గిరిజనులను విస్మరించి అభివృద్ధా?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 10 శాతం ఉన్న గిరిజనులను పట్టిం చుకోకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా గిరి జనుల జీవితాల్లో మార్పేమీలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పాదయాత్ర నుంచి సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహి రంగ లేఖను రాశారు. పోడుభూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు న్నారని మండి పడ్డారు. ప్రతి గిరిజన కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు నిత్యావసర వస్తువులను అందించి వారి జీవన ప్రమాణాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.