
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సంకల్ప యాత్ర పేరుతో బోథ్ నుం చి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సుద్దాల రాజేశ్వర్, సీనియర్ నాయకుడు గంగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దా దాపు 320 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బుధవారం గాం«దీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేయస్సు కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment