Komatireddy venkatreddy
-
మంత్రి కోమటిరెడ్డిపై జగదీష్‌రెడ్డి ఫైర్
సాక్షి,నల్లగొండజిల్లా:ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు చిల్లర చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.నల్గొండలో జగదీష్‌రెడ్డి శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాల కంటే ప్రజలే ఎక్కువ ఎండగడుతున్నారు.తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు కుమ్మక్కయ్యాయి.ప్రజల సొమ్ము ,ఆస్తులను దోచుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.కోర్టు ఉత్తర్వుల ప్రకారం శాంతియుతంగా రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం.మంత్రి కోమటిరెడ్డికి కోతలు తప్ప చేతలు లేవు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా,బీఆర్ఎస్ తలపెట్టిన నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. -
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
-
బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి సెటైర్లు
-
కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు
సాక్షి,మెదక్‌జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్ 9) నర్సాపూర్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటీ కంపు ఎక్కువ. కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్‌రావు అన్నారు. కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్ -
కేటీఆర్,హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,నల్గొండజిల్లా:కేసీఅర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కేటీఆర్,హరీష్‌రావు అనే పిల్లలు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని గందంవారి గూడెంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు కోమటిరెడ్డి శుక్రవారం(అక్టోబర్11) శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ‘నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడు.రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తాం. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’అని కోమటిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: ఆశపెట్టి నిరుద్యోగితో ఆడుకున్నారు -
సాక్షి కార్టూన్ 01-08-2024
-
బీఆర్ఎస్కు నేను చాలు..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని, బీఆర్ఎస్కు తాను చాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ముగ్గురూ కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారని, ఆయనకు వాళ్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడకూ వెళ్లడని, చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పారీ్టలో చేరినట్టా అని అన్నారు.మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి విలేకరులతో చిట్‌చాట్ మాట్లాడారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుందా అని చెప్పారు. ‘కేసీఆర్ సభకు ఎందుకు రావడంలేదు. సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్షనేత కూడా అలాగే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే.ఆయన వైఖరి చూస్తోంటే త్వరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది’అని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలను జగదీశ్‌రెడ్డి అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్‌కు త్వరలోనే రీటెండర్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత..రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రియాక్షన్
-
కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
-
కోమటిరెడ్డి వెంకటరెడ్డి హంగ్ వ్యాఖ్యల ప్రకంపనలు
-
మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. దీంతో, ఊహించని విధంగా ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెల 22వ తేదీన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. అయితే, తనకు ఆ నోటీసులు అందలేదన్నారు. దీంతో, తాజాగా ఏఐసీసీ మరోసారి నోటీసులు పంపింది. ఇక, నోటీసుల్లో భాగంగా 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డిని కోరింది. ఇక, తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలువదు అంటూ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అంతకుముందు కూడా.. మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరినట్లు లీకైన ఆడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపకుండా బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక, ఈసారి కూడా కోమటిరెడ్డి స్పందించకపోతే.. ఆయనపై సీరియస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
మునుగోడులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తమ్ముడి కోసం ట్విస్ట్ ఇచ్చిన వెంకన్న!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే, ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారు. కాగా, మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంటకరెడ్డి దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఈనెల 15వ తేదీన కోమటిరెట్టి.. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి సోదరుడు.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే, మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో.. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికి వస్తే హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: మునుగోడులో ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’ -
కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. రేవంత్‌కు ఊహించని ఫోన్ కాల్!
సాక్షి, హైదరాబాద్: వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. చండూరు సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డినుద్దేశించి టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలమే రేపుతున్నాయి. మూడు దశాబ్దాలుగా పార్టీలో కీలక హోదాల్లో పనిచేస్తున్న నేత గురించి దయాకర్ అనుచితంగా మాట్లాడటం పట్ల ఆ పార్టీ సీనియర్ నేతలు గరంగరంగా ఉన్నారు. వేలాదిమంది ప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకుల సాక్షిగా దయాకర్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమైనవని, ఆయనను వారించే ప్రయత్నం కూడా ఎవరూ చేయకపోవడం కచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరైన సభలో ఈ విధంగా మాట్లాడటం పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అంటున్నారు. ఇదే విషయమై నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు ఏఐసీసీ పెద్దలకు ఫోన్ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన్ను పార్టీలోంచి వెళ్లిపొమ్మనే హక్కు దయాకర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం. షోకాజ్ నోటీసు జారీ దయాకర్ అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసింది. ఈ విషయమై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పీసీసీ నాయకత్వంతో చర్చించినట్టు సమాచారం. దయాకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే దయాకర్‌కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దయాకర్ మాట్లాడిన ఆ సభలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఉండటంతో ఆయననే సాక్షిగా చూపుతూ నోటీసు జారీచేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. క్షమాపణ చెబుతున్నా: అద్దంకి వెంకట్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతుండటంతో దయాకర్ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను పొరపాటున చేసిన వ్యాఖ్యలతో వెంకట్‌రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందున ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానన్నా రు. కోమటిరెడ్డి అభిమానులు క్షమించా లని, మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటానని అన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వక ముందే వివరణ ఇవ్వాలనుకున్నానని, ఆ లోపే అది వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇస్తానన్నారు. వరుస తప్పిదాలకు పాల్పడుతున్న దయాకర్‌పై పార్టీ కఠినచర్యలు తీసుకో వాలని కోమటిరెడ్డి అభిమానులు కోరుతుండటం గమనార్హం. షోకాజ్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో టీపీసీసీ క్రమ శిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని శనివారం గాంధీభవన్‌లో దయాకర్ కలిశారు. ఎంపీ కోమటిరెడ్డినుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై క్షమాప ణలు చెబుతున్నట్టు తెలిపారు. కోమటి రెడ్డిని కలసి క్షమాపణలు చెబుతానని, ఏఐ సీసీకి, కోమటిరెడ్డిలకు లేఖ కూడా రాస్తానని చిన్నారెడ్డికి వెల్లడించారు. ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు -
ఆకర్ష ఆకర్ష! బీజేపీ బిగ్ ప్లాన్.. గులాబీ నేతల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ.. బీజేపీ దూకుడు కారణంగా ప్రధాన పారీ్టలన్నింటి మధ్యా నువ్వా నేనా అన్న ట్టుగా యుద్ధం సాగుతున్న పరిస్థితి మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, బీజేపీలో చేరుతానని ప్రకటించడం మరింత వేడిని పెంచింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతోనూ అగ్గి రాజుకుంది. అధికార టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీలతో ముక్కో ణపు పోటీ నెలకొంటుండటంతో.. నేతలు తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీల వైపు దృష్టి సారిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కూడా గణనీయ సంఖ్యలో నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. బీజేపీ ఆకర్ష్ వేగవంతం.. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో అధికారం సాధిస్తామని ప్రకటించింది. తర్వాత కూడా వరుస పెట్టి జాతీయ నేతలతో పర్యటనలు చేయిస్తోంది. పార్టీ జాతీయ నేతల దిశానిర్దేశం, మద్దతుతో రాష్ట్ర బీజేపీ ఆపరేషన్ ఆకర్‡్షను వేగవంతం చేసింది. పారీ్టలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల జాబితాను పార్టీ చేరికల కమిటీ ఇప్పటికే సిద్ధం చేసుకుందని.. జాతీయ నాయకత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నేతలు సోమవారమే జాతీయ నాయకులతో సమావేశం కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి.. చేరికలపై ఆమోదముద్ర వేయించుకోనున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌కు వరుస దెబ్బల నేపథ్యంలో.. కొన్నేళ్ల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై నేతల ఆసక్తి తగ్గిపోయిందనే అభిప్రాయం నెలకొంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేవనే ప్రచారం మొదలైంది. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీలను విచారించడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. దీంతో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేతల్లో ఊగిసలాట మొదలైందని.. బయటి నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకూ ఇతర పార్టీల నేతలు సంశయిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్లోని అసంతృప్తులు, రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలున్న బలమైన నేతలను చేర్చుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డిని త్వరగా పార్టీలో చేరేలా ఒప్పించినట్టు సమాచారం. పక్షం రోజుల తర్వాత నిర్ణయం చెబుతానన్న రాజగోపాల్‌రెడ్డి.. ఆ మరునాడే రాజీనామా ప్రకటన చేశారని తెలిసింది. ఇద్దరు ఎంపీలు... రాజగోపాల్‌రెడ్డి చేరిక తర్వాత ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయతి్నస్తోందని, ఆ ఇద్దరూ వ్యాపారవేత్తలేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇక గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడినీ చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు మంత్రి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కూడా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా జాతీయ నేతల సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాజయ్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో దళిత సామాజిక వర్గానికి ఓ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. బీజేపీ నేతలతో టీఆర్ఎస్ నాయకుల భేటీలపై గులాబీ పెద్దలు నిఘా పెట్టిన నేపథ్యంలో గుట్టుగా ఆకర్ష్ ఆపరేషన్ సాగుతున్నట్టు సమాచారం. మునుగోడు.. 3 పార్టీలకూ కీలకం రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీకు కీలకం కానుంది. రాజగోపాల్‌రెడ్డి స్పీకర్‌కు రాజీనామా పత్రం ఎప్పుడిస్తారు? స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా, జాప్యం చేస్తారా అన్నదానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే ఉప ఎన్నిక ఎప్పుడు జరగవచ్చనే దానిపై స్పష్టత రానుంది. - కాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్ సీటు, కేడర్ బలంగా ఉన్న నియోజకవర్గం కూడా. అయినా ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఇక్కడ హుజూరాబాద్ తరహా ఫలితం పునరావృతం కాకుండా చూడాలన్న కృతనిశ్చయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. - హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల తరహాలో మునుగోడులోనూ చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తోంది. ఉప ఎన్నికల హ్యాట్రిక్ విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవడంతోపాటు, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. - ఎట్టిపరిస్థితుల్లోనూ మునుగోడులో విజయం సాధించాలని.. తద్వారా తమ బలం ఏమాత్రం తగ్గలేదని, బీజేపీది వాపే తప్ప బలుపు కాదనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. -
సింగరేణి టెండర్లలో అక్రమాలు
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ నిజాయితీగా ఉంటే దేశంలో కోల్ ఇండియా మాదిరిగానే సింగరేణిలో కూడా టెండర్లు పిలవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోటీ ఎక్కువగా ఉంటే తక్కువ రేటుకు టెండర్లు ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఈ టెండర్లో ముగ్గురికే అర్హత ఉందని తేల్చారు. కేసీఆర్ సమీప బంధువుకు చెందిన ప్రతిభ ఇన్ఫ్రా అనే కంపెనీతో లోపాయికారి ఒప్పందం మేరకు టెండర్లు జరిగాయ’ని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాశానని, టెండర్లు తెరవగానే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందన్నారు. రఫెల్ లాంటి కుంభకోణమే సింగరేణిలో జరుగుతోందని ఆరోపించారు. సత్యహరిశ్చంద్రుడి వారసుడినని చెప్పే కేసీఆర్ కోల్ ఇండియాలో ఉన్న నిబంధనలు, సింగరేణిలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది ఇరవై వేల కోట్ల రూపాయలు చేతులు మారే టెండర్ అని పేర్కొన్నారు. ఇది సింగరేణి సీఎండీ సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేదంటే, కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిందా అని ప్రశ్నించారు. -
దుప్పలపల్లిలో విషాదం: పాడె మోసిన ఎంపీ కోమటిరెడ్డి
రామగిరి (నల్లగొండ): తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ శివారులో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తానెదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దుర్మరణం చెందారు. వీరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం బుధవారం దుప్పలపల్లికి తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. లారీని ఢీకొని దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి నల్ల గొండలో సొంత ఇల్లు కూడా ఉంది. రెండు రోజుల క్రితం సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ నల్లగొండకు వచ్చారు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి 9.30 గంటలకు స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సుమారు రాత్రి 11.45 గంటల ప్రాంతంతో ఔటర్ రింగ్‌రోడ్డు దాటాక పెద్దఅంబర్‌పేట సమీపంలో ఓ టిప్పర్ లారీ వర్షం పడుతున్న కారణంగా ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న వీరి స్కార్పియో వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియో వాహనంలో ఉన్న దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాలను పోలీసులు అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామమైన దుప్పలపల్లికి తీసుకువచ్చారు. వివాహం జరిగి పదిరోజులు గడవకముందే.. ఎంపీటీసీ దంపతులకు కూతురు ప్రీతిరెడ్డి, కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు సంతానం. కాగా.. ఆగస్టు 22వ తేదీన కుమార్తె ప్రీతిరెడ్డి వివాహం నల్లగొండలోని ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. కుమార్తె వివాహం అయి పదిరోజులు గడవకముందే తల్లిదండ్రులు ఇద్దరూ అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 10, 11 కుమార్తె, అల్లుడిని తీసుకుని తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణం పాలయ్యారు. కాగా.. మంగళవారం తిరుపతిలో రూం కోసం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నుంచి లెటర్ కూడా తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం వేణుగోపాల్‌రెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి మాజీ సర్పంచ్. వీరికి దుప్పలపల్లిలో వ్యవసాయ భూమి కూడా ఉంది. ప్రస్తుతం వేణుగోపాల్‌రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు బిల్డర్‌గా పని చేస్తున్నాడు. గ్రామస్తులతో వీరికి వీడదీయరాని అనుబంధం ఉంది. ఎంపీటీసీ దంపతుల మరణంతో దుప్పలపల్లిలో విషాదం నెలకొంది. ప్రజాప్రతినిధుల నివాళి అంత్యక్రియల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని తానే స్వయంగా పాడె మోశారు. దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాలకు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనిశెట్టి దుప్పలపల్లిలో శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, లోడంగి గోవర్ధన్, వనపర్తి నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్‌రెడ్డిలు నివాళులర్పించారు. -
సభా వేదిక పేచీ: కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభా వేదిక మారింది. భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నుంచి చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే మహేశ్వరం సమీపానికి సభా వేదికను మార్చాలని నిర్ణయించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేసినందునే ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది. ఈనెల 9న ఇంద్రవెల్లిలో సభావేదికపై నుంచే ఇబ్రహీంపట్నం సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తనను అడగకుండా తన పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నంలో సభ ఎలా ప్రకటిస్తారని కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తీరుపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్ వరకు వ్యవహారం వెళ్లడంతో ఆయన కోమటిరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం కోమటిరెడ్డి, రేవంత్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారని, తనకు ఈనెల 17 నుంచి 21 వరకు బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్టాం డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ ఉన్నందున తాను సభకు రాలేనని, ఆ టూర్ కోసం గోవాకు వెళ్తున్నానని కోమటిరెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో సభ పెట్టి ఎంపీ కోమటిరెడ్డి హాజరుకాకపోతే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే సభాస్థలిని మా ర్చాలని నిర్ణయించారని, ఇందుకోసం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. గతంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రేవంత్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన రావిర్యాలలోనే దళిత గిరిజన దండోరా సభను కూడా నిర్వహించాలని నిర్ణయించినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం సభకు పోలీసులు అను మతి నిరాకరించారు. ఇక్కడ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
పీసీసీ రానందుకు బాధగా ఉంది: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, యాదాద్రి : తనకు పీసీసీ అధ్యక్ష పదవి రానందుకు బాధగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరం లేదు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం’’ అని అన్నారు. -
రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక కసరత్తులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయమై పార్టీ అధిష్టానం మరోసారి కొందరు నేతలతో సంప్రదింపులు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా నివాసం 10 జన్‌పథ్‌కు వెళ్లి వచ్చిన తరువాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చిం చారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌లతో పాటు రాష్ట్ర నాయకులతోనూ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురి పేర్లతో ఒక తాజా జాబితాను రూపొందించారు. పీసీసీ అధ్యక్ష రేసులో తాను లేనని శ్రీధర్‌బాబు ప్రకటించినప్పటికీ ఆయన పేరుతో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో సంప్రదింపులు జరిపే ప్రక్రియ కూడా ప్రారంభమయ్యిందని ఏఐ సీసీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాను మరింత వడబోసి త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిని పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. అంతకుముందు మరొకసారి పార్టీలోని కీలక, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపాలని కూడా అధిష్టానం పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. అనంతరం అధినేత్రి ఆమోదం తీసుకుని అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇతర పదవుల పైనా చర్చలు కేవలం అధ్యక్ష పదవికి ఎంపిక మాత్రమే కాకుండా, సామాజిక సమీకరణాల ఆధారంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల వంటి కీలక పదవుల భర్తీపై కూడా చర్చలు సాగుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మండల స్థాయి అధ్యక్షుల నియామకం కూడా వేగవంతం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేక నూతన అధ్యక్షులను నియమించాలా అనే అంశంపై గతంలోనే సమాలోచనలు జరిగాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయిన తరువాత జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు ఈసారి సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక నియామకాలు జరగనున్నాయని తెలిసింది. జంబో కార్యవర్గానికి భారీ కోత? ప్రస్తుతం సుమారు 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, 27 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో సైజ్ టీపీసీసీ కమిటీకి ఈసారి భారీగా కోత పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో ఒక అధికార ప్రతినిధి నియామకంతో పాటు పీసీసీ స్థాయిలో కేవలం 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను మాత్రమే కొత్త కమిటీలో భాగంగా నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
‘ఒకరు మతం.. మరొకరు డబ్బు రాజకీయం’
నల్లగొండ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని చూస్తే, టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సే అని, గెలుపు ఓటములన్నది సహజమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నేతలు అమిత్ షా, యోగి తదితర నేతలు హైదరాబాద్‌కు వచ్చి మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వెదజల్లిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు మత ప్రాతిపదికన తరహాలో జరిగాయని ఆరోపించారు. దుబ్బాకలో కూడా ఇదే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ బలహీనపడ లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో రైతు పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. కేంద్ర వి«ధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారని, అలాంటి ఉద్యమాలే రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. -
ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ
సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, కేసీఆర్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ
ఇబ్రహీంపట్నం: నగరానికి సమీపం లోని ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరి పించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి ప్లాట్లు చేస్తున్న విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటే..మన రాష్ట్రంలో ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుంటే మంత్రులకు పదవులుండవని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించడాన్ని ఖండించారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానానికి ఆయన కూతురు కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయలేదని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. -
కోమటిరెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి కోసం..
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సంకల్ప యాత్ర పేరుతో బోథ్ నుం చి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సుద్దాల రాజేశ్వర్, సీనియర్ నాయకుడు గంగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దా దాపు 320 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బుధవారం గాం«దీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేయస్సు కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. -
హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి
బొమ్మలరామారం: రాష్ట్రంలో డెంగీ జ్వరం వస్తే లక్షలు ఖర్చు చేసుకుంటున్న పేదలను ఆదుకోకుండా వాస్తు దోషం పేరిట రూ.4 వేల కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారన్నారు. -
పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిని గెలిపించుకుంటామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి లాంటి నేతలంతా హుజూర్‌నగర్‌లో ఐకమత్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ విషయంపై మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డి ఎవరని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నల్లగొండ వ్యవహారాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పక్క జిల్లా నుంచి వచ్చి తమ వ్యవహారాల్లో వేలు పెడితే సహించేది లేదన్నారు. హుజూర్నగర్ నుంచి పద్మావతి కాకుండా ఎవరైనా పోటీ చేయాలని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేతలను అడిగామని, అంతా పద్మావతి పేరునే ప్రతిపాదించా రని చెప్పారు. నల్లగొండ జిల్లా కీలకనేతల మధ్య గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పోగొట్టుకుని అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. పీసీసీ రేసులో నేను తప్ప ఎవరూ లేరు.. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘రేసులో ఉండడం ఏంటి? నేను తప్ప పీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఎవరూ లేరు. వీహెచ్‌ను అడిగినా, ఎవరిని అడిగినా, పాత కాంగ్రెస్ నేతలెవరైనా నాకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు’అని వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటును చూసిన తర్వాత అసెంబ్లీ చిన్నగా కనిపిస్తోందన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆర్థికమంత్రి హరీశ్‌ను కోరానని ఎంపీ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. -
కాంగ్రెస్ వరుస పాదయాత్రలు
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఖరీఫ్ సీజన్ ఊపందుకున్న తరుణంలో ఇంకా ప్రారంభం కాని, పూర్తికాని ప్రాజెక్టుల సాధన, కాళేశ్వరం ప్రతిపాదిత స్థలం, ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు రద్దు లాంటి అంశాలతో పాదయాత్రల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ఈ నెలాఖరులో మూడు యాత్రలకు శ్రీకారం చుట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ యాత్రల్లో పాల్గొననున్నారు. ఉదయసముద్రం కోసం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం కోసం ‘రైతుసాధన యాత్ర’పేరుతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. నల్లగొండ శివారు పానగల్లు వద్ద ఉన్న ఉదయసముద్రం ప్రాజెక్టు నుంచి 100 కి.మీ. నడిచి ఆయన రాష్ట్ర సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయమైన జలసౌధ వరకు చేరుకోనున్నారు. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు 5 వేల మంది రైతు లతో నిర్వహించనున్న ఈ యాత్రలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టాలని కోరుతూ నిర్వహించనున్న ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇక ఈ నెల 26నే ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం గురించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు టీపీసీసీ ఆధ్వర్యం లో యాత్ర చేపడుతున్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా గోదావరి నీరు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదని, అవినీతి కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారంటూ ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలతో ఈ యాత్ర చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు సాగునీటి కోసం ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు నిరసనగా యాత్ర చేపట్టి మొదటి రోజు శంకర్పల్లి ధోబీపూర్ నుంచి చేవెళ్ల వరకు, రెండో రోజు మన్నెగూడ వరకు, మూడో రోజు పరిగి వరకు, నాలుగో రోజు షాద్‌నగర్ వరకు 88 కి.మీ. మేర యాత్ర సాగించనున్నారు. -
అన్ని ‘జెడ్పీ’లను కైవసం చేసుకుంటాం
హైదరాబాద్: రాష్ట్రంలోని 21 జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన ఆదివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని, అన్ని జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన సూచించారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిత తర్వాత కేసీఆర్ అహంకారం పెరిగిపోయిందని ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి 40వేల మెజారిటీతో గెలుపొందగా, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. చిరస్థాయిగా నిలిచిపోవాలి నాయకుడనే వాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని, కానీ నేడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్లు దోచుకోవడం వల్లే తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సొంత కూతురిని గెలిపించుకోలేకపోయారన్నారు. నాయకుడంటే దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి అని, ఆనాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి సీఎంను చేశారని తెలిపారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆనాడు వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చెల్లెమ్మా అని గౌరవించారని, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఆమెకు నేడు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఆలిండియా కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు ముందే పొత్తులు వద్దని చెప్పా
-
నల్గొండ: మా నాన్నను గెలిపించండి
సాక్షి, నల్లగొండ : ‘మా నాన్న తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నాడు.. 11 రోజులు ఆమరణ దీక్ష చేశాడు.. ఆయన ఎంతో సౌమ్యుడు.. సహాయ గుణం, సానుభూతి ఆయనకు వెన్నతో పెట్టినవి. అలాంటి మా నాన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించండి’ అని కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధి అమెరికానుంచి నియోజకవర్గ ప్రజలకు మీ చెల్లిగా అభ్యర్థిస్తున్నానని బుధవారం ఒక ప్రకటనను మెయిల్ ద్వారా పంపింది. అందరినీ తన వాళ్లుగా చూసుకునే తత్వం నాన్నదని పేర్కొంది. తన చిన్నతనం నుంచి నాన్ననుంచి నేర్చుకున్నది «ధైర్యం, సానుభూతి, సహాయ గుణమని తెలిపింది. చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన నాన్న ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నల్లగొండ ప్రజలకే కాదు.. తెలంగాణ ప్రజలకు కూడా తనదైన స్వరం అందించిన తీరు అనుసరణీయమని పేర్కొంది. ‘జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫ్లోరిన్ రహిత నీటికోసం పోరాడిన యోధుడిగా నాన్న మీ అందరికీ సుపరిచితమే.. ఎందరో జీవితాలను ప్రభావితం చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది తెలంగాణ సాధన కోసం మం త్రి పదవిని వదులుకున్న త్యాగశీలి నాన్న. మా బాల్యాన్ని నాన్న మిస్సవుతున్నా వేలా ది మంది పిల్లలకు వైద్య, విద్యను అందిస్తూ ఆనందమయ జీవితాన్ని అందిస్తున్నందుకు మాకెంతో సం తోషం. మొన్న వేసవిలో నాన్నతో ప్రజల్లోకి వెళ్తే నాకు ఎంతో ఆనందం, ఆశ్చర్యం కలిగింది. 9వ తరగతి అమ్మాయి నాన్నను ఆప్యాయంగా పెదనాన్న అని సంబోధిస్తుంటే నా కళ్లు ఆనందభాష్పాలకు నెలవులయ్యాయి. నాకు తమ్ముళ్లు, చెల్లెల్లు ఎందరో.. లెక్కపెట్టగలనా అనిపించింది. నాన్న సేవల లెక్క తేలడం అంత కష్టం. అలాంటి నాయకుడి బిడ్డనయినందుకు గర్విస్తున్నాను. ఈ సమయంలో నేను అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. అందుకే ఈ మాధ్యమం ద్వారా మీకు విన్నవించుకుంటున్నా’ అని వివరించింది. మనందరి సంపూర్ణమద్దతు నాన్నకు అందిద్దామని, నాన్నను మళ్లీ మన ఎమ్మెల్యేగా మరింత శక్తివంతమైన నాయకుడిగా చూద్దామని కోరింది. -
కాంగ్రెస్‌వైపే ప్రజాదరణ : కోమటిరెడ్డి లక్ష్మి
సాక్షి, నాంపల్లి: కాంగ్రెస్‌వైపే ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. రానున్నది మహాకూటమి ప్రభుత్వమని అన్నారు. కార్యకర్తలకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంత రాజుగౌడ్, జెడ్పీటీసీ మేతరి యాదయ్య, కుంభం శ్రీనివాస్‌రెడ్డి, బీమానాయక్, పాక నగేష్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయక తప్పదు మునుగోడు : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల అనంతరం ప్రగతి భవన్ ఖాళీ చేయకతప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని శుక్రవారం మండలంలోని సింగారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు జిల్లా వెంకటేశం, కుంభం భూపాల్‌రెడ్డి, జంగం రాములు, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, సోమగోని రమేష్, కుంభం సురేందర్‌రెడ్డి, మునగాల పోతులూరాచారి, ఉప్పునూతల రమేష్, వట్టి వెంకట్‌రెడ్డి, కోడి చం ద్రయ్య, కోరే రామచంద్రం పాల్గొన్నారు. రాజగోపాల్‌రెడ్డికే తమ మద్దతు డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇస్తుం దని ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కొమిరె స్వామి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి చేయి గుర్తుకు ఓటువేయాలని కోరుతూ శుక్రవారం మునుగోడులో సంఘం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పందుల మల్లేష్, సంపత్‌కుమార్, గోసుకొండ శంకర్, దుబ్బ భాస్కర్, పోలే వెంకన్న, పందుల సైదులు, దుబ్బ గోపాల్, పందుల పర్వతాలు, లింగస్వామి పాల్గొన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చండూరు: చెయ్యి గుర్తుకు ఓటు వేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చండూరు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కోడి గిరిబాబు, కోడి శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి అవకాశం ఇవ్వండి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ : మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 34, 35 వార్డుల్లో ఆయన గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఒకప్పుడు తాగు నీరు లేక నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడేవారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పానగల్ నుంచి పైప్‌లైన్ వేయించి నీరందించామని పేర్కొన్నారు. అంతే కాకుండా అండర్‌గ్రౌండ్ డ్రైయినేజీ, సీసీ రోడ్లతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలో చేసింది ఏమీ లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సట్టు శంకర్, మల్లయ్య యాదవ్, కడారి కోటి, ఇంతియాజ్, జహంగీర్ పాల్గొన్నారు. ముస్లిం పెద్దలను కలిసిన కోమటిరెడ్డి: పాత కలెక్టరేట్ రోడ్డులోని మసీద్ వద్ద ప్రార్థనలకు వచ్చిన ముస్లింలను కోమటిరెడ్డి కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మైనార్టీ యువకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. పలు మసీదుల వద్దకు వెళ్లి ప్రార్థన అనంతరం బయటికి వచ్చిన తర్వాత వారిని ఓటును అభ్యర్థించారు. మరిన్ని వార్తాలు... -
అందుకే చిన్న గ్రౌండ్లో కేసీఆర్ బహిరంగ సభ!
సాక్షి, నల్లగొండ: ముందస్తు ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్న టీఆర్ఎస్ పార్టీ గురువారం నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. నిజామాబాద్‌లో సభతో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారభేరీని మోగించిన కేసీఆర్.. నల్లగొండ సభతో గులాబీ శ్రేణుల్లో మరింత ఊపు తేవాలని భావిస్తున్నారు. ఇందూరు సభలో ప్రతిపక్ష మహాకూటమి, కాంగ్రెస్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఒకవైపు నల్లగొండలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చేసేదంతా మోసమేనని, నల్లగొండ సభకు ప్రజలు రారనే ఉద్దేశంతోనే చిన్న గ్రౌండ్లో సభ ఏర్పాటు చేశారని విమర్శించారు. నిజామాబాద్ సభలోలాగా పిచ్చిపిచ్చిగా కేసీఆర్ మాట్లాడితే నల్లగొండలోని 12 స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మారుస్తారా?
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సూర్యాపేటలో పట్టణానికి దూరంగా కలెక్టరేట్ నిర్మాణం చేపడుతోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. పిల్ దాఖలు చేసిన చక్కిలం రాజేశ్వరరావు తాను ఓ జాతీయ పార్టీకి చెందిన వ్యక్తినని, ఆ పార్టీ అధికార ప్రతినిధినని ఎక్కడా చెప్పకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజన వ్యాజ్యంగా మార్చడం ఎంత మాత్రం తగదని హితవు పలికింది. బ్యాలెట్ ద్వారా చేయాల్సిన యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం మంచిది కాదని సూచించింది. ఈ వ్యాజ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారని, దీంతో ఈ పిల్ వెనుక ఉన్న ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని వ్యాఖ్యానించింది. కలెక్టరేట్ నిర్మించతలపెట్టిన భూమి పక్కనే మునిసిపల్ చైర్మన్ భర్త భూమి కొన్నారని, ఈ భూములకు రేట్లు పెరిగేలా చేసేందుకే ప్రభుత్వం అక్కడ కలెక్టరేట్‌ను నిర్మిస్తోందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. సూర్యాపేట జిల్లా ఏర్పడటానికి ముందే అక్కడ మునిసిపల్ చైర్మన్ భర్త శ్రీసాయి డెవలపర్స్ పేరుతో భూమి కొన్నారని గుర్తు చేసింది. కలెక్టరేట్ నిర్మాణం కోసం అవసరమైన మొత్తం 25 ఎకరాల భూమిలో ప్రభుత్వం మునిసిపల్ చైర్మన్ భర్తకు చెందిన శ్రీసాయి డెవలపర్స్ నుంచి 8 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన భూమిని ఇతర వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. దురుద్దేశాలు అంటగట్టడం సరికాదు.. సూర్యాపేటలో ప్రభుత్వ భూమి ఉన్నా.. పట్టణానికి దూరంగా కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధిలోని ప్రైవేటు భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, అందులో కలెక్టరేట్ నిర్మించాలని నిర్ణయించిందని ఆరోపిస్తూ సీహెచ్.రాజేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డికి చెందిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే పట్టణానికి దూరంగా కలెక్టరేట్‌ను ప్రైవేటు భూముల్లో నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కలెక్టరేట్ నిర్మాణం చేస్తున్న భూమి పక్కనే మునిసిపల్ చైర్మన్ భర్త భూములున్నాయన్న కారణంతో ప్రభుత్వ జీవోకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదన్న శ్రీసాయి డెవలపర్స్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్ష వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. సూర్యపేట కలెక్టరేట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని చెప్పలేమని తేల్చి చెప్పింది. -
తెలంగాణ వచ్చిన సంతోషం ఒక్కరిలోనూ లేదు
తిరుమల: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలకులు తప్ప, ప్రజలు సంతోషంగా లేరు..తెలంగాణ వచ్చిన సంతోషం ఓ ఒక్కరిలోనూ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు అధికారాలు లేవని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూతురు కవితతో సహా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కాగితాలపై తప్ప వాస్తవంగా లేదని వ్యాఖ్యానించారు. గురువారం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి ని దర్శించుకున్న వారిలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, పీఠాధిపతులు సుగునేంద్ర తీర్ధ స్వామిజీ, రఘునేంద్ర తీర్ధ స్వామిజీలు ఉన్నారు. -
నేను అలా అనుకోవడం లేదు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పడానికే నేతలు ఢిల్లీ వెళ్లారన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నుంచి చాలామంది నేతలు రెడీగా ఉన్నారన్నారు. స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని త్వరలోనే చేరికలుంటాయని వెల్లడించారు. సర్పంచ్ రిజర్వేషన్లు అస్థవ్యస్థంగా ఉన్నాయని ఆరోపించారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. ఏ ప్రాతిపదికన, ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారో స్పష్టత ఇవ్వాలన్నారు. సర్పంచ్ రిజర్వేషన్లపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
కేసీఆర్ సిద్ధిపేట, సిరిసిల్లకే ముఖ్యమంత్రా?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎన్నో ఎళ్ల తర్వాత మెడికల్ వచ్చింది.. కానీ సిద్దిపేట మెడికల్ కాలేజీకి 70 కోట్లు ఇచ్చి, నల్లగొండకు మాత్రం 250 కోట్లు ఇచ్చారు. వాళ్ల ప్రాంతానికి ఓరకంగా.. మా ప్రాంతానికి ఓ రకంగా నిధులు మంజూరు చేశారు. వాళ్ల ప్రాంతంలో ప్రమాదంలో చనిపోతే ఓ రకంగా, మా ప్రాంతంలో ఓ రకంగా ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. బతుకమ్మ చీరలకు కేవలం సిరిసిల్లకు 250 కోట్ల ఆర్డర్ ఇచ్చారు.., రాష్ట్రంలో ఏ జిల్లాలో చీరలు నేయరా..? సిద్ధిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖ్యమంత్రా? కాళేశ్వరానికి ఎక్కువ నిధులు , ఎస్ఎల్బీసి ప్రాజెక్టుకి నిధులు ఉండవు. నల్లగొండ జిల్లా తెలంగాణలో ప్రాంతం కాదా? కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను మొదలుపెట్టించింది కాబట్టే ఇంత నిర్లక్ష్యం. మిషన్ భగీరథ కుంభకోణాలపై ప్రశ్నించినందుకు ఇలా చేస్తున్నారు. పండించే పంటకు మద్దతు ధర, బోనస్ ఇస్తే రైతులు బాగుపడతారు. జూన్ 2 న 50 వేల పోస్టులని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఐకేపీ ధాన్యం డబ్బులు, ఉపాధి హామీ పనుల బకాయిలు అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్టీసీ ఎత్తివేయడానికి కుట్ర జరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లకు మా పూర్తి మద్దతు ఉంటుంది.’ అని వెల్లడించారు. మరోవైపు బొడ్డపల్లి శ్రీను హత్య, అకారణంగా ఎమ్మెల్యే పదవి రద్దు, గన్మెన్లను తొలగింపు.. ఇవన్నీ నాపై కావాలనే కుట్ర జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు ఎమ్మెల్యేగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేయడబోతున్నాను. -
శాసన సభ్యత్వాలు పునరుద్ధరించండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్సైట్లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. -
న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది. తమ ఎమ్మెల్యేలను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తీర్పు వచ్చి 20 రోజులవుతున్నా ప్రొటోకాల్, ఇతర హక్కుల విషయంలో శాసనసభ్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని గవర్నర్‌కు చెప్పారు. వెంటనే శాసనసభ్యుల హక్కులు కాపాడేలా ప్రభుత్వాధినేతగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలసిన వారిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ముఖ్య నేతలు నాగం జనార్దనరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు. సానుకూల స్పందన: ఉత్తమ్ గవర్నర్‌ను కలసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తాము అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సీఎస్‌ను కలసి వినతిపత్రం ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.జోషిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు. ఏమో.. నాకా చరిత్ర తెలియదు: కాంగ్రెస్ నేతలతో గవర్నర్ కాంగ్రెస్ నేతలు తనను కలసిన సందర్భంగా వారు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ సావధానంగా విన్నారు. ‘తప్పకుండా పరిశీలిస్తాను’ అని పలుమార్లు కాంగ్రెస్ నేతలకు ఆయన చెప్పారు. అయితే, భేటీ చివర్లో గవర్నర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భేటీ ముగిసే సమయంలో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి గవర్నర్ దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 1952 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలా ఎమ్మెల్యేలను బహిష్కరించలేదని గవర్నర్‌కు జనార్దనరెడ్డి చెప్పారు. దీనికి స్పందించిన గవర్నర్ ‘ఏమో నాకు తెలియదు. నేను 1952లో ఏడో తరగతి చదువుతున్నా. ఆ చరిత్ర నాకెలా తెలుస్తుంది’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
నిలదీశారు... నిప్పులు చెరిగారు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం(సీఎల్పీ) గరంగరంగా సాగింది. రాష్ట్రంలో పార్టీ అధినేతల తీరుపై ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. పలు అంశాలపై వారి వ్యవహారశైలిని నిలదీశారు. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనే విషయం, పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన ఘటనలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో గంటన్నరపాటు సీఎల్పీ భేటీ జరిగింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం... ‘ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడలేకపోయారు. రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. కార్యకర్తల్లో ధైర్యం ఎలా నింపుతారు’ అని సంపత్ నిలదీశారు. ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ లాంటి పెద్ద తలకాయలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేకపోయారని, పార్టీ నాయకత్వం తీరు మార్చుకోకపోతే కార్య కర్తల్లో నమ్మకం కోల్పోతామన్నారు. ‘మమ్మల్ని కాపాడలేకపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. ఇక, కార్యకర్తలను ఏం కాపాడతారు’ అని కూడా ఆయన అనడంతో సీఎల్పీ సమావేశం వేడెక్కింది. అయితే, ఉత్తమ్, జానా సర్దిచెప్పేందుకు యత్నించినా సంపత్ వ్యాఖ్య లకు మద్దతిస్తూ కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడటం గమనార్హం. నిలువరించలేక పోతున్నాం... సీఎం కేసీఆర్ అండ్ టీం యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా వారిని నిలు వరించడంలో విఫలమవుతున్నామని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగాల్లేవు, డబుల్బెడ్రూం ఇళ్లు లేవు. ఇసుక మాఫి యా చెలరేగిపోతోంది. ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్న దానిపై పునరాలోచన చేయాలి. యుద్ధం పకడ్బందీగా చేయకపోతే కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎదుర్కోగలమా? ప్రెస్మీట్లు పెట్టి తూతూ మంత్రపు హెచ్చరికలు చేస్తే సరిపోతుందా? ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాల్సింది. తూతూమంత్రం కార్యక్రమాలతో ఏం సాధిస్తాం.?’అని పలువురు వ్యాఖ్యానిస్తూ నిలదీశారు. నన్నూ అవమానపర్చారు ప్రోటోకాల్ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయనే చర్చ సీఎల్పీ సమావేశంలో జరిగింది. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ తనను అవమానపర్చారని, సమాచారం సరిగా ఇవ్వకుండా నలు గురు మంత్రులు వచ్చి మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వెళ్లారని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని, కేసు అడ్మిట్ అయి ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిగినా పార్టీ పక్షాన ఎందుకు పట్టించుకోవడం లేదని పొంగులేటి ప్రశ్నించినట్టు సమాచారం. కొంతమందికి అసెంబ్లీకి వచ్చే వీలు లేకపోతే గాంధీభవన్‌లో సీఎల్పీ సమా వేశం పెట్టాల్సిందని, జానా నివాసంలో పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారని కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రైతాంగాన్ని కార్యకర్తలు ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావాలని సీఎల్పీ సమావేశం కోరింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రోటోకాల్ అమలు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో తాము వేరే మార్గం వెతుక్కోవాలని సీఎల్పీ నిర్ణయించింది. జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కతోపాటు జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, వంశీచందర్‌రెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ ఆకుల లలితలు పాల్గొన్నారు. అసంతృప్తితో అమెరికాకు కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో శాసనసభలో మైక్ విసిరేసిన ఘటనకు సంబంధించి తనతోపాటు మరో ఎమ్మెల్యే సంపత్‌ను బహిష్కరిస్తే టీపీసీసీ, సీఎల్పీ నామమాత్రంగానైనా పట్టించు కోకపోవడంపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకత్వాల తీరుకు నిరసనగానే ఆయన అమెరికా వెళ్లినట్లు సన్నిహితులు చెప్పారు. తమ గన్మెన్లను తొలగించినా ఉత్తమ్, జానారెడ్డి కనీసం పట్టించుకో లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్‌ను హతమార్చడం, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రౌడీలతో నల్లగొండలో రాజకీయం చేయాలని చూడటం వంటి పరిణామాల నేపథ్యంలో తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని కోమటిరెడ్డి ఆరోపించారు. -
కోమటిరెడ్డి కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ రద్దు తీర్పుపై అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతివ్వాలా, వద్దా అన్న అంశంపై వాదనలు ముగిశాయి. దీనిపై నిర్ణయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు. దాన్ని సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన వ్యాజ్యంలో వారు ప్రతివాదులు కాదు గనుక నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్‌కు అనుమతిపై ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున, అభిషేక్ మను సింఘ్వీ కోమటిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయాలడం సరికాదని బుధవారం వైద్యనాథన్ వాదించారు. -
ఆ తీర్పు అమలును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం అప్పీల్ దాఖలైంది. తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జి.సాయన్న, మర్రి జనార్దన్‌రెడ్డి, గ్యాదరి కిశోర్ కుమార్, మాగంటి గోపీనాథ్, మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, కె.పి.వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలె యాదయ్య, రమావత్ రవీంద్రకుమార్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పీల్‌ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్‌పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పు చట్టవిరుద్దం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఈ నెల 17న తీర్పునిచ్చారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం ఎమ్మెల్యేలను రంగంలోకి దించి దానిపై అప్పీల్ దాఖలు చేయించింది. సింగిల్ జడ్జి తీర్పు ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమేనని అప్పీల్లో వారు వాదించారు. ‘‘కోమటిరెడ్డి, సంపత్ సభ్యులుగా కొనసాగేందుకు అర్హులే కాదు. సభా మర్యాదలను వారు మంటగలిపిన తీరును మాతో పాటు సభ్యులంతా చూశారు. వారు పిటిషన్లో కోరిన వాటికి మించి జడ్జి అనుకూల ఉత్తర్వులిచ్చారు. అసలు వారి వ్యాజ్యాన్ని విచారణార్హంగా పరిగణించి ఉండకూడదు. వారి చర్యలు సభా ధిక్కారమే. వారి బహిష్కరణకు శాసన వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. వీడియో ఫుటేజీ ఇవ్వకపోవడం, సభ్యులకు బహిష్కరణ తీర్మానం, నోటీసు, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ జడ్జి తప్పుబట్టారు. కానీ సహజ న్యాయ సూత్రాల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సభ్యుల చర్యలు దుష్ప్రవర్తనే గాక సభా ధిక్కారం కూడా. ఇలాంటి వారిని అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు అనుమతించడం అసాధ్యం. వారేం చేశారో సభంతా చూశాక వారి వాదన వినాల్సిన అవసరమే లేదు. తప్పు చేశారని స్పష్టమవుతుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించాలనడంలో అర్థమే లేదు. పైగా సభ్యుల చర్యలు సభా ధిక్కారమైనప్పుడు, వారి వాదనలు వినే విషయంలో ఎలాంటి ప్రొసీజర్ లేనప్పుడు తగిన తీర్మానం జారీ చేసే అధికారం సభకుందని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది’’అని పేర్కొన్నారు. ఆ అధికరణను సుప్రీంకోర్టే ఉపయోగించగలదు ‘‘అసెంబ్లీకి కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయి. వాటి ప్రకారం సభ్యులను శిక్షించవచ్చు. సభా మర్యాదలకు భంగం కలిగించినా, సభను ధిక్కరించినా, ప్రతిష్టను దిగజార్చినా బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం ఉంది. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను శిక్షించరని జడ్జి పేర్కొన్నారు. దానికి, శాసనసభ్యుల శిక్షకు ఉన్న తేడాను విస్మరించారు. తప్పు చేసిన సభ్యులను మన్నించి వదిలేస్తే సభ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకమవుతుంది. సభలో జరిగిన విషయాలపై న్యాయ సమీక్షకు వీల్లేదు. సభకు ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని జడ్జి విస్మరించారు. ఆధారాలు సమర్పించకుంటే అవి విరుద్ధంగా ఉన్నాయని భావిం చే పరిస్థితి ఈ కేసుకు వర్తించదు. జడ్జి 142వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి తీర్పునిచ్చారు. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టే ఉపయోగించగలదు. ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరం లేదని పార్లమెంటరీ సభా విధానాల ను పరిశీలించకుండానే తీర్పునిచ్చారు. న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా సభ నుంచి డాక్యుమెంట్‌ను కోరితే సభ ప్రత్యే క, అసాధారణ అధికారాలకు విలువ లేనట్లే! సభ జరుగుతుండగా జరిగిన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సభ తీర్మానం తప్పనిసరి. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేదా తేల్చేందుకు పార్లమెంటు, శాసనసభలే సరైన అధికార వ్యవస్థలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జడ్జి తన తీర్పుతో సభ తీర్మానంలో జోక్యం చేసుకున్నారు’’ అని అప్పీల్లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
‘హైకోర్టు తీర్పు వారికి చెంప పెట్టు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఇది ప్రజల విజయమని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగిద్దామనుకున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు అని ఆయన అన్నారు. న్యాయాన్ని, వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ విజయం సాధించారని అభినందించారు. సభ్యత్వ రద్ధు చెల్లదంటూ వెలువరించిన 175 పేజీల హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందని కొనియాడారు. కుటిల రాజకీయాలు చేసే నేతలకు ఈ తీర్పు కనువిప్పు అని పేర్కొన్నారు. ప్రశ్నించే వారే ఉండొద్దన్న ధోరణిలో టీఆర్ఎస్ ఉందని జానా మండిపడ్డారు. అందుకనే కోదండరాం పార్టీ సభకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలపై నిరసన గళమెత్తకుండా చేసేందుకు ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని విమర్శించారు. తీర్పు అనంతరం ఎమ్మెల్యే సంపత్ విలేకర్లతో మాట్లాడారు. గత నెలలో జరిగిన పరిణామాలు కుటిల రాజకీయాలకు తార్కాణమని అన్నారు. అయినా ‘మేం ధైర్యం కోల్పోలేదు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకముంది. ప్రజాస్వామ్యాన్ని దొరల గడీలో బంధించాలన్న కుట్రలకు మా విజయం తగిన గుణపాఠం’ అని సంపత్ అన్నారు. -
తెలంగాణ అడ్వకేట్ జనరల్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ద్వారా గవర్నర్‌కు పంపినట్లు తెలిసింది. అయితే ప్రకాశ్‌రెడ్డి రాజీనామా లేఖపై గవర్నర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి బహిష్కరణ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో చోటుచేసుకున్న పరిణామాలే ప్రకాశ్‌రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 12న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సమర్పిస్తామంటూ హైకోర్టుకు ఏజీ హోదాలో ప్రకాశ్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా అలా ఎలా హామీ ఇస్తారని నిలదీయడంతో ఏజీ నొచ్చుకున్నట్లు సమాచారం. అంతేగాక ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఏజీకి స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత రెండ్రోజులుగా తర్జనభర్జన పడ్డ ఏజీ.. తన సన్నిహితుల వద్ద రాజీనామాపై చర్చించారు. అనంతరం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, సోమవారం ఉదయం 11 గంటల సమయంలో లేఖను సీఎస్ ద్వారా గవర్నర్‌కు పంపారు. ఇదీ జరిగింది ఈ నెల 12న అసెంబ్లీలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు నిరసన తెలియచేశాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన చేతిలో ఇయర్ ఫోన్‌ను విసిరేశారు. అది వెళ్లి వేదికపై ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలిందని, దీంతో ఆయన కంటికి గాయమైందంటూ వివాదం రేగింది. దీన్ని ఆధారం చేసుకొని నల్లగొండ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డితో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను కూడా సభ నుంచి బహిష్కరించారు. నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం వర్తమానం పంపారు. ఈ నేపథ్యంలో ఆ ఇరువురు ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి దిగారు. తమ బహిష్కరణను సవాల్ చేయడంతో పాటు తమ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ముందుకెళ్లకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, అలాగే గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన మొత్తం ఒరిజినల్ వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మండలి చైర్మన్ ఉల్లాసంగానే గడిపారు కోమటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఈ నెల 19న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరిన తర్వాత కూడా మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉల్లాసంగా గడిపారని, వేదికపై ఉన్న స్పీకర్‌తో నవ్వుతూ మాట్లాడారని కోర్టుకు తెలిపారు. గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లే సమయంలో ఆయనతోపాటు బయట వరకు వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారని, ఆ తర్వాతే ఇయర్ ఫోన్ వల్ల కంటికి గాయమైందంటూ ఆరోపణలు మొదలుపెట్టారని తెలిపారు. తర్వాత ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇయర్ ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచినందుకు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించ లేదని, గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరించినందుకే బహిష్కరించామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, నల్లగొండ, అలంపూర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. ఇదే సమయంలో ఒరిజినల్ వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మీ ఆదేశాలు వద్దు.. నా హామీ చాలు ఈ సమయంలో ఏజీ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీని తప్పక సమర్పిస్తామని, ఇది తన హామీ అని చెప్పారు. ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన ఈ హామీని నమోదు చేసిన న్యాయమూర్తి ఫుటేజీల సమర్పణ నిమిత్తం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆ తర్వాత హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఫుటేజీలు తీసుకోవాలంటే సభ తీర్మానం అవసరమని, అందువల్ల ఫుటేజీల సమర్పణకు మరింత గడువు కావాలని కోర్టును కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. ఆ రోజున వీడియో ఫుటేజీలు సమర్పించి తీరాలని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం వద్ద రెండ్రోజుల క్రితం ఓ సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వీడియో ఫుటేజీల సమర్పణ విషయంలో ఇచ్చిన హామీపై సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఇలా హామీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఏజీని ప్రశ్నించినట్లు సమాచారం. ఫుటేజీలు సమర్పిస్తే వచ్చే ఇబ్బందులను సైతం సీఎం ఈ సందర్భంగా లేవనెత్తారు. అయితే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏజీ ఏకీభవించలేదని తెలిసింది. సాల్వే నియామకంపై చెప్పని సర్కార్ తాను మాములు న్యాయవాదిగా ఆ హామీ ఇవ్వలేదని, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా హామీ ఇచ్చినందున దానికి ఓ విలువ ఉంటుందని ప్రకాశ్‌రెడ్డి అన్నట్టు సమాచారం. తాను ఇచ్చిన హామీపై వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని అన్నట్టు తెలిసింది. కానీ ఈ విషయంలో సీఎం అభిప్రాయం భిన్నంగా ఉండటంతో తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాశ్‌రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టులో జరుగుతున్న విచారణకు ఢిల్లీ నుంచి సుప్రీం సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను రప్పించాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సమాచారం అందలేదు. సాల్వే ద్వారా వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ కేసు నుంచి తప్పుకోవాలని ప్రకాశ్‌రెడ్డికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని అవమానంగా భావించిన ప్రకాశ్‌రెడ్డి ఏజీ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. గతేడాది జూలై 17న ప్రకాశ్‌రెడ్డి అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. నేడు కేసు విచారణ తమ బహిష్కరణపై కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరపనుంది. గవర్నర్ ప్రసంగం రోజున జరిగిన ఘటనలకు సంబంధించిన మొత్తం ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు గత వారం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో న్యాయస్థానం తదుపరి ఏం ఆదేశాలు ఇవ్వబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోమటిరెడ్డి, సంపత్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించనున్నారు. -
సెమీ ఫైనల్‌కు సిద్ధం; కోమటిరెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికకూ సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లను నిరసిస్తూ సంపత్‌కుమార్‌తో కలిసి గాంధీభవన్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ దీక్ష చేస్తోన్న ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సెమీస్‌కు సిద్ధం : ‘కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మాపై వేటు వేశారు. దీనిపై గవర్నర్ విచారణ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా వ్యతిరేక నిర్ణయం వస్తే ప్రజల దగ్గరికెళ్లి తేల్చుకుంటాం. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామంటోన్న టీఆర్ఎస్.. ఉప ఎన్నికలంటూ హడావిడి చేస్తోందికదా, వాళ్లకిదే నా సవాల్.. మేం సెమీ ఫైనల్స్ కు సిద్ధంగా ఉన్నాం. 2019లో జరిగే ఫైనల్స్‌లో 100కుపైగా సీట్లు సాధిస్తాం’ అని కోమటిరెడ్డి అన్నారు. పోలీస్ రాజ్యమిది : షబ్బీర్ ఫైర్ తమ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డిల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు గాంధీభవన్‌కు వెల్లువలా వస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేయడమేకాక, ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు. -
నల్లగొండ ఉపఎన్నిక.. బరిలో భూపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనే చర్చ కొలిక్కిరాకముందే, ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం తీసుకోకముందే అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. ‘సంపత్ కుమార్ ప్రాతినిధ్యవ వహిస్తున్న ఆలంపూర్ శాసనసభ స్థానం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయిన’ట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్ఎస్లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఆశావాహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్నవారిలో ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. 20న ప్రకటన? : నల్లగొండ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తరఫున కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీచేస్తారని కొద్ది గంటలుగా పెద్ద ఎత్తునప్రచారం సాగుతోంది. భూపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. నాటి ఎన్నికల్లో భూపాల్ గణనీయంగా ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకున్న ప్రజాదరణను బట్టి పార్టీలో చేర్చుకోవడమేకాక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ బాధ్యతలు కట్టబెట్టారు టీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే నల్లగొండలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఈ నెల 20న ప్రగతి సభను నిర్వహించాలని భావిస్తున్నది. ఆ సభలోనే భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటనలు లేవు. -
నల్లగొండపై పక్కా వ్యూహం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు ముందు బల నిరూపణకు.. తమ పట్టును ప్రకటించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పెద్ద వ్యూహాన్ని రచించిందా..? పద్నాలుగేళ్ల ఉద్య మ కాలంలో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఉత్సా హం నింపాల్సి వచ్చిన ప్రతిసారీ ప్రయోగిం చిన ‘ఉప ఎన్నికల’ వజ్రాయుధాన్నే ఇప్పుడూ ప్రయోగిస్తోందా..? నల్లగొండపై టీఆర్ఎస్ సిద్ధం చేసుకున్న ప్రణాళిక గురించి తెలుసు కుంటే పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఆరేడు నెలల కిందట నల్లగొండ ఎంపీ స్థానంలో ఉప ఎన్నిక ప్రయోగం అమలు చేయాలని చూసినా.. వివిధ కారణాలతో టీఆర్ఎస్ నాయకత్వం వెనకడుగు వేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు వేదికగా గవర్నర్ ప్రసంగ సమయంలో సోమవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలను టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంటోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తమకు దక్క కుండా ఊరిస్తున్న నల్లగొండ అసెంబ్లీ స్థానం లో పాగా వేసేందుకు ఎదురుచూస్తున్న టీఆర్ ఎస్‌కు మంగళవారం నాటికి ఓ స్పష్టతకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయమైన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్ శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయడంతో నల్లగొండలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటు న్నాయి. ముఖ్య నేతలతో అధినేత ఫోన్ సంభాషణ? నల్లగొండ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం ఖాయమయ్యాక టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడా రని విశ్వసనీయంగా తెలిసింది. ఉప ఎన్నిక అనివార్యమవుతుందని, పూర్తిస్థాయిలో దృష్టి సారించి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారని సమాచారం. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండపై దృష్టి సారించిన పార్టీ అధినాయకత్వం వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ప్రగతి సభల పేర జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు ఈనెల 20వ తేదీన నల్లగొండలో కూడా సభ జరగాల్సి ఉంది. ఇప్పటికే శాసనసభ నుంచి రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సమీప నెలల్లోనే ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నిరసన కార్యక్రమాలు.. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడికి నిరసనగా సోమవారం కొన్ని నిరసన కార్య క్రమాలు జరిగాయి. అయితే, కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరును ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని అధినాయ కత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు సోమవారం రాత్రికి రాత్రే కార్యక్రమాలను రూపొందించారు. ప్రధానంగా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంగళ వారం పెద్ద ఎత్తున దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు కోమటిరెడ్డి శాసన సభ్యత్వం రద్దు, ఇతర ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. దీంతో పోలీసులు ముందస్తు గానే అప్రమత్తమై ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ నేతలను అరెస్టు చేశారు. మరో వైపు జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలోనే పోలీసులను మోహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐలు, ఎస్ఐలను ఉదయం ఏడు గంటలకల్లా నల్లగొండకు రప్పించారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇలా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొన్నా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. -
కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో కాంగ్రెస్ సభ్యులపై వేటు వేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డిల మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. అరాచక శక్తులను సహించేది లేదని, కాంగ్రెస్ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని సీఎం ఆగ్రహించగా.. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని బీజేపీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. సస్పెన్షన్ల నిర్ణయం సరికాదని కిషన్‌రెడ్డి వాదించారు. బాధాకరమే కానీ తప్పలేదు : ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు, 9 మందిపై సస్పెన్షన్ వేటు నిర్ణయాలు బాధకారమే అయినా తీసుకోక తప్పలేదని సీఎం తెలిపారు. ‘‘ప్రజలకు మాత్రమే మేం జవాబుదారీగా ఉంటాం. సభలో ఏ అంశాన్నైనా చర్చిస్తాం. కానీ అరాచక శక్తులను మాత్రం సహించే ప్రసక్తేలేదు. కాంగ్రెస్ సభ్యుల్లో అసహనం తీవ్రంగా పెరిగింది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకోబోం. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అందుకే కాంగ్రెస్ సభ్యులపై తీవ్ర చర్యలను సిఫార్సుచేశాం’’ అని కేసీఆర్ అన్నారు. చరిత్ర మర్చిపోయారా? : ఇదే అంశంపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆవేశపూరిత నిరసనను అరాచకంగా భావించడం తగదన్నారు. ‘సభలోలేని విపక్ష ఎమ్మెల్యేను కూడా సస్పెండ్ చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ సర్కారుది’’ అని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డి మాటలకు సీఎం సమాధానం చెప్పేప్రయత్నం చేశారు. దీంతో పలు మార్లు కిషన్‌రెడ్డి మైక్‌ను స్పీకర్ కట్ చేయడం గమనార్హం. టీఆర్ఎస్కు మజ్లిస్ మద్దతు : కాంగ్రెస్ సభ్యులపై తీవ్ర చర్యలను టీఆర్ఎస్తోపాటు మజ్లిస్ కూడా సమర్థిస్తున్నదని ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. అసెంబ్లీలో నిన్న జరిగిన దాడిని ఎంఐఎం ఖండిస్తున్నదన్నారు. -
స్కాంగ్రెస్ మట్టికరువక తప్పదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల తొలిరోజు సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ పార్టీగా అభివర్ణిస్తూ.. ఘాటైన విమర్శలు ఆయన ఎక్కుపెట్టారు. ‘స్కాంగ్రెస్ పార్టీకి చర్చించేందుకు సబ్జెట్‌కు లేదు. కనీసం హుందాగా అసమ్మతి తెలిపే నైతిక అధికారం కూడా లేదు. స్కాంగ్రెస్ విఫల ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చూసి, విసిగిపోయి, ఆ పార్టీని చెత్తకుప్పలో విసిరేశారు. ఆ పార్టీ ఎంత రౌడీయిజానికి దిగినా.. మట్టికరువక తప్పదు’ అంటూ కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీవ్ర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టడంతో.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి స్వల్ప గాయమైంది. కోమటిరెడ్డి హెడ్సెట్ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అసెంబ్లీలో తాజా పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, కాంగ్రెస్ సభ్యులపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. Scamgress party has no subject material to discuss & debate or even moral authority to register a decent dissent People of Telangana have experience of Scamgress’ failed governance. Have tried, tested & dusted them No amount of hooliganism is going to save them from biting dust https://t.co/81U6AWBXRQ — KTR (@KTRTRS) March 12, 2018 -
కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ ప్రకటనల చర్చ !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ వ్యూహాలను పసిగడుతున్న కాంగ్రెస్ అప్రమత్తమవుతోందా ? టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తోందా ? సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ ముందస్తు కసరత్తు మొదలు పెట్టిందా..? కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు పై ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నాటినుంచి టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టు సాధించలేక పోయింది. అప్పుడు కేవలం ఆలేరు స్థానానికే పరిమితమైంది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మొదటిసారి ఆరు స్థానాలు గెలుచుకుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను గెలచుకోగా, నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలో మాత్రం కేవలం ఒక్క సూర్యాపేటకే పరిమితమైంది. దీంతో ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్న టీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేతను బరిలోకి దింపడం ద్వారా అసెంబ్లీ స్థానాలను కొల్లగొట్టాలని చూస్తోంది. వీరి వ్యూహాలను పసిగట్టిన కాంగ్రెస్ అదే స్థాయిలో ప్రతివ్యూహం రచించుకుంటోంది. కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి ప్రకటనల చర్చ ! పార్లమెంటు సీటులో బలమైన అభ్యర్ధిని నిలబెడితే ఆ ప్రభావం ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తున్న మాదిరిగానే కాంగ్రెస్ సైతం అదే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి వీచినా.. కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ స్థానాన్ని రెండు లక్షల మెజారిటీ ఓట్లతో గెలుచుకుంది. అలా గెలిచిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఈసారి మరో బలమైన అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ ఎంపీ స్థానం పరిధిలోనే సీఎల్పీ నేత జానారెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, హుజూర్నగర్, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి నియోజకవర్గం నల్లగొండ ఉన్నాయి. దీంతో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి బలహీనుడైతే సీనియర్లు ఉన్న అసెంబ్లీ సీట్లపైనా దాని ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ఇది గమనించే సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తానే నల్లగొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ ప్రకటన ఆయన వ్యక్తిగతంగా చేసిందా, లేక కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంలో భాగంగా చేసిందా అన్న స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీని శాసన మండలికి పంపిస్తామని కూడా ఆయన ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేస్తే అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరనే ప్రశ్న కాంగ్రెస్ శిబిరంలో వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి చేసిన ప్రకటనలను టీ పీసీసీ కూడా అధికారికంగా ధ్రువీకరించి ప్రకటిస్తే నల్లగొండ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిరేపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ పరిణామలంటినీ నిశితంగా పరిశీలిస్తున్న అధికార టీఆర్ఎస్ నాయకత్వం గుంభనంగా ఉంటోంది. -
'వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తా'
సాక్షి, నల్లగొండ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని వేములపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు దక్కకుండా అన్నీ నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రజా వ్యతిరేక దోపిడి పాలనను అంతం చేయడానికి ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన తెలిపారు. -
'మంత్రి పదవి ఆఫర్ చేశారు.. ఫుటేజీ బయటపెడతా'
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. కేటీఆర్ డబ్బు మదంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తీవ్ర స్ధాయిలో ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో సగం కాంట్రాక్టులు కేటీఆర్‌కు చెందినవేనని.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకే తరచూ విదేశాలకు వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేతగానితనం వల్లే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. మరోవైపు 'టీఆర్ఎస్ తలుపులు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారు' అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఆఫీస్‌కు వచ్చి మంత్రి పదవి ఇస్తానని కేటీఆర్ ఆఫర్ చేశారని.. కావాలంటే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెడతానని కోమటిరెడ్డి తెలిపారు. -
' వీరేశం బడా నయీం.. రేపు అంతా షాకవుతారు '
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వీరేశం నయీంకంటే డేంజర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ నయీంకంటే వీరేశమే బడా నయీం అని అన్నారు. తన ప్రధాన అనుచరుడు శ్రీనివాస్‌ను హత్య చేయించింది ముమ్మాటికి ఎమ్మెల్యే వీరేశమేనని, ఆయన కాల్ డేటా, ఆయన కిరాయి హంతకుల కాల్ డేటా చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని అన్నారు. హంతకులు హత్య చేసి నేరుగా నకిరేకల్ వెళ్లి ఆగినట్లు స్వయంగా డీజీపీ కూడా చెప్పారని, వీరేశం చెబితేనే తాము హత్య చేసినట్లు నిందితులు కూడా ఇప్పటికే డీజీపీ వద్ద ఒప్పుకున్నారని, ఆ వార్తలు రేపు మీరు టీవీల్లో చూసి షాక్ కు గురవుతారని కోమటిరెడ్డి చెప్పారు. వీరేశం అనే వ్యక్తిని ఎమ్మెల్యే అనడానికి తనకు సిగ్గుగా ఉందన్న కోమటి రెడ్డి సినీ ఫక్కీలో శ్రీనివాస్‌ను హత్య చేయించారని అన్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ భర్తను చంపడం మాములు విషయం కాదని, కోట్లు ఖర్చు చేసి శ్రీనివాస్‌ను హత్య చేశారని తెలిపారు. మూడేళ్ల నుంచే శ్రీనివాస్ హత్యకు కుట్ర చేశారని చెప్పారు. శ్రీనివాస్‌కు అపాయం ఉందని గతంలోనే భార్యభర్తలను అసెంబ్లీ చాంబర్‌కు తీసుకెళ్లి ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకున్నంత పనిచేసినా ఆయన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీ మారాలని శ్రీనివాస్‌పై ఒత్తిడి తెస్తున్నారని, తన (వెంకట్‌రెడ్డి) సంగతి మేం (టీఆర్ఎస్) చూసుకుంటామని బెదిరించారని, అయినా అతడు వినకపోవడంతోనే ఈ హత్య చేయించారని అన్నారు. శ్రీనివాస్ తనకు కుటుంబ సభ్యుడిలాంటివాడని, 25 ఏళ్లుగా తనతోనే ఉన్నాడని చెప్పారు. 'వీరేశం అనే వాడు బడా నయీం. ఆ నయీంను ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈ వీరేశంను ఎందుకు ఎన్ కౌంటర్ చేయరు. అవసరం అయితే నా ఫోన్ కాల్ డేటా తీసుకోవాలి. వీరేశం కాల్ డేటా, వీరేశం కిరాయి హంతకుల కాల్ డేటా తీసుకుంటే హంతకులు ఎవరో? ఎవరు హత్య చేయించారో అనే విషయం తేలిపోతుంది. వేముల విరేశం వల్లే శ్రీనివాస్ హత్య జరిగింది. సీఎం, మంత్రి జగదీష్ రెడ్డి అండ చూసుకొని వీరేశం బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు. నాకు, లింగయ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి. న్యాయం జరగకపోతే కోర్టుకు వెళతాం. చంపుకుంటూ పోతే కత్తులే మిగులుతాయి. సీఎం మా సహనాన్ని పరక్షించవద్దు' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. -
'మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం'
సాక్షి, నల్గొండ: పార్టీ మారుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడతానన్నారు. మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని వివరించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ పదివేలు మాత్రమేనని, ఆయనకు వచ్చిన ఓట్లు 60 వేలు అయితే సీఎంపై లక్ష ఓట్లతో మెజార్టీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి అబద్ధాల పుట్ట అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మానుకోవాలని కోమటిరెడ్డికి గుత్తా సూచించారు. కాగా టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కంచర్ల సోదరులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందుగానే కంచర్ల సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కంచర్ల సోదరులకు పార్టీలో గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ హమీ మేరకే కంచర్ల భూపాల్‌రెడ్డికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో సుఖేందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలోనే సభ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలే కళా శాలలు పెట్టి విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచైనా ఈ పథకం అమలు చేసేలా చూస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనను చూస్తుంటే తనకు నక్సలిజంలో చేరాలనిపిస్తోందని కోమటిరెడ్డి అదే సందర్భంగా లాబీల్లో వ్యాఖ్యానించారు. మంచి చేస్తారంటే మరో 20 సంవత్సరాలు అధికారం టీఆర్ఎస్కే రాసిస్తామని, వచ్చే నెలలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై భారీ బహిరంగ సభ లేదా ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అమల్లోకి తెచ్చిందనే అక్కసుతోనే ఈ పథకాన్ని టీఆర్ఎస్ నీరుగారుస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. -
ప్రజల నేత అంటే వైఎస్సారే
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం హోదాలో ఉండి కోదండరాం సర్పంచ్ కూడా కాలేదు అన్నాడు కేసీఆర్. మరి సర్పంచ్ కూడా కాని వాడిని జేఏసీ చైర్మన్‌గా ఎందుకు పెట్టినావు? ఉద్యమకాలంలో ఆయనను అందలం ఎక్కించావు. ఈరోజు అదే కోదండరాంని వాడు వీడు అని మాట్లాడి సీఎం హోదా పరువు తీశావు. కోదండరాం తప్పేమిటి? ప్రతి ఊరూ తిరిగిండాయన. కేసీఆర్ కంటే ఎక్కువ మీటింగులు పెట్టాడు. ఆయన రాజకీయ నేత కాకపోవచ్చు. కానీ తెలంగాణ అవసరాన్ని విప్పి చెప్పాడు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రతిపక్ష నేతలాగా ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజల కష్టాలను పట్టించుకున్న నిజమైన జననేత దివంగత సీఎం వైఎస్సారేనని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిరోజూ సచివాలయంలో ఉదయం 10 గంటలనుంచి గడియారం చూసుకుని మరీ పర్యవేక్షించిన అసలైన నేత వైఎస్సార్ అని ప్రశంసించారు. ఉదయం ఎనిమిదన్నర నుంచి తొమ్మిదన్నర వరకు రోజుకు 5 వేల మందిని కలుస్తూ వచ్చిన అరుదైన నాయకుడు వైఎస్సార్ కాగా, కేసీఆర్ ఈ మూడున్నరేళ్ల కాలంలో 500 మందిని కూడా కలిసి ఉండరని, తెలంగాణలో మళ్లీ గడీలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ ప్రజానుకూల పాలన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దరిదాపుల్లో కూడా నిలబడలేరని అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... తెలంగాణకోసం నాడు సాగించిన పోరాటంపై ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎవరైతేనేం.. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులు, రైతుల కష్టాలు ఇకనైనా తొలగిపోతాయి అని వ్యక్తిగతంగా చాలా సంతోషపడ్డాను. కానీ తెలంగాణకోసం పోరాడిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ సీఎంని నేరుగా కలవలేని పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. రెండేళ్లనుంచి కేసీఆర్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వాన్ని ఏర్పర్చిన కొత్తలో కేసీఆర్‌ని కలిశాను. దాదాపు 2 గంటలు మాట్లాడారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని, మరిన్ని అవసరాలను చెబితే అన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు అసెంబ్లీలో కనిపించి అభ్యర్థిస్తే స్పందనే లేదు. తర్వాత నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనుల కోసం వారం రోజులపాటు ప్రతిరోజూ ఫోన్ చేసినా కేసీఆర్ ఫోనెత్తలేదు. దీన్ని చెప్పాలంటేనే నాకు గలీజుగా అనిపిస్తోంది. కానీ ప్రజలకు వాస్తవం తెలపాలనే మీద్వారా, ‘సాక్షి’ ద్వారా చెబుతున్నాను. వారం తర్వాత నేను మళ్లీ ఫోన్ చేస్తే ‘మీతో మాట్లాడనని సీఎం చెప్పారండీ, మీరిక ఫోన్ చేయవద్దు’ అని సీఎం పేషీ నుంచి నాకు బదులిచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రతి దశ లోనూ కేసీఆర్‌తో మేం టచ్‌లో ఉండేవాళ్లం. అలాంటిది సీఎం అయ్యాక నాతో కలవడం, మాట్లాడటం ఆయనకు ఇష్టం లేదన్న సమాధానం విని చాలా బాధపడ్డాను. బాబుతో, వైఎస్సార్‌తో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. వైఎస్సార్‌తో అయితే ఎంత చిన్నా, పెద్ద విషయమైనా సరే ఫోన్లోనే మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడం అవమానమండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఎమ్మెల్యేగా మీముందు కూర్చుని ఇవ్వాళ ఇలా చెప్పుకోవడమే చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి చెప్పాలంటే మా తెలంగాణ పరువు మేం తీసుకుంటున్నట్లే అని చెప్పాలి. డీఎస్సీకి సంబంధించి దాదాపు వందసార్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రేపు నోటిఫికేషన్ తెస్తున్నాం అని సీఎం చెప్పి ఉంటారు. లక్షలమంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయంపై ఇన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉందా? నెలకు ఒక్కో విద్యార్థి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కూలి నాలి చేసుకుని ఒక పూట ఉపవాసముండి మరీ డబ్బు పంపిస్తుంటే డీఎస్సీ ఎప్పుడొస్తుందో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో పిల్లలు బాధపడుతున్నారు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్న యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై కూడా ప్రభుత్వం ఇంత మజాక్ చేసుకుంటోందే? వాళ్ల జీవితాల్తో ఆడుకోవడం కాదా ఇది. సింగరేణి ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదని సీఎం అన్నారే? సింగరేణి ఎన్నికలలో ప్రభుత్వం ఏం పొడిచినట్లు? గెలిచిన అధికార పార్టీ సంఘానికి, ఓడిపోయిన యూనియన్లకు మధ్య తేడా కేవలం 3 వేల ఓట్లు. ఫలితం ఏమిటో అక్కడే తేలిపోలేదా. అది గెలుపు కాదు. సింగరేణినే మీకు రాసిస్తానని చెప్పారు కేసీఆర్. మామూలు వాగ్దానాలు కాదు. మీ ఖాతాలో రేపే డబ్బులు అంటూ ప్రలోభ పెట్టారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 16 శాతం ఉంటే దాన్ని 25 శాతంకి పెంచారు. ఇన్ని రోజులు చేయనిది ఎన్నికలు కాబట్టి పెంచారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు అడ్డుకుంది కాబట్టి కారుణ్య ఉద్యోగాలను ఇస్తానని మాట మార్చారు. అన్నీ చేస్తాననడమే కానీ చేసిందెప్పుడు. గనికార్మికుల యూనియన్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యతను ఇచ్చిన సీఎంని నా జీవితంలోనే చూడలేదు. వైఎస్సార్, కేసీఆర్ పాలనను ఎలా పోలుస్తారు? పోలికే లేదు. పోలికలు కాదుకదా.. వైఎస్సార్ దరిదాపులకు కూడా రాలేడు కేసీఆర్. వైఎస్ జలయజ్ఞంపై కొన్ని పత్రికలు ఆరోజు ఏవేవో ఆరోపణలు చేశాయి కానీ ఈరోజు కేసీఆర్ చేస్తున్న అవకతవక పనులను ఏ పత్రిక కూడా ప్రస్తావించడం లేదు. ప్రజల ముఖం చూడటానికి కూడా ఇష్టపడని సీఎంని ఇప్పుడే చూస్తున్నాం. సెక్రటేరియట్‌కు రాని సీఎంని గతంలో ఎన్నడూ చూడలేదు. అదే వైఎస్సార్ ఉంటే జిల్లాల్లో లేకుంటే సెక్రటేరియట్లో ఉండేవారు. ఉదయం 8.30 నుంచి 9.30కి ఇంటివద్ద సామాన్య ప్రజలను కలిసేవారు. ప్రజలు ఎవరైనా వెళ్లి ఆయనతో చెప్పుకోవచ్చు. వారి సమస్యలపై ప్రత్యేక కార్యదర్శులను పెట్టి వెంటనే సమాధానం పంపేవారు. వారం రోజుల్లో పరిష్కారం చేసేవారు. 9.30 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో జనంని కలిసేవారు. నాయకులం మేం వెళ్లి కలిసినా వాట్ సార్, ఏంటి విషయం అని పరామర్శించేవారు. వైఎస్ ప్రజలను పరామర్శించే తీరే వేరు. చంద్రబాబుకు, వైఎస్సార్‌కు మధ్య తేడా ఏమిటి? ఏ సీఎంని కూడా రాజశేఖరరెడ్డితో పోల్చలేము. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే లేదు. 108 అంబులెన్స్ పథకం అమెరికాలో ఉండేది. దాన్ని మొదటగా ఏపీలో తీసుకొచ్చింది వైఎస్సార్. తర్వాత కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేశాయి. ఇలాంటి పథకాలు పేదవాళ్లకు ఎప్పటికయినా వస్తాయా అని అనుకునేవారు. పేదవాళ్లకు గుండెజబ్బు వస్తే రెండు లక్షల రూపాయలు వైద్యానికి చెల్లించడం అసాధ్యం. చావు తప్ప వారికి మరో మార్గం ఉండేది కాదు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఎవరైనా సరే గుండె జబ్బు అంటే తెలిసి తెలిసీ చనిపోయేవారే తప్ప వైద్యం అందుబాటులో ఉండేది కాదు. కూలీ చేసుకునేటోడు హైదరాబాద్‌కు పోయి ఆపరేషన్ చేసుకోలేడు. ఎవరూ వాడికి అప్పివ్వరు. అలాంటివారికి ఆరోగ్యశ్రీ కార్డు చూపి, వాళ్లే తీసుకువచ్చి, ఆపరేషన్ చేసి, తర్వాత ఆరునెలల వరకు మందులు కూడా వాళ్లే ఇచ్చి ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే వాహనంలో తీసుకెళ్లి దింపేవారు. పదిలక్షల మంది పేదవాళ్లను బతికించాడు వైఎస్సార్. అలాంటి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వాళ నీరుగారిపోయింది. ఓటుకు కోట్లు కేసు వ్యవహారంపై మీ అభిప్రాయం? పరిటాల రవి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లి బాబును కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక ఓటుకు కోట్లు కేసు విషయం ఏమిటి? దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ విషయంలో ఇద్దరు సీఎంలూ రాజీ పడిపోయినట్లే. ఇద్దరికి ఎక్కడో అవగాహన కుదిరినట్లే ఉంది. (కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/HekhpK https://goo.gl/ifzwgQ -
కుంతియాకు ఆ అధికారం లేదు..
నల్లగొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకెళ్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా వ్యాఖ్యలతో కోమటిరెడ్డి సోదరులు విభేదించారు. 2019వరకూ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొనసాగుతారని చెప్పే అధికారం కుంతియాకు లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై త్వరలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలుస్తామన్నారు. యువకుల నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకు వెళుతుందని కోమటిరెడ్డి సోదరులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా వచ్చి చెప్పినంత మాత్రాన అయ్యేదేమీలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కార్యకర్తలు, జనాలకు దగ్గరగా ఉండే నాయకుల నాయకత్వం కోరుకుంటున్నారని పరోక్షంగా పీసీసీ నాయకత్వ మార్పు మాట్లాడారు. తొందర్లోనే రాహుల్, సోనియా గాంధీలను కలిసే అవకాశముందని, కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు. త్వరలోనే యువరక్తం ఉన్న నాయకుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం మూడున్నరేళ్లుగా భర్తీ చేయలేని ఉద్యోగాలను ఒక్క ఏడాదిలో ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే లక్ష ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిష్టానానిదే తుది నిర్ణయం తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. 2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని అనే అధికారం కుంతియాకు లేదని, ఆ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. హైకమాండ్‌కు ప్రస్తుత నాయకత్వం నచ్చకపోతే ఎన్నికల్లోగా మార్చవచ్చునని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక నయీంను చంపి వంద నయీమ్‌లను సృష్టించాడని ఆరోపించారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే భువనగిరి నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. -
కేసీఆర్ సమయం ఇవ్వడం లేదు: కోమటిరెడ్డి
నల్లగొండ: ఎంపీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజుకు 2 వేల మంది ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వినేవారని గుర్తు చేశారు. గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ తరచుగా భేటీ కావడాన్నిఆయన తప్పుబట్టారు. వారానికి నాలుగుసార్లు గవర్నర్‌తో చర్చలు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. కుమారురు, కూతురుతో కలిసి తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఏపీ కాంట్రాక్టర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. -
గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధం: కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అక్కడ తాను విజయం కూడా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ మండలం కొత్తపల్లిలో ఆదివారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారని, ఈ విషయం ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే ఇంతటి మోసకారి సీఎం లేరని మండిపడ్డారు. టీఆర్ఎస్ బహిరంగ సభకు రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
-
కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ మారినవారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కోమటిరెడ్డి సవాల్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతారని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 31 కాదు 131 జిల్లాలు చేసినా టీఆర్ఎస్కు ఓటమి తప్పదని అన్నారు. కేసీఆర్‌కు ఎందుకు ఓట్లు వేయాలని, రుణమాఫీ చేయనందుకా, ఆరోగ్యశ్రీని పట్టించుకోనందుకా అని ప్రశ్నించారు. -
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌ది హత్యా?
- అతన్ని చంపించింది నేనే.. - డబ్బులివ్వకుంటే నీ కొడుకునూ చంపిస్తా - వ్యాపారి నాగేందర్‌ను బెదిరించిన నయీమ్ - 2011లో ఔటర్‌పై ‘ప్రమాదం’లో మరణించిన ప్రతీక్ సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి చనిపోయింది రోడ్డు ప్రమాదంలో కాదా? గ్యాంగ్‌స్టర్ నయీమే అతన్ని హత్య చేయించాడా? అది హత్యేనని, తానే చేయించానని నయీమే తనతో స్వయంగా చెప్పాడని వ్యాపారి గంపా నాగేందర్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. తన కొడుకునూ అలాగే చంపుతానంటూ నయీమ్ బెదిరించాడని అందులో నాగేందర్ పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది...? కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు. అతనితోపాటు స్నేహితులైన సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ప్రమాదమేనని, పటాన్చెరు వైపు వస్తుండగా గొర్రెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పిందని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. సర్వీసు రోడ్డు పక్కనున్న మట్టి, రాళ్ల కుప్పను ఢీకొని కారు ఎగిరిపడిందని తేల్చారు. ప్రతీక్ మృతదేహం రోడ్డుకు 20 అడుగుల దూరంలో పడింది. ఇది రోడ్డు ప్రమాదంగానే పోలీసు రికార్డుల్లో ఉండిపోయింది. అయితే ప్రతీక్‌ను తానే చంపించానని నయీమే స్వయంగా చెప్పాడని నాగేందర్ తాజాగా ఆగస్టు 17న భువనగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘గత మార్చి 18న నయీమ్ అనుచరులు నన్ను నయీమ్ వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీమ్ నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించారు. పోలీసులు మాత్రం కేవలం నయీమ్ బెదిరింపుల కోసం చెప్పిన మాటల ఆధారంగా దీనిపై ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు. అయితే ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీమ్ తనను బెదిరించాడని వెంకట్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. -
కేసీఆర్ తప్పు చేశారు: కోమటిరెడ్డి
నల్లగొండ: ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఫైర్ అయ్యారు. పుష్కరాల తర్వాత రాజీనామా చేస్తానని గుత్తా చెప్పడం అభినందనీయం అని కోమటిరెడ్డి అన్నారు. గుత్తా తిరిగి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదన్నారు. పుష్కరాల తర్వాత కాంగ్రెస్‌కు మంచి రోజులు రానున్నాయన్నారు. ఐరన్‌లెగ్ లాంటి గుత్తాను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని కోమటి రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి
నల్లగొండ రూరల్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని కొందరు.. టీఆర్ఎస్లో చేరుతున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అవాస్తవమన్నారు. కోమటిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని చెప్పి.. పలువురు ప్రజాప్రతినిధులను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీని వీడిన వారిని పట్టించుకోవద్దన్నారు. -
'ఎన్నికలొస్తే ఇద్దరు తప్ప ఎవరూ గెలవలేరు'
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై, అధికార పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు చేశారు. నల్లగొండ పట్టణంలో స్థానిక మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికలొస్తే రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్ప ఎవరూ గెలవలేరంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గెలుస్తారని వెంకట్ రెడ్డి చెప్పిన వారి పేర్లలో కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం విదితమే. -
నీ వల్లే పార్టీ ఓడిపోయింది.....
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ కమిటీ హాల్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కోమటిరెడ్డి ...పొన్నాలతో వాగ్వివాదానికి దిగారు. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన పొన్నాల అధ్యక్షత వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైందని కోమటిరెడ్డి విమర్శించారు. ఓటమికి బాధ్యత వహించి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పొన్నాల సమావేశానికి అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించారు. పదవికి పొన్నాల ఇంకా రాజీనామా చేయకపోవటం సరికాదని అన్నారు. ఓడిపోయిన వ్యక్తి సీఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించడమేంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఓటమికి పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలదే బాధ్యత అని ఆరోపించారు. గెలిచే సత్తాలేని వారికి టికెట్లు ఇచ్చి పార్టీని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇచ్చిన హామీలు నెరవేరుస్తా
- త్వరలో కేసీఆర్‌తో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన - పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా - నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ధ్యేయం - నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్, పదిహేనేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు.. ఈ ఐదేళ్ల కాలంలో చేసే అభివృద్ధి మరో ఎత్తు.. అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేసి నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. శనివారం పట్టణం లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలుత నల్లగొండ జిల్లా కేంద్రానికి తీసుకవచ్చి మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు. రేయింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తన చిరకాల వాంఛ అయిన శ్రీశైలం సొరంగమార్గంతో పాటు బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. శ్రీశైలం సొరంగ మార్గానికి గతంలోనే *2వేల కోట్లు మంజూరు చేయించానని, పనులు పూర్తి చేయించి, సాగునీరు అందిస్తానని చెప్పారు. నీరు వస్తేనే రైతులు బాగుంటారు. కూలీలు అభివృద్ధి చెందుతారన్నారు. ఎవరూ ముఖ్యమంత్రిగా ఉన్నా మనం గౌరవించాలని ప్రజా తీర్పును తప్పకుండా గౌరవిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనూ నల్లగొండ నియోజకవర్గాన్ని మోడల్ సీటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే నల్లగొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం 32 కోట్లు మంజూరుకు సచివాలయంలో అధికారులతో మాట్లాడనని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్న వారు తన ఇంటికి వస్తే అండగా ఉంటానన్నారు. త్వరలోనే నల్లగొండ పట్టణ శివారులో పేదలకు 5వేల ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర సమీపంలో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. నల్లగొండ శాసనసభ్యుడిగా మరోమారు గెలిపించిన నియోజకవర్గం ప్రజల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ 1000, 1500, భువనగిరిలో తన సోదరుడు రాజగోపాల్క్షరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం బాధకలిగించిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని కవిత, కేశాని కవిత, బొడ్డుపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా
నల్లగొండ, న్యూస్‌లైన్, నల్లగొండ జిల్లాను మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తాం..హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో మేకల అభినవ్స్టేడియంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జయభేరి సభలో ప్రసగించారు. సభకు భువనగిరి, నల్లగొండ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశానికి ముందు బ్రదర్స్ ఇద్దరు వారి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి వారు ప్రసగించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాటుపతానని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అదే విధంగా బ్రాహ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందేలా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలి చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. ప్రజా సేవయే పరమావధిగా భావించి రేయింబవళ్లు వారి శ్రే యస్సు కోసం పాటుపడుతున్నానన్నారు. ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తెలంగాణలోనే అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిం చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు : ఎంపీ గుత్తా ఈ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎంపీ సుఖేందర్‌రెడ్డి తెలిపా రు. అభ్యర్థులు ఎవరో తెలియని వారికి కేసీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చాడన్నారు. ఉద్యమకారులకు కాకుండా తెలంగాణ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ మునుగోడు అభ్యర్థి పల్లావెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, డీసీసీ ధ్యక్షడు తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు కోరారు. సమావేశానికి వీరితో పాటు భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అద్దంకి దయాకర్, తండు శ్రీని వాస్‌గౌడ్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ,మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, గుమ్ముల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కోమటిరెడ్డీ భీ జానా హై
-
పింఛన్ పెంపునకు కృషి చేస్తా
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వికలాంగులందరికీ రూ వెయ్యి నుంచి రూ 1500 వరకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాదేనని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వికలాంగుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా వికలాంగులు ఉన్నారని తెలిపారు. వీరిలో కొందరికి పుట్టుకతో వికలత్వం రాగా మరికొందరికి ఫ్లోరైడ్ నీటిని తాగి వైకల్యం వచ్చిందన్నారు. వీరందరికీ పింఛన్ పెంచే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. వికలాంగులమని అధైర్యపడవద్దని, ఆత్మస్థైయిర్యంతో ముందుకుసాగాలని సూచించారు. ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వికలాంగులందరికీ వారం రోజుల్లో ట్రైసైకిళ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాలలోని వికలాంగుల జాబితాను ఎంపీడీఓలకు అందజేయాలని సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేశారు. వికలాంగుల శాఖ ఏడీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు వెంకన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఏడీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి.బి. శైలజ, ఏపీఎం వినోద, ఏపీఓ శ్రీలత, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా కన్వీనర్ పనస శంకర్‌గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, వెంకటరెడ్డి పాల్గొన్నారు.