Tamilisai Soundararajan
-
తమిళిసై క్లారిటీ: దుమారం రేపుతున్న అమిత్ షా-తమిళిసై సంభాషణ
-
అమిత్ షా మందలించారా?.. స్పందించిన తమిళిసై
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య సీరియస్‌గా సాగిన సంభాషణ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్ చర్చేంటి? అంటూ రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారాని ముందు ఆహ్వానితుల జాబితాలో ఉన్న తమిళిసై అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఆ టైంలో వేదిక మీద ఉన్న బీజేపీ అగ్రనేతలకూ ఆమె నమస్కరించుకుంటూ పోసాగారు. అయితే ఆమెను వెనక్కి పిలిచిన అమిత్ షా.. ఏదో సీరియస్‌గా మాట్లాడారు. ఆమె వివరణ ఇవ్వబోతుండగా.. వేలు చూపించి మరీ ఏదో సీరియస్‌గానే చెప్పారు. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే అంతా భావించారు. అయితే.. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024VIDEO CREDITS: 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨ఈ ఘటనకు సంబంధించి తమిళిసై తాజాగా స్పందించారు. అమిత్ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై పేర్కొన్నారు. Yesterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he adviced to carry out the…— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 13, 2024తమిళనాడులో బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు కొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం, ఎన్నికల కోసం అన్నాడీఎంకే పొత్తును ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై వ్యతిరేకించారని.. ఒకవేళ పొత్తుగా వెళ్లి ఉంటే బీజేపీ కచ్చితంగా విజయం సాధించి ఉండేదన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేశారని.. ఈ నేపథ్యంలో అమిత్‌షా ఆమెను పిలిచి మందలించారంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఈ పరిణామంపై స్పందించింది. ఓ మహిళా నేతతో ఇలాగేనా వ్యవహరించేది.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ మండిపడింది. ఇంకోవైపు.. అమిత్ షా అంత కఠువుగా వ్యవహరించి ఉండాల్సింది కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఆయన తననేం తిట్టలేదన్నట్లుగా ఇప్పుడు తమిళిసై వివరణ ఇచ్చుకొచ్చారు. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజలకు సేవ చేస్తాను: తమిళిసై
ఎలక్షన్ కౌంటింగ్ మొదలైపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తాము గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి 'తమిళిసై సౌందరరాజన్' మీడియాతో మాట్లాడారు.దేశ ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు కూడా రాబోయే ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు ఎన్నిక ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయాను. ఫలితాలు ఎలా ఉన్నా.. నేను ప్రజల తీర్పును అంగీకరిస్తాను. ఎప్పటికీ ప్రజలకు సేవ చేస్తాను అని తమిళిసై అన్నారు.#WATCH | Chennai, Tamil Nadu: BJP candidate from Chennai South, Tamilisai Soundararajan says, "...I think that all the politicians and all the leaders should express their confidence in this process. The whole world is appreciating this democratic process. So, we have to express… pic.twitter.com/tgavFz3ntg— ANI (@ANI) June 4, 2024 -
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే తమ తరఫున ప్రధాని ఎవరు అవుతారనేది కూడా ఆ పార్టీలకు తెలియదని తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండబోతున్నదని, కొన్ని సీట్లలో మాత్రం బీఆర్ఎస్ పోటీ పడుతుందన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలవడంతోపాటు ఎక్కువ మంది కేంద్రంలో మంత్రులు అవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. ‘దక్షిణాదికి తెలంగాణ ముఖద్వారమని ప్రధాని మోదీ చెప్పారు.రాష్ట్రాభి వృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు.ఐదేళ్లలో తెలంగాణకు 22సార్లు వచ్చారు’ అని చెప్పారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో తమిళిసై మీడి యాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫ ల్యం చెందింది. తెలంగాణకోసం ఆ పార్టీ పని చేయలేదు. గత రెండేళ్లలో కేసీఆర్ నాతో మాట్లాడ లేదు. రాజ్యాంగ సంస్థలను గౌరవించలేదు’ అని అన్నారు. మహిళ సాధికారత కోసం మోదీ పనిచేస్తున్నారని, చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పన, ఇతర నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెబుతున్నారే తప్ప అందుకు నిధులు ఎలా సమకూరుస్తారో తెలియదన్నారు. అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చిందని మండిపడ్డారు. తాను రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కూడా వారి మద్దతు కొనసాగడం సంతోషదాయక మన్నారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్, ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆమె తప్పుబట్టారు. 2001లో అప్పటి ప్రధాని వాజపేయి రిజర్వేషన్లు ఉండాలని చెబితే, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని తమిళిసై గుర్తు చేశారు. -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్‌రాం మేఘ్వాల్: రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్‌కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
తమిళిసై వర్సెస్ తమిళచ్చి.. ఆసక్తికర పరిణామం
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్ టికెట్‌ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంతా కాసేపు షాక్‌కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. S Chennai: Pic of Tamilisai and Tamizhachi extending a courtesy hug after filing nominations N Chennai: Sekar Babu and Jayakumar fighting over which party arrived at the location first to file nomination pic.twitter.com/0AHpuWhYkN — Dharani Balasubramaniam (@dharannniii) March 25, 2024 కాగా సౌత్ చెన్నైలో బీజేపీ నుంచి తమిళిసై, డీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి, అన్నాడీఎంకే నుంచి డాక్టర్ జయవర్దన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో స్థానికంగా పోరు ఆసక్తికరంగా మారింది. #WATCH | Chennai, Tamil Nadu: After filing her nomination for the Lok Sabha elections, former Telangana Governor and Puducherry Lieutenant Governor and BJP candidate Tamilisai Soundararajan says, " The people want PM Modi to be Prime Minister again. South Chennai is a… pic.twitter.com/SLmZ0sy05R — ANI (@ANI) March 25, 2024 -
లోక్‌సభ ఎన్నికలు.. ఈ సారైనా తమిళసైకి అదృష్టం వరించేనా?
సాక్షి, చెన్నై : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ...ఈసారి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసేలా నిర్దేశించుకుంది. ఇందుకోసం వివాదాల్లేని నేతల్ని లోక్‌సభ అభ్యర్ధులుగా బరిలోకి దించుతుంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్లా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం గవర్నర్లుగా పనిచేస్తున్న ప్రముఖుల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్‌కు చెన్నై సౌత్ సీటును కేటాయించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం తమిళిసైకి చోటు కల్పించింది. దీంతో తమిళసై సౌందరరాజన్ ఎవరు? అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళిసై సౌందరరాజన్ ఎవరు? నగర్ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తే తమిళిసై సౌందరరాజన్. వ్యాపారవేత్త..రాజకీయవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు. తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె గైనకాలజిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. సోనాలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో మెడికల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (దక్షిణాది రాష్ట్రాల వైద్య విభాగం)గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలో తమిళసై పనిచేశారు. 2007, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, 2013లో జాతీయ కార్యదర్శిగా ఉన్నత బాధ్యలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై 2006, 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. సెప్టెంబర్ 2019లో తెలంగాణ గవర్నర్‌గా సౌందరరాజన్ నియమితులయ్యారు. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తర్వలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళసై. -
చెన్నై సౌత్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న తమిళిసై
-
చెన్నై సౌత్ బరిలో తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడులోని మొత్తం తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను చెన్నై సౌత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. -
బీజేపీ జాబితాలో 'తమిళిసై'.. అక్కడ నుంచే పోటీ..
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన 'తమిళిసై సౌందరరాజన్' (Tamilisai Soundararajan) బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును కూడా అందజేశారు. నేడు (మార్చి 21) బీజేపీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది. ఇందులో చెన్నై సౌత్ నుంచి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. వెల్లూరు నుంచి డాక్టర్ ఏసీ షణ్ముఘం, కృష్ణగిరి నుంచి సీ నరసింహ, నీలగిరి నుంచి డాక్టర్ ఎల్ మురుగన్, కోయంబత్తూరు నుంచి అన్నామలై, పెరంబలూరు నుంచి టీఆర్ పర్వేంధర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
బీజేపీ లో రీ-జాయిన్ ఐన గవర్నర్ తమిళసై ఆసక్తి కర వ్యాఖ్యలు
-
రాజీనామాపై స్పందించిన తమిళిసై.. దానికి మాత్రం నో రిప్లై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ తనకెప్పుడూ అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లేనని అన్నారు. కాగా తెలంగాణ గవర్నర్ పదవికి సోమవారం తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎన్నటికీ మరవనని.. అందరితో కలుస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నను.. ఆమె దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై.. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. -
ఎన్నికల వేల షాక్ ఇచ్చిన తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా..!
-
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా (ఫొటోలు)
-
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
-
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్‌భవన్ అధికారిక ప్రకటన ప్రకారం.. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనంతరం, రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆమె చెన్నైకి వెళ్తారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయపరంగా తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది. అయితే తర్వాతి కాలంలో బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపించారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
పీపుల్స్ ప్లాజాలో జాతీయ సంస్కృతి మహోత్సవాలు–2024 (ఫొటోలు)
-
ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటున్నా
పుదుచ్చెరి: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా చెప్పారు. పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పుదుచ్చేరిలో తన అధికారిక నివాసం(రాజ్ నివాస్)లో మీడియాతో ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పుదుచ్చేరి నుంచి ఎంపీగా బరిలో దిగుతారనే ఊహాగానాల నడుమ అదే అంశాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం. ‘‘నేనొక సాధారణ వ్యక్తిని. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి ఏం ఆదేశిస్తారో అది మాత్రమే నేను ఒక సాధారణ కార్యకర్తలా చేస్తా. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చెరి నుంచి పోటీచేయబోతున్నానని నేను ఎక్కడా అనలేదు. నా జీవితంలో ఇది కావాలని ఏనాడూ అడగలేదు. అగ్రనాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. అయితే అది నెరవేరుతుందా లేదా అనేది ప్రధాని మోదీ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’అని ఆమె అన్నారు. ‘‘కోవిడ్ విపత్తుకాలంలో పుదుచ్చెరిలో కరోనా వ్యాక్సిన్లు సకాలంలో అందించడంలో సఫలమయ్యా. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడితో పుదుచ్చేరిని అందరికీ ఆదర్శంగా నిలిపా. అరబిందో, సుబ్రమణ్యభారతి వంటి వారికి పుదుచ్చేరితో ఎంతో అనుబంధం ఉంది. నాకూ అలాంటి అనుబంధమే ఉంది. కానీ ఇన్నేళ్లు ఇక్కడ ఉన్నా కొందరు ఇంకా నన్ను ‘బయటివ్యక్తి’అనడం నాకెంతో బాధగా ఉంటుంది’’అని అన్నారు. ‘‘మూడేళ్లకాలంలో పుదుచ్చేరిలో వేర్వేరు రంగాల్లో, ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశా. ఇక్కడి ఎన్నుకున్న ప్రభుత్వ సహాయసహకారాలతో ఉత్తమంగా పాలించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’అని ఆమె అన్నారు. -
గవర్నర్‌గా హ్యాండిల్ చేయలేననుకున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్ అర్బన్: ‘నన్ను గవర్నర్‌గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్ బేబీ) హ్యాండిల్ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్‌గా ట్విన్స్ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్‌లో క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు. గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్‌లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్ వర్క్‌షాప్ భవనాన్ని. రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్‌లోని ‘మనూ’పాలిటెక్నిక్ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కేవీ నూతన భవనం నిజామాబాద్‌లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: కూరెళ్ల విఠలాచార్యా గ్రంథాలయానికి రూ.10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ ‘నూతన భవనం’పై అంతస్తులోని ‘సాయి సభా మందిరం’ ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆచార్య విఠలాచార్యుల గురించి ‘మన్ కి బాత్’ లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. ‘విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్ని వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’అని గవర్నర్ తమిళసై విఠలాచార్యులపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఇంటినే గ్రంథాలయం చేసిన విఠలాచార్య -
ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్ మహారత్న’ అవార్డు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అవార్డును ప్రదానం చేశారు. కాగా, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. ఇక, మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే, మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ..‘మహిళలకు అన్ని రంగాల్లో సరైన అవకాశాలు కల్పించాలి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ పాస్ చేయడం చరిత్రాత్మకం. పార్లమెంట్లో జరిగే చర్చల ఆధారంగా చట్టాల ఉద్దేశం తెలుస్తుంది. తెలంగాణ కొత్త రాష్ట్రానికి యంగ్ గవర్నర్ ఎలా పని చేస్తారని నా మీద విమర్శలు వచ్చాయి. కానీ, నా పనితీరుతో రెండో రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అవకాశం వచ్చింది. గైనకాలజిస్ట్‌గా కొత్త శిశువు డెలివరీ చేసినట్లుగా తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని కూడా సరిగ్గా నిర్వహించాను. పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుంది అని కామెంట్స్ చేశారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో వివిధ పద్దతుల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ఎంపీలు నిరంతరం ప్రశ్నించాలి అని అన్నారు. -
మేడారం జాతరకు రావాలని గవర్నర్ తమిళిసైని ఆహ్వానించిన సీతక్క
-
రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శనివారం (10న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 11న విరామం ఇచ్చి.. 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చించనున్నారు. 13న బడ్జెట్‌ను ఆమోదించి, ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల అధ్యక్షతన వేర్వేరుగా సమావేశమైన ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశ మందిరంలో అసెంబ్లీ, శాసన మండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. తర్వాత సభలను వాయిదా వేశారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపి, ఆమోదిస్తాయి. శనివారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెడతారు. 11న ఆదివారం విరామం. 12న అసెంబ్లీ, మండలి వేర్వేరుగా సమావేశమై బడ్జెట్ అంశాలపై చర్చిస్తాయి. 13న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదిస్తారు. దీనితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే.. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన తీర్మానా లు, అంశాలు చర్చకుపెడతారని సీఎం రేవంత్‌రెడ్డి బీఏసీ భేటీలో సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆయా అంశాలను సభ ముందు పెట్టే అంశంపై మరోమారు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన శాసనమండలి బీఏసీ కూడా.. శాసనసభ తరహాలోనే ఈ నెల 13 వరకు సమావేశం కావాలని నిర్ణయించింది. ’ బీఏసీలలో ఎవరెవరు? శాసన మండలి, శాసనసభల నిర్వహణ షెడ్యూల్, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయడానికి.. అధికార, ప్రతిపక్షాల సభ్యులతో ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’లను ఏర్పాటు చేస్తారు. సమావేశాల ప్రారంభం రోజున ఈ బీఏసీలు స్పీకర్/చైర్మన్ అధ్యక్షతన సమావేశమై.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగే తేదీలు, చర్చించే అంశాలను నిర్ణయిస్తాయి. రాష్ట్ర కొత్త శాసనసభ ఏర్పాటైన నేపథ్యంలో ‘బీఏసీ’ని ఏర్పాటు చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ భేటీలో అధికార పక్షం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, విప్ బీర్ల అయిలయ్యకు చోటు కల్పించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ)లకూ అవకాశం కల్పించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనందున ఆ పార్టీ విజ్ఞప్తి మేరకు మహేశ్వర్‌రెడ్డికి చోటు దక్కింది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో.. డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమూద్ అలీ (బీఆర్ఎస్), ఏవీఎన్ రెడ్డి (బీజేపీ), ఎఫెండీ (ఎంఐఎం), అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
-
తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే..
Updates.. ముగిసిన బీఏసీ సమావేశం ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ఈ నెల 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 11వ తేదీన అసెంబ్లీకి సెలవు 12, 13వ తేదీన బడ్జెట్‌పై చర్చ అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేత పత్రం, మేడిగడ్డ విజిలెన్స్ విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్ శ్వేత పత్రం విడుదల ఉండదంటున్న అసెంబ్లీ వర్గాలు ఇప్పటికే ప్రకటన చేశాము కాబట్టి ఖచ్చితంగా ఉంటుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కొత్త రాజ్యాంగామా ఇది: హరీష్ రావు ఫైర్ గతంలో ఇలాంటి సాంప్రదాయం ఉన్నట్టు నిరూపిస్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా గతంలో లేని సంప్రదాయాలు తీసుకోని వస్తున్నారు. బీఏసీ జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కాంగ్రెస్ కొత్త రాజ్యాంగం తీసుకోని వస్తున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీష్ రావు వస్తారని నిన్ననే స్పీకర్‌కు కేసీఆర్ తెలియజేశారు స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు. జగ్గారెడ్డికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ జగ్గారెడ్డి తన స్థానం నుండే ఆయన గెలవలేదు ఆయన మాపార్టీ ఎమ్మెల్యేలని ఎలా తీసుకెళ్తారు మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లంతా దమ్మున్న వ్యక్తులు కాంగ్రెస్‌లో లేరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాకేం అవసరం ఉంది ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతర్యుద్ధం తప్పదు తీర్చలేని హామీలు ఇచ్చి మాపై నెపం నెడుతున్నారు బీఏసీ మీటింగ్ నుంచి బయటకు హరీష్ రావు.. బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు కేసీఆర్‌కు బదులుగా బీఏసీ సమావేశానికి వెళ్ళిన హరీష్ తనకు బదులుగా హరీష్ బీఏసీకి వస్తారని ముందే సమాచారం ఇచ్చిన కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాసేపటి తర్వాత బీఏసీ నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు హరీష్ రావు బయటకు.. సీఎం రేవంత్ లోపలికి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఏసీ సమావేశం అసెంబ్లీ సమావేశాల అజెండాపై బీఏసీలో చర్చ బీఏసీ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి హాజరు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్ధీన్ ►తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ►ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం. మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించాం. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్, లక్నవరం త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తాం. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తాం. బస్సులో బల్మూరి వెంకట్.. మొదటి రోజు అసెంబ్లీకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చిన వెంకట్ ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్న వెంకట్. ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న బీజేపీ బీజేఎల్పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కమలం పార్టీ బీజేఎల్పీ నేతను నియమించకపోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం ఫ్లోర్ లీడర్ ఎంపిక అంశం జాతీయ పార్టీ చేతిలో ఉందటున్న రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో రాజా సింగ్‌కి కాకుండా ఎవరికి ఫ్లోర్ లీడర్ ఇస్తే బాగుంటుందనే కసరత్తుల్లోనే బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ గత సమావేశాల మాదిరిగానే పార్టీ హై కమాండ్ సూచన మేరకు అంశాన్ని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం బీఏసీ సమావేశానికి వెళ్లనున్న ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ►తెలంగాణ మూడో శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30కి శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ►ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం ఉంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ►ఇక, నేడు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు. రేపటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. నేడు మిగతా బీఆర్ఎస్ సభ్యులంతా హాజరుకానున్నారు. ►బడ్జెట్లోని అంశాలపై 12 నుంచి చర్చ జరగనుంది. ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని భావిస్తుండగా, గురువారం స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సమావేశ తేదీలు, ఎజెండా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఏసీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో విపక్ష పార్టీల నేతలతో సంప్రదించి సభ నిర్వహణ తీరు తెన్నులపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రోటోకాల్‌లో తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్‌బాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు వచ్చేలా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రస్తుత సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో గతంలో తాను కూడా బాధితుడినని గుర్తు చేశారు. -
8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశా లు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేష న్ జారీ చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ను 8వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న తమిళిసై సాయంత్రం 5 గంటలకు అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ఆమె అమిత్ షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనా విధానంసహా పలు రాజకీయ అంశాలపై అమిత్ షా ఆరా తీశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించినట్లు తమిళిసై ఎక్స్ వేదికగా వెల్లడించారు. -
గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨@DrTamilisaiGuv #tribalwelfare pic.twitter.com/dUAXqZ5Zi4 — Upasana Konidela (@upasanakonidela) February 1, 2024 -
రోగాలకు ‘గూగుల్ చికిత్స’ వద్దు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
‘గ్యారంటీ’గా ముందుకెళ్తున్నాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. యువతలో అపోహలు వద్దు గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: రాజకీయ పార్టీల్లో కొన సాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా ఆమోదించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘ఇది ద్వంద్వ నీతి కాదా? గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కాదా?’ అని శుక్రవారం ‘ఎక్స్’లో నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీల విషయంలో ఒకే రకంగా ఉండాలని, కానీ గవర్నర్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల అప్పగింత గొడ్డలిపెట్టు లాంటిదే.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించాలనే నిర్ణయం తెలంగాణకు గొడ్డలిపెట్టు లాంటిదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు, విద్యుత్ అవసరా లకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండదని అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరి గిన బీఆర్ఎస్పీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు, ఇతర మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేద ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం.. ఢిల్లీలో సంతకాలు పెట్టిందంటూ కేంద్రం మినిట్స్ విడు దల చేయగా, రాష్ట్ర మంత్రులు మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడటం శోచనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖామంత్రిని తమ పార్టీ పార్లమెంటరీ బృందం కలిసి వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపా రు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై బురద చల్లడం మానుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆదిలాబాద్‌కు వచ్చిన ప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని మాట ఇచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్‌షా తన మాటను నిలబెట్టుకోవాలని, బీసీ గణన చేపట్టాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
ఆ మాటలు గవర్నర్‌కు తగవు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంగా ఎన్నికై పదేళ్లపాటు పనిచేసిన ప్రభుత్వాన్ని నియంతృత్వమని, ప్రజాస్వామ్య విలువలు లేవని చెప్పడం గవర్నర్ స్థాయికి తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి ఇది నిదర్శనమన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ కోసం కొట్లాడిన దాసోజుశ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ డిసెంబర్ 3వ తేదీ ముందు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి.. ఈ ఇద్దరు రాజకీయ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనే సాకు చూపుతూ అభ్యరి్థత్వాన్ని తిరస్కరించారు. కానీ ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కోదండరాంను కాంగ్రెస్ అదే గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తే గవర్నర్ ఎలా ఆమోదించారు? గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అమిత్ షా ఆదేశాల మీద వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్‌కి వెళ్లింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుని.. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ ఆదానీని విమర్శిస్తే రేవంత్ మరోవైపు అతనితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి ఇప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌కు మద్దతు పలకడమే ఆశ్చర్యకరం’’ అని కేటీఆర్ విమర్శించారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలి గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేక ఇన్చార్జిలకు అప్పగించకుండా సర్పంచ్ల పదవీ కాలం పొడిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరోనా మూలంగా రెండేళ్ల పాటు సర్పంచ్‌లు పరిపాలన సాగించలేక పోయారని, ఈ నేపథ్యంలో వారి పదవీ కాలాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు లేదా తిరిగి ఎన్నిక నిర్వహించేంత వరకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచి్చన హోం శాఖ మాజీ మంత్రి మహమూద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న కేటీఆర్ చొరవతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న మహమూద్ అలీ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. -
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేత లు దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలివిడిగా మాట్లాడారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఏఐసీసీ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బండ ప్రకాశ్, ఆ ర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మ పురస్కార గ్రహీతలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చిందు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తేనీటి విందుకు హాజరుకాగా, జ్ఞాపిక అందజేసి గవర్నర్ అభినందించారు. కాగా, త్వరలో ఏపీ పర్యటనకు వెళుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలపై ఏపీతో చర్చిస్తామన్నారు. -
తమిళిసై.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. కానీ, నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరామ్‌ను ఎలా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళిసై ఆగమేఘాల మీద స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు. రాజభవన్ నడుస్తుంది.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు రేవంత్ రెడ్డికి కాదు బాధ్యులు కాదు.. రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం.. ఈరోజు ఎందుకు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారం, చేష్టలు చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. రేవంత్ రెడ్డి వెళ్లి అమిత్ షాను కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆర్ఎస్కు, మరొకటి కాంగ్రెస్‌కు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తోంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?.. తమిళిసైపై హరీష్ రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి హరీష్‌రావు సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కూడా హరీష్ ఫైరయ్యారు. ద్వంద్వ నీతి కాదా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలైంది. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా?. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?. రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో… — Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2024 -
కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై
-
నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై
Live Updates.. ►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ►ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ►హైదరాబాద్ సెక్రటేరియట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ►రిపబ్లిడ్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. ►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’. ►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై ►పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. ►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ►నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. ►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సీఎం రేవంత్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. -
ఓటర్లపై ఒత్తిడి తెస్తే.. చర్యలు తీసుకోవాల్సిందే!
కూకట్పల్లి (హైదరాబాద్): ‘‘ప్రజలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు హక్కును విని యోగించుకునేలా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఒత్తిడి చేసే లా అభ్యర్థులు వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ బాగా పనిచేసింది. కానీ ఓ అభ్యర్థి తనకు ఓటేయకపోతే ఆత్మ హత్య చేసుకుంటానంటూ ప్రచార మాధ్యమా లలోకెక్కారు. అది విచారకరం. ప్రజలను ఒత్తి డికి గురిచేసి గెలవడానికి అభ్యర్థి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం సరి కాదు..’’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమ ర్శించారు. గురువారం మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ప్రజలు ఓటు హక్కును ఆయుధంలా ఉపయోగించుకుని తమ జీవన పరిస్థితులకు మార్చుకోవచ్చని.. ఆ మార్పే దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు. మంచి వారికి ఓటేయాలి.. తమ సమస్యలను వినడంతోపాటు అభివృద్ధి చేయగల సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకా శం ఓటు ద్వారానే లభిస్తుందని.. అభ్యర్థుల గుణ గణాలను పూర్తిగా విశ్లేషించాకే ఓటేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గుంతల రోడ్లను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలను తిట్టేకంటే ముందు మంచివారికి ఓటు వేయటం మంచి నిర్ణయమన్నారు. ఓటింగ్ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకొని కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్తున్నారని.. ఆ ఆలోచన సరికాదని స్పష్టం చేశారు. యువత ఓటు హక్కును తప్ప కుండా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మాట్లా డుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. గెలవకుంటే శవయాత్ర అంటూ.. గతంలో కేసీఆర్ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, దీంతో కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత తాను గెలిస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ)గా రాష్ట్ర మా జీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యా రు. అదేవిధంగా కమిషన్‌లో పది మంది సభ్యు ల నియామకానికి అవకాశం ఉండగా.. ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల మేరకు ఐదుగురిని సభ్యులుగా నియమించడానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ని యమితులైన చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఆరే ళ్ల పాటు ఉంటుంది. అయితే 62 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించి.. సెర్చ్ కమిటీ వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా చర్యలు వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిణామాల నేపథ్యంలో గతంలో కమిషన్ చైర్మన్‌గా వ్యవ హరించిన బి.జనార్ధన్‌రెడ్డి డిసెంబర్లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యులు కూడా రాజీనామా చేయడంతో కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో పీఎస్సీల పనితీరును అధ్యయనం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాను స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై టీఎస్పీఎస్సీ నిర్వహణకు సలహాలు సూచనలు కోరారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలనకు సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం సెర్చ్ కమిటీ చైర్మన్, సభ్యుల కోసం కొన్ని పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. కాగా ఈ మేరకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1962 డిసెంబర్ 3న ఆయన జన్మించారు. దాదాపు 36 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగిన మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేశారు. టీఎస్పీఎస్సీ టీమ్ ఇదే చైర్మన్: ఎం.మహేందర్‌రెడ్డి(రిటైర్డ్ ఐపీఎస్) సభ్యులు: అనితా రాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమిర్ ఉల్లా ఖాన్, (రిటైర్డ్ ఇండియన్ పోస్టల్ సర్వీస్), ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబడి రామ్మోహన్రావు, పాల్వాయి రజినీకుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల బయోడేటాలు పేరు: ఎం.మహేందర్ రెడ్డి స్వస్థలం : ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కిష్టాపురం గ్రామం పుట్టిన తేదీ : 1962 డిసెంబర్ 3 సామాజికవర్గం: రెడ్డి (ఓసీ) విద్యార్హతలు: ఆర్ఈసీ వరంగల్ నుంచి బీటెక్ (సివిల్), ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ హోదా: రిటైర్డ్ డీజీపీ (2022 డిసెంబర్) (1986 బ్యాచ్ ఐపీఎస్) పేరు: అనితా రాజేంద్ర స్వస్థలం : రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ పుట్టిన తేదీ : 1963 ఫిబ్రవరి 04, బీసీ–బీ (గౌడ) విద్యార్హతలు: బీకాం, ఎంఏ, ఎల్ఎల్ఎం హోదా: రిటైర్డ్ ఐఏఎస్ పేరు: అమిర్ ఉల్లా ఖాన్ స్వస్థలం : హైదరాబాద్ సామాజికవర్గం : ముస్లిం వయస్సు: 58 ఏళ్లు అనుభవం: యూఎన్‌డీపీలో పనిచేస్తున్నారు. ఉర్దూ వర్సిటీ, నల్సార్, ఐఎస్బీ, ఎంసీఆర్హెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్. హోదా: ఇండియన్ పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా పేరు: పాల్వాయి రజనీకుమారి స్వస్థలం : సూర్యాపేట పుట్టిన తేదీ: 06–05–1972, ఎస్సీ మాదిగ విద్యార్హతలు: ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ హోదా: టీచర్, వీడీఓ, మున్సిపల్ కమిషనర్ పేరు: వై.రామ్మోహన్రావు స్వస్థలం : హైదరాబాద్ పుట్టిన తేదీ : 1963 ఏప్రిల్ 4 సామాజికవర్గం : ఎస్టీ–ఎరుకల విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ హోదా: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ జెన్కో పేరు: డాక్టర్ నర్రి యాదయ్య స్వస్థలం: మల్లారెడ్డిగూడెం, యాద్రాది భువనగిరి జిల్లా పుట్టిన తేదీ : 1964–4–10 సామాజికవర్గం: బీసీ–బీ(కురుమ) విద్యార్హతలు: ఎంటెక్ , పీహెచ్డీ హోదా: సీనియర్ ప్రొఫెసర్, జేఎన్టీయూహెచ్, కూకట్పల్లి -
పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్
-
TSPSC చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి.. గవర్నర్ ఆమోదం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్ పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. -
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సీరియస్
-
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. 75వ గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని గవర్నర్‌ను వారు సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొని అక్కడ భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయాలను గవర్నర్‌కు ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. అలాగే లండన్ పర్యటన, అక్కడి ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌తో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం త్వరగా జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లతోపాటు, ఇదివరకే నిర్వహించిన పరీక్షల ఫలితాల వెల్లడికి వీలవుతుందని తెలిపినట్లు తెలిసింది. -
‘గవర్నర్’ కోటాపై మెలిక !
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీటముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్‌కుమార్, కె.సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫారసులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తొలుత కేసు విచారణార్హతను తేల్చాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మరొకరి పేరును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
-
రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు
-
TSPSC: ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో, టీఎస్పీఎస్సీ నూతన ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. వివరాల ప్రకారం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్లో టీఎస్పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. దిగజారిన ప్రతిష్ట ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. 2021 మే 21వ తేదీన టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగింది. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఆ ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరుసగా దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటలు జారీ చేస్తూ వచి్చంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో ఇంటిదొంగలు తయారయ్యారు. గ్రూప్–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీసుల కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షల రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. క్రమంగా పరిస్థితులు కాస్త సద్దుమణగడం, పరీక్షల పునర్ నిర్వహణ తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు. ఇక, తెలంగాణలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా రాజీనామా చేశారు. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. -
పేద విద్యార్థులు, దాతల మధ్య వారధిగా రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్ పనిచేస్తుందని గవర్నర్ అన్నారు. అయోధ్య రామాలయ పాదుకలకు పూజలు అయోధ్య రామాలయం కోసం చల్లా శ్రీనివాసశాస్త్రి రూపొందించిన స్వర్ణ పాదుకలకు గవర్నర్ తమి ళిసై మంగళవారం రాజ్‌భవన్‌లో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ఈ పాదుకలు నిత్యం కోట్లాది మంది భక్తుల పూజలను అందుకోనున్నాయని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. నరసింహన్ భేటీ: రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవ ర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఎమ్మెల్సీల తిరస్కరణ పిటిషన్.. జనవరి 24కు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల తిరస్కరణపై దాశోజు శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు.. ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టుకు తెలియజేశారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్‌భవన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) ఆయన వెంట ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి. గవర్నర్ దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం గవర్నర్‌తో దాదాపుగా 15 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని గవర్నర్‌ను సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పాలన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, ప్రణాళికలను రేవంత్ వివరించినట్టు సమాచారం. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సర ఆరంభం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. ఓపెన్‌హౌస్ నిర్వహించి అతిథుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర సీనియర్ అధికారులు, 2,500 మంది సాధారణ ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ పిలుపు మేరకు పూలబోకేలకు బదులుగా చాలామంది అతిథులు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను కానుకలుగా ఇచ్చారు. దీంతో 25,000 నోట్‌బుక్స్ రాజ్‌భవన్‌కు అందాయి. ఈ పుస్తకాలను జీహెచ్ఎంసీ, గిరిజన ప్రాంత మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌కు సంబంధించిన వాట్సాప్ చానల్ ( https:// whatsapp. com/ channel/0029VaIxdrC4 NVicOQDVvY3 L)ను కూడా ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాల వార్తలు, ఫొటోలను దీనిద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి: గవర్నర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, వర్సిటీల్లో తక్షణమే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రాజ్‌భవన్ తరఫున కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తమిళిసై హామీ ఇచ్చింనట్టు సమాచారం. -
గవర్నర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ / సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును తీసుకురావాలని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకున్నారు. 2024లో సైతం అన్ని రకాల సామాజిక రుగ్మతలపై పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించడంతో పాటు, సమానత్వం, శాంతియుత, సుస్థిర, ఆరోగ్యకర సమాజం కోసం కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
నా రాజీనామా ఊహాగానమే
సాక్షి హైదరాబాద్/కంటోన్మెంట్: తాను గవర్నర్‌గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని అనురాధా టింబర్స్‌ను సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్‌గా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు శ్రీరాముడితో పాటు ప్రధాన మంత్రి మోదీ చేతుల్లో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. పూల బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులను గవర్నర్ ఆహ్వనించినట్టు తెలిసింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులను తీసుకురావాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. -
రాజీనామా వార్తలపై స్పందించిన గవర్నర్ తమిళిసై
-
TS: రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని... గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్.. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తాన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. -
విజయకాంత్ మృతి పట్ల మోదీ, స్టాలిన్ ఏమన్నారంటే..
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. స్టాలిన్ సంతాప సందేశంలో, 'మా ప్రియ మిత్రుడు - నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఎంతో బాధను కలిగించింది. మంచి మనసున్న మిత్రుడు విజయకాంత్ సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ తన కఠోర శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. నటుడిగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా.. ఏ పని చేపట్టినా దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడు. అని స్టాలిన్ తెలిపారు. కొద్దిరోజుల నుంచి విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతుండగా ఈరోజు (డిసెంబర్ 28) ఉదయం మృతి చెందాడు. విజయ్ కాంత్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. నేడు తమిళనాడు లోని అన్ని థియేటర్స్‌ను క్లోజ్ చేస్తున్నారు. అన్ని షో లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ నటించిన చివరి సినిమా మధుర విరన్ (2018)లో విడుదలైంది. ఆయన తమిళ చిత్రాల్లో మాత్రమే నటించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ: విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. విజయకాంత్‌ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అతని నటన లక్షల మంది హృదయాలను తాకింది. ఆపై రాజకీయ నాయకుడిగా, అతను తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రజా సేవలో ఉంటూ చాలా ఏళ్లుగా పోరాడారు. అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పూడ్చడం కష్టతరమైనది.' అని మోదీ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై: 'అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత నా సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేడు ఒక మంచి నటుడిని, మంచి రాజకీయ నేతను కోల్పోయాం. ఆయన నాకు మంచి సోదరుడు.' అని తమిళిసై తెలిపారు. కమల్ హాసన్: నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రానించారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్: విజయకాంత్‌గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక పవర్‌హౌస్. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. చిరంజీవి: మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అయనొక మంచి వ్యక్తిత్వంతో పాటు తెలివైన రాజకీయ నాయకుడు. అయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ, ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన ప్రజాదరణతో పాటు ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. మంచు విష్ణు: విజయకాంత్ గారు లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సినిమాలు చూస్తూనే నా బాల్యం అంతా గడిచింది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో గుర్తుండిపోతాయి. ఆయన ఎంతో అభిమానంతో మాట్లాడుతారు. రంగం ఏదైనా సరే ఆయన నిజమైన నాయకుడని మంచు విష్ణు తెలిపారు. సంతాపం తెలిపిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంతాపం తెలిపింది. తెలుగు చిత్రసీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని వారు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 உடல் நலக்குறைவால் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த தேமுதிக தலைவர்,சகோதரர் கேப்டன் திரு.விஜயகாந்த் அவர்கள் உயிரிழந்த செய்தியறிந்து மிகவும் மனவேதனை அடைந்தேன். நல்ல திரைப்படக்கலைஞர்.... நல்ல அரசியல் தலைவர்.... நல்ல மனிதர்.... நல்ல சகோதரர்.... ஒட்டுமொத்தமாக ஒரு நல்லவரை நாம்… pic.twitter.com/oPVTWZ1uRD — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 28, 2023 Heartbroken to know that our ‘Puratchi Kalingar’, ‘Captain’ Vijayakanth is no more. He was a wonderful human being, Hero of the Masses,a multi faceted personality and an astute politician. Though he never acted in straight Telugu films, he is hugely popular and loved by the… pic.twitter.com/r0N4olxFrL — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
గవర్నర్ తమిళిసై పొలిటికల్ రీ ఎంట్రీ.. పోటీ అక్కడేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు నుంచే తమిళిసై బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: Praja Bhavan Rash Driving Case: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్ -
గవర్నర్ తమిళిసై పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం
-
మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై నివాళులు
-
At Home Event: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం (ఫొటోలు)
-
పీవీపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక ఢిల్లీ పర్యటలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడి తెలంగాణ భవన్లో జరిగిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంచింది. On his death anniversary, we pay tribute to the former Prime Minister of India, PV Narasimha Rao. Often remembered as the 'Father of Indian Economic Reforms', who revolutionised the Indian economy, we honour him for his exceptional contributions to the nation. pic.twitter.com/sHD7W01XO0 — Congress (@INCIndia) December 23, 2023 As we observed the 19th death anniversary of former Prime Minister Shri.PV Narasimha Rao Garu,paid floral tributes to him at #Hyderabad. A great son of #Telangana Soil, he's an erudite scholar,a statesman & administrator par excellence.#PVNarasimhaRao pic.twitter.com/atAOi8HkSk — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 23, 2023 దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం శ్రీ @revanth_anumula గారు మరియు మంత్రులు. pic.twitter.com/b6Z7w1XHHN — Telangana Congress (@INCTelangana) December 23, 2023 -
రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్‌హోం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్ హోం నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు, విపక్ష నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆహూతులను పరిచయం చేసుకున్న ద్రౌపదీ ముర్ము కాసేపు వారి తో ముచ్చటించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై శివుని కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్రావు, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుదీర్‌రెడ్డి, పర్ణికారెడ్డి, యశస్విని, రాగమయి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, మండలి, అసెంబ్లీ సభ్యులు పలువురు అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రతిభతోనే..దేశ గౌరవం ఇనుమడిస్తుంది
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు కనబర్చే ప్రతిభతోనే దేశ గౌరవం పెరుగుతుందని రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి, పర్యావరణంపైనా అవగాహన పెంచుకోవాలని, స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. జీవితంలో అభిరుచులను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరమని, ఇవి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా పని చేస్తాయన్నారు. దేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్ప గొప్ప విద్యార్థులను అందించి దేశానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాంటి అనేకమంది గొప్పవాళ్లను ఈ స్కూల్ అందించిందని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని ఉండొచ్చని, దాని అనుభవాల ఆధారంగా విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి చదువుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించినందుకు హెచ్‌పీఎస్‌ను అభినందించారు. పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందంటూ... ఈ స్కూల్లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. చదువు, క్రీడలు రెండు కళ్లు: గవర్నర్ విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్లలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి క్రీడా, సామాజిక రంగానికి తరలించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజంలో ఎలా ప్రవర్తించాలో అలవడుతుందని చెప్పారు. హెచ్‌పీఎస్ ఆనేక దిగ్గజాలను తయారు చేసిందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశంపాల్గొన్నారు. అంతకుముందు స్కూల్ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. వేడుకలు ఏడాది పొడవునా జరగనున్నాయి. -
తెలంగాణ గవర్నర్ ప్రసంగం అసత్యాలు, అభూత కల్పనలతో నిండిందన్న కేటీఆర్..ఇంకా ఇతర అప్డేట్స్
-
10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు
-
TS: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగించారు. అంతా ఊహించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమలులోకి తీసుకువస్తామ్ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్‌లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది’ అని గవర్నర్ అన్నారు. ‘యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్ అన్నారు. ‘లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని గవర్నర్ తెలిపారు. ఇదీచదవండి..యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ -
నేడు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
-
నేడు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
-
వచ్చే ఐదేళ్ల లక్ష్యంపై గవర్నర్ ప్రసంగం తయారీ!
రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏమేం చేయనుంది, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను ప్రస్తావించనుంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం రాష్ట్ర శాసనసభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ భేటీ జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగ పాఠంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనుండటంతో.. ప్రసంగ పాఠంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. పాలన, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఐదేళ్లపాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ విధానాలపై సమీక్ష.. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో తాము అనుసరించే విధానాలను ప్రకటించాలని తీర్మానించింది. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటి అమలును పాక్షికంగా ప్రారంభించిన అంశాన్ని వివరిస్తూ.. ఇతర గ్యారంటీల అమలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల్లో ముంచిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో.. గవర్నర్ ప్రసంగంలో, తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ఆయా అంశాలను ప్రస్తావించాలని కేబినెట్ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇక రైతుబంధు, ధరణి పోర్టల్, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై త్వరలో మరోమారు సమావేశం అవుతామని మంత్రులకు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. విభాగాల వారీగా శ్వేతపత్రాలు వివిధ ప్రభుత్వ శాఖల వారీగా అప్పులు, పనులు, పథకాల తీరుతెన్నులను వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదల మొక్కుబడిగా, హడావుడిగా కాకుండా పూర్తి వివరాలు, ఆధారాలతో ఉండాలని.. ఆ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో లోతుగా సమీక్షించి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్వేతపత్రాల విడుదల తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా మంత్రులు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై తొందరపాటుతో స్పందించకుండా.. లోతుగా అవగాహన చేసుకున్నాకే ప్రతిస్పందించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో.. సీఎం రేవంత్‌తోపాటు ట్రెజరీ బెంచ్ (అధికార పక్షం)నుంచి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినందున పూర్తి సన్నద్ధతతో రావాలని పేర్కొన్నట్టు సమాచారం. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటివరకు ఆమోదించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. జనార్దన్‌రెడ్డి సోమవారం రాజీనామా సమర్పించగా, పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌కు దానిని ఆన్లైన్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం గవర్నర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని, రాజీనామాను ఆమోదించే విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం చోటుచేసుకోవడంతో రాతపరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తుపట్ల గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. -
TSPSC: జనార్ధన్ రెడ్డి రాజీనామా.. ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పై కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరపనుండగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. TSPSC చైర్మన్ బి. జనార్ధన్‌రెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఇప్పటికే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ రాజీనామా తిరస్కరించడంతో సీఎం జరిపే సమీక్షకు జనార్ధన్‌రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, రాతపరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీ, తదుపరి నియామక ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో సచివాలయంలో సమీక్షించనున్నారు. గ్రూప్-2 పోటీ పరీక్షలు, గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ,గ్రూప్-3 షెడ్యూలు ఖరారు, ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, జనార్దన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖను అందజేశారు. ఇదీచదవండి..ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ -
Telangana: కొలువుదీరనున్న కొత్త సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యు డు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొ త్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. కేసీఆర్, రాజాసింగ్ దూరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించినందున తాను ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రకటించారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. బీఆర్ఎస్కు విపక్ష హోదా శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ మూడో శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో అధికారులతో సమీక్ష తర్వాత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, ఐఏఎస్ అధికారులు అశోక్‌రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే.