
సాక్షి, యాదాద్రి భువనగిరి: కూరెళ్ల విఠలాచార్యా గ్రంథాలయానికి రూ.10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ ‘నూతన భవనం’పై అంతస్తులోని ‘సాయి సభా మందిరం’ ను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆచార్య విఠలాచార్యుల గురించి ‘మన్ కి బాత్’ లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ తమిళసై కృతజ్ఞతలు తెలిపారు. ‘విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ని వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు’అని గవర్నర్ తమిళసై విఠలాచార్యులపై ప్రశంసలు కురిపించారు.