రేవంత్ ఓ బచ్చాగాడు...: నాయిని
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌పై అధికారా లు గవర్నర్‌కు ఇచ్చారు.. గవర్నర్ ఎవరు? ఆయనకెట్లా ఇస్తారు... హైదరాబాద్‌పై పెత్తనం ఎలా చెలాయిస్తారు. రేవంత్‌రెడ్డి బచ్చాగాడు... రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. సీఎం చంద్రశేఖర్‌రావు కొడుకంత లేదు అతని వయసు కేసీఆర్‌నే తిడతాడా.. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణోడో, ఆంద్రోడో తేల్చుకోవాలి. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా’’.. అంటూ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అటు ప్రతిపక్షాలపై ఇటు గవర్నర్‌పై తీవ్ర పదజాలం తో విరుచుకుపడ్డారు.
మంగళవారం సికింద్రాబాద్‌లోని గ్రాండ్ మినర్వా హోటల్‌లో తెలంగాణ నాన్ గవర్నమెంట్ అసోసియేషన్(టీనా) ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్‌జీవోల పాత్ర అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌కు అప్పగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీ పాలన మీరు చూసుకోండి... గల్లీలో మా పాలన మేము చూసుకుంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారులు విద్యాసాగర్‌రావు, సంస్థ ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, హెలెన్ శీల, సులోచన, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.