Jishnu Dev Verma
-
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖయమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు అందించారు.కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్ ఆహ్వానించారు. -
గవర్నర్ తో సీతక్క భేటీ
-
గవర్నర్‌తో సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఇవాళ (మంగళవారం) తెలంగాణ మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ‘‘ 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞత్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం. అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము’’ అని సీతక్క పేర్కొన్నారు.Met Telangana Governor @JishnuDevVerma at Raj Bhavan, appealed him to approve the long-pending bill that grants municipal status to Mulugu. The bill, passed by the Assembly in 2022, has faced delays due to technical and legal issues. Despite being included in the Telangana… pic.twitter.com/MEYb5Jigtv— Danasari Seethakka (@meeseethakka) September 24, 2024చదవండి: బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు! -
తెలంగాణ గవర్నర్‌తో డీఆర్డీఓ మాజీ చీఫ్ భేటీ
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఈ డీఆర్డీవో మాజీ చీఫ్.. రాష్ట్రంలో ఏరోనాటిక్స్, అంతరిక్ష,రక్షణ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణదేవ్కు సతీష్ రెడ్డి మిషన్ శక్తి నమునా జ్ఞాపికను అందజేశారు. -
రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్: యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
సుస్థిర అభివృద్ధి సాధించాలి
హనుమకొండ అర్బన్: చారిత్రక వారసత్వ నగరం ఓరుగల్లు సుస్థిర అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన అయన హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో భేటీ అయ్యారు. అదే విధంగా నగరంలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి, పద్మాక్షి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కాకతీయ ఆలయాల శిల్పకళను పరిశీలించారు. వరంగల్ కోట, వరంగల్ ఎన్ఐటీలను సందర్శించి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హనుమకొండ రెడ్‌క్రాస్‌ను సందర్శించి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా అదనపు బ్లాక్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వరంగల్ నగరం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదాదేవి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. లక్నవరం సరస్సులో బోటింగ్మంగళవారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో బసచేసిన గవర్నర్ బుధవారం ఉదయం సరస్సులో మంత్రి సీతక్క, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. సరస్సు అంతా కలియదిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. -
ప్రభుత్వ పథకాలు భేష్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, యాదాద్రి: షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి, పేదలు, గిరిజనులు, ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు, ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంగళవారం మూడు రోజుల రాష్ట్ర పర్యటన ప్రారంభించిన గవర్నర్.. యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మంత్రి ధనసరి సీతక్క (అనసూయ), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్కను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రామప్ప గుడి, కోటగుళ్లు సందర్శన ములుగు జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. రామప్ప గుడి, సరస్సును సందర్శించారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ నిర్మాణం, విశిష్టత, శాండ్ బాక్స్ టెక్నాలజీ, శిల్పసంపద రమణీయతను తెలుసుకున్నారు. రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు.అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు గణపేశ్వరాలయాన్ని గవర్నర్ వర్మ సందర్శించారు. తర్వాత లక్నవరం చేరుకుని రాత్రిబస చేశారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ రణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. కాగా గవర్నర్ బుధ, గురువారాల్లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలు బాగుండాలని యాదాద్రీశుని కోరుకున్నా అంతకుముందు ఉదయం రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన గవర్నర్ తొలుత యాదాద్రికి చేరుకున్నారు. విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో గవర్నర్‌కు అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ ముందుగా శ్రీస్వామివారి పుష్కరిణి వద్ద స్నాన సంకల్పం చేశారు. అఖండ జ్యోతి దీపారాధన చేసి మొక్కు టెంకాయ సమర్పించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోనికి ప్రవేశించారు. ధ్వజ స్తంభం వద్ద మొక్కిన తర్వాత అంతరాలయంలో అర్చన పూజచేశారు. దర్శనానంతరం గవర్నర్‌కు మహా మండపంలో వేద మంత్రాలతో వేదాశీ్వరచనం చేశారు. ఆలయం కట్టడాలను పరిశీలించిన గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు స్వామి వారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామి వారి ప్రసా దాన్ని అందజేశారు. కలెక్టర్ హనుమంత్ కె.జెండగే, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన వెంట ఉన్నారు. కాగా తెలంగాణ ప్రజలు బాగుండా లని లక్ష్మీనరసింహస్వామిని కోరుకున్నానని గవ ర్నర్ దేవాలయం వెలుపల మీడియాతో చెప్పారు. -
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ..
-
గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర నాలుగో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజలకు కొత్త గవర్నర్ సందేశం విభిన్న సంస్కృతులు, సుసంపన్నమైన వారసత్వం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచి్చన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సందేశాన్ని విడుదల చేశారు. సమృద్ధిగా సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూములతోపాటు వ్యాపార, వాణిజ్యానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేశారు.ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ వంటి విలువలతో కూడిన మన రాజ్యాంగం నిర్దేశించిన బాటలో కలిసి నడుస్తూ మార్పు దిశగా ప్రయాణాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. యువత, విద్య, సాధికారత, ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రశంసించారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం: శంషాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమానాశ్రయంలో గవర్నర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సాయుధ దళాలు గౌరవవందం చేశాయి. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి.