భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపించారు.
అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు.
Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది
Comments
Please login to add a commentAdd a comment