మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే తమ తరఫున ప్రధాని ఎవరు అవుతారనేది కూడా ఆ పార్టీలకు తెలియదని తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండబోతున్నదని, కొన్ని సీట్లలో మాత్రం బీఆర్‌ఎస్ పోటీ పడుతుందన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలవడంతోపాటు ఎక్కువ మంది కేంద్రంలో మంత్రులు అవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. ‘దక్షిణాదికి తెలంగాణ ముఖద్వారమని ప్రధాని మోదీ చెప్పారు.
రాష్ట్రాభి వృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు.ఐదేళ్లలో తెలంగాణకు 22సార్లు వచ్చారు’ అని చెప్పారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో తమిళిసై మీడి యాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వైఫ ల్యం చెందింది. తెలంగాణకోసం ఆ పార్టీ పని చేయలేదు. గత రెండేళ్లలో కేసీఆర్ నాతో మాట్లాడ లేదు. రాజ్యాంగ సంస్థలను గౌరవించలేదు’ అని అన్నారు. మహిళ సాధికారత కోసం మోదీ పనిచేస్తున్నారని, చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పన, ఇతర నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెబుతున్నారే తప్ప అందుకు నిధులు ఎలా సమకూరుస్తారో తెలియదన్నారు.
అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చిందని మండిపడ్డారు. తాను రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కూడా వారి మద్దతు కొనసాగడం సంతోషదాయక మన్నారు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్, ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆమె తప్పుబట్టారు. 2001లో అప్పటి ప్రధాని వాజపేయి రిజర్వేషన్లు ఉండాలని చెబితే, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని తమిళిసై గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment