Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Padma Shri Vanajeevi Ramaiah Passed Away Condolences pour1
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇక లేరు

సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్‌ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్‌ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్‌ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్‌ఎస్‌ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్‌ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్‌ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్‌ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్‌(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ..

Tamil Nadu minister Ponmudy removed from DMK post2
డీఎంకే మంత్రి అసభ్యకర వ్యాఖ్యలు.. పార్టీ పదవి నుంచి తొలగింపు

చెన్నై: శైవ, వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే, శైవ, వైష్ణవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే క్రమంలో మహిళలను కూడా అవమానించేలా పొన్ముడి మాట్లాడారు. పలువురు మహిళలను ఉదహరిస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యల తాలూకు వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాటిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. మరోవైపు.. ఆయనను మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ ఆసాంతం అసభ్యకరంగా తయారైందన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారినుద్దేశించి పానీపురీ అమ్ముకుంటారంటూ గతంలోనూ ఆయన అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. This is DMK’s standard of political discourse in Tamil Nadu. Thiru Ponmudi was once the Higher Education Minister of Tamil Nadu & now Minister for Forests and Khadi, and the youth of Tamil Nadu are expected to tolerate this filth? Not just this Minister, the entire DMK ecosystem… pic.twitter.com/ENMq47hiPf— K.Annamalai (@annamalai_k) April 11, 2025కాగా.. పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలుశిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.

60 In 6 Overs With Our Lineup Will Be Very Difficult: Dhoni After KKR Beat CSK3
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్‌కే.. తాజాగా మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో ఓటమితో పాటు.. సొంత మైదానం చెపాక్‌లో హ్యాట్రిక్‌ పరాజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) సీఎస్‌కేను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.పూర్తిగా విఫలమైపోయాంఅయితే, కెప్టెన్‌గా పునరాగమనం చేసిన వేళ ధోనికి ఇలా ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందిస్తూ.. ‘‘గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసి రావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిని అంగీకరించకతప్పదు.ఈరోజు మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు నింపలేకపోయాం. గత మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో మేము తడబడ్డాం. కానీ ఈసారి తొలి ఇన్నింగ్స్‌లోనే మేము దారుణంగా విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైపోయాం.పవర్‌ ప్లేలో 31 పరుగులు మాత్రమే వచ్చాయన్నది వాస్తవం. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికే ప్రాధాన్యం ఇస్తాం. గత రెండు మ్యాచ్‌లలో మీరు ఈ విషయం గమనించే ఉంటారు. మా బలాలు ఏమిటో మాకు తెలుసు. అందుకు అనుగుణంగానే మేము ఆడతాం.వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడాఇతరులను అనుకరిస్తూ.. వారితో పోటీ పడుతూ.. వారిలాగానే ఆడాలనుకోవడం సరికాదు. స్కోరు బోర్డును చూస్తూ పవర్‌ప్లేలో అరవై పరుగులు చేయాలనే ఆతురత ఒత్తిడిని పెంచుతుంది. మా ఓపెనర్లు అచ్చమైన క్రికెట్‌ షాట్స్‌ ఆడతారు. పరిధులు దాటి హిట్టింగ్‌ మాత్రమే ఆడాలనే దృక్పథం మాకు లేదు. మాకు అది చేతకాదు కూడా.భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మధ్య ఓవర్ల సమయానికి పటిష్ట స్థితిలో ఉండాలని భావిస్తాం. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది. మా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనికి ఉంది. కానీ ఇప్పుడిలా చేదు అనుభవం ఎదుర్కోవడంతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తలా తెలిపాడు.103 పరుగులు మాత్రమేకాగా చెపాక్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (4), డెవాన్‌ కాన్వే (12).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి (16) మూకుమ్మడిగా విఫలమయ్యారు.మిడిల్‌లో విజయ్‌ శంకర్‌ (21 బంతుల్లో 29), శివం దూబే (29 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్‌ (1), రవీంద్ర జడేజా (0), దీపక్‌ హుడా (0), కెప్టెన్‌ ధోని (1) తీవ్రంగా నిరాశపరిచారు. కేకేఆర్‌ బౌలర్లలో స్పిన్నర్లు సునిల్‌ నరైన్‌ మూడు, వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్‌ అలీ కాన్వే రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.10.1 ఓవర్లలోనే ఫినిష్‌పేసర్లలో వైభవ్‌ అరోరా ఒకటి, హర్షిత్‌ రాణా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక సీఎస్‌కే విధించిన స్పల్ప లక్ష్యాన్ని కేకేఆర్‌ 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (16 బంతుల్లో 23), సునిల్‌ నరైన్‌ (18 బంతుల్లో 44) రాణించగా.. కెప్టెన్‌ అజింక్య రహానే (17 బంతుల్లో 20), రింకూ సింగ్‌ (12 బంతుల్లో 15) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. చదవండి: SRH vs PBKS: సన్‌రైజర్స్‌కో విజయం కావాలి! Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025

Worlds Highest Bridge Cutting Travel Time to One Minute4
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన

ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్‌ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్‌. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online5
ఒక్క క్లిక్‌తో క్షణాల్లో ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11గం. సమయంలో రిజల్ట్స్‌ను వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించనున్నారు. AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

​how Ripple Effect of Trump Tariffs on the US Dollar6
డాలర్‌కు ట్రంప్‌ గండం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు యూఎస్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇది అమెరికా వాణిజ్య విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. దేశీయ పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ ఈ సుంకాల అనాలోచిత నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఇందులో యూఎస్ డాలర్ క్షీణించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్‌ క్షీణతకు కారణాలను నిపుణులు విశ్లేషి​స్తున్నారు.వాణిజ్య అసమతుల్యతసుంకాలు దిగుమతి చేసుకునే వస్తువుల ఖర్చును పెంచుతాయి. ఇతర దేశాలు కూడా ఇందుకు అనుగుణంగా తమ సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడానికి దారితీస్తుంది. చైనా, కెనడా వంటి వాణిజ్య భాగస్వాములు ప్రతిచర్యలకు పూనుకోవడంతో అమెరికా ఎగుమతులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాణిజ్య అసమతుల్యతలు ప్రపంచ మార్కెట్లలో డాలర్ స్థానాన్ని బలహీనపరుస్తున్నాయి.దెబ్బతింటున్న ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసంఫైనాన్షియల్ మార్కెట్లు ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు అంచనాలపై వృద్ధి చెందుతాయి. సుంకాలను ప్రవేశపెట్టడం అనిశ్చితిని సృష్టించింది. ఇది అమెరికా విదేశీ పెట్టుబడులకు ఆకర్షించడంలో వెనుకపడేలా చేసింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్కెట్లను కోరుకోవడంతో డాలర్‌కు డిమాండ్ తగ్గింది.గ్లోబల్ కరెన్సీ సర్దుబాట్లుయూఎస్ సుంకాల ప్రభావానికి గురైన దేశాలు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ వస్తువులకు పోటీని కొనసాగించడానికి తరచుగా వారి కరెన్సీ విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనా యువాన్‌ను స్థిరీకరించడానికి చర్యలు తీసుకుంది. గ్లోబల్ కరెన్సీ విధానాల్లో ఇలాంటి సర్దుబాట్లు పరోక్షంగా అమెరికా డాలర్ విలువను ప్రభావితం చేశాయి.ఇదీ చదవండి: టారిఫ్‌ పాజ్‌.. మార్కెట్‌ జోష్‌ఆర్థిక వృద్ధి ఆందోళనలుసుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేస్తాయి. అవి దేశీయ పరిశ్రమలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అవి స్థానిక వ్యాపారాలు, వినియోగదారులకు ఖర్చులను పెంచుతాయి. దాంతో ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థ పట్ల భవిష్యత్తు అంచనాలను తగ్గిస్తుంది.

IPL 2025: Vishnu Vishal Slams MS Dhoni For Batting At Last In CSK Vs KKR Match7
సర్కస్‌ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం

ధోని కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టినా సీఎస్‌కే తీరు ఏమీ మారలేదు. వరుసగా ఐదోసారి పరాజయం పొందింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయం సాధించింది. శుక్రవారం జరిగిన చెన్నై వర్సెస్‌ కోల్‌కతా మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. కేవలం నాలగు బంతులు మాత్రమే ఎదుర్కొని సింగిల్‌ రన్‌ తీసి అవుట్‌ అయ్యాడు. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దారుణం..టీమ్‌ను గెలిపించేందుకు టాప్‌ ఆర్డర్‌లో రావాల్సింది పోయి చివర్లో వస్తాడేంటని సోషల్‌ మీడియాలో పలువురూ విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal) సైతం ధోని తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం దారుణమని మండిపడ్డాడు. ఎవరైనా గెలవకూడదని ఆడతారా? అని ప్రశ్నించాడు. ఇదంతా సర్కస్‌లా ఉందని.. స్పోర్ట్స్‌ కంటే ఏ వ్యక్తి కూడా గొప్పవారు కాదంటూ ట్వీట్‌ చేశాడు. కరెక్ట్‌గా చెప్పావ్‌..ఇది చూసిన నెటిజన్లు కరెక్ట్‌గా చెప్పావ్‌.. ధోని (MS Dhoni) మరీ 9వ స్థానంలో రావడం ఏంటో.. ఆయన హుందాగా రిటైర్‌మెంట్‌ తీసుకుంటే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఎవరైనా గెలవడానికే ప్రయత్నిస్తారు. తమ టీమ్‌ ఓడిపోవాలని ఏ ఆటగాడు కోరుకోరు. అందరిలాగే తనూ తన పని చేస్తున్నాడు. ఎందుకని అందరు ఆయనపై పడి ఏడుస్తున్నారు? అని అభిమానులు ధోనిని వెనకేసుకొస్తున్నారు.అప్పట్లో 'తలా' రేంజే వేరుఇప్పుడంటే ధోనికి బ్యాడ్‌ టైం నడుస్తోంది కానీ ఒకప్పుడు ఆయన రేంజే వేరే. అప్పట్లో ధోని క్రీజులో అడుగుపెడితే బాల్స్‌ బౌండరీలు దాటాల్సిందే.. ట్రోఫీలు చెన్నై హస్తగతం కావాల్సిందే! తలా నాయకత్వంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీలు అందుకుంది. అంతేకాదు, తన జట్టును పదిసార్లు ఫైనల్స్‌ దాకా చేర్చాడు. విష్ణు విశాల్‌ విషయానికి వస్తే ఆయన చివరగా లాల్‌ సలాం సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం తమిళంలో మఘడు సినిమాలు చేస్తున్నాడు. I refrained n refrained n refrained being a cricketer myself...I didn wanna come to conclusions too soon...But this is atrocious...Why come so lower down the order ..Is any sport played not to win?Its just like visitn a circus now...NO INDIVIDUAL IS BIGGER THAN THE…— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 11, 2025 చదవండి: మిస్టర్‌ హౌస్‌కీపింగ్‌ రివ్యూ.. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ

Tahawwur Rana has finally arrived in our country8
రాణా గుప్పిట కీలక రహస్యాలు!

పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్‌ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్‌లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్‌ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్‌ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు. అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్‌ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్‌ నుంచి వెళ్లిపోయాడని అంటారు. పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్‌గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్‌ఐకీ, లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)కీ కూడా ఏజెంట్‌గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు. అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్‌లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్‌ లోకేషన్‌లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్‌ పార్క్‌ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్‌ పోయి అక్కడ ఐఎస్‌ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్‌ ఇక్బాల్‌ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం. సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్‌ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్‌ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్‌లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్‌ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్‌ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్‌ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్‌ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్‌ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్‌ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్‌లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది.

Complaints to the Higher Education Council and the Higher Education Department regarding Fee Reimbursement9
అప్పు చేసి ఫీజులు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. దయచేసి హాల్‌ టికెట్‌ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..! – మంత్రి లోకేశ్‌కు ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్‌టికెట్‌ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్‌ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. క్వార్టర్‌కే దిక్కులేదు.. సెమిస్టర్‌ బాంబు..! గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్‌ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్‌ పీజీ రీయింబర్స్‌మెంట్‌ గాలికి.. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. – కె.కుమారి, ఇంటర్‌ విద్యార్థిని తల్లి, విజయవాడ అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాంతిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్‌ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్‌ చదువుతున్నాడు. – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లి, తిరుపతి జగన్‌ హయాంలో ఆదుకున్నారిలా..జగనన్న విద్యా దీవెన: రూ.12,609.68 కోట్లు వసతి దీవెన : రూ.4,275.76 కోట్లు 2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ - ఎంటీఎఫ్‌) విభాగం చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) ఐటీఐ రూ.10 వేలు పాలిటెక్నిక్‌ రూ.15 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు రూ.20 వేలు (నోట్‌: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్‌ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు)

Saurabh caught filming woman bathing in Ayodhya Raja Guest House10
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్‌రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్‌ నంబర్‌-3 దగ్గరలో రాజా గెస్ట్‌ హౌస్‌ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట​్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్‌ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్‌ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. బాత్‌రూమ్‌లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement