
సాక్షి, సూర్యాపేట: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా తలొగ్గారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి.. ఇదే విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పంచాయితీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని తెలిపారు.
కేంద్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సిద్దమేనని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సమాన దూరంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఉందన్నారు. రాష్ట్రంలో సామాజిక శక్తులు వామపక్ష పార్టీలుతో పొత్తుకు సిద్ధమని.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని వీరభద్రం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment