Tramping
-
శవాన్ని బూటుకాళ్లతో తొక్కిన పోలీస్
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు. -
కోమటిరెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి కోసం..
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు. సంకల్ప యాత్ర పేరుతో బోథ్ నుం చి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సుద్దాల రాజేశ్వర్, సీనియర్ నాయకుడు గంగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దా దాపు 320 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బుధవారం గాం«దీభవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ శ్రేయస్సు కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. -
రెడ్డి పోరుయాత్ర.. ఉద్రిక్తత
హైదరాబాద్: శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆందోళనలకు కారణమయ్యారని రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, అధ్యక్షుడు ఏనుగు సంతోశ్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేసి, రెడ్డిలను హింసించిన బాలానగర్ డీసీపీ సాయిశేఖర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, పేదలను ఆదుకోవడానికి కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లతో పది రోజులుగా ఉత్తర తెలంగాణలో సాగిన రెడ్డి ఐక్యవేదిక పోరుయాత్ర (పాదయాత్ర) మేడ్చల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నుంచి ప్రారంభమయిన యాత్ర బుధవారం రాత్రి పాదయాత్ర ద్వారా మేడ్చల్ మండలానికి చేరుకుంది. అత్వెల్లి పరిధిలోని శివాలయంలో రాత్రి బసచేశారు. గురువారం ఉదయం అత్వెల్లి నుంచి ప్రారంభమై, కొంపల్లిలో బహిరంగ సభతో ముగించాలని నేతలు ముందస్తుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అక్కడి శివాలయం ఆవరణలో దాదాపు 10 వేల మందికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. అంతమంది రావడంపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కొందరు రెడ్డి ఐక్యవేదిక నాయకులను అరెస్ట్ చేసి శివార్లలోని స్టేషన్లకు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇదే సమయంలో రాంరెడ్డి, సంతోశ్రెడ్డిలు సంఘం నేతలతో కలసి అత్వెల్లి నుండి పాదయాత్ర ప్రారంభించారు. వారు జాతీయ రహదారిపై సెయింట్ క్లారెట్ పాఠశాల వద్దకు రాగానే వారిని పోలీసులు అరెస్ట్ చేసి రింగురోడ్డు మీదుగా దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో సభ్యులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య వచ్చి ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోవడంతో పోలీస్‌లు గుంపులను చెదరగొట్టారు. పలువురికి గాయాలయ్యాయి. అనంతరం రాంరెడ్డి, సంతోశ్రెడ్డిలు మాట్లాడుతూ.. తాము పోలీసుల అనుమతితోనే పాదయాత్ర చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన యాత్ర మేడ్చల్‌లో పోలీసుల కారణంగా ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. -
గిరిజనులను విస్మరించి అభివృద్ధా?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 10 శాతం ఉన్న గిరిజనులను పట్టిం చుకోకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా గిరి జనుల జీవితాల్లో మార్పేమీలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పాదయాత్ర నుంచి సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహి రంగ లేఖను రాశారు. పోడుభూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు న్నారని మండి పడ్డారు. ప్రతి గిరిజన కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు నిత్యావసర వస్తువులను అందించి వారి జీవన ప్రమాణాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
ముచ్చర్ల టు సీఎం ఇంటికి..
♦ పాదయాత్రను ప్రారంభించిన తమ్మినేని వీరభద్రం ♦ ఫార్మాసిటీ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ ♦ 16 కి.మీ తర్వాత అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత ♦ ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట కందుకూరు : రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఫార్మాసిటీకి భూములు అప్పగించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీకి కేటాయించిన సర్వే నంబర్ 288లోని భూమికి సంబంధించిన సర్టిఫికెట్దారులు పరిహారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ముచ్చర్ల నుంచి సీఎం ఇంటి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిటీకి కేటాయించిన భూముల్లో 1992లో 221 మంది నిరుపేదలకు ఎకరా చొప్పున పట్టాలు, పాస్‌పుస్తకాలు ఇచ్చి, 1బీ రికార్డులో నమోదు చేశారన్నారు. అప్పటి నుంచి ఆ భూముల్నే నమ్ముకున్న వారికి న్యాయం చేయకుండా భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వడం అన్యాయమన్నారు. కందుకూరు, యాచారం, ఆమన్‌గల్ మండలాల పరిధిలో 12 వేల ఎకరాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముచ్చర్ల నుంచి దెబ్బడగూడ, కందుకూరు మీదుగా శ్రీశైలం రహదారిపైన రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ గుడి వరకు దాదాపు 16 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. పెద్దమ్మ గుడి వద్ద మధ్యాహ్న భోజనం ముగించుకుని సాయంత్రం తిరిగి సీపీఎం డివిజన్ కార్యదర్శి రాంచందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కందుకూరు, ఆదిబట్ల, మహేశ్వరం సీఐలు విజయ్‌కుమార్, అశోక్‌కుమార్, మన్మోహన్‌ల ఆధ్వర్యంలో పోలీసులు పాదయాత్ర చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కందుకూరు పీఎస్‌కు తరలించారు. పాదయాత్రకు టీడీపీ నాయకులు రాంచంద్రారెడ్డి, సత్తయ్య, ఎంపీటీసీ సభ్యులు నర్సింహ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య, డివిజన్ కార్యదర్శి డి.రాంచందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ మీనా, బి.కనకయ్య, దత్తునాయక్, కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్ మండలాల కార్యదర్శులు కుమార్, రవికుమార్, శంకర్, నాయకులు కృష్ణ, బి.శ్రీను, పి.జంగయ్య, వెంకటరమణ, పి.వెంకటయ్య, ఎన్.నర్సింహా, గౌర శ్రీశైలం, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
జలం కోసం కదిలిన జనం
రైవాడ నీటికోసం నిరసన పాదయాత్ర నాలుగో రోజు వికలాంగుల మద్దతు కృష్ణారాయుడుపేట(వేపాడ): రైవాడ జలాశయం నీటిని అదనపు ఆయకట్టుకు అందించాలని, పైపులైన్ నిర్మాణ ప్రతిపాదనలను శాశ్వతంగా విరమించుకోవాలన్న డిమాండ్లతో చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజు బుధవారం కొనసాగింది. రైవాడ జలాశయం సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో రైవాడ కాలువ వద్ద గ్రామపెద్దలు అలబోని పైడిబాబు, బోజంకి శ్రీనివాస్ నేతృత్వంలో అధికసంఖ్యలో మహిళలు కాళీబిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాగునీటి సాధన కమిటీ నాయకుడు వేచలపు వెంకట చినరామునాయుడు మాట్లాడుతూ తమ ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించాలని దశాబ్దాల కాలంగా ఆందోళన చేస్తున్నామని, జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.112 కోట్లతో పంట కాలువలు నిర్మించాలన్న డిమాండ్లతో పాదయాత్ర చేస్తున్నామన్నారు. పాదయాత్రకు మద్దతు పలికిన లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తక్షణమే అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలన్నారు. ధన కమిటీ సభ్యుడు చల్లా జగన్ మాట్లాడుతూ కాలువను ఆనుకున్న గ్రామాలతో పాటు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో చినగుడిపాల సర్పంచ్ శీరంరెడ్డి సింహాద్రప్పడు, కండిపల్లి పెదనాయుడు, గండి నాయనబాబు, మల్లునాయుడు, నెక్కల శ్రీను, బి.వెంకన్న, కన్నబాబు, సూర్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. జమ్మాదేవిపేటలో ప్రారంభమైన పాదయాత్ర ఆనందపురం, ఏకేజేపాలెం, కృష్ణారాయుడుపేట, పోతనవలస, ఉగ్గినవలస, ఆరైవై అగ్రహారం, కేజేపురం, ముషిడిపల్లి చేరుకుని రాత్రి బస చేశారు. చివరిరోజు పాదయాత్రనిర్వహించే గ్రామాలు: పాదయాత్ర చివరిరోజు గురువారం ఎల్.కోట మండ లం భూమిరెడ్డి పాలెంలో ప్రారంభమై గవరపాలెం, దాలివలస, కేకే అగ్రహారం, వారాడ, సంతపాలెం, మీదుగా ఆనందపురం కూడలికి చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ జరగనుంది. -
ఎంఆర్పీఎస్ ఆందోళన భగ్నం
జిల్లా వ్యాప్తంగా కట్టడి చేసిన పోలీసులు సంగారెడ్డి జోన్: ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలో తల పెట్టిన పాదయాత్ర, ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో దళితులు దేవాలయంలోకి రాకుం డా కంచె వేసిన సర్పంచ్, ఇతరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం ఉదయమే సంగారెడ్డి ఐబీకి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. సంగారెడ్డిలో కేవీపీఎస్ నాయకుడు అడివయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సడాకుల కృష్ణ, నవాజ్‌లను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామ దళితులు సంగారెడ్డికి వస్తున్న క్రమంలో పెద్దాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జోగిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో కూడా పాదయాత్రకు వస్తున్న నాయకులను కట్టడిచేశారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న నాయకులను సంగారెడ్డిలోని ఐబీకి తీసుకువచ్చారు. మందకృష్ణ మాదిగతో పాటు నేతలతో జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న చర్చలు జరిపారు. ఎల్లారం గ్రామంలో దళితులకు న్యాయంచేయాలని, సర్పంచ్‌ను అరెస్ట్ చేయాలని మందకృష్ణ మాదిగ తదితరులు ఎఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా మరో వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఎఎస్పీ హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళన విరమించారు. దోషుల్ని వదిలి మమ్మల్ని అరెస్టా! సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: దళితులను అవమానించిన వారిని అరెస్టు చేయకుండా... న్యాయం చేయాలని కోరిన దళిత నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని మంద కృష్ణమాదిగ పోలీసులను ప్రశ్నించారు. దళితులను అవమానించినందుకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ఎస్పీ కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేసి, ఆందోళన చేపట్టిన నాయకులను అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహించారు. మందకృష్ణ మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే తాను ఎల్లారం వెళ్లి, ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసినప్పుడు... నిందితులను వారంలో అరెస్టు చేస్తామని చెప్పారన్నారు. పది రోజులు దాటినా వారిని పట్టుకోలేదని... అందుకు నిరసనగానే కేవీపీఎస్, ఎంఆర్పీఎస్, సీపీఎం ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన చేపట్టామన్నారు. నిందితులను వదిలేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. కాగా, కేసు దర్యాప్తులో ఉందని, వారంలో నిందితులపై చర్యలు తీసుకొంటామని ఏఎస్పీ వెంకన్న హామీ ఇచ్చారు. దీంతో ఎస్పీ కార్యాలయ ముట్టడిని ఈ నెల 21కి వాయిదా వేసినట్టు మందకృష్ణ తెలిపారు. -
బీజేపీ పాదయాత్ర ఉద్రిక్తం
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి డిమాండ్‌తో మహా పాదయాత్ర - అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే నేతల బైఠాయింపు - పోలీసులు, కార్యకర్తల తోపులాట... - నేతల అరెస్టు హన్మకొండ: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలుత బీజేపీ నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్, మరికొందరు నేతలు కంతనపల్లి ప్రాజెక్టు వద్ద మహా పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర ఏటూరునాగారం మండలం ఏటూరు గ్రామం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకొన్నారు. ఈ పాదయాత్రకు అనుమతి లేదని, భద్రతా కారణాల రీత్యా దానిని నిలిపేయాలని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించారు. ఈ సమయంలో కిషన్‌రెడ్డిని, పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కార్యకర్తలను దాటుకుని నేతలను ఏటూరునాగారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరాశ, నిస్పృహల్లో ప్రజలు: కిషన్‌రెడ్డి కేసీఆర్ పాలనతో ప్రజలు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 69 ఏళ్ల కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సాగు, తాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బుధవారం ఒకే రోజు 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. -
గిదేం ఊరు.. గిట్లయితే బాగలేదు..!
- ఇండ్ల మధ్యనే జిల్లేడు చెట్లు.. - పొదలు, చెత్తా చెదారం.. - ఇదేం బాగలేదు.. - వెంటనే మార్చేద్దాం - అంతా కలిసి నడుద్దాం - వీధులన్నీ చుట్టి..గ్రామస్తులతో ముచ్చటించిన సీఎం - ఎర్రవల్లిలో సీఎం పాదయాత్ర - రూపు రేఖలు మారుస్తానంటూ హామీ - గ్రామస్తుల హామీ తీసుకున్న ముఖ్యమంత్రి గజ్వేల్/జగదేవ్‌పూర్: ఏమ్మా మరుగుదొడ్డి కట్టుకున్నారా... ఈ మురుగంతా ఏందీ..ఈ చెత్త గిట్లనే ఉంటదా..రోడ్డు పక్కన పాతబావి ఏందీ..ఇండ్ల మధ్య జిల్లేడు చెట్లు మంచిది కాదు..చాలా పాత ఇళ్లు.. పెంకుటిళ్లు ఉన్నట్టు ఉన్నయ్.. గీ ఇండ్లల్ల ఎవరూ ఉండరా.. ఇండ్ల మధ్య పెంటకుప్పులేందీ.. ఈ చెత్తా చెదారమేందీ...ఏమయ్యా గీ ఇల్లు నీదేనా.. ఈ గుడిసే మీదేనా..అందరికి ఇండ్లు కట్టిస్తాం..ఊర్లో ఎటు చూసినా.. ఏమూలన చూసినా పాత, కూలిపోయిన ఇండ్లే కనిపిస్తున్నాయ్.. గిదేం ఊరు.. గిట్లయితే బాగుండదు.. అంతా మార్చేద్దాం..అనే సంభాషణల మధ్య సీఎం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ పర్యటన కొనసాగింది. బుధవారం సాయంత్రం ఎర్రవల్లి గ్రామ సమీపంలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గురువారం ఉదయం గ్రామజ్యోతిలో భాగంగా పక్కనే ఉన్న ఎర్రవల్లి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఉదయం 10.50 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 2.30 గంటలకు ముగిసింది. స్థానిక వాటర్ ట్యాంకు వద్దకు సీఎం కేసీఆర్ 10.50 నిమిషాలకు చేరుకున్నారు. గ్రామానికి చెందిన మహిళలు సీఎం కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికి, తిలకం దిద్దారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న నారిని లక్ష్మీనర్సు ఇంట్లోకి వెళ్లి మరుగుదొడ్డిని పరిశీలించారు. అలాగే చింతకాయల రాజవ్వ ఇంటికెళ్లి రాజ వ్వతో మాట్లాడారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్నా మురుగు గుంతల ను పరిశీలించారు. పక్కనే ఉన్న సర్పంచ్ భాగ్య, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డితో ఇండ్ల మధ్య ఈ మురుగేంది అని ప్రశ్నించారు. వెంటనే మురుగును తొలగించాలని ఆదేశించారు. అలానే ముందుకెళ్లి నూతనంగా నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవనాన్ని పరిశీలించి, తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి అవుసుల నర్సింహా చారి, యాదగిరి ఇంటి వెనుకకు వెళ్లి అక్కడే ఉన్న మరుగుదొడ్డిని పరిశీలించారు. అదే రోడ్డున అంబేద్కర్ చౌరస్తా వెళ్లే దారి వద్దకు వచ్చారు. కొంత ముందుకు వచ్చి ఓ పాత ఇల్లు ఉన్న గల్లీలోకి వెళ్లారు. అక్కడ కూలిన ఇల్లును చూసి ఇండ్ల మధ్య ఇలాంటి కూలిన ఇండ్లు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. గ్రామానికి చెందిన తుమ్మ కృష్ణ ఈ స్థలం యూత్ భవనం కోసం ఇస్తున్నాం సారూ.. అంటూ వివరాలు సీఎంకు చెప్పారు. అలాగే రోడ్డు పక్కన్నే ఉన్న పాడుబడ్డ చేదబావి దగ్గరకు వెళ్లి తొంగి చూశారు. అటు నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి సర్పంచ్ భర్త బాల్‌రాజుతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయించారు. అనంతరం గ్రామజ్యోతి సభ కార్యక్రమానికి వెళుతూ దళిత కాలనీ ఎక్కడా అంటూ పక్కనే ఉన్నా ‘గడా’ ఓఎస్ డీ హన్మంతరావును ఆడిగారు. దళిత కాలనీని కూడా చూద్దామంటూ కాలనీలోకి ఆడుగుపెట్టారు. మొండి భిక్షపతి ఇంటి వెనుక నుంచి పెంకుటిళ్లను చూస్తు ముందుకు వెళ్లారు. మరుగుదొడ్డిని పరిశీలించారు. సైద నర్సయ్య ఇంటి దగ్గరకు రాగానే కూలిపోయిన ఇల్లు కనిపిం చింది. వెంటనే సీఎం కేసీఆర్ ఈ ఇల్లు ఎవరిదీ.. అం టూ ఆరా తీశారు. సైద నర్సయ్యను పిలిచి ఇల్లు ఉందా అని ఆడిగారు. యాదయ్య లేదనగానే.. ఎక్కడుంటున్నవ్ అని ఆడగడంతో రేకు ల ఇంట్లో ఉంటున్నా అంటూ చెప్పారు. దళిత కాలనీ అంతా కలియతిరుగుతూ కనిపించిన వారినల్లా పలకరించారు. మల్లని యాదయ్య, నాగమణి దంపతులు ఉంటున్న గుడిసెను చూసి మీదేనా గుడిసె.. మీకు ఇల్లు కట్టిస్తా అంటూ హామీ ఇచ్చారు. రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెను ప్రత్యేకంగా పరిశీలించారు. ఇండ్ల బయటకు వెళ్లి సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. ఇండ్ల మధ్య గీ చెత్తాచెదారం ఎందీ.. అంటూ పక్కనే ఉన్న గడా అధికారి హన్మంతరావును, బాల్‌రాజు, కిష్టారెడ్డిని ప్రశ్నించారు. ఇదంతా తీసేయాలి.. నిన్నమొన్న గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏంచేశారు. అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మళ్లీ బీటీ రెడ్డెక్కి బీసీ కాలనీలోకి ప్రవేశించారు. రోడ్డుపై నిలబడి కాలనీల సంగతులు తెలుసుకున్నారు. వాటర్‌ట్యాంకు దగ్గరకొచ్చి నిన్నమొన్న వేశారా అంటూ సీసీ రోడ్ల గురించి గడా ఓఎస్డీని ఆడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి పాఠశాల నూతన భవనాల పనుల వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. సీఎం నాటేందుకు ఏర్పాటు చేసిన మొక్కలను చూసి నాటకుండానే ముందుకుసాగారు. హనుమాన్ గుడి దగ్గర పాడుబడ్డ ఇండ్లను చూసి ఇండ్లల్లో ఎవరూ ఉంటలేరా అయితే గ్రామానికి ఏదైనా అవసరం ఉంటది జాగా అడగండి అంటూ సర్పంచ్ భర్త బాల్రాజును అదేశించారు. అక్కడి నుంచి 12.30 గంటలకు గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. జేసీ వెంకట్రామిరెడ్డి, స్థానిక సర్పంచ్ భాగ్య, ఎంపీటీసీ భాగ్యమ్మ, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీపీ రేణుక, గడా అధికారి హన్మంతరావు, జహంగీర్, రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి సీఎంతో కలిసి లోపలకు వెళ్లారు. సీఎం అక్కడ నిమ్మరసం తగారు. అనంతరం గంటకు పైగా గ్రామాభివృద్ధిపై చర్చించారు. గ్రామంలో ఎంత మందికి ఇండ్లు లేవు, కూలిపొయిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి..ఊరి బయట ఎంత మంది ఉంటున్నారు అనే విషయాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు అధికారులను పిలవగా ఎవరూ లేరు. దీంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 1.45 గంటలకు గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొని 43 నిమిషాలు మాట్లాడారు. మళ్లీ రేపు వచ్చి శ్రమదానం చేస్తా..అందరం కలిసి భోజనం చేద్దామంటూ వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. -
రైతు సమస్యలపై పాదయాత్ర
ధార్వాడ నుంచి బెళగావి వరకు హెచ్.డి.కుమారస్వామి సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో బాగంగా ధార్వాడ నుంచి బెళగావి వరకు జేడీఎస్ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26న ధార్వాడ నుంచి పాదయాత్ర ప్రారంభమై 29న ఉదయం బెళగావిలో ముగుస్తుందని తెలిపారు. అంతేకాకుండా అదేరోజు అక్కడ నిర్వహించే బృహత్ సమావేశంలో వేలాదిమంది రైతులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. 80 కిలోమీటర్ల పాటు సాగే ఈ పాదయాత్రలో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు సామాజిక వేత్తలు కూడా పాల్గొంటారన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో చెరుకు, పట్టు, దానిమ్మ, ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. సరైన మా ర్కెటింగ్ సదుపాయాలు లేక పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఏడాదినుంచి చక్కెర కర్మాగాయార యాజమాన్యం చెరుకు రైతులకు బకాయిలను చెల్లించ డం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చక్కెర కర్మాగారాలు రైతులకు దాదాపు రూ.4,600 కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా కుమార స్వామి తెలిపారు. ఇక చైనా నుంచి పట్టును దిగుమతి చేసుకుంటుండటంతో స్థానిక పట్టు రైతులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవసా య మార్కెటింగ్ కమిషన్ ఆశించిన ఫలితాలను ఇవ్వ డం లేదని అన్నారు. అందువల్లే రాష్ట్రంలోని రైతులందరూ ఇబ్బం దులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ , ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సం క్షేమం పట్ల నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ప్రభుత్వమే అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు పెదవి విప్ప డం లేదు.’ అని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వస్తున్నాడు
11న హైదరాబాద్‌కు రాహుల్ 12న నిర్మల్‌లో 15 కిలోమీటర్ల పాదయాత్ర ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12న ఉదయం 15 కి.మీ కాలినడకన తిరగనున్నారు. పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా రాష్ట్ర నేతలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి.. కొంత ఆర్థిక సాయం అందించనున్నారు. రైతుల్లో భరోసాను కల్పించడానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో 12వ తేదీన ఉదయం 15 కిలోమీటర్లు కాలినడకన తిరగనున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన ఏర్పాట్లపై చర్చించడానికి టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీ గాంధీభవన్‌లో మంగళవారం సమావేశమైంది. ఈ పర్యటన సందర్భంగా పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ‘రైతు ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్రలో ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనేలా చూడాలని, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను విభజించుకోవాలని నిర్ణయించారు. పర్యటన వివరాలివీ.. 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు చేరుకుని.. బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవన్లో బస చేస్తారు. 12వ తేదీన ఉదయం 5.30కు హైదరాబాద్ నుంచి వాహనాల్లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు బయలుదేరుతారు. ఉదయం 9 గంటల సమయంలో ఆ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం వడ్యాల గ్రామానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. వడ్యాల నుంచి రాచాపూర్, పొట్టుపల్లి, లక్ష్మణచాంద మీదుగా కొరటికల్ గ్రామానికి చేరుకుంటారు. ఈ గ్రామాల్లో ఏడు రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించనున్నారు. పాదయాత్రలో చివరి గ్రామమైన కొరటికల్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు. అదేరోజున రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 13న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళతారు. పార్టీ నేతలు, ఇతర ముఖ్యులు ఎవరైనా రాహుల్‌గాంధీని కలవాలనుకుంటే 11వ తేదీన సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల దాకా అవకాశం ఉన్నట్టుగా టీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ముఖ్యనేతలు డి.శ్రీనివాస్, దామోదర, జె.గీ తారెడ్డి, శ్రీధర్‌బాబు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు వారాల్లో మరో పర్యటన.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇష్టాగోష్టి, తెలంగాణ ప్రొఫెసర్లతో చర్చలు, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ ముందుగా నిర్ణయం తీసుకున్నారని.. అయితే వాటికోసం మరో పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించారని టీ పీసీసీ నేతలు తెలిపారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే అందరి దృష్టి అటువైపు మళ్లే అవకాశం ఉంటుందని రాహుల్ భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల మరో రెండు వారాల్లోనే రాహుల్ మరోసారి హైదరాబాద్‌లో పర్యటించే అవకాశముందని పేర్కొన్నారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలి సంక్షోభంలో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టీ పీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మా జీమంత్రి డి.శ్రీధర్‌బాబు, నేతలు భిక్షమయ్యగౌడ్, మాదు సత్యం అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు వి లేకరులతో మాట్లాడారు. సాగర్‌లో జరిగిన టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో రైతులు, వ్యవసాయం సంక్షోభం, ఆత్మహత్యలను ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.