కొడుకు ఇక లేడని జీర్ణించుకోలేక గుండెలవిసేలా విలపించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ మహేశ్, ఎస్ఐ విజయ్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి టౌన్: ఆదాయ పన్ను, టీడీఎస్ నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ విభాగం, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ కార్యాలయ ఇన్‌కం టాక్స్ అధికారి మానస్ రంజన్ మెహర మాట్లాడుతూ.. నిర్ణీత సమయంలోగా కరెక్ట్ టీడీఎస్ రిటర్న్ సమర్పించాలని సూచించారు. దాఖలు చేయడంలో ఏవేని సమస్యలు ఉంటే www.tdscpc.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని లాగిన్ అయి క్లారిఫికేషన్ పొందాలని సూచించారు. ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలు, ఫైలింగ్ ఏ విధంగా చేయాలి తదితర అంశాలపై వివరించారు. ఈసందర్భంగా పలువురు డీడీఓల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి కవిత, జిల్లాలోని అన్ని శాఖల డీడీఓలు, హైదరాబాద్ ఇన్‌కం టాక్స్ కార్యాలయ అధికారి పావల్, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా..
మెదక్: ఒకే కడుపున పుట్టిన తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శాలిపేట గ్రామానికి చెందిన ముండ్రాతి ఆంజనేయులు (35), సత్యనారాయణ, సిద్దిరాములు ముగ్గురూ అన్నాదమ్ముళ్లు. వీరు ఇప్పటికే తల్లిదండ్రుల ఆస్తి పంచుకున్నారు. ఇందులో సత్యనారాయణకు చెరువు సమీపంలో ఐదెకరాలు రాగా, ఆంజనేయులుకు పోచమ్మ మర్రిచెట్టు సమీపంలో ఐదెకరాలు వచ్చింది. సత్యనారాయణ పొలం వద్ద నీళ్లు సరిగా లేవని, మళ్లీ భూమి పంచుకుందామని ఆంజనేయులుతో అన్నాడు. ఇద్దరం మర్రిచెట్టు దగ్గర ఒక్కొక్కరికి రెండున్నర, చెరువు దగ్గర రెండున్నర చొప్పున తీసుకుందామని గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. సత్యనారాయణ చెప్పినట్లు భూమిని పంచారు. చెరువు దగ్గర ఉన్న బోరును కూడా ఇద్దరూ సమానంగా వాడుకోవాలని గ్రామపెద్దలు చెప్పారు. ఈ క్రమంలో బోరు మాత్రం నేను ఒక్కడినే వాడుకుంటా అని సత్యనారాయణ అన్నాడు. దీనికి అంజనేయులు ఒప్పుకోకపోవడంతో వివాదం మొదలైంది. రోజులాగే బుధవారం ఉదయం నారుమడికి నీరు పెట్టేందుకు ఆంజనేయులు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సత్యనారాయణ మరో వ్యక్తితో కలిసి ఆంజనేయులుపై దాడి చేసి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళన! పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాయంపేట సీఐ లక్ష్మీబాబు, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట ఎస్ఐలు నారాయణ, హరీశ్‌గౌడ్, మొహినుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. మృతుడికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవి చదవండి: పాలమూరు యూనివర్సిటీలో దారుణం! డిబార్ చేశారని.. విద్యార్థి? -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు
ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు జహీరాబాద్ పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పర్వదినం కోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని అతిపెద్దదైన మెథడిస్టు చర్చిని దీపాలతో అలంకరించారు. క్రైస్తవులంతా ముందస్తు వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీలలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులంతా ఇళ్ల ఎదుట స్టార్ దీపాలను ఏర్పాటు చేశారు. కొత్త బట్టలు, తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లో సందడి నెలకొంది. – జహీరాబాద్ టౌన్ -
బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం!
పటాన్చెరు: బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తితోపాటు నాలుగేళ్ల బాలుడు చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబేద్ అలీ బతుకుదెరువు కోసం పటాన్చెరు మండలం ముత్తంగికి వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న వేంకటేశ్వర బ్రిక్స్ కంపెనీలో పని చేసుకుంటూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు పనిచేసే చోట బీహార్‌కు చెందిన సోనుకుమార్ అలియాస్ మునిలాల్(38) పని చేసుకుంటూ అక్కడే గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సోనుకుమార్, అబేద్ అలీ కుమారుడు రంజన్ అలీ(4)ని తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు దుకాణానికి రోడ్డు దాటి వెళ్లాడు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిరిగి రోడ్డు దాటుతుండగా పటాన్చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై సోనుకుమార్, బాలుడు రంజన్ అలీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు.. -
వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి! అసలు కారణాలేంటి?
సిద్దిపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండు శ్రీనివాస్(35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతున్న సందర్భంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. పక్కన ఉన్న వారు గొడవను ఆపారు. శ్రీనివాస్‌ను గ్రామానికి చెందిన వ్యక్తి తన ఆటోలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ స్పృహ కోల్పోయి, నోటిలో నుంచి నురగ రావడంతో అదే ఆటోలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. శ్రీనివాస్ మృతిపై తమకు అనుమానం ఉందని విచారణ జరిపి న్యాయం చేయాలని అతడి భార్య రాధ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గృహిణి మృతి.. అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ పట్టణ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్‌కు చెందిన నాచారం మరియమ్మ (41) ఈ నెల 16వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు ఈనెల 17న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పిల్లికోటాల్ శివారులో గల పిల్లికుంట వద్ద సోమవారం మరియమ్మ చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కుంటలో వెతుకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై గాయం ఉండడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ టౌన్ సీఐ తెలిపారు. ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది?
సంగారెడ్డి: హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో తరచూ మృతదేహాలు లభ్యమవుతున్నాయి. మహిళలు, యువతుల, వ్య క్తుల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మృతదేహం దొరుకుతుండడంతో పోలీసులకు సవాలుగా మారింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో జిన్నారం మండలంలోని బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, జిన్నారంమంగంపేట, సోలక్పల్లి గ్రామాలు, హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, నాగారం, వడ్డెపల్లి, షేర్ఖాన్పల్లి గ్రామాలు, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, మంబాపూర్, నల్లవల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి తండా గ్రామాలు ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతం వేల హెక్టార్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు ప్రధాన రహదారి ఉంది. ఈ రోడ్డుపై ప్రతీనిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలు, యువతులను హత్యలు చేసి అటవీ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారు. ఇలాంటి కేసులు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది. రెండేళ్ల కిందట నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డబ్బాల్లో తీసుకొచ్చి నల్లవల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. దుండిగల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసి మాదారం అటవీ ప్రాంతంలో పడేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోని ప్రజలు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది. రెండేళ్ల కిందట ఇతర ప్రాంతంలో హత్య చేసిన వ్యక్తిని బొల్లారం సమీపంలోని రింగురోడ్డు ప్రాంతంలో పడేశారు. ఖాజీపల్లి అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి. ఆయా అటవీ ప్రాంతాల్లో పలువురు మహిళలు, యువకులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి హత్యలా, ఆత్మహత్యాలా తెలియరాలేదు. మూడు నెలల కిందట ఓ మహిళ మృతదేహాన్ని మంబాపూర్ అటవీ ప్రాంతంలో పడేసి కాల్చి హత్య చేశారు. తాజాగా జిన్నారం మండలంలోని మంగంపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాగారం, రొయ్యపల్లి, నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లోపించిన నిఘా.. ప్రధాన రహదారులపై పోలీసుల నిఘా లోపించింది. నామమాత్రంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి సమయంలో నిఘా లోపించడంతో నిందితులు దర్జాగా వారి పనులు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల పనితీరు కూడా సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తగిన నిఘా, భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీటిని నివారించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కేసులను ఛేదిస్తున్నాం.. హత్య కేసులను ఛేదించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. హత్యలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సీసీ కెమెరాల పనితీరును మరింత మెరగు పర్చేలా చూస్తున్నాం. – వేణుకుమార్, సీఐ జిన్నారం ఇవి కూడా చదవండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ! -
కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్..
సంగారెడ్డి: జహీరాబాద్‌లోని ‘ట్రైడెంట్’ యాజమాన్యం క్రషింగ్‌ను చేపట్టే పరిస్థితి కనిపించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పక్క రాష్ట్రాలకు చెరకును తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రజా ప్రతినిధులు మర్చిపోవడంతో రైతాంగం వారిపై ఆశలు వదులుకొని తమ దారి తామే చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు కర్మాగారాలతో ఒప్పందం సైతం చేసుకున్నారు. జహీరాబాద్ జోన్ పరిధిలో సుమారు 18 వేల ఎకరాల్లో చెరకు పంట సాగులో ఉంది. 7 లక్షల టన్నుల మేర చెరకు పంట ఉత్పత్తి కానుంది. ఇంత మొత్తంలో పంట జోన్ పరిధిలో ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలిస్తున్నారు. కర్ణాటకలోని చించోళి, బరూర్, మన్నాక్కెల్లి, గాంధీ చక్కెర కర్మాగారాలకు పంటను పంపిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, యాజమాన్యంపై ఆశలు వదులుకొని ఇప్పటికే జోన్ పరిధిలో సాగులో ఉన్న దాంట్లో 8 వేల ఎకరాల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలోని చించోళి యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లో రైతులు చెరకు పంటను విస్తారంగా సాగు చేసుకున్నారు. కర్ణాటకలోని యాజమాన్యాలు టన్నుకు ధర రూ.2,650 మేర చెల్లించి, చెరకు కోత, రవాణా ఖర్చులను వారే భరిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. రూ.9 కోట్ల మేర బకాయి.. ‘ట్రైడెంట్’ కర్మాగారంలో 2022–23 క్రషింగ్ సీజన్‌కు గాను 2.55 లక్షల టన్నుల చెరకును గాను గాడించింది. టన్నుకు రూ.3,270 ధర నిర్ణయించింది. మొదటి విడత కింద టన్నుకు రూ.3 వేల వంతున చెల్లిస్తూ వచ్చింది. మిగితా రూ.270 పెండింగ్ పెట్టింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మాసంలో చెరకును సరఫరా చేసిన రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో బిల్లులు పడ్డాయి. జోన్ పరిధిలో ఉన్న మొత్తం 2,287 మంది రైతులు కర్మాగారానికి చెరకును సరఫరా చేశారు. ఇందులో 1,699 మంది రైతులకు టన్నుకు రూ.270 వంతున బకాయి పడింది. మిగిలిన రైతులకు పూర్తిస్థాయిలో బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. రూ.83 కోట్లకు గాను రైతాంగానికి ఇప్పటి వరకు రూ.74 కోట్ల మేర చెల్లించారు. ఇంకా రూ.9 కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చిన హామీని మరిచిన నేతలు! ఎన్నికల సందర్భంగా కర్మాగారంలో క్రషింగ్‌ను చేపట్టేలా చర్యలు తీసుకుంటామని, మొత్తం చెరకు బకాయిలు ఇప్పిస్తామని రైతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చి మర్చిపోయారని రైతులు వాపోతున్నారు. పలు సమావేశాల్లో ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ హామీ ఇచ్చారని రైతులు పేర్కొంటున్నారు. అవసరం అయితే తమ ఆస్తులను అమ్మి బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారని, వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే క్రషింగ్ జరిపేలా చూస్తామని చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చి.. ఎన్నికల ప్రచారం నిమిత్తం నవంబర్ 23వ తేదీన జహీరాబాద్‌కు అప్పటి సీఎం కేసీఆర్ ప్రచారం నిమిత్తం వస్తుండడంతో సభను అడ్డుకునేందుకు రైతులంతా తీర్మానించారు. డిసెంబర్ మొదటి వారంలో బకాయిలను ఇప్పించడంతోపాటు క్రషింగ్‌ను జరిపిస్తామని ఎమ్మెల్యే మాణిక్‌రావు, కేన్, పోలీసు అధికారులు హామీ ఇచ్చి తమ ఆందోళనను విరమింపజేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కొండల్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు, జహీరాబాద్ ఇవి చదవండి: వలస.. ఏదీ భరోసా? -
కారును ఓవర్టేక్ చేయబోయి..
పటాన్చెరు టౌన్: లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ రెహమాన్(19), ఖాసీం ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడాది కిందట వచ్చి బొల్లారం పరిధిలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ పని నిమిత్తం బైక్‌పై శంకర్పల్లి వైపు బయలుదేరారు. ముత్తంగి సర్వీస్ రోడ్ నుంచి కర్ధనూర్ వైపు వెళ్తుండగా కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: పుట్టపర్తిలో దారణం.. అనుమానంతో భర్త! -
బైక్‌ను తప్పించబోయి..
బైక్‌ను తప్పించబోయి.. ● స్తంభాన్ని ఢీకొట్టిన తుఫాన్ వాహనం ● పలువురికి గాయాలు అల్లాదుర్గం(మెదక్): బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం చిల్వెర గ్రామ శివారులో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చిల్వెర నుంచి అల్లాదుర్గం వైపు బైక్‌పై వెళ్తున్నాడు. చిల్వెర శివారులోకి రాగానే పోలీసులు ఎదురుగా వస్తుండడంతో ఫైన్ వేస్తారనే భయంతో బైక్‌ను సడన్‌గా ఆపాడు. అతడి వెనుక నుంచే అల్లాదుర్గం వస్తున్న తుఫాన్ వాహనం బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్లో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బచ్పల్లి గ్రామానికి చెందిన రాములుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
గ్రూపు విభేదాలే కారణమా? ఓటమిపై అధిష్టానం ఆరా..
సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగి అధికారంలోకి వస్తే.. దుబ్బాక నియోజక వర్గంలో మాత్రం పార్టీ ఘోరపరాజయం చవిచూసింది. మొదటి నుంచి గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దుబ్బాకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని భావించిన అధిష్టానానికి నిరాశే మిగిలింది. గెలుపు కాదు కదా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటమికి నేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలే కారణమా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న దానిపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. టికెట్ దక్కకపోవడంతో.. మొదటి నుంచి దుబ్బాక కాంగ్రెస్‌లో గ్రూపు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూపు విభేదాలు నెలకొనడంతో ఎన్నిసార్లు అధిష్టానం సమన్వయం కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎన్నికల ముందు దుబ్బాక టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. ఆఖరికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ దక్కింది. దీంతో కత్తి కార్తీక ఎన్నికలకు నాలుగురోజుల ముందు బీఆర్ఎస్ చేరి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఇక టికెట్ రాకపోవడంతో శ్రావణ్ కుమార్‌రెడ్డి దుబ్బాక వైపే చూడకపోవడం తన అనుచరులు సైతం శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల్లో సహకరించకపోవడం కనిపించింది. డిపాజిట్ దక్కని పరిస్థితి! దుబ్బాకలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురతుందని అధిష్టానం ధీమాగా ఉండగా నియోజకవర్గంలో సైతం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలుస్తాడని సర్వేల్లో తేలింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో ఓ దశలో అంతు చిక్కని పరిస్థితి కనబడింది. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం శోచనీయం. చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కేవలం 25,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కు కావాల్సిన 28,894 ఓట్లకు 3,500 పై చిలుకు ఓట్లు దూరంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దుబ్బాకలో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇవి కూడా చదవండి: సారూ..! మా గ్రామాలకు 'మహాలక్ష్మి' కరుణించేదెలా? -
లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్‌నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్ అపార్ట్మెంట్లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్‌మెంట్‌ని 4వ అంతస్థుకు వెళ్లాడు. కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం! -
లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్..
పటాన్చెరు టౌన్: ఇన్‌స్ట్రాగామ్‌లో ఐఫోన్ కొనేందుకు వెళ్లి సైబర్ వలలో చిక్కుఉని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.6లక్షల 2 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధి బీరంగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగి సెప్టెంబర్ 25వ తేదీన ఇన్‌స్ట్రాగామ్‌లో ఐఫోన్ రూ.13 వేలకు వస్తుందని వచ్చిన మెసేజ్ ను చూసి అపరిచిత వ్యక్తిని సంప్రదించాడు. దీంతో ఆ వ్యక్తి ఓ లింకు పంపగా... అందులో తన వివరాలు నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా చేసి తన ఖాతాలో ఉన్న రూ.ఆరు లక్షల రెండు వేలు పోగొట్టుకున్నాడు. అనంతరం మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మంగళవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోన్ ఇస్తామంటూ ఫోన్‌కాల్.. లోన్ ఇస్తామంటూ వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన ఓ గృహిణి రూ.రెండు లక్షల 71 వేలు పోగొట్టుకున్న సంఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీన్‌పూర్‌కు చెందిన ఓ గృహిణికి నవంబర్ 6వ తేదీన రూ.లక్ష లోన్ ఇస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బాధితురాలు అపరిచిత వ్యక్తి పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసింది. కొద్దిసేపటికి ఆమె ఖాతాలో ఉన్న రూ.రెండు లక్షల 71 వేలు మాయమయ్యాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించి బాధితురాలు ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, మంగళవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫలించిన మంత్రాంగం
● ఆ ఇద్దరినీ విజయానికి చేరువ చేసిన ట్రబుల్షూటర్ ● సంగారెడ్డి, జహీరాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీశ్‌రావు ● రెండుచోట్ల సన్నిహితులకు కీలక బాధ్యతలు ● పకడ్బందీ వ్యూహాలను అమలుచేసిన మాజీ మంత్రి సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చారు. పకడ్బందీ వ్యూహాలను అమలు చేసి ఆ రెండు చోట్ల బీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేయగలిగారు. హస్తం పార్టీ హవాలోనూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కంటే ఓ సీటు అధికంగా గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకునేలా చేయడంలో హరీశ్‌రావు సఫలీకృతుడయ్యారు. ఆయన ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలను ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు నాయకులకు కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించినా హరీశ్ వారితో తన వ్యూహాలను తు.చ తప్పకుండా అమలు చేయించారు. తద్వారా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులిద్దరినీ విజయం వైపు నడిపించారు. సంగారెడ్డిలో పక్కా వ్యూహం సంగారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బరిలో ఉండగా, బీఆర్ఎస్ టిక్కెట్టును హరీశ్‌రావు పట్టుబట్టి చింతా ప్రభాకర్‌కు ఇప్పించుకున్నా రు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి రెండు నెలల ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించుకుని.. పోలింగ్ ముగిసిసే చివరి నిమిషం వరకు పకడ్బందీగా అమలు చేయించారు. ఆ టిక్కెట్టు ఆశించి భంగపడి అసమ్మతి రాగం వినిపించిన ముఖ్య నాయకులను, చింతా ప్రభాకర్‌తో అంతర్గత విభేదాలున్న కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను హరీశ్‌రావు బుజ్జగించి సమన్వయం చేశా రు. తాను స్వయంగా అసమ్మతి నేతల ఇంటికి వెళ్లి అసమ్మతి నేతలను దారికి తెచ్చుకున్నారు. నామినేషన్ సమయానికి ఎక్కడా చిన్న అసంతృప్తులకు కూడా తావులేకుండా క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. అవసరం మేరకు వ్యూహాలను మా ర్చుతూ క్యాడర్‌ను ముందుకు నడిపించారు. బహి రంగసభలు, రోడ్‌షోలు, ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. పోలింగ్ రెండు రోజులు ఉండగా సీఎం కేసీఆర్ బహిరంగసభను సంగారెడ్డిలో నిర్వహించేలా హరీశ్‌రావు కేసీఆర్ ప్రచార షెడ్యుల్‌ను ఖరారు చేయించారు. అక్క డ పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిర్వహించే పోల్ మేనేజ్మెంట్ కూడా పకడ్బందీగా జరిగింది. ఇలా పోలింగ్‌కు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా గులాబీ శ్రేణులను నడిపించిన హరీశ్ సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ను విజయ తీరాలకు చేర్చగలిగారు. కర్నాటక ప్రభావం ఉన్నా.. జహీరాబాద్ నియోజకవర్గాన్ని కూడా హరీశ్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గులాబీ పార్టీ అభ్యర్థి మాణిక్‌రావును గెలిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్‌కు అక్కడ కీలక బాధ్యతలను అప్పగించి ఆయన ద్వారా ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయించగలిగారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఖాతాలో పడుతుందని మొదటి నుంచి అన్ని రాజకీయ వర్గా లు భావించాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు, మైనార్టీలు అధికంగా ఉన్న ఈ స్థానంలో కాంగ్రెస్ సులభంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. సర్వేలు కూడా ఆ స్థానం కాంగ్రెస్‌దే అన్నట్టు వివరించాయి. అయినప్పటికీ క్యాడర్ ఏమాత్రం నిరాశ చెందనీయకుండా చివరి క్షణం వరకు పోరాటం చేసేలా చేయడంలో హరీశ్‌రావు సఫలీకృతుడయ్యా రు. పార్టీకి మేలు జరుగుతుందని తెలిస్తే బూత్ స్థాయి కార్యకర్తతో కూడా ఆయన స్వయంగాగానీ, ఫోన్లోగానీ మాట్లాడారు. మైనస్ ఉన్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ వైపు తిప్పగలిగారు. ప్రభావం చూపే సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ను ఆదరించేలా చేశారు. పలు మండలాల్లో విభేదాలతో ఉన్న నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకుని వారిని సమన్వయం చేశారు. జహీరాబాద్‌లో హరీశ్‌రావు అన్నీ తానై ఎదురొడ్డి నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావును ముందుకు నడిపించారు. -
భక్తి భావనతోనే మనసుకు ప్రశాంతత
మిరుదొడ్డి(దుబ్బాక): భక్తి భావనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని మాధవానంద సరస్వతీ స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. మిరుదొడ్డి, లక్ష్మీనగర్, ఆరెపల్లి గ్రామాల శివారులో వెలసిన సదానందాశ్రమ 40వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాదుకా పూజలు, పుష్షార్చన, బిల్వపత్ర పూజ, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తి భావన అలవర్చుకుంటేనే పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతాయన్నారు. అందరూ భక్తి భావనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలన్నారు. నిత్యం దైవారాధనలు చేసి పుణ్యఫలాలను దక్కించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైదిక నిర్వాహకులు విఠాల రాజపున్నయ్య శర్మ, చంద్ర శేఖర శర్మ, రమేష్ శర్మ, ఆశ్రమ శిష్యబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వార్షికోత్సంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
మెజారిటీ రాదు.. ఒట్టు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ చాలెంజ్
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు చైర్మన్ జితేందర్‌గౌడ్‌తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు. -
కేసీఆర్ సన్నిహితుడికి షాక్
జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది. జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్‌లో సైతం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్ఎస్ అభ్యర్థి అయిన భూపాల్‌రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది. ఇక్కడే ప్రచారానికి పరిమితం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్‌తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్‌రావు జహీరాబాద్‌కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోలైన ఓట్లు బీఆర్ఎస్ : 5,30,194 కాంగ్రెస్ : 5,48,348 బీజేపీ : 1,72,575 -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
అరగంటలో రౌండ్..
జిల్లాలో ముందుగా నారాయణఖేడ్, సంగారెడ్డి నియోజకవర్గాల ఫలి తాలు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి 18 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. సంగారెడ్డి ఓట్లను 17 రౌండ్లలో లెక్కిస్తారు. ఓట్లు అధికంగా పోలైన పటాన్చెరు నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమవుతుంది. ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో జరుగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుఉంటుంది. అంతటా ఉత్కంఠ.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రధాన పార్టీల నేతలు తలపడ్డారు. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. దీంతో చివరి రౌండ్ వరకు అభ్యర్థుల ఆధిక్యంపై ఉత్కంఠ కొనసాగే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అరగంటలో రౌండ్.. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్హాల్లోకి అనుమతి ఇస్తారు. ఇందుకోసం వారికి ముందస్తుగా పాసులు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ 8,400 జిల్లాలో మొత్తం 8,400 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నారాయణఖేడ్‌లో 1,65 2, అందోల్‌లో 1,445, జహీరాబాద్‌లో 1,501, సంగారెడ్డిలో 2,737, పటాన్చెరులో 1,065 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఏర్పాట్లు పూర్తి.. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్క సంగారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్ వద్ద ముగ్గురు ఓట్లు లెక్కిస్తారు. అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కౌంటింగ్ హాలులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను అభ్యర్థుల ఏజెంట్లు వీక్షించేలా, వారి సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అధికారులు సిబ్బంది ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారు. నియోజకవర్గం పోలింగ్ కౌంటింగ్ మొత్తం కేంద్రాలు టేబుల్స్ రౌండ్లు నారాయణఖేడ్ 296 18 17 అందోల్ 313 18 18 జహీరాబాద్ 314 18 18 సంగారెడ్డి 281 16 18 పటాన్చెరు 405 18 23