గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిసిన సీఎం రేవంత్‌ | Cm Revanth Meets Governor Jishnu Dev Varma At Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిసిన సీఎం రేవంత్‌

Published Wed, Nov 6 2024 8:57 PM | Last Updated on Wed, Nov 6 2024 9:02 PM

Cm Revanth Meets Governor Jishnu Dev Varma At Raj Bhavan

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖయమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు అందించారు.

కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. మగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్‌ ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement