
సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, కేసీఆర్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment