bhuvanagiri
-
యాదగిరిగుట్టలో బైక్‌పై వెళ్తున్న భక్తుడికి తగిలిన మాంజా దారం
-
భువనగిరిలో బీఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేకువజాము నుంచే పోలీసులు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో రాత్రి పొద్దుపోయే వరకు నిర్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎస్ఎస్యూఐ కార్యకర్తలు.. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి బీఆర్ఎస్ నేతలు భువనగిరికి చేరుకుని మూడు చోట్ల ధర్నాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు.దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించాయి. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అశ్వికదళంతో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో గస్తీ నిర్వహించారు. పోలీసుల తీరుపై పైళ్ల శేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు భువనగిరిలో వినాయక చౌరస్తా వద్ద నిర సన తెలుపుతున్న వల్లపు విజయ్ను పో లీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు చెప్పారని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. -
బీఆర్ఎస్ కార్యాలయంపై NSUI కార్యకర్తల దాడి
-
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది’
యాదాద్రి: భువనగిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడిగా ఆమె ఆరోపించారు. ‘ కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. ఏఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్‌కి దుకాన్ ఒక బూటకం. కాంగ్రెస్‌ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం. కాంగ్రెస్ యువజన విభాగం గూండాల విభాగంగా మారింది. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనం. కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి.భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరు’ అని కవిత హెచ్చరించారు.కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా తీవ్రంగా మారింది. . భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే: కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు: కేసీఆర్ -
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
-
భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
సాక్షి, భువనగిరి: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి దుర్మరణం
భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చంపాపేట్‌కు చెందిన బైగళ్ల జగన్ భార్య పావని(30), కుమార్తె సాత్విక, కుమారుడు ప్రణయ్(2)తో కలిసి శుక్రవారం ఉదయం బైక్‌పై యాదగిరిగుట్ల లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం అనంతరం శుక్రవారం రాత్రి యాదగిరిగుట్ట నుంచి నగరానికి తిరిగి వస్తుండగా భువనగిరి మండల పరిధిలోని హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారిపై దీప్తి హోటల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ప్రణయ్‌తో పాటు స్వల్పంగా గాయపడిన జగన్, సాతి్వకను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సెలవు రోజు కావడంతో.. జగన్ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నాడు. వరుస సెలవులు రావడంతో యాదగిరిగుట్టతో పాటు స్వర్ణగిరిలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం రాయగిరి చెరువు వద్ద సంతోషంగా గడిపిన వారు భోజనం చేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పోటీలో ఉన్నారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీబీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి బూరభువనగిరిలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్ఎస్ లోని పాత పరిచయాలతో క్రాస్ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్‌ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్ చరిష్మా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తోంది. సెమీ అర్బన్ నియోజకవర్గం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధి సెమీ అర్బన్‌గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌కు ఈస్ట్‌కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది. పోటీలో సీపీఎం రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది. ప్రభావితం చేసే అంశాలు పెండింగ్ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ జాప్యం కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్యం గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 2019 లోక్‌సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్) 5,32,795 (44.37 శాతం) బూరనర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) 5,27,576 (43.94 శాతం) పీవీ శ్యాంసుందర్‌రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం) -
స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
భువనగిరి ఎంపీ టికెట్ అడగడం లేదు
మునుగోడు: భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మికి అడుగుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదని, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే గిట్టనివారు తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే బాగుటుందని తాను పలుమార్లు చెప్పానని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కోమటిరెడ్డి కుటుంబం పదవుల కోసం పాకులాడదని, తన భార్య లక్ష్మి కూడా పోటీచేసేందుకు సుముఖంగా లేదని చెప్పారు. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో.. తమ కుటుంబం నుంచి పోటీచేస్తేనే గెలుస్తామని రిపోర్టు వస్తే..అధిష్టానం పోటీచేయాలని పట్టుబడితే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఎప్పుడూ విభేదాలు ఉండవు తన సోదరుడు మంత్రి వెంకట్‌రెడ్డికి, తన మధ్య విభేదా లు ఉన్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ మధ్య ఏ ఒక్క రోజూ ఎడబాటు ఉండదన్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని, తాను సూర్యాపేటకు వెళ్తే.. ఒక్క రోజు కూడా బయట తిరగలేడన్నారు. ఆలస్యమైనా తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ నమ్మకం ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో చౌటుప్పల్, నారాయణపురం ఎంపీపీలు తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాదేవి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్‌కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.... ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం
భువనగిరిటౌన్/నేరేడుచర్ల: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు నెగ్గాయి. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కోల్పోయింది. భువనగిరి మున్సిపాలిటీలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులతో కలిసి సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 36 మంది సభ్యులుండగా మంగళవారం నిర్వహించిన అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 31 మంది హాజరయ్యారు. 16 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గింది. ఈ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. మొదట బీఆర్ఎస్కు ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. వైస్ చైర్పర్సన్ రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు చైర్మన్‌తో కలిసి ముగ్గురు, సీపీఎంకు ఒకరు, కాంగ్రెస్‌కు పది మంది సభ్యులున్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస సమావేశానికి చైర్మన్ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. -
‘కారు’ వెళ్లింది.. సర్వీసింగ్‌కే..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు ఓటమి కొత్తకాదని, ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు విరామమెరుగకుండా పనిచేసిన కారు మరింత స్పీడ్‌గా పనిచేసేందుకు సరీ్వసింగ్‌కు మాత్రమే పోయిందని, షెడ్డులోకి పోలేదంటూ బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదనీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడానికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం జరగలేదని, ఇతర పార్టీల నుంచి వ న వారికి సరైన గుర్తింపును ఇవ్వలేకపోయామనీ, అందుకు కూడా తనదే పూర్తి బాధ్యతన్నారు. పది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా జరిగిన సమీక్షల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా గుర్తించిన కారణాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటరుకు, కార్యకర్తకు మధ్య లింకు తెగింది ‘నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆరి్ధక పరిస్థితిని కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వానికి పథకాలకు నడుమ కార్యకర్తల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే ప్రయోజనం చేకూరడంతో ఓటరుకు, కార్యకర్తకు నడుమ లింకు తెగిందని పలువురు నేతలు చెప్పారు. ‘ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చి నా, ప్రతీ నియోజకవర్గంలో 15వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేక పోయాం. వందలో ఒకరికి రేషన్‌కార్డు రాకున్నా నెగెటివ్ ప్రచారం జరిగింది. దళితబంధు కొందరికే రావడంతో అర్హత కలిగిన ఇతరులు అసహనంతో పార్టీకి వ్యతిరేకమయ్యారు. దళితబంధు ఇవ్వడంపై ఇతర కులాల్లో వ్యతిరేకత ఏర్పడింది’ అని సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. ‘రైతుబంధు అందరికీ వర్తింప చేసినా ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూస్వాములకు లబ్ధి జరగడాన్ని సామాన్య రైతు ఒప్పుకోలేదని తేలింది. పార్టీ పట్ల ప్రజల్ల నెలకొన్న వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే అధికారానికి దూరమైనట్లు విశ్లేషణలో తేలింది’ అని కేటీఆర్ వెల్లడించారు. సమీక్షల్లో భాగంగా వస్తున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా ప్రజలు తప్పు చేశారంటూ అక్కడక్కడా పార్టీ నాయకులు అంటున్నారు. రెండు పర్యాయాలు మనల్ని గెలిపించింది ప్రజలే. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’అని కేటీఆర్ పార్టీ నేతలకు హితవు పలికారు. ’’సంయమనం పాటించాలని కేసీఆర్ సూచించినా కాంగ్రెస్ బీఆర్ఎస్ను రెచ్చగొట్టి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ వేదికగా మన నేతలు కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు.ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, నష్టపోతున్న ఆటో డ్రైవర్ల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలి.’’అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు ‘‘బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారు. అమిత్ షాతో రేవంత్ భేటీ తర్వాతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ పద్ధతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా నిరాశ తప్పలేదు. రాజకీయం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటోంది. మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచే వాళ్లమేమో. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలు సీరియస్‌గా తీసుకుంటూ తప్పుడు కేసులు ఎదుర్కొంటాం’ అని కేటీఆర్ వెల్లడించారు. -
భువనగిరి మున్సిపాలిటీలో కుంభం అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం
-
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
-
భువనగిరిలో కాంగ్రెస్ ప్రచారం
-
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్‌లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్‌లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్‌గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్‌కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్‌లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్‌కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్‌ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్‌తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్‌లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
3 కోట్ల విలువైన భూమి.. మేము బ్రతికి కూడా వేస్ట్.. ఎమోషనల్ అయిన రైతులు
-
భువనగిరి ఖిలాను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
భువనగిరి: భువనగిరి ఖిలాను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఖిలాపై చారిత్రాత్మాక కట్టడాలు, నీటి కొలనులు, నిర్మాణాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఏకశిలపై నిర్మించిన కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, భావితరాలకు తెలియజేసేందుకు శిథిలం కాకుండా పరిరక్షించుకోవాలని సూచించారు. ఖిలా రాక్ క్లైలైంబింగ్కు అనువుగా ఉందని, ఇక్కడ శిక్షణ పొందినవారు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతారోహణ చేయడం మంచి పరిణామం అన్నారు. అనంతరం న్యాయమూర్తి కుమార్తెలు రాక్ క్లైలైంబింగ్, జిప్‌లైన్ చేశారు. జస్టిస్ రాధారాణి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత ఉన్నారు. -
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. అక్కడ మాత్రం!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తయింది. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ప్రకారం హద్దులు నిర్ధారించారు. అలైన్మెంట్ ప్రకారం జెండాలు కట్టిన కర్రలు పాతారు. సర్వే నంబర్ల వారీగా రైతుల సమక్షంలో వారి వివరాలను రికార్డు చేశారు. ఆ రెండు చోట్ల తీవ్ర నిరసనలు.. రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు కోసం ఎనిమిది ‘కాలా’ (కాంపిటెంట్ అథారి టీస్ ఫర్ లాండ్ అక్విజిషన్) లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అధికారులు అన్ని విభాగాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే భువనగిరి కాలాకు సంబంధించి సర్వే అసలు జరగలేదు. ఇక్కడ రైతులు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో పలు ప్రాజెక్టులకు భూమి ఇచ్చినందున మరోసారి భూమిని కోల్పేయే ప్రసక్తే లేదంటూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూసేకరణ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అలాగే సంగారెడ్డి పట్టణం సమీపంలోని గ్రామాల రైతులు కూడా అధికారులను సర్వే చేయనివ్వలేదు. సంగారెడ్డిని దాదాపు ఆనుకుని ఉన్నందున తమ భూములకు ఎక్కువ ధర ఉందని, అయితే పరిహారం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భూములు ఇవ్వబోమంటూ సర్వేను అడ్డుకున్నారు. భువనగిరి కాలా పరిధిలో 22 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే జరగలేదు. సంగారెడ్డి కాలా పరిధిలో 8 కి.మీ. నిడివి గల రోడ్డుకు సంబంధించి సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో చర్చించి, సర్వే జరపాలని అధికారులు భావిస్తున్నారు. కుదరని పక్షంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. -
Anvitha Reddy: ‘మనాస్లు’ పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో రికార్డ్ సృష్టించారు. నేపాల్‌లోని ఎత్తయిన మనాస్లు పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణ కోసం ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ నుంచి నేపాల్ బయలుదేరి వెళ్లిన అన్వితారెడ్డి... సెప్టెంబర్ 11న మనాస్లూ బేస్ క్యాంప్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత పైభాగానికి 28వ తేదీ రాత్రి చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా అన్వితారెడ్డి చరిత్ర సృస్టించారు. మనాస్లు... ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తయిన పర్వతం కావడం విశేషం. ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డి.. మేలో ఎవరెస్టును, 2021 జనవరిలో ఆఫ్రికాలోని కిలిమంజారోను, ఫిబ్రవరిలో ఖడే, డిసెంబర్లో యూరప్‌లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో అన్వితారెడ్డి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. పట్టణంలోని పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె అయిన అన్విత... ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. -
మటన్ ముక్కలు.. డీజే పాటలు!.. రెండు పెళ్లిళ్లు.. రెండు వివాదాలు
సాక్షి, భువనగిరి క్రైం: ఒకచోట పెళ్లి విందులో మటన్ ముక్కల విషయమై గొడవ.., మరొకచోట వివాహానంతరం బారాత్ సమయంలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కడీలబాయి తండాకు చెందిన యువతితో చండూరు మండలం సర్వయితండాకు చెందిన యువకుడి వివాహం గురువారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. కాగా పెళ్లి తర్వాత ఇచ్చిన విందులో మాంసం కూర వడ్డించే క్రమంలో వివాదం మొద లైంది. అదికాస్తా ముదరడంతో అమ్మాయి, అబ్బా యి తరఫు వారు ఘర్షణకు దిగి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండువర్గాల బంధువులు ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద కూడా గొడ వపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిలో ఉన్న ఓ సర్పంచ్‌పై ఎస్ఐ వెంకటేశ్ అనుచితంగా ప్రవర్తించి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏసీపీ ఉమామహేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ అబ్బా యి వివాహం భువనగిరికి చెందిన అమ్మాయితో పట్టణంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. పెళ్లి అనంతరం బారాత్‌లో డీజే పాటలతో డ్యాన్స్ చేస్తున్న క్రమంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల బంధువులు తమకు నచ్చిన పాటే పెట్టాలని ఒకరినొకరు తోసుకున్నారు. కాసే పటి తర్వాత అబ్బాయి తరఫు వారు బస్సులోకి ఎక్కేందుకు వెళ్లగా అక్కడ వేచి ఉన్న అమ్మాయి తరఫు వారు ఇటుకలతో దాడి చేశారు. దీంతో కూరడి ఈశ్వర్, దొంతరబోయిన స్వామిశేఖర్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కర్రలతో దాడి చేయడంతో అబ్బాయి తరఫు వారి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. చదవండి: Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా -
భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత
సింగరాయకొండ: తెలంగాణలోని భువనగిరిలో కిడ్నాప్ అయిన బాలుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దాల మహేష్ తెలంగాణలోని జనగాం మండలం భువనగిరి పట్టణానికి బేల్దారి పని కోసం వెళ్లాడు. 10 రోజుల క్రితం మహేష్ స్వగ్రామానికి వచ్చేప్పుడు మూడేళ్ల బాలుడిని వెంట తీసుకొచ్చాడు. బుధవారం మహేష్ బాలుడిని తన తమ్ముడు రమేష్ వద్ద వదిలి ఊరికి వెళ్లటానికి ప్రయత్నించగా.. అందుకు రమేష్ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాదులాట జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. మహేష్ తను పనిచేస్తున్న చోట బాలుడిని కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తరువాత స్వగ్రామానికి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు. -
రామకృష్ణ హత్య కేసులో మరో ఏడుగురి రిమాండ్
భువనగిరి క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో మిగిలిన ఏడుగురు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ప్రమేయంఉందని భావిస్తున్న మొత్తం 11మందిలో సోమవారం నలుగురిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న మిగతా ఏడుగురు ఏ1 పల్లెపాటి వెంకటేశం, ఏ2 దోర్నాల యాదగిరి(బీబీనగర్ పీఎస్‌లో హోంగార్డు), ఏ3 దంతూరి రాములు, ఏ8 మహ్మద్ సిద్దిఖీ, ఏ9 తోట్ల ధనలక్ష్మి, ఏ10 తోట్ల నరేందర్, ఏ11 తోట్ల భానుప్రకాశ్‌లను విచారించారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. -
రామకృష్ణది పరువు హత్య కాదు
భువనగిరి క్రైం/గజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణది పరువు హత్య కాదని, ఆస్తి తగాదాల హత్యగానే భావిస్తున్నట్లు భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. హత్య కేసులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఏ1గా యాదాద్రి భువనగిరి జిల్లా గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం, ఏ2గా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల యాదగిరి (బీబీనగర్ పీఎస్‌లో హోంగార్డు), ఏ3గా వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన దంతూరి రాములు, ఏ4గా మోత్కూర్‌కు చెందిన సయ్యద్ లతీఫ్, ఏ5గా సిద్దిపేట జిల్లా యెల్లారెడ్డి నగర్‌కు చెందిన గోలి దివ్య, ఏ6గా సిద్దిపేట జిల్లా ఇందిరా నగర్ కు చెందిన మహ్మద్ అప్సర్, ఏ7గా సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌కు చెందిన పొలసం మహేశ్, ఏ8గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన మహ్మద్ సిద్దిఖీ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన తోట్ల ధనలక్ష్మి, తోట్ల నరేందర్, తోట్ల భానుప్రకాశ్‌లను ఏ9, ఏ10, ఏ11 నిందితులుగా పేర్కొన్నారు. సోమవారం సయ్యద్ లతీఫ్, గోలి దివ్య, మహ్మద్ అప్సర్, పొలసం మహేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీపీ చెప్పా రు. నిందితుల నుంచి ఓ బొమ్మ పిస్టల్, రెండు కొడవళ్లు, సుత్తి, రూ.లక్ష నగదు, ఇండికా కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. జమ్మపురం సర్పంచ్ అమృతరావును సాక్షిగా పేర్కొన్నారు. నిమ్మతోటలోకి తీసుకెళ్లి.. భూమిని చూపించడానికి జమ్మపురం సర్పంచ్ అమృతరావు ఈ నెల 15న రామకృష్ణను భువనగిరి పట్టణంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లారు. అమృతరావుతో వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్గవి 16న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమృతరావును పోలీసులు విచారించగా లతీఫ్ అతని అనుచరులు రామకృష్ణను గుండాల మండలం రామారంలోని నిమ్మతోటలోకి తీసుకెళ్లి తాడుతో కట్టి సుత్తి, బండ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారని చెప్పినట్టు ఏసీపీ తెలిపారు. శవాన్ని గోనె సంచిలో కట్టి టాటాబోల్ట్ కారులో పెట్టి అమృతరావును కూడా ఎక్కించుకుని బయలుదేరారని, కిలోమీటరు దూరం వచ్చాక అతన్ని అక్కడే వదిలేశారని, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు సిద్దిపేటకు వెళ్లినట్లు తెలిపారు. అమృతరావు సమాచారం మేరకు లతీఫ్, అతని భార్య దివ్య, మహేశ్, అప్సర్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు చెప్పారు. ఆస్తి కోసం మామను బెదిరించడంతో.. కొంతకాలం కిందట రామకృష్ణ ఉద్యోగం పోవడంతో మామ వెంకటేశంను ఆస్తిలో భాగం ఇవ్వాలని, లేకపోతే కోర్టులో కేసు వేస్తానని రామకృష్ణ బెదిరించాడని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశం రామకృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడని ఏసీపీ తెలిపారు.హోంగార్డు యాదగిరి ద్వారా రూ.10 లక్షలకు లతీఫ్‌తో సుపారీ మాట్లాడుకుని రూ.6 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారన్నారు. గుండాల మండలం రామారంలో దారుణంగా హత్య చేసి శవాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లక్డారం గ్రామంలోని కొండపోచమ్మ దేవాలయం దగ్గరలోని గోతిలో పాతిపెట్టారన్నారు. విచారణలో ఈ విషయాన్ని పోలీసులకు లతీఫ్ తెలపగా వెంటనే అక్కడికెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు. తల, మెడ భాగాల్లో తీవ్రగాయాలు రామకృష్ణ తలకు తీవ్ర గాయమైందని, మెడ చుట్టూ ఉరేసినట్టు స్పష్టమైన గాయం కనిపిస్తోందని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించారు. నుదుటిపై, తల వెనుకభాగంలో గాయాలున్నాయన్నారు. చెవులు, ముక్కులోంచి రక్తం వచ్చిందని.. వీపు వెనుక కూడా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మూత్రం పోసే నాళం వద్ద కూడా బలమైన గాయం కనిపించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి తీసుకెళ్లారు. 6 నెలల పసికందు, భార్గవికి అన్యాయం చేశారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
20 మంది టీంలో ఐదుగురు చనిపోయారు.. అయినా..
సాక్షి, హైదరాబాద్: శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీల చలిలో, గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలిలో రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళగా భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డి నిలిచింది. పర్వతారోహణ పూర్తిచేసి నగరానికి చేరుకున్న ఆమెను గూడూరి నారాయణరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గూడూరు నారాయణరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ... 5 సంవత్సరాలుగా పర్వతారోహణ చేస్తున్నానని, ఇప్పటివరకు కిలిమంజారోతో పాటు మరో నాలుగు పర్వతాలు అధిరోహించానని తెలిపింది. నవంబర్‌లో యూకే నుంచి వచ్చిన 20 మంది ఉన్న టీంలో ఐదుగురు చనిపోయారని అయినా పట్టుదల వీడక తాను, తన గైడ్ చతుర్ ముందుకు వెళ్లామన్నారు. తనతో పాటు వచ్చిన చాలామంది వాతావరణం చూసి వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని..
భువనగిరి: మనస్తాపానికి గురై చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని రాయగిరి చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన బసవరాజు, భారతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో గీతారాణి (34) ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చదవండి: ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’ వరంగల్ కాజీపేటకు చెందిన టి. విజయ్‌కుమార్‌తో గీతారాణికి గతంలో నిశ్చితార్ధం అయ్యింది. డిసెంబర్ 9, 2020న పెళ్లి తేదీ నిర్ణయించారు. కాగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అబ్బాయి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అప్పటి నుంచి గీతారాణి డిప్రెషన్లోకి వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుల్దేరిన గీతారాణి సాయంత్రం 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. చదవండి: రూ.70 కోసం వాగ్వాదం: గొడ్డలితో దాడి కాగా రాత్రి భువనగిరిలోని రాయగిరి చెరువు కట్ట మీద యువతి చెప్పులు, ఆధార్‌కార్డు పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. గురువారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టగా, చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహయంతో మధ్యాహ్నం చెరువులో నుంచి గీతారాణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు. -
మాకొక అండర్ పాస్ కావాలి
-
కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని పాలించాలని, ప్రజలను ఇబ్బందులు పెడుతే చూస్తూ ఉరుకొమని, గాడిల పాలనను బద్దలు కొడుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇకనైనా పిచ్చి తుగ్లక్ పాలనకు స్వస్తి పలకాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్పైన ప్రజల పక్షాన కోర్టులో ఫీల్ దాఖలు చేశానని, ఎల్ఆర్ఎస్ రద్దు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కాదు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం నీకు(కేసీఆర్) సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. శ్వాశతంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చెయాలి లేకపోతే కేసీఆర్, టీఆర్ఎస్ను శాశ్వంతంగా ప్రజలు రద్దు చేస్తారని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టవద్దన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు. కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నావని ఫైర్ అయ్యారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపీ ప్రజలను ఇబ్బంది పెట్టవని విరుచుకుపడ్డారు. నియంత్రణ వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశామని, కేసీఆర్ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో అని హితవు పలికారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి పీఆర్సీ కోసం ఎన్నిసార్లు కమిటీలు వేస్తావు, ఇక కేసీఆర్ అబద్దాలకు స్వస్తి పలకాలన్నారు. రైతులకు ఉచిత ఎరువులు అని రైతులకు శుభవార్త వారం రోజుల్లో చెబుతానన్నది ఏం అయిందని ప్రశ్నించారు. సకల జనులను ఏకం చేసి తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కంటేని పెద్ద ఉద్యమం చేస్తామని కేసీఆర్ నియంత పాలనకు చరమగితం పాడుతామని, కేసీఆర్‌ను గద్దెదించుతామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. -
దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ
సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి -
యాదాద్రి: భువనగిరిలో విషాదం
-
'మొబైల్ యాప్స్ ఆరోగ్యస్థితిని గుర్తించలేవు'
సాక్షి, భువనగిరి : ' మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేసే మొబైల్ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వార్డ్ చేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి, బీపీ, హార్ట్ బీట్ మొదలైనవి చెక్ చేసుకోడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగకరంగా ఉంది అంటూ నమ్మిస్తున్నారు. అయితే మొబైల్ యాప్స్ ఎలాంటి ఆరోగ్య స్థితి, ఆనారోగ్యం, బీపీ , పల్స్, ఆక్సిజన్ శాతాన్ని గుర్తించలేవు' అంటూ జిల్లా ఎస్పీ బాస్కరన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కరోనా సంక్షేమ సమయంలో ఇలాంటి యాప్స్ ద్వారా మీ వెలి ముద్రలు సేకరించి మీ విలువైన సమాచారాన్ని దొంగిలించి ఆర్ధిక నష్టాన్ని కలగజేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న సరికొత్త సైబర్ ఎత్తుగడ అని ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. మీ చూపుడు వేలు వివిధ వ్యక్తిగత డేటా ప్రామాణికత కోసం ఉపయోగించబడుతుందని గమనించగలగాలి. గూగుల్ పే వంటి యాప్స్ డౌన్లోడ్ చేయగానే ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి కెమెరాలో మన వేలిని ఉంచమని అడుగుతాయి.అయితే మన వేలిముద్రలను హ్యకర్లు దొంగలించే అవకాశం ఉంది. బ్యాంక్‌ఖాతా లావాదేవీ హెచ్చరికలను చదవడం ద్వారా అకౌంట్లో ఎంత డబ్బు ఉందనేది హ్యాకర్లు ఇట్టే పసిగడతారు.ఇలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, వాటిని డౌన్లోడ్ చేయవద్దు.' అంటూ పేర్కొన్నారు. -
అమ్మను రోడ్డున పడేశారు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్
సాక్షి, హైదరాబాద్: నూతన వధూవరులను వీడియో కాలింగ్ ద్వారా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశీర్వదించారు. తన వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ శుక్రవారం ఉమారాణిని పెళ్లి చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ పెళ్లికి సంతోష్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరు కావాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన తన ప్రయాణాన్ని విరమించుకుని, తన అంగరక్షకుడికి ఫోన్ ద్వారా శుభాశీస్సులు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని, వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) స్వయంగా వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని అనుకున్నప్పటికీ కరోన వైరస్ ప్రభావం వల్ల వెళ్లలేకపోయానని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు మనసులో బాధ ఉన్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలను పాటించినట్టు చెప్పారు. ప్రముఖులు, ప్రజలు అందరు కూడా జనసమూహానికి దూరంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సంతోష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. (ఎయిర్పోర్ట్ నుంచి అలా బయటకు వచ్చాం..) -
జార్జియా దేశంలో చిక్కుకున్న భువనగిరి వాసి
-
లాటరీలో వరించిన విజయం..
సాక్షి, మోత్కూరు : భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన మోత్కూరు మున్సిపాటిటీ ఓట్ల లెక్కింపులో 7వ వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపింది. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్‌కు వచ్చాయి. 7వ వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చి టై అయ్యింది. 7వ వార్డులో అత్యధికంగా 8మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి మధ్యే పోటీ జరిగింది. 1,104 ఓట్లకు గాను 1,001 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక పోస్టల్ బ్యాలెట్, 2 ఓట్లు నోటాకు పోలయ్యా యి. లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సావిత్రికి 378 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డికి 377 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కాంగ్రెస్‌కు పడటంతో ఇద్దరికి సమానంగా 378 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో అభ్యర్థులు మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు లెక్కించగా అవే ఓట్లు వచ్చాయి. సుమారు రెండు గంటలకు పైగా ఫలితం ఎటూ తేలకపోవడంతో కౌంటింగ్ హాల్ లోపల ఉన్న అభ్యర్థులతో పాటు బయట ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరికి అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు అంగీకరించారు. దీంతో ఒక్కో అభ్యర్థి పేరుతో 5 చీటీలు మొత్తం 10 చీటీలు రాసి లాటరీ తీశారు. లాటరీలో తీపిరెడ్డి సావిత్రి పేరు రావడంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు. -
ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ
సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, కేసీఆర్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. -
పుర పోరులో ‘రియల్ ఎస్టేట్’ దూకుడు!
సాక్షి, యాదాద్రి : డబ్బుంది.. పలుకుబడి ఉంది.. కావాల్సిందల్లా అధికారమే..! అందుకోసమే ఎంతఖర్చయినా సిద్ధమే.!! మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దూకుడు పెంచారు. ఎలాగైనా పార్టీ టికెట్ దక్కించుకొని చైర్మన్‌గిరి పట్టాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలో భువనగిరి, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట, భువనగిరి, జాతీయ రహదారి వెంట ఆలేరు మున్సిపాలిటీ ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అనుకూలంగా రిజర్వేషన్ రాని వారు పక్క వార్డుల నుంచి నామినేషన్ వేశారు. అంతేకాకుండా చైర్మన్ గిరిపై కన్నేసి ఇతర వార్డుల్లోనూ తమ అనుకూల వ్యక్తులను పోటీలో దింపేందుకు వారితో నామినేషన్లు వేయించారు. ఖర్చు కూడా వారే భరించనున్నారు. డబ్బుల సంచులతో సిద్ధం వివిధ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టికెట్ కోసం చూస్తున్నారు. తమకు పార్టీ టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నవారు చైర్మన్ గిరిపై కన్నేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ బీసీ జనరల్, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి బీసీ మహిళ, మోత్కూర్ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. అయితే రియల్టర్లు పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎక్కువ మంది రియల్టర్లు రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగడంతో జిల్లాలో పలువురు కోట్ల రూపాయలు గడించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని రూ.2కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఈవిషయాన్ని పార్టీ అధిష్టానం వద్ద చెబుతూ చైర్మన్‌గిరి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పోటీ తీవ్రం కావడంతో అధికార పార్టీలో చైర్మన్ అభ్యర్థుల పేరు ముందుగా ప్రకటించడం లేదు. గెలిచిన తర్వాత చైర్మన్ పేరు ప్రకటిస్తామని చెప్పడంతో ఎవరికి వారు రేసులో దూసుకుపోతున్నారు. బీసీలకు చైర్మన్ సీటు రిజర్వ్ కావడంతో పోటీదారుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు ముందుకుసాగుతున్నారు. కౌన్సిలర్ స్థానాలకు సైతం.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలవడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సి పాలిటీలో అధికార పార్టీ మెజార్టీ సీట్లను కొత్తవారికి కేటాయించడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీలో సైతం డబ్బు సంచులతో వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు చే యడానికి వెనుకాడేది లేదని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు మొండిచేయి చూపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బు లేదన్న కారణంతో చైర్మన్ అభ్యర్థులతో పాటు కౌన్సిలర్లుగా పోటీపడే వారికి కూడా టికెట్లు దక్కడం లేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. అందని బీఫారాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులకు ఇంకా ఖరారు చేయలేదు. అధికార పార్టీలో పెద్ద ఎత్తున రెబెల్స్ బెడద ఉండడంతో బీఫారాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. మోత్కూరులో టీఆర్ఎస్ పూర్తి జాబితా ప్రకటించగా.. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో కొందరికి బీఫారాలు ఇచ్చింది. మిగతా వారికి ఇవ్వడంలో జాప్యం చేస్తోంది. ఎక్కువ మంది పోటీ ఉండటం వల్లే బీ ఫారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అభ్యర్థులు నామినేషన్లు వేసి బీఫారాల కోసం నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా డబ్బు ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమేనంటూ టికెట్లు ఆశించే అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు. కొందరు పార్టీ పేరుతో నామినేషన్లు వేసినప్పటికీ టికెట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్న ఆశావహులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. డబ్బు ప్రభావం అన్ని పార్టీల్లో స్పష్టంగా కనిపించడం వెనక రియల్టర్లు పెద్ద ఎత్తున పోటీకి దిగడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ టికెట్ రాకున్న పోటీ నుంచి తప్పుకునేది లేదని, పోటీలో ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ఖర్చు చేసి విజయం సాధిస్తామని పలువురు రాజకీయ రియల్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగాలని బావిస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో వరదలా డబ్బు ఖర్చు చేయడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: రియల్ ఎస్టేట్ వ్యాపారిని హతమార్చిన భార్య, కుమారులు -
భార్యే సూత్రధారి..!
జీవితాంతం తోడూనీడగా ఉంటానని ప్రమాణం చేసి తాళి కట్టించుకుంది.. అతడితో జీవితం పంచుకుని నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. క్షణిక సుఖం కోసం మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా భర్తకు తెలియడంతో తాగుబోతు అంటూ నింద వేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.అక్కడ యథేచ్ఛగా తన ప్రియుడితో సఖ్యతగా మెలిగింది. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా అంతమొందించింది. ఇదీ.. ఇటీవల రాజాపేట మండలం దూదివెంకటాపురంలో వెలుగుచూసిన నరేష్ హత్యోదంతం వెనుక ఉన్న కారణాలు. భువనగిరిఅర్బన్ : ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి శనివారం తన కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొల్లూరు నరేష్(35)కు రాజపేట మండలం దుదివెంకటాపురం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల భాగ్యతో పదిహేడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వీరికి నలుగురు సంతానం. వీరు 13 సంవత్సరాలు కలిసి జీవించారు. ఈ సమయంలో భాగ్యతో మోటకొండూరు గ్రామాని చెందిన వంగపల్లి అయిలయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం నరేష్‌కు తెలియడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవలకు దారితీసిందర్థా క్రమంలో నరేష్ మద్యానికి బానిసగా మారాడు. దీంతో భాగ్య భర్త తాగుబోతు అంటే నింద వేసి నాలుగేళ్ల క్రితం మోటకొండూరు నుంచి తన తల్లిగారి గ్రామమైన దుదివెంకటపురానికి పిల్లలతో కలిసి వచ్చి ఉంటోంది. వంగపల్లి అయిలయ్యతో వివాహేతర సంబంధం అలానే కొనసాగిస్తోంది. పిల్లలను చూసేందుకు వెళ్లగా.. నరేష్ తన పిల్లలను చూడటానికి ఈ నెల 9వ తేదీన దుదివెంకటాపురం గ్రామానికి వెళ్లాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. అందుకు భాగ్య ఒప్పుకోకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. తదనంతరం రాత్రి సమయంలో ఎక్కవగా మద్యం సేవించిన నరేష్ తన అత్తవారి ఇంటిముందున్న మంచంపై నిద్రపోయాడు. పథకం ప్రకారం.. తన సఖ్యతకు అడ్డొస్తున్నాడనే నెపంతో భాగ్య భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం వెంటనే విషయాన్ని ప్రియుడు అయిలయ్యకు ఫోన్ చేసి తెలిపింది. భర్త మద్యం మత్తులో నిద్రపోయిన విషయాన్ని తెలిపి దూదివెంకటాపురం రావాలని కోరింది. అయిలయ్య గ్రామానికి చేరుకోవడంతో ఇద్దరు కలిసి ఆదమరచి నిద్రపోయిన నరేష్ ముఖంపై భాగ్య దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేయగా అయిలయ్య కాళ్లు, చేతులు పట్టుకున్నాడు. కాసేపటికి నరేష్ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. తదనంతరం అతడి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. కొల్లూరి నరేష్‌ను హత్య చేసిన వెంటనే భాగ్య అయిలయ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారి పోయారు. మృతుడు నరేష్ తల్లి కొల్లూరి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే శనివారం భువనగిరి పట్టణ శివారులో ఉన్న బొమ్మాయిపల్లిలో భాగ్యలక్ష్మి, అయిలయ్య ఇద్దరు ఉన్నట్లు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తామే నరేష్‌ను హత్య చేసినట్టు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీసీపీ వివరించారు. సమావేశంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, రూరల్ సీఐ అంజనేయులు, ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను బ్రాందీ నగరంగా మార్చారు
భువనగిరి అర్బన్: హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ నగరంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, మరోవైపు బార్లను తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..
పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ సన్మార్గంలో పయనించాలనే మంచిమాటలు చెప్పాల్సిన వయసులో ఆ వృద్ధుడి బుద్ధి పెడదోవపట్టింది.. వివాహేతర సంబంధాలు పెట్టుకుని కుటుంబంలో చిచ్చురేపాడు.. చివరకు వావి వరసలు కూడా మరిచి పశువులా ప్రవర్తించాడు.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతడి తీరులో మార్పు రాలేదు సరికదా ఆగడాలు ఇంకా శృతిమించిపోయాయి. ఈ వయసులో ఇదేం పని నాన్నా అంటూ నిలదీసిన కుమారుడిపైనే కయ్యానికి కాలుదువ్వాడు.. ఆ పెనుగులాటలో కుమారుడు తోసేయగా బండమీద పడడంతో తల పగిలి తండ్రి ప్రాణాలు విడిచాడు.. ఇవీ.. భువనగిరి మండలం బండసోమారంలో వృద్ధుడి హత్యోదంతానికి దారితీసిన కారణాలు. ఉద్దేశపూర్వకంగా చేసినా.. అనుకోకుండా జరిగిన నేరం నేరమే అన్నట్టు చివరకు ఆ వృద్ధుడి కుమారుడు కటకటాలపాలయ్యాడు. భువనగిరి అర్బన్ : వృద్ధుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుమారుడే అతడి మృతికి కారణమని విచారణలో తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.మండలంలోని బండసోమారం గ్రామానికి చెందిన యామల్ల లక్ష్మారెడ్డి(65), రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దాడు. కుమార్తె వివాహం చేశాడు. తండ్రి, కుమారులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మాధవరెడ్డికి వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. కొన్ని రోజులకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మాధవరెడ్డికి సిరివేణికుంటకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. అందరూ ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు. వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి.. లక్ష్మారెడ్డి కొన్నేళ్లుగా చెడు తిరుగుళ్లు తిరుగుతూ గ్రామంలో కొందరు మహిళలలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా అతని బుద్ధి మారకపోగా ఇంట్లో ఉన్న కోడలిపైనే కన్నేశాడు. ఈ విషయం కుమారుడు మాధవరెడ్డికి తెలియడంతో తండ్రి కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తండ్రి వేధింపులు భరించలేక మాధవరెడ్డి గ్రామంలోనే వేరు కాపురం పెట్టాడు. ఆయన తీరుపై గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. దీంతో ఇక నుంచి కోడలిని వేధించనని పెద్ద మనుషుల సమక్షంలో లక్ష్మారెడ్డి ఒప్పుకున్నాడు. వడ్లు ఆరబోసేందుకు వెళ్లి.. లక్ష్మారెడ్డి గత శుక్రవారం ఉదయం వడ్లు ఆరబోసి వస్తానని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరిగి బావి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో మాధవరెడ్డి కూడా బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో వడ్లు ఆరబోసిన రామస్వామిగుట్టపై లక్ష్మారెడ్డి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో సఖ్యతగా ఉండడాన్ని చూశాడు. మాధవరెడ్డిని చూసిన ఆ మహిళ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన మాధవరెడ్డి ఈ వయసులో ఇదేం పని ఇక నీవు మారవా అంటూ నిలదీశాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఇద్దరు ఘర్షణ పడగా మాధవరెడ్డి తండ్రిని నెట్టివేశాడు. దీంతో లక్ష్మారెడ్డి వెల్లకిలా బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తండ్రి మరణించాడని మాధవరెడ్డి అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి వద్దకు వెళ్లి నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడని నమ్మించాడు. తల్లిని ట్రాక్టర్‌పై ఎక్కించుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. నాన్న ఫోన్ చేయడం లేదని అటూ ఇటూ తిరిగారు. చివరకు బండపై మూలుగు వినిపిస్తోందని అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే లక్ష్మారెడ్డి రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. స్థానికుల సాయంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే లక్ష్మారెడ్డి మృతిచెందాడు. కేసును ఛేదించారు ఇలా.. బాట విషయంలో భూ పంచాయితీ ఉన్న వారే తన తండ్రిని హత్య చేసి ఉంటారని మాధవరెడ్డి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేశాడు. అయితే భర్త గురించి బాగా తెలిసిన రాధమ్మ భూ పంచాయితీ ఉన్న వారిపై, కుమారుడిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాధవరెడ్డి తండ్రి మరణానికి తానే కారణమని, ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని పెనుగులాటలో కింద పడడంతో మృత్యువాత పడ్డాడని నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును 24 గంటలలోగా ఛేదించిన సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు రాఘవేందర్‌గౌడ్, మధు, ఏఎస్ఐలు పీఎస్ఎన్ ప్రసాద్, వి.సాగర్‌రావు, కానిస్టేబుల్ ఎం. జాన్, యాకుబ్‌ఖాన్, కొండారెడ్డి, వేణును డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ భుజంగరావు సిబ్బంది పాల్గొన్నారు. -
కి‘లేడి’ అరెస్టు
సాక్షి భువనగిరిఅర్బన్(నల్గొండ) : బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా భూదవారిపేటకు చెందిన అక్షింతల సంధ్య అలియాస్ దివ్య టైలరింగ్ పనిచేస్తు జీవనం సాగిచేంది. టైలరింగ్‌లో డబ్బులు అనుకున్నంతగా రాకోపోవడంతో సంతృప్తి చెందలేదు. అనంతపూర్ జిల్లాకు చెందిన గంట రామస్వామి బ్యాచ్‌లో చేరి 2010 నుంచి 2016 వరకు చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికురాలిగా నటిస్తు అసలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు అభరణాలను అపహరించేది. ఆమె తన ముఠా సభ్యులతో కలిసి భువనగిరిటౌన్, రూరల్, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు ములుగు, దేవరకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడింది. గతంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసి నల్లగొండ జైలు పంపారు. బెయిల్‌పై తిరిగి బయటికి వచ్చింది. తన గ్రామంలో ఉన్న లలితతో స్నేహం చేసింది. ఇద్దరు కలిసి రద్దీగా ఉండే బస్సుల్లో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి హన్మకొండకు వెళ్తున్న రద్దీగా ఉన్న బస్సును ఎక్కారు. బస్సులో ప్రయాణిస్తున్న జి.సూర్యమ్మ, టి. కృష్ణవేణిల పక్కన ప్రయాణికులుగా కూర్చున్నారు. బస్సు భువనగిరి దాటిన తర్వాత బస్సులో రద్దీగా ఉండటంతో సంధ్య సూర్యమ్మ బ్యాగులో ఉన్న 4 గ్రాముల బంగారు చెవి దిద్దులు, లలిత జి.కృష్ణవేణికి చెందిన బ్యాగులో నుంచి నగదును అపహరించారు. వెంటనే బస్సును రాయగిరి వద్ద హడవీడిగా నిలిపి వేసి దిగారు. గమనించిన సూర్యమ్మ, కృష్ణవేణిలు తమ బ్యాగులను చెక్ చేసుకోగా బంగారం, నగదు కనబడలేదు. వెంటనే వారిని పట్టుకోమని తోటి ప్రయాణికులకు చెప్పడంతో సంధ్యను పట్టుకొగా, లలిత పారిపోయింది. అనంతరం సంధ్యను ప్రయాణికులు రూరల్ పోలీస్‌లకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించింది. ఆమెనుంచి చెవి దిమ్మెలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ సురేందర్‌రెడ్డిని, ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్‌ను, సిబ్బందిని అభినందించారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి అరెస్ట్
సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎం.సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్‌చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్‌కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని గ్యాంగ్ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్‌రెడ్డి లండన్ టౌన్షిప్ పేరుతో వెంచర్ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్‌లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్‌లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్‌డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
సాక్షి, భువనగిరి : యాద్రాద్రి జిల్లా భువనగి చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరకాల డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరిన బస్సు.. భువనగిరి బైపాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కొంత మంది ప్రయాణికులు కాల్వలో పడిపోయారు. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..
సాక్షి, భువనగిరి: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బండసోమవారం గ్రామశివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన సుధీర్‌కుమార్(22) మండల పరిధిలోని బండసోమవారం గ్రామంలో ఓ కోళ్లపారంలో ఏడాదినుంచి పని చేస్తున్నాడు. ఇదే కోళ్లఫారంలో బీహార్‌కు చెందిన డోలి కుమారి, జ్యోతి, రాజులు బతుకు దెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థా నికంగా నివాసం ఉన్నారు. ఒకే కుటుం బానికి చెందిన డోలి కుమార్, జ్యోతి, వారి సొదరుడు రాజు ఒకే గదిలో ఉంటున్నారు. అ గదికి సమీపంలోనే సుధీర్‌కుమార్ నివా సం ఉండే వాడు. సుధీర్‌కుమార్, జ్యోతిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా జ్యోతి, ఆమె సొదరుడు రాజు 25 రోజుల క్రితం సొంత గ్రామం ఉన్న బీహార్‌కు బయాలుదేరి వెళ్లారు. డోలి మాత్రం ఇక్కడే ఉండి పోయింది. బీహర్‌కు వెళ్లిన జ్యోతికి 10 రోజుల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఇ వివాహానికి సంబంధించిన ఫొటోలను డోలికుమారికి పంపింది. అ ఫొటోలను చూసిన సుధీర్‌కుమార్ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడు. తను ప్రేమించిన యువ తి మారొకరితో వివాహం చేసుకోవాడాన్ని భరించలేక మానస్తాపం చెంది తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోళ్లఫారం సూపర్ వైజర్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు. -
కోమటిరెడ్డి అరెస్ట్.. భువనగిరిలో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆందోళన చేస్తుండగా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా.. భువనగిరి మండలం వడపర్తి గ్రామ సర్పంచ్ కాలు విరిగింది. ఉద్రిక్తతల నడుమ కోమటిరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ గత ఐదేళ్ల నుంచి స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ.. స్థానిక ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం పోరాటాల గడ్డ అయిన భువనగిరి నుంచి పోరాటం మొదలు పెట్టామన్నారు. స్థానిక సంస్థల నిధులు-విధులు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులందరు ఈ పోరాటంలో కలసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రం, మైనింగ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు కేటాయించకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. గ్రామ పంచాయతీలకు చెక్ పవర్ కల్పించి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు మధ్య కొట్లాట పెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. హరితహారంలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సర్పంచ్ మీద వేటు వేయడం సబబు కాదన్నారు. -
సహకార ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. గతంలోనే ఓటరు జాబితా సిద్ధం ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. సంఘం నిర్మాణం ఇలా.. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. వాయిదాపడే అవకాశం ఉంది 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. –వెంకట్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జ్ అధికారి -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే
సాక్షి, భువనగిరి: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం భువనగిరిలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మురళీధర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష చూడకుండా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వారణాసిలో, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్‌లో అమిత్‌షా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో 11 కోట్ల సభ్యత్వాలు ఉంటే ఈసంవత్సరం అదనంగా మరో 10 కోట్ల సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పతనమవుతోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనేది శక్తి బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎల్బీనగర్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేస్తాం.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమైన ఆయుష్మాన్‌భవ పథకం ద్వా రా రూ.5లక్షలు మంజూరు చేస్తోందని మురళీధర్‌రావు తెలిపారు. స్థానిక ఎల్బీనగర్ కాలనీ లో చేపట్టిన ఇంటింటి సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ఈ నిధులను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. సభ్యత్వాలు పొందిన వారి పేరు, వివరాలు ఢిల్లీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉంటాయన్నారు. తమ కుటుంబ సభ్యుల అందరి చేత సభ్యత్వాలు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఇన్చార్జి దాసరి మల్లేషం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, జిల్లా ఇన్చార్జ్ వేముల నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగరావు, పడమ టి జగన్మోహన్రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలం రమేష్, ఎండీ.మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు మాయ దశరథ, అసెంబ్లీ కన్వీనర్ బలరాం, పట్టణశాఖ అధ్యక్షుడు చందా మహేందర్‌గుప్తా, మాజీ కౌన్సిలర్లు పట్నం రోజా, చిట్టిప్రోలు సువర్ణ, నాయకులు సుర్వి శ్రీనివాస్, చిట్టిప్రోలు శ్రీధర్, జనగాం నర్సింహాచారి, రత్నపురం శ్రీశైలం, రత్నపురం బలరాం, మేడి కోటేష్ పాల్గొన్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడి అరెస్ట్
సాక్షి, భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన డీఎస్ ప్రాన్సిస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వెంచర్లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్ పక్కిర్ బాల్‌రెడ్డి వద్ద నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్‌లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు. -
ప్రభావం.. ఏ మేరకు!
సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనల ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఆయన పార్టీ మారుతున్నారని ఇప్పటికే నిర్ధారణ కాగా, ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీని వీడి పోయేవారెందరు..? కాంగ్రెస్‌లో కొనసాగే వారెందరు..? ఆయన పార్టీ మారడం వల్ల ఏ నియోజకవర్గాల్లో పడే ప్రభావం ఎంత..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పార్టీ కేడర్‌లోనూ ఈ అయోమయం కొంత గందరగోళానికి దారితీస్తోందని చెబుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భువనగిరి లోక్‌సభస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా ఆయన మొదట జనగామ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు నాయకుడిగా ప్రచారమయ్యారు. ఐదేళ్ల పాటు తెలంగాణ నినాదాన్ని మోయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువమంది అభిమానులనే సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఆయన భువనగిరి నుంచే రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయారు. కానీ, కొన్నాళ్లకే వచ్చిన నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సంబంధాలు నెలకొల్పుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సొంత కేడర్‌ను తయారు చేసుకున్నారు. మొన్నటి 2018 ముందస్తు ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, పీసీసీ నాయకత్వాన్ని ఆశించిన ఆయనకు ఆశాభంగం కావడం వల్లే పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రకట నలు పార్టీ శ్రేణుల్లో సంచలనం కలిగించాయి. ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు ఈ నెల 24వ తేదీని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని చెబుతుండడంతో పార్టీపై పడే ప్రభావం, ఎందరు పార్టీని వీడి బయటకు వెళతారు అన్న చర్చ మొదలైంది. ఉండే వాళ్లెందరు... పోయే వాళ్లెందరు? మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి కేవలం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కానందున, ఆయనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పరిచయాలు, అనుచరవర్గం ఉన్నందున, ఆయన పార్టీ మారితే పడే ప్రభావంపై నాయకత్వం అంచనావేస్తోంది. ప్రధానంగా భువనగిరి లోక్‌సభనియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనతో వెళ్లే కేడర్, లీడర్లు ఎంతమంది ఉంటారన్న అంచనాల్లో కాంగ్రెస్ నాయకత్వం మునిగిపోయింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాలనుంచి ఎవరైనా పార్టీ మారుతున్నారా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రధానంగా మునుగోడు నుంచి ఆయన వెంట వెళ్లేవారెందరు..? పార్టీలోనే ఉండిపోయే వారెందరు..? అన్న అంచనాలు వేస్తున్నారు. అయితే, ముందునుంచీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సీనియర్లు, ముఖ్య కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతారని, ఆయనతోపాటు వెళ్లే వారి సంఖ్య పెద్దగా ఉండదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు తమ కేడర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఒక వైపు ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నారని తెలిసిన తర్వాత ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్న కొందరు నాయకులు అప్పుడే ఇన్చార్జ్ బాధ్యతలు దక్కించుకునే రేసులో మునిగిపోయారని, కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలను పక్కనపెట్టి ఇన్చార్జి పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ మార్పిడిపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతుండగా, స్వల్ప సంఖ్యలోనే ఆయన వెంట వెళ్తారన్న అంచనాలో పార్టీ నాయకత్వం ఉంది. మొత్తంగా ఈ నెల 24వ తేదీ తర్వాత కానీ, మునుగోడు, ఇతర నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పార్టీ మారుతారు? ఎవరు మిగిలిపోతారు ? అన్న ప్రశ్నలకు సమాధానం లభించేలా లేదు. -
‘అమ్మకు’పరీక్ష
భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్లు ఆలస్యంగా రావడంతో సోమవారం పరీక్షలకు వచ్చిన గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఆస్పత్రి లోని ఓపీ విభాగంలో గర్భిణులకు పరీక్షలు నిర్వహించేందుకు నలుగురు గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. ప్రతి సోమవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణులు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వస్తారు. ఇదే క్రమంలో ఆస్పత్రికి ఉదయమే వందల సం ఖ్యలో గర్భిణులు తరలివచ్చారు. నిబంధనల ప్ర కారం డాక్టర్లు ఉదయం 9నుంచి 12గంటల వరకు వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉద యం 9గంటలకు రావాల్సిన డాక్టర్లు 11గంటల కైనా రాలేదు. దీంతో అప్పటికే చికిత్స కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గర్భిణులు లైన్లో నిల్చుని డాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా 11 గంటల తర్వాత డాక్టర్ రావడంతో గర్భిణులం దరూ ఒక్కసారిగా తోసుకువచ్చి గుంపులుగా చేరారు. గర్భిణులతోపాటు వారి వెంట వచ్చిన బంధువులతో ఓపీ హాల్ నిండిపోయి ఆస్పత్రి ఆవరణలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుర్చీలు సరిపడా లేకపోవడంతో గర్భిణులు గంటల తరబడి నిలబడక తప్పలేదు. ప్రతి సోమ, గురువారం రోజుల్లో గర్భిణుల తాకిడి ఓపీ విభాగంలో అధికంగా ఉంటుంది. 250 మందికి పైగా.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి 250కు పైగా గర్భి ణులు వచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండగా సోమవారం ఇదరే అం దుబాటులో ఉన్నారు. వారు కూడా ఆలస్యంగా వచ్చారు. దీంతో గంటల తరబడి గర్భిణులు డా క్టర్ల కోసం ఎదురుచూడక తప్పలేదు. అందరికీ పరీక్షలు నిర్వహించాం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉన్నారు. ఇందులో ఒకరు సెలవులో ఉన్నారు. మరొకరు చౌటుప్పల్ ఏరియా ఆ స్పత్రిలోని ఓపీ విభాగంలో పని చేసే గైనకాలజిస్టు రాకపోవడంతో అక్కడికి వెళ్లాడు. మిగి లిన ఇద్దరు గైనకాలజిస్టులు ఉదయం లేబర్ రూమ్‌లో మహిళ ప్రసవం కోసం సమయాన్ని కేటాయించారు. దీంతో ఓపీ విభాగానికి వచ్చేసారికి ఆలస్యమైంది. అయినప్పటికీ గర్భిణులందరికీ పరీక్షలు నిర్వహించారు.–కోట్యానాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
భువనగిరిలో ప్రచారానికి గులాబీ అధినేత
సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు రానున్నారు. ఏప్రిల్ 2వ తేదీన భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. తమ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కేసీఆర్ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. మార్చి 29న మిర్యాలగూడలో, ఏప్రిల్ 2న భువనగిరిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో గులాబీ బాస్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లోనూ పని చేయాలని ఇప్పటికే అధినేత నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు అందాయి. అంతేకాకుండా ఈనెల 7వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాస్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో వారు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెజార్టీపై టీఆర్ఎస్ దృష్టి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఐదుచోట్ల టీఆర్ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్ గెలుపొందాయి. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజాయం సాధించారు. అయితే టీఆర్ఎస్ గెలిచిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,95,280 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు గెలిచిన రెండుస్థానాలతోపాటు ఓడిన ఐదు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 5,36,893 ఓట్లు వచ్చాయి. మొత్తంగా టీఆర్ఎస్కు 58,387 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆధిక్యం స్వల్పంగా ఉండడంతో అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరి పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టిసారించి జిల్లా నాయకత్వానికి బాధ్యతలను అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యం పెంచుకోవడానికి నాయకత్వం ఆపరేష్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసను ప్రోత్సహిస్తోంది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీకీ బలమైన దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడ కాంగ్రెస్‌లోని బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించడం ద్వారా వారి ఓటు బ్యాంకుతో మెజార్టీని భారీగా పెంచుకోవాలన్న వ్యూహాత్మక ఎత్తుగడతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 2న భువనగిరిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణీనాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నూతన దంపతుల మృతి
గుండాల : యాదాద్రిభువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతన దంపతులు మృతి చెందారు. గుండాల మం డలం బ్రాహ్మణపల్లికి చెంది న బెజాడి కుమార్ కుమారుడు బెజాడి నరేశ్‌కు (27) గత నెల 22న భువనగిరి మండలం కేసారం గ్రామా నికి చెందిన దివ్య (24)తో వివాహం జరిగింది. నరేశ్ తండ్రి కుమార్ ఉద్యోగ రీత్యా ఆర్టీసీ డ్రైవర్. కుటుంబంతో మేడిపల్లిలో నివాసం ఉంటున్నారు. నరేశ్ హైదరాబాద్‌లో వైకుంఠ రథం డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో అక్కడే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం నరేశ్ భార్యతో కలసి తన పెద్దమ్మ స్వగ్రామం ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో శుభకార్యానికి వచ్చాడు. తిరిగి సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై తన అత్తగారి ఊరు కేసారం గ్రామానికి వెళ్లే క్రమంలో స్థానిక బస్టాప్ వద్ద ఆగి ఉన్న ట్రాన్స్‌పోర్టు లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా అనంతరం మృతదేహాలను వారికి అప్పగించారు. -
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
టికెట్ ఇవ్వకపోయినా భువనగిరి నుంచి పోటీ చేస్తా!
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి నుంచి తనకు టికెట్ వచ్చినా, రాకపోయినా భువనగిరిలో తాను పోటీ చేయడం ఖాయమని యువతెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికి యువతెలంగాణ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతానని ఆయన చెప్పారు. కేసీఆర్ చెప్పిన మాటలకు, ఆయన చేస్తున్న చేతలకు పొంతనలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేల్కొకపోతే మరోసారి ఒక రజాకార్ను సీఎం చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. భువనగిరి అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. దివంగత నేత మాధవరెడ్డి కాలంలో జరిగిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉమా మాధవరెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఓట్ల కోసం గ్రామాల్లో డబ్బులు ఎందుకు డబ్బులు పంచుతున్నారని ప్రశ్నించారు. -
ఆస్తి కోసం తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి
-
నో స్టాప్..!
భువనగిరి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్నుంచి వందలాది మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్లు ఆగకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన టికెట్లతో నష్టపోవాల్సి వస్తోంది. పద్మావతి, శాతవాహన, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ఆ శాఖ అధికారులనుంచి స్పందన కరువైంది. భువనగిరి మీదుగా వెళ్లే రైళ్లు.. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్), కృష్ణా, కొలహాపూర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసిం జర్(ఫలక్నమా నుంచి భువనగిరి), ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్ నుంచి గుంటూరు), కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్), ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి హౌరా), పుష్పుల్ ప్యాసింజర్ (హైదరా బాద్ నుంచి వరంగల్), గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్‌నుంచి గుంటూరు), ప్యాసిం జర్(ఫలక్నామానుంచి జనగాం), భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ నుంచి బల్హార్షా), కాకతీయ ప్యాసింజర్(సికింద్రాబాద్ నుంచి మ ణుగూరు), పుష్ పుల్(హైదరాబాద్ నుంచి కాజీ పే ట), గౌతమి(లింగంపల్లి నుంచి కాకినాడ), దక్షిణ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్) రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట వైపు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆగని రైళ్లు.. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం సుమారు 2,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో సుమారు 500 మంది ప్రతి రోజూ హైదరాబాద్‌లో ఉద్యోగ నిమిత్తం వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం భువనగిరి మీదగా వివిధ రకాల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో శాతవాహన, పద్మావతి, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఆగడం లేదు. కాజీపేట వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్లేటప్పడు గానీ ఈ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వ్యవధిలో రైళ్లు లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన వస్తుంది. ఉదయం కాజీపేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.17 నిమిషాలకు ఉంటే ఆ తర్వాత గోల్కొండ ఎక్స్‌ప్రెస్ 12.04 గంటలకు, ఆ తర్వాత ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 3.57 గంటలకు రైలు ఉంది. దీంతో ఈ రైళ్ల రాకపోకల మధ్య సుమారు 3నుంచి 4 గంటలు çసమయం పడుతుంది.ఈ సమయంలో వచ్చిన రైళ్లు రద్దీగా రావడంతో ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్ల బుక్ చేసుకున్న టికెట్లను నిత్యం 50నుంచి 70 వరకు రద్దు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో టికెట్లు రద్దు చేసుకున్న సమయం దాటిపోవడంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. భువనగిరి స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో షిరిడీ, పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. కేంద్ర మంత్రిని కోరాం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లతో పాటు పద్మావ తి, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని సంబంధిత కేంద్ర మంత్రిని కోరాం. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే జీఎం కూడా శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపటానికి సంబంధించిన నివేధిక కూ డా ఉన్నతాధికారులకు పంపించారు. రైల్వే స్టేషన్లో కనీసం రెండు రైళ్లన్న నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. –డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎంపీ -
భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియర్
-
వేపకాయలతో ఉపాధి
జూన్ మొదటి వారంలో ఓ మాదిరి వర్షాలు పడటంతో చాలా గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామాల్లో కూలీ పనులు దొరకక నిరుపేద కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు గ్రామాల్లోని మహిళలు వేపకాయల సేకరణ చక్కటి ఉపాధిగా ఎంచుకున్నారు. మహిళలు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల వెంట ఉన్న వేపచెట్లు, వ్యవసాయ భూములు, అడవుల్లో ఉన్న వేప చెట్ల వద్దకు వెళ్లి వేపకాయలు ఏరుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భువనగిరి/పెద్దవూర : భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూరు(ఎం), బీబీనగర్, పోచంపల్లి మండలాలతోపాటు భువనగిరి మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు వేపగింజలను విక్రయించేందుకు భువనగిరి మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన వేపగింజలను విజయవాడ, ముంబాయి, బెంగళూరు, పుణె, మద్రాస్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన మహిళలు ఆటో కిరాయికి తీసుకుని వేకువజామునే ఆంధ్రా ప్రాంతాలైన మాచర్ల, గురజాల, దుర్గి, రెంటచింతల పరిసర ప్రాంతాలకు వెళ్లి పొద్దంతా వేపకాయలు ఏరుకుని ఉపాధి పొందుతున్నారు. భువనగిరి మార్కెట్ భారీగా వేపకాయల రాక భువనగిరి గంజ్ మార్కెట్‌యార్డ్‌లో వేపగింజల కొనుగోళ్ల సందడి మొదలైంది. గత వారం రోజుల నుంచి కొనుగోళ్లు జరుగుతుండటంతో మార్కెట్‌కు భారీగా వేపగింజలను తీసుకువస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్ల అనంతరం తిరిగి మార్కెట్లో వేపగింజల కొనుగోళ్లతో రద్దీ కనిపిస్తోంది. సుమారు 20 రోజుల పాటు కొనసాగే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం క్వింటాళ్‌కు రూ.600ను చెల్లిస్తున్నారు. దిగుబడి ఎక్కువ ధర తక్కువ.. గత సంవత్సరంలో వర్షాభావం వల్ల వేపగింజల దిగుబడి తక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.750 నుంచి రూ.850వరకు చెల్లించారు. ఈ సీజన్‌కుగాను వేపగింజల దిగుబడి ఎక్కువగా ఉండటంతో క్వింటాళ్‌కు రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతి క్వింటాళ్‌కు రెండు కిలోల చొప్పున తరుగుదల కింద తీసుకుంటుండగా వాహనాల కిరాయి పోను వేపగింజలను వేరే వారికి రోజుకూ కూలీ రేటు కూడా పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేపకాయలతో ఉపయోగాలు వేప గింజల నుంచి యంత్రాల సహయంతో నూ నెను తీస్తే నూనెతో పాటు వేప పిండి వస్తుంది. ఈ వేపనూనె, పిండి పంట తెగుళ్లకు, వ్యాధి నిరోధకంగా, క్రిమిసంహారక మందులలో వాడుతున్నారు. వేప పిండిలో నత్రజని, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలే కాకుండా గంధకం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఉంటాయి. వేపపిండిని వాడటం ద్వారా పంట ఏపుగా పెరగటంతో పాటు వేర్లను ఆశించే పురుగులు, నులి పురుగులు, చీడపీడల సమస్య తగ్గుతుంది. దీంతో బత్తాయి తోటల రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ఎరువులుగా వాడుతున్నారు. దీంతో వేపకాయలకు ఏడాదికేడాది డిమాండ్ పెరుగుతుంది. -
మీరాకుమార్‌కు ఘన స్వాగతం
భువనగిరి : లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆది వారం భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్‌లో జరిగిన సింహగర్జనకు హాజరయ్యే ందుకు వెళ్తూ మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని వివేరా హోటల్లో అరగంట పాటు ఆగి భోజ నాలు చేశారు. హోటల్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వరంగల్‌కు వెళ్లిపోయారు. వీరివెంట లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్షనేత మల్లికార్జున్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి బలరాంనాయక్, నాయకులు కొప్పుల రాజు, తడక కల్పన, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, పొత్నక్ ప్రమోద్‌కుమార్, బీసుకుంట్ల సత్యనారా యణ, చల్లగురుగుల రఘుబాబు ఉన్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
భువనగిరి అర్బన్ : భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రావి ఉమాదేవి (73) భర్త శంకర్‌రెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందాడు. ఉమాదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు, కుమార్తె స్మీతారెడ్డి ఆమెరికాలో ఉంటున్నారు. ఉమాదేవి తన భర్త చనిపోయినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దకుమారుడు నర్సింహారెడ్డి వద్దకు వెళ్లి వస్తూ ఉంటుంది. రైతుబంధు చెక్కు తీసుకునేందుకు.. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు చెక్కు తీసుకోవడానికి ఉమాదేవి శుక్రవారం ఉదయం తన కొడుకు నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి నందనం గ్రామానికి వచ్చింది. ఉమాదేవి తనకు రావల్సిన చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను తీసుకుంది.4ఎకరాల భూమికి గాను రూ.16 వేల విలువ గల చెక్కు, పాస్‌పుస్తకాన్ని తీసుకుని గ్రామంలోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కుమారుడిని హైదరాబాద్ వెళ్లి ఉదయం రమ్మని పంపించి ఇంట్లో ఒంటరిగానే ఉంది. ఇంట్లో ఒంటరిగా.. ఉమాదేవి గ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు తోడుగా అదే గ్రామానికి చెందిన పొట్ట లక్ష్మమ్మ సహాయంగా ఉంటుంది. అయితే ఇటీవల తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్లింది. దీంతో ఉమాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంది. 10.30 గంటల సమయంలో.. ఉమాదేవి ఇంటి తలుపులను మూసి టీవీ చూస్తోంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుండగులు ఉమాదేవి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోనికి ప్రవేశించారు. మేడ పైనుంచి వెనుక భాగంలో ఉన్న పెంకుటింట్లోకి చొరబడ్డారు. ఎవరో ఇంట్లోకి వచ్చినట్లు అనుమానం వచ్చి పరిశీలిస్తుండగా దుండగులు ఆమెపై దాడికి తెగబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె చాలా సేపటి వరకు దుండగులతో ప్రతిఘటింటినట్టు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. దుండగులు ఆమె చీరకొంగును మెడకు ఉరివేసి అంతమొందించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, రెండు ఉంగరాలు, కాళ్ల కడియాలు, చేతి గాజులు మొత్తం 12 తులాల గల బంగారు ఆభరణాలను, ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి రూ.20 నగదును అపహరించుకపోయారు. మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ నందనం గ్రామంలో జరిగిన హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కుమారుడి రాకతో.. ఉమాదేవి కుమారుడు ఉదయం 7గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో డ్రైవర్‌ను ఇంటిపైకి వెళ్లి చూడమని చెప్పాడు. అప్పటికే ఉమాదేవి విగతజీవిగా పడి ఉండడంతో గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. డీసీపీ రామచంద్రారెడ్డి స్థానికులను, కుటుంబ సభ్యులను, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాచకొండ కమిషనరేట్ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు. ఉమాదేవిని తెలిసిన వ్యక్తులే అంతమొందించి ఉంటారని గ్రామంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ తమను గుర్తుపడుతుం దన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
పట్టపగలే యువకుడిపై హత్యయత్నం
-
నిరుపేదను ఆదుకోరూ..!
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్‌స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వేధించిన అప్పులు.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు... ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్‌వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్ క్లబ్ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ (నల్లగొండ మైత్రి ఉమెన్స్ కాలేజ్ బ్రాంచ్)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది. -
సంగీతకు మంత్రి సన్మానం
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అర్బన్ ప్లానర్ పుల్లూరి సంగీతను మంత్రి హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. పుల్లూరి సంగీత 11 స్మార్ట్ సిటీలకు అర్బన్ ప్లానర్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల ఇండియాలో మొదటి ఉత్తమ మున్సిపాలిటీగా సిద్ధిపేటను తీర్చిదిద్దటం, స్వచ్ఛభారత్ తోపాటు, ఐఎస్ఓ గుర్తింపు తేవడం కోసం సంగీత పాటుపడ్డారని తెలిపారు. ఇందుకు శనివారం రాత్రి సిద్ధిపేటలోని కొమటిచెర్వు కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్వచ్ఛత ఎక్సెలెన్స్ ఆవార్డు–2018లో భాగంగా అవార్డులు, సన్మాన కార్యక్రమం నిర్వహంచారు. కాగా మంత్రి హరీశ్‌రావు పుల్లూరి సంగీతను శాలువా, గుర్తింపు జ్ఞాపికతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజాపేటకు చెందిన పుల్లూరి వెంకటేశం కుమార్తె పుల్లూరి సంగీతకు పలువురు నాయకులు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. -
రైలు కింద పడి టీఆర్ఎస్ నాయకుడి మృతి
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : రైలుకింద పడి మండల కేంద్రానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు బొంగు శంకరయ్య(68) గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళ్తూ మలక్‌పేట వద్ద మెట్రోరైల్ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారికింద పడి అక్కడక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాత్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బొంగు శంకరయ్య 10 ఏళ్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అన్న తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మరో 10 ఏళ్లు పనిచేశారు. అలాగే సింగిల్‌విండో చైర్మన్‌గా రైతులకు సేవలందించారు. పలువురి సంతాపం... ఈయన మృతి పట్ల ఎంపీపీ సార సరస్వతీబాలయ్య, వైఎస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రం, నాయకులు కె. భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రామాంజనేయులు, పొనమోని శ్రీశైలం, బొంగు అయిలయ్య, మైసగోని వెంకటేశం, కొంక లక్ష్మినారాయణ, దారెడ్డి మల్లారెడ్డి, సోమలింగం, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు బడుగు దానయ్య, పట్టణ అధ్యక్షుడు గుండ్ల రాంచంద్రం, రామేశ్వర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
నేరస్తుల కట్టడికే కార్డన్ సెర్
భువనగిరిఅర్బన్ : నేరస్తులను కట్టడి చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తాతానగర్, పహాడీనగర్ కాలనీల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌లు, నాలుగు కార్లు, ఐదు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ముగ్గురు రౌడిషీటర్లు, మరో ముగ్గురు అనుమానితులు, ఇద్దరు ఎక్స్కాన్వెర్స్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ కోరారు. కాగా, తెల్లవారుజామునే పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు ఒకింత భయాందోళన చెందారు. కార్డన్సర్చ్లో భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 6 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 130 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సీజ్ చేసిన వాహనాలు ధృవపత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ -
జోరుగా మాస్ కాపీయింగ్
భువనగిరి : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉండగా కొందరూ ఎగ్జామినర్లు మందులు, విందులు స్వీకరిస్తూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న ఇ ద్దరు ఎగ్జామినర్లను అధికారులు తొలగించారు. దీనిని బట్టి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ ఏవిధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేది నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. 34 పరీక్ష కేంద్రాల్లో నాలుగు విడుతల్లో ఈ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తున్నారు. మొదటి విడుత 1వ తేది నుంచి 5, రెండో విడుత 6 నుంచి 10, మూడో విడుత 11 నుంచి 16, నా లుగో విడుత 17నుంచి 21వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,010 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ 1,421, బైపీసీ 1,589మంది విద్యార్థులు ఉ న్నారు. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 1,313మంది విద్యార్థులు ఉన్నారు. పర్యవేక్షణ ఏదీ..? ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పర్యవేక్షణ లేక మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను నియమించారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి ఆయా కోర్సులను బట్టి నిర్ణిత ల్యాబ్ ఫీజు కంటే అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కళాశాల యాజమాన్యాలు వసూలు చేశారు. దీంతో ఆయా కళా శాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ కోసం వచ్చే ఎగ్జామినర్లకు మందు, విందు, తాయిలాల సౌకర్యాలు కల్పిస్తూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నాపత్రం తీసినప్పటికీ పరీక్ష గదిలో మాత్రం మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాస్ కాపీయింగ్ మా దృష్టికి రాలేదు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేస్తున్నాం. ఆలేరులో విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రవీంద్రప్రసాద్, డీఐఈఓ -
దొడ్డు అన్నం తినేదెట్లా..?
సాక్షి, యాదాద్రి : వివిధ వర్గాలు, అధికారుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సివిల్సప్లై కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలతో రెండు రోజులుగా జిల్లాలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వరుస దాడులు జరిగాయి. గురువారం సివిల్సప్లై టాస్క్ పోర్స్ ఎస్పీ నాగోబారావు ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్నారని భువనగిరి సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పాఠశాలను తనిఖీ చేసినప్పుడు విద్యార్థులు మెనూ విషయంలో పలు ఫిర్యాదులు చేశారు. దొడ్డు బియ్యం అన్నం, నీళ్లచారుతో కడుపునిండా తినలేకపోతున్నామని అధికారుల ముందు వారు వాపోయారు. మెనూ పాటిం చడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సన్నబియ్యంతో నాణ్యమైన కూరగాయలతో మంచి భోజనం పెట్టించాలని విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులను వేడుకున్నారు. అలాగే పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగా 577 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థులు రావడం లేదని తేలింది. వారందరిని రప్పించాలని ప్రిన్సిపాల్‌ను అదేశించారు. ఆత్మకూర్ఎం మండలం ముత్తిరెడ్డిగూడెంలో పీవీఎన్రెడ్డికి చెందిన హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తనిఖీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రేషన్‌దుకాణంలో తనిఖీ నిర్వహించారు. అలాగే బుధవారం బీబీనగర్ మండలం భట్టుగూడెం కాదంబరి రైస్ మిల్‌పై 6 ఏ కేసు నమోదు చేశారు. కస్టం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, మిల్లులో ఉన్న స్టాక్‌కు తేడాను గుర్తించి మిల్లుపై కేసు నమోదు చేశారు. భువనగిరిలోని యాదాద్రి మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాసరావు, అధికారులు జనార్ధన్‌రెడ్డి, కాశప్ప, వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. -
భువనగిరిలో కార్డన్ సెర్చ్
భువనగిరిఅర్బన్ : నేరాల నియంత్రణలో భాగంగా రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాల మేరకు డీసీసీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మూకుమ్మడిగా కార్డన్ సెర్చ్‌కు దిగారు. సుమారు 250 మంది పోలీసులు 2,3 వార్డుల్లోని ఇళ్లలో విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భం గా డీసీపీ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్తులు, పలు కేసుల్లో నిందితులుగా ఉండి పరారీ లో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను వదిలిపెట్టేది లేదన్నారు. ఈ తనిఖీ ల్లో ఎనిమిది మంది అనుమానితులను, ఇద్దరు రౌడీషీటర్లను గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. అలాగే అనుమతి లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న, ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు కలిగిన ఉన్న, ఇంట్లో మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.2, 3వ వార్డులోని సంతోష్‌నగర్, సంజీ వనగర్ కాలనీల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపటట్టామని అనుమతి, సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రెండు ట్రాక్టర్లు, రెండు ప్యాసింజర్ ఆటోలు, ఒక కారు, 43 బైకులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఆధారాలు చూపితే వాహనాలు ఇస్తామన్నారు. పోలీసులకు రెండు కాలనీల ప్రజలు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇక ముందు అన్ని కాలనీల్లో కార్డెన్ సెర్చ్‌లు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 7 మంది సీఐలు ఎం. శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అంజనేయులు, 20 మంది ఎస్ఐలు, 250 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
భువనగిరి అర్బన్ (తెలంగాణ) : ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణలోని భువనగిరి రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన యువకుడు ధనుంజయ్, మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద రూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి భువనగిరికి బస్సులో వచ్చారు. భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు. ధైర్యం చాలకపోవడంతో.. పురుగుల మందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ముందే బాలిక తన బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో బంధువులు వెంటనే బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని పౌల్ట్రీఫామ్‌లో పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారికి సమాచారం అందించారు. వారు వెంటనే భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ కింద పడిపోయి ఉన్న వీరిద్దరినీ గుర్తించారు. వెంటనే చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రికి తరలింపు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష యం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాం ధీ ఆస్పత్రికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కాళ్ల: మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన పంపురెడ్డి ధనుంజయ్, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక వ్యవసాయ పనులు చేస్తుంటారు. ధనుంజయ్ అత్తిలికి చెందినవాడు కాగా తల్లిదండ్రులు మరణించడంతో కోపల్లెలో తాత ఇం టి వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ప్రేమికులిద్దరూ భువనగిరిలో ఆ త్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని కాళ్ల పోలీసులు చెప్పారు. -
భువనగిరి పెద్ద చెరువుకు గండి
-
బతుకమ్మ చీరలపై మహిళల ఆగ్రహం
►బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి ►చీరలు కాల్చి బతుకమ్మ ఆడిన మహిళలు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలను పంపిణీ చేస్తామన్న ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం...తీరా డామేజ్ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు. కేవలం వంద రూపాయల విలువచేసే సాధారణ చీరలు పంపిణీ చేసిందని ఆరోపిస్తూ పలు జిల్లాల్లో మహిళలు.. చీరలు కాల్చేసి బతుకమ్మ ఆడారు. జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని 12వ వార్డు బుడగ జంగాల కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఆందోళనకు దిగారు. 50రూపాయలు విలువ కూడా చేయని చీరలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవ పరుస్తున్న అని ఎద్దేవా చేశారు. ఆ చీరలు బతుకమ్మకు కట్టుకోమని మహిళలు వాటిని అక్కడే పడేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 22, 23వ వార్డులో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అయితే వాటిని అందుతున్న మహిళలు చీరలు చాలా నాసిరకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నడిరోడ్డుపైనే కుప్పగా వేసి నిప్పు పెట్టారు. చీరలు కాలుతుండగా చుట్టూ చేరి బతుకమ్మ ఆడారు. పోచంపల్లి చేనేత చీరెలు పంపిణీ చేస్తానని కేవలం 50 రూపాయలు విలువచేసే పాలిస్టర్ చీరెలు పంపుతారా అని కోపోద్రుక్తులయ్యారు. జగిత్యాల జిల్లా జిల్లా మండలం చల్గల్, లింగంపేటలో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల ధర్నాకు దిగారు. బతుకమ్మ చీరలను దగ్ధం చేసి మహిళలు తమ నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోనూ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. వాలీబాల్ కోర్టులోని నెట్‌కు చీరలను కట్టి తమ అసంతృప్తిని వెల్లడించారు. పంట చేళ్లల్లో పక్షుల కోసం బెదురుగా కట్టే చీరల కంటే హీనంగా బతుకమ్మ చీరలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి మూడ్రోజులపాటు కొనసాగనుంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళి శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.222 కోట్లు వెచ్చించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలో భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ కాలనీవాసులు బతకమ్మ చీరలను కుప్పగా పోసి నిప్పంటించారు. బతుకమ్మ చీరల పేరుతో నాసిరకం చీరలను ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మళ్లీ మంచి చీరల్ని పంపిణీ చేయాలని కోరారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వ ధనాన్ని నాశనం చేస్తున్నారని, డబ్బులిస్తే తామే మంచి చీరల్ని కొనుక్కుంటామని మహిళలు తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
రూ. 62 లక్షల పాతనోట్లు స్వాధీనం
భువనగిరి: రద్దైన పెద్ద నోట్లను తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 62 లక్షల విలువైన పాత రూ. 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు పెద్ద నోట్లు తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు. -
భువనగిరిలో పేలిన్ గ్యాస్ సిలిండర్
భువనగిరి: వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రెండిళ్లతో పాటు మూడు బైకులు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడి సిలిండర్ పేలడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే పక్కనే ఉన్న పూరిళ్లుకు మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.