Nayani Narshimha Reddy
-
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాయిని సతీమణి అహల్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి నాయిని అహల్య (64) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. భర్త చనిపోయి 4 రోజులు గడవక ముందే ఆమె కూడా తుది శ్వాస విడిచారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి కూడా మరణించడంతో వారి కుమారుడు, కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. గత నెల 28న నాయినికి, ఆ తర్వాత ఆయన భార్య అహల్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 10న పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అదే సమయంలో ఇద్దరికీ ఈ నెల 13న న్యుమోనియా సోకింది. ఆరోగ్యం క్షీణించడంతో నాయిని ఈ నెల 22న ఆస్పత్రి లో కన్నుమూశారు. భర్తను కడసారి చూసేందుకు అహల్యను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లోనే తీసుకొచ్చి చూపించి మళ్లీ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. నీతోపాటే నేనూ.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామం నాయిని నర్సింహారెడ్డిది కాగా, దానికి 5 కి.మీ. దూరంలోని పెద్ద మునిగాల గ్రామం అహల్యది. మేనమామ కూతురు అయిన అహల్యను నాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రగతి శీల ఉద్యమాలకు అండగా నిలిచిన నాయినిపై ఎన్నో కేసులు పోలీసులు పెట్టినా ఆమె ఎన్నడూ కుంగిపోలేదు. ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నాయిని ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లే సమయంలో భార్యకు ఫోన్ చేసి ఆమెకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. అహల్య పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆమె నివాసానికి తీసుకు రానున్నారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు.. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నాయిని అహల్య మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
కార్మిక నేతకు తుది వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియ లు గురువారం మధ్యాహ్నం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాయి ని మృతి చెందినట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని నాయిని కుటుంబసభ్యులను పరామర్శించారు. తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహి ల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని నాయిని నివాసానికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్ద కడ సారి చూపుకోసం వేచి ఉన్నారు. నాయిని భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథో డ్, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి నాయిని అం తిమ యాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానంలో నాయిని పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. పాడె కూడా మోశారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాయిని చితికి కుమారుడు దేవేందర్‌రెడ్డి నిప్పంటించారు. ఆస్పత్రి నుంచి భార్య.. నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాయినితో పాటు ఆమె కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో ఆమె ను మినిస్టర్ క్వార్టర్స్‌కు తీసుకురాగా భర్త భౌతిక కాయాన్ని చూసి రోదించారు. అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి నాయిని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కార్మిక సమస్యల పరిష్కారంలో నాయిని కృషి చిరస్మరణీయం న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువు రు ప్రముఖులు సంతాపం తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘స్నేహశీలి నాయిని ఆ త్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం’’అని వెంకయ్య తన సందేశంలో పేర్కొన్నారు. పలువురి సంతాపం నాయిని నర్సింహారెడ్డి మృతికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ యాధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ఎంపీ కోమ టి రెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినో ద్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, టీఎన్జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మరో నేత కారం రవీందర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, నాయిని పార్థివదేహానికి డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. హాం మంత్రిగా ఉన్నప్పుడు నాయిని పోలీసుశాఖకు ఎన్నో సేవలు చేశారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ప్రతీక్షణం తెలంగాణ కోసం .. నాయిని తన జీవితంలో ప్రతీక్షణం తెలంగాణ కోసం శ్రమించారు. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. నాయిని మృతితో తెలంగాణ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది – గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరచిపోలేని అనుబంధం నాయిని మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధం మరచిపోలేనిది. ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. – సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి నాయిని మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం అత్యంత బాధాకరం అని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని ఓ గొప్ప కార్మిక నాయకుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జననాయకుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకుడు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోం మంత్రిగా మనందరి మనసులో నాయిని నర్సింహారెడ్డి చిరస్థాయిగా నిలచిపోతారు. – మంత్రి కేటీ రామారావు. -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపారు. అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టివేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న పోలీసులు గ్యాంగ్‌లో ఒక సభ్యున్ని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి మూడువేలకు పైగా సొమ్మును రికవరీ చేశారు. ఈ ముఠాలోని ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కాగా కార్మిక, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు నగరంలోని మహా ప్రస్థానం స్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్ని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. (పాడె మోసిన కేటీఆర్) -
నాయిని అంత్యక్రియలు: పాడె మోసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్న్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పడలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. -
నర్సన్న మరణం తెలంగాణకు తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అర్ధరాత్రి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకిన విషయం తెలిసిందే. నాయిని మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. నర్సన్న మరణం పార్టీకి, తెలంగాణకు తీరనిలోటు: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేశారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని, నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం: నాయినితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఉద్యమాలు, త్యాగాలు, పదవులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. నాయిని చనిపోవడం బాధాకరం: తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలక పాత్ర పోషించారని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. 2001 నుంచి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. తొలి హోంమంత్రిగా పనిచేశారని,1975 ఎమర్జెన్సీ కాలంలో రైల్వేను స్తంభింపచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచారని అన్నారు. కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి అని, వారి హక్కుల్ని కాపాడారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మరణం చాలా బాధకమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయినిది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థివదేహాన్ని ఆయన ఉదయం తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో కలసి సందర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా తొలి తెలంగాణా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుండి తొలి తెలంగాణా మంత్రి వర్గంలో నాయినితో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాయిని మరణం అత్యంత బాధాకరం నాయిని నర్సింహారెడ్డి మరణం అంత్యంత బాధకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. తొలి మలిదశ ఉద్యమాల్లో నాయిని పోరాటం గొప్పది గుర్తుచేశారు. కార్మికులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేశారని అన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు. నాకు అత్యంత ఆత్మీయుడు నాయిని తనకు అత్యండ ఆత్మీయుడని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వాసి అని, ఆయన తమకు ఆదర్శం అన్నారు. నాయిని చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన్ని చూసి ప్రభావితుడనై రాజకీయాల్లోకి వచ్చానని జానారెడ్డి అన్నారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం: నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నిబద్ధత గల నాయకుడు తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాయిని నరసింహారెడ్డి కార్మికుల పక్షపాతి అని, తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు అని తెలిపారు. నాయిని తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి అని అన్నారు. కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. అందరినీ తమ్మి.. బాగున్నావా.. అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయిని అని గుర్తు చేసుకున్నారు. నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని తెలిపారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. తెలంగాణ పోరాట యోధుడు: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని అని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సన్న లేకపోవడం బాధాకరం నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి మంత్రి మల్లారెడ్డి నివాళులు అర్పించారు. కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం అన్నారు. కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేమని తెలిపారు. ప్రభుత్వాలతో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడే వారు నాయిని అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయిని చేసిన పోరాటం మరచిపోలేమన్నారు. తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నివాళులు అర్పించారు. నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి సమరసింహారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని నర్సింహారెడ్డి మృతి చాలా బాధాకరం: డిప్యూటీ స్పీకర్ పద్మారావు -
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత) నాయిని నర్సింహారెడ్డి ప్రస్థానం.... నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము 1944లో నాయిని నర్సింహారెడ్డి జననం నాయిని తండ్రి దేవారెడ్డి, తల్లి సుభద్రమ్మ నాయిని సోదరుడు మాధవరెడ్డి.. చెల్లెల్లు ధమయంతి, సుధేష్న మేనమామ కూతురు అహల్యను వివాహమాడిన నాయిని నాయినికి దేవేందర్‌రెడ్డి, సమతా రెడ్డి సంతానం పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువు 5వ తరగతి నుంచి దేవరకొండలో విద్యాభ్యాసం కుటుంబ బాధ్యతలతో హెచ్ఎస్సీ మధ్యలోనే ఆపేసిన నాయిని సొంతూరులో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న నాయిని సోషలిస్టు పార్టీకి ఆకర్శితులైన నాయిని సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్ మనోహర్ లోహియా,.. రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్ పిట్టి మాటతో 1962లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాయిని సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఐఎన్టీయూసీ నుంచి.. సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయిని 1969లో సోషలిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయిని ఉద్యమం సమయంలో ఓ 30సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నాయిని 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు ప్రముఖ నాయకుడు టి.అంజయ్యపై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీలో చేరాలని ఎన్టీఆర్ కోరగా తిరస్కరించిన నాయిని 1983లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి 307 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపు 1984లో ఉపఎన్నికల్లో జనతాపార్టీ తరపున హిమాయత్‌నగర్ నుంచి ఓటమి 1985లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 10,500 ఓట్ల మెజార్టీతో గెలుపు 1989లో జనతాదళ్ పార్టీ తరపున పోటీచేసి నాయిని ఓటమి 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నుంచి మరోసారి నాయినికి ఆహ్వానం కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరిక.. నాయినికి ముషీరాబాద్ టికెట్ పొత్తులో భాగంగా ముషీరాబాద్ టికెట్ కోసం బీజేపీ పట్టు సనత్‌నగర్ నుంచి పోటీచేయాలని నాయినిని కోరిన టీడీపీ టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించి ఎన్నికలకు దూరంగా ఉన్న నాయిని 2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2004లో టీఆర్ఎస్ నుంచి ముషీరాబాద్‌లో పోటీ చేసి గెలుపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పనిచేసిన నాయిని 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు -
బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు..
సాక్షి, ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఆరడుగుల ఆజానుబాహుడు.. కోర మీసాలు.. వీటికి తోడు బుల్లెట్.. నాయిని నర్సింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. సోష లిస్టు పార్టీ భావాలతో ఎప్పుడూ నీతి, న్యాయం కోసం పోరాడేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే అక్కడికి చేరి వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండేవారు. అందువల్లే హైదరాబాద్ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనను ముద్దుగా బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్ ఉండాల్సిందే. వయోభారం మీదపడ్డా.. బుల్లెట్ నడపలేని స్థితిలో ఉన్నా తన బుల్లెట్‌ను మాత్రం రోజూ తుడవడం, ఒకసారి స్టార్ట్ చేసి పక్క న పెట్టడం ఆయనకు అలవాటు. ముఖ్యం గా వాహనాలంటే ఆయనకు అమితమైన మోజు. మార్కెట్లోకి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని ట్రయల్ చేసేవారు. చదవండి: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత రమిజాబీ కేసుతో వెలుగులోకి... 1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు. -
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
-
నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆసుపత్రికి వెళ్లి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్‌రెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. నాయినికి నలుగురు మనవళ్లు. భోళామనిషి: సోషలిస్టు జీవితం.. సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం.. నాయిని నర్సింహారెడ్డి సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్ కిల్లర్‌గా ఖ్యాతిపొందారు. 1985లో రెండోసారి, 2004లో మూడోసారి అదేస్థానం నుంచి గెలుపొందారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ నుంచి టీఆర్ఎస్ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు. సోషలిస్టు పార్టీ నుంచి ప్రస్థానం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్ఎస్సీ వరకు చదువుకున్నారు. మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొంటుండేవారు. ఈ క్రమంలోనే 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ పార్టీ సమావేశం నాగార్జున సాగర్‌లో జరగగా దానికి సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్ పిత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా స్థానిక నాయకుడు పాశం రుక్మారెడ్డితో సోషలిస్టు పార్టీ కార్యాలయంలో నమ్మకంగా పని చేయడానికి, చురుకైన ఓ కార్యకర్త కావాలని కోరగా అప్పుడు నాయిని నర్సింహారెడ్డి పేరును రుక్మారెడ్డి సూచించారు. దీంతో నాయిని ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఆఫీసు బాధ్యతలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక నాయకుడిగా ఎదిగిన వైనం... సోషలిస్టు పార్టీ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. నగరంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకమైన వీఎస్టీ, ఐడీఎల్, హెచ్ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్ బేకరి వంటి కంపెనీల్లో కార్మికనేతగా గెలుపొందడంతోపాటు సికింద్రాబాద్ హాకర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీలో నాయిని నర్సింహారెడ్డిని అరెస్టు చేసి ముషీరాబాద్ జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తంకాలం నాయిని జైల్లోనే గడిపారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు నాయిని పార్థివదేహం తరలించారు. పార్టీశ్రేణుల సందర్శనార్థం మినిస్టర్ క్వార్టర్స్‌లో నాయిని భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖుల సంతాపం: నాయిని మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. నాయిని నర్సింహారెడ్డి మరణం తీరని లోటు మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని పాత్ర మరువలేనిది గుర్తుచేశారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాయిని మృతిపట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. గురువారం అధికార లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతాయి. నాయిని మృతి పట్ల మంత్రి మహమూద్ అలీ సంతాపం తెలిపారు. నాయిని మృతిపట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం పార్టీకి, తెలంగాణకు తీరని లోటన్నారు. నాయిని కుటుంబ సభ్యులకు నిరంజన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్
-
నాయినిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నాయినిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాయిని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. (చదవండి : నాయిని ఆరోగ్యం విషమం ) కాగా, గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని ఇటీవల కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ పడిపోవడంతో ఈ నెల 13న తిరిగి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నాయిని ఆరోగ్యం విషమం
ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారు.. అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భార్య, అల్లుడు, మనుమడికి కరోనా.. ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎలా సోకింది..? లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
‘మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండటం మన ఖర్మ’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన కర్మ అని, ప్రజలు చేసుకున్న పాపం అని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు. జగన్ నిర్ణయం సరైనదే..: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొనగాడు అని నాయిని కితాబు ఇచ్చారు. జగన్ ప్రైవేట్ రంగంలో లోకల్ వారికి 75 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, ఇక్కడ కూడా అది అమలు చేయాలని కోరారు. 3 రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ బినామిలే అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. -
అలిగి అసెంబ్లీకి రాని మైనంపల్లి..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల్లోనూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీఆర్ఎస్ గ్రేటర్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి సోమవారం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కగా... మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మనస్తాపంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బెంగళూర్ వెళ్లారు. శాసనసభ ఎన్నికల సమయంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, ఎమ్మెల్సీగానే ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని తెలిపారు. కానీ తాజా మంత్రివర్గంలో తనను పక్కకు పెట్టడం, ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లను కాదని, ఇతరులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మనోగతాన్ని వెల్లడించేందుకు సీఎంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మనస్తాపం చెందారు. ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేబినెట్ విస్తరణకు ముందు కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సరైన గుర్తింపునిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని.. తీరా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ముఖ్య పదవుల భర్తీలోనూ తన ప్రాధాన్యతను గుర్తించడం లేదని ఆయన ఆదివారమే బెంగళూర్ వెళ్లారు. గ్రేటర్లో పార్టీ కోసం కష్టపడే మైనంపల్లికి కనీస గుర్తింపు ఇవ్వకుండా అవమానాలకు గురిచేయడం సమంజసం కాదంటూ ఆయన సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేకే మైనంపల్లి బెంగళూర్ వెళ్లారని ఆయన సన్నిహితుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. -
కేసీఆర్ మాట తప్పారు: నాయిని
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే మంత్రి ఈటల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు తమ మనసులోని అసంతృప్తిని బహిరంగ వేదికల మీద వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి చేరారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్, వద్దు కౌన్సిల్లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మా ఇంటికి పెద్ద.. మేమంతా ఓనర్లమే అని స్పష్టం చేశారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమన్నారు నాయిని. -
‘జైపాల్, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిచెందినట్లు తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ నేతలు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి సంతాపం తెలిపారు. రాజకీయ జీవితంతో మచ్చలేని నాయకుడిగా జైపాల్ ఎదిగారని కొనియాడారు. ఇద్దరం కలిసి దేవరకొండ హైస్కూల్లో కలిసి చదుకున్నామని, ఒకేసారి ఎమ్మెల్యేలుగా శాసనసభకు వెళ్లామని గుర్తు చేశారు. జైపాల్ మరణం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన నా రాజకీయ గురువు జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి వల్లే తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థి దశ నుంచే తనను ప్రొత్సహించారని, ఆయనే తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన వల్లే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. ఏ పార్టీలో ఉన్న ఆయనతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించానన్నారు. నిజమాబాద్‌కు మంచినీటి, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులకోసం మొదట 100 కోట్లు ఇచ్చింది జైపాల్ రెడ్డినేనని గుర్తుచేశారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతికి తెలిపారు. జైపాల్ రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలి : ఉత్తమ్ జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. జైపాల్‌రెడ్డికి ఘాట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేపు అంతిమ యాత్ర ఆయన ఇంటి నంచి ఉంటుందన్నారు. నెక్లెస్ రోడ్లో దహనకార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. -
కార్మికులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది - నాయిని నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు టీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం బీమా సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన నిర్మాణ కార్మికుల ఆశీర్వాదసభలో నాయిని ప్రసంగించారు. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంది. పేద ఇంటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేసి ఆ వర్గాలకు బాసటగా నిలుస్తున్నాం. రాహుల్ గాంధీ, చంద్రబాబు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసి కాంగ్రెస్ 1,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మన ప్రాజెక్టులను అడ్డుకోవటానికి చంద్రబాబు లేఖలు రాశాడు. ప్రజాకూటమిని తరిమి కొట్టి టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలి’అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆ సీటు ఎటు?
సాక్షి,సిటీబ్యూరో: రెండు నెలలుగా నగర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నలుగుతున్న ముషీరాబాద్ స్థానాన్ని టీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందన్నది శనివారం తేలనుంది. వాస్తవానికి సెప్టెంబర్ 6వ తేదీనే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాలని భావించినా, నాయిని నర్సింహారెడ్డి అభ్యంతరాలతో ప్రకటన నిలిచిపోయింది. ‘ముషీరాబాద్‌తో నలభై ఏళ్ల అనుబంధం నాది. ఈ ఎన్నికల్లో నేను సూచిస్తున్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. అతడికి ఇవ్వడం కుదరకపోతే స్వయంగా నేనే మళ్లీ పోటీ చేస్తా’ అని గతంలోనే హోంమంత్రి నాయినిప్రకటించారు. అనంతరం ముషీరాబాద్ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిందేనంటూ పలు సందర్భాల్లో నాయిని ప్రకటిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో సీఎం తనకు సమయం ఇవ్వడం లేదని కూడా వాపోయారు. నగరంలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, మరో వైపు నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తుండడంతో శనివారం అభ్యర్థిని తేల్చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వడం కుదరకపోతే తానే పోటీ చేయాలన్న నిర్ణయంతోనే నాయిని నర్సింహారెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ సీటును మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముఠా గోపాల్‌కే ఇచ్చేందుకు సీఎం ఉన్నట్టు సమాచారం. శనివారం సీఎం కేసీఆర్‌తో నాయిని భేటీకానున్నారు. ఈ చర్చల్లో నాయిని కోరికకు అనుగుణంగా టీఆర్ఎస్ అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?, లేక సామాజిక సమీకరణల్లో భాగంగా ఇప్పటికే నిర్ణయించినట్టు ముఠా గోపాల్‌కే ఓకే చెబుతారా..? అన్నది తేలాల్సి ఉంది. ప్రజా కూటమిలోనూ.. ఆ ఒక్కటి నగరంలోని ఒక్క సీటు అంశం ప్రజా కూటమిలోనూ గందరగోళం రేపుతోంది. సనత్‌నగర్ స్థానాన్ని టీడీపీ బలంగా కోరుకుంటుండగా దానికి బదులు సికింద్రాబాద్ ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. సనత్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్‌గౌడ్‌ను పోటీ చేయించే లక్ష్యంతో పార్టీ నేతలు పావులు కదపగా, సనత్‌నగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేక నిర్ణయాన్ని పార్టీ అధినేతరాహుల్గాంధీకి వదిలేసింది. అయితే, ఈ స్థానం నుంచి మళ్లీ మర్రి శశిధర్రెడ్డియే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఢిల్లీలో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. దీంతో ఈ నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించేంత వరకుఉత్కంఠే కొనసాగనుంది. -
పది కోట్లు కాదు..10 లక్షలే : నాయిని
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచిస్తూ కేసీఆర్ రూ.5 లక్షలో, రూ.10 లక్షలో ఇస్తానన్నారని, కానీ తాను లక్షలు అనబోయి పొరపాటున రూ.10 కోట్లు అన్నానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వివరణ ఇచ్చారు. ముషీరాబాద్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చినా రాకపోయినా కేసీఆరే తమ నాయకుడని, ఆయన ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు షోలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ముందు అభ్యర్థుల్ని ప్రకటించాలన్నారు. అసెంబ్లీ రద్దుపై డీకే అరుణ కోర్టుకెళ్లారని.. అసెంబ్లీ రద్దు అధికారం కేబినెట్‌కు ఉంటుందన్న విషయం మంత్రి పదవి వెలగబెట్టిన ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై కోర్టు సరైన తీర్పునిచ్చిందన్నారు. ఓటరు జాబితా బాగోలేదంటూ శశిధర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, చివరకు కోర్టు కూడా ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నించలేదన్నారు. దమ్ముంటే శశిధర్ రెడ్డి తలసానిపై పోటీచేసి గెలవాలని సవాలు విసిరారు. సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుకెళ్లి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు కోదండరాం, కమ్యూనిస్టు పార్టీల నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, బాబు జోలికి మేము వెళ్లకున్నా ఆయనే మా జోలికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికే లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని, తన రాజకీయ జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉందని స్పష్టం చేశారు. ముషీరాబాద్ నుంచి తన అల్లుడు స్వతంత్రంగా పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. -
‘నాయినికి ఇంతటి అవమానమా’
సాక్షి, హైదరాబాద్ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గానికి 10కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఖర్చుని భరిస్తానని కేసీఆర్ నాయినికి హామినిచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే గురువారం మీడియాకు వెల్లడించారని అన్నారు. ముషీరాబాద్ సీటును అల్లుడికి ఆశించిన నాయినికి కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ను వెన్నంటి ఉన్న నాయినికి నెలరోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా...? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్లో పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని నాయిని పత్రికాముఖంగా చెప్పారనీ, దీన్ని సుమోటాగా తీసుకుని ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలన్నారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. -
సమాధానం చెప్పలేకపోతున్నా!
సాక్షి,హైదరాబాద్: ‘యాడికి పోయినా పార్టీ కార్యకర్తలు, శ్రేయోభి లాషులు, బంధువులు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నరు. నువ్వుండగా ముషీరాబాద్ టికెట్ పెండింగ్‌ల ఎందుకున్నది? సీఎంకు నువ్వు బాగా దగ్గరటగద అని అడుగుతున్నరు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నా. చాలా బాధ అయితున్నది. అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా అప్సెట్ అయిండు’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి కోసం ముషీరాబాద్ టికెట్ ఆశించినా.. ఇప్పటివరకూ ప్రకటించకపోవడంపై ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. గురువారం చిక్కడపల్లిలోని ఓ జిమ్ ప్రారంభానికి అల్లుడి తో కలిసి వచ్చిన నాయిని.. ముషీరాబాద్ టికెట్ విషయంలో మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ 105 సీట్లు ప్రకటించి నెల రోజులైంది. అందులో ముషీరాబాద్ ఎందుకు ఆపారని చర్చ జరుగుతుంది. అమావాస్య తర్వాత ఆపిన 14 సీట్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అమావాస్య కూడా అయిపోయింది. ముషీరాబాద్ టికెట్ గురించి నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నాను’అని నాయిని పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడో మాటిచ్చారు ‘ముషీరాబాద్ గురించి ఆర్గనైజ్ చేసుకోమని సీఎం చాలా రోజుల క్రితమే నాకు చెప్పాడు. ఆయన మాట మీద విశ్వాసంతో.. అల్లుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో తిరుగుతూ కార్యకర్తలను సమీకరించాడు. ఇప్పటికిప్పుడు శ్రీనివాస్ రెడ్డి పిలిస్తే 1000 మంది వచ్చే నెట్వర్క్ తయారైంది. అందుకే సీఎంను కలవడానికి ప్రయత్నిస్తున్నాను’అని నాయిని తెలిపారు. కేసీఆర్ కూడా ‘నర్సన్నకు చెప్పు.. ఆయనతో మాట్లాడాకే ముషీరాబాద్ టికెట్ డిక్లేర్ చేస్తా. తొందరపడొద్దు’అని కేటీఆర్ ద్వారా చెప్పించారన్నారు. ఆ తర్వాత రెండుసార్లు కలిసినా.. కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పారన్నారు. ఈమధ్య పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ తమ పేర్లు కనిపించడం లేదని వాపోయారు. ‘ఈరోజే కాదు.. నాలుగైదురోజుల తర్వాత పేర్లు ప్రకటించినా ఇబ్బందిలేదు. శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే సంతోషమే. లేకుంటే నేనే పోటీ చేస్తానని చెప్పాను. ముషీరాబాద్ నియోజకవర్గంలో 1978 నుంచి ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నా. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు’అని నాయిని పేర్కొన్నారు. అప్పుడు ఎల్బీ నగర్ నుంచి.. 2014లో నేను ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ‘వద్దు నర్సన్నా నిను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీ నగర్ నుంచి పోటీచెయ్. సర్వేలో స్థానిక నాయకులకంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి’అని కేసీఆర్ అన్నారని నాయిని గుర్తుచేశారు. దానికి సమయం 15 రోజులే ఉంది బాగా డబ్బున్న సుధీర్ రెడ్డి మీద కోట్లాడేంత డబ్బు నా దగ్గర లేదంటే ‘నీ తమ్ముడిని నేనున్నా రూ.10 కోట్లు ఇస్తా పోటీచెయ్’అన్నాడన్నారు. ఎల్బీ నగర్లో పోటీకి విముఖత చూపడంతో.. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో చోటిచ్చాడని నాయిని చెప్పారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మక ముంది. మా ఇద్దరిలో (మామా అల్లుళ్లలో) ఎవరికి అవకాశం ఇచ్చినా.. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. మంగళవారం కేటీఆర్‌ను కలిసి కూడా ఇదే విషయం చెప్పాను. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాను. మరో రెండేళ్లపాటు నా ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. దీన్ని ముషీరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తికి ఇచ్చి.. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది’అని ఆయన అన్నారు. అయితే, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. మామా అల్లుళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నాయిని -
బాబుకు ఏపీలో ఓటమి ఖాయం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ ఓడిపోవడం ఖాయమైపోయిందనే ఉద్దేశంతోనే ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు మకాం మార్చాలనుకుంటున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తెలంగాణలో నలుగురైదుగురు తన చెంచాలను గెలిపించుకోవాల ని భావిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలతో ఏర్పడే మహాకూటమి ఆ పార్టీలకే మహాగూటమిలా మారుతుం దని అన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల తేదీలు రావడంతో కాంగ్రెస్‌కు ఆశాభంగమైంది. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్ని కలు రావని కాంగ్రెస్ ఆశ పడింది. కాంగ్రెస్ ఇంకా కోర్టులపై ఆశ పెట్టుకున్నట్లుంది. కాంగ్రెస్‌కు చేతనైతే ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లాలికానీ కోర్టుల చుట్టూ తిరగడమేంటీ? మర్రి శశిధర్‌రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్‌పై గెలవాలి. కాంగ్రెస్‌కు దమ్ముంటే పొత్తుల్లేకుండా మాతో నేరుగా తలపడాలి. ఉత్తమ్ పెద్ద బట్టేబాజ్. సీఎం పదవికి గౌరవం ఇవ్వకుండా కేసీఆర్‌ను బట్టే బాజ్ అంటారా? 14 ఏళ్లు శాంతియుతంగా ఆందోళన చేసిన కేసీఆర్ రాష్ట్రానికి ఏం అన్యాయం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు’ అని ప్రశ్నించారు. ఉత్తమ్ మా ఇంటికొచ్చారు: నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి ఖండించారు. ‘4 నెలల కింద రోడ్డుప్రమాదంలో గాయపడ్డాను. ఇటీవలే కోలుకున్నాను. చాలా మంది నేతలు నన్ను పరామర్శించేందుకు నా ఇంటికి వచ్చిపోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, మరికొందరు నేతలు ఆదివారం మా ఇంటి కి వచ్చి పరామర్శించారు. ఎలాంటి రాజకీయాల చర్చలు జరగలేదు’ అని ఓ ప్రకటనలో తెలిపారు. -
మర్రి శశిధర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన నాయిని
-
పథకాల అమలులో మనమే నంబర్‌వన్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. దేవరకొండలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయన్నారు. అదే విధంగా నల్లగొండలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈనెల 4న జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. దేవరకొండ (నల్లగొండ రూరల్): దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు లేని హామీలను సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి లేదని, మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టేం దుకు వస్తున్నారని, ప్రజలు గమనించా లన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ్టయేనని, ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపివేయాలని కేసులు వేస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు మాట్లాడుతూ రాను న్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజా ర్టీతో గెలిపించి దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అం తకుముందు భారీ ర్యాలీగా సమావేశ ప్రాంతానికి చేరుకున్న మంత్రులకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, మార్కెట్ చైర్మన్ బండారు బాలనర్సింహ, తేర గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, నల్లగాసు జాన్‌యాదవ్, గాజుల ఆంజనేయులు, నేనావత్ రాంబాబు, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, పున్న వెంకటేశ్, ముత్యాల సర్వయ్య, ముక్కమల వెంకటయ్య, ఏడ్పుల గోవిందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలి నల్లగొండ రూరల్ : రాష్టానికి పట్టిన శని పోవాలంటే ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నల్లగొండ మండల కమిటీ సర్వసభ్య సమావేశం బైపాస్‌లోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. 60ఏళ్లు రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జిల్లా తలాపున కృష్ణానది పారుతున్నా సాగునీరు లేదు..కనీసం తాగునీరు అందివ్వకపోగా రోగాలను, ఫ్లోరోసిస్ అందించారని, పైగా జిల్లానే ఎడారిగా మార్చారని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు. రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శని అన్నారు. పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి, పార్టి మండల, పట్టణ అధ్యక్షుడు బకరం వెకంన్న, అబ్బగోని రమేష్‌గౌడ్, ఐసీడీఎస్ కోఆర్డినేటర్ శరణ్యరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, మార్కెట్ చైర్మన్ ఖరీంపాష, ఎంపీపీ దైద రజితా వెంకట్‌రెడ్డి, బక్కపిచ్చయ్య, కట్టశ్రీను, జిల్లా శంకర్, దేపవెంకట్ రెడ్డి, రాజ్‌పేట మల్లేష్‌గౌడ్, గాదె రాంరెడ్డి, కె.సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, బడుపుల శంకర్, అండాలు గట్టయ్య పాల్గొన్నారు. సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి నల్లగొండ రూరల్ : ఈనెల 4న నల్లగొండ బైపాస్‌లోని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద నిర్వహించే సీఎం కేసీఆర్ ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. కొంగరకలాన్ సభకు వెళ్లలేని వారంతా సీఎం సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాలను చూస్తుంటే ఎన్జీ కాలేజి స్థలం సరిపోదని బైపాస్కు మార్చినట్లు తెలిపారు. -
ఉద్యమంలో ఉత్తమ్ ఆచూకీ లేదు: నాయిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విలీనం, విమోచనం గురించి మాట్లాడే అర్హత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్తమ్ ఆచూకీ లేదని.. ఉద్యమంలో ఆయన ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. హైదరాబాద్ సంస్థాన విలీన దినం సందర్భంగా తెలంగాణ భవన్లో నాయిని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేక పారిపోయారు. అమిత్ షా తెలం గాణలో గెలుస్తాం అని షో చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అమిత్ షాకు తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ సమయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మాది సెక్యులర్ పార్టీ. మైనార్టీల పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇవ్వొద్దని కాంగ్రెస్ వాళ్లు నిజాం కాలేజీలో సభ పెట్టారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులు. మిగతా పార్టీలు మహాకూటమితో ప్రజల వద్దకు వెళ్తామంటున్నాయి. వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు వంద సీట్లు రావడం ఖాయం. చంద్రబాబు తెలంగాణ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారు. టీడీపీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలపడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు. అభివృద్ధి విషయంలో తెలంగాణ, దేశంలోనే ముందు ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అది కొనసాగుతుంది’ అని అన్నారు. -
సీఎం మాటిచ్చారు.. టికెట్ మాకే
హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గం నుండి టికెట్‌ను మాకే కేటాయిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని సాయిబాబా ఆలయం వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబా ఆలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తనకు గానీ, తన అల్లుడు కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి పార్టీ తరపున టికెట్ కేటాయిస్తున్నట్లు సీఎం నుండి స్పష్టమైన హామీ లభించిందన్నారు. ఇక్కడి టికెట్‌ను అడగడంలో న్యాయం, హక్కు రెండూ ఉన్నాయన్నారు. తొలిదశ 105 టికెట్ల పంపిణీలో తమకు ముందువరుసలో రావాల్సినప్పటికీ జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. నాయకులు ప్రకాష్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ధర్మరాజు గౌడ్, పాశం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ్ మళ్లీ గెలవడు: నాయిని
సాక్షి, హైదరాబాద్: ఈ సారి ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలవడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పుడు గృహనిర్మాణ శాఖలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ టీడీపీ నేతలు ఆ పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టి.. ఎన్టీఆర్ ఆత్మకు క్షోభ కలిగిస్తున్నారు. సీపీఐ, సీపీఎం వారి సిద్ధాంతాలను పక్కన పెట్టేశాయి. ఎన్నికలు వస్తుండటంతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోంది. టీఆర్ఎస్ను ఓడించేందుకు కూటములు కడుతున్నారు. కాకమ్మ కథలకు కల్లబొల్లి మాటలకు ఓట్లు పడవు. జగ్గారెడ్డిపై కేసు 2004 నాటిది. ఆయన మీద కేసు ఉన్నందు వల్లే కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడు కాంగ్రెస్ ఆ కేసును తొక్కి పెట్టింది. రాజకీయ కక్షే ఉంటే హౌసింగ్ కుంభకోణంలో ఉత్తమ్‌ను అరెస్టు చేయించే వాళ్లం. ఉత్తమ్ బట్టేబాజ్.. అడ్రస్ లేనోడు.. మళ్లీ గెలవడు. కేసీఆర్‌ను జైళ్లో పెడతా అంటవా.. ఎన్నికలయ్యాక లోపలుంటావో, బయట ఉంటావో తేల్చుకో’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి రషీద్ అనే బ్రోకర్‌తో కేసీఆర్, హరీశ్ పేర్లు పెట్టించారని, ఆధారాలుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ సొసైటీ కేసులో రేవంత్‌కు నోటీసులిస్తే రాజకీయ కక్ష అంటున్నారని మండిపడ్డారు. -
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
గోల షురూ!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులపై అసమ్మతి భగ్గుమంటోంది. ఎక్కడికక్కడ విభేదాలు రచ్చకెక్కెతున్నాయి. ముషీరాబాద్ సీటు విషయంలో చిక్కుముడి అలాగే ఉండగా...తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అవసరమైతే తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను ఫోన్లో సంప్రదించగా...చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. ఇక కొన్నిచోట్ల అదే పార్టీకార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. కూకట్‌పల్లిలో బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య భర్త హరీష్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్‌లు శుక్రవారం పార్టీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్‌లో నియోకజవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి, జూబ్లీహిల్స్‌లో మురళీగౌడ్ (2014లో టీఆర్ఎస్అభ్యర్థి)లు సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు. కూకట్పల్లి నియోకవర్గంలో హరీష్‌రెడ్డితో పాటు గొట్టిముక్కల పద్మారావు, వెంకటేశ్వరరావులు సైతం తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయానికి వచ్చారు. వీరిలో హరీష్‌రెడ్డి ఏకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్న ప్రకటన కూడా విడుదల చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్కే చెందిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అనుచరులతో శుక్రవారం సమావేశం నిర్వహించి, వారం రోజుల్లో అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. జగదీశ్వర్‌గౌడ్ సతీమణి పూజిత హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక కుత్బుల్లాపూర్‌లో నియోకవర్గ ఇన్చార్జి కొలను హన్మంతరెడ్డి తాను పోటీ చేయటం ఖాయమని శుక్రవారం ప్రకటించారు. మల్కాజిగిరి, మేడ్చల్‌లో హైడ్రామా మల్కాజిగిరి, మేడ్చల్ శాసనసభ స్థానాల విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. మల్కాజిగిరి సీటును తొలుత తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతికి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సహా ఐదుగురు కార్పొరేటర్లు అభ్యంతరం తెలపటంతో అధికారిక ప్రకటనను వాయిదా వేశారు. తనకే టికెట్ ఇవ్వాలని మైనంపల్లి పట్టుపడుతుండగా,సీఎం కేసీఆర్ మాత్రం చింతల కనకారెడ్డి కుటుంబానికి ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. సీటు కనకారెడ్డికా లేదా ఆయన కోడలుకా అన్న విషయాన్ని తేల్చే బాధ్యతను ఆయన సమీప బంధువు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. మేడ్చల్ నియోకజవర్గంలోనూ సస్పెన్స్ సాగుతోంది. ఎంపీ మల్లారెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం రెండవ జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ముషీరాబాద్ కిరికిరి.. నగర రాజకీయాల్లో కీలక స్థానమైన ముషీరాబాద్ అభ్యర్థిత్వం టీఆర్ఎస్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అది సాధ్యపడక పోతే తానే పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానం నుండి 2014లో ముఠా గోపాల్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే అవకాశం ఇవ్వాలని గోపాల్ కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరేందుకు గోపాల్ శుక్రవారం హుస్నాబాద్ వెళ్లి బహిరంగసభ వద్ద సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై హోంమంత్రి నాయిని ముఖ్యమంత్రిని ఫోన్లో సంప్రదించగా శనివారం రావాలని, చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. -
నాయిని నారాజ్!
సాక్షి,సిటీబ్యూరో: తాను సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముషీరాబాద్ స్థానం నుంచి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి పేరు లేకపోవడంతో ఆయన కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి సైతం దూరంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆ జాబితాలో ముషీరాబాద్ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠా గోపాల్ పేరు ఉందన్న సమాచారంతో నాయిని అలిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేదన్న ప్రచారం జరిగింది. దీంతో చివరి నిమిషంలో ముషీరాబాద్ అభ్యర్థి ప్రకటనను వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయమై హోంమంత్రిని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. కేబినెట్ సమావేశంలో తాను పాల్గొనడం వల్లే, కేసీఆర్ విలేకరుల సమావేశానికి వెళ్లలేదని, ‘అయినా ముషీరాబాద్ టికెట్ శ్రీనివాసరెడ్డికి ఎందుకు రాదు... తప్పకుండా వస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పద్మారావు ‘పాంచ్’ పటాకా.. 2004లో తొలిసారి శాసనసభకు పోటీ చేసిన మంత్రి పద్మారావు.. రెండు విజయాలు, రెండు ఓటములు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఐదోసారి పోటీకి సిద్ధమయ్యారు. 2004, 2014లో విజయం సాధించిన ఈయన.. 2008 ఉప ఎన్నికల్లో తలసాని చేతిలో, 2009లో (సనత్‌నగర్) మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తలసాని ‘ఆరోసారి’.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలిసారి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నారు. 1995లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తలసాని, 1999, 2008, 2014లలో విజయం సాధించారు. 2004, 2009లో ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఆరోసారి శాసనసభకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయన్నా.. ఆరోసారే.. కంటోన్మెంట్ నియోకజవర్గంలో 1994 నుంచి వరసగా పోటీ చేసి నాలుగుసార్లు సాయన్న విజయం సాధించారు. 2009లో శంకర్రావు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.. టీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేస్తున్న సాయన్న.. శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడం ఇది ఆరోసారి. గతంలో ఓడిన వారికి మరో ఛాన్స్ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రాంమోహన్‌గౌడ్(ఎల్బీనగర్), భేతి సుభాష్‌రెడ్డి(ఉప్పల్), జీవన్‌సింగ్(కార్వాన్), సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), ఇనాయత్ అలీకి చార్మినార్ బదులు బహుదూర్‌పురాలో అవకాశం కల్పించారు. అంబర్‌పేట, మలక్‌పేట, గోషామహల్‌లలో కొత్త అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
భారీ వేదిక.. 300 మందికి చోటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. దూరంలోనున్న సభికులకు కనిపించే విధంగా భారీ వేదికను నిర్మిస్తున్నారు. దీనికిగాను సభాప్రాంగణ విస్తీర్ణం పెద్దగా ఉండేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, పట్టా భూములను చదును చేస్తున్నారు. వేదికను 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై 300 మంది ఆసీనులయ్యే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు వేదికపై చోటు కల్పించనున్నారు. సుమారు 500 ఎకరాల మైదానంలో భారీ ఎల్సీడీ స్క్రీన్లు, సరైన వెలుతురు కోసం ఫ్లడ్‌లైట్లు, భద్రత కోసం బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 15 ఫైరింజన్లు తీసుకుంటున్నారు. వీటి కోసం పార్టీ నిధి నుంచి చెల్లించారు. దీనికి భారీగా కరెంటు అవసరం కావడంతో రూ.30 లక్షలను విద్యుత్ శాఖకు చెల్లించనున్నారు. సభాస్థలికి రోడ్లు... అద్దె వాహనాలు... సభకు సుమారు 25 లక్షల మందిని తరలిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనికోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్లు, ప్రైవేటు స్కూల్ బస్సులు వంటి 24 వేల వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వేదికకు ఎదురుగా 50 వేల కుర్చీలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లలో వేగం పెంచండి...: కేటీఆర్ సభాస్థలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో వేగం పెంచాలని పార్టీ ముఖ్యనేతలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పనులను పరిశీలించారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పని విభజన చేసుకుని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణాలు వద్దు: ప్రగతి నివేదన సభ కోసం దాదాపు అన్ని వాహనాలను కిరాయికి తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే ఈ సభ నిర్వహిస్తున్నామని, సామాన్యులెవరూ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
చరిత్ర సృష్టించేలా ప్రగతి నివేదన సభ
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రగతి నివేదన సభ పేరుతో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభ దేశంలోనే చరిత్ర సృష్టిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని సభాస్థలాన్ని చదును చేసే పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సేవలను ఇక్కడ వివరిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రాణాలు లెక్కచేయకుండా రాష్ట్రం సాధించాడన్నారు. 25 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి సత్తా చాటుతామని నాయిని చెప్పారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది టీఆర్ ఎస్ సర్కార్ మాత్రమేనని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి మైనార్టీ హాస్టళ్లను ప్రారం భించిందని, 50 వేల మంది పిల్లలు నేడు హాస్టళ్లల్లో చదువుతున్నారనితెలిపారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ సభ జరగబోతోందన్నారు. సెప్టెంబర్ 2న ఉప్పొంగే జనసంద్రానికి ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయన్నారు. -
కేరళకు రూ.25 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు నాయిని ఆదివారం హైదరాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లారు. మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్రం చేయదగిన సహాయా న్ని చేస్తుందన్నారు. గత నూరేళ్లలో రాని ప్రకృతి వైపరీత్యం కేరళలో వచ్చిందని, ఈ పరిస్థితుల పట్ల చలించిన కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి అండగా ఉంటామనే సందేశాన్ని తెలిపేందుకు తనను పంపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్ర రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. కేరళకు నీటి శుద్ధి ప్లాంట్లు.. కేరళ వరద బాధితుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.2.5 కోట్ల విలువైన 50 ఆర్వో వాటర్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం ద్వారా పంపించింది. వీటి ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయవచ్చు. ఆర్వో ప్లాంట్లను వినియోగించడంలో కేరళ ప్రజలకు సహకరించేందుకు 20 మంది స్మాట్ సంస్థ ఇంజనీర్లతో పాటు మరో 10 మంది సిబ్బందిని కూడా కేరళకు పంపింది. మంత్రులు, ఎమ్మెల్యేల విరాళాలు.. వరదల్లో చిక్కుకున్న కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకొస్తున్నారు. హోంమంత్రి నాయిని, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు తమ ఒక నెల జీతాన్ని కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. -
రూ. 25 కోట్ల చెక్కును కేరళ సీఎంకు అందజేసిన నాయిని
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను తక్షణ సహాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చెక్కును తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం నాడు కేరళ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు అందజేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. టీఆర్ఎస్ భవన్లో ఎంపీ కేశవరావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల ఒక నెల వేతనాన్ని(మొత్తం 20 లక్షల రూపాయలు) కేరళ సీఎం రీలిఫ్ ఫండ్‌కు అందజేయనున్నామని తెలిపారు. ఈ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా తమ నెల వారి జీతాలను కేరళ వరద బాధితులకు విరాళంగా అందజేయనున్నామని తెలిపారు. కేరళ సోదరి, సోదరులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇండియా ఫర్ కేరళ, తెలంగాణ ఫర్ కేరళ అని హ్యష్ ట్యాగ్లు ట్వీట్‌కు జత చేశారు. -
పిలగాడు ఆగం పట్టడం ఖాయం : మంత్రి నాయిని
ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పిందే నిజమైంది జూరాలపై ఆధారపడితే ఎత్తిపోతల పథకాలకు భంగపాటే నారాయణపేట, కొడంగల్‌కు పాలమూరు–రంగారెడ్డి ద్వారా సాగునీరు కోస్గి బహిరంగ సభలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బస్‌డిపో, బస్టాండ్ పనులకు శంకుస్థాపన, సీఐ కార్యాలయం ప్రారంభం హాజరైన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు మంత్రి నాయిని హామీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నాలుగేళ్లుగా పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మున్ముందు మరింత సమర్థవంతంగా అందాలంటే టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని కోస్గిలో బస్ డిపో నిర్మాణ పనులతో పాటు బస్‌స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా పోలీస్‌సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఆ తర్వాత మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన కోస్గి జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే.. మేం చెప్పిందే నిజమవుతోంది! సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ముందు నుంచి చెబుతున్న మాటే నిజమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ రోజు జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ ప్రాజెక్టు నుంచి మనం వాడుకోగలిగిన నీరు కేవలం 6టీఎంసీలు మాత్రమే. జూరాల మీద ఆధారపడి ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలతో పాటు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పైనుంచి వరద ఆగిపోయే సరికి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు పోతే ఎత్తిపోతల పంపులన్నీ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటిది పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జూరాలను ఆధారంగా ఏర్పాటు చేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? శ్రీశైలం డ్యామ్‌లో 215 టీఎంసీల నీరు ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఎండాకాలం వచ్చే వరకు నడుస్తాయి. అదే జూరాల మీద ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను నడపగలమా? అందుకే సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఆధారం చేసుకొని చేపట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో జూరాలపై భారం వేయలేం. అయినా కచ్చితంగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కర్వెన రిజర్వాయర్ ద్వారా 1.30లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రాబోయే రోజుల్లో ఇది చేసి చూపిస్తాం. కేసుల వల్లే ఆలస్యం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగెత్తించాలని మేము భావిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుపై పదుల సంఖ్యలో కేసులు వేసిన కారణంగానే అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోయాము. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల్ల అభయారణ్యం దెబ్బ తింటుందని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఇంచార్జీ హర్షవర్దన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అలాగే దేవరకద్రకు చెందిన పవన్‌కుమార్ హైకోర్టులో కేసులు వేశారు. ఇలాంటి చర్యల వల్లే ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. గులాబీ జెండా ఎగరడం ఖాయం రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తిస్తున్నాం. మాయమాటల ద్వారా ఒకటి రెండు సార్లు మోసం చేస్తారేమో కానీ ఎల్లకాలం చెల్లుబాటు కాదు(రేవంత్‌ను ఉద్దేశించి). కోస్గికి గతంలో బస్‌డిపో మంజూరు కాకపో యినా మోసపూరితంగా శిలాఫలకం వేశారు. కానీ మేము అలా కాకుండా.. స్థానిక నేతలు అడిగిన వెంటనే 15 రోజుల్లోనే జీఓ మంజూరు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బస్ డిపోగా కోస్గి రికార్డుకెక్కింది. అలాగే ఆస్పత్రులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పూడికతీత, పంచాయితీరాజ్ కింద రోడ్ల నిర్మాణం, విద్యుత్సబ్స్టేషన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. త్వరలో బోరాంస్పేట, దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీల ఏర్పాటు చేస్తాం. కోస్గిలో స్థలం గుర్తిస్తే అధునాతన కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి అంటే ఏందో తెలుసా.. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అభివృద్ధి అంటే ఏందో తెలియదని మంత్రి మహేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో గ్రాఫిక్ చిత్రాలతో ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు గెలుపొందారని... ఇక మునుముందు వారి ఆటలు సాగవన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వివరించారు. మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పిల్లగాడు ఆగం పట్టడం ఖాయమంటూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఖాయమని... అందుకే ఈ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్‌చార్జీగా సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఇక్కడ విజయం ఖాయమని... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆ పిల్లగాడిని అమ్మ దగ్గర పాలు తాగడానికి పంపించేలా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను తిట్టినోడు ఎవరూ బాగుపడలేదని...పిచ్చి కూతలు కూసే ఈ పిల్లగాడిది అదే పరిస్థితి అవుతుందని అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ప్రధాని లాంటి జితేందర్‌రెడ్డి కోరిక మేరకు కోస్గిలో ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నాయిని -
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
-
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోంది: నాయిని
సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, వారి హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాజ్‌బహదూర్ గౌర్ శతజయంత్యుత్సవాల ప్రారంభానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి, భుక్తి కోసం నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి రాజ్‌బహదూర్ అని నాయిని అన్నారు. కేంద్ర విధానాలతో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకుం డా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్, తమ్మినేని వీరభద్రం, నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు అండగా ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన కార్యాలయాన్ని బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ 3వ అంతస్తులో శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసన మండలి ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సమాచారహక్కు ప్రధాన కమిషనర్ రాజాసదారాం, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్.రాములు, కార్పొరేషన్ చైర్మ న్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కమిషన్ ఉందా అనే అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ వస్తే వారికి పరిపాలించుకొనే స్తోమత ఉందా అని సమైక్యరాష్ట్ర పాలకులు ఎద్దేవా చేశారని, అన్ని అవరోధాల ను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కమిషన్ చైర్మన్‌గా అవకాశం ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 2003లోనే కమిషన్ ఏర్పాటైనా ఎక్కడా పనిచేయలేదన్నారు. గతంలో సమైక్యపాలకులకు మాత్రమే కమిషన్‌లో అవకాశం ఇచ్చారని, తెలంగాణ దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందన్నారు. కమిషన్ ద్వారా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటామన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
ప్రతి పల్లెలో సీసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టులను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు కింద జనసంచార, రద్దీ ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో స్వచ్ఛంద సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నేను సైతం ప్రాజెక్టు కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వ్యాపారులు, కాలనీ, అపార్ట్మెంట్ వాసులు, వివిధ సంఘాలు నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ సీసీటీవీల వీడియో ఫుటేజీ 30 రోజుల పాటు ఉంటుందని, నేను సైతం కింద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫీడ్ యజమాని నిర్వహణపై ఆధారపడి ఉంటుందని డీజీపీ వివరించారు. జీహెచ్ఎంసీలో 10 లక్షల కెమెరాలు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ సీసీటీవీలు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామని డీజీపీ చెప్పారు. సర్కిల్, డివిజన్, జిల్లా స్థాయి కమాండ్ సెంటర్లకు వాటిని అనుసంధానిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కమాండ్ సెంటర్లను రాజధానిలో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్‌లో అనేక సంచలనాత్మక కేసులను 24–40 గంటల్లోనే ఛేదించామని గుర్తు చేశారు. హైదరాబాద్ పరిధిలో 2014 నుంచి 2017 మధ్య 32 శాతం నేరాల తగ్గుదల కనిపించిందని.. సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షలు, మిగతా ప్రాంతాల్లో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిటీ, నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసుకునే కెమెరాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూపొందించిన మార్గదర్శాకాల ద్వారా కొనుగోలు చేయాలని.. నెట్వర్క్ వ్య వస్థ, హెచ్డీ క్వాలిటీ అంశాలను పాటించాలని డీజీపీ చెప్పారు. మార్గదర్శకాల కాపీ లను ఎస్పీలు, కమిషనర్లకు అందించారు. తద్వారా సీసీ ఫుటేజీ క్వాలిటీ బాగుంటుందని, నిందితులు, అనుమానితుల గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి: నాయిని నేను సైతం ప్రాజెక్టుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు రూపొందించిన షార్ట్ ఫిలిమ్‌ను హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. టెక్నాలజీతో నేరాల నియంత్రణ చేయొచ్చని హైదరాబాద్ పోలీసులు రుజువు చేశారని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెళ్తే నేరాల నియంత్రణ సులభమవుతుందన్నారు. పోలీసు శాఖకు ప్రభుత్వం ఎప్పుడూ సహకారం అందిస్తుందని, పీపుల్ ఫ్రెండ్లీగా పోలీసులు ఉండాలాని నాయిని ఆకాక్షించారు. -
మరో 15 ఏళ్లు అధికారంలో టీఆర్ఎస్
సాక్షి, జగిత్యాల : మరో 15 ఏళ్ల వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం గ్యారెంటీ అని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నాడు సీఎం ఏం చెప్పారో అదే జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం నడుస్తోందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. టీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం తీసేది లేదని, బుడ్డార ఖాన్(రేవంత్‌రెడ్డి)కి కేటీఆర్ అంత వయస్సు లేదు.. ఆయనా సీఎంను తిట్టేది అంటూ ఛలోక్తులు విసిరారు. అమిత్‌షా ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పనికి వచ్చే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. మోదీకి కేవలం నోరు ఉందని, నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పోలీసు డిపార్ట్మెంట్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. తమకు ఎవరితోనూ తగాదాలు లేవని, తెలంగాణ ప్రజలు శాంతి కాముకులని పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. -
12లోగా ‘బోనాల’కు దరఖాస్తులు: నాయిని
సాక్షి, హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం పొందాలనుకునే దేవాలయాలు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకో వాలని బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్, హోం మంత్రి నాయిని నర్సంహారెడ్డి సూచించారు. శనివారం సచివాలయంలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 20లోగా దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం పొందని దేవాలయాలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
‘ఒత్తిడిని జయించడం’ పుస్తకావిష్కరణ
మఠంపల్లి : మైండ్ పవర్లో ప్రపంచ రికార్డ్ సాధించిన తాటికొండ వేణుగోపాల్‌రెడ్డి రచించిన ఒత్తిడిని జయించడం (కాంక్యూర్‌స్ట్రెస్) పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఒత్తిడి ప్రమాదకరమైన వైరస్ అని ఈ పుస్తకం ఆ వైరస్‌ను విద్యార్థులకు సోకకుండా చేస్తుందన్నారు. పుస్తకాన్ని రచించిన మరో రచయిత విజయార్కె మాట్లాడుతూ ప్రాక్టికల్ థింకింగ్, మన ఆలోచన విధానం ఎలా ఉండాలో, ఒత్తిడిని ఎలా జయించాలో ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు. అంతేగాక పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదవదగ్గ పుస్తకమని, తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉంటుందని అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శివారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసాచారి తదితరులున్నారు. -
సాంకేతికతతో ఆధారాలు పదిలం
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు సేకరించడమే కాకుండా టెక్నాలజీ వినియోగంతో నిందితులను కటకటాల్లోకి పంపడం ఇప్పుడు సులభతరమైందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ పెరిగి ఆన్లైన్లోనే క్షణాల్లో విశ్లేషణ చేసి నిందితులను పట్టుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న 19వ జాతీయ స్థాయి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సదస్సు ముగింపులో నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫింగర్‌ప్రింట్స్ బ్యూరో సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం సంతోషకరమని, రాష్ట్ర పోలీస్ ఫింగర్ ప్రింట్స్ డేటా మేనేజ్మెంట్, ఆటోమేషన్‌లో ది బెస్ట్ అని కితాబిచ్చారు. వచ్చే ఏడాది సదస్సుకల్లా తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో పూర్తి స్థాయి సిబ్బంది, అధికారులతో మరింత పటిష్టంగా మారుతుందని ఆకాంక్షించారు. ఫింగర్ ప్రింట్స్ బ్యూరో నిర్వహించిన పలు పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించిన తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ అధికారిణి స్వర్ణలతకు ఆయన అవార్డు అందజేశారు. అన్ని విభాగాలు అందిపుచ్చుకోవాలి.. ఫింగర్ ప్రింట్ విభాగంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. గతంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ, ఫలితాల కోసం నెలల కొద్దీ సమయం పట్టేదని, ఇప్పుడలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. బ్రిటన్‌లాంటి దేశాల్లో ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫింగర్ ప్రింట్ విభాగం అందుబాటులో ఉంటుందని, అలాగే రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నేరస్తుల ముఖం, పేర్లు మారినా వారి వేలిముద్రలు మాత్రం మారవని, అవే అత్యంత కీలకమైన ఆధారాలు అని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది అన్నారు. భవిష్యత్తులో కార్లను కూడా వేలిముద్రలతో అన్‌లాక్, స్టార్ట్ చేసే టెక్నాలజీ కూడా రాబోతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారినీ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని కూడా ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించేందుకు టెక్నాలజీ తీసుకొస్తున్నామని ఎన్సీఆర్బీ డైరెక్టర్ ఈష్‌కుమార్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఫింగర్ ప్రింట్ విభాగం ఏర్పాటు, వాటి పురోగతికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు 92 శాతం పోలీస్ స్టేషన్లు అనుసంధానమయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అనుసంధానం చేసి డేటాను షేర్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్‌మాతుర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
హైదరాబాద్ : పేద రెడ్ల అభివృద్ధి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. రాజా బహద్దూర్ స్ఫూర్తిని కొనసాగించే విధంగా రెడ్డి హాస్టల్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో ఆదివారం సెంటినరీ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి హాస్టల్‌కు 15 ఎకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి ఓవర్సీస్ ఫండ్ కూడా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజా బహద్దూర్ స్ఫూర్తితో అట్టడుగున ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని సూచించారు. బుద్వేల్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎడ్ల రఘుపతిరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, సొసైటీ కార్యదర్శి కుందవరం వెంకటరెడ్డి, ఉపా«ధ్యక్షుడు పాపారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, డాక్టర్ వసుంధరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేద్దాం
జూబ్లీహిల్స్: రాష్ట్రంలో బాలకార్మిక వ్వసస్థను సంపూర్ణంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, వచ్చే 2021 సంవత్సరంలోపు అది పూర్తవుతుందని రాష్ట్ర హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం స్వచ్ఛద సంస్థలు, ప్రజలు, ప్రజా ప్రతిని«ధులతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రపంచ బాలకార్మిక నిర్మూలన రోజును పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ, ప్లాన్ ఇండియా, మహిత స్వచ్ఛద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బేగంపేట సెస్ ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. బాలకార్మిక వ్వవస్థకు ప్రధానంగా పేదరికమే కారణమని, గ్రామాల్లో పేదరికం నిర్మూలిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు చొరవ తీసుకొని పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు. నగరంలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలనకు చేపట్టిన చర్యలు వివరిస్తూ ‘ఏ జర్నీ టు క్రియేట్ చైల్డ్ లేబర్ ఫ్రీ తెలంగాణ విత్ ఎన్జీఓ పార్టిసిపేషన్’ పేరుతో రూపొందించిన టేబుల్ బుక్‌ను, బాల కార్మిక వ్యతిరేక ప్రచారంతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ అనితాకుమార్, మహిత డైరెక్టర్ రమేష్‌శేఖర్‌రెడ్డి, కార్మికశాఖ ఎస్ఆర్సీ స్టేట్ కో-ఆర్డినేటర్ వర్షాభార్గవ, పలు జిల్లాలకు చెందిన సర్పంచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాయినికి ‘తెలంగాణ రత్న’ పురస్కారం
వివేక్‌నగర్ : తెలంగాణ ఉక్కు మనిషి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విశేష కృషి చేసి తెలంగాణ రత్నంగా ఎదిగారని, మనస్తత్వంలోను, ఆహార్యంలోను ఎదుటి వారిని ఆకట్టుకునే తత్వం ఆయనదని పూర్వ లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్.ఎం.ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయ గానసభలో సంగీత జానపద నృత్యాంశాలతో పాటు హోంమంత్రి నాయినికి అభినందన సత్కార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ.. భాషా ప్రాతిపధిక రాష్ట్రాలు కలిసి ఉండలేవని తేలిందని భాష కంటే సంస్కృతి సంప్రదాయం, ఆచారాలు ముఖ్యమని, అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేచిందన్నారు. ఆ ఉద్యమంలో నాయిని పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డిని ‘తెలంగాణ రత్న ’ పురస్కారంతో సత్కరించి, పుష్పాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. తెలంగాణలో బిడ్డలందరూ రత్నాలేనని, మంచి మనసుతో చేసే పని విజయవంతమవుతుందన్నారు. తెలంగాణ సాధన కూడా అలాగే జరిగిందని వివరించారు. ప్రస్తుత తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.సత్యనారాయణ శర్మ, ఆయుర్వేద వైద్యులు డా.నర్శిరెడ్డి, కె.జయప్రసాద్, ఆచార్య కె.చంద్ర శేఖరరెడ్డి, అలివేలుమంగ, డా.రాజ్‌నారాయణ్, కుçసుమాశేఖర్, జె.మంజులారావు తదితరులు ప్రసంగించారు. -
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి నిరంతర కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ అమ్మ వారి గుడిలో స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ భవన్‌లోనూ.. రాష్ట్రావతరణ వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. -
అగ్రకులాల్లో పేదలు పాలకులకు కనిపించరా?
-
మా కులమే అనర్హతా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్‌తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: నాయిని అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్‌రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్‌రెడ్డి తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యం
హైదరాబాద్ : దేశ సరిహద్దులో ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న సైనికులకు మనం ఎంత చేసినా తక్కువేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయిని మాట్లాడుతూ, సైనికులు తమ కుటుంబాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. వీరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. సైనికుల సంక్షేమాన్ని కాపాడాలన్న కారణంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఒకరోజు జీతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒక్క రోజు జీతాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఒక గ్రూపు ఒక రోజు జీతాన్ని ఇవ్వలేదన్నారు. కెప్టెన్ ఉరేష్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, సైనిక సంక్షేమ అధికారి శ్రీనిష్ కుమార్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ కేసులు.. కీలక సమీక్ష!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ కేసుల విషయమై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులను ఎత్తివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని మంత్రులు తెలిపారు. ఎక్కడైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. 15 రోజుల్లో వివరాలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఉద్యమకాలంలో నమోదైన మిగతా కేసుల ఎత్తివేతపై న్యాయనిపుణులతో చర్చిస్తామని మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ తెలిపారు. ఉద్యమకాలంలో నమోదైన కొన్ని కేసులు సాంకేతిక కారణాలు చూపుతూ.. న్యాయస్థానాలు ఎత్తివేసేందుకు నిరాకరించాయి. పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో అవి ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఓ ఉద్యమకారుడికి తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పీఎస్ భవన నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన
రామగుండం : అంతర్గాం మండల కేంద్రంలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక చొరవతో రూ.1.50 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. రామగుండం కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఏసీపీ రక్షిత కె.మూర్తి, డీసీపీ సుదర్శన్‌గౌడ్, హోంమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీఐ సాగర్, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్ పుప్పాల హన్మంతరావు, గ్రామ సర్పంచులు శశికళ, పద్మ, ఎంపీటీసీ పద్మ, రాజయ్య, వైస్ ఎంపీపీ పవన్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించిన నాయిని.. పాలకుర్తి : హోంమంత్రికి గురువారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో కేశోరాం ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అంతర్గాంలో నూతనంగా నిర్మించనున్న పీఎస్ నిర్మాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి కేశోరాం అతిథి గృహంలో బస చేశారు. కాగా ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు, మేనేజర్ కేఎన్‌రావులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌లున్నారు. మంత్రికి ఘన స్వాగతం.. జ్యోతినగర్ : మంత్రి నాయిని ఎన్టీపీసీ పీటీఎస్ అతిథి గృహంలో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. గురువారం ‘ఖని’లో పలు శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ జ్యోతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు గౌరవందనం చేశారు. ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి హోంమంత్రికి స్వాగతం పలికారు. సారయ్య, సత్యనారాయణ, రమేశ్‌బాబు, గట్టయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్‌కు పీటీఎస్ అతిథి గృహంలో పెద్దపల్లి అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దం పేట శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం తెలిపారు. చెన్న య్య, డాక్టర్ విజయభాస్కర్, సింగం సత్త య్య, పలువురు గౌడ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లకు దూరం
గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఎవరైనా మావోయిస్టులు తారసపడితే వారిని అరెస్టు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని, ఎన్కౌంటర్ల కు దూరంగా ఉందని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో పోలీస్ గెస్ట్‌హౌస్, కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారని, ఆంధ్రోళ్లను తరిమి కొడతారని, వారి ఇళ్లను లూటీ చేస్తారని విషప్రచారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయబోమని హోంమంత్రి తెలిపారు. తెలంగాణ వస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్న ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిదర్ గయా అని హోంశాఖ మంత్రి ప్రశ్నించారు. -
కార్మిక సంక్షేమానికి కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, అందు కోసం అహర్నిశలు పని చేస్తుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. యాజ మాన్యం– కార్మికుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడితే ఆర్థిక వృద్ధిని సాధిం చవచ్చన్నారు. మంగళవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని రవీంద్రభారతిలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం రూ. 10 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులు చనిపోతే రూ. 2 లక్షలే ఇచ్చేవారని, ప్రస్తుతం రూ. 6 లక్షలు ఇస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు ఉన్నాయని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయెల్ అన్నారు. కార్మికులకు న్యాయం జరగాలన్న తలంపుతో అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగం, వేతనం, సామాజిక భద్రత విషయంలో కార్మికులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 2020 నాటికి భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొలుత లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం 8 మందికి అత్యుత్తమ యాజమాన్య అవార్డులు, 30 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ కె.వై.నాయక్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, మినిమం వేజస్ చైర్మన్ జేసీఎల్ చంద్రశేఖర్ గంగాధర్ పాల్గొన్నారు. అవార్డులు అందుకుంది వీరే: జీఎంఆర్ ఏరో టెక్నిక్ లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కాఫీ లిమిటెడ్, యశోద హాస్పిటల్, ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మైలాన్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్. -
రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం!
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజా మున 2.30కి అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. సమాచా రం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంట లను ఆర్పే యత్నం చేశారు. అగ్నికీలలు భారీ గా ఎగిసిపడటంతో హైదరాబాద్ నుంచి మరో 10 ఫైరింజన్లను రప్పించారు. 12 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ మేర దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది. రూ.కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. గతంలోనూ ఇదే పరిశ్రమకు చెందిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి రూ.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పరిశ్రమను సందర్శించిన హోంమంత్రి.. ఘటనా స్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చన్నారు. పరిశ్రమ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా వీలైనంత సాయం చేస్తామని హామీనిచ్చారు. కాగా ఘటనపై విచారణ చేప ట్టి వివరాలు వెల్లడిస్తామని అగ్నిమాపక జిల్లా అధికారి డీఎఫ్ఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
దేశానికి దిశను చూపే ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాలకు దిశ దశను నిర్దేశించే విధంగా టీఆర్ఎస్ 17వ ప్లీనరీ ఉంటుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మీడియా సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఎన్నో అవమానాలను, ఆటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. టీఆర్ఎస్ది సెక్యులర్ ప్రభుత్వమని, తెలంగాణలో అన్నివర్గాలు సామరస్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతోందని అన్నారు. ప్రధాని మోదీ మీద భ్రమలు తొలగిపోయాయని, కాంగ్రెస్, బీజేపీల తీరు చూసే దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే నంబర్ వన్: మహమూద్ అలీ తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను దేశం అంతటా ఆదరణ లభిస్తున్నదన్నారు. ఏ రాష్ట్రం వెళ్లినా ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను, తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతున్నారని చెప్పారు. రైతులకు రూ.12 వేల కోట్లతో పెట్టుబడి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇది రైతు ప్లీనరీ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రదర్శించబోయే సాంస్కృతిక కార్యక్రమా లకు రిహార్సల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. కొంపల్లిలోని గార్డెన్లో మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. -
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహని జరగలేదు
-
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక మండలి సమావేశంలో నాయిని పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 లక్షల మంది కార్మికులు, 312 ప్రభుత్వ సంస్థలు, 10,012 ప్రైవేటు సంస్థలు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక మండలిలో నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వివాహ కానుకలు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ప్రకటించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పలు రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
నాయినికి ‘లోహియా’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు. అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయనతోనే..బంగారు తెలంగాణ సాధ్యం
చింతపల్లి (దేవరకొండ) : బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని తెలంగాణరాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నారన్నారు.రైతులకు 24 గంటల విద్యుత్, పేద ప్రజల సంక్షేమానికి షాదిముబారక్, కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు సన్న బియ్యం భోజనం తదితర సంక్షేమ పథకాలుప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఏ రాజకీయపార్టీ తరం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండాతీర్చిన ఘనతతో పాటు అనేక సంక్షేమ పథకాలుప్రవేశ పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం ఖాయమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీపీ సర్వయ్య, సుధీర్‌రెడ్డి, నట్వ గిరిధర్, ఎల్లంకి అశోక్, ఎండి. ఖాలెక్, చంద్రశేఖర్, నరేందర్‌రావు, బిజె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చందంపేట (దేవరకొండ) : సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్రహోంశాఖ, కార్మిక శాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. డిండి నుంచి నేరెడుగొమ్ము మండల కేంద్రానికి కాలువల ద్వారా చెరువులు నింపేందుకు వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా శనివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి జల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో 70 ఏళ్లుగా పూడుకుపోయిన కాలువలకు పుర్వ వైభవం వచ్చిందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని సుమారు 40 చెరువులు, కుంటలు డిండి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో జలకళను సంతరించుకున్నాయని, గ్రామాల్లో ప్రజ లు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రం అందించని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కమల పరుశురాములు, ఎంపీటీసీ గిరియాదగిరి, గడ్డం వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్‌రెడ్డి, రాంరెడ్డి, ఆలంపల్లి నర్సింహ, మేకల శ్రీను, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీను, ఆరెకంటి రాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. -
మరో 14 వేల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టామని, మరో 14 వేల నియామకాలకు ఉత్తర్వులిచ్చామని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో హోం, కార్మిక శాఖ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం షీ టీమ్స్ హైదరాబాద్‌లో 100, జిల్లాల్లో 100 ఉన్నాయని.. వాటిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బార్ల సమయంపై మాట్లాడుతూ.. మద్యం సేవించి, వాహనాలు నడిపి ఎదుటి వారి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. మద్యం తాగితే వాహనం నడుపొద్దన్నారు. రాష్ట్రంలో అవసరమున్న చోట కొత్త జైళ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి ఓ కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు నాయిని తెలిపారు. మరో 1,000 మంది అర్చకులకు వేతనాలు: ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రంలో 4,700 మంది అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేలా చర్యలు ఇప్పటికే చేపట్టామని, నెల రోజుల్లో మరో 1,000 మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అయితే వారికి 010 పద్దు కింద వేతనాలివ్వడం కుదరదన్నారు. ధూపదీప నైవేద్యం కింద రూ. 6 వేలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని.. అందులో రూ. 4 వేలు పూజారికి, రూ. 2 వేలు ధూపదీప నైవేద్యానికి ఇస్తామని చెప్పారు. -
రాశీఖన్నాకు రోబో షేక్‌హ్యాండ్
-
పోరాట యోధురాలు ఈశ్వరీబాయి: నాయిని
హైదరాబాద్: పోరాట యోధురాలైన ఈశ్వరీబాయిని మహిళా నాయకులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడుపల్లిలో ఈశ్వరీబాయి విగ్రహం వద్ద 27వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈశ్వరీబాయి కుమార్తె, జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈశ్వరీబాయికి నివాళులు అర్పించారు. ఈశ్వరీబాయి చేసిన సేవలు మరువలేనివని, దళితుల అభ్యున్నతికి పాటుపడిన మహానాయకురాలని నాయిని కొనియాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సైతం తనవాణిని వినిపించి పేదల పక్షాన నిలిచిన గొప్ప మహనీయురాలని ఆయన అన్నారు. తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గీతారెడ్డి తెలిపారు. ఈశ్వరీబాయి స్ఫూర్తితో రాజకీయాల్లో రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బాలానందం, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, శివకుమార్, ప్రదీప్, రాజుసాగర్, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేఘనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు ఏడు సీట్లు వస్తే ఎక్కువే..
సాక్షి, జహీరాబాద్ : వచ్చే పదేళ్ల వరకు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ సీఎం కష్టపడని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనులు చేస్తున్న సీఎం దేశంలో నంబర్ వన్‌గా నిలిచారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు తప్పకుండా వస్తుందని, ఎక్కడైతే పరిస్థితి వీక్‌గా ఉందో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి వారి బంధువులకు టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. కొత్త దుకాణాలు ఎక్కువరోజులు నడవవు.. కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటోందని నాయిని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే గడ్డం తీస్తానని శపథం చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం కుమార్ రెడ్డిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు ఏడు కంటే ఎక్కువ సీట్లు రావన్నారు. బీజేపీకి ఒక్క సీటు వస్తే గొప్పేనని ఆయన చెప్పారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా ఫర్వాలేదని, కొత్త దుకాణాలు ఎక్కువ రోజులు నడవవని, చివరికి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా నంబర్ వన్‌గా ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం అమలు చేస్తున్నారని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మిషన్ కాకతీయ పనులను చూసి సీడబ్ల్యూసీ ఇంజినీర్లు మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని విదేశీయులు సైతం అభినందిస్తున్నారన్నారు. -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
శాతవాహనయూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రపౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్సారార్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన దూరవిద్య పితామహుడు గడ్డం రాంరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దూరవిద్య ద్వారా లక్షలాది మంది పేదలు ఉన్నత విద్యకు చేరువయ్యారన్నారు. రాంరెడ్డి కరీంనగర్ జిల్లాలోని మైలారం గ్రామానికి చెందినవారన్నారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందుబాటులో తెస్తామన్నారు. ఇప్పుడు నిధులకు కొరత లేదని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యకోసం పరితపించిన వ్యక్తుల్లో రాంరెడ్డి అగ్రగణ్యుడని కొనియాడారు. రాంరెడ్డికి పద్మ అవార్డు విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. సామాన్యులకు ఉన్నత విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్రం లో 500 రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కోర్టు నుంచి వర్క్‌షాప్ వరకు గల రోడ్ ను రాంరెడ్డిరోడ్‌గా నామకరణం చేయనున్నట్లు తెలిపా రు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ రాం రెడ్డి యూజీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడే విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపునూ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నా రు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈ ద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎం ద రో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రె డ్డి మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం విగ్రహ కమిటీ ప్రతినిధులను సన్మానించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, గడ్డం రాంరెడ్డి కుమారుడు గడ్డం ప్రమోద్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విగ్రహ కమిటీ ప్రతినిధులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మెతుకు సత్యం, రఘువీర్‌సింగ్, రెడ్డి సంఘం అధ్యక్షు డు ముద్దసాని లక్ష్మారెడ్డి, ఊట్కూరి రాదాకృష్ణారెడ్డి, ఓ పెన్ యూనివర్సిటీ సహాయక కేం ద్రం సహాయసంచాలకులు ఈ.రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో మాటల లొల్లి !
-
నెల రోజుల్లో రిజిస్టర్ చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే ఏజెంట్లందరూ నెలలోగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ‘ఈ– మెగ్రేట్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పదేపదే వీసా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్ ప్రయో గించాలని వారు పోలీసు శాఖను ఆదేశించారు. ఎన్ఆర్ఐ శాఖ వ్యవహారాలపై మంత్రులిద్దరూ శనివారం సచివాలయంలో పోలీసు, హోం, ఎన్ఆర్ఐ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో జరిగిన భేటీలో చర్చించిన వివిధ అంశాల అమలుకు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచ నలు జరిపారు. బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఏజెంట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రులిద్దరూ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఏజెంట్లపై చర్యలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దీనికి ప్రజలు పోలీసులకు సహకరించాలని మంత్రులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టామ్‌కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని నిరుద్యో గులకు సూచించారు.రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మాణానికి ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నారై శాఖాధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి.. గల్ఫ్ దేశాలకు మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక, ఎన్నారై, పోలీస్ శాఖలు ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పాస్‌పోర్టు కార్యా లయ అధికారుల సహకారం తీసుకోవాలన్నా రు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఎన్నారై, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో ...అందులోని బలమైన నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకువడం ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామని అన్నారు. -
రెడ్డి కులస్తులంతా ఏకం కావాలి
హైదరాబాద్: రెడ్డి కులస్తులంతా ఏకం కావాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌లోని మేకల జంగారెడ్డి గార్డెన్లో రెడ్డి సామాజిక సార్వజనిక సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయిని మాట్లాడుతూ ఎవరికి వారు వేర్వేరు సంఘాలు పెడుతూ వాటిని రాష్ట్ర స్థాయి సంఘాలుగా చెప్పడం ప్రధాన సంఘాన్ని పలుచన చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఐకమత్యం లేకుండా ఇలా వీధికో సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడంతో చులకనభావం ఏర్పడుతుందన్నారు. ఒకటే సంఘంగా ఏర్పాటై సమస్యలను పరిష్కరించుకునే మార్గంలో ముందుకు నడవాలని సూచించారు. సంఘ ప్రతినిధుల వినతి మేరకు రెడ్డి సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో రైతు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పంటకు, రైతుకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి ఇవ్వడం ప్రభుత్వ ఘనతేనని గుర్తు చేశారు. పేద రెడ్డి కులస్తులను ఆదుకుంటామని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కంసాని సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్‌రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలారెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షుడు ఎడ్ల రఘుపతిరెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు: నాయిని
సాక్షి, హైదరాబాద్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయిని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. తాము ఇచ్చిన మాటప్రకారం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్ దంపతులు బొంతు రామ్మోహన్, శ్రీదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్‌రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్‌రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్‌రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం
సూపర్ స్టార్ కృష్ణకు ‘ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని’ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు. శనివారం ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) టాటా (తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్) సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాయి. ‘‘కృష్ణకు ఆటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేయడం తెలుగు జాతికి గర్వకారణం’’ అని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు జీవితంలో అనేక అవార్డులు వచ్చాయి. ప్రతిసారీ నాకు హీరోగా అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలను గుర్తుకు చేసుకుంటాను. హీరోగా తొలి పరిచయం చేసిన అదుర్తి సుబ్బారావుకు కతజ్ఞతలు’’ అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు జి.వివేక్, ఆటా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, టాటా అధ్యక్షులు జాన్సీరెడ్డితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, ఆదిశేషగిరిరావు, నటి విజయనిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఎన్నారై భవనానికి స్థలం కేటాయించండి..!
సిడ్నీ: ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన తమ ప్రతినిధుల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు సంతోష్ గుప్తాని ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న వివిధ ఎన్నారై సభ్యులను తెలంగాణ హాంమంత్రి నాయని నర్సింహారెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయిస్తే వివిధ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు అందరు కలిసి ఎన్నారై భవనం నిర్మించుకుంటామని అన్నారు. తెలుగు ఎన్నారైల కోసం భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు వారు వివరించారు. తెలంగాణలో కూడా ఎన్నారై భవనం వస్తే పలు లాభాలుంటాయని, భారతదేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నారై భవనం హైదరాబాద్‌లో నిర్మాణం కోసం స్థలం కేటాయింపు కొరకు తాను సీఎం కేసీఆర్‌తో చర్చించి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. తెలంగాణలో ఎన్నారైలు సుఖంగా తమ వ్యాపారాలు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న పలు ఎన్నారై సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. తెలంగాణ సాధనలో ఆ పార్టీ నేతల కృషిని వారు అభినందించారు. తెలంగాణలో అసలైన అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ ద్వారానే జరుగుతుందనీ, 2019 లో అన్ని వర్గాలు కారు గుర్తుకే ఓటు వేస్తారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయని నర్సింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కొరకై ఎన్నారైలు కీలక పాత్ర వహించాలని నాయని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం ఆస్ట్రేలియా సభ్యులు నల్లా ప్రవీణ్ రెడ్డి, కపిల్ కాట్పెల్లీ ప్రశాంత్ కడపర్తి, అశోక్ మారం సందీప్ మునగాల, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్ సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, డేవిడ్ రాజు, శశి మానేం, వినోద్ ఏలేటి తదితరులు నాయనితో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నారై భవనం కోసం ఎయిర్ పోర్టుకు దగ్గర్లో స్థలం కేటాయిస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు
సిడ్నీ : ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతు ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అని, ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా, మహానేతలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర కలదని, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ అని కొనియాడారు. చరిత్రలో నిలిచిన ఒక విద్యా సంస్థకు వందేండ్లు రావడం, శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సభ్యులు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నా తెలుగు ఆడపడుచులు అందరు తెలంగాణలో తయారు చేసిన పోచంపల్లి చీరలు ధరిస్తే తెలంగాణలో వున్న పోచంపల్లి కార్మికులకు ఎంతో ఉపోయోగపడుతారని అన్నారు. అనంతరం ఆస్ట్రేలియా ఎంపి జోడీ మెకాయ్‌కు తెలంగాణ గుర్తుగా ప్రత్యేక పోచంపల్లి చీరను బహుకరించారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎంపిలు జోడి మెకాయ్, జియోఫ్రేలీ, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆజాం అలీ, సీనియర్ నాయకులు సంతోష్ గుప్తా, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి, వివిధ ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో నాయనికి ఘనస్వాగతం
సిడ్నీ: ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాయని బృందానికి ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్ సభ్యులు, తెలంగాణ సంఘాలైన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరమ్, ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. హోం మంత్రి నాయని ఆస్ట్రేలియాలోని పలువురు నేతలను కలుసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించనున్నారు. అదే విధంగా డిసెంబర్ 2న ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, అనిల్ మునగాల, ప్రదీప్ సేరి, రామ్ గుమ్మడివాలి, గోవర్దన్, సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రశాంత్ కడపర్తి, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల కమిటీ చైర్మన్ వినోద్ ఎలెట, భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. నాయని నర్సింహారెడ్డితో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజమ్ అలీ, టీఆర్ఎస్ సీనియర్ నేత సంతోష్ గుప్తా శతాబ్ది ఉత్సావాల్లో పాల్గొంటారు. -
ఆన్లైన్లో రోగుల వివరాలు: నాయిని
సాక్షి, హైదరాబాద్: రోగి గత చరిత్ర, బీమా కార్డు వివరాలు, అత్యవసర సమయంలో వైద్యపరంగా ఆ రోగికి తగిన సూచనలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిసారించి కార్మికుల కోసం ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులో తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ‘బీమా పొందిన కార్మికులకు సంబంధించిన వైద్యసేవలన్నీ ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే రోగి బ్లడ్ గ్రూప్, ఇతర అనారోగ్య కారణాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. రెఫరల్ ఆస్పత్రి వివరాలు, వివిధ ఆస్పత్రులకు రెఫర్ చేసిన కేసుల వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీంతో ఫీడ్‌బ్యాక్‌ను బట్టి తక్షణమే వైద్యసేవలు అందించడానికి సులభమవుతుంది. రాష్ట్రంలో బీమా పొందిన కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. 70 డిస్పెన్సరీలు, 4 ఆస్పత్రులు, 2 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. కార్మికుల సేవల కోసం 18002701341 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాం. ఈ నంబరుతో డాక్టర్ ఇన్ కాల్ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నాం. దీనిద్వారా ఇంటి దగ్గరినుంచే ఫోన్‌కాల్‌తో వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చు’ అని తెలిపారు. -
హోంగార్డుల సమస్యలపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్‌పై ముఖ్యమంత్రి ఆలోచన చేశారని.. రెగ్యుల రైజేషన్‌కు అర్హత లేనివారిని హోంగార్డులుగానే కొనసాగించాలా, క్లాస్–4 ఉద్యోగులుగా మార్చాలా అనే అంశాలను చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో పోలీసు శాఖ ఆధునికీకరణపై జరిగిన లఘు చర్చలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, సుంకరి రాజు, రాములు నాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానమిచ్చారు. హోంగార్డుల వేతనాలను కూడా రూ.12 వేలకు పెంచామని గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపడితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. ‘ఓవైపు రెగ్యులరైజ్ చేయాలంటూ మరోవైపు కేసులు పెడుతూ అడ్డుకుంటున్నారు.. ఇదేం పద్ధతయ్యా..!’అని విమర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కల్పించుకొని న్యాయం జరగని వారు కోర్టుకు వెళతారని, కోర్టును ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. -
వెనుకబడిన రెడ్లకు చేయూతనివ్వాలి
హైదరాబాద్: రెడ్లందరూ ఐక్యంగా ఉండి ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూతనివ్వాలని, రెడ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకు నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలామంది రెడ్లు దయనీయ స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉందన్నారు. రాజ్ బహదూర్ వెంకట్రాంరెడ్డి వందేళ్ల క్రితమే భవిష్యత్ తరాల కోసం రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తాజాగా రెడ్డి హాస్టల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ 15 ఎకరాల స్థలం ఇచ్చి నిధులు కేటాయించారని తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తేనే రెడ్డి సమాజం ఉన్నతమవుతుందన్నారు. గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్ కన్వీనర్, మాజీ చీఫ్ సెక్రటరీ పి.రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్లను ఆహ్వానిస్తూ గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో చదువుకు తగిన ఉద్యోగాలు, వృత్తి నైపుణ్యం, ఉచిత న్యాయ సలహాలు, సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇవ్వటం, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటం, తదితర అంశాలపై చర్చించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం మాట్లాడుతూ రెడ్లు పరస్పరం సహకారంతో ఉంటూ అవకాశాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ్యాప్తంగా అనేక మంది రెడ్లు అనైక్యతతో నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు వసుంధర రెడ్డి, ఎడ్ల రఘుపతి రెడ్డి, నల్ల భాస్కర్ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సరోవరం’ 100 డేస్ ఆడాలి
విశాల్, ప్రియాంకా శర్మ జంటగా శ్రీలత క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు సురేశ్ యాదవల్లి రూపొందించిన చిత్రం ‘సరోవరం’. ఈ చిత్రంతో ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి పాటల సీడీలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా 100డేస్ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. జబర్దస్త్ టీమ్ ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు’’ అన్నారు విశాల్. ‘‘యూనిట్‌ని ప్రోత్సహించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంకా శర్మ. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నిర్మాత శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకి బెక్కం రవీంద్ర లైన్ ప్రొడ్యూసర్. -
గత వ్యాధులతోనే అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: నేరేళ్ల ఘటన విచారణ సమయంలో పోలీసులు నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాధితులకు గతంలో ఉన్న వ్యాధులతోనే అనారోగ్యం పాలయ్యారని వెల్లడించారు. వారిపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునే ఎత్తుగడతో, భయంతో పోలీసులు కొడితే గాయాలయ్యాయని, ఎముకలు విరిగాయని పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. విచారణ సమయంలో మితిమీరి ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చిన ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామన్నారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దురాగతాలు, అత్యాచారాలు, పోలీసు కేసులపై మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానం ఇచ్చారు. నేరెళ్ల ఘటన, లారీలను తగులబెట్టిన సమయంలో అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను వారే గాయపరిచారని పేర్కొన్నారు. కేసులో 8 మంది ప్రమేయం ఉన్నట్లు తేలిందని, ఆ కేసుల భయంతో ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షబ్బీర్ కల్పించుకొని మాట్లాడుతూ అసలు దాడులే జరగలేదని హోం మంత్రి మొదట చెప్పి సభను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఖమ్మం జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరు: హరీశ్‌రావు ఖమ్మం జిల్లాలోని పాలేరు పాత కాల్వ ఆధునీకరణ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలేరు కాల్వ ఆధునీకరణపై ఎమ్మెల్సీ పొంగులేటి అడిగిన ప్రశ్నకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. ఆ కాల్వ కింద 14,447 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 వేల ఎకరాలకు పరిమితమైందన్నారు. తాము ఆధునీకరణ చేపట్టడం వల్ల మరో 6 వేల ఎకరాలకు అదనంగా నీరందించేలా చేయగలిగామన్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇస్తూ.. నల్లగొండ, సూర్యాపేటలో 150 సీట్లతో రెండు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామన్నారు. 26 లక్షల గొర్రెల పంపిణీ: తలసాని గొర్రెల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 26 లక్షల గొర్రెలు ఇచ్చామని, గొర్రెలు చనిపోయినా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మళ్లీ ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లబ్ధిదారులకు నష్టం వాటిల్లదన్నారు. పెద్ద పథకం కాబట్టి కొంతమంది దొంగలు చొరబడ్డారని, వారిపై 85 కేసులు నమోదు చేశామన్నారు. -
మత్తుమందుల కేసులో 22 మంది అరెస్ట్
మత్తుమందుల కేసుల్లో ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈఅంశంపై సభ్యులు రేవంత్‌రెడ్డి, వెంకటవీరయ్య, కృష్ణయ్య, జె.గీత, టి.జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిలపూర్వక సమాధానమిచ్చారు. మత్తు మందుల కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, మత్తుమందుల లభ్యతను, వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుందని నాయినిపేర్కొన్నారు. -
శాంతిభద్రతల వల్లే 4వేల పరిశ్రమల రాక
సాక్షి, హైదరాబాద్: పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్ర తలు నెలకొన్నాయని, అందువల్లే తెలంగాణకు 4 వేల పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు శాఖపై ఖర్చు పెట్టిన ప్రతిపైసాకు పెట్టుబడులు, ఉపాధి కల్పన, అభివృద్ధి రూపంలో అంతకుమించి ఎన్నోరెట్ల ప్రతిఫలం వస్తోందని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత తపాలా శాఖ ‘మై స్టాంపు’ పథకంలో భాగంగా అమరవీరుల స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక తపాలా బిళ్లను, ప్రత్యేక తపాలా కవర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణలో శాంతిభద్రతలు ఎంతో కీలకమని, ఇందులో భాగంగానే రాబోయే ఐదేళ్లలో శాంతి భద్రతలను మరింత సమర్థంగా నిర్వహించేలా పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో భాగంగా పోలీసుశాఖకు ఈ ఏడాది వెయ్యి కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అనుసరిస్తుండటం తో రాష్ట్రంలో నేరాల శాతం గణనీయంగా తగ్గింద న్నారు. భాగ్య నగరంలో దాదాపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొ న్నారు. తెలంగాణలో నేరం చేసి బయటకు వెళ్లలేమని నేరగాళ్లు భావించే విధంగా పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. అమరుల కుటుంబాలకు ఆపన్నహస్తం.. 1959 అక్టోబర్ 21న భారత, చైనా సరిహద్దుల్లో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా దురాక్రమణ దారు లతో పోరాడుతూ కేంద్ర రిజర్వ్ పోలీసు దళానికి చెందిన ఎస్ఐ కరమ్సింగ్తోపాటు మరో పది మంది జవాన్లు వీరమరణం పొందారని, అప్పటి నుంచి ప్రతియేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నామని డీజీపీ అనురాగశర్మ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు దేశ సరిహద్దుల్లో, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతో మంది అసువులు బాశారని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 383 మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటున్నామని, దాదాపు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారి సేవలను జాతి ఎన్నటికీ మరువదని అన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. -
నక్సల్స్, కాంగ్రెస్‌తో కోదండరాం కుమ్మక్కు
స్టేషన్ మహబూబ్‌నగర్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం నక్సలైట్లు, కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జేఏసీ నుంచి అందరూ వెళ్లిపోతున్నారని, అసలు జేఏసీ ఉందా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘తొలి తెలంగాణం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘‘జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని కోదండరాం నా ఇంటికి వచ్చి చెప్పారు. పోలీసుల అనుమతితోనే యాత్రలు చేయాలని ఆయనకు సూచించా’’అని తెలిపారు. రాష్ట్రంలో అరాచక శక్తులకు స్థానం లేదని, అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నాయిని దుయ్యబట్టారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం..
-
ఆరు నూరైనా..యాత్ర కొనసాగుతుంది
-
అమరవీరుల స్ఫూర్తి యాత్ర భగ్నం.. కోదండరాం అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్రకు బయలుదేరిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరో విడుత అమరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనడానికి జనగామ వెళుతున్న జేఏసీ చైర్మెన్‌ను.. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోదండరాం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. హోం మంత్రిని కలిసిన అనంతరం జేఏసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని అన్నారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీజేఏసీ శనివారం వరంగల్, జనగాం జిల్లాల్లో నిర్వహించతలపెట్టింది. ఇందుకుగాను సర్కారును అనుమతి కూడా కోరింది. అయితే యాత్రకు అనుమతి ఇచ్చే అంశంపై ఎటూ తేల్చని పోలీసులు.. ఆయా జిల్లాల్లో టీజేఏసీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడిన కోదండరామ్ ఉదయం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఆయన స్పందన సరిగా లేదని, అయినా యాత్రను కొనసాగించి తీరుతామని కోదండరామ్ స్పష్టం చేశారు. జనగామలో ఉద్రిక్తత జనగామ: అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపథ్యంలో తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల సతీష్ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్పూర్, రఘునాధపల్లి, స్టేషన్ ఘన్ పూర్ పోలీస్టేషన్లకు తరలించారు. టీ జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్ ఫై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. -
ఐ- తెలంగాణ 2017 సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 సదస్సును ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణలోన టీ- ఎయిర్ సమ్మిట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్నెట్, రోబోటిక్స్‌పై చర్చించనున్నారు. -
హోంగార్డుల సర్వీసును క్రమబద్ధీకరిస్తాం
► వారి సమస్యలపై సీఎం సానుకూలం: నాయిని సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సానుకూలంగా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవం త్‌రెడ్డి హోంగార్డులను రెచ్చగొడు తున్నారని, అలాంటి ప్రసంగాలు మానుకోవాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హోంమంత్రిని కలిసి హోంగార్డుల సమస్యలను వివరించగా ఆయన పైవిధంగా స్పందించారు. -
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం లోపే అవడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ వ్యూ ద్వారా చార్మినార్, ట్యాంక్‌బండ్‌లలో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. సహకరించిన గణేష్ ఉత్సవ సమితికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఇతర వినాయక విగ్రహాలు రాత్రి లోపే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీకి అదేశించామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్చందంగా, వీలైనంత త్వరగా రాత్రి లోపే నిమజ్జనాన్ని ముగించాలని కోరుతున్నామన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని శ్రమించారన్నారు. పోలీస్ శాఖ పనితీరు చాలా బాగుందని, జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండీఏ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు. -
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
-
సచివాలయానికి సీఐ పదోన్నతుల రగడ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తమకు పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బంగారు తెలంగాణలోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ తమకు నిరాశే ఎదురవుతోందని 1989–91 బ్యాచ్ సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్లు)లు వాపోయారు. శనివారం సచివాలయానికి ఆ బ్యాచ్ సీఐలు మూకుమ్మడిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ ఐదో జోన్లో డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. పదోన్నతుల ఫైలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద ఉండటంతో సాయంత్రం వరకు అక్కడే వేచిచూశారు. అనంతరం సీఐలతో హోంమంత్రి, రాజీవ్ త్రివేది, రాజీవ్ శర్మలు రాత్రి 7 గంటల వరకు చర్చలు జరిపారు. ఈ నెల 31లోపు ప్రమోషన్ల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు చేయొద్దని వారు సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు వస్తాయని సీఐలకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
'తెలంగాణ పోలీసులు నెంబర్‌వన్'
హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్‌గా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోలీసుల పెట్రోలింగ్‌తో రాష్ట్రంలో నేరాలు తగ్గాయన్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ, ఏసీపీ పోలీసు స్టేషన్లను హోంమంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు సమర్థతంగా పని చేస్తుండటంతోనే దొంగతనాలు తగ్గాయని వెల్లడించారు. పోలీసు వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుందన్నారు. పోలీసులకు అవసరమైన వాహనాలను సీఎం తక్షణమే మంజూరు చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ ఆఫీసుల తరహాలో పీఎస్‌లు ఉండాలని సీఎం నిర్ణయించారని.. అందుకు అనుగుణంగానే పీఎస్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. పోలీసుల స్టేషన్ల ఆధునీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. -
'దుమ్మెత్తి పోస్తే వారిమీదే పడుతుంది'
సాక్షి, హైదరబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజల ఆశీర్వాదంతో మరో పదేళ్లపాటు సీఎంగా ఉంటారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ గిరిజన సంక్షేమ సఘం(టీజీఎస్ఎస్), జీవీఎస్ ఆధ్వర్యంలో రవీంద్రభారతీలో కొమరం భీమ్ అవార్డ్స్, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో జనరంజక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయని తెలిపారు. దుమ్మెత్తే వారి మీదనే దుమ్ముపడుతుందని చెప్పారు. తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. అన్ని వర్గాలకు సబ్సిడీతో కూడిన పథకాలు ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పది కాలాలపాటు ఉండాలని ధీవించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ మాట్లాడుతూ..వచ్చే ఏడాది నాటికి గిరిజనులు తమ సొంత భవనంలోఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. -
మూడేళ్లు దాటినా కాంగ్రెస్‌పై నిందలా
హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ వాడకానికి కాంగ్రెస్ కారణమంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడటం దారుణమని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా హోంమంత్రిగా ఆయన చేస్తున్నదేమిటో చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంమంత్రి నాయిని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. పబ్స్ అరాచకాలపై నిరసన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానమే డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని విమర్శించారు. పబ్‌ల లైసెన్సులు అన్నింటినీ రద్దుచేయాలని డిమాండ్ చేశారు.ఇసుక లూటీని ప్రశ్నించిన సిరిసిల్ల దళితులపై పోలీసుల అరాచకాలు దారుణమని, దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని, దళితులపై పోలీసుల దాడులతో మంత్రి కేటీఆర్ తమ దళిత వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని ఆరోపించారు. -
ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి
హైదరాబాద్: డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో టీఆర్ఎస్ వారసులకు లింకులు ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ప్రతిపక్షాలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు, డ్రగ్స్ మాఫియా కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు. -
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు. మౌలాలిలో తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో టీఆర్ఎస్ నేతలు రైల్ రోకో చేపట్టిన విషయం విదితమే. -
మీ స్థాయికి మేం దిగజారలేం: జానా
హైదరాబాద్: వరంగల్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డిని ఇరికించడాన్ని కె.జానారెడ్డి ఖండించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడారు. రాజేందర్ రెడ్డికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని, నిందితులు ఎక్కడా ఆయన పేరు కూడా చెప్పలేదని జానారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించటం అన్యాయం, అక్రమమన్నారు. రాజకీయ వైరుధ్యం ఉన్నంత మాత్రాన హత్యతో సంబంధం ఉందని ఆరోపించటం రాజకీయంగా కక్ష తీర్చుకోవడమేనని చెప్పారు. 1972లో తనని కూడా ఇలానే ఓ కేసులో ఇన్వాల్వ్ చేశారని గుర్తు చేశారు. కానీ కోర్టు అది అక్రమ కేసు అని తీర్పు చెప్పింది. రాజేందర్‌రెడ్డి విషయంపై డీజీపీకి వివరించి, న్యాయం చేయమని కోరానన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్యతో ఎటువంటి సంబంధం లేదని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ఇట్లా చేస్తే బాగుండదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్కారం లేని నాయకుల స్థాయికి తాము దిగజారమని తెలిపారు. -
రైల్వే కోర్టుకు హాజరైన కేటీఆర్
సికింద్రాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో ఈ రోజు రాష్ట్ర మంత్రులు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావులు గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కుస్తీ వీరులు తెలంగాణ ఖ్యాతిని చాటాలి
హైదరాబాద్: మల్ల యోధులు కుస్తీ పోటీల్లో తెలంగాణ ఖ్యాతిని చాటాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జియాగూడలోని ఎంసీహెచ్ క్వార్టర్స్‌లో జరిగిన వీర్ చంద్రశేఖర్ ఆజాద్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో మల్ల యోధులు వేల సంఖ్యలో ఉన్నారని, వీరంతా గత 100 సంవత్సరాల నుంచి తమ సత్తా చాటుతూనే ఉన్నారన్నారు. యువతకు కుస్తీ పోటీలపై ఆసక్తి కలిగే విధంగా శిక్షణ ఇస్తూ క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్నారని కితాబిచ్చారు. ఈ సందర్భంగా బోలూ సింగ్జీ హెవీ వెయిట్ కేసరి టైటిల్ (90–150 కేజీలు) నెగ్గిన ధూల్‌పేట్ లాలా తాలీమ్‌కు చెందిన సూరజ్ లాల్ పహిల్వాన్‌కు ఆయన విజేత గదను అందించారు. ఈ పోటీలో బోయిగూడ కమాన్ వీర్మారుతీ వ్యాయామశాలకు చెందిన రెజ్లర్ టిల్లు కుమార్ రన్నరప్‌గా నిలిచాడు. మిగతా వెయిట్ కేటగిరీల్లో వీర్ చంద్రశేఖర్ ఆజాద్ కేసరి టైటిల్ (70–90 కేజీలు)ను తెలంగాణ పోలీస్ అకాడమీకి చెందిన జి. గజేందర్ దక్కించుకోగా... వీర్ చంద్రశేఖర్ ఆజాద్ బాల్ కేసరి టైటిల్ (50–55 కేజీలు)ను మల్లేపల్లి గోవింద్రామ్ అఖాడాకు చెందిన వై. సాయి గెలుచుకున్నాడు. 40–45 కేజీల విభాగంలో జియాగూడ ఎంసీహెచ్ రెజ్లర్ జి. ప్రదీప్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో సుమారు 300 మంది మల్ల యోధులు తలపడగా గెలుపొందినవారికి రాష్ట్ర మంత్రి నాయిని షీల్డులు, గదలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్, ఆర్గనైజర్ గులాబ్ సింగ్ పహిల్వాన్, జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జ్ ఠాకూర్ జీవన్ సింగ్, ఆర్గనైజర్ ధరమ్ సింగ్ పహిల్వాన్, కైలాష్సింగ్ పహిల్వాన్, లాలా తాలీమ్‌కు చెందిన ఆదేశ్ సింగ్ పహిల్వాన్, లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు..మనకేం చేస్తాడు?’
హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు మనకేం చేస్తాడు, మామను చంపి మంత్రి అయినోడు ఎలా చేస్తాడు..' అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్ధేశించి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు చేశారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉందని, ఆ చరిత్ర ఆధారంగానే ఇప్పుడు తెలంగాణ వచ్చిందని, లేకుంటే వచ్చేది కాదన్నారు. తెలంగాణ వాదులు ముందు నుంచీ మోసపోతూనే ఉన్నారని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రాకు చెందిన వారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారనే విషయంపై ముగ్గురు ఐఏఎస్‌లతో కమిటీని వేయగా, ఏపీకీ చెందిన వారు 85వేల మంది ఇక్కడ చేస్తున్నారని.. అందుకే ఇక్కడ వారికి ఉద్యోగాలు దక్కట్లేదని కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ ఉద్యోగాలన్నీ ఇక్కడ వారికే వర్తించేలా 610 జీఓను ప్రవేశపెట్టారు. ఆ తరువాత బాబు ముఖ్యమంత్రి అవ్వడం, ఎన్టీఆర్ మరణించడం అన్నీ జరిగిపోయాయి.. కానీ జీఓ మాత్రం అమలు కాలేదు. అప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది ఎన్టీఆర్‌నే చావగొట్టినోడు ఇంకా మనకేం చేస్తాడులే అని ఆ రోజుల్లోనే అనుకున్నామని.. ‘1969 జై తెలంగాణ విద్యార్థి నేతల ఉద్యమ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో నాయిని గుర్తు చేశారు. శనివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో జరిగిన ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారన్నారు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అప్పుడు కాంగ్రెస్ పెద్దలకు నేరుగా చెప్పానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
టామ్‌కామ్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు
- వరంగల్ మెగా ఉద్యోగ మేళాలో మంత్రి నాయిని వరంగల్: విదేశాలల్లో ఉద్యోగాలు చేయగోరేవారు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ను మాత్రమే సంప్రదించాలని, ప్రైవేట్ ఏజెన్సీల చేతిలోపడి మోసపోవద్దని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి బుధవారం వరంగల్‌లో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఆయన.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదనే విమర్శలు అర్థరహితమన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని నాయిని అన్నారు. ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
పదోన్నతులపై పంచాయితీ
అన్యాయం జరిగిందంటూ సీఎంవోకు రేంజ్ ఇన్స్పెక్టర్ల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో డీఎస్పీ పదోన్నతులపై మళ్లీ రగడ మొదలైంది. హైదరాబాద్ రేంజ్, సిటీ పోస్టుల పంచాయితీ మళ్లీ తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తమ పోస్టుల్లో సిటీ అధికారులు పదోన్నతులు పొంది తమను కిందకు నెట్టారంటూ రేంజ్ ఇన్స్పెక్టర్లు సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమను సీనియారిటీలో పట్టించుకోకుండా సిటీలోని వారికే పదోన్నతులు అంటగడుతున్నారంటూ ఆందోళన చేశారు. ప్రస్తుతం 1991, 89 బ్యాచ్‌లో ఉన్న ఇన్స్పెక్టర్లకు పదోన్నతులు కల్పించేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. అయితే తమకూ పదోన్నతులు ఇవ్వాల్సిందేనని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి పదోన్నతులు కట్టబెట్టి తమకు మళ్లీ మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ 1995, 1996 బ్యాచ్ ఇన్స్పెక్టర్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పదోన్నతులపై ఏం చేయాలో తెలియక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సీనియారిటీ ప్రకారం ముందుకెళ్దామంటే గతంలో తెచ్చిన 54 జీవో పునఃసమీక్షించలేదు. అడహాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పిద్దామంటే ఆంధ్రావాళ్లకే ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చే ప్రమాదముంది. -
పోలీసు సంక్షేమానికి చర్యలు
హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుల సంక్షేమా నికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఎక్స్‌గ్రేషి యాను గణనీయంగా పెంచామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు, విద్య, లాస్డ్పెన్షన్ తదితర సదుపా యాలు కల్పిస్తున్నామని వివరిం చారు. మొట్టమొదటి సారిగా హోం గార్డులకు ఎక్స్‌గ్రేషియాను వర్తింప జేస్తున్నామన్నారు. ట్రాఫిక్‌తో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ప్రత్యేక అలవెన్సులు చెల్లిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకన్నా పటిష్టం: సీఎస్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ పోలీసు శాఖ చాలా పటిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర నియం త్రణలో ఉపయోగిస్తున్న తీరు దేశ పోలీస్ మొత్తాన్నీ హైదరాబాద్ ఆకర్షిస్తోందన్నారు. అదే విధంగా పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచిందన్నారు. దేశ భద్రతలోనూ కీలక పాత్ర: డీజీపీ రాష్ట్ర పోలీసు విభాగం శాంతి భద్రతల విషయంలోనే కాకుండా దేశ భద్రత విషయంలోనూ కీలకంగా పనిచేస్తోందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చేస్తున్న కృషిని దేశం మొత్తం గర్విస్తోందన్నారు. అదే విధంగా టెక్నాలజీ ఉపయోగంలోనూ అన్ని రాష్ట్రాల కన్నా ముందువరుసలో ఉన్నామని అన్నారు. ప్రతీ దర్యాప్తు అధికారి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తన టేబుల్‌పై కంప్యూటర్లోనే కేసుల పురోగతి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే షీటీమ్స్ పనితీరును కూడా దేశం మొత్తం గుర్తించిందన్నారు. మన రాష్ట్రంలో మంచి ఫలితాలు చూసిన ఇతర రాష్ట్రాలు కూడా షీటీమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఇలా ప్రతీ అంశంలో తెలంగాణ పోలీస్ ది బెస్ట్ అనిపించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన సిబ్బంది, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. -
చంపడానికే హోంమంత్రి ఉన్నాడా?: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరిస్తున్నారని, ప్రజలను చంపడానికే హోంమంత్రిగా ఉన్నాడా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మంగళ వారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ధర్నా లేదు, ధర్మం లేదు అన్నట్టుగా ఉందని ఆరోపించారు. ధర్నాచౌక్ ఇందిరాపార్కు వద్దే ఉండాలని పోరాడుతున్నవారికి, వద్దంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులను ప్రభుత్వమే రెచ్చగొట్టి అదే సమయానికి ధర్నాకు అనుమతినిచ్చిందని తెలిపారు. రైతుల సమస్యలు, ధర్నాచౌక్ పోరాటాల గురించి పట్టించుకునే తీరిక గవర్నర్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఉగ్రవాదులా అనే పోస్టర్‌ను విడుదల చేశారు. -
నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్-వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ధర్నచౌక్‌లో రెండు వర్గాలకు అనుమతినిచ్చి రెచ్చగోట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ధర్నాచౌక్‌లో స్థానికులు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికులు మాత్రం తమకు మానవతాదృక్పదంతో తాగటానికి మంచినీళ్లు ఇచ్చారని చెప్పారు. రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంటున్నారు జనాన్ని చంపడానికి ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌గారు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గరించి వాకబు చేస్తాడు కాని రైతుల సమస్యల గురించి మాత్రం పట్టించుకోరని వెద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసింనందుకు నిరసనగా "రైతులు ఉగ్రవాదులా" అనే వాల్‌పోస్టర్‌ను వీహెచ్ ఈసందర్భంగా ఆవిష్కరించారు. -
దిగ్విజయ్ క్షమాపణ చెప్పాలి: నాయిని
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ పోలీసులపై అను చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రశంసించారన్నారు. ఈ సమ యంలో రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దెబ్బ తీసేలా దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హోంమంత్రి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ను రద్దు చేయలేదని నాయిని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. -
ట్రేడ్ యూనియన్లలో రాజకీయాలొద్దు
మేడే ఉత్సవాల్లో హోంమంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: ట్రేడ్ యూనియన్లలో రాజకీయాలకు తావు లేకుండా, పరిశ్రమలు పరిపుష్టం చేసుకొని తద్వారా ఆర్థిక వృద్ధిని సాధించుకునేందుకు కార్మిక సంఘాలు, యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కార్మిక శాఖ రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే ఉత్సవా ల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అండ దండలతో యాజమాన్యాలు, కార్మికులు, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేశామని, త్వరలోనే ఈ బోర్డు సిఫారసులను పరిశీలించి తుది నివేదికను ఖారారు చేస్తామన్నారు. ముఖ్యంగా యాజమాన్యాలు.. కార్మికులకు మధ్య సత్సంబంధాలు ఉండాలన్న సంక ల్పంతో ప్రభుత్వం కంపెనీలపై చట్టాలను ప్రయోగించడం లేదన్నారు. ఇవే కాకుండా పక్క రాష్ట్రాలు, ముఖ్యంగా ఒరిస్సా నుంచి రాష్ట్రానికి ఇసుక బట్టీలు తదితర యూనిట్లలో పని చేసేందుకు వచ్చే కార్మికుల సంక్షేమానికి హెల్ప్ డెస్క్‌ను సోమవారం ప్రారంభిం చామన్నారు. దేశంలో తెలంగాణను సంక్షేమ రాష్ట్రంగా పరిగణిస్తున్నారన్నారు. మన పరిశ్రమలు తన్నుకెళ్లేందుకు ఏపీ కుట్ర ఈ ఏడాది లక్షమందికి, వచ్చే రెండేళ్లలో దాదా పు మూడు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబ డి ఉందని నాయిని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.6 లక్షలు, శాశ్వత అంగ వైకల్యం కలిగితే రూ.4 లక్షల సహాయం, మహిళా కార్మికులకు ప్రసూతికి రూ.30వేలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం తన్నుకపోయేందుకు కుట్రలు చేస్తోందని, ఈ ప్రమాదం నుంచి బయటపడా లంటే కార్మికులంతా శక్తివంతంగా తయారు కావాలని సూచించారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... అమెరికాలో వంశపారంపర్య ఆస్తులపై పన్ను ఉంటుందని, అటువంటి విధానం మన దేశంలో తేస్తే ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 90 శాతం కార్మికుల కోసం కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. 22 మందికి శ్రమశక్తి అవార్డులు... ఈ సందర్భంగా 22 మంది వివిధ యూని యన్ల ప్రతినిధులకు శ్రమశక్తి అవార్డులు, 10 కంపెనీలకు బెస్ట్ మేనేజ్ మెంట్ అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ఎమ్మెల్సీ సి.రాములు నాయక్, రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, కమిషనర్ మహమ్మద్ నదీమ్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, ట్రాన్స్‌కో డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కిషన్ పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ హర్షం... మేడే ఉత్సవాల్లో భాగంగా తనకు బెస్ట్ మేనే జ్మెంట్ పురస్కారం ప్రకటించడం పట్ల సింగరేణి బొగ్గు గనుల సంస్థల సీఎండీ ఎన్.శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వానికి, నాయినికి కృతజ్ఞతలు తెలిపారు. -
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
-
కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. పన్నెండు సెట్ల నామినేషన్లు వచ్చాయని, అయితే అందరూ కేసీఆర్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారన్నారు. ఎన్నికలకు సహకరించిన అందరికీ నాయిని ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. కాగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసిఆర్ తిరిగి ఎన్నికయిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు కేసీఆర్ ఎన్నికతో మంత్రులు, ఎంపీలు తెలంగాణ భవన్లో మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీ సమావేశాలకు కొంపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికార పీఠాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడంతో ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి నివేదికను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్లీనరీ వేదికను ఉపయోగించుకోనున్నారు. -
రేవంత్.. ఇప్పుడు సమాధానం చెప్పాలి
ఆనాడు మంత్రి పదవులపై రాద్ధాంతం చేశావ్.. సీఎం కేసీఆర్‌పై విమర్శలా..! హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయంపై సమాధానం చెప్పాలని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీనగర్ వై జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు బీఎన్ శ్రీనివాస్‌రావుయాదవ్, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ నోరెత్తితే కేసీఆర్ టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అనిచెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదైందన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల బీమా ఉంటుందని, ఇప్పటికి ముషీరాబాద్‌లో ముగ్గురికి ఇన్సూరెన్స్ ఇప్పించామన్నారు.కార్యక్రమంలో ముషీరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జీ ముఠాఘోపాల్, గాంధీనగర్, రాంనగర్ డివిజన్ల కార్పొరేటర్లు ముఠా పద్మనరేష్, వి.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘ఏపీలో మంత్రి పదవులపై మాట్లాడాలి..’
చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్నా బుడ్డర్ఖాన్ రేవంత్‌రెడ్డి ఏపీలో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురి ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చింది ఈ విషయంపై సమాధానం చెప్పాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీనగర్ వై జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు బీఎన్ శ్రీనివాస్‌రావుయాదవ్, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ నోరెత్తితే కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా నగంరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదని ఇక మీకు నోరు ఎక్కడిదని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అని చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో గెలిచామని చెప్పుకుంటున్నా బీజేపీ వారిపై ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే ఆరోపణలు ఉన్నాయని ఆ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటాదని చెప్పారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదు జరిగిన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల బీమా ఉంటుందని తెలిపారు. -
మధుకర్ మృతిపై హోంమంత్రి స్పందించాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంథనిలో దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మధుకర్ మృతి విషయంలో రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయన్నారు. దోషులకు శిక్ష పడే విధంగా సమగ్ర విచారణ జరిపించాలని రవి డిమాండ్ చేశారు. -
ప్రాజెక్టుల రద్దుపై రగడ
మండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం ⇒ ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారు: కాంగ్రెస్ ⇒ రాష్ట్ర ప్రయోజనానికి భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామన్న హరీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్షాల మధ్య రగడ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రాజెక్టులనే రద్దు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజన కరమైన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. ప్రాజెక్టులకు దేశం కోసం ప్రాణాల ర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెడితే, రీడిజైన్ పేరిట ప్రస్తుత ప్రభుత్వం ఆ పేర్లను తొలగించడాన్ని తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపే అవకాశ మివ్వాలని కోరినప్పటికీ చైర్మన్ అంగీకరించక పోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదుల నుంచి 225 టీఎంసీల నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు అప్పటి ప్రభుత్వం దుమ్ముగూడెం టేల్ పాండ్ ప్రాజె క్టును ప్రారంభించిదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రాజెక్టును రద్దు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అధ్యయనం చేసిన తర్వాతే ఇందిరా, రాజీవ్ సాగర్ లను రీడిజైన్ చేయాలని నిర్ణయించామని వివరించారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైల్డ్‌లైఫ్ అనుమతిని తీసుకురాలేకపోయిందని, ఇందిరా సాగర్ ప్రాజెక్టు వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున.. వాటిని ప్రీ క్లోజర్ చేసి భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. పాలు కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్ హైదరాబాద్‌లో పాలను కల్తీ చేసే వారిపై ఆహార భద్రతా చట్టం మేరకు కేసులు నమోదు చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. రాజేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ.. కల్తీదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో వచ్చే రెండు నెలల్లోగా కిడ్నీ రోగుల కోసం 34 కొత్త డయాలసిస్ యూనిట్లను పీపీపీ పద్ధతిన ఏర్పాటు చేస్తు న్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్ తదితరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సివిల్ వివాదాల్లో తలదూర్చిన పోలీసులపై చర్యలు: నాయిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఉన్నతాధి కారులకు, ప్రభుత్వ పెద్దలకు ఉన్నతాధి కారులపై అవినీతి ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమ మండలిలో నమోదైన భవన నిర్మాణ కార్మికుడు అకస్మాత్తుగా మరణిస్తే రూ.6 లక్షలు, పూర్తి వైకల్యం పొందితే రూ.5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. -
సెరిలాక్ టైంలోనే సెల్ఫోన్లా?: నాయిని
సాక్షి, హైదరాబాద్: సెరిలాక్ తినాల్సిన సమయం నుంచే సెల్ఫోన్లు పట్టుకోవడం వల్లే చిన్నారులపై లైగింక దాడులు జరుగుతున్నాయని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అభిప్రాయ పడ్డారు. సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా నేతృత్వంలో గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఆన్లైన్లో చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సైబర్ నేరస్థులను కట్టడి చేయడంలో సీఐడీ సఫలీకృతమవుతోందని నాయిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఐడీ రూపొందించిన లైంగిక వేధింపుల నియంత్రణ మాడ్యుల్‌ను ఆవిష్కరించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పోలీసులు, చట్టాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎన్ని ఉన్నా పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నియంత్రణలో కీలక పాత్ర తల్లిదండ్రులదేనని తులిర్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యారెడ్డి స్పష్టంచేశారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తాము చేసిన సర్వే ప్రకారం సెక్సువల్ ఎడ్యుకేషన్ పాఠ్యాంశంగా ఉందని, అయితే దేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంశంగా చేర్చే ప్రక్రియ ప్రారంభంలో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుకలో దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. బిహార్‌లోని పట్నా రైల్వేస్టేషన్లో ఉచితంగా వైఫై ఇవ్వడంతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలు డౌన్లోడ్ చేసినట్టు అక్కడి పోలీసులు దర్యాప్తులో బయటపడిందన్నారు. పోర్న్ వెబ్సైట్లు, సంబంధిత సోషల్ మీడియాను వీక్షించవద్దని తెచ్చే ఒత్తిడి వల్ల పిల్లల్లో మానసిక వేదన ప్రారంభమై, వాటిని చూసేలా ప్రేరేపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది.. ఇటీవల అమెరికాకు చెందిన వ్యక్తిని సీఐడీ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. చిన్నారులకు సంబంధించిన అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసిన ఆ వ్యక్తి.. ఇక్కడి నుంచి అప్లోడ్ చేయడం కూడా ప్రారంభించాడు. ఇలా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది కేవలం చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసేలా ఆన్లైన్లో అశ్లీల చిత్రాలు అప్లోడ్, డౌన్లోడ్ చేస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ స్తుతి కక్కర్ తెలిపారు. అమెరికాలో జరిగిన ఓ బాలిక ఫేస్బుక్ వ్యవహారాన్ని ఉదాహరణగా యూనిసెఫ్ ప్రతినిధి తనిష్ట దత్తా వివరించారు. స్మార్ట్ఫోన్ల ద్వారానే 80 శాతం లైంగిక వేదింపులు జరుగుతున్నట్టు తమ సర్వేలో వెల్లడైందని దత్తా స్పష్టంచేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు అడ్వకేట్ వకుల్ శర్మ, తదితరులు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. -
'వీరికి కేడర్ లేదు.. వారికి నాయకులు లేరు'
⇒ మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: హోంమంత్రి నాయిని హైదరాబాద్: తమ పార్టీ టీఆర్ఎస్ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని, తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ,గంగాధర్ గౌడ్లతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం చరిత్రాత్మకమని కొనియాడారు. గత అరవై ఏళ్లలో సాధించని అభివృద్ధిని తమ పాలనలో సాధిస్తున్నామన్నారు. ఒక పార్టీకి కేడర్ లేదు.. ఇంకో పార్టీకి నాయకులు లేరని వ్యంగ్యంగా అన్నారు. శాసన సభలో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు ధీటుగా బదులిస్తామని, టీఆర్ఎస్ పటిష్టంగా ఉందని, తమ బలం సర్వేలో ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే 106 సీట్లు వస్తాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. తమను గుర్తించి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు ధన్యవాదాలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తమవంతు కృషి చేస్తామన్నారు. -
అన్ని జిల్లాల్లో ‘భరోసా’ కేంద్రాలు
ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో ప్రారంభంలో నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: న్యాయపరంగా, వైద్యపరంగా, చట్టపరంగా హైదరాబాద్‌లోని బాధిత మహిళలకు అండగా ఉంటున్న ‘భరోసా’ కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు, షీ టీమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా వద్ద ‘ఉమెన్ అండ్ చైల్డ్ ఎక్స్పో’ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఈ ఎక్స్పోను శనివారం నాయిని ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక మహిళల భద్రత కోసం ప్రారంభించిన షీటీమ్స్ సేవలు సత్ఫలితాలి స్తున్నాయని, వీటిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని నాయిని చెప్పారు. మహిళల భద్రత కోసం కృషి చేస్తున్న షీటీమ్ సేవలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. దీనికితోడు నగర పోలీసులు ప్రారంభించిన ‘భరోసా’ రాకతో బాధిత మహిళలు, పిల్లలకు సత్వర న్యాయం, వైద్యం, కౌన్సెలింగ్ లభిస్తున్నాయన్నారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా సాగేందుకు ‘భద్రత’ ఉపయోగపడుతుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. నేరరహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్న ట్యాగ్‌లైన్‌తో ఆదివారం ఉదయం నిర్వహించే ‘షీటీమ్స్ 5కే రన్’లో ప్రజలను కూడా భాగస్వాములు చేసే దిశగా చర్యలు తీసుకున్నామని నగర అదనపు పోలీసు కమిషనర్, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతిలక్రా తెలిపారు. అనంతరం బాలికలపై లైంగిక వేధింపులపై తీసిన షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించారు. -
ఈ–ములాఖత్‌తో సమయం ఆదా
⇒ ఖైదీల కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరం ⇒ ‘చంచల్‌గూడ’లో ఈ–ములాఖత్ ప్రారంభంలో హోం మంత్రి నాయిని హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ ఎంతగానో ఉపయోగపడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన చంచల్‌గూడ జైల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–ములాఖత్ సౌకర్యాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ–ములాఖత్ పనితీరును జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. గతంలో ములాఖత్ కోసం వచ్చే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఈ–ములాఖత్ ద్వారా ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చుని ములాఖత్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జెళ్ల శాఖ నిర్వస్తున్న పెట్రోల్ బంక్‌ల ద్వారా ఏటా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంద న్నారు. జైళ్లలో అవినీతిని రుజువు చేస్తే రూ. 5 వేల నగదు బహుమానం ఇస్తామని డీజీ వినయ్‌కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఐజీ నర్సింహ, సూపరింటెండెంట్లు బచ్చు సైదయ్య, బషీరాబేగం తదితరులు పాల్గొన్నారు. ఈ–ములాఖత్ నమోదు ఇలా.. ఖైదీలను ములాఖత్‌లో కలవాలం టే జైలు వద్ద ఉన్న ములాఖత్ నమోదు కేంద్రానికి వచ్చి ఆధార్ జిరాక్స్ అందజేస్తే ములాఖత్‌కు వచ్చే వారితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుని టోకెన్ నంబర్ ఇస్తారు. సూపరింటెండెంట్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ములాఖత్ ఫారమ్‌ను పరిశీలించి అనుమతి ఇస్తారు. దీనికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. సమయం వృథా కాకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఈ–ములాఖత్ ను ప్రవేశపెట్టింది. eprisons. nic. inలో new visit registration ఆప్షన్లో ఆధార్ నంబర్‌తో పాటు ములాఖత్‌కు వచ్చే వారి, ఖైదీ వివరాలు నమోదు చేయాలి. తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. రెండు మూడు గంటల వ్యవధిలో ములాఖత్ అనుమతించబడిందా లేక తిరస్కరించబడిందా తెలిసిపోతుంది. అనుమతించబడిన ములాఖత్ పాస్ ప్రింట్ తీసుకుని జైల్లోని ములాఖత్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది. -
ఉద్యమాలతో అస్థిరపరచవద్దు
హోంమంత్రి నాయిని హితవు సాక్షి, హైదరాబాద్: ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అనవసర ఉద్యమాల పేరుతో ప్రభుత్వాన్ని అస్థిర పరచవద్దు. అధికారం శాశ్వతం కాదు. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా అధికారంలోకి రావొచ్చు. ప్రభుత్వ పరంగా తప్పులుంటే ఎత్తి చూపాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం సక్రమంగా పనిచేస్తుంది. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి చేసుకుందాం’అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో భారత రిపబ్లికన్ పార్టీ, దళిత హక్కుల ఉద్యమ నేత ఈశ్వరీబాయి వర్ధంతి సభ జరిగింది. రాష్ట్ర భాషా, సాంస్కృ తిక శాఖ, ఈశ్వరీబాయి స్మారక ట్రస్టు సం యుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈశ్వరీ బాయి పేరిట మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని పలువురు దళిత నాయకులు, ఈశ్వరీబాయి ట్రస్టు సభ్యులు కోరగా... సీఎంతో మాట్లాడి అందుకు ప్రయత్నిస్తానని నాయిని బదులిచ్చారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని నాయిని చెప్పారు. అసలు సిసలు తెలంగాణ పోరాట యోధురాలు ఈశ్వరీబాయి అని, దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని నివాళులర్పించారు. ఉద్యమంలో చెన్నారెడ్డి తప్పు లేదు 1969లో తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగిన పరిణామాలు, తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తప్పు లేదని నాయిని చెప్పారు. సొంతంగా 10 ఎంపీ సీట్లు గెలిచినా, కేంద్రంలో ఇందిరాగాంధీ పూర్తి మెజారిటీ సాధించడంతో పరిస్థితులు అనుకూలించ లేదన్నారు. నిధులు, నీళ్లు తదితర అంశాలపై చెన్నారెడ్డి ఒప్పందాలు చేసుకున్నారే తప్ప.. ఎక్కడా లొంగి పోలేదన్నారు. అయితే తర్వాత ఆయన గవర్నర్ పదవి తీసుకోవడంతో దుష్ప్రచారానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఈశ్వరీబాయి కుమార్తె, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో ఏక వ్యక్తి సైన్యంగా తన తల్లి గళం విప్పారని, ఆనాటి సీఎంలను సైతం తన ప్రసంగాలతో గడగడలాడించారన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, మండలిలో చీఫ్‌విప్ పాతూరి సుధాకరరెడ్డి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి పాల్గొన్నారు. -
నిరుద్యోగ ర్యాలీ పేరుతో కుట్ర: నాయిని
సాక్షి, హైదరాబాద్: జేఏసీ పేరుతో కోదండరాం చేస్తున్న కుట్ర వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వాడు అయి ఉండీ తెలంగాణ ప్రభుత్వంపైనే కుట్రలు పన్నడమేమిటని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సందర్భం వేరు. ఇప్పుడు కోదండరాం చేస్తున్న సందర్భం వేరు. దానికి దీనికి లింకు పెట్టడం సిగ్గుచేటు. మా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు..’’అని నాయిని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎన్ని వేల ఉద్యోగాలిచ్చాయో చెప్పాలన్నారు. లక్షా 7వేల ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. ర్యాలీకి అనుమతిపై హైకోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని.. కోర్టులను కూడా కోదండరాం గౌరవించడం లేదని పేర్కొన్నారు. నాగోల్‌లో ఆదివారం సభ పెట్టుకుంటే సెలవు దినం కాబట్టి భారీగా జనం వచ్చే వారంటూ ఎద్దేవా చేశారు. శాంతికి విఘాతం కలిగించే యత్నం: పల్లా కోదండరాం హైదరాబాద్‌లో శాంతిభద్రత లకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిం చారని శాసనమండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కోదండరాం ప్రకటనల ఆధారంగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారన్నారు. కోదండరాం ప్రొఫెసర్లా కాకుండా అజ్ఞానిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. -
ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు: హోం మంత్రి
తెలంగాణ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతా ఆయన చెప్పినట్లే జరగాలా అని ప్రశ్నించారు. హైకోర్టు చెప్పినట్లుగా ఆయన ఎందుకు నడుచుకోలేదని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని.. కోదండరామ్ పార్టీ పెట్టినా కూడా తమకు నష్టం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్లే వ్యతిరేకంగా ఉంటే ఎలాగని నాయిని నరసింహారెడ్డి అన్నారు. -
ఓర్వలేకే ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు
-
సీసీ కెమెరాలే కీలకం
శాంతిభద్రతలే ప్రధానం పోలీసుల సంక్షేమమే లక్ష్యం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మెదక్ రూరల్: దొంగతనాలను, రౌడీయిజాన్ని, టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయని, ఒక్క సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లుతో సమానంగా పని చేస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మెదక్ మండలం అవుసులపల్లి గ్రామం వద్ద గల మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్ పక్కన రూ.10కోట్ల78 లక్షల వ్యయంతో 600 మంది పోలీస్ సిబ్బంది క్వార్టర్ల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ నిధుల నుంచి తమ తమ నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో సీసీ కెమెరాల ఆధారంగా కేవలం 24 గంటల్లోనే పోలీసులు చేధించిన పలు కేసుల గురించి వివరించారు. నేరాలను అదుపు చేయడానికి అధునాతన పద్ధతులతో హైదరాబాద్‌లో 22 అంతస్తులతో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా సీసీ కెమెరాల ఆధారంగా ప్రతీ పోలీస్‌స్టేషన్ నుంచి నిమిషాల వ్యవధిలో మొత్తం వివరాలతో కమాండ్ అండ్ కంట్రోల్‌కు సమాచారం వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన కొత్త మండలాల్లో త్వరలో పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నేరాలు అదుపులో ఉన్నాయన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశ పెట్టాం.. గతంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారని, కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టి.. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించామన్నారు. పోలీసులు డబ్బులు తీసుకుని చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నెలనెలా నిర్వహణ కోసం ఖర్చులను అందిస్తున్నట్లు తెలిపారు. ఏ క్లాస్ పోలీస్‌స్టేషన్‌కు రూ.75వేలు, బి క్లాస్ పోలీస్‌స్టేషన్‌కు రూ.50వేలు, సీ క్లాస్ పోలీస్ స్టేషన్‌కు రూ.25వేలు అందిస్తున్నట్లు తెలి పారు. సీఎం ప్రతి రంజాన్‌కు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పోలీసుల సంక్షేమానికి రూ.350 కోట్లు.. పోలీసుల సంక్షేమానికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆసరా పింఛన్‌ను, ఆరు కిలోల బియ్యం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నల్లా నీళ్లు, మిషన్ కాకాతీయ ద్వారా చెరువుల పురుద్ధరణ వంటి కార్యక్రమాలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పది వేల మంది పోలీసులు శిక్షణలో ఉన్నారని, అం దులో మహిళా పోలీసులు ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ ఎంతో అవసరం.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో రామాయంపేట పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వచ్చినప్పుడు మెదక్‌లో పోలీస్ సిబ్బంది కోసం క్వార్టర్లు, డీఎస్పీ కార్యాలయం కావాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే పోలీస్ వ్యవస్థ బాగుండాలనే ఉద్దేశంతో అత్యధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి, ఎస్పీ చందనదీప్తి, మెదక్ ఎంపీపీ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యారెడ్డి, సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నయీమ్ కేసులో ఎవరినీ వదలం: నాయిని
సాక్షి, మెదక్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్ప గించబోమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సిట్ నివేదిక అందాక దోషులని తేలితే ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో స్టాఫ్ క్వార్టర్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. నయీమ్‌తో పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోబోమని తెలిపారు. సీడబ్ల్యూసీకి నయీమ్ బాధిత చిన్నారులు నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ డెన్‌లో గుర్తించిన 8 మంది చిన్నారులను నల్లగొండ బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)కి సోమవారం మహబూబ్‌నగర్ అధికారులు అప్పగించారు. వీరిలో నయీమ్ సోదరుడు అలీమొద్దీన్ కుమార్తె షామ కూడా ఉంది. చిన్నారుల పేర్లను కూడా మార్చి రికార్డుల్లో నమోదు చేయడంతో వారి రక్త సంబంధీకులు ఎవరనేది తేలాల్సి ఉంది. నాలుగేళ్ల బాలుడు జానీపాష అలియాస్ పాలేద్తోపాటు మరో ఇద్దరిది సూర్యాపేట జిల్లా నేరెడుచర్లగా, ఓ బాలికది హుజూర్నగర్ అని అధికారులు గుర్తించారు. -
నయీం ఫొటోల కలకలం.. నాయిని కామెంట్
-
కోదండరాం ఎజెండా ఏమిటో?
ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో ఆయన చేతులు కలిపారు: హోంమంత్రి నాయిని సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చీటికి మాటికి విమర్శలు చేస్తున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఎజెండా ఏమిటో అర్థం కావడం లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కోదండరాంకు ఏం కావాలో ఆయనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వార్షికోత్స వాలకు హాజరైన నాయిని అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో కోదండరాం చేతులు కలిపారని విమర్శిం చారు. కోటి ఎకరాలకు సాగునీరిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ పార్టీ నేతలతో కోదండరాం కుమ్మక్కయ్యారని ఆరోపిం చారు. పత్రికల్లో వచ్చే ఫొటోల ఆధారంగా చర్యలు తీసుకోలేం... అలాగైతే ప్రభుత్వాన్ని నడపలేం అని నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. -
నయీం ఫొటోల కలకలం.. నాయిని కామెంట్
విశాఖపట్నం: కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫొటోలు వెలుగుచూడటం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం విశాటపట్నం పర్యటనకు వచ్చిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా.. ఫొటోల ఆధారంగా నయీం కేసులో చర్యలు తీసుకోలేమని తెలిపారు. దినపత్రికల్లో వచ్చిన ఫొటోలపై తాను స్పందించబోనని పేర్కొన్నారు. సిట్ నివేదిక ఆధారంగానే నయీం కేసులో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెప్పారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు కోదండరాం అడ్డుపడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో జరుగుతున్న శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ హోంమంత్రి నాయిని హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శారదాపీఠం వనదుర్గ హోమాలతోపాటు.. స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో చతుర్వేద సంహిత మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్‌తోపాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల్లో సాయం చేసిన వారిని సత్కరిస్తాం
హైదరాబాద్ : ప్రమాదాల్లో బాధితులకు సహాయం చేసిన వారిని పోలీసు కేసుల్లో సాక్షులుగా పిలవబోమని, క్షతగాత్రులను ఆదుకున్నందుకు అవార్డులతో గౌరవిస్తామని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రమాద రహిత దినం (ఆక్సిడెంట్ ఫ్రీ డే) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇద్దాం.. ప్రమాద రహిత తెలంగాణను కాంక్షిద్దాం.. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్ మహేష్ భగవతి, జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, నటుడు కోట శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు, ఆందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తన కొడుకును గుర్తు చేసుకుని కంట తడిపెట్టారు. -
నిర్మాణ కార్మికుల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపునిచ్చేందుకు వారి పేర్లు నమోదు చేస్తామని, ఇందుకు ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్చేపట్టనున్నామని హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికు ల సంక్షేమంపై ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 9.49 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదై ఉన్నారని చెప్పారు. ఇప్పటికే భవన నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా 69 వేల మందికి పైగా కార్మికులకు రూ.82.55 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మరో 10 కోట్ల వ్యయంతో 35,375 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. -
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
-
హోంగార్డుల సమస్యలు కొలిక్కి!
సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి, డీజీపీ పెండింగ్ సమస్యలపై త్వరలోనే ప్రకటన సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం హోంగార్డులు కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ,, ఐజీ (హోంగార్డ్స్) బాల నాగాదేవీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే హోంగార్డుల డిమాండ్లన్నీ ఒకేసారి చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, మొదటి దఫాలో భాగంగా వేతన పెంపుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నాయి. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న 21 వేల మంది హోంగార్డులకు హెల్త్‌కార్డులు అందించే ఆలోచన కూడా ఉన్నట్టు వివరించాయి. బస్ పాస్‌ల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీకి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో డీజీపీతో సీఎం కేసీఆర్ చర్చించడంతో హోంగార్డులకు తీపి కబురు అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. హోంగార్డుల డిమాండ్లు... మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని కానిస్టేబుళ్లుగా మార్చాలి. కానిస్టేబుల్ నియామకాల్లో ఇన్‌సర్వీస్‌లో ఉన్న హోంగార్డులను శిక్షణకు పంపాలి. డెప్యుటేషన్‌లో ఉన్న హోంగార్డులను అదే విభాగంలో క్రమబద్ధీకరించాలి. హోంగార్డు బెటాలియన్ ఏర్పాటు చేయాలి. కనీసం వేతనం రూ. 25 వేలకు పెంచాలి. ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన సాధారణ, మెడికల్ సెలవులు, బస్‌పాస్‌లు అందించాలి. డెప్యుటేషన్, ట్రావెలింగ్, డెయిలీ అలవె న్సులు, మెటర్నిటీ సెలవులు ఇవ్వాలి. పదవీ విరమణ, సాధారణ మరణం పొం దిన వారికి రూ. 10 లక్షలు అందించాలి. -
నాయిని వర్సెస్ భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ ఉపనేత భట్టి విక్రమార్క పరస్పరం మాటలు తూటాలు పేల్చుకోవడంతో సభ కాస్తంత వేడెక్కింది. చర్చ సందర్భంగా ప్రభుత్వ జవాబుకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ను కోరగా ఆయన అనుమతించారు. నిరసనను తెలిపేందుకు జానారెడ్డి అనుమతితో భట్టి మాట్లాడుతుండగా, నిరసన తెలిపే హక్కు విపక్ష నేతకే ఉందని నాయిని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు మండలి సభ్యులు కనుక అసెంబ్లీ నియమాలు తెలిసి ఉండకపోవచ్చని భట్టి అనడంతో.. నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ జోక్యంతో ఇద్దరి మధ్య ఆవేశం కొద్ది సేపటికి చల్లారింది. -
మనోళ్లు రాగానే ఆంధ్ర వారిని పంపిస్తాం
పోలీసు సిబ్బంది సర్దుబాటుపై హోంమంత్రి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 9,041 మంది కానిస్టేబుళ్లు, ఎస్సై రిక్రూట్మెంట్ ప్రక్రియ తుది దశకు చేరిందని, ఇది పూర్తయిన వెంటనే తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత సిబ్బందిని వారి ప్రాంతాలకు పంపించి వేస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 10,315 మంది పోలీసు సిబ్బందిని కమల్‌నాథన్ కమిటీ ఏపీకి కేటాయించిందని, అందులో 7,437 మంది ఏపీ బెటాలియన్‌లో పనిచేస్తుండగా, 2,878 మంది తెలంగాణలో పనిచేస్తున్నారని నాయిని చెప్పారు. వీరిలో మరో 431 మంది రిలీవ్ అయ్యారని, ఇంకా 2,447 మంది ఇక్కడే ఉన్నారని వివరించారు. వీరందరినీ ఒకేసారి ఆంధ్ర ప్రాంతానికి పంపడం కుదరదన్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత అధికారులు, రాజకీయ నాయకులకు సెక్యూరిటీ కల్పించడం, శాంతిభద్రతలు కాపాడడం లాంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి కనుక తెలంగాణ సిబ్బంది రిక్రూట్ కాగానే వారిని ఆంధ్రకు పంపించి వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత సిబ్బందే కాకుండా... ఏపీలో కూడా 650 మంది తెలంగాణకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారని, అక్కడ నిత్యం అవమానాలకు గురవుతున్న వారిని ఎప్పుడు తెలంగాణకు తీసుకువస్తారని కిషన్‌రెడ్డి (బీజేపీ) ప్రశ్నించారు. ఈ సమాచారం తమకు కూడా ఉందని, ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించామని, వీలున్నంత త్వరగా వారిని తెలంగాణకు తెచ్చేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారని నాయిని వివరించారు. ‘పోలీస్’లో డిజిటల్ అడుగులు పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థను డిజిటలైజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విదేశాల్లో ఉన్న నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న కమాండెంట్ కంట్రోల్ వ్యవస్థ తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని, వాటన్నింటినీ హైదరాబాద్ వ్యవస్థకు అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రూ.3.36 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల 150 అడుగుల ఎత్తులో రిపీటర్ టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. కేంద్రంకన్నా ఎక్కువ మందికి సబ్సిడీ బియ్యం : ఈటల రాజేందర్ రాష్ట్రంలోని 1.91 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయిస్తే.. తాము 2.73 కోట్ల మందికి ఇస్తున్నామని పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.2,200 కోట్లను బడ్జెట్లో కేటాయించినట్టు ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. కేంద్రం రూ.3కు సబ్సిడీ బియ్యం ఇస్తుంటే తాము రూ.1కే ఇస్తున్నామని చెప్పారు. సర్కారు ఆసుపత్రుల అభివృద్ధిపై చర్చిస్తాం : లక్ష్మారెడ్డి ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలను విస్తరించడంతో పాటు వాటిని అభివృద్ధి చేసే అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆసుపత్రుల్లో మందుల లభ్యతపై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చాలా ఆసుపత్రుల్లో 1940 నాటి పరికరాలనే ఇప్పటికీ వినియోగిస్తున్నారని, బడ్జెట్ లభ్యత మేరకు కొత్త పరికరాలను తెప్పిస్తున్నామని చెప్పారు. అయితే గతంలో కన్నా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ఆసుపత్రులకు అవసరమైన మందుల కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. నల్లవాగుపై లిఫ్ట్ అంశాన్ని పరిశీలిస్తాం :హరీశ్‌రావు నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నల్లవాగు ఆధునీకరణ కోసం రూ.19 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి టెయిలెండ్ భూములకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తామని సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ వాగు ఎఫ్టీఎల్ పెంపుపై సర్వే నిర్వహిస్తామని, లిఫ్ట్ ఏర్పాటు ద్వారా మరికొన్ని గ్రామాల్లోని ఆయకట్టును కూడా స్థిరీకరించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. -
సురక్షిత రాష్ట్రమే షీ టీమ్స్ ఉద్దేశం
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యులు గొంగిడి సునీత, బొడిగె శోభ, అజ్మీరా రేఖానాయక్‌లు అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 221 షీ టీమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. షీ టీమ్స్ ఏర్పాటైన తర్వాత మొత్తం 3,171 కేసులు నమోదు చేశామని, 2,730 మందిని కౌన్సెలింగ్ చేశామని మంత్రి తెలిపారు. -
‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’
-
‘ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారు’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం హోం గార్డుల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హోం గార్డుల జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ , కిషన్ రెడ్డి కోరారు. ఈ విషయం పై స్పందించిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచినట్టు తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హోంగార్డుల విషయంలో రాధ్దాంతం చేస్తున్నారన్నారు. -
బాలలతో పనులు చేయిస్తే ఖబడ్దార్
హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతోపాటు అన్ని శాఖలూ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం’ అని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో మంత్రి మాట్లాడారు. చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదు చేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. -
'దేశంలో మన పోలీసులు నెంబర్ వన్'
నల్లగొండ: భువనగిరిలో మహిళా పోలీసుల విశ్రాంతి భవనాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని కొనియాడారు. మహిళల కోసం అన్ని పోలీస్స్టేషన్లలో విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు నీటి కోసం రోడ్లపైకి రాకుండా మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పారు. అనంతరం బీబీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు నల్గొండ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మైనార్టీ సంక్షేమానికి రూ.100 కోట్లు
నిధుల మంజూరుకు కేంద్రంతో మాట్లాడతా: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులిచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సోమవారం మంజీర అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో దత్తాత్రేయ సమావేశమై మైనార్టీల సంక్షేమం, కార్మిక శాఖ చర్యలపై సమీక్షించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలను చిన్న, కుటీర పరిశ్రమల స్థాపన వైపు ప్రోత్సహించాలని సూచించారు. ముస్లిం కుటుంబాల్లో పేదరికాన్ని తరిమేయాలని.. మహిళలు, పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చాలని, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక గ్రాంటు వచ్చేలా కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో మాట్లాడతానని చెప్పారు. కార్మిక శాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తూ, గోషామహల్లో 100 పడకలు.. ఎర్రగడ్డ, బోరబండలో 300 పడకల ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించగా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హోం మంత్రి చెప్పారు. ఈఎస్ఐ పరిధిని రూ.21 వేల వేతనం వచ్చే కార్మికులకు కూడా వర్తింప జేస్తున్నామని, దీని ద్వారా 35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారిని నగదు రహిత చెల్లింపుల వైపు మళ్లించాలని సూచించారు. వర్దా తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నష్టం సంభవించిందని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తానన్నారు. పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల సంతాపం మాజీ పార్లమెంటు సభ్యులు పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం తెలియజేశారు. రాజేశ్వరరావుతో తనకున్న మైత్రిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
మంత్రులపై కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై నమోదైన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. తమపై నమోదైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావులు బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం కూడా కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో వీరితో పాటు పాల్గొన్న పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. -
రేవంత్.. ఓ బుడ్డర్ఖాన్!
మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫైర్ - అడ్డగోలుగా మాట్లాడితే తరిమికొడతరు - రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం అదృష్టం - మోదీ, కేసీఆర్ పనితీరుపై చర్చిద్దాం - బీజేపీ నాయకులకు నారుుని సవాల్ సాక్షి, సిరిసిల్ల: టీడీపీ నేత రేవంత్‌రెడ్డి..ఓ బుడ్డర్ఖాన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ఐటీఐ భవన నిర్మాణానికి, సర్ధాపూర్లో 17వ బెటాలియన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ’రేవంత్‌రెడ్డి అని.. ఓ బుడ్డర్ఖాన్ ఉన్నడు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు.. కేసీఆర్‌ను తిట్టే స్తోమత నీకు లేదు.. నువ్వో.. బచ్చావి.. ఇదే హెచ్చరిక చేస్తున్నా.. నిన్ను మహిళలే తరిమి తరిమి కొడుతరు’ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీకి అడ్రస్ లేకుండా పోరుుందని, ఉన్న ఒకరిద్దరితో అయ్యేదేమీలేదన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చారన్నారు. కేసీఆర్ సీఎం కావడం రాష్ట్రానికి అదృష్టమన్నారు. ఇన్నేళ్లుగా ఇంటింటికీ నీళ్లు అందించాలనే కనీస ఆలోచన ప్రతిపక్షాలు కూడా చేయలేదన్నారు. ఈ డిసెంబర్ నాటికి నల్లగొండ, జనగామ జిల్లాల్లో మూడు వేల ఇండ్లకు, వచ్చే ఏడాది వరకు తెలంగాణ మొత్తానికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఎవరేం చేశారో చర్చపెట్టాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు నాయకుడు లేడని, సీపీఎంకు తెలంగాణలో అడ్రస్ లేదన్నారు. ఐటీలో కేటీఆర్ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాడన్నారు. చైనా, రష్యా, ఆస్ట్రేలి యా దేశాలు తెలంగాణలో పరిశ్రమలు పెడతా మంటూ కేటీఆర్ వెంటపడుతున్నాయని చెప్పారు. దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని సర్వేలు తేల్చాయన్నారు. కేటీఆర్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రశంసిస్తూ, సన్మానం చేసిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో హైదరా బాద్‌కు ఇన్చార్జ్గా కేటీఆర్ రావడంతోనే రికార్డు విజయం సొంతం చేసుకున్నా మన్నారు. విద్యకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నా రని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. కోటి ఎకరాలకు సాగునీరు.. ఇంటింటికీ తాగునీరు: మంత్రి కేటీఆర్ కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు అందివ్వడం సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అనే విధంగా తెలంగాణ మారాలనేది ముఖ్యమంత్రి కల అన్నారు. వడ్డీలేని రుణాల కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందని, త్వరలో అవి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయన్నారు. డబ్బులు చేతుల్లోకి ఎప్పుడొస్తాయో తాము చెప్పలేమని, అది ప్రధాని మోదీ చేతిలో ఉందని చమత్కరించారు. 4 లక్షల మంది బీడీ కార్మికులు నెలకు రూ.40 కోట్లు పింఛన్ ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరేనన్నారు. టీడీపీ హయాంలో ఒకరి చనిపోతేనే మరొకరికి పింఛన్ వచ్చే దుస్థితి ఉండేదని, కాంగ్రెస్ ఇచ్చిన రూ.200 కనీసం మందుబిళ్లలకు కూడా సరిపోయేది కాదన్నారు. తాము వాటిని ఐదింతలు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి రూ.800 కోట్లు ఇస్తే, తాము 38 లక్షల మందికి రూ.4500 కోట్లు పింఛన్ కింద చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యంపై నియం త్రణ ఎత్తివేసి, ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ మనుమడు, మనుమరాలు తినే సన్నబియ్యాన్ని హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నామని, ఇది సీఎం మానవీయతకు నిదర్శనమని పేర్కొ న్నారు. 2018 చివరినాటికి ఇంటింటికి నీళ్లు ఇవ్వక పోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న సీఎం కేసీఆర్అన్నారు. 5400 పాఠ శాలల్లో 3354 పాఠశాలల్లో డిజిటల్ బోధనలు ప్రారంభమ య్యాయన్నారు. ఓ వైపు ప్రజల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపడు తుంటే, మరిచిపోరుున పార్టీలు, జెండాలు పట్టుకొని యాత్రలకు బయలుదేరాయని ఎద్దేవా చేశారు. రైతులను పట్టుకొని ఎంత కష్టమొచ్చిదంటూ ఏడుస్తున్నారని, సంక్రాంతికి రెండు నెలలు ముందే గంగిరెద్దోళ్లు వచ్చారని రైతులు ఆగమైతున్నారన్నారు. అలాంటి ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. -
తెలంగాణ పోలీస్ నంబర్‌వన్
► రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ► శాంతిభద్రతల నిర్వహణకు సర్కారు ప్రాధాన్యం ► మంత్రి కె.తారకరామారావు ► సర్దార్‌పూర్‌లో 17వ బెటాలియన్‌కు శంకుస్థాపన సిరిసిల్ల క్రైం : శాంతిభత్రలనుకాపాడడంలో పోలీసులు మంచి ప్రావీణ్యం చూపుతున్నారని , కేంద్ర హోంశాఖ మంత్రి దీనిని స్వయంగా పరిశీలించారని, దేశంలో తెలంగాణ పోలీస్ విధానం నంబర్‌వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నారుు ని నర్సింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్ధాపూర్లో 17వ పోలీస్ బెటాలియన్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనంతరం పోలీసు విధానంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పుడు పోలీసులంటేనే ప్రజలు భయాందోళనలో ఉండేవారని, దానిని మార్చి స్నేహపూరిత పోలీసు విధానాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోలీస్ బెటాలియన్ సాధించడంలో మంత్రి కేటీఆర్ కృషి ఉందన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం, హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులను శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. నేరాలను అదుపు చేయడానికి సాంకేతికతను వాడుకుంటున్నామని, సీసీ కెమెరాలు, షీ టీంల ఏర్పాటుతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆధునిక పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల తప్పు చేసే వారిలో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. పోలీసుల అవసరాలకు వివిధ స్థారుుల్లో కార్యాలయాలు ఏ ర్పాటు చేస్తున్నామని, అందు లో వ్యాయామశాల ఏర్పాటు చేసి పోలీసుల ఫిట్‌నెస్‌కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్యాయం జరిగితే సంబంధిత ఠాణాలో ఫిర్యాదు ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో కూడా నమోదు చేస్తే ఉన్నతస్థారుు అధికారులకు అది చేరుతోందని, దాంతో సత్వర న్యాయం జరగుతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 130 ఎకరాల్లో అన్ని హంగులతో రెండేళ్లలో బెటాలియను పూర్తి చేస్తామన్నారు. రెండున్నరేళ్లుగా మత సామరస్యంతో ముందుకు సాగుతున్నామని, గత పాలనతో పోల్చితే నేడు క్రైం రేటు తగ్గిందని, దానికి కారణం పోలీస్ విధానంలో పటిష్టమైన చర్యలని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ బెటాలి యన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొండవీటి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వైఎస్సే
♦ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ♦ గుంటూరులో బాలికల వసతి గృహం ప్రారంభం సాక్షి, అమరావతి బ్యూరో/ యడ్లపాడు: చారిత్రక ప్రాంతమైన కొండవీడు కోట అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సిం హారెడ్డి తెలిపారు. ఏపీలోని గుంటూరులో అనవేమా ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఉడుముల కోటిరత్నం, సాంబిరెడ్డి బాలికల వసతి గృహం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన కొండవీడు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొండవీడు అభివృద్ధికి సమష్టి సహకారం అందించినట్టు వెల్లడించారు. నాడు శ్రీకారం చుట్టిన పనులనే నేటి ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. నోట్ల రద్దుతో సామా న్యులకే ఇక్కట్లని బడాబాబులకు ఎలాంటి కష్టం లేదని, బ్లాక్‌మనీ బాగానే చెలామణి అవుతోందన్నారు. రద్దుకు ముందు రూ.50, రూ.100 నోట్లు ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. గ్రామాల్లో సామాజికంగా న్యాయం జరగాలంటే రెడ్లతోనే సాధ్యమన్నారు. ముందుగా నాయిని కొండ దిగువన ఏర్పాటు చేసిన కొండవీడు ప్రాంతానికి చెందిన ఫొటోగ్యాలరీని సందర్శించారు. కొండవీడుకోట కమిటీ కన్వీనర్ శివారెడ్డి చారిత్రక విషయాలను వివరించారు. కొండవీడుకోట అభివృద్ధికి పార్టీలు, కుల, మతాలకు అతీతంగా సమష్టిగా సహకారం అందించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. -
హైదరాబాద్ అందరిదీ
⇒ స్థిరపడ్డ వారితో నగరానికి వన్నె ⇒ క్షత్రియ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకుని ఆదరించే సంస్కృతి హైదరాబాద్ సొంతమని, ఆ సంప్రదాయం మరింత గొప్పగా కొనసాగుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ స్థిరపడ్డ వారందరి సహకారంతో హైదరాబాద్.. దేశంలోనే గొప్ప నగరంగా వెలుగొం దుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి ఆయువు పట్టుగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల (రాజుల) పాత్ర ఉందని చెప్పారు. భవిష్యత్‌లో ప్రభుత్వం క్షత్రియులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరా బాద్‌లోని కొంపల్లిలో బుధవారం జరిగిన క్షత్రియుల అర్ధ శతాబ్ద ప్రస్థాన సమ్మేళనానికి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ‘ఉద్యమం ప్రారంభించినప్పుడు జలదృశ్యంలోనే నా వైఖరి స్పష్టంగా చెప్పాను. టీఆర్ఎస్ విధానాన్ని వెల్లడించాం. పొట్ట కూటికి వచ్చే వారితో పేచీ లేదు. పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అన్నాం. చాలా మంది తమ వైఖరి మార్చుకున్నారు కానీ, మేము మార్చు కోలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్రా ఉంది. దాదాపు 300 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారు. వివిధ వ్యాపారాలతో స్థిరపడి హైదరాబాద్‌లో భాగమయ్యారు. పూలగుత్తిలో అన్ని రకాల పూలు ఒదిగినట్లే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌కు వన్నె తెచ్చారు. రాజులు పౌరుషానికి ప్రతీక. అల్లూరి సీతారామా రాజు వారసులు. అలాంటి క్షత్రియులు హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చారు. కోళ్ల ఫారాలు, ద్రాక్ష తోటలను హైదరాబాద్‌కు పరిచయం చేసింది వీరే. సినిమా, ఐటీ, నిర్మాణరంగాల్లోనూ రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు క్షత్రియులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సీఎం ప్రకటించారు. క్షత్రియ ప్రముఖులు రుద్రంరాజు శ్రీహరిరాజు, పెన్మత్స సోమరాజు, టైర్రాజు సత్యనారాయణ, బంగార్రాజు, అప్పల్రాజు, సీతారామరాజు పాల్గొన్నారు. -
హోంమంత్రి ఆదేశాలు : అత్తింట్లోకి సుజాత
హైదరాబాద్: మూడు రోజులుగా అత్తింటి ముందు న్యాయం కోసం దీక్ష చేపట్టిన సుజాత హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదేశాలతో ఎట్టకేలకు అత్తింట్లోకి అడుగు పెట్టింది. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో నివసించే బీజేపీ నేత ఎస్పీ.శ్రీను కొడుకు అశోక్ 2004లో నవనిర్మాణ్నగర్ బస్తీకి చెందిన సుజాతను ప్రేమ పేరుతో కొద్ది రోజులు సహజీవనం చేసి పెద్దలకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడు. (చదవండి : ‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే.. ) వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. ఇటీవల అశోక్ మరో వివాహం చేసుకోవడానికి పథకం వేసుకొని సుజాతను దూరం పెట్టాడు. దీంతో ఆమె రోడ్డున పడింది. న్యాయం కోసం అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్ష చేపట్టింది. హోం మంత్రిని కలవగా ఆమెను అత్తింట్లోకి పంపించాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం స్థానిక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాల మద్దతుతో అత్తింటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లింది. -
'నాయిని నెత్తిన టోపీ.. కేసీఆర్ చేతిలో లాఠీ'
హైదరాబాద్: ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చి హోంగార్డులకు, పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టోపీ పెట్టారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న హోంగార్డుల అరెస్టు ఘటనలో గాయపడిన కొందరిని ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులను పోలీసులతో కొట్టించి, బూట్లతో తన్నించి అమానుషంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకున్నాడని ఆరోపించారు. హోంమంత్రి నాయిని నెత్తిపై టోపీ పెట్టి, లాఠీ మాత్రం కేసీఆర్ చేతిలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ధర్నాలు ఉండవని, బంద్‌లు, ఉద్యమాలు, పోలీసుల బూట్ల చప్పుడు, లాఠీ చార్జీలు కనిపించవని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ఎద్దేవా చేశారు. ఉన్నతాధికారులకు, నాయకులకు సేవ చేస్తున్న హోంగార్డులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి పోలీసులకు, ప్రభుత్వానికి చేతులు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'సీఎం ఇంట్లోనే కొడుకు కేటీఆర్ కు మంత్రి పదవి, కూతురు కవిత ఎంపీగా, మేనల్లుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చినా ఎవరూ అడగలేదు. అడ్డమైన గొడ్డుచాకిరీ చేస్తున్న హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంటు చేయాలంటే మాత్రం తప్పు వచ్చిందా! పోలీసు బూట్లతో తొక్కించి, లాఠీలతో కొట్టేటంత పెద్ద తప్పా’ అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పోలీసులకు జీతాలు పెంచుతామని, 8 గంటల పనివేళలు ఉంటాయని, వారాంతపు సెలవులు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఏమైనా అమలుచేశారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇంకా హక్కులకోసం కాళ్లు పట్టుకోకుండా సీఎం కేసీఆర్ నడిచే దారిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తీసేసి, ట్రాఫిక్‌ను జామ్ చేయాలని పిలుపునిచ్చారు. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ హెచ్చరించారు.