రైతు సమస్యలపై పాదయాత్ర
ధార్వాడ నుంచి బెళగావి వరకు
హెచ్.డి.కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో బాగంగా ధార్వాడ నుంచి బెళగావి వరకు జేడీఎస్ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు హెచ్.డీ కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26న ధార్వాడ నుంచి పాదయాత్ర ప్రారంభమై 29న ఉదయం బెళగావిలో ముగుస్తుందని తెలిపారు. అంతేకాకుండా అదేరోజు అక్కడ నిర్వహించే బృహత్ సమావేశంలో వేలాదిమంది రైతులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. 80 కిలోమీటర్ల పాటు సాగే ఈ పాదయాత్రలో జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు సామాజిక వేత్తలు కూడా పాల్గొంటారన్నారు.
రైతుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో చెరుకు, పట్టు, దానిమ్మ, ద్రాక్ష రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. సరైన మా ర్కెటింగ్ సదుపాయాలు లేక పోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 ఏడాదినుంచి చక్కెర కర్మాగాయార యాజమాన్యం చెరుకు రైతులకు బకాయిలను చెల్లించ డం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చక్కెర కర్మాగారాలు రైతులకు దాదాపు రూ.4,600 కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా కుమార స్వామి తెలిపారు.
ఇక చైనా నుంచి పట్టును దిగుమతి చేసుకుంటుండటంతో స్థానిక పట్టు రైతులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవసా య మార్కెటింగ్ కమిషన్ ఆశించిన ఫలితాలను ఇవ్వ డం లేదని అన్నారు. అందువల్లే రాష్ట్రంలోని రైతులందరూ ఇబ్బం దులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ , ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సం క్షేమం పట్ల నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ప్రభుత్వమే అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు పెదవి విప్ప డం లేదు.’ అని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.