
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం యాగశాలలో మహా పూర్ణాహుతిలో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్‌కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్‌రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు.
యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment