Yadadri Bhuvanagiri District
-
తెలంగాణలో బర్డ్‌ఫ్లూ కలకలం.. 40వేల కోళ్ల మృతి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ పరిధిలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. గ్రామంలోని పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌లో.. ఈ నెల 12న 500 కోళ్లు మృతి చెందాయి. దీనిపై సుదర్శన్‌రెడ్డి ఇచి్చన సమాచారం మేరకు పశువైద్యాధికారులు.. చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. వారు వాటిని మధ్యప్రదేశ్, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్ఐ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నమూనాలను పరీక్షించగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణయ్యింది. దీంతో శుక్రవారం జిల్లా పశుసంవర్థక, వైద్య, రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు ఆ పౌల్ట్రీఫామ్‌ను సందర్శించారు. అక్కడ పశు వైద్యాధికారులు, సిబ్బంది మొత్తం 32 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లుగా ఏర్పడి.. పీపీఈ కిట్లు ధరించి.. ఫాంలోని 40వేల కోళ్లను చంపి మూటగట్టి సమీపంలో గుంతతీసి పూడ్చిపెట్టారు. సుమారు 19 వేల గుడ్లను సైతం పూడ్చారు. దీనిపై యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఫాంలోని 90 టన్నుల ఫీడ్‌తో పాటు కోళ్ల పెంటను సైతం దహనం చేస్తామని తెలిపారు. కోళ్లఫాం నుంచి కిలోమీటర్ పరిధిలో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తామని తెలిపారు. మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్‌ను సీజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి పౌల్ట్రీఫామ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దోతిగూడెంలో బర్డ్‌ఫ్లూ వల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని కోరారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా..
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్‌రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 4 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ స్టడీ హాల్‌కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాగ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు. -
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్ -
క్షణికావేశం.. జీవితం కన్నీటిమయం (ఫొటోలు)
-
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
ఒక్క రోజే 800 కోళ్లు మృతి
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని కోళ్ల ఫారంలో శనివారం తెల్లవారుజామున 800 కోళ్లు మృతి చెందాయి. నేలపట్లకు చెందిన పబ్బు మల్లేశ్ ఫారంను లక్కారం గ్రామానికి చెందిన శివ కొంతకాలంగా లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి పృథ్వీరాజ్ ఫారం వద్దకు చేరుకుని మరణించిన కోళ్లను పరీక్షించారు. బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని, వైరస్ కారణంగా చనిపోయి ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతి చెందిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానని నిర్వాహకుడు శివ వాపోయాడు. -
పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు
తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !!పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావుఅప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న ఊళ్ళోకి పెద్ద కారొచ్చింది. ఇంత చిన్న పల్లెలోకి ఇంత పొద్దుగాల ఎవరచ్చిర్రా అని తెల్లారి పొలం పనులకు వెళ్ళే రైతులు..నీళ్ళకోసం బావులవద్దకు వెళ్ళే మహిళలు విస్తుపోయి చూస్తున్నారు. కార్లోంచి టిప్ టాప్ గా దిగిన ఒక ఆఫీసర్ ఆ ఊళ్ల పదోక్లాస్ చదూతున్న పిల్లవాడు ఇంటికి వెళ్ళి.. టక్.. టక్ అని డోర్ కొట్టారు.. ఏందబ్బా ఇంత మబ్బులల్ల ఇంటికి ఎవరొచ్చిర్రు.. చుట్టాలు ఇంత వేకువనే వస్తారా... అంటూ పిల్లగాని తల్లి విజయలక్ష్మి తలుపు తీసింది.. ఎదురుగా ఎవరో ఆఫీసర్...అమ్మో ఎవరాయన ఇంత ఉదయం ఎందుకు వచ్చాడు అనుకుంటూ విస్తుపోయి చూస్తుండగా ఆయనే ముందుగా మాట్లాడారు...అమ్మా నేను మీ జిల్లా కలెక్టర్‌ను.. మీ అబ్బాయి భరత్ చంద్ర పదోక్లాస్ చదువుతున్నాడు కదా..ఎలా ఉన్నాడు.. బాగా చదువుతున్నాడా..బాధ్యతగా ఉంటున్నాడా.. పొద్దున్నే మబ్బులల్ల నిద్ర లేపండి..ఉదయాన్నే చదివించండి...పొద్దీకి టీవీలు. ఫోన్లు చూడనివ్వకండి.. పదో క్లాస్ చాలా ముఖ్యం కదమ్మా.. బాగా చదివించండి.. అంటూ ఒక చైర్..ఎగ్జామ్ ప్యాడ్..పెన్నులు వంటివి అందజేశారు..అసలు కలెక్టర్ ఏందీ..తమ ఇంటికి రావడం ఏందీ అని ఆ తల్లి విజయలక్ష్మి నోట మాట రాలేదు..అసలిదంతా ఏమిటి అని ఆమె షాక్ లో ఉండిపోయింది.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పదోక్లాస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో టెన్త్ క్లాస్ పిల్లలను ప్రోత్సహించేందుకు.. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు పదో క్లాస్ అనేది తొలిమేట్టు అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పేందుకు తానే నడుంబిగాంచారు. అందులో భాగంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలు గూడెం గ్రామానికి వెళ్లి తెల్లవారి ఐదు గంటలకే విద్యార్థులు నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో పదో క్లాస్ చదువుతున్న పిల్లలు పిల్లలకు వెళ్లి వారు చదువుతున్న తీరు గురించి తల్లిదండ్రులతో ఒక చేసి పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాకుండా భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లి ఆయన పదవ క్లాస్ పరీక్షలు పూర్తయ్యే వరకు నెలకు రూ.5000 రూపాయలు ఖర్చుల నిమిత్తం తాను చెల్లిస్తానని చెబుతూ.. వెనువెంటనే రూ. 5000 అందజేశారు. అంతేకాకుండా భరత్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని.. ఆయన జీవితం స్థిరపడేంతవరకు తాను తోడుగా ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెల్లవారేసరికి గ్రామంలో కలెక్టర్ పర్యటన ఓ విద్యార్థి ఇంట్లో ఆయన కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడడం క్షణాల్లో ఊరంతా పాకేసింది. మన ఊరు అబ్బాయి భరత్ ఇంటికి కలెక్టర్ సాబ్ వచ్చాడంట.. చదువుకోడానికి డబ్బులు ఇచ్చారట.. పెన్నులు కుర్చీ ప్యాడ్ వంటివి ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఆయన ఎంత చదివితే అంత చదివిస్తానని కూడా మాటిచ్చాడంట.. నిజంగా ఇంతలా ప్రోత్సహించే అధికారులు ఉంటే పిల్లలు ఎందుకు చదువుకోరు అంటూ గ్రామస్తులు అబ్బాయి తో పాటు కలెక్టర్‌ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు బాధ్యతగా ఉండాలని.. వృధా కాకుండా తెల్లవారు జామునే లేచి చదువుకోవాలని.. అలాంటప్పుడే ఉన్నత స్థానాలకు చేరుతారని ఉద్బోధించారు.. చదువుకునే పిల్లలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ముందుకు కదలారు... ఆయన వెళుతున్న వైపే చూస్తూ భరత్... ఆయన తల్లి విజయలక్ష్మి.. చూస్తూ నిలబడిపోయారు. సిమ్మాదిరప్పన్న -
దెయ్యం పట్టింది.. వదిలిస్తా..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చరిత్రకు సజీవ సాక్ష్యం.. రాజకోట
యాదగిరిగుట్ట: నిజాం ప్రభువులకు లక్షలాది రూపాయల కప్పం కట్టిన సంపన్న సంస్థానం.. ఒకప్పుడు అద్భుతమైన కట్టడంగా భాసిల్లిన కోట నిర్మాణం.. అదే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజకోట. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయంగా.. రాచరికపు మహోన్నత వైభవానికి.. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాజాపేటలోని (Rajapeta) రాజావారి కోట. హైదరాబాద్‌కు (Hyderabad) 90 కిలోమీటర్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు.. గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరు ఉండేది. ఇక్కడ చిన్న చిన్న షూటింగ్‌లు, ఫొటో షూట్లు సైతం జరుగుతుంటాయి. కోటలోని అద్భుత శిల్ప కళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చాటుతుంది. కోట చరిత్ర రాజాపేట గ్రామానికి పడమటి భాగంలో గోపాలపురం (Gopalapuram) అనే గ్రామం ఉండేది. గ్రామం పైభాగంలో చెరువు ఉండేది. ఆ చెరువు వరద ముంపునకు గురైన గోపాలపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం రాజ రాయన్న అనే రాజు 1775లో కోటను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. రాజ రాయన్న పాలన సాగించిన కోటనే నేడు రాజాపేటగా పిలుస్తున్నారు. రాజాపేట గ్రామం చుట్టూ కందకం తవ్వారు. కోట గోడ ప్రాకారం, ఎత్తయిన రాతి గోడలతో చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉండేలా.. మూడు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు. ఎగువ పడమటి వైపున్న గోపాల చెరువు నుంచి కందకంలో నీరు పారేలా ఏర్పాట్లు చేసి.. శత్రువులు చొరబడకుండా మొసళ్లను పెంచేవారు. గ్రామం లోపలి ప్రధాన ద్వారం దాటితే రాజ నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, నీటి కొలను, గిరిగిరి మాల్, ఏనుగుల మోట, ఖైదీల కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటివి కనిపిస్తాయి. శత్రువుల నుంచి కోటను రక్షించేందుకు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బురుజులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను రక్షించుకునేందుకు కోట నుంచి బయటికెళ్లేందుకు సొరంగ మార్గాలున్నాయి. పర్యాటకుల తాకిడి.. సినిమా షూటింగ్‌లు.. రాజకోటలో బురుజులు, అంతఃపురం, నీటి కొలను, సైనిక ప్రాంగణం, ఏనుగుల మోట, గిరిగిరిమాల్ తదితర అద్భుత నిర్మాణాలు.. సినిమా షూటింగ్‌లు, ఫొటోషూట్‌కు అనుకూలంగా ఉన్నాయి. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఈ కోట ఉండటంతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలువురు ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) షూట్లు ఇక్కడ తీస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని గడికోట రాజకోట రాజవంశీకులు ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. దీంతో పర్యాటక శాఖాధికారులు రాజకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ 29న పర్యాటక శాఖాధికారులు గడిని సందర్శించారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు, రాజాపేట గడికోట, కొలనుపాకలోని జైన్ మందిర్, సోమేశ్వర ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. చదవండి: తిరుమలలో చాగంటి కోటేశ్వరరావుకు అవమానంభావితరాలకు అందించాలి రాజకోటను తిలకించేందుకు పర్యాటకులు, సినీ నటులు తరచూ వస్తున్నారు. కోటలో ఇప్పటికే పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకోటను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలి. – కొత్తకొండ భాస్కర్, రాజాపేట గ్రామస్తుడురాజకోటను పరిరక్షించాలి మా కాలంలో ఈ కోట ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు నిరాదరణకు గురైంది. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటలోని రాజకోటను అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు అతి సమీపంలోని ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట -
మొక్కు తీర్చుకుని వస్తూ మృత్యుఒడికి..
మొక్కు తీర్చుకోవడానికి షిర్డీ వెళ్లిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. అలాగే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లి తిరిగివస్తున్న వారి కారు అదుపుతప్పి లారీ కింద ఇరుక్కోవడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహారాష్ట్రలోని గంగాపూర్ వద్ద ఓ ఘటన చోటుచేసుకోగా, భువనగిరి జిల్లా కేంద్రం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శ్యాంశెట్టి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులు తమ కొడుకు, కోడలుతో సరూర్‌నగర్ గ్రీన్ పార్కు ఏరియాలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి మనవడు పుట్టిన సందర్భంగా మొక్కుతీర్చుకోవడానికి షిర్డీకి వెళ్లాలని అనుకున్నారు. భోగి పండుగ రోజు పెద్ద కూతురు ప్రసన్నలక్ష్మి, చిన్న కూతురు బజ్జూరి స్రవంతి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో వెళ్లి షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా తుఫాన్ వాహనం కిరాయికి తీసుకొని ఔరంగాబాద్‌లోని మినీ తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఔరంగాబాద్ – షిర్డీ మధ్యలో గంగాపూర్ వద్ద బుధవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో శ్యాంశెట్టి ప్రేమలత (57) ఆమె కుమారుడి కొడుకు వైది్వక్ (6 నెలల బాలుడు), పెద్ద కూతురు తొల్పునూరి ప్రసన్నలక్ష్మి (42)తో పాటు ప్రసన్నలక్ష్మి పెద్ద కూతురు తొల్పునూరి అక్షిత (21) మృతిచెందారు. ప్రేమలత పెద్ద అల్లుడు శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి రెండో కూతురు శరణ్యతో పాటు ప్రేమలత భర్త కృష్ణమూర్తి, కుమారుడు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమలత చిన్న కూతురు బజ్జూరి స్రవంతి, అల్లుడు రాంబాబుతో పాటు వీరి కుమారుడు, కుమార్తె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఔరంగాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. సంక్రాంతి పండుగకు వచ్చి వెళ్తూ... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రాంతండాకు చెందిన గుగులోతు రవి, భూక్య సంతోష్ బావాబావమరుదులు. రవికి భార్య భవాని, కుమార్తె మోక్ష ఉండగా.. సంతోష్ కు భార్య అనూష (26), ఇద్దరు కుమార్తెలు ప్రణశ్వని, చైత్ర (6) ఉన్నారు. రవి, సంతోష్‌లు కుటుంబాలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. రవి, సంతోష్‌లు తమ భార్యాపిల్లలతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు కారులో స్వగ్రామం వెంకట్రాంతండాకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. సంతోష్ కారు నడుపుతుండగా.. అతడి భార్య అనూషతో పాటు చిన్న కుమార్తె చైత్ర అతడి పక్కన కారు ముందు భాగంలో కూర్చున్నారు. మిగతావారు వెనక కూర్చున్నారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలోని రాయగిరి వద్దకు రాగానే వరంగల్–హైదరాబాద్ హైవే బైపాస్ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఇండికేటర్ వేయకుండా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాడు. వెనకాలే వస్తున్న వీరి కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారు లారీ కిందిభాగంలో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును జేసీబీ సహాయంతో బయటకు తీయగా.. అప్పటికే అనూష, చైత్ర మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ఐదుగురిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భూక్య సంతోష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు, ఎస్హెచ్ఓ సంతోష్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన రవి భార్య భవాని 8 నెలల గర్భంతో ఉంది. ఆస్పత్రికి తరలించిన అనంతరం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. -
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్‌ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్‌లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి జిల్లాలోని పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒక కార్మికుడు కనకయ్య మృతిచెందినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద శబ్ధం రావడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కనకయ్య మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, పరిశ్రమ లోపల ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ప్రమాద ఘటనపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికుల కుటుంబాల సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. -
గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థిని మృతి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో గుండెపోటు తో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల మేరకు.. గ్యార స్వామి, యాదమ్మ దంపతుల కుమార్తె నవ్య (16) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా మంగళవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన కావ్య జ్వరంతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు అదే రోజు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా తగ్గింది. బుధవారం సాయంత్రం తిరిగి జ్వరం రావడంతో బీబీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్వరం, బీపీ ఎక్కువ ఉందని చెప్పడంతో మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే నవ్య మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందిందని యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆడపిల్ల కావాలనే కోరికతో స్వామి, యాదమ్మ దంపతులు రెండు నెలల వయసున్న నవ్యను బంధువుల నుంచి దత్తత తీసుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది -
ఉపాధికి అడ్డ.. భువనగిరి గడ్డ
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.30 వేల మందికి పైగా.. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్లు, వెయిటర్లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్‌వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.అధికంగా రైస్ మిల్లుల్లో.. ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు. అడ్వాన్స్‌లు చెల్లించి మరీ.. పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్‌లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్‌కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.చదవండి: రియల్ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లిబెంగాల్ నుంచి వచ్చాను మాది పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు. – దాలీమ్షేక్, పశ్చిమబెంగాల్మూడు నెలలు ఇక్కడే మా రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం. – మహబూబ్ ఆలమ్, ఛత్తీస్గఢ్ఇక్కడ ఉపాధికి కొదవలేదు ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. – అన్వర్, మహారాష్ట్రరోజుకు రూ.1,000 సంపాదిస్తున్న జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.– జాకీర్, ఒడిశాఇక్కడే ఆరు నెలలు ఉపాధి మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది. – బాబులాల్, బిహార్ -
ఆ మలుపులో ఎన్నో ప్రమాదాలు!
భూదాన్ పోచంపల్లి: అసలే ఇరుకు రోడ్డు.. దానిపై ప్రమాదకరంగా మూల మలుపు.. దాని పక్కనే చెరువు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురంలో శనివారం కారు చెరువులో బోల్తా కొట్టిన ప్రాంతం దుస్థితి ఇది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, పక్క నే చెరువు ఉన్నట్టు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాహనాలు చెరువులోకి దూసుకెళ్లాయి. పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలతో నిత్యం రద్దీ ఉన్నా..పోచంపల్లి పర్యాటక కేంద్రం, చేనేతకు ప్రసిద్ధికావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేవారు వస్తుంటారు. వాహనాల రద్దీ ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై జలాల్పురం చెరువు కట్ట వద్దకు రాగానే ఇరువైపులా పెద్ద మూల మలుపులు ఉన్నాయి. ఇరువైపులా చెట్లు, పొదలు పెరిగి, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు సరిగా కనిపించవు. చెరువుకు రక్షణ గోడ కూడా లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల సమీపంలో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని... చెట్లు, పొదలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం ధర్నా కూడా చేశారు. చెరువు సమీపంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరికీ పట్టింపులేదని జలాల్పురం గ్రామానికి చెందిన పాలకూర్ల జంగయ్య మండిపడ్డారు.చెరువులోకి దూసుకెళ్తున్న వాహనాలు⇒ ఈ ఏడాది జూలై 17న ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.⇒2023 జూలై 24న చెరువు కట్టపై పండ్ల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందాడు.⇒ 2020 జూలై 24న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన జింక వంశీ, తన స్నేహితులతో కలిసి పోచంపల్లి మండలం రాంలింగంపల్లిలోని బంధువులకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తుండగా... ఇదే మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. వంశీ మృతిచెందగా, మిగతావారు బయటపడ్డారు.⇒ 2020 జూన్ 26న చెరువు కట్ట మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొన్నాయి. కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇక పదుల సంఖ్యలో ద్విచక్రవాహనలు అదుపుతప్పి చెరువులో పడి చాలా మంది గాయాలపాలయ్యారు. -
ఐదుగురు యువకులు జలసమాధి
భూదాన్ పోచంపల్లి: వారంతా 25 ఏళ్లలోపు యువకులు.. కలసి తిరిగే స్నేహితులు.. సరదాగా షికారుకు బయలుదేరారు.. మధ్యలో మద్యం తాగారు.. ఆపై కల్లుతాగాలనే కోరిక పుట్టింది.. దానికోసం వెళుతుంటే, పొగమంచులో దారి సరిగా కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది. మృతులంతా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారే. ఆరుగురు కలసి వెళ్లి.. ఎల్బీ నగర్ ప్రాంతంలోని సిరినగర్ కాలనీకి చెందిన తీగుళ్ల వంశీగౌడ్ (23), ఇంద్రపల్లి హర్షవర్ధన్ (22), వీరమల్ల విఘ్నేశ్వర్(20), ఆర్టీసీ కాలనీకి చెందిన కలకోటి అక్షయ్‌కుమార్ అలియాస్ బల్లు (19), వాస్తుకాలనీకి చెందిన జెల్ల వినయ్ (21), బోడుప్పల్ జ్యోతినగర్ కాలనీకి చెందిన మేడబోయిన మణికంఠయాదవ్ (21) స్నేహితులు. శుక్రవారం రాత్రి వీరంతా ఎల్బీ నగర్లో కలసి పార్టీ చేసుకొందామని అనుకున్నారు. తీగుళ్ల వంశీగౌడ్ తన ఇంటి వద్ద ఓ స్నేహితుడు పెట్టివెళ్లిన కారు ఉండటంతో.. దానిని తీసుకొని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయలుదేరారు.మార్గమధ్యలో అంబర్‌పేట వద్ద మద్యం తాగారు. అక్కడే రెండు గంటల పాటు గడిపారు. ఆ సమయంలో వారికి ఈతకల్లు తాగాలని కోరిక పుట్టింది. దీనితో సుమారు 3.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లికి వచ్చారు. ఇంకా చీకటిగానే ఉండటంతో అక్కడే టీ తాగారు. టిఫిన్ చేసి వద్దామనుకుని కొత్తగూడెం ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లారు. టిఫిన్ సెంటర్లు తెరవకపోవడంతో తిరిగి పోచంపల్లికి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న వంశీ కారు నడుపుతున్నాడు. అయితే మధ్యలో అటవీ ప్రాంతం కావడం, తెల్లవారుజాము సమయం కావడంతో పొగమంచు దట్టంగా కప్పుకొంది. దానితో రోడ్డు సరిగా కనిపించక వంశీ ఒక్కసారిగా కారు హ్యాండ్ బ్రేక్ వేశాడు. వేగంగా ఉన్న కారు దీనితో అదుపుతప్పి పక్కనే ఉన్న జలాల్పురం చెరువులోకి బోల్తా కొట్టింది. ఈత రాక, బయటపడలేక.. కారులో డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్న మణికంఠ కారు సైడ్ అద్దం కొద్దిగా తెరిచి ఉంటడంతో దానిని కాలుతో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కారు నడుపుతున్న వంశీ, వెనుక సీట్లో కూర్చున్న అక్షయ్, వినయ్, హర్షవర్ధన్, విఘ్నేశ్వర్ నీట మునిగి ప్రాణాలు వదిలారు. ఒడ్డుకు చేరిన మణికంఠ రోడ్డుపై వెళ్తున్న పాల వ్యాపారిని ఆపి ప్రమాదం గురించి చెప్పాడు. ఆ వ్యాపారి 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక ఎస్సై భాస్కర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. నీట మునిగిన కారును జేసీబీతో వెలికితీయించి.. అందులోని మృతదేహాలను బయటికి తీశారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతా పేద కుటుంబాల వారే జల సమాధి అయిన ఐదుగురు యువకులు కూడా పేద కుటుంబాలకు చెందినవారే. ఇందులో వంశీగౌడ్ ఇంటర్ పూర్తి చేసి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతడి తండ్రి శంకర్ ఆటోడ్రైవర్కాగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ఇక అక్షయ్‌కుమార్ ఇంటర్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి తండ్రి నర్సింహాచారి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. జెల్ల వినయ్ ఇంటర్ చదివాడు. అతడి తండ్రి జగన్నాథం చేనేత కారి్మకుడు. హర్షవర్ధన్ డిగ్రీ పూర్తి చేశాడు. ర్యాపిడో బైక్ నడుపుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వీరమల్ల విఘ్నేశ్వర్ ఇంటర్ పూర్తి చేశాడు. అతడి తండ్రి సత్యనారాయణ ఆర్టీసీ కండక్టర్ అని తెలిసింది. అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చాను పార్టీ చేసుకొందామని ఫ్రెండ్స్ చెబితే రాత్రి ఎల్బీ నగర్‌కు వచ్చాం. వంశీ కారు తీసుకొచ్చాడు. ఆరుగురం కలసి రాత్రి 12 గంటలకు బయలుదేరాం. రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ జామైతే గంటపైగా అక్కడే ఉన్నాం. కల్లు దొరుకుతుందని రాత్రి 3.30 గంటలకు పోచంపల్లికి వచ్చాం. ఇంకా తెల్లరకపోయేసరికి టిఫిన్ చేయడానికి కొత్తగూడెం ఎక్స్‌రోడ్డుకు వచ్చి తిరిగి పోచంపల్లికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనబడక సడన్‌గా హ్యాండ్ బ్రేక్ వేసిండు. కారు పల్టీ కొట్టి చెరువులో బోల్తా పడింది. డోర్లు తెరుచుకోలేదు. ముందు సీట్లో ఉన్న నేను కారు సైడ్ అద్దాన్ని కాలితో తన్ని పగులగొట్టి బయటికి వచ్చాను. డోర్లు తెరుచుకుని ఉంటే అంతా ఎలాగోలా బయటపడేవారు. – మణికంఠ యాదవ్, (ప్రాణాలతో బయటపడిన యువకుడు) రాత్రి 11 గంటల దాకా ఇంటివద్దే ›ఉన్నాడు మేం ముగ్గురం అన్నదమ్ములం. వంశీ రెండోవాడు. పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. రాత్రి 11 గంటల వరకు అంతా ఇంటి వద్దే ఉన్నారు. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లారు. ఉదయం నేను జిమ్‌కు వెళ్తుంటే తెలిసినవారు మీ తమ్ముడు చనిపోయాడని, స్నాప్‌చాట్‌లో ఫొటోలు వచ్చాయని చెప్పడంతో చూసి షాక్ అయ్యాం. – తిగుళ్ల ఉదయ్‌కుమార్ (మృతుడు వంశీ సోదరుడు) -
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బీబీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్‌లోని కాటన్ బాక్స్‌లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
తెల్లారితే పెళ్లి.. అంతలోనే మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట... నవ వరుడి ఆకస్మిక మరణంతో విషాదం చోటు చేసుకుంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ (24) అలియాస్ గురుకి ఇటీవలే బంధువుల అమ్మాయితో వివాహం ఖాయం కాగా.. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఎప్పట్లాగే నవీన్ తమ వ్యవసాయబావి వద్ద కోళ్లఫారంలో కోళ్లకు దాణా పెట్టేందుకు వెళ్లాడు. పెండ్లి కొడుకును చేసే సమయం అవుతున్నా నవీన్‌యాదవ్ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు కోళ్లఫారం వద్దకు వెళ్లాడు. అక్కడ నవీన్‌యాదవ్ విగతజీవిగా పడి ఉన్నాడు. నవీన్ మృతికి కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తి చేశారు. -
యాదగిరి గుట్ట పులిహోర ప్రసాదంలో ఎలుక!
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు సోష ల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఓ కుటుంబానికి చెందిన భక్తులు శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని దర్శించుకొని, అక్కడే ఉన్న ప్రసాద విక్రయ శాలలో లడ్డూ, పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు. ఆ ప్రసాదాన్ని మొదటి ఘాట్ రోడ్డులో కూర్చుని తింటున్న క్రమంలో.. చనిపోయిన ఎలుక పులి హోరలో ప్రత్యక్షమైంది. దీంతో కంగుతిన్న భక్తు లు, వెంటనే ఆలయాధికారుల వద్దకు తీసు కెళ్లారు. భక్తులను ఆలయ అధికారులు సము దాయించి, వేరే పులిహోర ప్రసాదం అందజేసి, అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని ప్రసాదం సెక్షన్ అధికారి అశోక్ కుమార్‌ను వివరణ కోరగా.. పులిహోర ప్రసాదంలో ఎలు క వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విష యాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
‘రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: కూరెళ్ల విఠలాచార్యా గ్రంథాలయానికి రూ.10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ ‘నూతన భవనం’పై అంతస్తులోని ‘సాయి సభా మందిరం’ ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆచార్య విఠలాచార్యుల గురించి ‘మన్ కి బాత్’ లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. ‘విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్ని వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’అని గవర్నర్ తమిళసై విఠలాచార్యులపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఇంటినే గ్రంథాలయం చేసిన విఠలాచార్య -
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
కేటీఆర్ తన భాష మార్చుకోవాలి: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని ఎలా అంటావంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్) ఫామ్ హౌలో పెట్టాడా అని విమర్శించారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది మీలాగా పూటకో మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు.కేసీఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్‌కు పోతుంటే వాసాలమర్రిలో శ్మశానాలు అడ్డంగా ఉన్నావని గ్రామాన్ని దత్త తీసుకొని వదిలేశాడని మండిపడ్డారు. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
కీచక టీచర్.. పదో తరగతి విద్యార్ధినికి అసభ్యకర మెసెజ్‌లు
సాక్షి, యాదాద్రి : విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే తప్పు బాట పట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పదో తరగతి విద్యార్థిని టీచరల్ వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది భువనగిరి పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థినికి ఫోన్లో అసభ్య మెసేజ్‌లు పంపుతున్నాడు. గత కొన్ని నెలలుగా అతడి వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో పొగలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులుట్రైన్ దిగి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు రావడాన్ని గుర్తించారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్‌కు మరమ్మత్తులు చేసి రైలును పంపించారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే.. -
కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్బీనగర్/మన్సూరాబాద్: ‘కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు. చీకట్లో కరెంట్ షాక్‌కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌గాందీకి వ్యవసాయం తెలియదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్ కేలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్‌రెడ్డినగర్ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు. కొత్తపేట ప్రూట్‌మార్కెట్ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్ పరుష పదజాలం ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్‌షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. -
భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో అపశ్రుతి నెలకొంది. సభకు హాజరైన కార్యకర్తకు గుండెపోటు రావడంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్లు ప్రకటించారు. మృతుడిని పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్యగా గుర్తించారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి భువనగిరి వేదిక సిద్ధమైంది. కాసేపట్లో భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైలా శేఖర్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే సభా స్థలికి వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. పాటలు, నృత్యాలతో కళాకారులు హోరెత్తిస్తున్నారు. చదవండి: అప్పట్లో జనగామను చూసి ఏడ్చా : ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ -
యాదాద్రిలో నిబంధనలకు తిలోదకాలు
నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు. కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు. -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
బోరు బావిలో ఇరుక్కున్న మహిళ
బొమ్మలరామారం: వరి నాటు వేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తూ బోరు బావిలో ఇరుక్కుపోయింది. నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ అయినబోయిన పద్మ స్థానిక గోలిపల్లి వెంకట్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు మంగళవారం వరి నాటు వేసేందుకు వెళ్లింది. రైతు వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద గతంలో బోరు బావిని తవ్వించగా.. నీరు పడకపోవడంతో వదిలేశాడు. ఆ భూమిలోనే కొత్తగా మడిని చేసి అందులో వరి నాటు వేయడానికి దుక్కి దున్నాడు. ఆ మడిలో మహిళా కూలీలు నాటు వేస్తుండగా పద్మ కాలు పాత బోరు బావి కేసింగ్‌లో పడింది. ఆమె నడుము వరకు అందులో కూరుకుపోయింది. అప్రమత్తమైన తోటి కూలీలు, యజమాని ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు, జేసీబీ సహాయంతో కేసింగ్‌కు సమాంతరంగా గోతిని తీసి 4గంటల పాటు శ్రమించారు. చివరికి బోరు బావి కేసింగ్ ధ్వంసం చేసి పద్మను కాపాడారు. అనంతరం పద్మను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే!
సాక్షి, యాదాద్రి: ఫలక్‌నుమా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ మేరకు శనివారం బీబీ నగర్‌కు చేరుకున్న క్లూస్ టీం.. దగ్ధమైన బోగీలను పరిశీలించింది. సమగ్ర దర్యాప్తునకు 12 మంది అధికారులతో కూడిన బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే పంపించగా .. ఈ టీం ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇదిలా ఉంటే.. ఎస్-4 కోచ్ బాత్రూమ్లో ముందుగా మంటలు చెలరేగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అయితే దర్యాప్తు పూర్తి అయ్యాకే ప్రమాదం వెనక కారణాలపై స్పష్టత ఇస్తామని క్లూస్ టీం అంటోంది. హౌరా నుంచి సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం ఉదయం నల్లగొండ దాటి యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యలో.. రెండు బోగీల నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. అది గమనించి కొందరు ప్రయాణికులు కేకలు వేయడంతో.. రైలు నిలిచిపోయింది. ఇక ప్రయాణికులంతా దిగిపోయి పెను ప్రమాదం తప్పింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. అయితే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా, రైలు నిర్వహణ సరిగా లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
యాదాద్రి జిల్లా రాయగిరి రైతులకు సంకెళ్లు
సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్ఆర్ఆర్ రైతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పందగా మారింది.నలుగురు రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా సంకెళ్లు వేయడంపై రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కొట్లాడితే సంకెళ్లు వేస్తారా అని నిలదీశారు రైతులకు సంకెళ్లు వేయడం పట్ల కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా గత నెల 30న ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నలుగురిని అదే రోజు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. నాలుగో తేదీ వరకు భువనగిరి జైళ్లో ఉంచిన పోలీసులు.. రాజకీయ నేతల పర్యటనలు, ఇతర కారణాలతో రాయగిరి రైతులను నల్గొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితులు పిటిషన్లు దాఖలు చేయగా.. నలుగురికి బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే క్రమంలో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పటికే బెయిల్ మంజూరు అయినందున కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు రానున్నారు రైతులు. చదవండి: రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్‌తో రేవంత్ రెడ్డి భేటీ -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
-
యాదాద్రి భువనగిరి జిల్లా భీమనపల్లిలో కల్తీ పాల కలకలం
-
వేగంగా వెళ్తున్న బస్సులో కుదుపులు.. డోర్ నుంచి కిందపడటంతో..
సాక్షి, భువనగిరి: మమ్మీ బైబై.. అంటూ స్కూల్‌కు వెళ్లిన చిన్నారి కానిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని హైదర్‌పూర్ గ్రామానికి చెందిన వడ్డేమోని శ్రీనివాస్, రాణి దంపతులకు మల్లికార్జున్, అభిలాష్(8) ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె వర్షిత ఉన్నారు. వీరంతా మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో చదువుతున్నారు. మల్లికార్జున్ 5వ తరగతి, అభిలాష్ ఒకట తరగతి, వర్షిత ఎల్కేజీ చదువుతుంది. ఉదయం అందరూ రెడీ అయి స్కూల్‌కు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో స్కూల్ వదిలిన తరువాత తిరిగి స్కూల్ బస్సు ఎక్కి ఇంటికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి జారి.. స్కూల్ నుంచి బయలుదేరిన బస్సు.. ఆయా గ్రామాలలో పిల్లలను దింపుతూ చివరగా హైదర్పూర్కు వెళ్తుంది. బస్సులో 10 మంది వరకు విద్యార్థులున్నారు. ఈ క్రమంలో భీమనపల్లి గ్రామం దాటిన తరువాత బస్సు డ్రైవర్ జింకల రాము అతివేగంగా బస్సును నడిపాడు. గ్రామశివారులోని చెరువు దాటిన తరువాత మూలమలుపు వద్ద కుదుపునకు బస్సులో ఉన్న అభిలాష్ కదులుతున్న బస్సులోంచి జారి కింద పడగా, బస్సు వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లింది. విద్యార్థి బస్సులోంచి పడిపోయిన విషయాన్ని డ్రైవర్ కనీసం చూడకుండానే వేగంగా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో భీమనపల్లి గ్రామానికి చెందిన ముంత కృష్ణ అనే వ్యక్తి బైక్‌పై వస్తూ విద్యార్థి కిందపడిపోవడాన్ని గమనించి కొద్దిదూరం వెళ్లిన బస్సును ఆపాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో విగతజీవిగా మారాడు. బస్సు డోర్‌కు లాక్ ఉండి ఉంటే... స్కూల్ బస్సు డోర్‌కు లాక్ సరిగా లేని కారణంగా బస్సులో ఉన్న వృద్ధురాలైన ఆయా పోశమ్మ డోర్ లాక్ వేయలేదు. మరోవైపు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును వేగంగా నడపడం వల్ల నిండుప్రాణం బలైపోయింది. విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూసి గుండెవిసేలా రోదించారు. సమాచారం అందుకొన్న ఎస్ఐ సైదిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్ రామును అదుపులోకి తీసుకొన్నారు. అలాగే బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు చెందిన బస్సు నుంచి అభిలాష్(6) అనే విద్యార్థి కిందిపడి మృతిచెందిన విషయంపై ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు భువనగిరి డీఈవో కె నారాయణరెడ్డి తెలిపారు. -
Cheetah Crash: లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి వీరమరణం
సాక్షి, యాదాద్రి: అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవాళ భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ‘చీతా’ కూలి ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అయితే అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తెలంగాణవాసి కావడం గమనార్హం. దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్నల్ వీవీబీ రెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఆయన పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహ్మారెడ్డి, విజయలక్ష్మీలు. అయితే.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్‌క్రాఫ్ట్.. సంగే గ్రామం నుంచి అసోం సోనిట్‌పూర్ జిల్లా మిస్సమారి వైపు వెళ్లాల్సి ఉంది. అయితే పావు గంటకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద అది ప్రమాదానికి గురైనట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి. అయితే.. ఆపై అందులో ఉన్న పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, కో పైలట్ మేజర్ జయంత్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. చివరకు వాళ్లు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించింది ఆర్మీ. -
భువనగిరిలో బయటపడిన చారిత్రక సంపద
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం చారిత్రక సంపద వెలుగు చూసింది. పట్టణంలోని ఖిలా కందకం వద్ద అభివృద్ధి పనుల కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన కాలంనాటి దేవాలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. పదిరోజులుగా కందకం వద్ద ఉన్న మట్టికుప్పలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కందకం ప్రాంతంలో ఉన్న మట్టిదిబ్బలను చదును చేసి పార్క్‌గా అభివృద్ధి చేయడానికి సంకల్పించి, అందులో భాగంగా పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే గాంధీనగర్‌లో మురికికాలువ కోసం జరిపిన తవ్వకాల్లో సంస్కృత లిపి ఉన్న శిలాశాసనం బయటపడింది. కందకం పక్కన గల కోటగడ్డ కింద దేవాలయాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు జరిపిన కోటగడ్డ తవ్వకాల్లో బైరవుడి విగ్రహం బయటపడింది. ప్రస్తుతం తవ్వకాల్లో బయటపడ్డ స్తంభాలు, యాలీ పిల్లర్లు రాష్ట్ర కూటులు, కల్యాణ చాళుక్యుల రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకుడు శ్రీ రామోజు హరగోపాల్ అంటున్నారు. కోటగడ్డ కింద దేవాలయాల సముదాయం ఉంటుందని భావిస్తున్నారు. కందకం వద్ద బయటపడ్డ పిల్లర్ల అనవాళ్ల ప్రకారం ఇక్కడ త్రికూటాలయం, లేక ఏక కూట ఆలయం ఉంటుందని హరగోపాల్ అన్నారు. ఇది 16 లేదా అంతకంటే ఎక్కువ రాతి పిల్లర్లతో నిర్మించిన అర్ధమంటపమై ఉంటుందని చెప్పారు. భువనగిరి కుమ్మరివాడలో గతంలో సింహయాలీ పిల్లర్‌కు చెందిన ముక్క దొరికిందని చెప్పారు. బ్రాహ్మణ వాడ, కుమ్మరివాడ మొదలు ఈ ప్రాంతంలో కోటగడ్డ కింద ఉన్న చారిత్రక సంపదను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని పనులు నిలిపివేశారు. ఈ మేరకు ఆర్కియాలజీ, రెవెన్యూ శాఖలకు సమాచారం ఇచ్చినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ చెప్పారు. ఆదివారం ఆయా శాఖల అధికారులు వచ్చి పరిశీలిస్తారన్నారు. -
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మోటకొండూరు: గణతంత్ర వేడుకల వేళ ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.మోటకొండూరుకు చెందిన భూమండ్ల వెంకటేశ్‌కు భువనగిరి మండలంలోని చీమలకొండూరు రెవెన్యూ పరిధిలో 2.26 ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. అయితే బంట్రోతు నాగరత్నం అనే స్థానికేతర మహిళ ఆ భూమి తమదేనని పట్టా చేసుకోవాలని చూస్తోందంటూ వెంకటేశ్, అతడి భార్య శోభ, కుమారుడు శ్రీకాంత్ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నివాసం ఉండని నాగరత్నంకు స్థానిక రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రికార్డులు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చాం: తహసీల్దార్ జ్యోతి అక్కడే ఉన్న మోటకొండూరు తహసీల్దార్ జ్యోతి బాధిత రైతుతో మాట్లా డుతూ ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని గత నెలలో నాగరత్నం అర్జీ పెట్టుకుందని, రికార్డులు పరిశీలించగా ఆమె తాత నర్సెట్టి వెంకటస్వామికి చీమలకొండూరులో 1985లో పట్టా భూమి ఉందని గుర్తించి ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేశామని పేర్కొన్నారు. ఆ భూమి భువనగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నందున సమస్యను భువనగిరి తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కరించుకోవా లని, అవసరమైతే ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. -
సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఇళ్లులేవు.. అనుమతులూ లేవు..
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు పక్కా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారా అని రెండేళ్లుగా వేచి ఉన్నామని.. ఇప్పటికీ ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభమే కాలేదని అంటున్నారు. కనీసం సొంతంగా కట్టుకునే పర్మిషన్లూ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పాత, సగం కూలిపోయిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే సొంతంగా కట్టుకునేందుకు అనుమతులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఇటీవల భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న సీఎం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామసభ నిర్వహించి, స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతకుముందు జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించడానికి వాసాలమర్రి మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఆ విషయం తెలుసుకున్న సీఎం సాయంత్రం తిరుగుప్రయాణంలో గ్రామంలోని రామాలయం వద్ద ఆగి మాట్లాడారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేకంగా లేఅవుట్ అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి చేపట్టాల్సిన పనులపై సర్వే చేశారు. రూ.152 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 481 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక వాసాలమర్రిలో ప్రస్తుతం 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ఈ 481 ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారి కోసం జీ ప్లస్ వన్, జీ ప్లస్ టూ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతర్గత మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకు, పార్కు, ఫంక్షన్‌హాల్, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, పోస్టాఫీస్, మినీ మార్కెట్, సబ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించారు. గ్రామాన్ని పునర్నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఇళ్లు కూడా నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇవేవీ ముందుకుపడలేదు. వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి గ్రామంలో 481 పెంకుటిళ్లు కూల్చివేసి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రెండేళ్లు అవుతోంది. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనడమేగానీ నిర్మాణం ప్రారంభం కావడం లేదు. గ్రామ అభివృద్ధి కోసం రూ.152 కోట్లతో డీపీఆర్ పంపించారు. నిధులు రాలేదు. లేఅవుట్ కాలేదు. 50 ఇళ్లు కూలిపోయాయి. నా ఇల్లు కూడా సగం కూలిపోయింది. కొత్తగా కట్టుకుందామంటే పర్మిషన్ లేదు. వెంటనే ఇళ్లు కట్టించాలని, లేకుంటే కట్టుకునే పర్మిషన్ అయినా ఇప్పించాలని గ్రామస్తులు పంచాయతీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదైనా సీఎం సార్ నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. మూడు విడుతలుగా నిధులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మౌలిక వసతుల కోసం రూ.58 కోట్లతో మరో డీపీఆర్ పంపించామని కలెక్టర్ చెప్తున్నారు. త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్, వాసాలమర్రి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం నూతన భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు. వానాకాలంలో పాత ఇళ్లు కొన్ని కూలిపోయాయి. కొందరు గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వకుండా.. మరోవైపు సొంత డబ్బులతో కట్టుకుందామనుకున్నా అనుమతులు ఇవ్వక పోవడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. – పలుగుల మధు, ఉప సర్పంచ్ -
పరిహారం కోసం పాదయాత్ర
సాక్షి, యాదాద్రి: పరిహారం కోసం వెయ్యి మంది రైతులు రోడ్డెక్కారు. పాదయాత్రగా వచ్చి అధికారులకు మొర పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ రైతులు, ప్రజలు 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాజెక్టులో మునిగిపోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం, పునరావాసం, రిహాబిలిటే షన్ అండ్ రీసెటిల్మెంట్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ డబ్బు లను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఐదేళ్ల కిందటి నాటి అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు. ఐదు సంవత్సరాల కిందట.. 2017 మే నెలలో నరేష్ హత్యకు(పరువు హత్య?) గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేశారు జడ్జి బాల భాస్కర్. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఇక తీర్పుపై నరేశ్ తండ్రి వెంకటయ్య అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదనగా మాట్లాడారాయన. కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ ఘోరంగా హత్యకు గురయ్యాడు. అది స్వాతి తండ్రి పనేనన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కూడా జరిగింది. ఆపై స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రేమకథ విషాదాంతమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ కాలేజీ రోజుల్లో.. లింగరాజుపల్లికి చెందిన స్వాతితో ప్రేమలో పడ్డాడు. కులాలు వేరు కావడంతో స్వాతి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో ముంబైలో ఉంటున్న నరేష్ తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి కులాంతర వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసి.. భువనగిరికి రావాలని, ఇక్కడ వివాహం జరిపిస్తానని ప్రేమతో కూతురిని నమ్మించాడు శ్రీనివాసరెడ్డి. అలా వచ్చిన స్వాతి-నరేశ్‌లు వేరయ్యారు. నరేష్ ఏమయ్యాడో.. ఆ తర్వాత జాడ లేకుండా పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు జూన్ 1 కల్లా నరేష్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచమని పోలీసులను ఆదేశించింది. కాగా నరేష్ హతమార్చినట్టు పోలీసు ఇంటరాగేషన్‌లో స్వాతి తండ్రి అంగీకరించాడు. బంధువు సాయంతో నరేశ్‌ను స్వాతికి చెందిన పొలంలోనే చంపి, దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడని తేలడంతో వాళ్లు గుండెలు పలిగేలా రోదించారు. ఆపై మే 16వ తేదీన నరేశ్ ప్రేయసి స్వాతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె మృతి కేసులోనూ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీళ్లే చేశారనేందుకు సాక్ష్యాలేవి? నరేశ్ హత్య కేసులో నిందితులుగా స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఏ1గా,ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డి ఏ2గా ఉన్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరం అంగీకరించారు కూడా. అయితే.. కేసు విషయమై న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్,డిఫెన్స్ తుది వాదనలు ఈనెల 9న పూర్తి కావడంతో బుధవారం కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. 2017లో జరిగిన ఈ కేసులో 2018 జులై 31న కేసు అభియోగపత్రాలు పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.23 మంది సాక్షుల విచారణతోపాటు భౌతిక ఆధారాలు,ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే.. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులే హత్య చేశారనేందుకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటిస్తూ భువనరిగి కోర్టు తీర్పును వెలువరించింది. పోలీసుల దర్యాప్తులో.. 2017 మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్‌లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్‌రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్‌తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్‌ను తగులబెట్టిన శ్రీనివాస్‌రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగింది కూడా. -
గ్రూప్–1 మెయిన్స్‌కు తండ్రీ తనయుడు
యాదగిరిగుట్ట రూరల్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాలనర్సయ్య (48), ఏలూరు సచిన్ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సాధించారు. బాలనర్సయ్య ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సచిన్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు. -
ప్రేమోన్మాది వేధింపులకు విద్యార్థిని బలి
భూదాన్‌పోచంపల్లి: ఓ ప్రేమోన్మాది వేధింపులకు మనస్తాపం చెంది పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య(16) చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. కావ్య ఇన్‌స్టా్రగామ్‌లో ఇదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి తనను ప్రేమించాలని మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో తనను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరింపులకు గురిచేశాడు. భయపడిన కావ్య ఇటీవల తన సోదరుడు నరేశ్‌కు విషయం చెప్పింది. దీంతో తన చెల్లెలికి మేసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేశ్ హెచ్చరించాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు రాత్రి కావ్యకు శివమణి ఫోన్‌చేసి ‘మీ అన్నను చంపేస్తాను’ అని బెదిరించడంతో ఆమె మనస్తాపం చెంది పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకొని ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. మందలించినా మారని తీరు.. ఈ నెల 2న గ్రామంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. ఇకపై కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని శివమణి తల్లిదండ్రులకు చెప్పారు. అయినా శివమణి మళ్లీ మెసేజ్‌లు పెడుతుండటంతో కావ్య కలత చెందింది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూడగా కావ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం కావ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కన కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. -
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. విజయవాడ హైవేపై ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. -
అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం
సాక్షి, గజ్వేల్/జగదేవ్‌పూర్: వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తున్నామనే సంతోషం.. వారిలో కొద్ది గంటలు కూడా నిలవలేదు. మూలమలుపు దాటేవరకు సజావుగానే సాగిన ప్రయాణానికి మృత్యువు కాపుగాసిందన్న విషయం తెలియకుండానే పైలోకాలకు వెళ్లిపోయారు. అతివేగం ఆరుగురి ప్రాణాలను బలిగొన్నది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. యాదాద్రి–భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య స్రవంతి కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. వీరికి కూతురు భవ్య, కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేష్ ఉన్నారు. అదే గ్రామంలోని మాంటిస్సోరి పాఠశాలలో భవ్య, ఏడో తరగతి, లోకేష్ 5వ తరగతి చదువుతున్నారు. సమ్మయ్య తన కుటుంబ సభ్యులతో పాటు బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన అత్తమామ రాజమణి–బిట్టు వెంకటేష్‌తో కలిసి రాజన్న దర్శనం చేసుకున్నాడు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలోని మునిగడప వద్ద కాల్వలోకి కారు బోల్తా కొట్టిన ఘటనలో మృత్యువాత పడ్డారు. మూలమలుపు దాటాక.. ప్రమాద ఘటనలో అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొంది. గ్రామంలోని ఎల్లమ్మగుడి వద్ద నిజానికి ప్రమాదకరమైన మూలమలుపు ఉంది. సహజంగా అక్కడ ప్రమాదాలు జరగడం పరిపాటి. కానీ ఈ మలుపు దాటిన కొద్ది క్షణాలకే కారు అదుపు తప్పింది. డ్రైవింగ్ చేస్తున్న సమ్మయ్య అజాగ్రత్త వహించాడా? వేరే కారణాలున్నాయా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌పై నిర్మించిన కల్వర్టును ఎడమ వైపున ఢీకొట్టిన కారు, అదుపుతప్పి మరింత వేగంతో కుడివైపునకు వెళ్లి అక్కడ మట్టిగడ్డను దాటి కెనాల్లో పడిపోయింది. ఈ క్రమంలో కెనాల్ పైభాగంలో ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను బలంగా తాకి గుంతలోకి తలకిందులుగా పడిపోయింది. ఆలయాల సందర్శనకు వెళ్లివస్తున్నప్పుడు సహజంగా మధ్యలో ఆగి దావత్‌లు చేసుకోవడం పరిపాటి. అంతేగాకుండా దైవదర్శనం సందర్భంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తుంటాం. తాజా ప్రమాదంలో ఈ రెండు కారణాలు కూడా ప్రభావం చూపాయా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవే కాకుండా మృతులు ప్రయాణించిన కారు కండిషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పారిశుధ్య కార్మికులు గమనించి హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను వెలికి తీయడంలో కీలకంగా వ్యవహరించారు. రోజువారి కూలీలే.. ప్రమాదంలో మృతి చెందిన వెంకటేష్, రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా వీరి పూర్వీకులు గ్రామాల్లో భాగవతం ఆడేవారు. వీరు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైన కూలి లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో బొమ్మలరామారం మండలంతో పాటు సమీప మండలాల్లో భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. అందరితో కలిసిమెలసి ఉండే ఈ దంపతులు ప్రమాదంలో మృతి చెందడంతో మల్యాల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంట తీరని శోకం తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతంగా ఉంది. రాజమణి –వెంకటేష్ దంపతులకు కూతుళ్లు స్రవంతి, విజయ, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతి కుటుంబమంతా మృతి చెందగా, విజయకు గోదావరిఖని చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. కలిసిరాని సెంటిమెంట్ బీబీనగర్‌లోని దాసరి కుటంబాలకు చెందిన వారంతా ప్రతీ ఏడాది వారి ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. రాజన్నను సోమవారం మాత్రమే దర్శించుకోవడం వీరికి సెంటిమెంట్. సమ్మయ్య కుటుంబం ఈ సంవత్సరం కూడా సోమవారమే రాజన్న దర్శనానికి వెళ్లగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం వారి బంధువులకు తెలియడంతో బీబీనగర్, బొమ్మలరామారం, మల్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫోన్‌రాగానే గుండె పగిలింది ‘నిన్న మధ్యాహ్నం తర్వాత మా అమ్మనాన్న, బావ, అక్క పిల్లలతో కలిసి వేములవాడ పోయిండ్రు. మొక్కులు తీర్చుకొని ఇయ్యాల 12 గంటలకు బయలుదేరుతున్నమని నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. సాయంత్రం 4 గంటల తర్వాత జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీవాళ్లకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో ఒక్కటేసారి గుండె పగిలినట్టయింది’. అంటూ మృతుడు వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ రోదించాడు. తన తండ్రిని గజ్వేల్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మాట్లాడారు. (చదవండి: ప్రమాదమా.. తగలబెట్టారా?) -
విశ్వశాంతి స్థాపనకు కృషిచేయాలి
బీబీనగర్: దేశంలోని ఎంతోమంది మహనీయులు విశ్వశాంతి స్థాపనకు పాటుపడ్డారని, వారి బాటలో శాంతిని మరింతగా విస్తరింపజేసేలా అందరూ కృషిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్‌పురం గ్రామ పరిధిలో నిర్మించిన ఆధ్యాత్మిక శాంతి కేంద్రమైన బ్రహ్మకుమారీస్ భవనంలో సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌ను రాష్ట్రపతి మంగళవారం రాజస్తాన్ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఆధ్యాత్మిక శక్తిగల భారత్‌ను గురువుగా అంగీకరిస్తుందన్నారు. ప్రజలు శాంతిని, ఆధ్యాత్మికతను, మానవత్వాన్ని అలవర్చుకునే విధంగా బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతోపాటు వివిధ వర్గాల వారిలో ఆధ్యాత్మికత, నైతిక విలువలు పెంపొందించేందుకు సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. మారుతున్న జీవన శైలిలో మానవుడు ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నాడని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు మెడిటేషన్ టెక్నిక్స్ ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ... జీవితంలో మానసిక మార్పులు, చక్కని మెళకువలు నేర్పించడానికి నిశ్శబ్దం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని చెప్పారు. -
నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధుల్లేవా?
భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు పరిహారం కోసం ప్రాజెక్టు కట్టపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారి దీక్షాశిబిరాన్ని ఎంపీ వెంకట్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు..? బస్వాపూర్ నిర్వాసితులకు ఎంత చెల్లిస్తున్నారో చె ప్పాలన్నారు. వాస్తు బాగోలేదని రూ.650 కోట్లు ఖ ర్చు చేసి సచివాలయం నిర్మిస్తున్న ప్రభుత్వం వద్ద నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్వాపూర్ నిర్వాసితులకు కొత్త అవార్డు ప్రకటించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పరిహారంపై హామీ ఇవ్వని పక్షంలో ఈ నెల 27న రిజర్వాయర్ కట్టపై వంటావార్పు చేపడతామని, అందులో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పలువురు నిర్వాసితులు కంటతడి పెట్టడంతో వారిని ఆయన ఓదార్చారు. -
ప్రాణాలైనా ఇస్తాం, భూములివ్వం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వేలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం గురువారం చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రి క్తత ఏర్పడింది. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, భూములను ఇవ్వబోము’అంటూ రైతులు నినాదాలు చేశారు. సర్వేకు ఒప్పుకోమని అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున పో లీసు బలగాలను దించి ఎక్కడికక్కడ మహిళలు, యువకులు, వృద్ధులను అదుపులోకి తీసుకుని వి విధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొత్తానికి అధికారులు రాత్రి వరకు సర్వేను పూర్తి చేశారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు సర్వే సిబ్బందిని అడ్డుకుని రహదారిపై బైఠాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళలు, పిల్లలు, రైతులు రోడ్డుపైనే కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. అయితే, రైతులు ఒక్కసారిగా వె ళ్లి సర్వే పనులను అడ్డుకుని అధికారుల చేతుల్లోని యంత్రాలను లాక్కుని పరుగులు తీశారు. ఈ క్ర మంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కిస్తుండగా మహిళా రైతులు అడ్డుకున్నా రు. ఈ సమయంలో ఓ మహిళా రైతు చేతికి గాయమైంది. మరో మహిళ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇతర మహిళలు ఆందోళన ఉధృతం చేశా రు. మహిళా పోలీసులు వచ్చి వారిని బీబీనగర్, భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓవైపు ఆందోళన.. మరో వైపు సర్వే రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల సర్వేకు కలెక్టరేట్ నుంచి ఎనిమిది బృందాలు వచ్చాయి. సర్వే నిలిపివేయాలని రైతులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే.. అధికారులు భూ సర్వే పనులు కొనసాగించారు. గత కొన్ని రోజుల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ సర్వేను రాయగిరి రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కేవలం భువనగిరి మున్సిపాలిటీ, కొన్ని గ్రామాల్లో మాత్రమే సర్వే మిగిలింది. దీంతో గురువారం రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చారు. భువనగిరి మండలం రాయగిరి, ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల మధ్య సర్వే పనులు పూర్తయినట్లు యాదాద్రి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి చెప్పారు. రైతులు కొంతమేరకు ప్రతిఘటించారని, అయినప్పటికీ సర్వే పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. 32 మందిని అరెస్టు చేశాం.. రీజనల్ రింగ్ రోడ్డు సర్వే పనులను అడ్డుకున్నందుకు నలుగురు మహిళలతో కలిపి మొత్తం 32 మందిని అరెస్ట్ చేశాం. తర్వాత అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, ఏసీపీ, భువనగిరి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి? నాకున్న మూడు ఎకరాల భూమి రోడ్డులో పోతే నా ముగ్గురు ఆడ పిల్లలను ఎలా పెంచాలి. పెళ్లిళ్లు ఎలా చేయాలి? తలుచుకుంటేనే భయమేస్తుంది. ఒక బిడ్డకు ఒక ఎకరం చొప్పున అమ్మి పెళ్లి చేయాలి అని అనుకున్నాం. కానీ, ప్రభుత్వం భూమి మొత్తం తీసుకుంటోంది. – పద్మ, రాయగిరి బతకడమే వ్యర్థం నా భర్త చనిపోగా ఆయన వారసత్వంగా నాకు ఏడు ఎకరాల భూమి వచ్చింది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నా ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. ఒక్క గుంట భూమి కూడా లేకుండా పోతుంది అంటే గుండె ఆగిపోయినట్లు ఉంది. బతకడమే వ్యర్థం అనిపిస్తోంది. –– లక్ష్మి, రాయగిరి -
విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెపలు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్ 7వ తేదీన యూరప్‌లోని ఎల్బ్రోస్ పర్వతాలను ఎక్కారు. -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
ఆడ శిశువుల్ని సాకి.. వ్యభిచార రొంపిలోకి దింపి
యాదగిరిగుట్ట: బాలికలను అక్రమ రవాణా చేస్తూ వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ చాలా ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను కొనుగోలు చేసి యుక్త వయస్సు వచ్చే వరకు పెంచి పోషించింది. సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో ఉన్న కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను పంపించింది. శ్రీనివాస్ అక్కడ ఆ బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండేవాడు. అదే క్రమంలో యాదగిరిపల్లికి కూడా పంపిస్తుండేవాడు. వ్యభిచారం చేయించేందుకు అనసూయ వారిని కొడుతూ ఉండేది. అనసూయ, శ్రీనివాస్‌కు మరికొంతమంది సహకరించేవారు. తప్పించుకుపోయి.. పోలీసుల కంటపడి.. అనసూయ చిత్రహింసలకు తట్టుకోలేక ఇద్దరిలో ఓ బాలిక ఇటీవల ఇంటి నుంచి పారిపోయింది. జనగామ జిల్లా బస్టాండ్‌లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వారి విచారణలో యాదగిరిపల్లికి చెందిన అనసూయ, తంగళపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. దీంతో అక్కడి పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులుతో పాటు ఇక్కడి పోలీసులకు సమాచారం అందజేశారు. మెరుపుదాడి చేసి.. ఈ నెల 3న సైదులు ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట పోలీసులు, షీటీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు కలిసి యాదగిరిపల్లిలోని కంసాని అనసూయ ఇంటిపై దాడి చేశారు. అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా సెక్స్ రాకెట్ డొంక కదిలింది. ఆమె ఇచ్చిన సమాచారంతో తంగళపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని టీచర్ కాలనీకి చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చందా సరోజనమ్మ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. దాడుల్లో పాల్గొన్న డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, టౌన్ సీఐ సైదయ్య, యాదగిరిగుట్ట పోలీసు బృందానికి సీపీ మహేష్ భగవత్ అభినందనలు తెలిపారు. -
దేశ సంపదను కాపాడేందుకు ఉద్యమం
యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న పరిస్థితుల్లో దేశ సంపదను కాపా డుకునేందుకు ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ పక్రటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కార్మికులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నరేంద్రమోదీ కార్మిక సంఘాలను నిర్వీ ర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కార్మికులు, ప్రజలు నష్టపోతుంటే అదానీ, అంబానీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. నల్లధనాన్ని బయటకు తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఆ నల్లధనం కలిగిన వారిని విదేశాలకు పంపించారని ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ గొడుగు కింద పని చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ గతంలో బ్రిటిష్ వారికి సేవ చేసిందని, నేడు పెట్టుబడి దా రులకు వత్తాసు పలుకుతోందని ఆమె మండిపడ్డారు. కేంద్రం ట్రేడ్ యూనియన్లను పట్టించుకోవడం లేదని, అపాయింట్మెంట్ కోరితే సమయం కూడా ఇవ్వడం లేదని అమర్జిత్కౌర్ నిందించారు. కార్మికుల సమ స్యలపై చర్చిద్దామని పిలిచి కేవలం 3 నిమిషాలు మా త్రమే సమయమిచ్చి అవమానపరుస్తున్నారని విమ ర్శించారు. దేశ సంపదను అమ్మినా, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలరాజు, వీఎస్ బోస్, తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
Neem Tree: వేపకు మళ్లీ ఆపదొచ్చింది.. మేలుకోకపోతే వింత రోగంతో..
ఆత్మకూరు (ఎం)/యాదాద్రి భువనగిరి: వేపకు మళ్లీ ఆపదొచ్చింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు కళ్లెదుటే మోడుబారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా వైరస్ సోకి పెద్ద ఎత్తున చెట్లు మోడుబారాయి. గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ వేప చెట్లు వైరస్‌కు గురవుతున్నాయి. వైరస్ ద్వారా తెగులు సృష్టిలో రకరకాల చెట్లు ఉన్నప్పటికీ వేపది ప్రత్యేక స్థానం. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టుతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అలాంటి ప్రాధాన్యం కలిగిన వేప చెట్టు ఇప్పుడు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడింది. ఈ వైరస్ సోకిన చెట్ల కొమ్మలు పసుపు, గోదుమ రంగులోకి మారి ఆ తర్వాత నిర్జీవ స్థితికి చేరుతున్నాయి. ఈ వైరస్ ఒక వేప చెట్టు నుంచి మరో వేప చెట్టుకు వస్తుంది. వాడాల్సిన మందులు వైరస్ బారిన పడిన వేప చెట్లకు కార్భోలానిజిమ్ ద్రావకాన్ని ఒక గ్రాం ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత కాపర్ ఆక్సై డ్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా వైరస్ ఆశించిన చెట్టు కొమ్మలను నరికివేయాలి. నరికిన కొమ్మలకు గోరింటాకు ముద్దగా చేసి అంటించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) గత ఏడాది మొక్కుబడి చర్యలు గత ఏడాది వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. చెట్లను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేప చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని చెట్లకు మాత్రమే మందులు వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. మందు పిచికారీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్పంచ్‌లు చేతులెత్తేశారు. దీంతో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. (చదవండి: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్) ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది వేప చెట్లకు వైరస్ తీవ్ర త ఈసారి ఎక్కువగా ఉంది. తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైరస్ సోకిన చెట్టు ఆరు నెల్లోపు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే చిగురిస్తాయి. గతంలో సర్పంచ్‌లకు చెప్పి మందు పిచికారీ చేయించాం. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి మందులు పిచికారీ చేయాలి వేప చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడం ఆందోళన కలిగి స్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి సంరక్షణలు చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసి మందులు పిచికారీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే చెట్లు అంతరించే ప్రమాదం ఉంది –డి.వెంకన్న, సైన్స్ ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం) అధికారులు స్పందించాలి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వేప పుల్లతోనే దంతాలు తోముకుంటున్నా. గత ఏడాది వేప చెట్లకు వైరస్ సోకి చాలా వరకు ఎండిపోయాయి. మళ్లీ అదే మాదిరిగా ఇప్పుడు ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెంటనే స్పందించి చెట్లను కాపాడాలి. –బద్దం శంకర్‌రెడ్డి, రైతు, కాల్వపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం -
యాదాద్రి: విడిపోయి బతకడం ఇష్టం లేకనే?
సాక్షి, యాదాద్రి జిల్లా: జిల్లాలో ఓ ప్రేమ జంట బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. బహూపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ జంట. మృతుల్ని బస్వాపూర్‌కి చెందిన గణేష్, నలందగా గుర్తించారు పోలీసులు. నలందకి వివాహం జరిగింది. అయితే.. గణేష్‌తో అంతకు ముందు నుంచే ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచింది. విడిపోయి బతకడం ఇష్టం లేకే ఈ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం!. -
తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా..
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువన గిరి జిల్లాలో శుక్రవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడుకి ముస్తాదు ఊడిపోవడంతో కాళ్లుపైకి తల కిందికి వేలాడుతూ ఆరుగంటల పాటు నరక యాతన అనుభవించాడు. సంస్థాన్ నారా యణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగోని మాసయ్య కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మాసయ్య శుక్రవారం ఆలస్యంగా 9గంటల ప్రాంతంలో కల్లు తీసేందుకు అదే గ్రామానికి చెందిన వీరమళ్ల దానయ్య పొలంలోని తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మాసయ్య ముస్తాదు ఊడిపోవడంతో మోకు, గుత్తిపై తలకిందు లుగా వేలాడాడు. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వచ్చి పెద్ద క్రేన్ సహాయంతో మాసయ్యను కిందికి దించారు. అప్పటికే అతడి ఎడమకాలు, చేయి చచ్చుబడ్డాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మాసయ్య ఆరు గంటల పాటు చెట్టుపైనే నరకయాతన అనుభవించారు. అధిక రక్తపోటుతో పక్షవా తం రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్‌లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు -
నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన
‘నీ కాళ్లు మొక్కుత సారు..పైసలిప్పియ్యరూ.. అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో జరిగింది. బస్వాపురం గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుడు ఉడుత అంజయ్య అక్కడికి వచ్చాడు. రిజర్వాయర్ నిర్మాణంతో తన వ్యవసాయ భూమి, బోరు పోయిందని పైసలు ఇప్పించాలని ఎమ్మెల్యే కాళ్లపై పడి దండం పెట్టి వేడుకున్నాడు. చదవండి: (అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్) -
ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు
చౌటుప్పల్: కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్ఎస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్ షేఠ్లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. -
స్టేటస్ పెట్టి.. బావిలో దూకాడు
భూదాన్‌పోచంపల్లి: వ్యవసాయబావిలో దూకి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడేనికి చెందిన నోముల ఆకాశ్‌రెడ్డి(17) భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మ్యాథ్స్ అర్థం కావడంలేదని, లె క్చరర్ హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారని వేరే కళాశాలలో చేరుతానని చెబుతుండేవాడు. అన్నట్టుగానే ఐదు రోజుల క్రితం టీసీ తీసుకొని పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్లో చేరాడు. స్టేటస్ పెట్టిన 10నిమిషాల్లోనే..: ‘నేను చనిపోవడానికి మా జూనియర్ కళాశాల మ్యాథ్స్ లెక్చరర్, తోటి విద్యార్థిని కారణం’అని ఆదివారం మధ్యాహ్నం 12.55కి తన మొబైల్ లో స్టేటస్ పెట్టాడు. అతని స్టేటస్ చూ సిన స్నేహితులు... ఆకాశ్‌రెడ్డి తల్లి అరుణకు చెప్పారు. అదే సమయంలో అక్కడి కి వచ్చిన ఆకాశ్‌ను ప్రశ్నించగా... సరదాగా పెట్టానంటూ వెళ్లిపోయాడు. అనంతరం సైకిల్‌పై గ్రామ సమీపంలోని వ్య వసాయ బావి వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన సైకిల్, గట్టు పైన చెప్పులు,సెల్‌ఫోన్ పెట్టి బావిలో దూకాడు. అతని కోసం వెదుకుతుండగానే బావిలో దూకాడని గ్రామస్తులు చెప్పారు. భయంతోనేనా.. ఆకాశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని ఫొటోలను తన ఫోన్లో వాట్సప్ డీపీగా పెట్టుకునే వాడు. కాలేజీ మారాక కూడా కొనసాగించాడు. దీంతో సదరు విద్యార్థిని మ్యాథ్స్ లెక్చరర్‌కు చెప్పింది. దీనిపై సోమవారం పోలీస్‌లకు ఫిర్యాదు చేద్దామని లెక్చరర్ చెప్పినట్లు సమాచారం. తనపై కేసు అవుతుందనే భయంతోనే బావిలోకి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాక ఆకాశ్ మానసిక స్థితి కూడా సరిగా ఉండదని తెలిసింది. అతడి తండ్రి నోముల శ్రీనివాస్‌రెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి అరుణ మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అర్ధరాత్రివరకు వెతికినా మృతదేహం దొరకలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
టార్గెట్.. 76 వేల ఓట్లు
చౌటుప్పల్ రూరల్: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్‌లకో ఇన్చార్జిని, పది బూత్‌లకో క్లస్టర్ ఇన్చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్ కుటుంబాలను గుర్తించాలి. కనీసంగా బూత్‌కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్ ఇన్చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి.. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్ ఇన్చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌కు 76వేల ఓట్లు వచ్చాయి. బూత్‌కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్ ఇన్‌చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్‌లవారీగా కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్‌గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Regional Ring Road: రాయగిరి రైతులకు కష్టాల ‘రింగ్’! బతికేదెట్లా?
సాక్షి, యాదాద్రి: అది రాయగిరి గ్రామం.. చుట్టూ పొలాలు, చేన్లతో కళకళాడేది.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు, హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉంటుంది. ఆ ప్రధాన రహదారి విస్తరణ కోసం గ్రామంలో కొంతమేర పొలాలు, భూములు పోయాయి.. అభివృద్ధి కోసమేకదా అనుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం మరికొంత భూమి పోయింది.. తమ ప్రాంతం పచ్చగా అవుతుంది కదా అనుకున్నారు. యాదాద్రి అభివృద్ధికి, హైటెన్షన్ విద్యుత్ లైన్ల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంది. అటు దేవుడు, ఇటు కరెంటు.. ఇవ్వలేక ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగు రోడ్డు తెరపైకి వచ్చింది. దాని అలైన్‌మెంటు కూడా రాయగిరి గ్రామం మీదుగానే వెళుతోంది. ఇన్నిసార్లు భూములు ఇచ్చామని.. ఇప్పుడూ ఇస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని, ఊరు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని రాయగిరి వాసులు వాపోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని వేడుకుంటున్నారు. రాయగిరి గ్రామంలో వందలాది మందికి ఉపాధి కల్పించే రైస్ మిల్లులు, హోటళ్లు మొత్తం రోడ్డు విస్తరణలో పోతున్నాయని అంటున్నారు. 80 ఎకరాల సేకరణ కోసం.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ జంక్షన్ సర్కిల్ కోసం 80 ఎకరాలు సేకరిస్తున్నారు. ముందుగా 60 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికి.. జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 20 ఎకరాలు పెంచారు. అలైన్మెంట్ మార్చారా? : ముందుగా రీజనల్ రింగ్ రోడ్డు తుర్కపల్లి మండలం నుంచి రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల మీదుగా భువనగిరి మండలంలోకి వెళ్లేలా ప్రాథమికంగా ప్రతిపాదించారు. తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానానికి ఉత్తరం వైపు నుంచి కాకుండా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, దాతర్పల్లి మీదుగా కలెక్టరేట్ నుంచి రాయగిరి గ్రామం మీదుగా వలిగొండ మండలం వరకు తాజా ప్రతిపాదనతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా రాయగిరి గ్రామానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసిన ప్రతిపాదనను తర్వాత మార్చడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు భూములు పోతే ఎలా..? రాయగిరి రెవెన్యూ పరిధిలోని బాలెంపల్లికి చెందిన బద్దం నర్సింహారెడ్డికి ఆరు ఎకరాల భూమి ఉంది. గతంలోనే హైటెన్షన్ లైన్ కోసం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వకుండా రెండు ఎకరాల భూమిని తీసుకున్నారు. కాళేశ్వరం కాల్వ కోసం 15 గుంటల భూమి తీసుకున్నారు. తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు కోసం మూడు 3 ఎకరాలు తీసుకుంటున్నారు. గ్రామంలో పది మంది రైతులది ఇదే పరిస్థితి. పంటలు పండే భూములు ఇలా తీసుకుంటే తాము ఎలా బతకాలని నర్సింహారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గుంట భూమి లేకుండా పోతుంది సర్వే నంబర్ 690లో మా అన్నదమ్ములిద్దరి పేరున మొత్తం 14 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటులో గుంట భూమి లేకుండా పోతోంది. దీంతో మాకు బతుకు దెరువు కష్టమవుతోంది. రోడ్డు అలైన్‌మెంటు మార్చి మా జీవితాలు కాపాడాలి. – తెల్జూరి ఐలయ్య, రాయగిరి అలైన్మెంట్ మార్చాలి సర్వే నంబర్ 726లో 7.15 ఎకరాల భూమిపోతోంది. ఇందులో ఆరుగురు రైతులు తమ భూములు మొత్తం కోల్పోతున్నారు. ముందుగా ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఈ సర్వే నంబర్లో 4 ఎకరాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. కానీ తాజా నోటిఫికేషన్ ప్రకారం మార్చిన అలైన్మెంట్తో భూమి మొత్తం పోతోంది. వెంటనే రింగురోడ్డు అలైన్ మెంట్ మార్చాలి. – అవిశెట్టి పాండు, రాయగిరి గుంట భూమి కూడా మిగలకుండా.. రాయగిరికి చెందిన కోటం భద్రయ్యకు ఉన్న 4.17 ఎకరాల భూమి మొత్తం రీజనల్ రింగ్‌రోడ్డులో పోతోంది. గతంలో ఆయన భూమిలో రెండు ఎకరాలను హైటెన్షన్ విద్యుత్ లైన్లు, టవర్ల కోసం ప్రభు త్వం తీసుకుంది. అలాగే జాతీయ రహదారి విస్తరణ కోసం 34 గుంటల భూమి, ఇల్లు పోయాయి. తాజా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉన్న మొత్తం భూమిని కోల్పోతున్నాడు. కూతురు వివాహం కోసం పనికి వస్తుందనుకున్న కోట్ల విలువ చేసే భూము లను కోల్పోయి ఎలా బతకాలని, ప్రభుత్వం అలైన్ మెంట్ మార్చాలని భద్రయ్య వేడుకుంటున్నాడు. -
యాదాద్రి జిల్లాలో 2 గంటల పాటు కుండపోత వర్షం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 65.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 169.2మి.మీ, తుర్కపల్లిలో 125.2 మి.మీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జిల్లాలో చెరువులు అలుగులు దుంకాయి. వాగులు పొంగిపొర్లాయి. భువనగిరి–యాద గిరి గుట్ట, వరంగల్‌వైపు వెళ్లే జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నీట మునిగింది. భువనగిరి– చిట్యాల జాతీయ రహదారిలో ఇంద్రపాలనగరం వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా పారడంతో ఈ రెండు ప్రధాన రహ దారులపై రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ–ధర్మారం మధ్యన వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. -
క్షుద్రపూజలకు మహిళ బలి?
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరులో మూటపురం అనూష(30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, 6 నెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఆపరేటర్ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. కుటుంబ కలహాలతో నిత్యం బాబురావు భార్యను కొట్టి వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మతల్లి సోకి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్ చేసి అనూష ఆరో గ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చే సరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది. క్షుద్ర పూజలనే అనుమానం.. అనూష అత్త యాదమ్మ తరచూ క్షుద్రపూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం, అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండటం, ఉదయం వరకు ఇంట్లో పెద్ద దీపం వెలుగుతుండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత క్షుద్రపూజలు చేసి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూ ష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు ధ్వంసం : అనూషను భర్త, అత్త కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు బాబురావు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. న్యా యం చేసేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించి కూర్చున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్ద మనుషులు రూ. 7.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం చేసుకు న్నట్లు సమాచారం. బాబురావు, యాదమ్మ పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
గాంధీ వేషధారణలో 750 మంది చిన్నారులు
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషధారణలో అలరించారు. చేనేత మగ్గం, రాట్నం, రాట్నంపై నూలు వడికే విధానాన్ని ప్రదర్శించారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటిచెప్పారు. -
బతికుండగానే కాగితాల్లో చంపేశారు!
సంస్థాన్ నారాయణపురం: వితంతు పింఛన్‌కు దరఖాస్తున్న చేసుకున్న మహిళ బతికుండగానే అధికారులు కాగితాల్లో చంపేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం పరిధి ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చన బోయిన బాలమ్మ భర్త రామచంద్రం అనారోగ్య కారణాలతో 2021 జనవరి 28న మృతిచెందాడు. దీంతో బాలమ్మ అదే ఏడాది సెప్టెంబర్ 14న పలు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో వితంతు పింఛన్ కోసం గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా, స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలమ్మ తనకు పింఛన్ మంజూరైందా? అని అధికారులను ఆశ్రయించింది. దీంతో వారు ఆన్లైన్లో శోధించగా ఆ జాబితాలో మాత్రం బాలమ్మ చనిపోయినట్లు ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్ ఇప్పించాలని బాలమ్మ అధికారులను వేడుకుంది. కాగా, దీనిపై ఎంపీడీవో యాదగిరిని సంప్రదించగా మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన పొరపాటుగా గుర్తించామని తెలిపారు. బాధితురాలికి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
ఉత్తమ అవార్డుకు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంపిక
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో ‘వన్ నేషన్ వన్ ఫ్లాగ్’పై నిర్వహించిన పోటీల్లో సాక్షి దినపత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా ఫొటోగ్రాఫర్ కోల్లోజు శివకుమార్ పంపిన చిత్రం ఎంపికైంది. ఈనెల 19న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో శివకుమార్ అవార్డు అందుకోనున్నారు. -
వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా
యాదాద్రి భువనగిరి: మునుగోడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధం కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్‌లో ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అర్థరాత్రి హైడ్రామా ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి ఉండే నివాసానికి ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. భూవివాదానికి సంబంధించిన గతంలో నమోదైన కేసులను మరోసారి తెరపైకి తెచ్చి తాడూరిని అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్ట్ చేసేందుకు వచ్చామని అక్కడకు వచ్చిన పోలీసులు తెలపగా, అసలు ఎందుకు అరెస్ట్ చేసి విచారిస్తారని తాడూరి నిలదీశారు. అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఎంపీపీ వెంకట్‌రెడ్డి ఇంటిని చుట్టూ ముట్టిన విషయం తెలిసి.. ఎంపీపీ ఇంటికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి , బీజేపీ నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. తాడూరి అరెస్ట్‌ను అక్కడకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి నోటీసులు ఇచ్చారు చౌటుప్పల్ పోలీసులు. వారు చౌటుప్పల్ పోలీసులు కాదు ఈ అంశానికి సంబంధించి తాడూరి స్పందించారు. ‘హైదరాబాదులో ఉంటున్న తన అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కి అర్థరాత్రి చౌటుప్పల్ పోలీసులమని చెప్పి అరెస్ట్ చేసేందుకు కొందరు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చౌటుప్పల్ పోలీసులు కాదు. నేను అందర్నీ గుర్తు పడతాను. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నాతో పాటు కొద్ది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మరికొంత మంది కార్యకర్తలు మేమందరం కలిసి మాట్లాడుకునే బీజేపీలోకి పోదామనే అనుకున్నాం. ఈ సమయంలోనే మా ఇంటికి ఎవరో వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు’ అని అన్నారు. -
అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు
బీబీనగర్: వరంగల్–1 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. శనివారం హైదరా బాద్ నుంచి వరంగల్‌కు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపుతప్పి రహదారి పక్కన గల గుంతలో చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. దాదాపు 200 మీటర్లు దూరం వరకు బస్సు అలా ముందుకు వెళ్లిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే స్థానికులు వెంటనే వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. కాగా, బస్సులో 20 మంది పైగా ఎస్సై పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు. ఆదివారం పరీక్ష ఉండగా వారు ఒక రోజు ముందుగానే వరంగల్‌కు బయలుదేరారు. వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాతాలకు చెందిన వారని తెలిసింది. స్టీరింగ్ లాక్ కావడంవల్లే: డ్రైవర్ రాజన్న ఈ ప్రమాదంపై డ్రైవర్ రాజన్న మాట్లాడుతూ.. ఎయిమ్స్ సమీపంలోకి రాగానే స్టీరింగ్ లాక్ కావడంతో బస్సు ఎడమ వైపు దూసుకెళ్లిందని, వెంటనే బ్రేక్ వేశానని, అయినా కొంతదూరం చెట్లపొదల్లోకి వెళ్లి నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం ప్రయాణికులను ఇతర డిపోలకు చెందిన బస్సులలో ఎక్కించి పంపించారు. ఇదిలా ఉండగా బస్సు చెట్లను ఢీకొని ఆగిపోవడంతోనే తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు తెలిపారు. -
తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు. చికోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయిష్మాన్ భారత్‌లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు. క్యాసినో స్కామ్‌లో చాలా మంది టీఆర్ఎస్ నాయకులున్నారని బండి సంజయ్ విమర్శించారు. డగ్ర్ కుంభకోణంలో కూడా వారే ఉన్నారన్నారు. నయీమ్ డైరీ ఏమైందని, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీమ్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రావడంతో అతన్ని ఎన్కౌంటర్ చేశారని అన్నారు. నయీమ్ బాధితులను ఆదుకొని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు రికవరీ చేస్తామన్నారు. ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటినే తమ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. చదవండి: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
సీఏం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ బంధు ఇస్తారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తారా అని నిలదీశారు. నెలలో సగం రోజులు సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఉంటారని, మిగతా సగం రోజులు మోదీని తిట్టడానికే సరిపోతుందని దుయ్యబట్టారు. యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు. దేశాన్ని ఉద్ధరించడం కాదని, ముందు రాష్ట్ర సమస్యలపై స్పందిచాలి. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేజీ టు పీజీ ఏమైంది. ఏడాది తరువాత రాష్ట్రంలో మార్పు వస్తుంది. మజ్లిస్, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయి’ అని మండిపడ్డారు. చదవండి: ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి.. కత్తితో బెదిరించి -
మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం
-
50 స్కూళ్లు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
సినీ నటి మంచు లక్ష్మి గొప్ప నిర్ణయం తీసుకుంది. 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని తెలిపింది. 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహిస్తూనే, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. పిల్లలు చదువు మధ్యలో ఆపేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మంచు లక్ష్మి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. పిల్లల చదువుకు పెద్దపీట వేసే ఈ ముందడుగు తప్పకుండా విజయవంతం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 'నిప్పు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
చక్రాల కింద ఇరుక్కుని.. చావుని తప్పించుకుని..
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ విఘ్నేశాచారి (73) ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చౌటుప్పల్‌కు వచ్చాడు. ద్విచక్ర వాహనంతో లారీ కింద ఇరుక్కున్న విఘ్నేశాచారి పని ముగించుకుని స్థానిక అంగడి ప్రాంతం నుంచి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో యూటర్న్ తీసుకునేందుకు బస్టాండ్ వద్దకి వెళ్లాడు. అక్కడ నెమ్మదిగా యూటర్న్ చేస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో విఘ్నేశాచారితో పాటు ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రాల కింద ఇరుక్కుంది. ఇది గమనించని లారీడ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు గట్టిగా కేకలు వేయగా లారీడ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన వెళ్లి ద్విచక్ర వాహనాన్ని, విఘ్నేశాచారిని లారీ కింద నుంచి బయటకు తీశారు. కాలికి చిన్నపాటి గాయం తప్పితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ నెమ్మదిగా వెళ్తుండటం, స్థానికుల కేకలతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. -
చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం కావొద్దు
సాక్షి, యాదాద్రి: వైద్య విద్యార్థులు చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం గా చేసుకోవద్దని, సకాలంలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంత మైన జీవితం గడుపుతూ లక్ష్యాల ను సాధించవచ్చని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో రీసెర్చ్ మ్యాగజైన్ అను సం«ధాన్‌ను ఆమె ఆవిష్కరించా రు. ఆస్పత్రిలో స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆడి టోరియంలో వైద్యవిద్యార్థులను, వైద్యులను ఉద్దే శించి ప్రసంగించారు. వివాహాలు చేసుకుంటే చదువుకోలేమని మహిళలు అనుకుంటారని, అది నిజం కాదనడానికి తన జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలోనే తనకు వివాహం జరిగిందని, అయినా ఆ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాన న్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం వంటి విషయాలను తమిళిసై గుర్తు చేసు కున్నారు. కొందరు చదువు పేరుతో వివాహాలు ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారన్నారు. తెల్లని కోటులో తనను డాక్టర్‌గా చూడాలని తన తల్లి పడిన తపనను గవర్నర్ వివరించారు. ఎయిమ్స్ సేవలు అభినందనీయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్ డాక్టర్లు అంది స్తున్న వైద్యసేవలను గవర్నర్ తమిళిసై కొనియా డారు. ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలు, శస్త్ర చికిత్సలు, కోవిడ్ సమయంలో అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్య మివ్వ కుండా సాధారణ ప్రసవాలు చేయాలని సూచించా రు. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 270 శస్త్రచికిత్సలు, 3,040 మైనర్ చికిత్సలు చేశార న్నారు. ఎయిమ్స్‌లో రీసెర్చ్ కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ వైద్యశాల, కళాశాలకు అవసరమైన అన్ని రకాల వైద్యపరికరా లను రూ.185 కోట్లతో తెప్పిస్తున్నామన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో దారుణం.. మహిళ ఫొటోలు తీసి బెదిరింపులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ(40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె నగ్న చిత్రాలను తీశారు. అనంతరం ఆ ఫొటోలను ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో వారి మిత్రులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..? -
ఢీ కొట్టి.. ఈడ్చుకెళ్లి..
భువనగిరి: బంధువుల అంత్యక్రియలకు వెళ్లేందుకు స్కూటీపై బయల్దేరిన వారిని డీసీఎం వాహనం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వీరిని ఢీ కొట్టిన తర్వాతైనా బండిపై ఉన్నవారు వేసిన కేకల్ని వినిపించుకుని వాహనాన్ని ఆపితే కనీసం రెండు ప్రాణాలైనా నిలిచేవి. కానీ, మద్యంమత్తులో వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతున్న ఆ డ్రైవర్ వీరు వేసిన కేకల్ని వినిపించుకోలేదు. స్కూటీతో పాటు వీరిని కూడా వంద మీటర్లు దూరం ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో వీరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురు ప్రాణాలు తీయడమే కాకుండా ముగ్గురు పిల్లలు అనాథలయ్యేందుకు కారణమయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామానికి చెందిన దండబోయిన నర్సింహ(35), రాజ్యలక్ష్మి(30) దంపతులతో పాటు నర్సింహ వదిన దండ బోయిన జంగమ్మ(40) గురువారం బొమ్మల రామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామంలో బంధువుల అంత్య క్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై బయల్దే రారు. అంతకు ముందేగానే జంగమ్మ భర్త బాలు మల్లు అంత్యక్రియలకు బయల్దేరి వెళ్లాడు. అయితే స్కూటీపై బయల్దేరిన ముగ్గురూ భువనగిరి పట్టణం దాటిన తర్వాత హన్మాపురం గ్రామ పరిధిలోని బచ్పన్ స్కూల్ సమీపంలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగదేవ్‌పూర్ నుంచి భువనగిరి వైపు వేగంగా వస్తున్న డీసీఎం వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం వాహనం ముందు భాగంలో ఇరుక్కుపోయింది. స్కూటీపై వెనుక కూర్చున్న జంగమ్మ ఎగిరి రోడ్డుపైపడి అక్కడికక్కడే మృతి చెందింది. కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా.. స్కూటీ ముందుభాగం డీసీఎంలో ఇరుక్కుపోవ డంతో రాజ్యలక్ష్మి, నర్సింహ కేకలు వేశారు. ఎంత గా అరుస్తున్నా వినిపించుకోకుండా డీసీఎం డ్రైవర్ ముందుకు దూసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లగానే రాజ్యలక్ష్మి స్కూటీ నుంచి విడిపోయి మృతి చెంద గా..నర్సింహను సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిపోయాడు. అప్పటికే అతడు కూడా మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి డీసీఎం వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బంధువులు కూడా గుర్తించలేదు మృతుల బంధువులు కూడా అదే దారిలో అంత్య క్రియలకు వెళ్తుండగా అప్పటికే ప్రమాదం జరగ డంతో జనం గుమికూడారు. దీంతో చనిపోయింది తమ బంధువులేనని గుర్తించలేకపోయామని వా రు వాపోతున్నారు. జంగమ్మ భర్త బాలుమల్లు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడి పిన డీసీఎం డ్రైవర్‌పై 304( జీజీ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనాథలైన పిల్లలు నర్సింహా, రాజ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదం డ్రులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురూ అనాథలయ్యారు. మరో మృతు రాలు జంగమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత సాంకేతిక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ–హాస్టల్–భోజన వసతితో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్స్ట లేషన్, సర్వీసు కోర్సుకు 6 నెలల శిక్షణ, దీనికి ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దొజి, క్విల్డ్‌బ్యాగ్స్ కోర్సుకు 6 నెలలు శిక్షణ, దీనికి 8వ తరగతి పాసై ఉండాలని తెలిపారు. అర్హతలు ► వయసు 18–25 ఏళ్ల లోపు వారై ఉండాలి ► ప్రస్తుతం చదువుకుంటున్న వారు అర్హులు కాదు. ► అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్, పాస్‌పోర్ట్ ఫొటోలు, ఆధా, రేషన్‌కార్డులు ఆసక్తి, అర్హతలున్న గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు ఈనెల 13న ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని తమ సంస్థకు రావాలని స్వామి రామానందతీర్థ గ్రామీణసంస్థ డైరెక్టర్ కిశోర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?) -
చలానా జాప్యం ప్రాణం తీసింది
జనగామ/యాదగిరిగుట్ట రూరల్: పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీల మనసు కరగలేదు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామన్న పోలీసుల అమానవీయవైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం జరిగింది. జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడునెలల క్రితం బాబు జన్మించాడు. కొద్దిరోజుల క్రితం సరస్వతి తన కొడుకును తీసుకుని ఇదే మండలం వెంకిర్యాలలోని తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు ఓ అద్దె కారును తీసుకుని బాబుతోసహా బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఆ కారును ఆపారు. కారుకు సంబంధించి వెయ్యి రూపాయల పెండింగ్ చలానా ఉన్నట్లు ఆన్లైన్లో గుర్తించారు. పోలీసులు వెంటనే డ్రైవర్ వద్ద ఉన్న ఒరిజినల్ లైసెన్స్ తీసుకుని, చలానా కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా కనికరించలేదు ‘సారూ.. బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.. ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.. ప్లీజ్ వదిలి పెట్టండి’అని ఆ తల్లిదండ్రులు ఎంతసేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. కారు ఓనర్‌కు డ్రైవర్ ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడించాడు. చలానా వెంటనే చెల్లిస్తానని అతడు వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది. ఆ తర్వాత నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది. ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఓ బాబు పుట్టిన రెండు నెలల తర్వాత చనిపోయాడు. రెండో కుమా రుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఊరు ఊరంతా కన్నీటిపర్యంతమైంది. కాగా, ఆస్పత్రికి ఎమర్జెన్సీగా వెళ్తున్నామని మాకు ఎవరూ చెప్పలేదని, వాహనం లోపల బాబు సీరియస్‌గా ఉన్నాడని తెలిస్తే తాము అలా చేయమని ట్రాఫిక్ సీఐ సైదయ్య అన్నారు. -
చేనేతకు గుర్తింపుతో ఉపాధి అవకాశాలు
భూదాన్‌పోచంపల్లి: చేనేతకు గుర్తింపునివ్వడం ద్వారా మార్కెటింగ్ పెరిగి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హైదరాబాద్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని టై అండ్ డై అసోసియేషన్ భవన్లో శుక్రవారం పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాల్‌పై తపాలా కవర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జియోగ్రాఫికల్ ఇండెక్స్ కలిగిన పోచంపల్లి ఇక్కత్‌తో పాటు తేలియా రుమాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్లను ముద్రించిందన్నారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు పంపించడానికి తపాలా శాఖ పార్శిల్ సేవలను అందిస్తుందని తెలిపారు. నెలకు రూ.50 వేల కంటే ఎక్కువ పార్శిల్ బిల్లులు చెల్లించేవారికి 10 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు క్రెడిట్ అవకాశం కూడా కల్పిస్తామన్నారు. కాగా, ఇక్కత్ డిజైన్లపై తపాలా స్టాంప్‌ను కూడా విడుదల చేయాలని హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. చేనేత కార్మికులు తమకు అందుబాటులో ఉన్న మార్గాలను సద్వినియోగం చేసుకొని వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్‌ను మరింత విస్తరించుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ సూచించారు. ఈ కార్యక్రమంలో చేనేత టై అండ్ డై అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోస్టల్ సూపరింటెండెంట్లు వెంకటసాయి, యెలమందయ్య తదితరులు పాల్గొన్నారు. -
Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య
సాక్షి, చౌటుప్పల్: ‘లైంగికదాడికి పాల్పడిన సమయంలో గిరిజన మహిళ నన్ను గుర్తించింది. విషయాన్ని భర్తతో పాటు నేను పనిచేస్తున్న తాపీమేస్త్రీలకు చెబుతానని హెచ్చరించడంతో భయపడి హత్య చేశా’ అని ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఈడిగి హరీష్‌గౌడ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం తన కార్యాలయంలో స్థానిక ఏసీపీ ఉదయ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడూరు మండలం మైలారం పరిధిలోని కర్రెన్నబండతండాకు చెందిన ముడావత్ క్రిషీనా అతడి భార్య లావణ్య(28) ఇటీవల ఉపాధి నిమిత్తం మల్కాపురానికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ గోడౌన్లో లావణ్య వాచ్‌మన్‌గా, సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 9న భర్త విధులకు వెళ్లగా భార్య గోడౌన్ వద్ద ఒంటరిగా ఉంది. ఐదురోజులుగా వ్యూహరచన దండుమల్కాపురం శివారులో మూతబడిన ఓ డెయిరీలో కొంత మంది తాపీ మేస్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీష్‌గౌడ్(25).. అంజనేయులు అనే మేస్త్రీ వద్ద కూలి పని చేస్తున్నాడు. ఈనెల 5న వారుంటున్న ప్రాంతంలో బోరు వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మూతబడిన గోడౌన్లో లావణ్య ఒంటరిగా ఉండడాన్ని నిందితుడు గమనించి వివరాలు తెలుసుకొని అప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నాడు. హరీష్‌గౌడ్.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి భర్త డ్యూటీకి వెళ్లగానే.. ముడావత్ క్రిషీనా సోమవారం డ్యూటీకి వెళ్లడాన్ని హరీష్‌గౌడ్ గమనించి సమయం కోసం వేచిచూశాడు. సాయంత్రం 4గంటలకు బాత్రూంకు వెళ్లిన లావణ్య వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తలపై కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతన్ని గుర్తించిన మృతురాలు విషయాన్ని భర్తతో పాటు ఇతరులకు చెబుతానంది. దీంతో నిందితుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. అనంతరం మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన భర్త చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (మాటేసి.. కాటేసి..) 24గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు లైంగికదాడి, హత్య ఘటనను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ఘటనాస్థలిలో లభించిన కాళ్ల చెప్పుల ఆధారంగానే నిందితుడిని అతడు నివసించే మూతబడిన డెయిరీలోని గదిలో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. అతడి వద్ద 2బంగారు పుస్తెలు, 2 వెండి పట్టీలు, 4 వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అభినందించారన్నారు. ఛేదించిన పోలీసులకు రివార్డు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో సీఐలు ఎన్.శ్రీనివాస్, ఏరుకొండ వెంకటయ్య, ఎస్సైలు బి.సైదులు, డి.అనిల్, డి.యాకన్న పాల్గొన్నారు. -
యాదాద్రిలో పార్కింగ్ చార్జీల బాదుడు
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రిలో ఆదివారం నుంచి కొత్త నిబంధన ప్రభుత్వం అమలు చేయనుంది. కొండపై వాహనం పార్క్ చేస్తే గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.వంద చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో తెలిపారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు వాహన రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం -
యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
యాదగిరిగుట్ట: ఓ భవనం బాల్కనీ కుప్పకూలడంతో నలుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు కలసి చదువుకున్న స్నేహితులు కాగా.. మరొకరు ఇంటి యజమాని. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లోని ఆంధ్రా బ్యాంక్ పక్కన గుండ్లపల్లి దశరథ గౌడ్ (70)కు రెండంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో సుంచు శ్రీనివాస్ (40) బట్టల దుకాణం, గిరి బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సుమారు 6.34గంటల సమయంలో దశరథ, గిరి, సుంచు శ్రీనివాస్ చల్ల గాలికి బయట కూర్చున్నారు. ఇదే సమయంలో శ్రీనివాస్ స్నేహితులు సుంగి ఉపేందర్ (40), తంగళపల్లి శ్రీనాథ్ (40) అక్కడికి వచ్చారు. అంతా సరదాగా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా భవనం మొదటి అంతస్తు బాల్కనీ కుప్పకూలి కిందకూర్చున్న వారిపై పడింది. దశరథగౌడ్, శ్రీనివాస్, శ్రీనాథ్, ఉపేందర్‌లు అక్కడికక్కడే మృతి చెం దగా.. గిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉలిక్కిపడిన ‘గుట్ట’వాసులు బాల్కనీ కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చిం ది. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలోనే కరెంట్ పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శిథి లాల కింద ఉన్న ఐదుగుర్నీ గమనించారు. అప్పటికే నలుగురు మరణించగా..తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిని అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానిక ప్రజలు జేసీబీ సహాయంతో గంటసేపు తీవ్రంగా శ్రమించారు. 35 ఏళ్ల కిందటి భవనం.. గుండ్లపల్లి దశరథకు చెందిన ఈ భవనం సుమారు 35 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఈ భవనానికి మొదట్లో బాల్కనీ లేదు. పదేళ్ల క్రితమే ఏర్పాటు చేయించి, దానిపై పూజ గదిని కూడా నిర్మించారు. అయితే పిల్లర్లు, బీమ్‌లు లేకుండా బాల్కనీ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయానికి 15 నిమిషాల ముందే దశరథ గౌడ్ భార్య కౌసల్య అక్కడనుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడే వస్తానంటూ వెళ్లానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కౌసల్య రోదిస్తూ తెలిపారు మరణంలోనూ కలిసే.. శ్రీనివాస్, ఉపేందర్, శ్రీనా«థ్లు కలిసి చదువుకున్నారు. స్థానికంగా ఉంటూ ఎప్పుడూ కలసిమెలసి ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చినా కలసి చర్చించుకునే వాళ్లని వారి తోటి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి పరిశీలించారు. సీఐ జానకిరెడ్డి, ఎస్సై సుధాకర్‌రావులు సహాయక చర్యలు పర్యవేక్షించారు. గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టలో భవనం బాల్కనీ కుప్పకూలడంపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తీవ్ర ఆందోళనకు గురుయ్యానని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుం బానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా లని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. v -
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఆలేరు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ 2021 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన 10 పోలీస్ స్టేషన్లలో ఆలేరు నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర హోం కార్యదర్శి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం ఆలేరు పోలీసులకు పంపించారు. గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్ కేటగిరీలో ఆలేరు పీఎస్ ఈ అవార్డుకు ఎంపికైంది. పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళల రక్షణకు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐ ఇద్రీస్ అలీతోపాటు సిబ్బందిని అభినందించింది. జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై రాచకొండ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
రామకృష్ణ పరువు హత్య! స్పందించిన భార్య భార్గవి
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదని తెలిపారు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే ప్రశ్నించారని తెలిపారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారని అన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని పేర్కొన్నారు. లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారని చెప్పారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారని అన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పుట్టింటితో సంబంధాలు లేవని పేర్కొంది. ‘మీరు చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు’ అని భార్గవి తెలిపారు. -
అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పనిచేస్తుండగా.. రామకృష్ణ హత్య కేసులో మరో హోంగార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లి ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. ఇటీవల రామకృష్ణ తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసకుంటున్నాడు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. భర్తతో గొడవలు.. న్యాయవాది ఆత్మహత్య ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి శనివారం ఉదయం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. -
బయో డీజిల్ పేరుతో ఇంధన దందా
సాక్షి, యాదాద్రి: బయో డీజిల్ పేరుతో సాగుతున్న కృత్రిమ డీజిల్ దందాను సోమవారం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు పారిశ్రామిక వాడ కేంద్రంగా కొంతమంది వ్యక్తులు గుజరాత్‌లోని ప్రైవేట్ రీఫైనరీల నుంచి ద్రవపదార్థాలను తీసుకొచ్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ డీజిల్ తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. పెట్రోల్ బంక్‌లలో లభించే డీజిల్ మాదిరిగానే ఈ కృత్రిమ డీజిల్‌తో వాహనాలు నడుస్తుండటంతో, వాహనాలకు మైలేజీ కూడా అధికంగా వస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ రేట్లు ఆకాశన్నంటుతుండటం, ఈ కృత్రిమ డీజిల్ లీటరు రూ.85 నుంచి రూ.90లకే లభిస్తుండటంతో ప్రైవేటు ట్రావెల్స్, భారీ వాహనాల వినియోగదారులు ఈ డీజిల్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, గుంటూరు, తిరుపతి తదితర పట్టణాలకు ఈ కృత్రిమ డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆయిల్ ట్యాంకర్లలో డీజీల్ తీసుకువచ్చి బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద గోదాంలో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడి నుంచి వాహనదారులకు, కొన్ని పెట్రోల్ బంక్‌లకు తమ వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొనుగోలు దారులను డీజిల్ అని నమ్మించేందుకు తెల్లని ద్రవ ప్రదార్థంలో పసుపు రంగు పౌడర్‌ను కలుపుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున రంగుప్యాకెట్లను సైతం నిల్వ ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు కొండమడుగు పారిశ్రామిక వాడలోని గోదాంపై సోమవారం దాడులు చేసి కృత్రిమ డీజిల్ ట్యాంకర్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేనేజర్ చిరాగ్‌పటేల్, ఈ డీజిల్‌ను కొనుగోలుచేస్తున్న సీఎంఆర్ ట్రావెల్స్ యజమాని, మరికొందరిపై కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నాం: ఎస్ఓటీ కృత్రిమ డీజిల్ ఘటనపై విచారణ జరుపుతున్నామని భువనగిరి జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ ఎ. రాములు తెలిపారు. డీజిల్ లాగానే ఉన్న ఈ ద్రవ పదార్థాన్ని నిర్ధారణ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
RRR First Gazette: రీజినల్ రింగ్ రోడ్డు తొలి గెజిట్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి తొలి గెజిట్ (3ఎ) విడుదలైంది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం 158.64కి.మీ.కు సంబంధించి కావాల్సిన భూసేకరణలో భాగంగా ఇటీవలే రాష్ట్రప్రభుత్వం ఎనిమిది మంది అధికారులతో అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సహా, చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేటల ఆర్డీఓలు ఈ అథారిటీ లో ఉన్నారు. అయితే ఏయే గ్రామాల నుంచి భూమిని సేకరిస్తారో తెలుపుతూ గెజిట్‌ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు గురువారం విడుదల చేశారు. మొత్తం 113గ్రామాల పేర్లను ఇందులో పొందుపరిచారు. ఈ ఉత్తర భాగానికి సంబంధించి రూపొందించిన తుది అలైన్‌మెంటు మ్యాపును విడుదల చేశారు. ఈ భాగంలో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఇతర రహదారులను రీజినల్ రింగురోడ్డు క్రాస్ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారీ ఇంటర్ ఛేంజర్లను నిర్మిస్తారు. మ్యాపులో వాటిని నిర్మించే ప్రాంతాలను కూడా సూచించారు. త్వరలో 3ఏ(క్యాపిటల్) గెజిట్ కూడా విడుదల కానుంది. ఇందులో సర్వే నెంబర్ల వివరాలను పొందుపరచనున్నారు. -
నేత్రదర్శనం.. యాదాద్రి దివ్యక్షేత్రం
యాదగిరి నరసింహుని దివ్యదర్శనం ఆరేళ్ల తర్వాత భక్తులకు లభించనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా రేపు పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది. యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా అత్యంత అపురూపంగా, అనన్యసామాన్యంగా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల (2.5 లక్షల టన్నులు) కృష్ణశిలను వినియోగించారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టడం విశేషం. విమాన గోపురాన్ని ద్రవిడ శిల్పకళారీతిలోను, అష్టభుజి మండపంలోని గోపురాలను పల్లవ శైలిలోను రూపొందించారు. కాకతీయ వైభవాన్ని తలపిస్తూ ముఖమంటపాలను కాకతీయ శైలిలో నిర్మించారు. పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. ఆలయ నిర్మాణం, శిల్పాల రూపకల్పనలో రఘునాథ పాత్రో, ముత్తయ్య స్థపతి, సౌందరరాజన్, డాక్టర్ ఆనందాచారి వేలు వంటి నిష్ణాతులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కృష్ణశిల ఏళ్లు గడిచేకొద్ది మరింత నునుపుదేలి, నాణ్యతను సంతరించుకుంటుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆలయ పునర్నిర్మాణం కోసం భారీస్థాయిలో కృష్ణశిల అవసరం కావడంతో రాష్ట్ర గనులశాఖ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి, నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజపల్లిలో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో, ఆలయ నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. రాళ్ల నాణ్యతను ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్’ సంస్థ, వాటితో చెక్కిన శిల్పాల నాణ్యతను ‘మెస్సెర్స్ సివిల్స్ ఇంజినీర్స్’ సంస్థలు పరిశీలించి, ధ్రువీకరించాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. శ్రీవైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను, రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు– ఇలా ఆలయంలోని ప్రతి నిర్మాణంలోనూ అణువణువునా విష్ణుతత్త్వం ప్రతిఫలించేలా రూపొందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేశంలోని అనేక శిల్పకళారీతులను స్వయంగా అధ్యయనం చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో అహరహం శ్రమించారు. గుట్టకు మరో గుట్ట జోడింపు ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి, మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి, మూడెకరాలను విస్తరించారు. మహాయజ్ఞంలా సాగిన ఈ ప్రక్రియకు ఏడాదిన్నర పట్టింది. కొండ కోసం తరలించిన మట్టి, రాళ్లు కూలిపోకుండా పటిష్ఠంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కొత్తగా విస్తరించిన కొండభాగం పటిష్ఠతను, నాణ్యతను జేఎన్టీయూ, ‘నిట్’ నిపుణులు పరీక్షించారు. చలికాలంలో, ఎండాకాలంలోనే కాకుండా భారీగా వర్షాలు కురిసినప్పుడు కొత్తగా జోడించిన కొండ ఎలా ఉంటుందనే దానిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు సీజన్లలో భారీ వర్షాలు పడినప్పటికీ, కొత్తగా జోడించిన కొండ ఏమాత్రం చెక్కుచెదరలేదు. భారీ వాహనాలు, క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపినా ఎలాంటి సమస్యలూ తలెత్తకపోవడంతో, కొన్ని వందల ఏళ్ల వరకు కొండ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు తేల్చారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ దాదాపు 2,400 డ్రాయింగ్లను పరిశీలించి, ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది. వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తుండగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా, వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 వీవీఐపీ కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. గానుగ సున్నంతోనే నిర్మాణం ఆధునిక నిర్మాణాల్లో రాళ్లు, ఇటుకలను జోడించి, వాటిని దృఢంగా నిలపడానికి సిమెంటు వాడటం మామూలే! అయితే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఈ గానుగ సున్నం మిశ్రమం నాణ్యతను బెంగళూరులోని ‘బ్యూరో వెర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పరీక్షించి, ధ్రువీకరించింది. పెద్దపెద్ద జాయింట్ల వద్ద కొన్నిచోట్ల సీసాన్ని కూడా వాడారు. ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. బెంగళూరుకు చెందిన ‘ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (ఐపీఐఆర్టీఐ) సంస్థ ఆధ్వర్యంలో కలప నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. కలప రకం, మందం, దారుఢ్యం, తేమను తట్టుకునే శక్తి వంటి లక్షణాలన్నింటినీ పరీక్షించి, ఉత్తమమైన కలపనే తలుపుల నిర్మాణం కోసం ఎంపిక చేశారు. యాదాద్రికి ఆనుకుని టెంపుల్ సిటీ ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. ఇక గుట్ట కింద తులసి కాటేజీలో అదనంగా 120 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా, ఇంకా ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, ఆస్పత్రి, పాఠశాల వంటి వాటిని కూడా నిర్మించనున్నారు. వీటి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొండపైన విష్ణుపుష్కరిణి, కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రతమండపం, ఆర్టీసీ, దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఐదువందల బస్సులు తిరిగేందుకు అనువుగా బస్ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ అనుసంధానిస్తూ ఆరులేన్ల రహదారిని నిర్మించారు. ఈ రహదారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలను పెంచడంతో, ఈ మార్గం పూలవనాన్ని తలపిస్తుంది. ఈ మార్గంలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన కూడళ్లలోనూ పూలమొక్కలను ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ చేయదలచుకున్న భక్తుల కోసం పన్నెండు అడుగుల వెడల్పుతో ప్రత్యేకమైన రోడ్డును నిర్మిస్తున్నారు. దాదాపు ఇరవైవేల మంది భక్తులు సులువుగా నడిచేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారుచేసిన అల్యూమినియం, ఇత్తడి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సప్తగోపురాలు యాదాద్రి ప్రధాన ఆలయానికి సప్తగోపురాలను సర్వాంగ సుందరంగా మలచారు. ద్వితీయ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు గోపురాలను, మూడు పంచతల గోపురాలను, ఒక సప్తతల మహారాజ గోపురాన్ని నిర్మించారు. పశ్చిమదిశలో మహారాజ గోపురాన్ని 85 అడుగుల ఎత్తున, ఒక్కో పంచతల గోపురాన్నీ 57 అడుగుల ఎత్తున, తూర్పు గోపురం నుంచి ముఖమండపానికి వెళ్లే దారిలో 30.8 అడుగుల ఎత్తున త్రితల గోపురాన్ని, గర్భాలయంపైన విమాన గోపురాన్ని నిర్మించారు. విమానగోపురానికి భక్తుల విరాళాలతో 125 కిలోల బంగారు తాపడం చేయిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే నాటికి భక్తుల నుంచి రూ.17.59 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం వచ్చింది. దర్శన మార్గం గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు పశ్చిమ గోపురం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. సరిగ్గా గర్భాలయంపైన విమాన గోపురం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి, గండభేరుండ నారసింహుడు దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం, గరుత్మంతుని విగ్రహం, స్వామివారి ఎదుట భారీ దర్పణం, గర్భగుడికి పక్కన ఆండాళ్ అమ్మవారు, శయన మండపం, మెట్ల వెంబడి గరుత్మంతుని విగ్రహాలు, ఆలయంలో వెలుగులు విరజిమ్మే షాండ్లియర్లు, రాజస్థానీ పద్మాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారి ప్రధాన ఆలయం రెండో అంతర ప్రాకారాల వద్ద నాలుగు వైపులా నాలుగు మండపాలను నిర్మించారు. ఆగ్నేయంలో స్వామివారి కైంకర్యాల కోసం ఏర్పాటు చేసిన రామానుజకూటం మండపం ఉంటుంది. ఈశాన్యంలో నిత్యకల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. రెండో బాహ్య ప్రాకారం వద్ద నాలుగు దిక్కుల్లో అష్టభుజి మండపాలను నిర్మించారు. స్వామివారి గర్భగుడి ఎదురుగా ఉండే ముఖమండపాన్ని 150 మందికిపైగా కూర్చునేందుకు అనువైన వేదికగా ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలోకి అడుగుపెడుతూనే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యేలా లోపలి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. గర్భగుడి గోడలపై స్వామివారి శంఖుచక్రనామాలు, పంచనారసింహ రూపాలు, ప్రహ్లాద చరిత్ర శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మూడు ఉపాలయాలు, శయన మండపం, బలిపీఠం, బంగారు తాపడంతో ధ్వజస్తంభం, దర్పణం భక్తులకు కనువిందు చేస్తాయి. చరిత్రలో యాదాద్రి చరిత్రను తరచి చూసుకుంటే, కాకతీయ రాజుల నుంచి నిజాం నవాబుల వరకు ఎందరో యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. కాకతీయులు పదమూడో శతాబ్దిలో ఒక ఆయుర్వేద వైద్యునికి ఈ స్థలాన్ని దానంగా ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్నా, అందుకు తగిన ఆధారాలు లేవు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం వద్ద లభించిన శాసనాల్లో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధి కోసం చేసిన పనులు వెలుగులోకి వచ్చాయి. పదిహేనో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయలు యాదాద్రిలో స్వామివారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దొరికిన ఆరువందల సంవత్సరాల నాటి శాసనాలను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరచారు. ఆకట్టుకునేలా ఆళ్వార్ల మండపం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లకు ప్రత్యేక స్థానం ఉంది. వైష్ణవ భక్తిమార్గ ప్రచారకులుగా, స్వామివారి ప్రియభక్తులుగా ప్రఖ్యాతి పొందిన పన్నెండుమంది ఆళ్వార్లను వైష్ణవభక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటారు. అందుకే యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మండపాన్ని ఆకట్టుకునే రీతిలో ఏర్పాటు చేశారు. ఆళ్వార్ల మండపానికిపైన కాకతీయుల స్తంభాలను నిర్మించారు. ఒక్కో ఆళ్వార్ విగ్రహం, ఒక్కో కాకతీయ స్తంభం ఎత్తు 32 అడుగులు ఉంటాయి. పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశైయాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పొణాళ్వార్, తొండరడిప్పొడియాళ్వార్, తిరుమంగయాళ్వార్, మధురకవి ఆళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్ విగ్రహాలను, తెలంగాణ శిల్పులు వెంకటకృష్ణ, పోతలూరు చారి, రాము తమ బృందంతో కలసి అద్భుతంగా తీర్చిదిద్దారు. పడమటి రాజగోపురం ముందుభాగంలో వేంచేపు మండపాన్ని నిర్మించారు. ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసేటప్పుడు స్వామివారిని భక్తుల సందర్శనార్థం ఇక్కడ కొద్దిసేపు అధిష్ఠింపజేస్తారు. తూర్పు రాజగోపురం ముందుభాగంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు మాత్రమే కాకుండా సహస్ర దీపాలంకరణ కోసం కూడా ఈ మండపాన్ని వినియోగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అరుదుగా అతికొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే అష్టభుజి ప్రాకార మండపాన్ని యాదాద్రిలోనూ నిర్మించారు. అష్టభుజి ప్రాకార మండపం పైభాగంలో సాలహారాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేశవమూర్తులు, నవ నారసింహులు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, అష్టలక్షు్మలు, దశావతారాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అష్టభుజి మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. వైకుంఠద్వారం యాదాద్రి ఆలయానికి మెట్లమార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉంటుంది ఈ వైకుంఠద్వారం. పూర్వం వాహన సౌకర్యం లేని కాలంలో ఆనాటి భక్తులు కొందరు కొండపైకి వెళ్లేందుకు వీలుగా రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి వెళ్లి, మొక్కులు తీర్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చాలాకాలం వరకు ఇక్కడ మెట్లు ఉన్నాయనే విషయమే జనాలకు తెలిసేది కాదు. రామదయాళ్ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితర భక్తులు 1947లో ఆస్థాన కమిటీగా ఏర్పడి, భక్తుల కోసం ఈ వైకుంఠద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లేందుకు 350 మెట్లు ఉండేవి. వీటికి ప్రతిరోజూ పసుపు కుంకుమలు పెట్టి భక్తులు పూజించేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వైటీడీఏ, ఆర్ అండ్ బీ అధికారులు 2019 నవంబరు 15న ఈ వైకుంఠద్వారాన్ని కూల్చివేసి, యాలీ పిల్లర్లపై భారీ వైకుంఠద్వారాన్ని కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం ఈ వైకుంఠద్వారం నుంచే భక్తులు మెట్లమార్గంలో స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఇదివరకు స్వామివారి పాదాల వద్ద ఉన్న మెట్లదారిని తొలగించిన అధికారులు, కొత్తగా నిర్మించిన వైకుంఠద్వారం నుంచే మెట్లదారిని ఏర్పాటు చేశారు. ప్రసాదం తయారీకి ఆధునిక యంత్రాలు ప్రసాదం తయారీ కోసం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. పెద్దసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రసాదం తయారీ కోసం ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు లక్ష లడ్డూలను, రెండువేల కిలోల పులిహోర తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘అక్షయపాత్ర’ సంస్థవారు ప్రసాదం తయారు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంవారే ప్రసాదం తయారు చేసేలా ‘అక్షయపాత్ర’ సంస్థవారు శిక్షణ ఇస్తున్నారు. బంగారు ధగధగలు యాదాద్రి ఆలయాన్ని స్వర్ణకాంతులతో ధగధగలాడేలా తీర్చిదిద్దారు. పంచనారసింహులు కొలువై ఉన్న గర్భాలయ ద్వారాలకు బంగారుతాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి సైతం ఇటీవల బంగారు తొడుగులు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల ద్వారాలకు వెండితొడుగులను బిగించనున్నారు. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ద్వారాలకు ఇత్తడి తొడుగులు వేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు బంగారు కలశాలను బిగించారు. అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలను బిగించారు. ఆలయంలో అమర్చిన బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. ఉగాది తర్వాత శివాలయం ఉద్ఘాటన యాదాద్రిని హరిహర క్షేత్రంగా చెబుతారు. కొండపైనే అనుబంధ ఆలయంగా కొలువై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రాకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంలోని మండపాల్లో నాలుగువైపులా కృష్ణశిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుని విగ్రహాన్ని కొలువుతీర్చారు. ఆలయానికి ఉత్తరాన స్వామివారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఉగాది తర్వాత జరగనున్న ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆలయ మండపాల్లోని ప్రాకారాల్లోని సాలహారాల్లో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శివుని అవతారాలు, భైరవులు, పార్వతి అమ్మవారి విగ్రహాలను నెలకొల్పారు. ముఖమండపంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, భైరవులతో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఈ శివాలయ ప్రాంగణంలో అన్నివైపులా భక్తులను ఆకట్టుకునే రీతిలో ఉపాలయాలను నిర్మించారు. నైరుతిలో ఏకతల విమానగోపురంతో గణపతి, వాయువ్యంలో ఏకతల విమాన గోపురంతో పర్వతవర్ధని అమ్మవారు, ఈశాన్యంలో ఆంజనేయస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యాగశాలలను నిర్మించారు. శివాలయానికి ఎదురుగా సుమారు 26 అడుగుల ఎత్తున ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భూపాలపల్లి అడవుల నుంచి ఎల్తైన నారవేప చెట్టు నుంచి సేకరించిన కలపదుంగను తీసుకువచ్చారు. యంబ నర్సింహులు, కల్లెం సంపత్‌కుమార్ ఫొటోలు: కొల్లోజు శివకుమార్ యాదాద్రి పరిసర క్షేత్రాలు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం శరవేగంగా అభివృద్ధి చెందనుంది. పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ఈ ప్రాంతంలోని పురాతన చారిత్రక కట్టడాలు, ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భువనగిరి మండలం వడాయిగూడెంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సకల దేవతల ఆలయాలకు నెలవుగా ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత సురేంద్రపురికే వెళుతుంటారు. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి బస్సు, ఆటో సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జట్కాబళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాదగిరిగుట్ట నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని బస్వాపూర్ గ్రామంలో కాళేశ్వరం జలాలతో సింహసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ బెంగళూరులోని బృందావన్ గార్డెన్ తరహా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరంలోని భువనగిరి కోటను కూడా తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా కోట పైకి రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి క్షేత్రానికి అతి సమీపంలోని వడాయిగూడెం, రాయగిరి రైల్వేస్టేషన్ సమీపంలోని గుట్టలను భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. రాయగిరి వద్ద ఆంజనేయ అభయారణ్యం, వడాయిగూడెం సమీపంలో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహ్లాదభరితమైన వాతావరణం కల్పించేందుకు ఇక్కడ వివిధ రూపాల్లో గొడుగులు, వంతెనలు ఏర్పాటు చేశారు. రాయగిరి చెరువుకట్టపై రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాయగిరి కమాన్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వరకు పూలమొక్కలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇక్కడ ఒకటిన్నర ఎకరాల స్థలంలో బోటింగ్ జరిపేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. పర్యాటకుల కోసం ఇక్కడ రెండు ఫుడ్‌కోర్ట్స్, ఆరు స్టాల్స్, ఒక చేనేత వస్త్రశాల ఏర్పాటు చేసేందుకు పనులు సాగిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఒడిశా నుంచి తెప్పించిన భారీ ఇసుకరాతి శిల్పాలను ఇక్కడకు తీసుకొచ్చారు. యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వర ఆలయం, మహాలక్ష్మీ వీరనారాయణస్వామి ఆలయాల పునరుద్ధరణ కోసం వైటీడీఏ ఇటీవల రూ.1.79 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఒక జైన ఆలయం, పద్దెనిమిది మఠాలు కూడా ఉన్నాయి. యాదాద్రికి 22 కిలోమీటర్ల దూరంలోని రాజపేట సంస్థానం కోట, మల్లాపురం, సైదాపురం, మైలార్గూడెంలలో మినీ ట్యాంక్‌బండ్‌లను అభివృద్ధి చేయనున్నారు. రేపు ఉ. 11.55 గంటలకు దర్శనం యాదాద్రి ఆలయంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి స్వయంభూ మూర్తుల దర్శనం మార్చి 28వ తేదీ ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణతో మొదలవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆలయ పునఃప్రారంభం కోసం మార్చి 21 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం, రాత్రి హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల తరహాలోనే ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతుల కోసం ఇప్పటికే తొలిదశ పనులు పూర్తయ్యాయి. భక్తుల కోసం మిషన్ భగీరథతో పాటు యాదాద్రి జలప్రసాదాన్ని తీసుకు వస్తున్నారు. గండిచెరువు వద్దనున్న దీక్షాపరుల మండపంలో తాత్కాలికంగా భక్తులకు అన్నప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. బాలాలయంలో మార్చి 28వ తేదీ నుంచి దర్శనాలను నిలిపివేసి, బాలాలయాన్ని తొలగించనున్నారు. ప్రస్తుతం బాలాలయం ఉన్న ప్రదేశంలో సంగీత మండపాన్ని ఏర్పాటు చేయనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి
సాక్షి, యాదాద్రి భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లాలోని దుర్గసానిపల్లి గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగల దాడి జరిగింది. షర్మిల, కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో షర్మిల సెక్యూరిటీ అప్రమత్తంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. -
కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగం: షర్మిల
మోటకొండూర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వ కుండా కాలయాపన చేయటంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూర్ మండలం ఆరెగూడెం, గిరిబోయినగూడెం మీదుగా పాదయాత్ర నిర్వహించిన షర్మిల.. మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకుని ఉద్యోగ దీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎంతో మంది నిరుద్యో గులు కేసీఆర్ పేరు రాసి చనిపోయారని కానీ, ముఖ్యమంత్రిలో చలనం రాకపోవటం దురదృ ష్టకరమన్నారు. చనిపోయిన నిరుద్యోగుల కుటుం బాలకు రూ.25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. -
యాదాద్రిలో అద్భుత ఘట్టం (ఫోటోలు)
-
కేసీఆర్ మాటలు నమ్మొద్దు
భువనగిరి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల పేరుతో మళ్లీ మీ ముందుకు వస్తారని, ఆయన గారడీ మాటలను ప్రజలు నమ్మవద్దని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ‘మాటా ముచ్చట’కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు పథకం’తప్ప మరే ఇతర పథకాలు ప్రవేశపెట్టలేదని, ఎకరానికి రూ.5 వేలు ఇస్తూ రూ.25 వేలు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మూగబోయాయని, అందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించినట్లు తెలిపారు. నిరుద్యోగులు తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయం
మోత్కూరు: బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరగా వారికి ప్రవీణ్‌కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ముశిపట్ల గ్రామానికి యాత్ర చేరింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా పని చేస్తున్న తనకు మీ మద్దతు అందించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ బల్గూరి స్నేహ, మండల నాయకులు ప్రతాప్, బుశిపాక నాగరాజు, నవీన్, సురేశ్, ఉదయ్‌కిరణ్, అశోక్, భిక్షం, రాములు, బండి నరేశ్, అరుణ్, మల్లయ్య పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటాం
భూదాన్‌పోచంపల్లి: ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తామని, అప్పుడు చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని వంకమామిడి, దంతూర్, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి వరకు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో షర్మిల మాట్లాడారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ చేశారని, నూలుపై సబ్సిడీ, నేతన్నలకు బీమా అందించారని గుర్తు చేశారు. నేడు నూలు ధరలు పెరిగి, గిట్టుబాటు లేక అప్పుల బాధతో 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని అధికార పార్టీ నాయకులు కనీసం పరామర్శించలేదని, ఎక్స్‌గ్రేషియా చెల్లించిన పాపాన పోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పులు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆదుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని ఏలబోతాడంటా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, సబ్సిడీ రుణాలు, మగ్గానికి ఉచిత కరెంట్, సబ్సిడీపై నూలు, రంగులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రాం కోర్డినేటర్ రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కన్వీనర్ నీలం రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన పోవాలి: షర్మిల
భువనగిరి: తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ నియంత పాలన పోవాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే గెలిచిన వారు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని, ఇది రాజకీయ వ్యభిచారమేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గోకారం, వర్కట్‌పల్లి, సంగెం గ్రామాల్లో కొనసాగింది. గోకారం గ్రామం వరకు 300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన మాటముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఎరువులకు సబ్సిడీతోపాటు పంట నష్టపరిహారమూ ఇవ్వడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన కొనసాగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకురావడం కోసమే తాను పార్టీని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజలు అవకాశం ఇస్తే నమ్మకంగా పనిచేస్తామని, ప్రతీ మహిళకు ఇల్లు ఇచ్చి వారి పేరు మీదనే ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, పార్టీ జీఎంహెచ్‌సీ కోఆర్డినేటర్ రాజగోపాల్, జిల్లా కోఆర్డినేటర్ మహమ్మద్ అతహర్ పాల్గొన్నారు. -
దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యం
మోత్కూరు/కొడకండ్ల/దేవరుప్పల: తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమే బీఎస్పీ లక్ష్యమని, ఇందుకు ప్రజలంతా తమతో కలిసి రావాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని అంబేద్కర్, పూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రవీణ్‌కుమార్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాష్ట్రంలో మార్చి 6న ఖిలాషాపూర్‌లో ప్రారంభమైన యాత్రను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. కాగా, అంతకుముందు బహుజన రాజ్యాధికార యాత్ర 11వ రోజులో భాగంగా జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దేవరుప్పల మండలం కడివెండిలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ రాజ్యాధికార యాత్ర ర్యాలీలు, కార్యక్రమాలకు ప్రజలు హాజరుకాకుండా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని, దళితబంధు రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమది ప్రజలకు అండగా నిల్చే పార్టీ అని, రాబోయే 289 రోజుల యాత్రనూ ఇదే తరహాలో ఆదరించాలని కోరారు. దొడ్డి కొమురయ్య కలలు సాకారం చేయాలంటే బడుగుల రాజ్యాధికారం అనివార్యమన్నారు. -
ఇంకా లక్ష ఖాళీలు ఏమైనట్లు?
వలిగొండ: రాష్ట్రంలో మొత్తం లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే.. 80 వేలు మాత్రమే భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారని, మిగిలిన లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వెంటనే 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి వద్ద నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. దీక్షానంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ పాలనలో మూడు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని, 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలను సృష్టించారని, పేదలకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించారని ఆమె చెప్పారు. -
సర్వోదయ పాదయాత్ర మొదలు
సాక్షి, హైదరాబాద్/భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలో సోమవారం నుంచి ‘సర్వోదయ పాదయాత్ర’ మొదలు కాబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని వార్దా వరకు 600 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించ నున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం వెల్లడించారు. శనివారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆదివారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ పాల్గొంటారని చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం, 75 ఏళ్ల భూదా నోద్యమ స్ఫూర్తిని ప్రజలకు మరోసారి చాటిచెప్పడమే యాత్ర ఉద్దేశమ న్నారు. పాదయాత్రలో వివిధ రాష్ట్రాల సర్వోదయ మండలికి చెందిన 25 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. యాత్ర కన్వీనర్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అసమాన తలు పోగొట్టడానికి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి పేదవారికి భూమి ఇచ్చామన్నారు. కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారికిచ్చిన భూమిని లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. కాగా, రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ చైర్మన్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో పాదయాత్ర జరగనుంది. రాష్ట్రంలో 26 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో యాత్ర కొనసాగు తున్న సమ యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓ రోజు పాల్గొననున్నారు. -
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అద్భుతం
బీబీనగర్: తెలంగాణలో వైద్య సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వైద్యసేవలను విస్తృతపర్చడం, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ కళాశాలలో శనివారం 2021–22 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు నిర్వహించిన వైట్‌కోట్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వైద్యరంగంపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, వైద్య వృత్తి కష్టతరమైనదైనా, దాని ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశముందని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో వైద్యులు మమేకం కావాలని సూచించారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడా.. తాను గైనకాలజిస్టుగా సేవలు అందించానని, 800కు పైగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి డెలివరీలు చేసి చిన్నారులను కాపాడానని గవర్నర్ తన అనుభవాలను చెప్పారు. ఇప్పుడు శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా వైద్యులు గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధాని ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, జనఔషధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీబీనగర్‌లోని ఎయిమ్స్ తెలంగాణకే గర్వకారణమని, రెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందని తమిళిసై అన్నారు. అనంతరం గవర్నర్ విద్యార్థులకు స్వయంగా వైట్‌కోట్ వేసి అభినందించారు. -
ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, యాదాద్రి: ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైవేపై పనిచేసే దినసరి కూలీలుగా గుర్తించారు. అంకర్ల లక్ష్మి, ఊరేళ్ల శ్యామ్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. అంకర్ల కవిత, ఊరేళ్ల లావణ్య తీవ్రంగా గాయపడటంతో ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు. -
తెలంగాణ హుజూరాబాద్ అయితది
సంస్థాన్ నారాయణపురం: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఫలితం వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ సర్వే చేయిస్తే.. రాజగోపాల్‌రెడ్డికి ప్రజల్లో మంచి పేరుందని తేలిందని, అందుకే మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతున్నాడన్నారు. రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకునిరా.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇప్పించు.. పింఛన్లు లేని వారి ఫింఛన్లు ఇప్పించు.. రేషన్ కార్డులు ఇవ్వు అని ఆయన మంత్రిని డిమాండ్ చేశారు. అవి నెరవేరిస్తే మంత్రిని గౌరవిస్తాం,. సన్మానం చేస్తామన్నారు. అభివృద్ధికి రూపాయి తీసుకురాకున్నా.. కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రి రావాలా? అని ఆయన ప్రశ్నించారు. -
భారతీయుల తరలింపులో విఫలం
యాదగిరిగుట్ట: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో మోదీ సర్కారు విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధం జరగనుందని ముందే గ్రహించిన అమెరికా, యూరప్ దేశాలు తమ పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా వెనక్కి రావాలని 10 రోజుల ముందే సూచించాయని, కానీ, మోదీ మాత్రం అలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ మనసంతా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఉందే తప్పా, ఉక్రెయిన్‌లోని 18 వేల మంది భారతీయ విద్యార్థుల బాధ, భవిష్యత్తుపై లేదని ఎద్దేవా చేశారు. -
మేమూ వచ్చేస్తున్నాం..
యాదగిరిగుట్ట: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు విద్యార్థులు.. రైలులో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గంజి భానుప్రసాద్, ముడుంబై శేషఫణిచంద్ర ఉక్రెయిన్‌లోని జప్రోజియా స్టేట్ మెడికల్ వర్సిటీలో వైద్యవిద్యనభ్యసిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన వీరిద్దరు.. తాము 1,200 కిలోమీటర్ల దూరంలోని సరిహద్దుకు రైలులో బయల్దేరామని, అక్కడ చేరుకోవడానికి 18 గంటలకుపైగా సమయం పడుతుందని, తమతో పాటు పలువురు అదే రైలులో ప్రయాణిస్తున్నట్టు సోమవారం తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పారు. సరిహద్దుకు చేరుకోగానే సమీపంలోని విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు చేరుకుంటామని వివరించారు. -
వలకు చిక్కిన భారీ చేపలు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చెరువులో మత్స్యకారుల వలలో భారీ చేపలు చిక్కాయి. మినీ ట్యాంకుబండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నాలుగైదు రోజులుగా చెరువు నుంచి దిగువకు తూముల ద్వారా నీటిని ఖాళీ చేస్తున్నారు. కొన్నేళ్లుగా చెరువులో చేపలు పెంచుతున్న మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. సోమవారం వలలో 30 నుంచి 25 కిలోల చేపలు 30 వరకు వలకు చిక్కాయి. ఇంత పెద్ద చేపలను గతంలో ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం) -
నేను చచ్చినా సరే ఆ సంస్కరణలు అమలు కానివ్వం: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి: మోదీ ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఈ మేరకు రాయగిరిలోని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీని తరిమి తరిమి కొట్టాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్నినాశనం చేసిందని, మోదీ ప్రభుత్వం ఏ రంగానికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు. పిచ్చి ముదురుతోంది ‘సంగతి చూస్తాం అంటున్నారు.. ఏం చూస్తారు కేసీఆర్ సంగతి. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది. మోదీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చాయి. ఏడాదిపాటు రైతుల్ని ఏడిపించారు. రైతుల్ని అవమానించారు. గుర్రాలతో తొక్కించారు. చివరకు రైతుల మీద కార్లు కూడా ఎక్కించారు. నేను చచ్చినా సరే తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు కానివ్వం. తెలంగాణకు ఎందుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మతతత్వం బీజేపీ ఉంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా. సిగ్గుపడాలి నరేంద్రమోదీ. కర్ణాటకలో మత పిచ్చి లేపారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డల మీద, విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల మధ్య మత కలహం పెడుతోంది బీజేపీ. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా. మోదీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం నిజం కాదా. ఏ రంగానికి మేలు చేసింది బీజేపీ ప్రభుత్వం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. చదవండి: Hyderabad: స్వచ్ఛ సాగర్‌గా హుస్సేన్‌సాగర్ అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలి రాహుల్‌ను ఉద్ధేశించి.. నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ‘అస్సాం బీజేపీ సీఎం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఇదా మన సంప్రదాయం. మోదీ, నడ్డా చెప్పాలి. హిందూ ధర్మం ఇదే చెబుతోందా. మోదీజీ ఇదేనా నీ సంస్కారం, ఇదేనా నీ భాష. అస్సాం సీఎం ఇలా దిగజారి మాట్లాడవచ్చా.. అహంకారమా.. కళ్లు నెత్తికెక్కాయా. అస్సాం సీఎంను మోదీ బర్తరఫ్ చేయాలి.’ అని డిమాండ్ చేశారు. -
వంద కిలోల గంజాయి పట్టివేత
చౌటుప్పల్: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి వంద కిలోల గంజాయితో పాటు పది లీటర్ల హాష్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని ఏసీపీ కా ర్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. కేరళలోని కుంజితూర్కు చెందిన ఫైజ ల్ కొన్నేళ్లుగా గంజాయి రవాణా వ్యాపారం చేస్తున్నాడు. అందులో భాగంగా కర్ణాటకలోని మంగళూర్ జిల్లాకు చెందిన కారు డ్రైవర్ హస్సైనర్, ముంబై లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అన్సార్, కబీర్, ఉప్పాల గ్రామానికి చెం దిన ఎస్కె.అబ్దుల్లా, మంగళూర్‌కు చెందిన నౌషద్, బెంగళూరుకు చెందిన మూర్తి ముఠాగా ఏర్పడ్డారు. లంబసింగి నుంచి కేరళకు.. ఈ ముఠా సభ్యులు గంజాయితో పాటు ద్వాని ద్వారా తయారయ్యే హాష్ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లంబసింగి ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకును రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల మీదుగా కేరళకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లంబసింగిలో కొనుగోలు చేసిన గంజాయి, హాష్ ఆయిల్‌ను ఓ కారులో రహస్య ప్రాంతంలో నిల్వ చేస్తారు. పోలీసుల తనిఖీల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేకంగా పైలెట్‌గా ఇన్నోవా వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని గంజాయితో వస్తున్న వాహనంలోని వ్యక్తులకు చేరవేస్తుంటారు. పక్కా సమాచారంతో.. గంజాయి రవాణాకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు శనివారం సాయంత్రం చౌటుప్పల్ పోలీ సులు రంగంలోకి దిగారు. మండలంలోని రెడ్డిబావి గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరుకుతో వచ్చిన స్విఫ్ట్ కారును పట్టుకుని, కారు డ్రైవర్ హస్సైనర్, అన్సార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కారులో ఒక్కక్కటి రెండు కిలోల బరువు కలిగిన 50 గంజాయి ప్యాకెట్లు, దాని ద్వారా ఉత్పత్తి చేసిన 10 లీటర్ల హాష్ ఆయిల్ లభించింది. వీటి తో పాటు రూ.4 లక్షల విలువైన కారు, రూ.50 వేల విలువైన 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీటి విలువ 46.50 లక్షలుగా పోలీసులు నిర్ణయించారు. అన్నింటినీ సీజ్ చేశారు. -
ఢిల్లీలో బిలియన్‌మార్చ్ చెయ్..
యాదగిరిగుట్ట: కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేస్తే తామూ వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో 7 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని బండి సంజయ్ ఒప్పుకున్నందుకు సంతోషమని, కానీ.. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్, ఆర్మీలో 2 లక్షలు, బ్యాంకింగ్‌లో 50 వేలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 2 లక్షల ఖాళీలు ఉన్నాయని, ఇవన్నీ కలిపితే 15లక్షలు అవుతాయని, వీటిని కేంద్రం ఎప్పుడు భర్తీ చేస్తుం దో చెప్పాలన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన ఆలేరు నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా కార్యకర్తల సమావే శంలో మంత్రి మాట్లాడారు. అంబేడ్కర్‌పై సీఎం కేసీఆర్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిం టోంది.. దానికి న్యాయం చేయాలని మాత్రమే అడిగారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో చిన్న మార్పు తెస్తేనే ఎస్సీలకు విద్య, ఉద్యోగంలో 15 శాతం నుంచి 19 శాతం రిజర్వేషన్ దొరుకుతుం దని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ వస్తుందని సీఎం కేసీఆర్ అంటే అది తప్పెలా అవుతుందన్నా రు. తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందనే వి షయాన్ని సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రచారం చేయాలన్నారు. మన రాష్ట్రం పేద ప్రజలకు మంచి వైద్యం అందిస్తోందని దేశంలోనే టాప్ 3లో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తెలిపిందని, అదే ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యోగి ప్రాతి నిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రజారోగ్యం విష యంలో చిట్ట చివరి రాష్ట్రంగా ఉందని తెలిపారు. యాదాద్రికి కిలో బంగారం.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న హరీశ్‌రావు దంపతులు ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం సిద్దిపేట నియోజ కవర్గం తరఫున కిలో బంగారం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి తదితరులున్నారు. -
కలెక్టర్ కారుకు అడ్డుపడి.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
సాక్షి, యాదాద్రి: తమ భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ రైతు కొడుకు కలెక్టర్ కారుకు అడ్డు వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వివాదంలో 3.17 ఎకరాలు యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన రైతు బొడిగె ఉప్పలయ్యకు చెందిన 3.17 ఎకరాల భూమి వివాదంలో ఉంది. 2016 నుంచి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా కాలేదు. దీంతో గత నవంబర్‌లో ఉప్పలయ్య కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చేశాడు. అతని కొడుకు మహేశ్ డిసెంబర్లో పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కలెక్టర్ చాంబర్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడున్నవాళ్లు అడ్డుకొని అతనితో మాట్లాడారు. సమస్య పరిష్కారం తమ చేతిలో లేదని, సివిల్ కోర్టులో జరుగుతుందని అధికారులు చెప్పారు. తాను సివిల్ కోర్టుకు వెళ్లనని, అధికారులే పరిష్కరించాలంటూ తాజాగా బుధవారం గణతంత్ర వేడుకలు జరుగుతున్న కలెక్టరేట్ వద్దకు మహేశ్ వచ్చాడు. కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న కలెక్టర్ పమేలా సత్పతి కారుకు అడ్డంగా పోయి ఒంటిపై పెట్రోల్ పోసుకోబోయాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది అతడిని పట్టుకుని పెట్రోల్ డబ్బాను లాగేశారు. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలి ఉప్పలయ్యకు సంబంధించి 3.17 ఎకరాల భూమి రికార్డులోకి రావాలి. కొత్త చట్టం ప్రకారం, ట్రిబ్యునల్‌లో తీర్పు ప్రకారం ఉప్పలయ్య సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులో రెవెన్యూ పరంగా ఏం చేయలేం. అవసరమైతే లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తాం. ఇలా బ్లాక్మెయిల్ చేయడం సరికాదు. పెట్రోల్ డబ్బాతో వచ్చి తరచూ అధికారులను బెదిరిస్తున్నాడు. – డి. శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి -
సాయుధ పోరాట యోధుడు నర్సింహులు కన్నుమూత
సాక్షి, యాదాద్రి/అంబర్‌పేట: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎం ఎల్) జనశక్తి నేత, ప్రజా విమోచన సంపాదకుడు బండ్రు నర్సింహులు (104) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 21న డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీ లోని కుమారుడు ప్రభాకర్ నివాసంలో ఉం టున్నారు. శనివారం బండ్రు నర్సింహులు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ప్రభాకర్, భాస్కర్, కుమార్తెలు విమలక్క (అరుణోదయ, విప్లవ గాయకురాలు), జయమ్మ ఉన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు దానం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్‌రెడ్డి, వామపక్ష నేతలు గోవర్ధన్, ఎన్.శ్రీనివాస్, పరశురామ్, డీడీ కాలనీకి వచ్చి బండ్రు నర్సింహులు మృతదేహానికి నివాళులర్పించారు. ఆలేరులో నక్సల్ ఉద్యమానికి శ్రీకారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెంది న కొమురవ్వ, బుచ్చి రాములు దంపతు లకు జన్మించిన బండ్రు నర్సింహులు ఆలేరు ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమానికి పురుడు పోశాడు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మీద పడి నర్సింహులు ఆలేరులో కొంతకాలం హమాలీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆంధ్ర మహాసభ ద్వారా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళ కమాండర్‌గా పోరాటం నడుపుతూ రాయగిరి వద్ద అరెస్టయ్యారు. జనగామ మిలటరీ క్యాంపు, నల్లగొండ జైలులో చిత్రహింసలు అనుభవించారు. 1964లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్, మీసా చట్టం కింద అరెస్ట్ అయి పన్నెండేళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత సీపీఐ (ఎంఎల్) పార్టీలో చేరి తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో పనిచేశారు. అనంతరం చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో.. అనంతరం జనశక్తి పార్టీ రాజన్న వర్గంలో పనిచేశారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో అరెస్ట్ 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా సికింద్రాబాద్ కుట్ర కేసు నమోదు చేశారు. ఇందులో బండ్రు నర్సింహులు తదితరులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సికింద్రాబాద్ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు సేకరించలేదని సెషన్స్ కోర్టు అభిప్రాయపడుతూ 1989 ఫిబ్రవరి 27న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 2015లో నూరేళ్ల పండుగ బండ్రు నర్సింహులు ‘నూరేళ్ళ సభ–నూటొక్క పాట’కార్యక్రమం 2015 అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో జరిగింది. అప్పుడే నర్సింహులు 100వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాగా, నర్సింహులు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. -
హోమియోలో మందు ఉంది
సాక్షి, యాదాద్రి: నల్లతామర పురుగు, నల్లపేను వంటి తెగుళ్లతో నష్టపోతున్న మిర్చి రైతులు పంటకు హోమియోపతి మందులు పిచికారీ చేస్తే తెగుళ్లకు చెక్ పెట్టవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం యజమాని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 19 రకాలకు పైగా తెగుళ్లు సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రైతులు మిర్చికి సోకుతున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించి పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, కర్ణాటకలోని రాయచూర్, గుల్బర్గా, అలాగే ఒడిశాలోని పలు జిల్లాల్లో మిరప పంటకు తెగుళ్లు సోకి రైతులు భారీగా నష్టపోతున్నారు. హోమియోపతి మందులతో.. మనుషులు వివిధ రోగాలకు వాడే హోమియోపతి మందులను ప్రత్యామ్నాయంగా మిర్చిపంట తెగుళ్లకు వాడుకుంటుంటే ఫలితం ఉంటుందని బాల్‌రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ.10 వేల ఖర్చు అవుతుందన్నారు. నాట్లు వేసే సమయంలోనే గుర్తించాలి కానీ, ఆలస్యం అయిందన్నారు. ఇప్పటికైనా రైతులు హోమియో మందులను వాడితే నష్టాల నుంచి బయటపడవచ్చని సూచించారు. ముఖ్యంగా తామర పురుగు నివారణకు అర్నేరియాడయోడెమా 30, తూజా 30 హోమియో మందులను పిచికారీ చేయాలని, 20 లీటర్ల నీటిలో 2.5 మి.లీటర్లు పోసి పిచికారీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండోనేíసియా నుంచి నల్లపేను.. ఇండోనేసియా నుంచి వచ్చిందని చెబుతున్న నల్లపేను తెగులు మిరప పంటపొలాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిరప రైతులు తక్కువ ఖర్చుతో లభించే హోమియోపతి మందులను వాడితే ప్రయోజనం ఉంటుందని జిట్టా బాల్‌రెడ్డి తెలిపారు. వరంగల్, గుంటూరు, కృష్ణా, రాయచూర్ జిల్లాల్లో తాను సూచించిన హోమియో పతి మందులను వాడి రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వెల్లడించారు. -
'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్ గ్రామంతో పాటు మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఈసీఐఎల్ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్‌కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్ స్కూల్‌కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్ఐ వెంకన్నతో పాటు షీ టీమ్ బృందం ఎస్ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ పరిసరాలలో పెట్రోలింగ్ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేయాలని విద్యార్థినులకు సూచించారు. -
ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు
సాక్షి, యాదాద్రి: ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు, నాయకులు చేసే ఆర్భాటం, హడావుడి అంతాఇంతాకాదు, హామీల మీద హామీలు ఇస్తుంటారు. వాటిని వెంటనే నెరవేరుస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత అతీగతీ ఉండదనడానికి హాజీపూర్ ఉదంతమే చక్కని ఉదాహరణ. 2019లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వెలుగు చూసిన బాలికలపై అత్యాచారం, హత్యల నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. హాజీపూర్ నుంచి బాలికలు ప్రతిరోజూ కాలినడకన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి ట్రాప్ చేసి, ముగ్గురు బాలికలపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2019 ఏప్రిల్ 26న వెలుగు చూసింది. నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారుణ సంఘటన అనంతరం హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం, గ్రామం పక్కన గల శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు అప్పట్లో హామీలు ఇచ్చారు. ఇంతవరకు అవి అమలైన దాఖలా లేదు. ప్రస్తుతం హాజీపూర్ నుంచి 16 మంది బాలికలు ప్రస్తుతం కాలినడకన బొమ్మలరామారం మోడల్ స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు కాలినడకన బయలుదేరి 9.30 వరకు పాఠశాలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి బయలుదేరి 6 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే కొందరు ఆకతాయిలు అప్పుడప్పుడు వేధిస్తున్నారు. ఆ విద్యార్థినుల బాధలేమిటో వారి మాటల్లో.. ఆకతాయిలతో ఇబ్బంది స్కూల్ నుంచి ఇంటికి కాలినడకన వెళ్లే సమయంలో కొందరు యువకులు బైక్‌లపై వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మాకు తాకేలా దగ్గర నుంచి వేగంగా వెళ్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. వెకిలిచేష్టలు చేస్తున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. – గొండ్రు అర్చన, 6 వ తరగతి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నాం ఆ ముగ్గురు బాలికలను చంపిన బావులకు సమీపంగా నడిచేటప్పుడు భయం వేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మాకు రవాణా సౌకర్యాలు కల్పించాలి. గ్రామం నుంచి మా బడి వరకు బస్సు నడపాలి. – సిరిమిల్ల శ్వేత, ఇంటర్ సెకండ్ ఇయర్ 3 గంటలు నడుస్తున్నాం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పాఠ శాలకు గంటన్నర సమయంలో చేరుకుంటున్నాం. పుస్తకాలు, నోట్‌పుస్తకాల బరువుతో బ్యాగ్ మోయలేకపోతున్నాం. రోజూ మూడు గంటల సమయం కాలినడకకే సరిపోతుంది. – ధీరావత్ సరిత, ఇంటర్ సెకండియర్ -
ధరణిలో ఇబ్బందాయె రైతు‘బందాయె’!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక రెవెన్యూ పరిధిలో ఉన్న 972 సర్వే నంబర్లో 14.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఏడెకరాల వరకు భూమిని ప్రభుత్వం ముగ్గురు పేదలకు అసైన్ చేసింది. వీరికి పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. ఇందులో ఒకరి పాస్ పుస్తకానికి సంబంధించి డిజిటల్ సంతకం పెండింగ్ అని ధరణి పోర్టల్‌లో చూపిస్తోంది. భూమి రకం కూడా తప్పుగా నమోదయింది. ఇప్పుడు వాటిని సరిచేసుకునేందుకు ధరణిలో ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గత యాసంగి నుంచి ఆ రైతుకు సంబంధించిన 3.10 ఎకరాల భూమికి రైతుబంధు కూడా రావడం లేదు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఏం చేయాలో ఆ రైతుకు పాలుపోవడం లేదు. మెజార్టీ రైతులది ఇదే పరిస్థితి: రాష్ట్రంలోని దాదాపు 14 లక్షల మంది అసైన్డ్ భూముల లబ్ధిదారుల్లో (అసైనీలు) మెజార్టీ రైతులు ధరణిపోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఈ భూముల్లో కొన్నింటిని నిషే ధిత జాబితాలో చూపెట్టడంతో కనీసం వాటిపై ఇతర లావాదేవీలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అసైనీలు చనిపోతే పౌతీ చేసే (భూమిని వారసుల పేరిట మార్చుకో వడం) ఆప్షన్ కూడా లేదు. ఈ భూముల నమోదులో తప్పులు జరిగితే సవరించే అవకా శం లేదు. దీంతో ఆ పేద రైతులకు రైతుబంధు రావడం లేదు. రికార్డులు సరిచేసుకునేందుకు, పేర్లు మార్చుకునేందుకు ఆప్షన్ లేకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోతోంది. క్రమబద్ధీకరణ ఊసేది?: ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మాట అటుంచితే ఈ భూముల విషయంలో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. అసైన్డ్ చట్టానికి సవరణలు చేసి ఈ భూములపై అసైనీలకు సర్వహక్కులు కల్పించే దిశలో అన్ని వివరాలు సేకరించింది. జిల్లాల వారీగా అసైన్డ్ భూములెన్ని ఉన్నాయి? అవి అసైనీల చేతుల్లో ఉన్నాయా లేవా? అసైనీల సామాజిక, ఆర్థిక హోదా ఏంటి? అసైన్డ్ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయిన నేపథ్యంలో థర్డ్ పార్టీల సామాజిక హోదా ఏంటి? అనే వివరాలను సేకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అసైన్ చేసిన భూములు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఈ భూములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 లక్షల మందికి పైగా అసైనీలు కోరుతున్నారు. నామమాత్రపు ధరకు ఈ భూములను క్రమబద్ధీకరిస్తే అటు పేద రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని, మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని వారంటున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెబుతున్నా ఇప్పటివరకు తీసుకోలేదు. నా పేరిట మార్చుకోలేకపోతున్నా అందె గ్రామంలో నలభై ఏండ్ల క్రితం మా తాత తండ్రుల పేరున 258 సర్వే నంబర్లో రెండెకరాల సర్కారు భూమి ఇచ్చారు. గత ఇరవై ఏళ్లుగా నేను ఆ భూమిని సాగు చేస్తున్నాను. ఆ భూమిని పౌతీ కింద నా పేరిట మార్చుకుందామంటే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతు బంధు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. – సూకూరి బాలరాజు, రైతు, అందె, మిరుదొడ్డి మండలం -
యాదాద్రి: మార్చి 28 నుంచి స్వామి దర్శనం
సాక్షి, యాదాద్రి: యాదాద్రీశుడి స్వయంభూల దర్శన భాగ్యం భక్తులకు త్వరలో కలగనుంది. ప్రధానాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేస్తున్న సంగతి విదితమే. భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మహాకుంభ సంప్రోక్షణ మార్చి 28న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. శ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి నిర్ణయించిన దివ్యముహూర్తం మేరకు ముందస్తు పనులు ప్రారంభించారు. ప్రధానాలయంలో గర్భాలయ తలుపుల బంగారు తాపడం పనులు పూర్తికాగా ధ్వజ స్తంభం బంగారు తాపడం పనులు కొనసాగుతున్నాయి. దివ్యవిమానానికి భక్తుల నుంచి బంగారం సేకరణ ముమ్మరంగా సాగుతోంది. గోపురాలపై కలశాల ఏర్పాటు ఉద్ఘాటన సందర్భంగా 1,000 యజ్ఞ కుండాలతో శ్రీమహాసుదర్శన యాగం చేపట్టనున్నారు. కృష్ణ శిలలతో నిర్మితమైన ప్రధానాలయ సప్తగోపురాలపై కలశాల ఏర్పాటుకు ముందస్తు పనులు ప్రారంభం అయ్యా యి. ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు మార్చి 21 నుంచి 28 వరకు మహాసుదర్శన యాగం నిర్వ హించనున్నారు. అలాగే దివ్యవిమానానికి బంగారు తాపడంతో పాటు బంగారు కలశాలను ఏర్పాటు చే యనున్నారు. మిగతా 6 గోపురాలకు ఇత్తడి కవచా లు, పంచలోహ కలశాలు ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి నుంచి ముచ్చింతల్‌కు తాటి కమ్మలు.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్మించిన జీయర్ కుటీరంలో 208 అడుగుల శ్రీశ్రీ రామా నుజ జీయర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జీయర్ స్వామి ఆధ్వర్యంలో 1,000 కుండాలతో సుదర్శన మహా యాగం చేపట్టనున్నారు. ఇందుకోసం తాటి కమ్మలతో యాగశాలను నిర్మించనున్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ తాటి కమ్మలు తరలిస్తున్నారు. అక్కడ యాగం పూర్తి కాగానే, ఆ తరహాలోనే యాదాద్రిలో శ్రీ సుదర్శన యాగం ప్రారంభం కానుంది. యాగశాలకు అప్పుడు కూడా తాటి కమ్మలనే వాడనున్నారు. తిరుమల తరహా భద్రత యాదాద్రి పుణ్య క్షేత్రం భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ ఇటీవల తిరుమలను సందర్శించి, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీనిప్రకారం కమాండ్ కంట్రోల్ ద్వారా భద్రతను పరిశీలించనున్నారు. మొత్తం 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. కొండపై చక చకా పనులు ఉద్ఘాటన గడువు దగ్గర పడుతుండడంతో కొండపై పనులు చక చకా సాగుతున్నాయి. ప్రధానంగా 16 ప్లాట్‌ఫాంలతో బస్బే, ఆర్చి నిర్మాణం, ఫ్లైఓవర్ల పనుల్లో వేగం పెరిగింది. ప్రధానాలయం ముందు బంగారు వన్నెతో కూడిన క్యూకాంప్లెక్స్ పనులు పూర్తి చేస్తున్నారు. కొండపైన గల మరో ప్రధానాలయమైన శివాలయం పనులు దాదాపు పూర్తి చేశారు. మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్లు పూర్తి కాగా వీటిలో ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొండకింద లక్ష్మీ పుష్కరిణి, గండి చెరువు, దీక్షాపరుల మండపం, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రతశాల, అన్నప్రసాద మండపం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉద్ఘాటన సమయానికి పూర్తి చేయనున్నారు. -
మోదీ నోట.. కూరెళ్ల మాట
రామన్నపేట/సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ‘మన్‌కీబాత్’ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరును ప్రస్తావించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య స్వగ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తమ ఇంట్లో 2013లో 70 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. అనంతరం ఆచార్య కూరెళ్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమార్తెలు, దాతల సహకారంతో పాత ఇంటిస్థానంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. సాహితీవేత్తలు, ఉన్నత విద్యనభ్యసించే వారితో పాటు పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే కూరెళ్ల విఠలాచార్య సేవాతత్పరత గురించి ప్రధానమంత్రి మాటల్లోనే .. నా ప్రియమైన దేశ ప్రజలారా.. మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతులతో సుసంపన్నమైనది. ఆ ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనడానికి కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్యగారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కూరెళ్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. తర్వాత విఠలాచార్య తెలుగు అధ్యాపకుడు అయ్యారు. అనేక సృజనాత్మక రచనలు చేశారు. ఆరేడు సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన స్వంత పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు సహకరించటం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో గల ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన కృషితో స్ఫూర్తి పొంది ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో ఉన్నారు. ప్రధాని ప్రశంస మధురానుభూతి పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టు చేయాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇంటిని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంగా మార్చాను. కవులు, రచయితలు వివిధ సంస్థల సహకారంతో 2 లక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో నా ప్రయత్నాన్ని ప్రశంసించడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలుస్తుంది. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య -
చెల్లెని బాగా చూసుకోవాలని చెబితే.. నాకే నీతులు చెబుతావా అంటూ..
సాక్షి, తుర్కపల్లి: ‘బావా మా అక్కను ఎందుకు వేధిస్తున్నావు.. కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు సాధారణమే.. చీటికి మాటికి గొడవలు పడితే చులకనవుతారు.. సర్దుకుపోయి కాపురాన్ని చక్కదిద్దుకోవాలి.. పిల్లల ముఖం చూసైనా మారాలి’అని సర్దిచెప్పిన బావమరిదికి అవే ఆఖరి మాటలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఆ బావ తీవ్ర ఆగ్రహంతో.. ‘నాకే నీతులు చెబుతావా’అంటూ ఇటుకతో బావమరిదిపై దాడి చేసి కడతేర్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఎర్రవల్లి వెంకటేశానికి సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కృష్టవేణితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వెంకటేశం బ్యాండ్ మేళంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనుమానం పెంచుకుని.. కొన్నేళ్ల నుంచి వెంకటేశం దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేశం మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వచ్చి భార్యను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే తరుణంలో శుక్రవారం కూడా వెంకటేశం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి జరిగిన విషయాన్ని సోదరుడు రాచకొండ రమేశ్‌కు ఫోన్లో వివరించి రోదించింది. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని వెంటనే రావాలని కోరింది. నిలదీస్తే దాడి చేసి.. సిద్దిపేట జిల్లా మామిడ్యాలలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న రాచకొండ రమేశ్ శుక్రవారం రాత్రి మాదాపూర్ గ్రామంలోని సోదరి ఇంటికి వచ్చాడు. తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని బావ వెంకటేశాన్ని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో వెంకటేశం ఇటుకతో బావమరిది తలపై బలంగా మోదడంతో రమేశ్ అక్కడికక్కడే కుప్పకులిపోయాడు. అదే కోపంతో అతడి ఛాతీ, కడుపులో కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గాయపడిన రమేశ్‌ను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమే శ్ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీన్‌రెడ్డి, ఎస్ఐ మధుబాబు తెలిపారు. -
శివాలయంలో బౌద్ధ సంతాన దేవత విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు. చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు. చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు -
నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే
సంస్థాన్‌నారాయణపురం: ‘నా ఎదుగుదలకు సర్వేల్ గురుకులం చదువే కారణం.. నా జీవితాన్ని మలుపు తిప్పిన గురుకులానికి గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో దేశం గర్వించే స్థాయిలో సేవలందిస్తున్నారు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలోని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు మంగళవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డీజీపీ ఈ సందర్భంగా బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సర్వేల్ గురుకులంలో చేరకముందు సొంత ఊరు పక్కన ఉన్న జెడ్పీ హైస్కూల్లో చదివానని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గురుకులాన్ని ప్రారంభించాలన్న పీవీ నరసింహారావు ఆలోచనలకు స్పందించిన నాటి సర్వోదయ నేత మద్ది నారాయణరెడ్డి తన 50 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని చెప్పారు. ఇక్కడి నుంచే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకు బీజం పడిందన్నారు. -
ఇంటర్ యువతికి ప్రేమ వేధింపులు.. మనస్తాపానికి గురై
మోత్కూరు: ప్రేమ వేధింపులకు ఓ విద్యార్థిని బలైంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బట్టు రాజమల్లు కూతురు దుర్గాభవాని (17) మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, దుర్గాభవానిని అదే గ్రామానికి చెందిన గురజాల ఏలేందర్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వీరి నివాసాలు పక్క పక్కనే ఉండడంతో దుర్గాభవాని కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో స్నేహితులతో కలిసి ఏలేందర్ ఇబ్బంది పెడుతున్నాడు. ఏడాది క్రితం ఏలేందర్ తన కూతురును వేధిస్తున్న విషయం రాజమల్లుకు తెలిసింది. దీంతో ఆయన పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అప్పట్లో ఏలేందర్.. ఇకపై దుర్గాభవానిని ఇబ్బంది పెట్టనని అందరి సమక్షంలో ఒప్పుకున్నాడు. తదనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తిరిగొచ్చి మళ్లీ అదే తీరు.. ఏలేందర్ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చాడు. స్నేహితుల సహకారంతో దుర్గాభవాని ఫోన్ నంబర్ సేకరించి మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన దుర్గాభవాని ఇంట్లోనే గడ్డిమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. అకస్మాత్తుగా ఈ నెల 20న ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు సాయంత్రం మృతి చెందింది. ఏలేందర్, మరో ఏడుగురు స్నేహితులతో వేధించడంతోనే దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.ఉదయ్‌కిరణ్ తెలిపారు. -
కోరిన స్కూళ్లో చేర్పించలేదని.. తల్లి బడి గేటు దాటకముందే..
నల్లగొండ క్రైం: తనకు నచ్చిన స్కూళ్లో చేర్పించడంలేదన్న కోపంతో ఓ విద్యార్థిని భవనంపై నుంచి కిందకు దూకింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బచ్చు ఉమామహేశ్వరి నల్లగొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈనెల 2వ తేదీన శుభకార్యం ఉండడంతో ఉమామహేశ్వరిని ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లింది. ఆదివారం తిరిగి పాఠశాలకు తీసుకువచ్చింది. కాగా, చెల్లెలు చదువుతున్న చౌటుప్పల్ పాఠశాలలో తనను చేర్పించాలని ఉమా మహేశ్వరి తల్లిని కోరింది. అక్కడ సీట్లు లేవని, వచ్చే సంవత్సరం చూద్దామని తల్లి పార్వతమ్మ సర్ది చెప్పింది. కానీ తను అక్కడ చదవనని ఉమామహేశ్వరి గొడవ చేసింది. తల్లి పాఠశాల గేట్ దాటే లోపే ఉమామహేశ్వరి భవనంపైకి ఎక్కి దూకింది. వెంటనే ఆమెను ప్రిన్సిపాల్, తల్లి, తోటి విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల నేషనల్ క్వాలిటీ అనాలసిస్‌కు చెందిన కేంద్ర ప్రతినిధుల బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. జాతీయ స్థాయి ఎంపిక ఇలా.. జాతీయ వైద్య ఆరోగ్య సంస్థ చేపట్టిన 14 రకాల కార్యక్రమాల అమలు, ఆస్పత్రి పరిపాలనా విభాగం పనితీరు, వివిధ ఆరోగ్య పరీక్షల నిర్వహణ–నాణ్యత, రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు–ఫార్మసీ నిర్వహణ, డెలివరీ ప్రొటోకాల్స్, అనంతరం తల్లీబిడ్డలకు అందిస్తున్న సేవలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ప్రమాణాలు పాటించిన పీహెచ్‌సీలను జాతీయస్థాయి క్వాలిటీ అస్యూరెన్స్ ఇస్తారు. కాగా పోచంపల్లి పీహెచ్సీ, పరిధిలోని 9 హెల్త్ సబ్‌సెంటర్ల ద్వారా మండలంలోని 52వేల మందికి వైద్య సేవలందిస్తున్నది. గర్భిణులు, పిల్లలకు ఇమ్యునైజేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా ఒక్క ఏడాదిలో పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 750 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఇలా జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పనిచేస్తున్నందుకుగాను పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి లభించింది. అదనపు నిధులు వస్తాయి పోచంపల్లి పీహెచ్సీ 2017లో ‘కాయకల్ప’అవార్డుకు ఎంపికైంది. గతంలో పీహెచ్‌సీని సందర్శించిన స్టేట్ క్వాలిటీ అనాలిసిస్ బృందం, నేషనల్‌కు ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇలా జాతీయస్థాయికి ఎంపికైన పీహెచ్‌సీకి ఏటా రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు అదనపు నిధులు వస్తాయి. –డాక్టర్ యాదగిరి, మండల వైద్యాధికారి -
యాదాద్రి: అడుగడుగు.. అణువణువు
సాక్షి, యాదాద్రి: యాదగిరి క్షేత్రాన్ని పునఃప్రారం భించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళ వారం యాదాద్రిలో పర్యటించారు.సుమారు 8 గం టల పాటు ఆయన ప్రధానాలయంతో పాటు యాదాద్రిలో చేపట్టిన పనులను పరిశీలించి సూచ నలు చేశారు. పూర్తికావచ్చిన ఆలయ పునర్ని ర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని పరిశీలిం చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు, పరిసరాలన్నిం టినీ పరిశీలించారు. మధ్యాహ్నం 12.40గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగి కొండపై బాలాలయానికి చేరుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సీఎంకు పుష్పగుచ్చాలు అందజేయగా వేదపండితులు, అర్చకులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. బాలాలయంలో అర్చన అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం.. పెంబర్తి కళాకారులు తీర్చిదిద్దిన ప్రధానాలయ ద్వారాలను పరిశీలించారు. ప్రాంగ ణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను తన వెంట ఉన్న మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృ«శ్యాలను పరిశీలించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తది తర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొం దించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాల యం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది’ అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అర్చకులకు ఇళ్ల స్థలాలు ఆలయ అర్చకులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరగా.. నిర్ణయం ఎప్పుడో తీసుకున్నం దున ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అర్చ కులకు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటా యించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని సీఎం ఆదేశించారు. ‘మీకు పీఆర్సీ వస్తోందా ?’ అని సీఎం కేసీఆర్ ఆలయ ఉద్యోగు లను అడిగి తెలుసుకున్నారు. రింగురోడ్డు నిర్మాణ సమయంలో వాణిజ్య స్థలాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కల్యాణ కట్ట సమీపంలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. త్రిదండి చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ఆలయ ప్రారం భం ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని కోరుతూ ఆలయ ఈఓ గీతకు సీఎం కేసీఆర్ అందించారు. యాదాద్రిలోని రామలింగేశ్వ రాలయంలో అభిషేక అర్చన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు, ఎమ్మె ల్యేలు, తదితరులతో కలిసి భోజనం చేశారు. కొండ కింద పనుల పరిశీలన సాయంత్రం.. కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్క రిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణా లను పరిశీలించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిం చారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతు న్నట్లు చెప్పారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీ లను నిర్మిస్తుందని తెలిపారు. మద్యపానం నిషేధం యాదాద్రి పవిత్రతను కాపాడ టానికి అందరూ సహకరించా లని, టెంపుల్ సిటీ పరిధిలో మద్య పానం, ధూమపానం నిషేధాన్ని కఠినతరంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం శాకాహారాన్నే అను మతించాలని సూచించారు. వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్ సూట్లు యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వీవీఐ పీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసి డెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు. హెలీపాడ్ వద్ద ఘన స్వాగతం అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగ వత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవ దాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు హెలీపాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గప్తా, సీఎం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. ప్రతి శిల్పం ప్రత్యేకంగా పరిశీలన ఆలయం ముందున్న వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన సీఎం ప్రధాన దేవాలయ గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్రనామాలతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ ఘట్టాన్ని, తంజావూరు చిత్ర పటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రి వర్గ సహ చరులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ధ్వజ స్తంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలిం చారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్లు, క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా సీఎం పరిశీలించారు. -
యాదాద్రి: 2022 మార్చి 28 నుంచి దివ్యదర్శనం
మహా ఉత్కృష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శించుకున్నా. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశాం. తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుంది. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించాం. –కేసీఆర్ సాక్షి, యాదాద్రి: మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు. అంతకంటే ముందు మార్చి 21వ తేదీన మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందని చెప్పారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభ కార్యక్రమం మొత్తం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం రాత్రి యాదాద్రి కొండపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్వయంభువుగా వెలసిన లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ పునః ప్రారంభం ఘనంగా జరుగుతుందని ప్రకటించారు. తిరుమల మాదిరిగానే మన రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రారంభం మన చేతుల్లో ఉండదని, ఆగమ, వాస్తు వంటి పలు శాస్త్రోక్త పద్ధతులలో చేయాల్సి ఉంటుందని చెప్పారు. 50 ఏళ్ల కిందట దర్శించుకున్నా.. గొప్ప సాంస్కృతిక చరిత్ర కలిగిన మన తెలంగాణ ఆధ్యాత్మిక రంగంలోని పరిమళాలను నూతన చరిత్రకారులు వెలికితీస్తున్నారని అన్నారు. మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని తాను 50 ఏళ్ల కిందట మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, బౌద్ధం నడయాడిన నేల తెలంగాణలో అష్టాదశ పీఠాలలో ఒకటైన జోగుళాంబ దేవాలయం శక్తిపీఠమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పుష్కర రూపంలో దానిని సుసంపన్నం చేశామని చెప్పారు. విద్వత్తు, సిద్ధాంతుల సభలో ముహూర్తం ఖరారు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమ ముహూర్తాన్ని జీయర్ గారి సూచనలతో విద్వత్తు, సిద్ధాంతుల సభలో నిర్ణయించడం జరిగిందని, మహా సుదర్శన యాగంతో ఇది ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సహస్రాశ్ట (1008) కుండలతో దీనిని నిర్వహించడం జరుగుతుందని, 6 వేల మంది ఋత్విక్కులు, 3 వేల మంది సహాయకులు పాల్గొంటారని చెప్పారు. జీయర్‌స్వామి పీఠంలో శ్రీమద్రమానుజ 1004వ జయంతి సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహిస్తున్నారని, అక్కడ యాగం పూర్తి కాగానే యాదాద్రిలో యాగం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఉద్ఘాటనకు దేశ, విదేశాలకు చెందిన పుణ్యక్షేత్రాల పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ దీవించాలని కోరారు. మహా సుదర్శన యాగ కార్యానికి లక్షా యాభై వేల కిలోల కల్తీ లేని నెయ్యి వినియోగిస్తున్నట్లు తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, పనులను రేపటి నుంచి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, మోత్కుపల్లి స్వర్ణతాపడంలో ప్రజలందరికీ భాగస్వామ్యం స్వామివారి గర్భగుడి దివ్య విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. తిరుమల స్వామివారి విమానగోపురం మాదిరిగానే యాదాద్రీశుని దివ్యవిమానం ఉంటుందన్నారు. రూ.65 కోట్లు ఖర్చయ్యే స్వర్ణ తాపడ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరినీ స్వచ్ఛందంగా భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. గౌరవ ప్రజాప్రతినిధుల సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు, 3,600 వార్డులు, 142 మున్సిపాలిటీల ద్వారా అందరినీ భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. రూ.11 నుంచి ఎంత వీలైతే అంత చెల్లించాలని కోరారు. మొట్ట మొదటగా తమ కుటుంబం నుంచి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మంత్రులు మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఇలా పలువురు బంగారం విరాళంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు వేల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, ప్రతి తండా నుంచి పదకొండు రూపాయల చొప్పున ఇచ్చినా సంతోషమేనని అన్నారు. ఈ ఆలయం మనది అనే భావనతో అందరూ స్వామివారి కార్యానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో కాటేజీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించే విధంగా వెయ్యి సూట్లతో 250 కాటేజీల నిర్మాణం వెంటనే చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి వెళ్లిన భక్తులు నాలుగైదు రోజులు అక్కడే ఎలా ఉంటారో యాదాద్రిలో కూడా అలాగే ఉండాలన్నారు. కళ్యాణకట్ట, పుష్కరిణి పనులు వేగంగా పూర్తి చేస్తామని, రూ.6.90 కోట్లతో బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఉచిత బస్సు కోసం బస్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ జలమండలి సహాయంతో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్షాకాలంలో నీరు వెళ్లేలా) పనులు వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని, చక్కని కాలనీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. జర్నలిస్టులు దేవాలయ మార్పు చూసినవారు కాబట్టి ఆలయ వార్తలు, రాష్ట్ర విశిష్టతను చక్కటి పరిశోధన వ్యాసాలుగా అందించాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని సీఎం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 60 లక్షల ఎకరాలలో పంట రాబోతోందని చెప్పారు. ఒంటరి మహిళలకు పెన్షన్లు, కులం జాతి అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. నవంబర్ 4వ తేదీ తర్వాత దళిత బంధు పథకం ద్వారా దళిత బిడ్డల ఆర్థిక ఉన్నతికి పది లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. యాదాద్రిపై యాదర్షి ఋషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని సీఎం వెల్లడించారు. యూనివర్సిటీ ఏర్పాటు కూడా జరుగుతుందన్నారు. అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప ఆకర్షణీయమైన కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాళేశ్వరంలో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ రూపుదిద్దుకుందని, మల్లన్న సాగర్ నుంచి ప్రతిరోజూ స్వచ్ఛమైన గోదావరి జలాలు లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలను తాకడం మన అదృష్టమని పేర్కొన్నారు. దీనితో ఆలేరు, భువనగిరి, రామన్నపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇది స్వామి వారి దీవెన అని కొనియాడారు. తెలంగాణ బిడ్డ, రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావు మన శిల్పారామం సృష్టికర్త అని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం చక్కగా అవిష్కృతం అవుతోందన్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు నర్సింహాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఫొటోలు -
క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల
యాదగిరిగుట్ట: బీసీలకు క్రీమీలేయర్‌ను పెట్టి వారికి రిజర్వేషన్లు అందకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వెంటనే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉపాధ్యాయులకు వెంటనే పదో న్నతులు వాటిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరా రు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శుక్రవారం జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 47 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన సురేశ్, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన నరేంద్రస్వామి ఎన్నికయ్యారు. -
వైద్యరంగానికి కేంద్ర బిందువుగా ఎయిమ్స్
సాక్షి, యాదాద్రి: ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఎయిమ్స్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నా రని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వ వైద్యరంగానికి బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతోందని అన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధాని లక్ష్యమని.. అందుకే కేంద్ర బడ్జెట్లో రూ.2.40 లక్షల కోట్లను వైద్యరంగానికి కేటాయించారని చెప్పా రు. దత్తాత్రేయ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో అకడమిక్ సెక్షన్‌ను ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెల్త్ డిజిటల్ ఐడీ కార్డు అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి జరుగుతోందన్నారు. భువనగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై పనిభారం తగ్గించేలా ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎయిమ్స్ ద్వారా అందించే వైద్య సేవలను, కోవిడ్ సమయంలో నిర్వహించిన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్, డాక్టర్ శ్యామల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, సీనియర్ నేతలు గూడూరు నారాయణరెడ్డి, బండ్రు శోభారాణీ పాల్గొన్నారు. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు!
భువనగిరి: ప్రసవం కోసం ఆపరేషన్ చేసిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో కాటన్ పెట్టి మరిచిపోయారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ మహిళ మంగళవారం మృతి చెందింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన చింతపల్లి ప్రవీణ్ భార్య మమత (21) మొదటి కాన్పు కోసం సంవత్సరం క్రితం భువనగిరి పట్టణంలోని కేకే నర్సింగ్ హోంలో చేరింది. ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా ఆ మహిళ పాపకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. ప్రతి నెలా చికిత్స కోసం అదే నర్సింగ్‌హోంకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమెకు 6వ నెల. 15 రోజుల క్రితం కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు. అయితే నొప్పి తిరగబెట్టడంతో మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లగా అక్కడ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేయలేమని చెప్పడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. మమత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు ఈ విధంగా మూడు నాలుగు ఆస్పత్రులు తిరగడంతో ఆమెకు గర్భస్రావమైంది. ఈ సమయంలో సన్‌ఫ్లవర్ ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు బతిమిలాడటంతో పరిస్థితి విషమించిందని తెలిపి, కుటుంబ సభ్యుల వద్ద హామీ తీసుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె గర్భంలో కాటన్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రసవం కోసం నిర్వహించిన ఆపరేషన్ సమయంలో రక్తస్రావాన్ని నిరోధించేందుకు ఉంచిన కాటన్ కడుపులోనే మర్చిపోయి కుట్లు వేశారని, ఆ కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణానికి ముప్పుగా మారిందని చెప్పారు. అయితే చికిత్స పొందుతూ ఆ గర్భిణి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మమత మృతదేహంతో పట్టణంలోని కేకే నర్సింగ్‌హోం వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం
-
‘బెస్ట్ విలేజ్’ పోటీలో భూదాన్‌పోచంపల్లి
భూదాన్‌పోచంపల్లి: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. మన దేశంలోని భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. పోచంపల్లికి ఘనమైన చరిత్ర భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది. అలాగే ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది. దాంతో పోచంపల్లిని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది. -
ఆరేళ్ల గిరిజన బాలికపై హత్యాచారం: పెల్లుబికిన ప్రజాగ్రహం..
సైదాబాద్: తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. అభంశుభం తెలియని ఆ బాలికకు చాక్లెట్ ఆశ చూపాడు. నమ్మి అతడి ఇంటికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండా నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ గిరిజన కుటుంబం సింగరేణి కాలనీలో నివసిస్తోంది. గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా కూతురు(6) ఇంటి వద్ద తోటిపిల్లలతో కలసి ఆడుకుంటోంది. వారి ఇంటి పక్కనే చిల్లర దొంగతనాలు చేసే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన రాజు(30) ఉంటున్నాడు. సంవత్సరం క్రితం అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. తరువాత గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని పరుపులో చుట్టి అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. అదేరోజు సాయంత్రం నుంచి తమ కూతురు కనపడటంలేదని తల్లిదండ్రులు సింగరేణి కాలనీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి ఇంట్లోనే చిన్నారి మృతదేహం బాలిక తల్లిదండ్రులు, స్థానికులు రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో రాజు ఇంటి తాళం పగలకొట్టి చూడగా పరుపులో చుట్టి ఉన్న బాలిక మృతదేహం లభించింది. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించటానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు వారికి సర్దిచెప్పి బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏడు గంటలపాటు నిరసన బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలుసుకున్న స్థానికులు, పలు సంఘాల వారు సింగరేణి కాలనీలో శుక్రవారం నిరసనకు దిగారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అనంతరం సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫి క్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ సంఘటనాస్థ లిని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుం బానికి ప్రభుత్వం అన్నివిధాలా బాసటగా ఉంటుందని హామీనిచ్చారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, వారి కుటుంబంలోని ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగంతోపా టు వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. తక్షణ సహాయం కింద రూ.50 వేల చెక్కును వారికి అందజేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయటం ద్వారా నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామని కలెక్టర్, అడిషనల్ కమిషనర్ రమేశ్‌రెడ్డి హామీ ఇవ్వటంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. నిందితుడు రాజు (ఫైల్‌ఫొటో) పోలీసుల అదుపులో నిందితుడి అక్క, బావ అడ్డగూడూరు/చందంపేట: నిందితుడు రాజు కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో రాజు అక్క, బావను శుక్రవారం అడ్డగూడూరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. నిందితుడిని సైతం అదుపులో తీసుకున్నట్లు టీవీల్లో ప్రసారం కావడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, రాజు స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల అని, అతని అక్క, బావ అడ్డగూడూరులో ఉంటారని అంటున్నారు. హత్యాచారానికి గురైన చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామం నక్కలగండితండాలో శుక్రవారం రాత్రి పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి. -
ప్రజా ఉద్యమంలా హరితహారం
భువనగిరి: 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మొ దలుపెట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్ మెషీన్ ద్వారా సీడ్‌బౌల్స్‌ను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల కాలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, రాష్ట్రంలో 5 శాతం గ్రీన్‌బెల్ట్ పెరిగిందని పేర్కొన్నారు. 2030లోగా 1 బిలియన్ సీడ్‌బౌల్స్ ప్లాంటేషన్ చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది అభయారణ్యాల్లో డ్రోన్ ద్వారా ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడానికి వీల్లేని ప్రాంతాలు, కొండలపై డ్రోన్ ద్వారా సీడ్‌బౌల్స్ వెదజల్లుతున్నామని, సంవత్సరం తర్వాత శాటిలైట్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు. అంతకుముందు మండలంలోని హన్మాపురం, తుక్కాపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు. -
హిమబిందు మృతదేహం లభ్యం
-
దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలోని రాజపేట మండలం, కుర్రారం గ్రామం దోసలవాగులో గల్లంతైన హిమబిందు మృతదేహం లభ్యమైంది. పారుపల్లి సమీపంలో మృతదేహం లభించింది. సింధూజ మృతదేహం లభించిన ప్రాంతానికి చేరువలోనే హిమబిందు మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. గల్లంతైన మూడు రోజులకు మృతదేహాలు లభ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం వాగులో ఇద్దరు యువతులు సింధూజ, హిమబింధు కొట్టుకుపోయిన విషయం విదితమే ఇటుకలపల్లి వెళ్లి తిరిగి కుర్రారం గ్రామానికి వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి గల్లంతు అయ్యారు. వాగు దాటుతుండగా మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో వాగు ఉదృతికి కొట్టుకుపోయారు. -
లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్‌లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్‌లు సంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్‌కు పల్సర్ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి -
యాదాద్రి భువనగిరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద ఓ బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని చిట్యాల మండలం పిట్టంపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. చదవండి: పెళ్లి బరాత్.. అంతలో సడన్‌గా పోలీసుల ఎంట్రీ ! -
భాగ్యమ్మా.. సెల్యూట్
జనగామ: తను చనిపోతూ అవయవదానంతో పలువురికి పునర్జన్మ ఇచ్చింది భాగ్యమ్మ. ఆ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని హర్షిస్తూ ఆస్పత్రి సిబ్బంది అందరూ సెల్యూట్ చేశారు. జనగామ మండలం పెంబర్తికి చెందిన చల్ల భాగ్యమ్మ (48) తండ్రి అంత్యక్రియల నిమిత్తం ఈనెల 19న తన కుమారుడితో కలిసి బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు బయల్దేరింది. మార్గమధ్యలో కొలనుపాక వద్దకు రాగానే హైబీపీతో భాగ్యమ్మ కిందపడిపోయింది. తలకు గాయమై అపస్మారక స్థితికి చేరగా ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అవయవాలను ఆస్పత్రి నిర్వాహకులు తీసుకున్నారు. -
మరణంలోనూ నీవెంటే: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చౌటుప్పల్: ఐదు దశాబ్దాల సంసార జీవితంలో ఎలాంటి కలతలు లేకుండా అన్యోన్యంగా గడిపారు ఆ దంపతులు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి బతుకుదెరువు చూపించారు. బరువు బాధ్యతలన్నీ ముగించుకున్న తరుణంలో భార్య అనారోగ్యంపాలైంది. అంతకంతకూ పెరుగుతున్న తన అనారోగ్య సమస్యలతో భర్త ఇబ్బంది పడకూడదని అగ్నికి ఆహుతైంది. అది కళ్లారా చూసి కలత చెందిన ఆమె భర్త కూడా నీ తోడై వస్తానంటూ.. ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మరణం అందరినీ కలచివేసింది. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(70), మల్లమ్మ(63) దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మారారెడ్డి గ్రామంలోనే వ్యయసాయం చేసుకుంటున్నాడు. కాగా, కొంత కాలంగా మల్లమ్మ అనారోగ్య సమస్యలతో అవస్థ పడుతోంది. వైద్యం చేయించుకున్నా సమస్య తగ్గకపోగా ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైంది. తన సమస్యతో భర్త, కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఇష్టం లేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన భర్త మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ మృతిచెందింది. కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతైపోవడాన్ని మారారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. అదే రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మృతదేహాలకు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్.. సర్పంచ్ ఇంట్లో భోజనం
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి రానున్నారు. జూన్ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి, గ్రామస్తులతో కలసి సీఎం సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి మరో అంకాపూర్‌గా తీర్చిదిద్దుతానని ప్రకటించిన సంగతీ విదితమే. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి కేసీఆర్ వాసాలమర్రికి చేరుకుంటారు. 53 దళిత కుటుంబాలతో కూడిన కాలనీలో పర్యటించి వారి అవసరాలను తెలుసుకుంటారు. దళిత బంధుపై చర్చిస్తారు. సర్పంచ్‌కు సీఎం ఫోన్ గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు ఇంట్లో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. వాస్తవానికి జూన్ 22నే సర్పంచ్ ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ ఆరోజు సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు. మరోమారు వస్తానని ఆ రోజు సర్పంచ్‌కు హామీ ఇచ్చిన సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆయన ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత గ్రామంలోని రైతువేదిక భవనంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిమిత సంఖ్యలో 150 మంది మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామాభివృద్ధిపై కలెక్టర్‌తో చర్చ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. జూన్ 22 తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఏ ర్పాటు, యువత, రైతులు, మహిళల అభ్యున్నతికి అవసరమైన చర్యలు, గ్రామంలో మౌలిక వసతులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగు, తాగు నీటి వివరాలు, ఉపాధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. -
చల్లారని ‘చౌటుప్పల్ పంచాయితీ’: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కేసు నమోదు
సాక్షి, యాదాద్రి భువనగిరి: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకి సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాన్నిమంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించడం ఏమిటని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ -
రైతులే ఆవిష్కర్తలు!
కరోనా నేపథ్యంలో పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం కొనసాగిస్తున్న కొందరు రైతులు సృజనాత్మక ఆలోచనలతో తమకు అవసరమైన వ్యవసాయ పరికరాలను, యంత్రాలను రూపొందించుకొని వాడుకుంటున్నారు. ఈ రైతు ఆవిష్కర్తల్లో కొందరు నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌లో సభ్యులు కావటం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. కష్టకాలంలో సులువుగా తక్కువ కూలీలతో పనులు చేసుకునే ఆవిష్కరణలు చేసిన వీరికి వాటర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ సంస్థ ఆర్థిక తోడ్పాటును అందించి ప్రోత్సహించింది. గుంటక : కలుపు నిర్మూలనతో పాటు ఎరువు వేయడానికి ఉపయోగకరం. దంతె : దుక్కి చేయటంతోపాటు విత్తనం, ఎరువు వేయడానికి ఉపయోగపడుతుంది. రూ. పది వేల ఖర్చుతో వీటిని రూపొందించిన రైతు పేరు రుద్రపాక నరసింహ. అతనిది సంస్థాన్ నారాయణపూర్ మండలం సుర్వైల్ గ్రామం. గడ్డి ఏరే పరికరం: వరి పంటను యంత్రంతో కోయించిన తర్వాత చెల్లాచెదురుగా పడిన గడ్డిని పోగెయ్యటం ఖర్చుతో కూడిన పని. అందువల్ల కొందరు రైతులు గడ్డికి నిప్పు పెడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా గాలి కలుషితమవుతోంది. ఈ పరికరంతో తక్కువ సమయంలో గడ్డిని కుప్ప వేయవచ్చు. రూ.700 ఖర్చుతో దీన్ని రూపొందించిన రైతు వంకా శ్యాంసుందర్‌రెడ్డి. ఇతనిది జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి. చేతక్ వీడర్ : పాత ఇనుప సామాను షాపులో చేతక్ స్కూటర్ విడిభాగాలు తీసుకొని అనేక పనులు చేసేలా రూ. 30 వేల ఖర్చుతో రూపొందించిన రైతు బొల్లం శ్రీనివాస్. ఇతనిది లింగాల ఘనపూర్ మండలం వనపర్తి. గేర్ బాక్స్ కూడా ఉండటంతో ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది. దుక్కికి, విత్తనాలు వేసుకోవడానికి, కలుపు నిర్మూలించడానికి గుంటక/దంతె మాదిరిగా, బెడ్ మేకర్‌గా, పంపును అనుసంధానం చేసి కాలువ నుంచి నీళ్లు తోడటానికి కూడా ఉపయోగిస్తున్నారు. ట్రాలీ స్ప్రేయర్ : పురుగుమందులు, కషాయాలు, జీవామృతం వంటి ద్రావణాలను పంటలపై తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చు పిచికారీ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. ట్యాంకును మోయటం కన్నా ట్రాలీపై పెట్టుకొని పిచికారీ చేసుకోవచ్చు. మనిషి తన వెనుక ఈ ట్రాలీని పెట్టుకొని.. దీన్ని లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలు. బొల్లం శ్రీనివాస్ ఈ ట్రాలీని రూ. 2,100 ఖర్చుతో తయారు చేసి, ట్యాంకర్‌ను దానిపై అమర్చాడు. చేతక్ వీడర్ నడుపుతున్న రైతు బొల్లం శ్రీనివాస్ ఈ పరికరాల గురించి మరిన్ని వివరాలకు.. నేలతల్లి ఎఫ్పిఓ సీఈవో కె.సురేందర్‌రెడ్డి – 99517 93862 -
ఇప్పుడు ఏ వ్యాఖ్యలూ చేయను: రాజగోపాల్‌రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: ‘కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను.. ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలూ చేయను’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని బోటిమిదితండా శివారులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు మా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా, వీడాలా అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. అధికారంలోకి రాలేకపోయామని బాధతో రెండు, మూడుసార్లు మాట్లాడానన్నారు. -
బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ..
మోత్కూరు: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లిని బతికుండగానే బొంద పెడతానంటూ ఓ కొడుకు గొయ్యి తవ్విన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుచ్చిమల్లయ్య, సాలమ్మ, దంపతులకు ముగ్గురు కుమారులు నర్సింహ, ఐలయ్య, వెంకటయ్యతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం బుచ్చిమల్లయ్య మృతి చెందాడు. ముగ్గురు కుమారులు కలిపి నెలకు రూ.600 చొప్పున ఆరు నెలలకోసారి 3,600 రూపాయలను జీవనభృతి కింద తల్లికి ఇస్తున్నారు. చిన్నకుమారుడు వెంకటయ్య నాలుగైదేళ్లుగా తన వాటా డబ్బులు ఇవ్వకపోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ గత నెల 16న వెంకటయ్య తన భార్యతో కలసి పొలం వద్ద ఉన్న తండ్రి సమాధి పక్కనే బొంద తీశాడు. ఈ విషయమై గ్రామపెద్దలు వెంకటయ్యను తీవ్రంగా మందలించడంతో బొందను పూడ్చివేశాడు. జీవనభృతి ఇవ్వడంలేదని వెంకటయ్యపై తల్లి గత నెల 30న యాదాద్రి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. -
అమ్మ ఫొటోకు ముద్దులు: చచ్చిపోయారుగా వాళ్లు రారు
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని రాంనగర్‌కాలనీ ఇంకా విషాదంలోనే ఉంది. ముగ్గురు బిడ్డలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికుల కళ్లెదుటే కన్పిస్తోంది. బాధ్యత మరిచి తిరుగుతూ మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద వేధింపుల కారణంగా కుటుంబం బలైంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే ఘటనపై చర్చించుకుంటున్నారు. ఉమారాణి, హర్షిణీ, లాస్య మృతదేహాలకు గురువారం రోజు సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఘటనకు బాధ్యుడైన తొర్పునూరి వెంకటేశం తన భార్యతో పాటు కుమార్తెలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ముగ్గురిని ఒకే చితిపై పడుకోబెట్టి దహనసంస్కారాలు చేశారు. ఈ దృశ్యం కుటుంబ సభ్యులు, బంధువులతో పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వెంకటేశం అరెస్ట్ .. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు షరతులపై విడుదల భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల మృతికి కారణమైన వెంకటేశంను స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. కాగా, తమకు కొంత సమయం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. ముగ్గురి అంత్యక్రియలు తనే నిర్వహించాడని, అనంతరం జరిగే కార్యక్రమాలు ముగిశాక అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఫిర్యాదుదారుడి సమ్మతితో పోలీసులు గడువుకు అంగీకరించారు. అనంతరం అతన్ని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కన్నీళ్లు పెట్టించిన చిన్నారి మాటలు తల్లితో పాటు ఇద్దరు అక్కలను కోల్పోయిన మూడేళ్ల చిన్నారి శైనీ చెప్పే మాటలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను కన్నీళ్లుపెట్టిస్తున్నాయి. పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అక్కలు, అన్నలతో రోజువారీ మాదిరిగానే కలివిడిగా ఉంటోంది. మమ్మి, అక్కలు గుర్తుకు రానంతవరకు బాగానే ఆడుకుంటుంది. కుటుంబ సభ్యుల వద్ద సెల్‌ఫోన్ తీసుకొని అందులోని తల్లి, అక్కల ఫొటోలను చూసుకుంటుంది. తల్లి ఉమారాణి ఫొటోకు ముద్దులు పెట్టిన దృశ్యం అక్కడివారిని కంటతడిపెట్టించింది. మమ్మీ, అక్కలు ఎటువెళ్లారని అడిగితే ఊయల ఊగి ఊరికి వెళ్లారని చెప్పింది. ఊరికి వెళ్లి మళ్లీ వస్తారా అని అడిగితే చచ్చిపోయారుగా అందుకే వాళ్లు రారు అంటూ అమాయకంగా చెప్పింది. ఆ అమాయకపు మాటలు విన్న కుటుంబీకులు ఘొళ్లుమంటు విలపించారు.