
'దేశంలో మన పోలీసులు నెంబర్ వన్'
దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని హోంమంత్రి నాయిని కొనియాడారు.
నల్లగొండ: భువనగిరిలో మహిళా పోలీసుల విశ్రాంతి భవనాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని కొనియాడారు. మహిళల కోసం అన్ని పోలీస్‌స్టేషన్లలో విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళలు నీటి కోసం రోడ్లపైకి రాకుండా మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పారు. అనంతరం బీబీనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు నల్గొండ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.