
సిద్దిపేటఅర్బన్: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో కన్నుమూసింది. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అంబటి మహేశ్ కూతురు లాక్షణ్య (13) సిద్దిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం రాత్రి జ్వరంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు మాత్ర వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు తగ్గింది.
అప్పుడే టిఫిన్ చేసి ఇంట్లోనే కూర్చుంది. కాసేపటికి బూత్‌రూంకు వెళ్లింది ఎంతకీ బయటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని, తీవ్రమైన గుండెపోటు రావడంతోనేనని తెలిపారు.