
సాక్షి, హైదరాబాద్ : వడగండ్ల వర్షాలతో పంట నేలపాలవుతున్నా, పిడుగుపాట్లతో రైతులు మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ...పంట నష్టంపై ఇంతవరకు అధికారులెవ్వరూ క్షేత్రస్థాయికి వెళ్లలేదని, రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పటివరకు కనీసం పరామర్శించని సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుబంధు పేరుతో వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.