చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం కావొద్దు | Governor Tamilisai Soundararajan Comments On Medical Students | Sakshi
Sakshi News home page

చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం కావొద్దు

Published Wed, Jun 29 2022 2:23 AM | Last Updated on Wed, Jun 29 2022 8:11 AM

Governor Tamilisai Soundararajan Comments On Medical Students - Sakshi

రోబోటిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించి పరిశీలిస్తున్న గవర్నర్‌ 

సాక్షి, యాదాద్రి: వైద్య విద్యార్థులు చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యం గా చేసుకోవద్దని, సకాలంలో పెళ్లి చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంత మైన జీవితం గడుపుతూ లక్ష్యాల ను సాధించవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రీసెర్చ్‌ మ్యాగజైన్‌ అను సం«ధాన్‌ను ఆమె ఆవిష్కరించా రు.

ఆస్పత్రిలో స్కిల్‌ ల్యాబ్, బర్తింగ్‌ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆడి టోరియంలో వైద్యవిద్యార్థులను, వైద్యులను ఉద్దే శించి ప్రసంగించారు. వివాహాలు చేసుకుంటే చదువుకోలేమని మహిళలు అనుకుంటారని, అది నిజం కాదనడానికి తన జీవితమే ఉదాహరణ అని చెప్పారు. ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరంలోనే తనకు వివాహం జరిగిందని, అయినా ఆ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాన న్నారు.

ఎంబీబీఎస్‌ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం వంటి విషయాలను తమిళిసై గుర్తు చేసు కున్నారు. కొందరు చదువు పేరుతో వివాహాలు ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారన్నారు. తెల్లని కోటులో తనను డాక్టర్‌గా చూడాలని తన తల్లి పడిన తపనను గవర్నర్‌ వివరించారు. 

ఎయిమ్స్‌ సేవలు అభినందనీయం
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్‌ డాక్టర్లు అంది స్తున్న వైద్యసేవలను గవర్నర్‌ తమిళిసై కొనియా డారు. ఓపీ, ఇన్‌పేషెంట్‌ సేవలు, శస్త్ర చికిత్సలు, కోవిడ్‌ సమయంలో అందించిన సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్య మివ్వ కుండా సాధారణ ప్రసవాలు చేయాలని సూచించా రు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు 270 శస్త్రచికిత్సలు, 3,040 మైనర్‌ చికిత్సలు చేశార న్నారు. ఎయిమ్స్‌లో రీసెర్చ్‌ కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా మాట్లాడుతూ వైద్యశాల, కళాశాలకు అవసరమైన అన్ని రకాల వైద్యపరికరా లను రూ.185 కోట్లతో తెప్పిస్తున్నామన్నారు. కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement