
సురక్షిత రాష్ట్రమే షీ టీమ్స్ ఉద్దేశం
మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ సభ్యులు గొంగిడి సునీత, బొడిగె శోభ, అజ్మీరా రేఖానాయక్‌లు అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 221 షీ టీమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. షీ టీమ్స్ ఏర్పాటైన తర్వాత మొత్తం 3,171 కేసులు నమోదు చేశామని, 2,730 మందిని కౌన్సెలింగ్ చేశామని మంత్రి తెలిపారు.