Sangareddy
-
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. -
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె. -
సన్న బియ్యం.. సంబురం
చరిత్రాత్మకం: మంత్రి పొన్నంలబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు ● మొదటిరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో 801 టన్నుల బియ్యం పంపిణీ ● 38వేలకుపైగా కార్డుదారులకు అందజేత ● రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు బారులు సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాప్‌ల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8,83,883 రేషన్ కార్డులుండగా మొదటి రోజు మంగళవారం 694 రేషన్ షాపులలో 38,526 కార్డుదారులకు 801.134 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లో సన్నబియ్యం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో.. సంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు అత్యధికంగా రేషన్ కార్డుదారులు సన్న బియ్యం తీసుకున్నారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో పంపిణీ చేశారు. నార్సింగ్, టెక్మాల్, పాపన్నపేట మండలాల్లో రెండు రేషన్‌షాపుల చొప్పున 6 రేషన్ షాపులలో మాత్రమే బియ్యం పంపిణీ చేయడం గమనార్హం. మరి కొన్ని రేషన్ షాపులలో బియ్యం చేరుకోవాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులతో ప్రారంభిస్తామని పంపిణీని వాయిదా వేశారు. కార్డుదారుల్లో సంతోషం.. కొన్నేళ్లుగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసింది. దీంతో కార్డుదారులు అంతంత మాత్రంగా తీసుకునేందుకు మొగ్గుచూపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని అందజేస్తోంది. కార్డుదారులు సంతోషంగా సన్న బియ్యం తీసుకున్నారు. సన్న బియ్యం ఇస్తుండటంతో బయట కొనడం ఇక తప్పిందని.. అలాగే డబ్బులు కూడా మిగులుతాయని కార్డు దారులు ఆనందం వ్యక్తం చేశారు. హుస్నాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడం చరిత్రాత్మకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో తెల్లరేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2.91 లక్షల రేషన్ కార్డులదారులకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకు అమ్మడం, రేషన్ దుకాణాలకు వాపస్ ఇవ్వడం జరిగేదన్నారు. ఇక నుంచి సన్న బియ్యం అందరూ తీసుకుంటారన్నారు. అందరికీ ఆరోగ్యం బాగుండాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సన్న బియ్యం పఽథకం ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి రోజు పంపిణీ వివరాలు జిల్లా మండలాలు రేషన్ కార్డులు కిలోలు షాపులు మెదక్ 3 06 86 1,960 సిద్దిపేట 25 365 17,933 3,62,138 సంగారెడ్డి 27 323 20,502 4,37,036 -
హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు కృషి
రామచంద్రాపురం(పటాన్చెరు): హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి తెలిపారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళుతున్న ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిలను రామచంద్రాపురంలోని వారి నివాసంలో మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను అమ్మడం సరికాదన్నారు. ఆ భూములలో ఎంతో వన సంపదతోపాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయని వివరించారు. ఆ భూములను విక్రయించే బదులు మరింత పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యూనివర్సిటీ పూర్వవిద్యార్థులైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌సీయూ భూముల పరిక్షణకు ఉద్యమిస్తున్న విద్యార్థులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలే
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు: నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని, ఈ బియ్యం పక్కదారి పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నాయికోటిబస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: పేదల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని 3వ వార్డు, నాగల్గిద్ద మండలం ఎనక్పల్లిలో, మనూరులోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పథకాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఖేడ్ పట్టణంలోని భూమయ్యకాలనీలో రూ.40 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ...ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంత కష్టమైనా పేదల కోసం ఒక్కోదాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో సీసీరోడ్లు, మురుగుకాల్వల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్ నారాయణఖేడ్: హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసహరించుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేతకీలో కర్ణాటక ఎమ్మెల్సీలు పూజలు ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్ పాటిల్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్, భీమ్రావు పాటిల్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. -
ఇందిరమ్మ డిజైన్లపై నిరుత్సాహం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఇళ్లను మంజూరు చేసిన రెండు నెలలు దగ్గర పడుతున్నా జిల్లాలో కనీసం 30 శాతం మంది లబ్ధిదారులు కూడా ముగ్గు పోసుకోలేదు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు రాగా, ఇందులో 1.36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. సొంతంగా ఇంటి స్థలం ఆధారంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించిన విషయం విదితమే. ఇందులో సొంత ఇంటి స్థలం ఉండి అర్హతలున్న వారికి ఈ ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఒక్కో మండలానికి ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేసి..ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఇళ్లు మంజూరు చేశారు. ఇలా జిల్లాలో మొదటి విడతలో 1,200 మంది లబ్ధిదారులకు గృహాలను మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇందులో కేవలం 275 మంది లబ్ధిదారులే ముగ్గు పోసుకున్నారు. బేస్మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు 21 మంది మాత్రమే కావడం గమనార్హం. -
అక్రమ రవాణాపై నిఘా పెట్టాలి
జహీరాబాద్ టౌన్: అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. సరిహద్దు, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లను మంగళవారం పరితోష్ పంకజ్ సందర్శించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన జహీరాబాద్‌కు వచ్చారు. జహీరాబాద్‌టౌన్ పోలీసు స్టేషన్ సందర్శించిన అనంతరం జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఆ తర్వాత కోహీర్ పీఎస్‌కు వెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయా లన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, జహీరాబాద్ టౌన్ సీఐ తదితరులు ఉన్నారు.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ -
మహిళా సంఘాలకు గ్రేడింగ్
సంగారెడ్డిటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తోంది. మహిళలకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా...స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. సంఘాల్లో సభ్యులు అనుభవమున్న రంగంలో రాణించేలా ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారు. అందుకే మహిళా సంఘాలలో మరింతమంది సభ్యులుగా చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుతోపాటు శ్రీనిధి రుణాలు సైతం అందుతుండటంతో ఆర్థిక సమస్యలను అధిగమించే దిశగా మహిళా సంఘాల సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఈ సంఘాలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రేడింగ్ విధానాన్ని సైతం అమలు చేస్తోంది. మహిళలకు గ్రేడింగ్ పెరిగేకొద్దీ రుణాలను ఎక్కువగా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి. మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఫొటోలను జతచేయాల్సి ఉంటుంది. ఏ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులు ఉండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాలలో గ్రామ సంఘాలలోని మహిళలున్నారు. వారికి గ్రేడ్ల ఆధారంగా రుణాలను అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ఒక్కో యూనిట్ విలువను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిర్ణయించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంశాలవారీగా కేటాయింపు మహిళా సంఘాలకు 12 అంశాల ఆధారంగా ఏ,బీ,సీ,డీ,ఈలతో గ్రేడింగ్ ఇస్తారు. ఒక్కో మహిళా సంఘం 75 శాతానికి పైగా గ్రేడింగ్‌ను సాధిస్తే ఎక్కువ సంఖ్యలో రుణాలిస్తారు. ఇలా తక్కువ వడ్డీకి ఇచ్చిన రుణాలను వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతానికి పైగా లక్ష్యాలను సాధిస్తే ఏ గ్రేడ్, 70% నుంచి 74% బీ గ్రేడ్, 60 లోపు సాధిస్తే సీ గ్రేడ్, 50% కంటే తక్కువ ఉంటే డీ గ్రేట్, అంతకంటే తక్కువగా ఉంటే ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ సంఘాలకు శ్రీనిధి రుణాలను కేటాయిస్తారు. గ్రామైక్య సంఘాలకు మాత్రమే ఈ గ్రేడింగ్ విధానం అమలులో ఉంది. క్షేత్రస్థాయిలో స్వయం సహాయక సంఘాలకూ ఇదే నిబంధన వర్తించనుంది.గ్రేడింగ్ విధానంతో రుణాలు పెరిగిన పర్యవేక్షణ రగ్రేడ్ పాయింట్ల ఆధార ంగా ప్రాధాన్యంకేటాయించే పద్ధతులు... ప్రతీ నెల రెండు సమావేశాలు ఉంటాయి సమావేశానికి అందరూ హాజరు కావాలి సక్రమంగా శ్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుల పద్ధతిలో చేయాలి ప్రతీనెల పొదుపు చెల్లింపులు ఉండాలి గ్రామ సంఘానికి చెల్లించిన రుణ వాయిదాలు, బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపులు సక్రమంగా ఉండాలి వీటన్నింటికీ తగిన మార్కులను కలిపి గ్రేడింగ్ నిర్ణయిస్తారు ఇందిరా మహిళా శక్తి శ్రీనిధి అమలు చేసిన కార్యక్రమాలలో 100% టార్గెట్‌ను గుమ్మడిదల సమైక్య సంఘం పూర్తి చేసింది మిగతా మండలాలలో కూడా లక్ష్యాలను పూర్తిచేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మహిళా సంఘాల పర్యవేక్షణ పెరిగింది మహిళా సంఘాలలో గ్రేడింగ్ విధానం అమలు చేయడంతో పొదుపు సంఘాలపై పర్యవేక్షణ పెరిగింది. సమావేశాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు లైవ్ఫొటోలను అప్లోడ్ తప్పనిసరిగా చేయాలి. ఎప్పటికప్పుడు అధికారులు సంఘాల వారీగా నివేదికలను తీసుకుని సమీక్ష చేస్తున్నారు. – జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి. -
నాన్న కల నెరవేర్చాను
చేగుంట(తూప్రాన్): గ్రూప్1లో స్టేట్ ర్యాంకు సాధించి తన తండ్రి కల నెరవేర్చినట్లు ఏరెడ్ల నిఖిత పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు మల్టీజోన్‌లో 2వ ర్యాంకు సాధించిన ఉమ్మడి మెదక్ జిల్లా హత్నూర మండలం కొడిప్యాకకు చెందిన ఏరెడ్ల నిఖిత మంగళవారం సాక్షితో మాట్లాడారు. గతంలోనే ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడలిస్టుగా మంచి ప్లేస్మెంట్ వచ్చినా వెళ్లలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తన తండ్రి సుధాకర్‌రెడ్డి కల మేరకు సివిల్స్‌పై ఆసక్తి పెంచుకొని ఇంటర్వ్యూలో పాల్గొన్నానని, మరోసారి ప్రయత్నం చేసి సివిల్స్ సాధిస్తానని పేర్కొన్నారు. ఇటీవల గ్రూప్ 2లో 144, గ్రూప్ 3లో 372వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఏడాదిన్నర చదివిన చదువుకు తగిన ఫలితం రావడం ఆనందంగా ఉందన్నారు. పట్టుదలతో చదువుకుంటే ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా గ్రూప్స్‌తో పాటు అన్ని పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునన్నారు. సాక్షితో గ్రూప్1 ర్యాంకర్ నిఖిత -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బేలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ (21) మనోహరాబాద్ మండలం కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమర్స్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం పరిశ్రమలో కూలర్‌ను సరిచేస్తున్న క్రమంలో ఇనుప స్టాండ్ వేసుకొని ఇంజక్షన్ మోల్డ్ మిషన్‌ను పరిశీలిస్తున్నాడు. స్టాండ్‌కు విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో పడిపోయాడు. ఇది గమనించిన తోటి కార్మికులు మేడ్చల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమలో సరైన వసతులు లేకనే మృతి చెందాడని తోటి కార్మికులు పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి వచ్చి కార్మికులతో మాట్లాడి సముదాయించాడు. మృతుడి అన్న దినేశ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
8న పుస్తకావిష్కరణ
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో 8న నందిని సిధారెడ్డి కథా సంపుటి బందారం కథలు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ.. సిధారెడ్డి కవిగా సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడని అన్నారు. ఆయన స్వగ్రామమైన బందారంలో తన జీవిత అనుభవ సారాన్ని కథలుగా రూపొందించి బందారం కథలు పేరిట వెలువరించారని తెలిపారు. సభకు కవులు, రచయితలు, సాహిత్య కారులు, గాయకులు, కళాకారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదగిరి, రాజిరెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం పని చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దమ్మక్కపల్లి, కొండపాక గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధనికులతోపాటు పేదలు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతినెలా పేదలకు రేషన్ దుకాణాల్లోంచి సన్న బియ్యం పంపిణీ జరిగేలా రెవెన్యూ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు దిలీప్ నాయక్, సుజాత, ఆర్ఐలు బాలకిషన్, సత్యనారాయణ, ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇసుక డంప్ సీజ్ బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల శివారులో డంప్ చేసిన ఇసుకను జేసీబీతో టిప్పర్‌లో లోడ్ చేస్తుండగా మంగళవారం టాస్క్‌ఫోర్స్, బెజ్జంకి పోలీసులు పట్టుకున్నట్లు ఏఎస్ఐ శంకర్రావు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేయగా ఇసుకతోపాటు జేసబీ, టిప్పర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళ అదృశ్యం గజ్వేల్‌రూరల్: మహిళ అదృశ్యమైన ఘటన గజ్వేల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వర్గల్ మండలం నాచారం గ్రామానికి చెందిన శీల సత్యనారాయణ, జ్యోతి(35) దంపతులకు 15 ఏళ్ల కిందట వివాహం జరుగగా వీరికి ముగ్గురు సంతానం. జ్యోతి సోమవారం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి వైద్యం చేయించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతుకగా ఆచూకీ లభించలేదు. మంగళవారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి మెదక్ మున్సిపాలిటీ : స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని రామంతాపూర్ చెందిన ఎండీ హఫీజ్(20) రంజాన్ పండుగ కోసం మెదక్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. బంధువులతో కలిసి స్థానిక గాంధీ నగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. అతడితోపాటు వెళ్లిన వారు నీటిలో స్నానం చేస్తుండగా గట్టుపై చూస్తున్నాడు. ఈ క్రమంలో హఫీజ్ ఈత కొట్టేందుకు ఒక్కసారిగా పూల్‌లోకి దూకాడు. ఈత రాకపోవడంతో పూల్ లోతు ఉండి నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారం పొడి చల్లి.. బంగారు గొలుసు చోరీ
బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో దారి దోపిడీ రామచంద్రాపురం(పటాన్చెరు): స్కూటీపై వెళ్తున్న వారిపై గుర్తు తెలియని దుండగులు కారంపొడి చల్లి బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో మంగళవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సాఆర్ జిల్లాకు చెందిన ఆరోగ్యమ్మ జీవనోపాధికై 20 ఏళ్ల కిందట రామచంద్రాపురానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారు. భర్త 5 ఏళ్ల కిందట మృతి చెందాడు. దీంతో వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. పెన్షన్ తెచ్చుకునేందుకు సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరింది. బస్సు ఎక్కడం కోసం అల్లుడు సూర్యతేజ స్కూటీపై ఇంటి నుంచి లింగంపల్లికి వెళ్తుంది. బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయం వద్ద రాగానే బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆరోగ్యమ్మ, సూర్యతేజ కళ్లల్లో దుండగులు కారంపోడి చల్లి మహిళ మెడలో నుంచి రెండున్నర తూలాల బంగారు గొలుసును లాక్కొని పరా రయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పెపల్లిలో విషాదం ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని ఇప్పెపల్లి గ్రామంలో ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్(28) మన్నాపూర్ గ్రామంలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. దుకాణంలో పనులు చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే, అదే గ్రామానికి చెందిన నాగప్ప(26)కు వడ దెబ్బతగిలి రెండు రోజుల నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకుంది. -
పచ్చి వడ్లు అమ్మి మోసపోకండి
హుస్నాబాద్‌రూరల్: రైతులు పచ్చి వడ్లు అమ్మి ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం పోతారం(ఎస్)లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించామని రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూర్చుతారని చెప్పారు. జిల్లాలో 419 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అందులో 212 ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సోలార్ ప్లాట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహణ మహిళ సంఘాలకే ఇస్తే ఆర్థిక ప్రగతి సాధిస్తారన్నారు. ధాన్యం రవాణకు ఇబ్బందులు లేకుండా గుత్తేదారులతో మాట్లాడి లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని, తూకంలో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రాంమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన పోతారం(ఎస్)లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం -
ట్రైన్లో వస్తాడు.. దోచుకొని వెళ్తాడు
సిద్దిపేటఅర్బన్: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట దొంగను సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కథనం మేరకు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గుర్రం అఖిల్ అలియాస్ తాడిశెట్టి మణికంఠ (32) 11 ఏళ్ల వయస్సు నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గత నెల 29న సిద్దిపేటలోని పొన్నాల వై జంక్షన్ వద్ద గల వైన్స్ పైకప్పు రేకులను తొలగించి రూ.30 వేల నగదు, రెండు మద్యం సీసాలను దొంగిలించాడు. చోరీ ఘటనపై వైన్స్ యజమానులు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది యాదగిరి, ప్రవీణ్, శివ, నగేశ్ ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతుకుతున్నారు. సోమవారం సాయంత్రం పొన్నాల వై జంక్షన్ వద్ద హైదరాబాద్ బస్సు కోసం వేచి ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారిచంగా వైన్స్‌లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి దొంగతనాలు ఇదిలా ఉండగా నిందితుడు 2012లో ఏపీలోని హుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో పట్టుబడి బాల నేరస్తుడిగా శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై 2021లో తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాడు. మళ్లీ జైలు నుంచి విడుదలై 2025 జనవరిలో సికింద్రాబాద్‌కు ట్రైన్లో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెయింట్ షాపులో ల్యాప్‌టాప్, మొబైల్, కొంత నగదు దొంగతనం చేసి, ఆ వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ డబ్బులు అయిపోగానే సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్‌వేర్ షాపులో ట్యాబ్, కౌంటర్లోని నగదు, మొబైల్ దొంగిలించి విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. డబ్బులు అయిపోగా మళ్లీ గత నెల 29న సికింద్రాబాద్‌కు ట్రైన్లో వచ్చి అక్కడి నుంచి సిద్దిపేటకు వచ్చి వైన్‌షాపులో దొంగతనం చేశాడు. జల్సాలకు డబ్బులు లేని సమయంలో ఇలా ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వచ్చి పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ సిద్దిపేట వైన్స్‌లో రూ.30 వేలు,మద్యం సీసాలు దొంగతనం జల్సాలకు అలవాటు పడి నిత్యం చోరీలు పోలీసుల అదుపులో అంతర్రాష్ట దొంగ -
రైతుల కన్నీటి కష్టాలు
మిరుదొడ్డి(దుబ్బాక): మునుపెన్నడూ లేని విధంగా మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. చెరువుల్లో చుక్క నీరు కానరావడం లేదు. వ్యవసాయ బావుల్లో నీటి తడులు అసలే లేవు. బోరు బావులు సైతం వట్టిపోతున్నాయి. ఆశ చావని రైతులు మరిన్ని అప్పులు చేసి బోరు బావులు తవ్వినా చుక్క నీరు రాక పోవడంతో మరింత నిరాశా నిస్ప ృహలకు లోనవుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండు ముఖం పడుతుంటే ఏం చేయాలో తోచక రైతులు చేతులెత్తేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో నీటి తడులులేక పొట్ట దశలో వరి సాగు, ఆరుతడి పంటలు ఎండిపోయి నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో అడుగు పెడితే చాలు సాగు నీటి కష్టాలు కళ్ల ముందు దర్శనమిస్తుంటాయి. ఏం చేయాలో పాలుపోక బొట్టు బొట్టునూ ఒడిసి పడుతూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సాగు నీరు లేక కొందరు రైతులు పంటలను వదిలేయగా, కాస్త నీటితోనైనా పంటలకు దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ట్యాంకర్లతో వరికి నీరు పొట్ట దశలో వరి వాడుముఖం పడుతుండటంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వరి సాగుకు నీటిని అందిస్తున్నారు. ఎంతో కొంత పోస్తున్న బోరు బావుల యజమానులతో మాట్లాడి ట్యాంకర్లో నీటిని నింపుకోవడానికి బేరాలు ఆడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇంజన్‌తోపాటు నీటి ట్యాంకర్‌కు రూ.1,500 చెల్లిస్తున్నారు. అయినా మండుటెండల్లో పొలం తడపడానికి ట్యాంకర్ నీరు ఏ మూలకు సరి సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకంటే ట్యాంకర్ ద్వారా నీటిని అందించడమే మరింత ఆర్థిక భారంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడులు వస్తాయోరావోనని ఆందోళన చెందుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు ఎండుతున్న పంటలు ఫాం పాండ్స్ ఏర్పాటు చేసుకొని నీటిని ఒడిసిపడుతున్న రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు మిరుదొడ్డిలో అన్నదాతల అవస్థలు బొట్టు బొట్టును ఒడిసి పట్టి బోరు బావులు వట్టి పోవడంతో బీర, మిరప, తమాట, మిర్చి వంటి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వచ్చీరాని నీటిని ఒడిసి పట్టాలన్న ఆలోచనతో కొందరు రైతులు గుంతలు తవ్వి నీటిని నింపడానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 5 మీటర్ల లోతుతో (ఫాం పాండ్స్) నీటి గుంతలను తవ్వుకుంటున్నారు. నీటి గుంతల అడుగుతోపాటు, చుట్టూ గోడల నుంచి నీరు ఇంకి పోకుండా ఉండేందుకు పాలిథిన్ కవర్లను అమర్చుతున్నారు. ఒక్కో నీటి గుంతకు రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నారు. వచ్చే కొంచెం నీటిని గుంతల్లో నింపుతున్నారు. ఆ నీటిని ఆరుతడి సాగు చేస్తున్న బీర, కాకర, మిర్చి, తమాట వంటి పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తూ గట్టెక్కుతున్నారు. -
ఆలయ భూములు కాపాడుకోవాలి
సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట) : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో అన్యాక్రాంతం అవుతున్న స్వామి వారి భూములను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సీపీఎం పార్టీతో కలిసి రావాలని సీసీఎం కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొమురవెల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 201, 208, 230లో 5 ఎకరాల 19 గుంటల భూమిని మహదేవుని మల్లయ్య, మహదేవుని సాంబయ్య 1983లో, సర్వే నంబర్ 218, 219లో 5 ఎకరాల 20 గుంటల భూమిని 1992లో మహదేవుని నాగమల్లయ్యతోపాటు మరో ఆరుగురు ఆలయానికి భూమిని విక్రయించారని తెలిపారు. ఆలయ భూములను కాపాడటంలో గతంలో ఆలయ ఈవోగా పని చేసిన బాలాజీ శర్మ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆలయ భూములను కాపాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినట్లు తెలిపారు. ఆలయ అధికారులు కోర్టుకు హజరు కాకుండా భూములు కొల్లగొట్టేందకు యత్నిస్తున్న వక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఆలయ భూములు కోల్పోయే విధంగా దేవాదాయ శాఖ అధికారులు కేసుకు హాజరు కాకుండా, వాదనలు వినిపించకుండా సదరు వ్యక్తులు కట్టడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్, జిల్లాకమిటీ సభ్యులు బద్దిపడిగే కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెల్లి బాల కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
టోల్ రేట్లు పెంపు
సంగారెడ్డి: మరోసారి టోల్గేట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ఎచ్ఏఐ) వర్గాలు వెల్లడించాయి. అకోలా–నాందేడ్ హైవేపై చౌటకూర్ మండలం తడ్డాన్పల్లి టోల్ ప్లాజా వద్ద కొత్త రేట్లతో కూడిన బోర్డులను అక్కడి యాజమాన్యం ప్రదర్శించింది. లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ కారు, జీపు, వ్యాన్ తదితర వాహనాలకు రూ.5 చొప్పున పెంచగా...నెలవారీ పాస్ రూ.150కు పెరిగింది. వాణిజ్య వాహనాలకు రూ.5 చొప్పున, నెలవారీ పాస్‌కు రూ.240 పెంచారు. మూడు చక్రాల వాణిజ్య వాహనాలకు రూ.15 చొప్పున వీటికి మంత్లీ పాస్ రూ.550 చొప్పున పెరిగాయి. భారీ వాహనాలైన బస్సు, ట్రక్కులకు రూ.15 చొప్పున, మంత్లీ పాస్ రూ.505 చొప్పున పెరిగాయి. ఇక ఓవర్ సైజ్ వెహికల్‌కు రూ.25, మంత్లీ పాస్ రూ.965కు పెరిగింది. ఈ పెరిగిన రేట్లన్నీ ఈనెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. గుమ్మడిదల టోల్‌ప్లాజాలోనూ...జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండల కేంద్ర సమీపంలోని టోల్గేట్లో ఈనెల 1 నుంచి కొత్త టోల్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. కారు జీపు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ పై రూ.5 రూపాయలు పెరిగాయని, బస్సులు, భారీ వాహ నాలపై రూ.10 రూపాయల చొప్పున చార్జీలు పెంచినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెరిగిన చార్జీలు సోమ వారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. చార్జీల పెంపుపై వాహనదారులు టోల్‌ప్లాజా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నేటి నుంచి అమలు -
ఈద్గాలను సందర్శించిన ఎస్పీ
సంగారెడ్డి జోన్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి హాస్టల్ ఈద్గాను సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈద్గా వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీతో పాటు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు (ఏప్రిల్ 1 నుంచి 30 వరకు) జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పటాన్చెరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ముస్లిం సోదరుల గృహాలకు వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ముస్లింల సంక్షేమానికి కృషిఎమ్మెల్యే సునీతారెడ్డి హత్నూర(సంగారెడ్డి): ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మైనార్టీ అభివృద్ధి కోసం తాను ఎప్పుడు సహకరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవులరాజురెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ దౌల్తాబాద్‌లో ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హత్నూర మండలంలో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర, దౌల్తాబాద్, కాసాల, చింతలచెరువు,బోరపట్ల, సిరిపురంతోపాటు పలు గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ ముస్లింలు తేడా లేకుండా స్నేహపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాలి నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బాల్కి పీఠాధిపతి బసవలింగ పట్టదేవర, జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షట్కార్, టీపీసీసీ సభ్యుడు శంకరయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతర ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించి గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. ‘యువ వికాసం’ను సద్వినియోగం చేసుకోవాలికలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...జిల్లాలో అత్యధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి 100% రాయితీ, రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారికి 90%రాయితీ, రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 80% రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70% రాయితీ లభిస్తుందని ఈ విషయంపై దరఖాస్తుదారులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. -
వరిపై తెగుళ్ల దాడి
ఏం తోస్తలేదు నాలుగు ఎకరాల వరి పంట వేసిన.. చేను మొత్తం ఈనుతుంది. ఈనినా గొలుసు పాలు పోసుకోకుండా గింజ గట్టి పడకుండా తెల్లగా నిలబడిపోతుంది. చేను గిట్లయితుందని మందు తెచ్చి కొట్టినా ఏం లాభం లేదు. వ్యవసాయాధికారి వచ్చి చూశారు. చేతికొస్తుందనుకున్న చేను గిట్లకావట్టే.. ఏం తోస్తలేదు. గత వానాకాలంలో కూడా గిట్లనే అయ్యి చాలా నష్టమైంది. – పాతూరి లక్ష్మణ్, రైతు దుబ్బాక పంటలను పరిశీలిస్తాం జిల్లాలో ఈ యాసంగిలో పెద్ద ఎత్తున వరి పంటల విస్తీర్ణం పెరగడంతో రకరకాల తెగుళ్లు వస్తున్నా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయాధికారులం పరిశీలించి ఎందుకు ఇలా జరుగుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తాం. రైతులు తమ పంటలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య మొదట్లోనే పరిష్కరిస్తే ఎక్కువ నష్టం కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. – రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి చేతికొచ్చే దశలో దెబ్బతింటున్న చేను ● గింజలు గట్టి పడకుండా తాలుపోతున్న గొలుసులు ● ఎన్ని మందులు కొట్టినా దక్కని ఫలితం ● మెడ విరుపు, మొగి పురుగు, అగ్గితెగులు అంటున్న వ్యవసాయాధికారులు ● ఆందోళనలో జిల్లా రైతాంగం ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొండె ఎల్లారెడ్డి. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ గ్రామం. ఈ యాసంగిలో తనకున్న 10 ఎకరాల్లో వరి పంట వేశాడు. పంట ఈని గొలుసులు బయటకు వచ్చాక గింజ గట్టి పడకుండా తాలుపోయి(పొల్లు) తెల్లగా నిలబడిపోతుంది. ఎంతో ఖర్చు పెట్టి రకరకాల మందులు స్ప్రే చేసినా ఫలితం లేదు. ఇప్పటికే వేల రూపాయల మందులు తెచ్చి కొట్టినా మట్టిలో పోసినట్లే అయ్యింది. అప్పు తెచ్చి రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిండు. పంటకు వచ్చి తెలుగు చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితే కాదు జిల్లాలోని రైతుల అందరి పంటలు ఇలాగే ఉన్నాయి. దుబ్బాక: వరి పంటలకు మాయదారి రోగం ఏదో సోకడంతో రైతులు పరేషాన్లో పడ్డారు. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా తీరా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే వానాకాలంలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీదపడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంటలు బాగా వస్తుందని గంపెడాశతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. తీరా చేను పొట్టదశకు వచ్చి ఈనుతున్న తరుణంలో బయటకు వచ్చిన గొలుసులకు గింజలు గట్టిపడకుండా తెల్లగా తాలు పోయి అలాగే నిలబడిపోతుండటంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 3.53 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలో చెరువులు..కుంటల్లో సమృద్ధిగా నీరుండడంతో ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 3.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ముందుగా వేసిన వరి పంటలు ఈని గింజలు ఎర్రబడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో ఈనిన వరి చేలు ఈనినట్లుగానే గొలుసులకు గింజలు పాలుపోసుకోకుండా అలాగే తెల్లబడి నిలబడిపోతున్నాయి. దుబ్బాక మండలంలోనే కాదు జిల్లాలోని చాలా గ్రామాల్లో వరి పంటల పరిస్థితి ఇలాగే తయారైంది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న రైతులకు ఈ మాయదారి రోగం ఆందోళన కలిగిస్తుంది. ఇష్ట మొచ్చిన మందులు వరి చేనుపై రైతులు ఇష్టమొచ్చిన మందులు పిచి కారీ చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి కనబడుతుంది. నాట్లు వేసినప్పుడు వాతావరణ పరిస్థితులతో ఎదగకుండా ఎర్రగా ఉండటంతో అప్పటి నుంచి ఇప్పుడు ఈని గొలుసు తాలుబోతుండటంతో రకరకాల మందులను వేల రూపాయలు పెట్టి తెచ్చి స్ప్రే చేస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏర్పడింది. మెడ విరుపు, మొగి పురుగు, అగ్గి తెగుళ్లే.. వరి చేను ఈని గింజలు గట్టి పడకుండా తాలుపోవడం వంటిది మొగి పురుగు, అగ్గి తెగుళ్ల లక్షణాలుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇది వరకు అగ్గి తెగులు సోకిన భూముల్లో ఈ మెడవిరుపు తెగులు లక్షణాలు కనబడుతున్నాయని చెబుతున్నారు. వానాకాలంలో సైతం ఇలాగే వరి పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వరి పంటలపై మెడ విరుపు లక్షణాలు కనిపిస్తే ట్రై సైక్లోజన్ లేదా గెలిలియో సెన్స్ మందులు స్ప్రే చేయాలంటూ వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. -
ఇక సన్న బువ్వ
నేటి నుంచి బియ్యం పంపిణీ ● సర్వం సిద్ధం చేసిన అధికారులు ● ఉమ్మడి జిల్లాలో28లక్షల మందికిపైగా లబ్ధిప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలుసన్న బియ్యం వచ్చేశాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు చేరుకున్నాయి. మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హుస్నాబాద్‌లో 8వ రేషన్ షాపులో పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించనున్నారు. సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,83,883 రేషన్ కార్డులున్నాయి. ఇందుకు నెలకు 18,205.019 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. 28,50,964 మందికి లబ్ధిచేకూరనుంది. ఇందులో 8,25,324 ఆహార భద్రత కార్డులకు 26,93,609 సభ్యులకు ఒక్కరికి 6కిలోలు, 58,311 అంత్యోదయ కార్డులకు గాను ఒక్కో కార్డుకు 35 కిలోలు, 248 అన్నపూర్ణ కార్డులకు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యంను పంపిణీ చేస్తారు. ఇక అక్రమాలకు చెక్ బయటి మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఆకాశానంటుతున్నాయి. మధ్య తరగతి, సామాన్యులు కొనలేని పరిస్థితి. ఇది వరకు రేషన్ షాప్‌ల్లో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది లబ్ధిదారులు అమ్మి సన్న బియ్యం కొనుగోలు చేసే వారు. దీంతో రేషన్ బియ్యం పక్క దారి పట్టేది. తాము అధికారంలోకి వస్తే సన్న బి య్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కొలువుదీరిన ఏడాదిన్నరకు సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది.జిల్లాలోని ఉపాధి హామీ వివరాలు గ్రామ పంచాయతీలు 619 జాబ్ కార్డులు 2.19లక్షలు ఉపాధి కూలీలు 4.3లక్షలు యాక్టిబ్ జాబ్ కార్డులు 1.32లక్షలురోజూ హాజరవుతున్న కూలీలు (సుమారుగా)35,000జిలా అంత్యోదయ ఆహార భద్రత అన్నపూర్ణ మొత్తం బియ్యం(టన్నులు) సిద్దిపేట 18,336 2,72,909 82 2,91,327 5,775.742 మెదక్ 13,860 1,99,902 66 2,13,828 4,430.496 సంగారెడ్డి 26,115 3,52,513 100 3,78,728 7,998.781అన్ని ఏర్పాట్లు చేశాం రేషన్ షాపుల ద్వారా కార్డు దారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే దాదాపు అన్ని రేషన్ షాపులకు బియ్యం చేరుకున్నాయి. ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీ వరకు పంపిణీ జరగనుంది. లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
మొక్కలపై అవిశ్రాంత ప్రేమ
ప్రకృతిని సృష్టించిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ● ఉద్యోగ రీత్యా ఊరు విడిచి వెళ్లినా మళ్లీ సొంత గ్రామానికి ● ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం ● సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందజేత ● విశ్రాంత జీవనంలో మొక్కల సంరక్షణకు సమయం హుస్నాబాద్‌రూరల్: నేలల స్వభావంతోనే రైతులు పంటలు సాగు చేస్తారు. తరి నేల వరి సాగుకు యోగ్యమైన భూమి. ఇందులో వరి తప్ప మరో పంట వేయడానికి రైతులు ఆసక్తి చూపరు. అలాంటిది తరి నేలలో ఎకరంలో 600 మొక్కలు నాటి ప్రకృతిని సృష్టించాడు ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి బొంపెల్లి రామారావు. వరి పంట వద్దు ప్రకృతి పర్యావరణం ముద్దు అన్నట్లు రకరకాల మొక్కలు సేకరించి నాటి నిత్యం చెట్ల సంరక్షణతోనే రైతు కాలం సాగిపోతుంది. చెట్లు పెంచితే పక్షులు చేరి కిచకిచరాగలు తీస్తే పల్లె ప్రకృతి మురిసి పోవాలని, పర్యావరణంకు హాని కలుగకూడదని రైతు ఆకాంక్షిస్తున్నాడు. 2017లో ఉద్యోగ విరమణ చేశాక.. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బొంపెల్లి రామారావు 10వ తరగతి పూర్తి చేసి 1980లో ఆర్టీసీలో మెకానికల్ ఉద్యోగంలో చేరి 2017లో ఉద్యోగ విరమణ చేశాడు. తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం కావడంతో పంటలు అంటే ప్రాణం, చిన్నప్పటి వ్యవసాయ బావి పరిసరాలు తాటి వనాలు, ఎల్లమ్మ చెరువు నీటి జలాశయంతో తన పంట చేళ్లకు ప్రకృతికి కొత్త అందాలను తెచ్చేవి. ఉద్యోగ రీత్యా ఊరు విడిచి కరీంనగర్‌లోనే స్థిరపడ్డ రామారావు ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. కుమారుడు ఆమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగంతో స్థిరపడగా కూతురు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అమ్మానాన్నలు పుట్టిన ఊరిలో ఉండగా ఉద్యోగ విరమణ చేసిన రామారావు ఏడాదిపాటు కరీంనగర్ నుంచి తోటపల్లికి వచ్చి పోయేవాడు. పండ్ల తోటలతో వ్యాపారం చేయాలనే ఆలోచన రైతుకు లేదు పంటల సాగుకు కొత్త పద్ధతులను గ్రామీణ రైతులకు పరిచయం చేయాలనే తపన రామారావుది. ఎకరంలో 600 మొక్కలు 2019లోనే ఊరికి వచ్చి తన ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో ఎకరంలో 600 మొక్కలు నాటి ఉద్యానవనం చేశాడు. శ్రీగంధము 300, జామ 200, దానిమ్మ, పనస, మామిడి, వాటర్ ఆఫిల్, ఉసిరి, బొప్పాయి 100 రకరకాల చెట్లను నాటించాడు. మరో 3 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించి ప్రకృతిని సృష్టించాడు. అమ్మానాన్నలు 60 ఏళ్లు వరి పంట సాగు చేస్తే రామారావు పంటను మార్చి మొక్కలను పెంచుతున్నాడు. మరో రెండు ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వరి సాగు సన్న రకం సాగు చేస్తున్నాడు. మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసి నీరు అందించడంతో పాటు సేంద్రియ ఎరువులను ద్రవ రూపంలో అందిస్తూ మొక్కలను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు. పండ్ల మొక్కల పెంపకం తన తోటలో వాటర్ ఆఫిల్ , మామిడి, జామ పండ్లు పెద్ద పరిమాణంలో ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉంది. పండ్లు కరీంనగర్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తాడు. పంటల పై ఎంత ఆదాయం వచ్చినా వాటిని మొక్కల సంరక్షణకే ఉపయోగిస్తాడు. వాటర్ ఆఫిల్ జామ, మామిడి పండ్లను తోట వద్దకు ఎవరు వచ్చినా లేదనకుండా తెచ్చి ఇస్తాడు. పల్లె రైతులకు నూతన పంటల సాగు పై అవగాహన కల్పిస్తూ వరికి బదులు వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచిస్తాడు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే కొత్త రకం పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని భావిస్తున్నాడు. -
పట్టుబట్టి.. కొలువులు కొట్టి
పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు దుబ్బాక: కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవా చేయాలన్నదే తన లక్ష్యమని దుబ్బాక పట్టణానికి చెందిన గ్రూపు 1 ర్యాంకర్ బైండ్ల వెంకటేష్ సోమవారం తెలిపారు. దుబ్బాకకు చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బైండ్ల నారాయణ కుమారుడు వెంకటేశ్ గ్రూప్ 1 జనరల్ కేటగిరీలో 543 ర్యాంక్, ఎస్సీ కేటగిరీలో 31వ ర్యాంక్ సాధించాడు. ఇది వరకే గ్రూప్ 4లో ర్యాంక్ కొట్టి సంగారెడ్డి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో ర్యాంక్ సాధించడం విశేషం. తనకు ఆర్డీవో లేదా డీఎస్పీ ఉద్యోగం రావొచ్చని వెంకటేశ్ తెలిపారు. తన విజయంలో తల్లిదండ్రుల పాత్రనే కీలకమని, కలెక్టర్ కావడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు. -
మహిళపై అడవి పంది దాడి
చిన్నశంకరంపేట(మెదక్): అడవిలోకి వెళ్లిన మహిళపై అడవి పంది దాడి చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవ్వలపల్లి తండాకు చెందిన దేవసుత్ లక్ష్మీ సోమవారం మోదుకు ఆకులను తెంపేందుకు అడవిలోకి వెళ్లింది. కొండాపూర్ రాజుల గుట్ట వద్ద ఆకులు తెంపుతున్న క్రమంలో మహిళపై అడవి పంది దాడి చేసి గాయపర్చింది. అప్రమత్తమైన మహిళ తప్పించుకొని రోడ్డుపైకి చేరింది. విషయం గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, మహిళను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. టైరు పగిలి కారు బోల్తా ఇద్దరికి స్వల్ప గాయాలు చిన్నకోడూరు(సిద్దిపేట): కారు బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన ఎడపల్లి సాగర్ రెడ్డి, తన సోదరుడి కుమారుడు కారులో హైదరాబాద్‌లో వెళ్తున్నారు. మల్లారం శివారులో కారు టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు వట్పల్లి(అందోల్): టీవీఎస్ ఎక్సెల్, బైక్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం అందోలు మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామ సమీపంలో నాందేడ్– అకోలా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. అందోలు మండల పరిధిలోని రాంసాన్పల్లి గ్రామానికి చెందిన మన్నె గోపాల్ తన బావ నగేశ్‌తో కలిసి బైక్‌పై ఆయన స్వగ్రామమైన గడిపెద్దాపూర్ గ్రామానికి వెళ్తున్నారు. కన్సాన్పల్లి గ్రామ సమీపంలో రహదారి విశ్రాంతి భవనం వద్దకు చేరుకోగానే టేక్మాల్ మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన దిగాల అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై జోగిపేటకు వస్తున్న క్రమంలో రెండు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నగేశ్ కాలు విరుగగా, గోపాల్, అంజయ్యకు తీవ్ర గాయాలు అయ్యా యి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో నగేశ్, గోపాల్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్కు చెందిన సిరిగోరి రాజు(24) చందానగర్‌లోని పికిల్ సెంటర్లో పని చేస్తున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం ఏడుపాయలకు వచ్చాడు. మధ్యాహ్నం మంజీరా నదిలోని రెండో బ్రిడ్జి సమీపంలో ఇద్దరు వంట చేస్తుండగా, మరో ఇద్దరు స్నానం కోసం మంజీరా పాయల్లోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి రాజు మృతి చెందాడు. వీరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. తోటి స్నేహితులు స్థానికులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్ల సహాయంతో రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుద్దెడకు చెందిన రొడ్డ మల్లేశం (31)టాటా ఏస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతనెల 30న వాహనం పంక్చరైందని ఇంట్లో చెప్పి వెళ్లి రాత్రి వరకు రాలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో చిన్నాన్న వ్యవసాయ బావి వద్ద మల్లేశం చెట్టుకు ఉరేసుకున్నాడని విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటినా వెళ్లారు. వాహనం సరిగా నడవక కుటుంబ పోషణ కోసం సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడని, అవి తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నానమ్మ మందలించిందని యువకుడు నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన కమ్మరి కమలమ్మ మనువడు కమ్మరి నర్సింలు(20) తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ వద్దే ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆమెకి వయస్సు మీద పడటంతో తాను పని చేయలేక పోతున్నానని, నిన్ను పెంచడం నాతో కాదని, నీవు ఏదైనా పని చేసుకొని బతకాలని మందలించింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు చనిపోయే ముందు ఇన్‌స్టా గ్రామ్‌లో ‘నేను చనిపోయాక అయినా నా విలువ తెలుస్తుందో ఏమో’ అని రీల్ పెట్టి బలవన్మరణానికి పాల్పడాడు. మృతుడి నానమ్మ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీఆర్ఎస్ గిరిజన నాయకుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): మద్యం తాగిన మత్తులో జరిగిన గొడవలో బీఆర్ఎస్ గిరిజన నాయకుడిని హత్య చేశారు. ఈ ఘటన కల్హేర్ శివారులో నీలం వాగు వంతెన వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కల్హేర్ కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(56) స్థానిక మండల పరిషత్‌లో ఉపాధి హామీ పథకం కింద చెట్లకు నీరు పోసే పనులు చేస్తున్నాడు. ఇతడు చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అతడి భార్య పిప్లిబాయి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆదివారం ఉదయం 8 గంటలకు తండా నుంచి కల్హేర్ వచ్చారు. రాత్రి హరిసింగ్ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోమ్యానాయక్ తండాకు చెందిన గణపతి, సీతారాం అడ్డుకొని తనను చంపుతామని బెదిరిస్తున్నారని భార్య పిప్లిబాయికి ఫోన్ చేసి చెప్పాడు. మార్గమధ్యలో హరిసింగ్, సీతారాం, గణపతి ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తాగిన మత్తులో గొడవ జరుగగా ఇద్దరూ కలిసి హరిసింగ్ మెడకు తువ్వాల చుట్టి హత్య చేశారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకు కల్వర్టులో చొరగొట్టే యత్నం చేశారు. రోడ్డుపై నుంచి ఎవరో వస్తున్నారనే భయంతో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు వెంకటేశం, వెంకట్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తామే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. మృతుడు హరిసింగ్ భర్యా పిప్లిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. మద్యం తాగిన మైకంలో గొడవ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కల్హేర్ శివారులో ఘటన -
పట్టుదలతో చదివి..
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలం ముసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత్‌రెడ్డి గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన ఎరగారి శశింధర్రెడ్డి , పావనీలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభాత్‌రెడ్డి గత రెండు నెలల క్రితం వెల్లడైన గ్రూప్–4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించి ప్రస్తుతం జిల్లాలోని కొల్చారం మండలం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన విద్యాభ్యాసం మెదక్‌లోని సిద్ధార్థ మోడల్స్కూల్లో 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని శ్రీనిఽధి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. మూడేళ్లుగా అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉండి చదువుకున్నారు. దీంతో పాటు గ్రూప్–3లో కూడా 800 వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడిని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు. -
పెళ్లయిన రెండు నెలలకే..
భార్య అంటే ఇష్టం లేదని భర్త ఆత్మహత్య వట్పల్లి(అందోల్): భార్య అంటే ఇష్టం లేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని తాడ్మన్నూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్ఐ పాండు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్(24)కు సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన సంజీవులు కుమార్తె మాధవితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య అంటే ఇష్టం లేని ప్రవీణ్ తరచు ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆనందయ్య మఠంలో చోరీ
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని బేగంపేటలో గల అనందయ్య మఠంలోని సౌండ్ సిస్టానికి చెందిన ఆంప్లీపయర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రోజులానే ఆలయం తాళం చెవిని ప్రాంగణంలో పెట్టి వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లేసరికి ఆంప్లీపయర్ కనబడలేదు. సుమారు 18 వేల విలువ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. బెజ్జంకి పోలీసులకు సమాచారమివ్వగా విచారణ చేశారు. అలాగే ఆటో బ్యాటరీ సైతం చోరీకి గురైందని స్థానికులు తెలిపారు. తాళం చెవి తీసుకుని చోరికి పాల్పడ్డారంటే తెలిసిన వ్యక్తులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ గజ్వేల్‌రూరల్: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని అక్కారం శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, గజ్వే ల్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 4 సెల్ఫోన్లతో పాటు రూ. 5,990 నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. భక్తుల సెల్‌ఫోన్ అపహరించిన మహిళ దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగింత కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల సెల్ఫోన్లు అపహరించిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ మహిళ ఓ భక్తుడి సెల్‌ఫోన్‌ను అపహరించేందుకు యత్నించగా అతడు అప్రమత్తమయ్యాడు. ఆమెను పట్టుకొని విచారించగా రెండు సెల్ఫోన్లు లభించాయి. దీంతో భక్తులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి మందలించి వదిలిపెట్టినట్లు సమాచారం. తండ్రిని చంపిన కొడుకు గజ్వేల్‌రూరల్: తండ్రి, కొడుకు మధ్య నెలకొన్న వాగ్వాదంలో తండ్రిని కొడుకు చంపిన ఘటన గజ్వేల్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని పటేల్బజార్కు చెందిన ఎండీ షాబొద్దీన్(47), రజియాబేగంలకు కొడుకు షాకేర్, కూతురు ఉన్నారు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న షాబొద్దీన్కు, కొడుకు షాకేర్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వంటింట్లోకి వెళ్లిన షాబొద్దీన్ కిందపడటంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే భార్య అక్కడకు చేరుకొని అతడిని పక్కకు తీసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో షాబొద్దీన్ నిద్రిస్తుండగా కొడుకు అతని మెడకు తాడును బిగించి చంపేందుకు ప్రయత్నించాడు. గమనించిన రజియాబేగం అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో షాబొద్దీన్ వద్దకు వెళ్లిచూడగా అతడు మృతి చెందినట్లు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి మహిళ దారుణ హత్య జహీరాబాద్ టౌన్: ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్‌లో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... ఝరాసంగం మండలం చిలేమామిడి గ్రామానికి చెందిన లక్ష్మి(35)కి భర్త లేడు. ఆమె కొడుకు ఉండగా హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఉపాధి కోసం వచ్చిన ఆమె పస్తాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఆదివారం ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోపలికి చొరబడి ఆమెను చితకబాదారు. గ్యాస్ సిలిండర్‌తో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకుని పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, సీఐ.శివలింగం ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతురాలి చెల్లెలు జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నప్పటి నుంచే లక్ష్యం..
న్యాల్కల్(జహీరాబాద్): చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఎక్కెల్లి అఽఖిలజారెడ్డి గ్రూప్–1లో ప్రతిభ కన బర్చింది. మండల పరిధిలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఎక్కెల్లి నిర్మల, జగనాథ్‌రెడ్డి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కూతురు అఖిలజారెడ్డి 10వ తరగతి వరకు పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివింది. తరువాత హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. 2019లో మొదటి ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేస్తూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష రాసి 483.5 మార్కులతో రాష్ట్రంలో 125 ర్యాంక్, మల్టీ జోన్లో 50వ ర్యాంక్ సాధించింది. ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని అఖిలజారెడ్డి పేర్కొంది. తన లక్ష్యం ఐఏఎస్ అని, ప్రజలకు సేవ చేయాలని ఆమె పేర్కొంది. ఉద్యోగానికి ఎంపిక కావడం పై ఆమె తల్లిండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో స్వీట్లు పంచి పెట్టారు. -
సత్తా చాటిన ఆణిముత్యాలు
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ –1 ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ప్రతిభ కనబర్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం పెట్టుకొని పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అభ్యర్థులను అభినందించారు.టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో హవా ● ఉమ్మడి జిల్లాలో ఆరుగురు ఎంపిక ● 26వ ర్యాంకు సాధించిన పూజ ● 41వ ర్యాంక్ సాధించిన శైలేష్ ● ముసాపేటకు చెందినప్రభాత్రెడ్డికి 73వ ర్యాంక్ ● 75వ ర్యాంకు సాధించిన సిద్దిపేట వాసి నర్ర అఖిల్ ● మిర్జాపూర్(బి)కు చెందినఅఖిలజారెడ్డికి 125 ర్యాంక్కోచింగ్ తీసుకోకుండానే.. మెదక్‌జోన్ : టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూన శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 503.500 మార్కులు వచ్చాయి. 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్‌లోని శివ సాయి, 8 నుంచి 10 తరగతి వరకు అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్మీడియట్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చదివాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఈ ర్యాంకు సాధించడం విశేషం. తండ్రి పూన రవి పట్టణంలో బంగారం నగల దుకాణం నడిపిస్తాడు. ఈ సందర్భంగా శైలేష్‌ను పలువురు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన నర్ర అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. పట్టణానికి చెందిన నర్ర భగవాన్‌రెడ్డి, వజ్రమ్మల మొదటి కుమారుడు అఖిల్. రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారిగా నీటిపారుదల శాఖ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఏఈఈగా నియామకమయ్యారు. తాజాగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో అఖిల్ 75వ ర్యాంక్ సాధించాడు. కష్టపడి చదివితే ఏదైనా సాంధించవచ్చని అఖిల్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదివానని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ వక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పోతాన్‌శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండారి వేణుగోపాల్(31) తన అవసరాల నిమిత్తం భార్య దీపిక పుస్తెలతాడును కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. నెల రోజుల క్రితం దీపికతో పుస్తెలతాడు విషయంలో గొడవ జరగగా దీపిక పుట్టింటికీ వెళ్లిపోయింది. దీంతో శనివారం రాత్రి తన గదిలో వేణుగోపాల్ ఉరివేసుకున్నాడు. ఆదివారం అతడిని నిద్రలేపేందుకు తల్లి వెళ్లి తలుపు తట్టగా తెరవలేదు. దీంతో స్థానికుల సాయంతో గదితలుపులు తెరవగా ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. -
ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్ కోచింగ్..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఉన్నత విద్యా కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది కప్పే పూజ యాదవ్. ఫలితాల్లో 509.5 మార్కులు సాధించింది. జహీరాబాద్ మండలంలోని చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన దండు అలియాస్ కప్పే అంజయ్య (రిటైర్డ్ ఎంఈఓ), జయశ్రీ (ఎంఏ బీఎడ్)ల పెద్ద కూతురే పూజ యాదవ్. వీరు ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ జిమాక్స్ కాలనీలో నివసిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన పూజ ఇప్పటికే గ్రూప్ –4 సాధించి గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. కాగా గ్రూప్స్‌కు ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ప్రతిభ కనబర్చింది. సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు. -
ఒక్కో నిరసనకు ఒక్కో రిబ్బన్
సందేహాలకు, సంతాపాలకు, నిరసనలకు, అవగాహనలకు ఒక్కో సందర్భానికి ఒక్కో రిబ్బను వాడుతుంటాం. జేబుకు ధరించి నిరసన తెలుపుతాం. కొన్ని రకాల వ్యాధులు, వాటి పేరుకంటే కూడా రిబ్బన్ సింబల్‌తోనే పాపులర్ అయ్యాయి. ఆ సింబల్ చూడగానే వ్యాధిపై అవగాహనకు వచ్చేస్తాం. రిబ్బన్లతో రకరకాల రంగులు నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ రంగు రిబ్బను దేన్ని సూచిస్తుందో.. మీ కోసం సాక్షి ప్రత్యేక కథనం. వెల్దుర్తి(తూప్రాన్): అవగాహన కార్యక్రమాలకు ప్రత్యేకం ● కొన్ని వ్యాధులు రిబ్బన్ సింబల్తోనేపాపులర్ ● ఒక్కో రంగు ఒక్కో అంశం నలుపు రంగు..తమ డిమాండ్లను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేసినప్పుడు నలుపు రంగు రిబ్బన్ ధరిస్తారు. అలాగే మృతిచెందిన వారికి సంతాప సూచకంగా నివాళి అర్పించే సమయంలోనూ వీటిని ధరిస్తారు. ఎరుపు.. ఎయిడ్స్, రక్త క్యాన్సర్, గుండె జబ్బులు, వ్యసనం, విపత్తు, ఉపశమనం తదితర వాటిపై నిర్వహించే సమావేశాల్లో ఎరుపు రంగు రిబ్బన్‌ను ధరిస్తారు. అలాగే అత్యవసర పరిస్థితులకు దీన్ని ఉపయోగిస్తారు. నీలి.. ఈ రిబ్బన్‌ను సుమారు 100కి పైగా సందర్భాల్లో ఉపయోగిస్తారు. మానవ అక్రమ రవాణా, బెదిరింపులకు వ్యతిరేకంగా వీటిని ఉపయోగిస్తారు. జల సంరక్షణపై అవగాహన కల్పించే సమయంలోనూ వీటిని ఇస్తారు. ఆకుపచ్చ.. మూత్రపిండాలు, కాలేయం, అవయవదానం, సురక్షిత వాహన చోదకం తదితర వాటికి ఆకుపచ్చ రిబ్బన్‌ను ఉపయోగిస్తారు. గ్లోబల్ వార్మింగ్‌ను తెలిపే సందర్భంలోనూ దీనిని ఉపయోగిస్తారు. పసుపు.. యుద్ధ ఖైదీలు, తప్పిపోయిన వారి కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పసుపురంగు రిబ్బన్‌ను ధరిస్తారు. ఆత్మహత్యల నివారణకు, ఎముకల క్యాన్సర్ తదితర వాటి గురించి నిర్వహించే అవగాహన సదస్సులో వీటిని ఉపయోగిస్తారు. తెలుపు.. గర్భిణులు, మహిళలపై దాడులు జరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో తెలుపురంగు రిబ్బన్ ధరిస్తారు. సురక్షిత మాతృత్వం, శాంతి, అహింసలను తెలుపుతూ జరిగే కార్యక్రమాల్లో వీటిని ఉపయోగిస్తారు. 18 రకాల రంగులు... మానవ శరీరంలో వివిధ అవయవాలకు సోకిన క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు వైద్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు 18 రకాల రిబ్బన్లను ఉపయోగిస్తారు. క్యాన్సర్ వ్యాధి సోకడానికి కారణాలు, వాటి లక్షణాలు, ట్రీట్మెంట్ విధానం ముందస్తుగా తీసుకోవల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు వీటిని ధరిస్తారు. గులాబీ..గులాబీ రంగు రిబ్బన్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు దీనిని అంతర్జాతీయ గుర్తుగా ఉపయోగిస్తారు. -
మామిడి పూతలా కొత్త ఆశలు..
మామిడి తోరణాలు తెలుగు లోగిళ్లు శ్రీ విశ్వావసుకు స్వాగతం పలుకుతున్నాయి మామిడి పూతలా కొత్త ఆశలు చిగురిస్తూ కొత్త కుండలో షడ్రుచులు కలగలసిన తీరుగా నూతన సంవత్సరాది ప్రతి ఒక్కరిలో ’విశ్వ’మంతటి వెలుగులు నింపాలని తెలుగు మదినిండా ఈ విశ్వ’నామం ఆశలు నింపాలని, చెడును పారద్రోలి ఆశలు ఆశయాలను వెంట తీసుకురావాలని శ్రీ విశ్వావసుని కోరుతూ..స్వాగతం పలుకుదాం – అనంతవరం సిద్ధిరామప్ప, గుండారెడ్డిపల్లి -
సకల శుభములు కలగాలి..
కొత్త మావిచిగురు కోకిల పాటలు, ఆనందనందనం అవనితెలుగు ఉర్వినుగాదియె ఉత్తమపండుగ, కొంగొత్త యాశలు కోర్కులమరువ షడ్రుచుల్, భక్ష్యాలు చవులూరు తెలుగింట, పంచాంగ శ్రవణమౌ పర్వదినము కవి కోకిలలు పాడు కమ్మని పద్యాలు, తెలుగు భాష ఘనత తేజరిల్ల సకల జనులంత జగతిలో చల్లగాను, శాంతి సౌభాగ్య ఆరోగ్య సంపదలను కలిగి వర్ధిల్లవలెగాక చెలువ మీర, సకల శుభములు కలుగాలి సత్వరమున – తాడూరి అరుణాదేవి, హుస్నాబాద్ -
జీవితాల్లో వెలుగులు నింపాలి
పటాన్చెరు/పటాన్చెరు టౌన్: శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆదివారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. అంతకుముందు రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్‌గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్చెరు పట్టణ పరిధిలోని చైతన్యనగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే గూడెం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, ఉగాదిని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రామచంద్ర రెడ్డి,నర్ర బిక్షపతి, శంకర్, వెంకట్ రావు కలసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తన నివాసంలో కలసి శుభాకాంక్షలు అందజేశారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి -
స్నానానికి వెళ్లి కాలువలో పడి..
దౌల్తాబాద్ ( దుబ్బాక ) : స్నానానికి వెళ్లి ప్రమాదశాత్తు కెనాల్ కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్‌దీప్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మచ్చనూరు గ్రామానికి చెందిన ఇర్బ ఎడకే (45) తన భార్య పిల్లలతో రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది కనకరాజు ఇటుక బట్టీలో కూలీ పని కోసం రెండు నెలల క్రితం వచ్చాడు. ఆదివారం ఉదయం రామాయంపేట కెనాల్ కాలువలో స్నానానికి వెళ్లాడు. ప్రమాదశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పరిష్కరించడంలో విఫలం
పట్టణంలో పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, రహదారుల నిర్మాణాలు, వీధి దీపాలు, ఇతర సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కాలనీల్లో చెత్త కుప్పలు, ఇండ్ల మధ్య మురుగునీరు, కచ్చా రోడ్లు, కచ్చా డ్రైనేజీల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పరిష్కరించాలి. –నల్ల జయరాములుగౌడ్, మాజీ కౌన్సిలర్, సదాశివపేట చెత్తబండి రావడం లేదు రాఘవేంద్రనగర్ కాలనీలో ఇంటింటికీ చెత్తసేకరించే బండిరావడం లేదు. ఇంట్లోనే చెత్తను సంచుల్లో నిల్వచేస్తుండటంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తే అందులో వేస్తాం. నిత్యం చెత్త సేకరణ వాహనం వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలి. –శశిమోహన్గౌడ్, రాఘవేంద్రనగర్, సదాశివపేట ఎవరూ పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం కాలనీలో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం కాలనీకి వెళ్లే మార్గంలో మురుగునీటి నిల్వతో దుర్గంధం ఏర్పడింది. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. తరచూ నీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీల కారణంగా నీటి సరఫరా నిలిచిపోతోంది. –ప్రభాకర్, డబుల్ బెడ్రూం కాలనీ, సదాశివపేట పరిష్కరిస్తాం పట్టణ పరిధిలోని కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య సమస్యలు, వీధి దీపాల సమస్యలతోపాటు ఇతర ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటా. ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. – ఉమ, కమిషనర్ సదాశివపేట -
అందరికీ శుభాలు కలగాలి
హుస్నాబాద్: నూతన తెలుగు సంవత్సరాది నుంచి అందరికీ శుభాలు కలగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మంత్రి పొన్నం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. షడ్రుచుల పచ్చడి, బక్ష్యాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ సమృద్ధిగా పాడి పంటలతో అందరూ సుఖంగా జీవించాలన్నారు. ప్ర జాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగేలా భగవంతుడి ఆశీర్వాదం అందాలని కోరా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి రూ.10 కోట్లు మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరైనట్లు సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి పెట్రోల్ బంక్ వరకు సెంట్రల్ లైటింగ్ ప్లాంటేషన్ కోసం రూ.కోటి, మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజురయ్యాయి. అలాగే కొత్త చెరువు సుందరీకరణకు రూ.2కోట్లు, హుస్నాబాద్ మున్సిపల్ స్వాగత తోరణాల ఏర్పాటుకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయన్నారు. నూతన జంక్షన్ల అభివృద్ధి కోసం రూ.80 లక్షలు మంజూరయ్యాయి. ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. ప్లాస్టిక్‌ను నివారిద్దామని, స్టీల్ గ్లాస్లు మేలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం పట్టణంలోని హోటల్ యాజమానులకు స్టీల్ గ్లాస్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. పట్టణంలో 50 హోటల్స్ ఉన్నాయని, ప్రతి హోటల్‌కు వంద గ్లాస్‌ల చొప్పున పంపిణీ చేశామన్నారు. చిన్న గ్రామాల్లో 500 కిట్స్, పెద్ద గ్రామాల్లో 1000 కిట్స్ చొప్పున స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు -
రంజాన్ వేడుకలకు సిద్ధం
సంగారెడ్డి జోన్/జహీరాబాద్ టౌన్: జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం అయింది. మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో నేడు రంజాన్ పండుగ సంబరాలు జరుపుకోనున్నారు. పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోని మసీదులు విద్యుద్దీపాల కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఉదయం 9 గంటల సమయంలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. జహీరాబాద్ ఈద్గా ముస్తాబు... జిల్లాలో అతి పెద్దదైన జహీరాబాద్ ఈద్గా ప్రార్థనలకు ముస్తాబైంది. ఇక్కడ ఒకేసారి సుమారు 25 వేలమంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంది. ఇప్పటికే ప్రార్థనల కోసం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రంజాన్ పండుగ షాపింగ్ కోసం ప్రజలు మార్కెట్‌కు రావడంతో ఆదివారం పట్టణంలో సందడి కనిపించింది. ఘనంగా ఉగాది వేడుకలుఝరాసంగం(జహీరాబాద్)/సంగారెడ్డి /రామచంద్రాపురం (పటాన్చెరు): తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు వివిధ గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇండ్లల్లో ప్రత్యేక పూజలు పచ్చడి తయారు చేశారు. సాయంత్రం సమయాల్లో శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంతోపాటు దత్తగిరి ఆశ్రమంలో పంచాగ పఠనం చేశారు. సంగారెడ్డిలో...జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న రామాలయంలో రాత్రి నిర్వహించిన మొరుండల కార్యక్రమం అందరినీ ఉత్సాహపరిచింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి రామాలయంపై నుంచి ప్యాలాలతో చేసిన మొరుండలను ప్రజల్లోకి విసరగా వాటిని అందుకోవడానికి జనం పోటీపడ్డారు. రామచంద్రాపురంలో...రామచంద్రాపురం,భారతీనగర్ డివిజన్, బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప లు ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో శ్రీలత, స్వరూప ఆధ్వర్యంలో చేపట్టిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రెడ్డి పాల్గొన్నారు.హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటితో ముగియనున్న ఓటీఎస్ పథకంజిన్నారం (పటాన్చెరు): ఈ నెల 31 తో ఒన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ముగియనుందని బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సైతం అధికారులు అందుబాటులో ఉండి పన్నులు వసూలు చేశారు. పారిశ్రామికవేత్తలు, గృహ యజమానులు ముందుకు వచ్చి 90% వడ్డీ రాయితీతో పనులు చెల్లించారు. మెడ్రిచ్ లిమిటెడ్ పరిశ్రమ రూ.5,93,280 , ఎస్డీ స్టీల్ ఇండస్ట్రీస్ రూ.1,82,002, విజేత ఎంటర్ర్పైజెస్ రూ.3,01,898 ఆస్తి పన్ను బకాయిలను చెక్కు రూపంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ...ఇప్పటివరకు 13.75 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేశామన్నారు. -
నోట్లో నురగలతో ముగ్గురు చిన్నారుల మృతి
పటాన్చెరు టౌన్: రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున నోట్లో నురగలతో విగతజీవులై కన్పించారు. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆస్పత్రిలో చేరిన వారి తల్లి చికిత్స పొందుతోంది. సీఐ నరేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు 2008లో వివాహం జరిగింది.2010లో భార్య అనారోగ్యంతో మరణించడంతో 2012లో నల్లగొండ జిల్లా మందాపూర్ గ్రామానికి చెందిన రజిత అలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న సాయికృష్ణ (12), నాలుగో తరగతి చదువుతున్న మధుప్రియ (10), మూడు చదువుతున్న గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా కలిసే భోజనం చేశారు గురువారం రాత్రి 9 గంటల సమయంలో అంతా కలిసి భోజనం చేశారు. పిల్లలు, రజిత పప్పుతో పాటు షాపు నుంచి తెచ్చుకున్న పెరుగుతో అన్నం తిన్నారు. చెన్నయ్య మాత్రం వట్టి పప్పుతో తిని, ట్యాంకర్ తీసుకుని చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగిరాగా, రజిత తలుపులు తీసింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రజిత తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పింది. చెన్నయ్య వెంటనే పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ముగ్గురు పిల్లలు నోటి నుండి నురగలు కక్కుతూ చలనం లేకుండా కనిపించారు.దీంతో వెంటనే బయటకు వెళ్లిన ఆయన ‘కాపాడండి..’అంటూ అరిచాడు. స్ధానికులు రావడంతో పిల్లలు చనిపోయారని, భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు రజితను బీరంగూడలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పారితోష్ పంకజ్, సీఐ నరేష్, క్లూస్ టీం ఇంటి ముందు, వెనుక, భవనంపైన పరిశీలించారు. ఘటనపై స్థానికుల్ని ఆరా తీశారు.పిల్లల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజితతో అమీన్పూర్ పోలీసులు మాట్లాడారు. తాము విషం లాంటిదేమీ తీసుకోలేదని, పప్పు, పెరుగన్నం తిన్నామని, భర్త పప్పుతో అన్నం తిన్నాడని వివరించింది. దీంతో వీరు తిన్న పెరుగులో ఏదైనా కలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్పూర్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరణించిన చిన్నారులు తీసుకున్న ఆహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వంగా విషం కలిపారా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనేది పరిశీలిస్తున్నారు. చిన్నారుల బ్లడ్ శాంపిళ్లతో పాటు, ఇతర శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎస్పీ పరితోష్ పంకజ్ ‘క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాం. స్థానికంగా ఆరా తీశాం. కానీ ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్ధాయిలో తెలియరాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.గతంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి: రజిత తల్లి ‘గత ఏడాది వరకు నా కూతురుకి, అల్లుడికి గొడవలు ఉన్నాయి. అప్పట్లో వచ్చి సర్ది చెప్పి వెళ్లాం. అప్పుడే నా కూతురు.. మళ్లీ గొడవ జరిగితే నేను, నా పిల్లలు మందు తాగి చనిపోతామని, మందు దొరకకపోతే ఎక్కడైనా నదిలో పడి చనిపోతామని చెప్పింది..’అని రజిత తల్లి పార్వతమ్మ మీడియాకు చెప్పింది.కారు ఇచ్చి ఆస్పత్రికి పంపా.. ‘చెన్నయ్య ఏడేళ్లుగా రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా డు. అర్ధరాత్రి రెండున్నర స మయంలో పిల్లలు చనిపోయారని, భార్య ప్రాణాపా య స్థితిలో ఉందంటూ చెన్నయ్య అరవడంతో బ యటకు వచ్చాం. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నేనే కారు ఇచ్చా. డయల్ 100కు, పోలీసులకు సమా చారం ఇచ్చా’అని కాలనీ వాసి ప్రభాకర్ చారి చెప్పారు. -
నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత!
సంగారెడ్డి, సాక్షి: బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటిదాకా సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు.. అభం శుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రిలోనే తుదిశ్వాస విడిచారు. అమీన్ పూర్(Ameenpur) మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. భార్యా, ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Wife Rajitha) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భర్త చెన్నయ్య చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారని నిర్ధారించుకున్నారు. సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8)గా పేర్లను ప్రకటించారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.కాగా, ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషం ఇచ్చి చంపారన్న విషయం ధృవీకరణ కాలేదని.. కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి రజిత ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎస్పీ.. ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
సిద్దిపేటకమాన్: ప్రయాణికులకు ఆర్టీసీ ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తామని సిద్దిపేట డిపో మేనేజర్ టీ.రఘు తెలిపారు. సిద్దిపేట డిపో నూతన మేనేజర్‌గా బదిలీపై వచ్చి ఆయన ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 30 ఏళ్లుగా ఆర్టీసీలో పని చేసిన అనుభవం ఉందని, భూపాలపల్లి, యాదగిరిగుట్ట, హయత్‌నగర్, కాచిగూడ డిపోల్లో మేనేజర్‌గా పని చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. సిద్దిపేట, దుబ్బాక డిపోల్లో సుమారు 500 మంది సిబ్బంది, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారం, సమిష్టి కృష్టితో రెండు డిపోలను లాభాల బాటలో తీసుకెళ్తానన్నారు. రూ.151 కే భద్రాద్రి తలంబ్రాలు ఇంటికి శ్రీరామ నవమి సందర్భంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకు పంపించడం జరుగుతుందని డీఎం తెలిపారు. రూ.151 డబ్బులు చెల్లిస్తే కార్గో ద్వారా ఇంటి వద్దకే తమ సిబ్బంది స్వామి వారి తలంబ్రాలు పంపిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డిపో సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది మౌలానా, తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ టీ.రఘు -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మన్నె లోకేంధర్ (39) తనకున్న ఎకరం పొలంతోపాటు సిద్దిపేట పట్టణ వ్యాపారవేత్తకు చెందిన నాలుగు ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ మాదిరిగా గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పొలం గట్లపై ఏపుగా పెరిగిన గడ్డిని కోస్తున్నాడు. ఈ క్రమంలో బోరుమోటార్‌కు సమీపంలోకి వెళ్లి గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. అక్కడే చుట్టుపక్క ఉన్న అన్న పోచయ్య, సమీప రైతులు వచ్చిచూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య శైలజ, కుమారులు ఆదికై లాష్ (5), వాసుదేవ్ (3), వృద్దురాలైన తల్లి ఉన్నారు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనిల్ తెలిపారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇంటి పనులు చేస్తుండగా పొలం వద్దకు వెళ్లొస్తానంటూ చెప్పి తిరిగిరాని లోకాలకు పోయావా అంటూ లోకేందర్ భార్య శైలజ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరనీ కంటతడి పెట్టించింది. చెన్నాపూర్ గ్రామంలో వ్యక్తి శివ్వంపేట(నర్సాపూర్) : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధి చెన్నాపూర్ గ్రామంలో గురువారం సాయత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సింగిరెడ్డి సుధాకర్‌రెడ్డి(45) గ్రామంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. శివారు పనులు చేసేందుకుగాను తడకలు సరిచేస్తుండగా ఇంటికి దగ్గరగా ఉన్న విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. మృతదేహంతో రాస్తారోకో : విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని మృతదేహంతో గోమారం– చిన్నగొట్టిముక్ల ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకర్‌రెడ్డి విద్యుత్ సిబ్బందితో ఫోన్ మా ట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామ ని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి ములుగు(గజ్వేల్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలం కొక్కొండ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు..గ్రామానికి చెందిన ఆశెల్లి అనిల్‌గౌడ్(30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. 26న సొంత ఆటో నడుపుతూ మండలంలోని బస్వాపూర్ నుంచి కొత్తూర్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో నోవా కంపెనీ సమీంపలోకి రాగానే ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. పక్కనే ఉన్న కాల్వలో పడటంతో అనిల్‌గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడి చిన్ననాన్న నాగులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ టేక్మాల్(మెదక్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రమైన టేక్మాల్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ కథనం మేరకు.. టేక్మాల్ గ్రామానికి చెందిన చింత పోచమ్మ(40) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. నిత్యం మాదిరిగానే 26న సాయంత్రం కల్లు తాగేందుకు ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. గ్రామానికి చెందిన తిమ్మిగారి మధుసూదన్ పోచమ్మ కట్టెల మిషన్ వైపు వెళ్లినట్లు చెప్పడంతో అటువైపు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతురాలి కూతురు జ్యోతిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. పొలం వద్ద గడ్డి కోస్తుండగా ప్రమాదం తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో ఘటన -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
పోలీసుల అదుపులో నిందితుడు కొండపాక(గజ్వేల్): అంబేడ్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన వ్యక్తిని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొండపాక మండలంలోని దమ్మక్కపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు.. దమ్మక్కపల్లి గ్రామంలో కొన్ని నెలల కిందట అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆవిష్కరణ చేయలేదు. ఈ క్రమంలో జింక తిరుపతి అనే వ్యక్తి విగ్రహ గద్దైపె కూర్చోని కట్టెతో చేయిపై కొట్టడంతో పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు విషయం పోలీసులకు చెప్పడంతో ఎస్సై శ్రీనివాస్ విగ్రహాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి గ్రామంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలి
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ శివారెడ్డి హాజరై మాట్లాడారు. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా ఉన్నత విద్య చదివించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే అసమానతలు తొలగుతాయన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా బడ్జెట్ కేటాయింపులు ఉండేలా చూసుకోవాలన్నారు. బీసీ కమిషన్ మెంబర్ బాల్‌లక్ష్మి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు అందించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, సెమినార్ కన్వీనర్ డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్, డాక్టర్ రవినాథ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం తదితరులు పాల్గొన్నారు.జాతీయ సదస్సులో విద్యార్థులకు వక్తల సూచన -
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్జహీరాబాద్: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల డీడీఎస్– కేవీకే ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. వ్యవసాయ శాఖ మద్ధతుతో అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాల వినియోగం, శాసీ్త్రయ వ్యవసాయ విధానాల అనుసరణ ద్వారా రైతులు మరింత లాభదాయకంగా వ్యవసాయం చేయగలరని సూచించారు. కేవీకే ద్వారా రైతులకు శాసీ్త్రయ అవగాహన కల్పించడంపై ప్రశంసించారు. జహీరాబాద్ ప్రాంతంలో పప్పు ధాన్యాలు, నూనెగింజల సాగుపై మెరుగైన అవగాహన కల్పించడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారి రామచారి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల కోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పథకం కింద రెండు గేదెలు లేదా ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకు రుణం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, కేవీకే శాస్త్రవేత్తలు వరప్రసాద్, రమేష్, శైలజ, స్నేహలత, కైలాష్, సాయి ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. -
రైతులకు ‘గుర్తింపు’
ప్రతీ పౌరుడికి ఆధార్ గుర్తింపు కార్డు మాదిరిగానే, ప్రతీ రైతుకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శ్రీఫార్మర్ రిజిస్ట్రీశ్రీ పేరుతో ప్రతీ రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇందు కోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేయగా, సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన మొగుడంపల్లి రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు వీలుగా ఇటీవల ఏడీఏ భిక్షపతి వ్యవసాయ శాఖ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది. – జహీరాబాద్ రైతులకు గుర్తింపు కార్డును ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా రైతులకు ప్రత్యేక కోడ్ ఉండాలనే ఉద్దేశ్యంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పీఎం కిసాన్, క్రాప్ లోన్, పంటల బీమా, యాంత్రీకరణ పరికరాలతోపాటు తదితర పథకాలను సాగుదారుల సంఖ్య ఆధారంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందే రైతుల పథకాలు అమలు చేసేందుకు గాను ఇది ఉపయోగపడుతుంది. బ్యాంకులకు రుణాల కోసం వెళ్తే పట్టాదార్ పాసుపుస్తకం అవసరం లేకుండానే సాగుదారుల సంఖ్య కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. కార్డు ద్వారా భూమికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. ధాన్యం కొనుగోళ్లకు సైతం ఇదే కార్డును వర్తింపజేయనున్నారు. రెవెన్యూ గ్రామం పరిధిలో 9 తండాలు మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో గ్రామంతోపాటు మరో తొమ్మిది తండాలు ఉన్నాయి. గ్రామంతోపాటు ఆయా తండాలకు సంబంధించిన రైతులు 4,123 మంది ఉన్నారు. గ్రామం పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. మొగుడంపల్లి రెవెన్యూ గ్రామం కిందకు పరిసరాల్లో ఉన్న పడియాల్తండా, విఠునాయక్‌తండా, మిర్జంపల్లితండా, లేతమామిడి తండా, మందగుబ్బడి తండా, నందునాయక్ తండా, హరిచంద్నాయక్తండా, చున్నంబట్టితండా, జాంగార్‌బౌలి తండాల రైతాంగానికి ఆధార్‌కార్డు తరహాలో పైలెట్ ప్రాజెక్టు కింద 11 అంకెల సాగుదారుల సంఖ్య పొందుపర్చిన కార్డులను ఇవ్వనున్నారు. తగిన సమాచారంతో నమోదుకు వెళ్లాలి రైతులకు అందించనున్న సాగుదారుల సంఖ్య కార్డు నమోదు కోసం తగిన సమాచారంతో వెళ్లాలి. మొగుడంపల్లి రైతు వేదికలో ప్రత్యేక యాప్‌ద్వారా నమోదు చేస్తారు. ఆధార్‌కార్డు లింకు ఉన్న సెల్‌ఫోన్ నంబరు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లాలి. వ్యవసాయ సిబ్బంది ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తారు. అనంతరం రైతు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నంబర్‌ను సిబ్బందికి చెబితే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్యను కేటాయిస్తారు. అందుబాటులో లేని రైతులు ఫోన్లో అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు చెబితే ప్రత్యేక నంబరును కేటాయిస్తారు. ప్రత్యేక కార్టుల జారీకి ప్రభుత్వం చర్యలు ఆధార్ తరహాలో 11 అంకెల సాగుదారుల సంఖ్య రైతులకు సంబంధించి ప్రతీ పనికి ఈ కార్డు ఉపయోగం మొగుడంపల్లి రెవెన్యూ గ్రామంపైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక ఏప్రిల్ మొదటి వారం నుంచి శ్రీకారం నమోదు ప్రక్రియకు ప్రత్యేక యాప్ ప్రభుత్వ పథకాలకు దోహదం ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సాగుదారుల సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టాదారు పాసుపుస్తకం లేకున్నా ప్రతీ పనికి తాము జారీ చేసే కార్డును తీసుకెళ్తే సరిపోతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయనున్నాం. వివరాల నమోదు కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. యాప్ రాగానే నమోదు ప్రక్రియను మొదలుపెడతాం. మొగుడంపల్లి నుంచి ప్రారంభించి పరిసరాల్లో ఉన్న తండాల్లో కొనసాగిస్తాం. జిల్లాలోనే మొగుడంపల్లిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. –భిక్షపతి,జహీరాబాద్ ఏడీఏ -
వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య
మనోహరాబాద్(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. గురువారం ఎస్ఐ సుభాష్ గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామంలో కమలేష్‌యాదవ్ (25) వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య మమత, కుమారుడు, కూతురు ఉన్నారు. కమలేష్‌యాదవ్ తాగుడుకు బానిసయ్యాడు. బుధవారం రాత్రి బాగా తాగి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం ఉద యం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా గ్రామ శివారులోని శ్మశానవాటిక పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య మందలించడంతో భర్త.. దుబ్బాకటౌన్ : తరచూ మ ద్యం సేవిస్తున్నావని భార్య మందలించడంతో ఉరేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయపోల్ మండలం గొల్లప ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం రాయపోల్ పోలీసుల కథనం మేరకు.. రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎంకొల్ల కుమార్ (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం కుమార్ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య మద్యం ఎందుకు తాగి వచ్చావని మందలించి, అమ్మమ్మగారి గ్రామం చేగుంట మండలం అన్నసాగర్ వెళ్లిపోయింది. భర్త కుమార్ అదే రోజు సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య మహంకాళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఉరేసుకొని మహిళ కంది(సంగారెడ్డి): ఉరేసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన కందిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం మేరకు.. కందికి చెందిన హేమంత్, హేమలత(34) దంపతులకు ఇద్దరు కుమారులు. హేమంత్ బుధవారం రాత్రి ఇంటికి రాగా భార్య తలుపులు తీయలేదు. దీంతో పగులగొట్టి చూడగా హేమలత చీరతో ఉరేసుకొని కనిపించింది. మృతురాలి తల్లి క్యాసారం అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖాపూర్ తండాలో రైతు.. జహీరాబాద్ టౌన్: ఉరేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన కిషన్ నాయక్ పవార్(50)కు సొంత పొలం ఉండగా వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. అప్పుల బాధ లేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిజర్వేషన్లతో ఆర్థికంగా ఎదగాలి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామినారాయణఖేడ్: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మనూరు మండలం కమలాపూర్‌లో దళిత రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకాశ్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న వర్గాలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ అంబేడ్కర్ చూపిన దారిలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పాటుపడిందన్నారు. పేదలకు సబ్సిడీపై ఇచ్చే బియ్యం నేడు దళారీలు కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ షెట్కార్, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్, రాష్ట్ర ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడి.. ఆపై హత్య
వట్పల్లి(అందోల్): మద్యం మత్తులో ఓ మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గురువారం జోగిపేట సీఐ అనిల్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన బుసిరెడ్డిపల్లి కిషన్ 11వ తేదీన ఉదయం ఇంటి వద్ద గ్రామానికి చెందిన మరో మహిళతో మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన గౌరమ్మ(40) తిట్టింది. దీన్ని మనసులో పెట్టుకున్న కిషన్ అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా లోనికి వెళ్లాడు. నన్ను ఎందుకు తిట్టావ్ అని కిషన్ ప్రశ్నించగా రాత్రిపూట నా ఇంటికి వస్తావా అంటూ మహిళ బెదిరించింది. మద్యం మత్తులో ఉన్న కిషన్ ఆమెను శారీరకంగా అనుభవించాడు. అనంతరం గౌరమ్మ పెద్ద మనుషులకు చెప్పి పంచాయితీ పెట్టి పోలీసు కేసు పెడతానని అతడిని బెదిరించింది. వెంటనే కోపోద్రేకుడైన కిషన్ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి వస్తువులు తీసుకున్నాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు గాను కారంపొడి చల్లి మంచాన్ని తగులబెట్టి ఆ మంటల్లో కాలిపోతుందనుకొని వెళ్లిపోయాడు. మరుసటి రోజు గౌరమ్మ మృతి వెలుగులోకి రాగా మృతురాలి సోదరుడు వీరేశం వట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడిగా కిషన్‌ను భావించి వెతుకుతుండగా గ్రామంలో లేడు. గురువారం గ్రామంలోని తన ఇంటికి వచ్చినట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోగా, కుమారుడు హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. మహిళ హత్య కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు తిట్టిందని కక్ష పెంచుకొని గొంతునులిమి చంపిన నిందితుడు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు -
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● రూ.25 కోట్లతో సీఎస్ఆర్ నిధులు వినియోగం ● పనుల పురోగతిపై సమీక్షసంగారెడ్డి జోన్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో గురువారం సీఎస్ఆర్ నిధుల వినియోగం, పనుల పురోగతిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో ప్రభు త్వ పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల మెరుగు కోసం వివిధ అభి వృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 2024– 25 ఆర్థిక ఏడాదిలో జిల్లాలో రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి జిల్లాలోని పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. పరిశ్రమల యజమాన్యాల సహకారంతో జిల్లాలో 2025–26 ఏడాదికి సంబంధించి సీఎస్ఆర్ నిధుల వినియోగాన్ని మరింత ప్రణాళికాబద్ధంగా చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు: లోకేశ్‌కుమార్ మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని రాష్ట్ర పంచాయతి రాజ్ కార్యదర్శి లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయించడం రాష్ట్రా నికి ఆదర్శంగా నిలిచిందని, అదేవిధంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూ సేకరణ చేపట్టాలని అధికారులకు ఆయన తెలిపారు. మహిళలు చేపట్టే పెట్రోల్ బంక్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఎ జ్యోతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేశ్వర్, డీఈఓ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్జ్ పనులు వేగవంతం చేయండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు జహీరాబాద్: నియోజకవర్గంలో గతంలో ఏర్పడిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని గురువారం ఎమ్మెల్యే మాణిక్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. 2011లో నిమ్జ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారన్నారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఉపాధి లభించనుందన్నారు. భారతినగర్ డివిజన్లో జోనల్ కమిషనర్ పర్యటన రామచంద్రాపురం(పటాన్చెరు): భారతినగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి గురువారం పర్యటించారు. బొంబాయి కాలనీ లోని రైతు బజారు నిర్మాణ పనులను పరిశీలించారు. పార్కింగ్ వాల్‌కు గ్రిల్స్ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాక్స్ సొసైటీ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్తను పరిశీలించారు. -
మిగిలింది మూడు రోజులే!
● వందశాతం వసూలు అనుమానమే! ● ఇప్పటివరకు రూ.5.90 కోట్లు వసూలు ● ఆస్తిపన్ను చెల్లించాలంటున్న అధికారులు ప్రయత్నాలు చేస్తున్నాం ఆస్తి(ఇంటి) పన్ను వసూలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రచారం వాహనంతో ప్రతీ రోజు పట్టణంలో చాటింపు వేయిస్తున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరించి ఆస్తిపన్ను చెల్లించాలి. మొండు బకాయిలు కల్గిన వారికి 90% వడ్డీలో రాయితీ ఇచ్చాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 31 లోగా పూర్తి బిల్లులు చెల్లించాలి. –ఉమా మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్ జహీరాబాద్‌టౌన్: జహీరాబాద్ మున్సిపల్‌కు ఇచ్చిన ఆస్తి పన్ను వసూలు గడువు ఇంకా మూడురోజులే ఉంది. ఇప్పటివరకు రూ.5.90 కోట్లు వసూలు చేయగా ఇంకా రూ.11 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గడువు దగ్గర పడుతుండటంతో వంద శాతం పన్ను వసూలు అనుమానంగా ఉంది. మార్చి 31తో నిర్దేశించిన గడువు ముగిస్తుండటంతో పన్ను వసూల్‌కు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో 37 వార్డులున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో ఇళ్లు, వ్యాపార సంస్థలు 29,000 పైగా ఉన్నాయి. పట్టణ విస్తీర్ణంతోపాటు ప్రతీ ఏటా నూతన నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. ఇళ్లు, వ్యాపార సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కలిపి 2024–25 ఆర్థిక ఏడాదికి మున్సిపల్‌కు ఇంటి పన్ను రూ.17 కోట్లు డిమాండ్ ఉంది. పది బృందాల ఏర్పాటు ఇంటి పన్ను వసూలుకు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. బిల్కలెక్టర్లు కలుపుకుని 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కోక్క టీంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఏరియాను బట్టి టార్గెట్‌ను నిర్దేశించి అధికారులు వసూళ్లకు పంపుతున్నారు. ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రతీరోజు పట్టణంలో తిప్పుతున్నారు. అయినా ఆశించిన మేరకు ఆస్తి పన్ను వసూలు కావడంలేదు. గడువు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నందున వందశాతం వసూలు అసాధ్యమంటున్నారు. మొండి బకాయిలు సైతం పేరుకుపోయాయి. వాటిని వసూల్ చేసేందుకు మున్సిపల్ అధికారులు వడ్డీలో 90 శాతం రాయితీ ప్రకటించారు. వడ్డీలో కేవలం పదిశాతం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయినా ఇప్పటి లక్ష్యం అధిగమించడం అనుమానంగా ఉంది. -
ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని శ్రీరుక్మిణీ పాండురంగ ఆలయ 14వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీరుక్మిణీదేవి పాండురంగేశ్వరులకు అభిషేకం,ప్రత్యేక పూజలు చేశారు. ప్రతేకంగా అలంకరించిన వాహనంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి డప్పుచప్పుళ్ల మధ్య పిల్లలు,పెద్దలు,యువకులు భజన చేస్తూ, నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించగా మహిళలు నిండు కలశాలతో విచ్చేశారు. ఆలయం లోశ్రీరుక్మిణి పాండురంగడికి మహాహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్‌గా వినాయక్ పవార్జహీరాబాద్ టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్హెచ్ఆర్సీ)జిల్లా చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన వినాయక్ పవార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మహ్మద్ యాసీన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్ పవార్ మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషిచేస్తానని చెప్పారు. ఐలా నూతన కార్యవర్గం ఎన్నికపటాన్చెరు: పటాన్చెరు పారిశ్రామికవాడలో ఐలా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే చైర్మన్ పదవికి సుధీర్‌రెడ్డిపై పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి అనర్హతకు గురి కావడంతో సుధీర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. వైస్ చైర్మన్ పదవికి పోటీ ఉండటంతో గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహించారు. దీనిలో 134 ఓట్లు పోలవగా ప్రభాకర్‌పై, శ్రీను 112 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే జనరల్ సెక్రటరీగా కుటుంబరావు, కోశాధికారిగా సురేందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా మురళి, సభ్యులు శ్రీశైలం, బసవరావు, శంకర్, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, గంగోత్రి శ్రీనివాస్, శ్రీదేవిలను ఎన్నుకున్నారు. ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలుసంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులు గురువారం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దంపతులను దేవాల య ప్రధాన అర్చకులు వరదాచార్యులు సన్మానించారు. దేవాలయ విశిష్టత గురించి ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇఫ్తార్సంగారెడ్డి జోన్: సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గురువారం రాత్రి ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉప వాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా చిన్నారులకు, అధికారులకు ఎస్పీ పరితోష్ ఖర్జూర పండును తినిపించారు. సంగారెడ్డి ‘బార్’ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నిక సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి బార్ అసోసియేషన్‌లో జరిగిన ఎన్నికల్లో 9వసారి అధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి విజయ ఢంకా మోగించారు. ఉపాధ్యక్షుడిగా భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.మహేశ్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.మల్లేశం, కోశాధికారిగా శ్రీకాంత్, క్రీడల కార్యదర్శిగా టి.శ్రీనివాస్, గ్రంథాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్ రషీద్, మహిళా ప్రతినిధిగా మంజులారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య, సుభాష్ చందర్, నరసింహ, మాణిక్‌రెడ్డి, రాములు, ఎం.దత్తాత్రి, భాస్కర్ విజయం సాధించారు. -
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజా వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాల్సిందేనని, రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజల గోడు పట్టించుకోరా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా గురువారం సీపీఎం సామూహిక నిరహార దీక్షలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్‌యార్డ్ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. ఇప్పటికే పరి శ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. -
సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలి
టీపీటీఎఫ్ డిమాండ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర కుటుంబ సర్వే విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తక్షణమే సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద టీపీటీఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ...గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులకు రూ.10 వేల రెమ్యూనరేషన్ ప్రకటించిందన్నారు. 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేసి ఇచ్చినా ఇప్పటివరకు వారికి ఆ మొత్తాన్ని చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదని, గతేడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్తోపాటు ఇతర పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ పరమేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య సుభాష్ బాబు, భాస్కర్, కమ్రుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరణ కష్టాలు
ఒక్కప్లాటు కోర్టు కేసులో ఉన్నా.. సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లు నిషేధిత జాబితాలోకి.. ● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ● వెంచర్లో ఖాళీ స్థలాలు లేకపోయినా ఓపెన్‌స్పేస్ చార్జీలు కట్టాల్సిందే. ● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ తీరు.. ● మిగతాచోట్ల అంతంతమాత్రం స్పందన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ ఇక్కట్లు కిషన్‌రావు, లక్ష్మణ్లదే కాదు. తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు ముందుకొస్తున్న వేలాది మంది దరఖాస్తుదారులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25% డిస్కౌంట్ ఇస్తామని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తోంది. కానీ ఈ ఎల్ఆర్ఎస్ చెల్లించేందుకు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్య లెవల్–1 స్థాయి అధికారుల వద్ద పరిష్కారమవుతుందా.. లెవల్–2 అధికారుల పరిధిలోకి వస్తుందా..? లెవల్ –3 అధికారు ల వద్దకు వెళ్లాలా తెలియక తికమకపడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నిషేధిత జాబితా కష్టాలు.. ఒక లేఅవుట్లోని సర్వేనంబర్‌లో 200 ప్లాట్లు ఉంటే.. అందులో ఒకటీ.. రెండు ప్లాట్లు కోర్టు కేసుల్లో ఉంటే.. ఆ సర్వే నంబర్లోని అన్ని ప్లాట్లను నిషేధిత (ప్రొహిబీటెడ్) జాబితాలో చూపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలామంది దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సంబంధిత సబ్ రిజిష్ట్రార్ నుంచి ఎన్ఓసీ తీసుకుని ఎల్–1 స్థాయి అధికారులను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. కనిపించని ఓపెన్‌స్పేస్‌లు.. అనధికారిక వెంచర్లు వేసిన అక్రమార్కులు చాలా చోట్ల ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన 10% స్థలాలను (టెన్ పర్సెంట్ ల్యాండ్)లను ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. ఆయా కాలనీల్లో బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పార్కు వంటి వాటి నిర్మాణం కోసం ఈ స్థలాలను కేటాయించాలి. నిబంధనల ప్రకారం ఈ 10% భూమిని సంబంధిత మున్సిపాలిటీగానీ, గ్రామపంచాయతీ తన అధీనంలోకి తీసుకోవాలి. కానీ అధికారులు వెంచర్ నిర్వాహకులతో చేతులు కలపడంతో ఈ ప్రజావసరాల ల్యాండ్ కూడా పరాధీనమైపోయింది. కానీ, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొన్నందుకు లేని ఓపెన్ స్పేస్‌కు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దరఖాస్తుదారులకు ఏర్పడింది. డాక్యుమెంట్స్ షార్ట్‌ఫాల్ పేరుతో... ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో చాలామందికి డాక్యుమెంట్ షార్ట్‌ఫాల్ అని వెబ్సైట్లో చూపుతోంది. అయితే ఏ డాక్యుమెంట్ అవసరమో సాధారణ దరఖాస్తుదారులకు తెలియడం లేదు. సేల్‌డీడ్, ఈసీ, లింక్‌డాక్యుమెంట్లు, లేఅవుట్కాపీ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయి. వీటిని నీర్ణీత సైజులో స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అయితే అంతగా అవగాహన లేని వారికి ఈ సాకేంతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎల్ఆర్ఎస్ వివరాలిలా... వచ్చిన దరఖాస్తులు: 90,546 అప్రూవ్డ్ అయినవి: 54,315 ఫీజు చెల్లించినవి: 8,829 ఇంకా ఫీజు చెల్లించాల్సినవి: 45,514మండల స్థాయి హెల్ప్‌డెస్క్‌ల్లో సమాచారం అంతంతే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ డెస్క్‌ల్లో పనిచేస్తున్న సిబ్బందికి చాలామందికి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. వీరికి శిక్షణ ఇచ్చినప్పటికీ.. చాలామందిలో అవగాహన అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల నుంచి, మండలాల నుంచి దరఖాస్తుదారులు కలెక్టరేట్లకు తరలివస్తున్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి కిషన్‌రావు జోషి. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో ఓ అనధికారిక లేఅవుట్లో 150 గజాల ప్లాట్‌ను 2018లో కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీం కింద తన ప్లాటును క్రమబద్దీకరించుకునేందుకు ప్రయత్నించగా..ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సిటిజన్ లాగిన్ చేస్తే ప్రొహిబిటెడ్ అని చూపిస్తోంది. స్థానిక అధికారులకు సంప్రదించగా సరైన సమాచారం దొరకలేదు. సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను సంప్రదించగా.. సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) తీసుకురావాలని చెప్పారు. దీంతో జోషి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పరుగులు పెట్టారు. రామచంద్రాపురానికి చెందిన లక్ష్మణ్ (పేరు మార్చాం). మండలంలోని పటాన్చెరు మండలంలో ఓ అనధికారిక లేఅవుట్లో ప్లాటు కొనుగోలు చేశారు. ప్రజావసరాల కోసం గ్రామపంచాయతీకి వదలాల్సిన 10% భూమిని కూడా వెంచర్ వేసిన అక్రమార్కుడు ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కానీ లక్ష్మణ్ మాత్రం 10% ల్యాండ్‌కు సంబంధించిన ఓపెన్‌స్పేస్ చార్జీలు 14% చెల్లించాల్సి వస్తోంది. ఓపెన్ స్పేస్ అసలు లేకపోయినప్పటికీ ఈ ఓపెన్‌స్పేస్ చార్జీలను తాను ఎందుకు చెల్లించాలని లక్ష్మణ్ వాపోతున్నారు. -
త్వరలో తహసీల్దార్ల బదిలీలు!
● నెలాఖరులోపు ఉత్తర్వులు! ● నెల క్రితమే ఆప్షన్లు తీసుకున్న రెవెన్యూశాఖ ● కీలక మండలాల్లో పోస్టుల కోసం ఉవ్విళ్లు!సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల బదిలీల్లో భాగంగా వివిధ జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు తిరిగి జిల్లాకు రానున్నారు. రెవెన్యూ శాఖ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేసిన తహసీల్దార్లు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలకు తహసీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి సుమారు ఏడాదిన్నర కాలంగా వీరంతా ఆయా జిల్లాల్లోనే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సొంత జిల్లాకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బదిలీలు కోరుకునే తహసీల్దార్ల నుంచి ఆప్షన్లు కూడా తీసుకున్నారు. ఈ తహసీల్దార్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ ఇలాగే త్వరలోనూ ఉత్తర్వులు వెలువడుతాయని పలుమార్లు చర్చ జరిగినా బదిలీ ఉత్తర్వులు మాత్రం రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలయ్యే వరకు.. స్థానిక సంస్థల ఎన్నికలయ్యే వరకు తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపే అవకాశాలు లేవని గతంలో చర్చ జరిగింది. చాలామంది తహసీల్దార్లు గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. వీరంతా తిరిగి జిల్లాకు చేరుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే భావనతో ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు చర్చ జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు తహసీల్దార్ల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పోస్టులకు భలే డిమాండ్.. జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్ల పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్ పోస్టుల కోసం కొందరు ఉవ్విళ్లురుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయా మండలాల్లో పనిచేసిన కొందరు పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములను నేతలు, బడా బాబులకు కట్టబెట్టడం వెనుక రూ.కోట్లు, అలాగే వారసులు లేని భూములను వందల ఎకరాల్లో పట్టాలు చేసి అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఇలా అక్రమార్జనకు వీలున్న మండలాల్లో తిరిగి పోస్టింగ్ దక్కించుకునేందుకు కొందరు తహసీల్దార్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపిన కొందరు తహసీల్దార్లు ఇప్పుడు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని ఈ కీలక పోస్టులను దక్కించుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కీలక మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు అవే మండలాల్లో పోస్టింగ్‌లు దక్కుతాయా? లేక వీరిని మారుమూల మండలాలకు పోస్టింగ్ ఇస్తారా అనేదానిపై స్పష్టత రావాలంటే ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. -
నేడు డయల్ యువర్ డీఎం
జహీరాబాద్ టౌన్: స్థానిక ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ జాకిర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు, సూచనల గురించి 99592 26269 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన కోరారు. వైభవంగా వీరభద్రుడి రథోత్సవంభారీగా తరలివచ్చిన భక్తజనం జిన్నారం (పటాన్చెరు): జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దివ్య రథోత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్‌రెడ్డి, ఈవో శశిధర్ గుప్తాల ఆధ్వర్యంలో శైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను విభిన్న పూలతో అలంకరించిన రథంలో ప్రతిష్ఠించారు. అనంతరం వీరన్నగూడెం వీధుల్లో భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అర్చక బృందం, భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐఎన్టీయూసీతోనే సమస్యల పరిష్కారంఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి స్పష్టం చేశారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో బుధవారం కిర్బీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. కిర్బీ పరిశ్రమలో వచ్చే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో పరిశ్రమలో ఉన్న ఇతర కార్మిక సంఘాల నాయకులను, కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. త్వరలో కార్మికులతో సర్వసభ్య సమావేశం నిర్వహించి, కార్మికుల మద్దతు కూడగడతామని తెలిపారు. ఘనంగా మహానీయుల జయంత్యుత్సవాలు అదనపు కలెక్టర్ మాధురి సంగారెడ్డి జోన్: ప్రతీ గ్రామంలో మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించేందు కు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మహానీయుల జయంత్యుత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పూలె మహనీయుల జయంత్యుత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి అఖిలేష్ రెడ్డి ,వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, ఈడీఎస్సీ కార్పోరేషన్ రామాచారి, ఎస్సీ ,ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మా ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి మున్నూరు కాపు సంఘం వినతి పత్రాన్ని అందజేసి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ...డంపు యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పూర్తిగా కలుషితంగా మారి పచ్చని పంట పొలాలు అటవీ ప్రాంతం నాశనమవుతాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. -
మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం
ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్చెరు టౌన్: జిల్లాలోని మహిళా ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఐలా కార్యాలయంలో బుధవారం సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణకు ఏర్పాటు నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పరిశ్రమల భద్రతా, పరిశ్రమలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉన్నామని, వారికి భద్రత కోసం షి–షట్లర్ పేరుతో బస్సుల నడుపుతున్నామని, త్వరలోనే మరిన్ని బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల భద్రత దృష్ట్యా ప్రతి కంపెనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సరైన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం పరిశ్రమలకు చెందిన వాహనాల డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆదేశించారు. భారీ వాహనాలు రాత్రి సమయంలోనే అనుమతించాలని సూచించారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ బలోపేతానికి అన్ని పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పారిశ్రామికవాడలలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి త్వరలో ట్రాఫిక్ మార్షల్స్‌ను నియమిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రెజరర్ రమణారెడ్డి, ఐలా వైస్ చైర్మెన్ రాఘవరెడ్డి, ఐలా ట్రెజరర్ రాజు, వివిధ ఫార్మా, ఇంజనీరింగ్ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సీఐలు వినాయక్ రెడ్డి,స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
జహీరాబాద్: కోహీర్ మండలంలో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. బుధవారం మండల వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ మండల కేంద్రమైన కోహీర్తోపాటు మండలంలోని సజ్జాపూర్, ఖానాపూర్, బడంపేట, మాచిరెడ్డిపల్లి, తదితర గ్రామాల్లో సాగులో ఉన్న నేలవాలిన, దెబ్బతిన మొక్కజొన్న, జొన్న పంటల వివరాలను సేకరించారు. పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే విషయాన్ని మండలంలోని ఖానాపూర్ గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికను సమ ర్పించనున్నట్లు ఏఓ పేర్కొన్నారు. -
విషాద వలసగీతం
● ప్లేగు వ్యాధితో తలోదిక్కుకు వలసపోయిన గ్రామస్తులు ● కుప్పానగర్, మేదపల్లి గ్రామాలలో నివాసం ● సాక్ష్యాలుగా మిగిలిన ఆంజనేయస్వామి విగ్రహం, దర్గా.. ● ఊరితో పేగుబంధాన్ని తెంచిన ప్లేగు వ్యాధి ● రెవెన్యూ ఆదాయం గినియర్పల్లికి ఇళ్లు, జనాలు లేని రాంపూర్రాంపూర్ గ్రామ వివరాలు అప్పట్లో ఉన్న కుటుంబాలు 30-40 జనాభా 200(సుమారు) సర్వే నంబర్లు 17 సాగులో ఉన్న భూమి 351.09 ఎకరాలు మా తాతల కాలం నుంచి నివాసం మా తాతల కాలం నుంచి కుప్పానగర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం. అప్పట్లో రాంపూర్ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ నివా సం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం. ప్లేగు వ్యాధి రావటంతో భయాందోళనతో గ్రామాన్ని వదిలి వచ్చినట్లు పెద్దలు చెప్పేవారు. –రాంపూర్ మచ్కూరి రాజమహ్మద్, కుప్పానగర్రెవెన్యూ ఆదాయం మళ్లించాలి రాంపూర్ గ్రామ రెవెన్యూ ఆదాయం గినియార్‌పల్లికి సమకూరుతుంది. అన్ని వసతులతోపాటు దగ్గరగా ఉండే కుప్పానగర్ గ్రామానికి రెవెన్యూ ఆదాయం మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. గతంలో రెవెన్యూపరంగా ఏదైనా అవసరం ఉంటే కుప్పానగర్ గ్రామ వీఆర్వో ఇచ్చేవారు. అక్కడికి వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాలి. –రాంపూర్ ప్రకాశ్, కుప్పానగర్ఒకప్పుడు లేలేత భానుడి కిరణాలతో మేల్కొనే గ్రామం...వ్యవసాయ పనులకెళ్లే జనాలతో, వంటింటి పనులు చేసుకునే మహిళలతోనూ, ఆడి పాడే పిల్లాపాపలు, పశుపక్ష్యాదులతోనూ నిత్యం జన సంచారంతో సందడిగా ఉండేది. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం. కానీ, ఇప్పుడా పల్లెసీమ చరిత్రకు ఆనవాళ్లై పోయింది. ఇప్పుడా ఊళ్లో ఇళ్లూ లేవు...అందులో జనాలూ లేరు. నాడు మహమ్మారిగా పేరొందిన ప్లేగు వ్యాధి ఊరిని కబళించడంతో భయంతో తలోదిక్కుకూ వలస వెళ్లిపోయారు. రెవెన్యూ రికార్డుల్లోనూ, చరిత్రపుటల్లోనూ మాత్రమే మిగిలిపోయిన ఝరాసంగం మండలానికి చెందిన ఆ ఊరి పేరు రాంపూర్. ఈ గ్రామానిది ఓ విషాద వలసగీతం. సంగారెడ్డిజోన్: రాంపూర్‌లో వ్యవసాయ భూములు, పాడుబడిన ఇళ్ల పునాదులు, ఓ గుడి, దర్గా మాత్రమే ఉన్నాయి. ఇక రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వ్యవసాయభూములు, వాటి సర్వే నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. 90 ఏళ్ల క్రితం 30 నుంచి 40 కుటుంబాలు సుమారు 200 మంది వరకు నివాసం ఉండేవారు. అప్పట్లో ప్లేగు మహమ్మారి వ్యాధితో గ్రామంలో చాలామంది మృత్యువాత పడ్డారు. దీంతో సరైన వైద్యం, వైద్య సదుపాయాలు లేక భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇతర గ్రామాలకు వలస వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువమంది ఇదే మండలంలోని కుప్పానగర్, మేదపల్లి గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. 17 సర్వే నంబర్లు.. 351.09 ఎకరాల భూమి రాంపూర్ గ్రామంలో జనం లేకపోయినప్పటికీ అక్కడి ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన వారు భూములను సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు. ప్రతీ రోజు నివాసం ఉంటున్న గ్రామాల నుంచి వెళ్లి పనులు చేసుకుని వస్తుంటారు. రెవె న్యూ (ధరణి) ప్రకారం రాంపూర్ గ్రామం పేరుతో 17 సర్వే నంబర్లు 351.09 ఎకరాల భూముల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆదాయం గినియర్పల్లికి రాంపూర్ గ్రామ రెవెన్యూ ఆదాయం ఇదే మండలంలోని గినియార్‌పల్లి గ్రామానికి సమకూరుతోంది. గ్రామంలో భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగినా వాటి ద్వారా వచ్చే ఆదాయం గినియార్‌పల్లికి చేరుతుంది. రాంపూర్‌లో ఉన్న ఒక కంకర్ క్రషర్ వల్ల వచ్చే ఆదాయం కూడా గినియార్పల్లికే చెల్లిస్తున్నారు. గతంలో ఏదైనా రెవెన్యూ రికార్డులు అవసరం ఉంటే కుప్పానగర్ గ్రామ వీఆర్వో ఇచ్చే వారని రాంపూర్ గ్రామస్తులు చెబుతున్నారు. అనుసంధానంగా కుప్పానగర్ రాంపూర్ గ్రామానికి కుప్పానగర్ అనుసంధానంగా ఉండేది. వ్యవసాయ భూములు ఇక్కడి శివారులో ఉన్నప్పటికీ సంబంధం లేని గినియార్‌పల్లికి రెవెన్యూ ఆదాయం ఎందుకు సమకూరుతుందో అర్థం కావటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని కుప్పానగర్కు మళ్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంరాంపూర్లో ఉన్న దర్గాప్రస్తుతం జనావాసం లేని ఆ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, గైబ్ సాహెబ్ దర్గాతో పా టు ఇళ్లకు సంబంధించిన పునాదిరాళ్లు నాటి గ్రామానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న స్వామి వారి విగ్రహానికి అప్పుడప్పుడు పూజలు, దర్గా వద్ద ఏడాదికొకసారి ప్రార్థనలు చేస్తున్నారు. రాంపూర్‌కు బిడెకన్నె గ్రామానికి మధ్య గుట్టపై శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ నిత్య పూజలు చేస్తుంటారు. పలు సినిమాల షూటింగ్‌లు సైతం జరిగాయి. -
అల్బెండజోల్.. ఆలస్యమేనా?
● మాత్రల పంపిణీలో జాప్యం ● గత నెల 10న అందించాలని ఏర్పాట్లు ● అనివార్య కారణాలతో నిలుపుదల ● 45 రోజులు దాటినా స్పష్టత కరువు ● జిల్లాలో 4,05,207 మంది పిల్లల గుర్తింపు పిల్లలపై ప్రభావం.. నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.సదాశివపేటరూరల్(సంగారెడ్డి): నులిపురుగుల నివారణకు ప్రతి ఏటా ఒకటి నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారికి అల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కానీ, ఈ ఏడాది వీటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత నెల 10న మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా అవి సరఫరా కాకపోవడంతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పటికీ 45రోజులు దాటినా మళ్లీ ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపై స్పష్టత కరువైంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నులిపురుగుల (నట్టల) నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో 4లక్షలకు పైగా పిల్లలు జిల్లాలో 119 ఏళ్లలోపు 4,05,207 పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకు గాను సంబంధించి జిల్లాలోని ఏఎన్ఎంలకు, ఆశావర్కర్లకు, వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు శిక్షణ సైతం ఇచ్చారు. నాణ్యత లేకపోవడమే కారణమా..! పిల్లలకు పంపిణీ చేయాల్సిన అల్బెండజోల్ మాత్రలు నాణ్యతగా లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. అల్బెండజోల్ మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలం కావడంతో ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. వయస్సును బట్టి మాత్ర.. ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సగంమాత్ర స్పూన్ ద్వారా పొడి చేసి నీటిలో వేయాలి. దీనిని మధ్యాహ్న భోజనం తర్వాత వేయాల్సి ఉంటుంది. 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్ర పొడిచేసి వేయాలి. 3 నుంచి 19 సంవత్సరాల వారికి చప్పరించి లేదా నమిలి మింగేటట్లు చూడాలి. అపరిశుభ్రత వల్లే నులి పురుగులు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తినడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చేతి గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. నులి పురుగులతో అనేక అనర్థాలు నులి పురుగులతో పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మాత్రలు సరఫరా కాలేదు అల్బెండజోల్ మాత్రలు సరఫరా కాకపోవడంతో గత నెల 10న నిర్వహించాల్సిన కార్యక్రమం వాయిదా పడిన మాట వాస్తవమే. జిల్లాకు సుమారు 4.5లక్షల మాత్రలు అవస రం ఉంది. ప్రభుత్వం నుంచి మాత్రలు రాగానే పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. –శశాంక్ దేశ్ పాండే,జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి,సంగారెడ్డి -
వైద్యాధికారి సస్పెన్షన్
● మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు ● కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశం సంగారెడ్డి జోన్/జహీరాబాద్ టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటుగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డా.అజ్మనాజ్ను విధులనుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతి తొలగించారు. ఈమెతోపాటుగా దౌల్తా బాద్, మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు అందించాలని జిల్లా వైద్యాధికారి డా.గాయత్రీదేవిని ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి తగిన సూచనలు సలహాలు అందించి, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 2023 –24 సంవత్సరం పోల్చితే 2024–25 సంవత్సరంలో మాతా శిశు మరణాలు 50% తగ్గినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లోని స్కానింగ్ సెంటర్లను ప్రతీ నెల తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. సక్రమంగా లేని ఆస్పత్రులను సీజ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.గాయత్రీదేవి, సీనియర్ జడ్జి రమేశ్, అదనపు ఎస్పీ సంజీవరావు, రెడ్ క్రాస్ చైర్మన్ వనజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సర్వే డబ్బులు చెల్లించాలి: ఎస్జీటీ ఆర్థిక, సామాజిక సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇంతవరకు చెల్లించలేదని, నిధులు విడుదల చేయాలని ఎస్జీటీ నాయకులు కలెక్టర్ కాంత్రిని కోరారు. ఈ మేరకు ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుల ప్రభాకర్, నిమ్మల కిష్టయ్యలు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. -
న్యూమోనియాతో బాధపడుతూ నాలుగేళ్ల చిన్నారి
సిద్దిపేటజోన్: న్యూమెనియాతో బాధపడుతున్న నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీకాంత్ చారి, స్వాతిల ఏకై క కుమార్తె మాన్విత(4) 12 రోజుల కిందట అస్వస్థతకు గురికాగా స్థానిక సందీప్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతుంది. బుధవారం అకస్మాతుగా పాప పరిస్థితి విషమించి మృతి చెందింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే పాప పరిస్థితి విషయంగా మారి చనిపోయిందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంతోనే పాప చనిపోయిందని బంధువులు ఆరోపించారు. పాపను కాపాడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, ఇందులో మా నిర్లక్ష్యం ఏమిలేదని ఆసుపత్రి నిర్వహకులు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నకిలీ ఔషధాలు తయారు చేయడం లేదు
మర్కూక్(గజ్వేల్): మండలంలోని కర్కపట్లలో ఉన్న జోడాస్ ఎక్స్ పోయిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నకిలీ ఔషధాలు తయారు చేయడం లేదని జోడాస్ పరిశ్రమ హెచ్ఆర్ శ్రీకాంత్, నూకరాజు తెలిపారు. బుధవారం పరిశ్రమలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ ఔషధాల ప్యాకింగ్ కవర్లపై రష్యా భాషలో ముద్రించడంతో కొంతమంది బాహ్య వాటాదారులు నకిలీ మందులు పంపిణీ చేస్తున్నారని నకిలీ ఔషధ పంపిణీ కేసుగా చిత్రీకరించారన్నారు. ఈ సమస్య రష్యాలో విస్తరించడంతో ఔషధ పంపిణీ విషయంలో తమ పరిశ్రమకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ యజమానులు తమ నివేదికలను డీసీఏ తెలంగాణకు సమర్పించారని వెంటనే వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పరిశీలించి కాంట్రాక్ట్ మాన్యూ ఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్( సీఎంఓ) ద్వారా చట్టబద్ధంగా తయారు చేయబడ్డాయని స్పష్టం చేశారన్నారు. అందుకు గాను ధ్రువీకరణ పత్రాలను అధికారులు బుధవారం అందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన ఔషధాలను మాత్రమే తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సీఎంఓ ద్వారా చట్టబద్ధంగా ధ్రువీకరించారు జోడాస్ పరిశ్రమ హెచ్ఆర్ శ్రీకాంత్ -
ఆదాయంపై శ్రద్ధ.. సమస్యలపై అశ్రద్ధ
తెల్లాపూర్ మున్సిపాలిటీ ● అస్తవ్యస్తంగా పాలన.. రోడ్లపై చెత్త కుప్పలు ● సమస్యలను పట్టించుకోని అధికారులు ● జోరుగా అక్రమ నిర్మాణాలు చెరువులోకి మురుగునీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లి నలగండ్ల ప్రాంతాలకు చెందిన మురుగునీరు చెరువులోకి చేరుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు పూర్తి కాలుష్యమవుతున్నాయి. తెల్లాపూర్ మున్సిపల్ వివరాలు తెల్లాపూర్ మున్సిపల్ ఏర్పాటు 2018 పట్టణంలోని వార్డులు 17 జనాభా 11,742 (2011 ప్రకారం) ప్రస్తుతం 2 లక్షలపైగా రెవెన్యూ జోన్లు 5 ఇళ్ల సంఖ్య 42,298 అవసరమైన తాగునీరు 11 ఎంఎల్డీ చెత్త సేకరణ వాహనాలు 27 పబ్లిక్ టాయిలెట్స్ 5 విద్యుత్ దీపాలు 4,24,621 మహిళా గ్రూపులు 379 పారిశుద్ధ్య కార్మికులు 150రామచంద్రాపురం(పటాన్చెరు): మున్సిపల్ పాలక వర్గం పదవీకాలం పూర్తికావడంతో ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులను సమకూర్చడంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు తప్ప అందులో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. రహదారులపైనే చెత్తకుప్పలు, డ్రైనేజీ నీరు పూడికతీత లేక పొంగిపొర్లుతుండటం, పలు కాలనీలకు చెందిన మురుగునీరు చెరువులోకి చేరుతుడటం వంటి సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నా అధికారులకు కంటికి మాత్రం కనిపించడం లేదు. రోడ్లపై చెత్త కుప్పలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రేడియల్ రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పలు వార్డులలో సైతం రోడ్లపై చెత్త వేసి తగలబెడుతున్నారు. విద్యుత్‌నగర్ నుంచి తెల్లాపూర్ మార్గంలో, కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సమీపంలోని రేడియల్పై, ఈదులనాగులపల్లి గ్రామ ముఖద్వారం, వెలిమెల, కొల్లూరు, విద్యుత్‌నగర్ ముత్తంగి, రోడ్ల పక్కల పెద్ద ఎత్తున చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అస్తవ్యస్తంగా చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఐదెకరాల్లో రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డ్‌ను అధికారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. పొడి,తడి చెత్తను వేరు చేయకుండా ముత్తంగి, వెలిమెల, అనేక ప్రాంతాలలో చెత్తను తగలబెడుతున్నారు. అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.2కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు స్థలంను కేటాయించి పనులు మొదలుపెట్టారు. కానీ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులను నిలిపివేయడంతో ఇంటిగ్రేటెట్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అక్రమ నిర్మాణాలకు అండగా నూతనంగా మున్సిపల్లో విలీనమైన గ్రామాల పరిధిలో అధికారుల అండతో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రోడ్లపై మట్టి తెల్లాపూర్‌లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రేడియల్ రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి కుప్పలున్నా వాటిని తొలగించిన పాపానపోవడంలేదు. దాంతో కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. వెలగని దీపాలు మున్సిపల్ పరిధిలోని పలుచోట్ల రోడ్లపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రిసమయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తెల్లాపూర్‌లోని మైఫేర్, రేడియల్ రోడ్డుతోపాటు పలు ప్రాంతాలలో విద్యుత్ దీపాలు వెలగడం లేదు. ఆసుపత్రికి స్థలం కేటాయించినా... జనాభాకు సరిపడా ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తెల్లాపూర్‌లో 30పడకల ఆసుపత్రిని మంజూరు చేసి అందుకు కావాల్సిన స్థలాన్ని సైతం కేటాయించింది. కానీ, పనులను మాత్రం ప్రారంభించడం లేదు. పనిచేయని సీసీ కెమెరాలు తెల్లాపూర్, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విద్యుత్‌నగర్ కాలనీలలో సుమారు 300 సీసీ కెమెరాలున్నాయి. కానీ అందులో సుమారు 200పైగా సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. -
రాష్ట్రస్థాయి పోటీలకు పూలే విద్యార్థినులు
వర్గల్(గజ్వేల్): వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ రాష్ట్రస్థాయి పోటీలకు వర్గల్ జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో ‘ఒక దేశం–ఒక ఎన్నిక’ అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గురుకుల కళాశాలకు చెందిన ఫైనలియర్ విద్యార్థినులు పుప్పాల శ్రీజ, గంగుల నవ్య చక్కని ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. వీరికి హైదరాబాద్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడే అరుదైన అవకాశం లభించనుందని తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తోపాటు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రాధారాణి, భాగ్యలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు. మహిళలతో అసభ్యకర ప్రవర్తన– ఇద్దరు రిమాండ్ మెదక్ మున్సిపాలిటీ: మద్యం మత్తులో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ నాగరాజు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు మంగళవారం రాత్రి పాత బస్టాండ్ వద్ద నుంచి స్కూటీపై వెళ్తున్నారు. మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న మెదక్ పట్టణానికి చెందిన ప్రదీప్‌కుమార్, గిరికల మహేశ్ కుమార్ మహిళల పక్క నుంచి వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. పక్కన ఉన్న వారు వారించే ప్రయత్నం చేసినా వినలేదు. బాధిత మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇద్దరిపై పోక్సో కేసుకొమురవెల్లి(సిద్దిపేట): రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం చేర్యాల సీఐ శ్రీను కథనం మేరకు.. మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన దినేష్, చేర్యాల పట్టణానికి చెందిన రాములు ఇద్దరు మైనర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. యువకుడు గల్లంతు మనోహరాబాద్(తూప్రాన్): చెరువులో యువకుడు గల్లంతమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మన్నె అజయ్‌కుమార్ (26) చేపలు పట్టడానికి గ్రామ చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గ్రామస్తులతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం మరోసారి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దు:ఖం దిగమింగి.. పరీక్ష రాసి
నిజాంపేట(మెదక్): తండ్రి మరణించిన బాధను దిగమింగుకొని విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఈ ఘటన మండలంలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యం (48) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉండగా.. రెండో కూతురు కావ్యశ్రీ కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. తండ్రి గుండెపోటుతో మృతి చెందాడని ఉదయమే సమాచారం రావడంతో తోటి విద్యార్థులు ఓదార్చారు. పరీక్ష రాసేలా ధైర్యం చెప్పారు. కావ్యశ్రీ గణితశాస్త్రం పరీక్ష రాసి నస్కల్ గ్రామంలోని తండ్రి అంత్యక్రియలకు హాజరైంది. -
నిండా ముంచిన నకిలీ మందులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): పంట ఎర్రబడుతుందని, దోమకాటు రక్షణకు మందులను పిచికారీ చేస్తే ఉన్న వరి పంట ఎండుముఖం పట్టింది.. ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు ఏకంగా ఆరు ఎకరాల పంటను నకిలీ మందులు నట్టెట ముంచాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చేబర్తి బాల పోచయ్య తనకున్న రెండు ఎకరాలతోపాటు 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని యాసంగిలో వరి సాగు చేశారు. కెనాల్ కాల్వ, బోర్ల ద్వారా పంటకు సాగునీరు పెడుతూ పంటను కాపాడుకుంటున్నాడు. కాగా వరి పంట ఎర్రబడుతుందని, పొట్ట సమయంలో దోమ కాటు నివారణ కోసం గజ్వేల్‌లోని శ్రీనిధి ట్రేడర్స్‌లో రూ.4,050 చెల్లించి ట్రెండ్, అచిబు వరి మందులను తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరు ఎకరాల వరి పంటకు పిచికారీ చేశారు. బుధవారం ఉదయం వరి పంటను చూసేసరికి ఎండుముఖం పట్టింది. దీంతో సదరు రైతు చేతికొచ్చే సమయంలో వరి ఎండిపోవడంతో ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే మందులు కొనుగోలు చేసిన డీలర్‌కు సమాచారం అందించారు. పంటను చూసి సదరు మందుల కంపెనీ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టినట్లు రైతు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎర్రబడుతుందని పిచికారీ చేస్తే ఎండిపోయింది ఆరు ఎకరాల పంట నష్టపోయాయని ఓ రైతు ఆవేదన -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
అల్లాదుర్గం(మెదక్): ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం మేరకు.. అల్లాదుర్గం గ్రామానికి చెందిన కుమార్(28) పంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు వచ్చే కొద్ది పాటి వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వేతనం సరిపోక సమయానికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది 21న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే జోగిపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ ఉస్మానియాకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాంచంద్రాపూర్‌లో మరో యువకుడు కోహెడరూరల్(హుస్నాబాద్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు సుంకరి ప్రశాంత్(19) కొద్దిరోజులుగా ఏం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన ప్రశాంత్ వారం రోజుల కిందట క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. -
దోమలతో ఇబ్బందులు పడుతున్నాం
దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. దోమల నివారణకు అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చెత్త సేకరణ కూడా సరిగా లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. – సురేశ్, తెల్లాపూర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు కారణంగా నిత్యం కొత్తవారు వస్తుంటారు. సీసీ కెమెరాలు ఉంటే ఎంతో ఉపయోగం. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. – రాజిరెడ్డి, తెల్లాపూర్ నిత్యం అందుబాటులో ఉంటున్నాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉంది. రోడ్డుపై చెత్త వేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. – సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్, తెల్లాపూర్ -
ఇక ఐదేళ్ల పిల్లల వరకు ‘కాక్లియర్’ చికిత్సలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మూగ, వినికిడి లోపమున్న చిన్నారులకు అందించే కాక్లియర్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సల విషయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీదైన ఈ చికిత్స చేయించుకొనే చిన్నారుల వయసు పరిమితిని ప్రస్తుతమున్న మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మేనేజర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే ఈ వైకల్యం గురించి తల్లిదండ్రులకు స్పష్టత వచ్చేసరికే మూడేళ్లు దాటిపోతోంది. దీంతో సుమారు రూ. 8–10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను నిరుపేదలు వారి పిల్లలకు చేయించలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉండే వినికిడి పరికరాలతో నెట్టుకొస్తున్నారు. తాజాగా వయసు పరిమితిని ఐదేళ్లకు పెంచడంతో నిరుపేద చిన్నారులకు ఈ చికిత్స ఉచితంగా అందే అవకాశాలున్నాయి. ఆరోగ్యశ్రీలో చేర్చిన వైఎస్ఆర్.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అందులో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను చేర్చలేదు. అయితే దీనిపై ఎందరో తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు రావడంతో స్పందించిన ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చే ర్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద అందించే వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచిం ది. ఈ పథకంలో అందించే ఉచిత వైద్య చికిత్సలు, సేవల సంఖ్యను 1,835కు పెంచింది. అయితే కొన్ని నిబంధనల కారణంగా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య ట్రస్ట్ కమిటీ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బయటకు కనిపించకుండా.. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సలో భాగంగా చిన్నారుల చెవికి శస్త్రచికిత్స నిర్వహించి ప్రత్యేక పరికరాన్ని చెవిలో అమరుస్తారు. చెవి వెనుక అమర్చిన సౌండ్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తారు. ఇది ధ్వని సంకేతాలను మెదడుకు పంపుతుంది. ఈ పరికరం జీవితాంతం చెవి లోపలే ఉంటుంది. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు మరో మూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్సను అందిస్తున్నారు. -
వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ
చేర్యాల(సిద్దిపేట): వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని, పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ శతవసంత వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుంచి అంగడిబజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీ ఖానాలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల ఆశయాల సాధనకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు. 100 ఏళ్ల పోరాటాలు, త్యాగాలు వంటి గొప్ప చరిత్ర కలిగిన ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, జనగా మ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు దయానందరెడ్డి, సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, శంకర్, జనా ర్దన్, భూమయ్య, బాలుమోహన్, పద్మ, నరేశ్, రజిని, మమత, మహేందర్, కృష్ణ, భాస్కర్‌రెడ్డి, సుదర్శన్, ప్రేమ్, బాల్‌రెడ్డి, భాస్కర్, బన్సిలాల్, సత్త య్య, నర్సింహచారి, అశోక్, కనకయ్య, శ్రీకాంత్, సురేందర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి చేర్యాలలో శతవసంత ర్యాలీ, బహిరంగ సభ -
పీపీఈ కిట్లు ధరించి పనులు చేయాలి
చేగుంట(తూప్రాన్): పొలం పనులు చేసే సమయా ల్లో కొన్ని సందర్భాల్లో పీపీఈ కిట్లు ధరించాలని సింజెంటా సీడ్స్ మేనేజర్ సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పొలంపల్లి గ్రామాన్ని సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు సందర్శించి రైతులకు సూచనలు చేసారు. మేనేజర్ మాట్లాడుతూ.. రైతులు సస్యరక్షణ చర్యల సమయంలో భద్రత కోసం ప్రత్యేక కిట్లు ధరించాలని తెలిపారు. అనంతరం సింజెంటా టీమ్ సభ్యులు రైతులతో మాట్లాడి వ్యవసాయం గ్రామంలో జరుగుతున్న వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సాయంగా గ్రామంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సింజెంటా ప్రతినిధులు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ రైతులు సింజెంటా ప్రతినిథులు పాల్గొన్నారు.పొలంపల్లి గ్రామాన్ని సందర్శించిన సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
వర్గల్(గజ్వేల్): 2025–26 విద్యాసంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయం ఆరో తరగతిలో ప్రవేశం కోసం జనవరి 18న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఫలితాల వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు సమాచారం చేర వేశామని, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్ఈఐటీ.ఇన్/సీబీఎస్ఈ/2025/ఎన్వీఎస్–ఆర్ఈఎస్యూఎల్టీ/రిజల్ట్.ఏఎస్పీఎక్స్ వెబ్సైట్లో నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అర్హత పొందిన 80 మంది అభ్యర్థులకు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం చేర వేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం 94489 01318 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. తొమ్మిదో తరగతి ఫలితాలు నవోదయలో తొమ్మిదో తరగతి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 8న నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్ష (లేటరల్ ఎంట్రీ) ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్ఈఐటీ.ఇన్/సీబీఎస్ఈ/2025/ఎన్వీఎస్–ఆర్ఈఎస్యూఎల్టీ/ఆర్ఈఎస్సీఎల్ఎస్ఐఎక్స్.ఏఎస్పీఎక్స్ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. ఆరో తరగతిలో ప్రవేశాలు తొమ్మిదో తరగతి ఖాళీ సీట్ల భర్తీ ఫలితాలు కూడా.. వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్ రాజేందర్ -
పొలం ఎకరం.. మడిమడికో రకం
పల్లేరులు మొలిచిన చోట పసిడి పంటలుతోటలోని క్యాబేజీని చూపిస్తున్న వెంకటరావుహుస్నాబాద్రూరల్: పల్లేరులు మొలిచే దుబ్బ నేల కరువు నీళ్లకు ఏం ఎవుసం చేసినా ఏ పంటలు పడుతాయి, రూ.లక్షలు పెట్టి బోరువేసినా కొద్దిపాటి నీరే వచ్చే, ఏ పంట వేసినా చేతికి వచ్చే వరకు బోరు నీరు పోస్తదా..? అనే సందేహం ఆ ఏడు పదుల రైతును ఆలోచింపజేసింది. బాటన పోయేవారు ఏలెత్తి చూపి గీ.. నీళ్లకు ఏం ఎవుసం చేత్తవ్ అనే వాల్లె తప్ప ప్రోత్సహించే వారు లేరు. రైతుకు తన మదిలో మెదిలే ఆలోచనలను ఒక్కొక్కటి అమలు చేసి ఎకరం భూమిలో 20 రకాల పంటలను సాగు చేసి పల్లేరులు మొలసిన చోటనే పసిడి పంటలు పండించి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఏడు పదుల రైతు వెంకటరావు.. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మంతెన వెంకటరావు డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారంలోకి దిగాడు. హుస్నాబాద్ పట్టణంలో స్థిరపడ్డ వెంకటరావు వ్యవసాయ అవసరాలైన పైపులు, మోటార్ల వ్యాపారం మొదలు పెట్టాడు. ఊరిలో అమ్మానాన్న ఇచ్చిన వ్యవసాయ భూమి వైపు కన్నెతి చూడలేదు. పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో ఒక బిడ్డ హైదరాబాద్‌లో వైద్యురాలిగా సేవలందిస్తుంది. వృద్ధాప్యం రావడంతో వ్యాపారం బంద్ చేసి దుకాణంను వేరొకరికి లీజుకు ఇచ్చాడు.● బంతి పూలు, స్వీట్‌కార్న్, కూరగాయలు సాగు ● ఏడు పదుల వయస్సులోనూ వ్యవసాయం ● ఆదర్శంగా నిలుస్తున్న తోటపల్లి గ్రామానికి చెందిన మంతెన వెంకటరావురూ.1.50 లక్షలతో బోరు పుట్టిన ఊరిలో అమ్మానాన్న ఇచ్చిన ఎకరం వ్యవసాయ భూమిలో ఏదైనా సాగు చేయాలనే ఆలోచన తట్టగానే రూ.1.50 లక్షలతో బోరు వేయించాడు. బోరు నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో పంటలు పండించడం కష్టమే అయినా స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. వేరుశనగ, బంతి పూలు, మిరప, స్వీట్‌కార్న్, బెండ, సోర, వంకాయ, క్యాబేజీ, బీర, కోతి మీర, చిక్కుడు, టమాట కూరగాయలు సాగు చేస్తున్నాడు. స్వల్పకాలిక పంటలు కావడంతో కష్టానికి ఫలితం వస్తుందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. పల్లేరులు మొలిచిన చోటనే రైతు ఆలోచనతో పసిడి పంటలు తీసి పల్లె రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మిరప తోటలో రైతునీరు చూసి పంటలు వేయాలి బోరు వేసినప్పుడు కొద్దిపాటి నీరే వచ్చింది. ఈ నీళ్లతో ఏ పంటలు పండుతాయని అందరూ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం వల్ల తక్కువ కాలంలో లాభాలను పొందవచ్చని ఆలోచన వచ్చింది. స్వీట్‌కార్న్, వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయలు, మిరప వీటికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మూడు గుంటల బంతి పూలు పెడితే రూ.20 వేలు వచ్చినయ్, మిర్చి మూడు నెలల నుంచి కాస్తనే ఉంది. సాగుకు పని చేయదు అన్న భూమిలోనే రకరకాల పంటలు వేస్తున్నాను. మన చేళ్లలో పండిన కాయలు, పంటలు మన ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. – మంతెన వెంకటరావు, కిషన్‌నగర్ -
‘నవోదయ’ ఫలితాలు విడుదల
వర్గల్(గజ్వేల్): 2025–26 విద్యాసంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయం ఆరో తరగతిలో ప్రవేశం కోసం జనవరి 18న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఫలితాల వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు సమాచారం చేర వేశామని, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్ఈఐటీ.ఇన్/సీబీఎస్ఈ/2025/ఎన్వీఎస్–ఆర్ఈఎస్యూఎల్టీ/రిజల్ట్.ఏఎస్పీఎక్స్ వెబ్సైట్లో నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అర్హత పొందిన 80 మంది అభ్యర్థులకు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం చేర వేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం 94489 01318 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. తొమ్మిదో తరగతి ఫలితాలు నవోదయలో తొమ్మిదో తరగతి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 8న నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్ష (లేటరల్ ఎంట్రీ) ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్ఈఐటీ.ఇన్/సీబీఎస్ఈ/2025/ఎన్వీఎస్–ఆర్ఈఎస్యూఎల్టీ/ఆర్ఈఎస్సీఎల్ఎస్ఐఎక్స్.ఏఎస్పీఎక్స్ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు. ఆరో తరగతిలో ప్రవేశాలు తొమ్మిదో తరగతి ఖాళీ సీట్ల భర్తీ ఫలితాలు కూడా.. వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్ రాజేందర్ -
రెండవ పంటలో యాజమాన్య పద్ధతులు
జహీరాబాద్ టౌన్: మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల చెరకు రెండవ పంట నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చు. మోడెం తోటల విషయంలో రైతులు శ్రద్ధ చూపకపోవడం మూలంగా దిగుబడులు పడి పోతున్నాయి. రెండో పంటలో రైతులకు పెట్టుబడి ఖర్చు తక్కువ. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఫస్ట్ క్రాప్ కంటే రెండో పంటలో అధిక దిగుబడులను సాధించని వ్యవసాయ శాఖ జహీరాబాద్ డివిజన్ ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు. నాణ్యమైన దిగుబడులు పొందాలంటే సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆయన సూచించారు. జహీరాబాద్ ప్రాంత నేలలు చెరకు పంట సాగుకు అనుకూలం. సుమారు 10 వేల మంది రైతులు దాదాపు 20 వేల ఎకరాల్లో ప్రతీ సంవత్సరం సాగు చేస్తుంటారు. జహీరాబాద్‌తోపాటు జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్ తదితర నియోజకవర్గాల్లో కూడా రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ఫస్ట్ క్రాప్ (మొక్కతోటలు) నరికిన తర్వాత రెండో పంటను మోడం అంటారు. ప్రస్తుతం చెరకు సీజన్ ముగియడంతో రైతులు రెండో పంట సాగుపై దృష్టి పెట్టారు. యాజమాన్య పద్ధతులు ● చెరకు పంటను నరికిన వెంటనే మోడులను భూమికి సమాంతరంగా నరికి వేయాలి. పిలకలు భూమి లోపల నుంచి వచ్చి బలీయంగా ఎదిగి వస్తాయి. అధికంగా పిలకలు వచ్చి పంట దిగుబడులు పెరిగేందుకు దోహదపడుతుంది. ● చెత్తను కాల్చి వేయకుండా ఆకులు కుళ్లినట్లు చేస్తే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా ఎకరానికి 3 నుంచి 4 టన్నుల మేర సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. ● తోట నరికిన వెంటనే నీటి తడులు ఇచ్చిన తర్వాత అదును చూసుకొని బొదెను నాగిలితో రెండు పక్కల దున్నాలి. ఇలా దున్నిన సాళ్లలో యూరియా రెండు బస్తాలు, ఎస్ఎస్పీ నాలుగు బస్తాలు, ఎంఓపీ ఒక బస్తా వంతున కలిపి వేయాలి. తర్వాత పక్కన నాగలితో దున్నినట్లయితే ఎరువు పూర్తిగా కప్పబడి చెరకు పంట ఏపుగా పెరుగుతుంది. ● బోదెను చీల్చడం ద్వార పాత వేరు తెగి కొత్త వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఈ కొత్త వేర్లు చురుకుగా ఉండి భూమిలోని పోషకాలను, నీటిని, గాలిని గ్రహించి వాటికి శక్తి పెరుగుతుంది. ● తోటలో దున్నడం ద్వారా వేర్లకు కావాల్సిన గాలి అంది మొక్క వృద్ధి చెందడంతోపాటు పిలకలు అధికంగా వచ్చే అవకాశముంది. ● మోడెంలో మొక్కలకు మొక్కలకు మధ్య రెండు నుంచి మూడు అడుగుల ఖాళీలు ఉన్నట్లయితే నింపడం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది. ● మోడెం తోటలలో రైతులు బోదెలను దున్నిన వెంటనే మట్టిని మోదులపైకి ఎగ దోస్తున్నారు. దీని వల్ల పిలకల శాతం గణనీయంగా తగ్గి పంట దిగుబడులు పడి పోయే ప్రమాదముంది. మోడులపైకి రెండు నెలల వరకు మట్టిని ఎగతీయకుండా చూడాలి. రెండో పంటలో ఫస్ట్ క్రాంప్ తోట కంటే ఒకటిన్నర శాతం ఎక్కువ నత్రజని వాడాలి. ఇలా యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరుగుతుందని ఏడీఏ వివరించారు. మెలకువలతో అధిక దిగుబడులు చెరకు చెత్తతో పంటకు లాభం జహీరాబాద్ డివిజన్ ఏడీఏ భిక్షపతి -
వందేళ్ల చరిత్ర గల పార్టీ సీపీఐ
చేర్యాల(సిద్దిపేట): వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని, పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ శతవసంత వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తా నుంచి అంగడిబజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీ ఖానాలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల ఆశయాల సాధనకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేసిందన్నారు. 100 ఏళ్ల పోరాటాలు, త్యాగాలు వంటి గొప్ప చరిత్ర కలిగిన ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, జనగా మ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు దయానందరెడ్డి, సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, శంకర్, జనా ర్దన్, భూమయ్య, బాలుమోహన్, పద్మ, నరేశ్, రజిని, మమత, మహేందర్, కృష్ణ, భాస్కర్‌రెడ్డి, సుదర్శన్, ప్రేమ్, బాల్‌రెడ్డి, భాస్కర్, బన్సిలాల్, సత్త య్య, నర్సింహచారి, అశోక్, కనకయ్య, శ్రీకాంత్, సురేందర్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి చేర్యాలలో శతవసంత ర్యాలీ, బహిరంగ సభ -
పీపీఈ కిట్లు ధరించి పనులు చేయాలి
చేగుంట(తూప్రాన్): పొలం పనులు చేసే సమయా ల్లో కొన్ని సందర్భాల్లో పీపీఈ కిట్లు ధరించాలని సింజెంటా సీడ్స్ మేనేజర్ సత్తిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పొలంపల్లి గ్రామాన్ని సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు సందర్శించి రైతులకు సూచనలు చేసారు. మేనేజర్ మాట్లాడుతూ.. రైతులు సస్యరక్షణ చర్యల సమయంలో భద్రత కోసం ప్రత్యేక కిట్లు ధరించాలని తెలిపారు. అనంతరం సింజెంటా టీమ్ సభ్యులు రైతులతో మాట్లాడి వ్యవసాయం గ్రామంలో జరుగుతున్న వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సాయంగా గ్రామంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సింజెంటా ప్రతినిధులు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ రైతులు సింజెంటా ప్రతినిథులు పాల్గొన్నారు.పొలంపల్లి గ్రామాన్ని సందర్శించిన సింజెంటా గ్లోబల్ టీమ్ సభ్యులు -
బస్సు ఢీకొని మహిళ మృతి
చేగుంట(తూప్రాన్): రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్టేషన్ మాసాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామానికి చెందిన బోదాసు సాయవ్వ(43) కామారెడ్డి నుంచి రైలులో స్టేషన్ మాసాయిపేటకు చేరుకుంది. రైలు దిగి తూప్రాన్ వెళ్లడానికి జాతీయ రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా చేగుంట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపాధి హామీ కూలీ ఝరాసంగం(జహీరాబాద్): ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ చాంద్ బీ(55) మంగళవారం ఉదయం కూలీ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆకస్మాతుగా కింద పడిపోయింది. అక్కడికక్కడే మృతి చెందడంతో విషయాన్ని తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీఓ సుధాకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి చేర్యాల(సిద్దిపేట): ప్రమాదవశాత్తు బావిలో పడి గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండల పరిధిలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగురు రాజయ్య(68) ఈనెల 18న వ్యవసాయ బావిలో మోటారు బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తెళ్లవారుజామున మృతి చెందాడు. -
బడులు పరిపూర్ణ వికాస కేంద్రాలు
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలు పరిపూర్ణ వికాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం పొడిచన్పల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒత్తిడి లేకుండా, ఆట పాటలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని గుర్తు చేశారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశభక్తి, విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వార్షికోత్సవ వేడుకలు చూస్తుంటే, తమ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కా ర్యక్రమంలో ఎంఈఓలు ప్రతాప్ రెడ్డి, నీలకంఠం, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సుదర్శణమూర్తి, నవీన్, రాజి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు పాల్గొన్నారు. డీఈవో రాధాకిషన్ రావు పొడిచన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం -
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు బెజ్జంకి విద్యార్థి
బెజ్జంకి(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలకు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బొనగిరి అరవింద్ ఎంపికై నట్లు హ్యాండ్ బాల్ జిల్లా కార్యదర్శి మల్లేశం కుటుంబ సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అరవింద్ హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పారామెడికల్ చదువుతున్నాడు. జనవరి 18న కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 పోటీల్లో ప్రతిభ కనబరిచిన అరవింద్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. నేటి నుంచి బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అరవింద్‌ను రాష్ట్ర అడ్వైజర్ కమిటీ సభ్యులు కనుకయ్య, బెజ్జంకిలోని ఆర్వీఎంబీపీ అకాడమీ సభ్యులు రవి, మధు, డీవీరావు అభినందించారు. ఏఐలో విద్యార్థిని ప్రతిభ● గూగుల్‌లో రీసెర్చ్ పత్రాలు ● అమెజాన్‌లో సైతం పుస్తక రూపంలో స్థానం కోహెడ(హుస్నాబాద్): కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎండీ తన్వీర్ సుల్తానా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో ప్రతిభ కనబర్చారు. అమెరికాలోని మిస్సోరి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుల్తానా పీహెచ్డీ చేస్తున్నారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)లో మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్ అనే అంశంపై రీసెర్చ్ చేశారు. వాషింగ్టన్లో జరిగిన పదవ ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సులో విద్యార్థిని చేపట్టిన రీసెర్చ్ పత్రాలను పరిశీలించారు. ప్రాముఖ్యత దృష్ట్యా గూగుల్‌లో స్థానం కల్పించినట్లు తెలిపారు. రీసెర్చ్ పత్రాలన్నీ పుస్తక రూపంలో అమెజాన్‌లో సైతం స్థానం పొందినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడి మృతిపాడె మోసిన మంద కృష్ణ మాదిగ నంగునూరు(సిద్దిపేట): ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు నంగునూరు మండలం నర్మేటకు చెందిన గందమల్ల యాదగిరి (40) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్న యాదగిరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన మంద కృష్ణ మాదిగ యాదగిరిని మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందకృష్ణ మాదిగ యాదగిరి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా నివాళులర్పించి డప్పు కొట్టి పాడె మోస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. యాదగిరి పెద్ద కూతురు శ్రీచందన నర్మేట ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్షలు రాస్తోంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
జొన్న మొక్కలకు కట్లు
జహీరాబాద్ టౌన్: అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. ఈదురు గాలులు, వడగండ్ల వాన వల్ల జొన్న, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లు కూలిపోయాయి.. కరెంట్ తీగలు తెగిపడ్డాయి. తెల్లజొన్న పంటకు ఎక్కువగా నష్టం జరిగింది. జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో జొన్నపంట సాగువుతోంది. ఈదురుగాలలు వల్ల పంట నేలకొరిగింది. పడిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు పైకెత్తి కట్లు కడుతున్నారు. పడిపోయిన జొన్నపంటకు ఐదారు మొక్కలు ఒకచోట కలిపి కట్టు కడుతున్నారు. ఇలా చేయడం వల్ల గింజలు దెబ్బతినకుండా ఉంటాయి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటల వివరాలు సేకరిస్తున్నారు. -
మహిళలకు సాగు యంత్రాలు
● లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు ● యంత్రాన్నిబట్టి సబ్సిడీ మంజూరు ● నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ● జిల్లాకు రూ.కోటి 31 లక్షల కేటాయింపు సంగారెడ్డి జోన్: వ్యవసాయ రంగంలో మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణలోభాగంగా మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలు మంజూరు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా రైతులకు యంత్ర పరికరాలు మంజూ రు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరునాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి, అందించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణలో భాగంగా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతులకు వివిధ రకాల యాంత్రాలను అందజేయనుంది. జిల్లాకు 630 యూనిట్లకు రూ.1,31,17,000లను కేటాయించింది. లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు వ్యవసాయ శాఖ తరఫున లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో జిల్లా కమిటీ, మండల స్థాయిలో మండల కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నారు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కన్వీనర్‌గా, రీజినల్ మేనేజర్(వ్యవసాయ శాఖ), లీడ్ బ్యాంకు అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. మండలస్థాయి కమిటీలో కన్వీనర్ గా మండల వ్యవసాయ శాఖ అధికారి, సభ్యులుగా ఎంపీడీవో, తహసీల్దార్లు ఉండనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు ముమ్మర కసరత్తు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు అర్హులైన వారిని ఈ నెలాఖరునాటికి గుర్తించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నం సాగించారు. జిల్లాలో 630 పరికరాలు సబ్సిడీతో అందించనున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత వ్యవసాయరంగంలో సబ్సిడీపై యంత్ర పరికరాలను పంపిణీ చేయనున్నారు. వివిధ రకాల యంత్రాలను బట్టి సుమారు 50% వరకు అందించనున్నారు. వివిధ రకాల యంత్ర పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యంత్ర పరికరాలు వ్యవసాయ పనులకు దోహదపడే విధంగా అందిస్తారు. అందులోభాగంగా రోటోవేటర్, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు, కల్టివేటర్లు, డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు, కేజ్ వీలర్లు, రోటోపడ్లర్, పవర్ వీడర్, బ్రష్‌కట్టర్స్, పవర్ టిల్లర్, ట్రాక్టర్, హార్వెస్టింగ్ పరికరాలున్నాయి. -
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
2016లో ఖేడ్‌లో... నారాయణఖేడ్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థి గణేశ్ యాదవ్ 2016లో అప్పులు చేసి మరీ తన స్నేహితులతో కలసి ఐపీఎల్లో రూ.ఐదు లక్షలు బెట్టింగ్ వేసి నష్టపోయాడు. అప్పులు తీర్చలేక కొద్దిరోజులకే తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో సంగారెడ్డిలో... సంగారెడ్డికి చెందిన ఇంటర్ విద్యార్థి ఉపేంద్ర రాథోడ్ తన జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించేందుకు 2019లో రూ.లక్షల్లో ఐపీఎల్ బెట్టింగ్ కాసి తీవ్రంగా నష్టపోయాడు. బెట్టింగ్‌లో నష్టం వచ్చిందన్న మనో వేదనతో తన గదిలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఐపీఎల్.. బెట్టింగ్‌ల జోరు ● చిత్తవుతున్న యువత●● పోలీసుల ప్రత్యేక నిఘా ● దూరంగా ఉండాలంటున్న నిపుణులు న్యూస్‌రీల్ -
బియ్యం పక్కదారిపై విచారణ
నారాయణఖేడ్: ‘పేదల బియ్యం పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు రహస్యంగా విచారణ నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఈ బియ్యం దాబావద్ద పట్టుబడినట్లు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో బియ్యం పట్టుబడితే తూకం వేసే క్రమంలో పోలీసు కానిస్టేబుల్‌ను తూకంవేసే వరకు ఉండి పరిశీలించి తగు ఫొటోలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలిన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ సంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సబితా ప్రతిభావంతుల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పిల్లలకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలన్నారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు జీతం పెంచాలిసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పటాన్చెరు: ఆశ వర్కర్లకు నెలకు రూ.18 వేల జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ సందర్భంగా ఆశ వర్కర్లపై పోలీసుల దౌర్జన్యాలను, వారి అక్రమ అరెస్టులను ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు. ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలలో విజయవంతం కోసం అనేక ఏళ్లుగా ఆశ వర్కర్లు ప్రజలకు సేవలందిస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 27న నిధి ఆప్ కే నిఖత్ పటాన్‌చెరుటౌన్: భవిష్య నిధి సంస్థ ద్వారా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 27న నిధి ఆప్ కే నిఖత్ 2.0 నిర్వహించనున్నట్లు ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ విశాల్ అగర్వాల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు కేంద్రాల్లో శిబిరాలను ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోని వెలజాన్ హైడ్రాయిర్ లిమిటెడ్‌లో, జహీరాబాద్ కోహీర్ క్రాస్ రోడ్లో పిరమల్ ఫార్మా లిమిటెడ్‌లో, పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సింతోకెం లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో భవిష్యనిధి సమస్యలున్న వారు ఈ మూడు కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉపాధిపై ప్రజా వేదికజిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 2023–24 ఏడాదికి గాను 15 గ్రామాలలో రూ.85 లక్షలు ఖర్చు చేసిన పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ కార్యక్రమానికి జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి బాలరాజ్ ప్రిసైడింగ్ అధికారిగా హాజరయ్యారు. 15 గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులను తనిఖీలు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి నాగేశ్వర్రావు, అంబుడ్స్‌మన్ భోజిరెడ్డి, ఎంపీడీవో అరుణారెడ్డి, ఏపీవో రామ్మోహన్, ఈసీ మహేశ్వర్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అమీన్పూర్ ఎకై ్సజ్ పీఎస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం
పటాన్ చెరు: అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ మంజూరైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కోసం..మంగళవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల పాత గ్రామ పంచాయతీ భవనాన్ని వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. సామాజిక ఆస్పత్రి పరిశీలన నారాయణఖేడ్: నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తిలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని సికింద్రాబాద్ ఏరియా ఆస్పత్రికి చెందిన కాయకల్ప బృందం మంగళవారం సందర్శించింది. సూపరింటెండెంట్ అనురాధ నేతృత్వంలో నర్సింగ్ ఆఫీసర్ అమూల్యరాణి, డాక్టర్ రాధాకృష్ణ, ప్రవీణ్‌ల బృందం ఆస్పత్రి పరిశుభ్రత, ఇన్‌పేషెంట్లతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. వారి వెంట డాక్టర్ స్వప్న, డా.జువేరియాబేగం, సూపర్వైజర్ గురుస్వామి ఉన్నారు. -
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
క్రికెట్ బెట్టింగ్‌లో యువత నష్టపోతుంది. క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించాలి కానీ విషాదంగా మార్చుకోకూడదు. పల్లెలు, పట్టణాల్లో యువకులకు ఆశ చూపించి వారిని బెట్టింగ్ రాయుళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాత్రికి రాత్రి డబ్బు సంపాదిద్దామనే పద్ధతి సరికాదు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడే వారిని తప్పుదారిలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –పూర్ణ కృష్ణ, మోటివేషనల్ స్పీకర్ మానసిక ప్రశాంతతను కోల్పోతారు బెట్టింగ్ వేయడంతో మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో బెట్టింగ్ పోతే ఇతరులకు డబ్బులు కట్టాలనే ఆలోచనలతో మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు తీసుకుంటుంటారు. కాబట్టి యువతే కాదు ఎవరైనా సరే బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. –డాక్టర్ పరశురాం, మానసిక వైద్యులు బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ ఆడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. బెట్టింగ్‌లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పల్లెల్లో కూడా పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. బెట్టింగ్ చట్టరీత్యా నేరం. జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. –పరితోష్ పంకజ్ , జిల్లా ఎస్పీ -
సన్నబియ్యం సర్దుబాటు
● నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ నుంచి తెప్పిస్తున్న అధికారులు ● జిల్లాలో అందుబాటులో లేని సన్నరకం నిల్వలు ● ఏప్రిల్ 1 నుంచి రేషన్‌షాపుల్లో పంపిణీకి ఏర్పాట్లు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సన్న బియ్యం కోసం పౌరసరఫరాల సంస్థ పక్క జిల్లాలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అవసరాల కోసం ఈ సన్న బియ్యాన్ని కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. సన్నరకం ధాన్యం సాగు జిల్లాలో నామమాత్రమే. జిన్నారం, గుమ్మడిదల, హత్నూర వంటి మండలాల్లో అతికొద్ది మంది రైతులు మాత్రమే ఈ సన్నరకం ధాన్యాన్ని సాగు చేస్తారు. ఇలా సాగైన ధాన్యాన్ని రైతులు తమ సొంత అవసరాల కోసమే ఎక్కువగా వినియోగిస్తారు. మిగిలిన సన్నధాన్యం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తారు. దీనికితోడు జిల్లాలో బాయిల్డ్ రైసుమిల్లులు కూడా తక్కువే. ఈ బాయిల్డ్ మిల్లులుంటే మిల్లర్లు ఇతర జిల్లాల నుంచి సన్నరకం ధాన్యాన్ని తెచ్చి సన్నబియ్యంగా మార్చేవారు. కానీ, ఈ పరిస్థితి కూడా జిల్లాలో తక్కువే. దీంతో ఈ సన్నబియ్యం కోసం పక్క జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా నుంచి 1,600 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లా నుంచి 2,000 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లా నుంచి 2,318 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం జిల్లాకు చేరాయి. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ప్రస్తుతం జిల్లాలో 3.79 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఇటీవల కొత్త రేషన్‌కార్డులను సైతం ప్రభుత్వం జారీ చేసింది. ఈ కొత్త కార్డులపై ఏప్రిల్ నుంచి నిత్యావసరాలు పంపిణీ చేసే అవకాశాలున్నాయి. దీంతో జిల్లాలోని కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఈ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 7,500 మెట్రిక్ టన్నులు.. జిల్లాలో 3.79 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డులపై గత నెలలో 7,899 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. రేషన్ పోర్టబిలిటీ విధానం అందుబాటులోకి వచ్చాక ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారు కూడా ఈ బియ్యాన్ని జిల్లాలో తీసుకునేందుకు వీలు కలుగుతోంది. ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు ప్రతినెలా బియ్యాన్ని స్థానిక రేషన్‌షాపుల్లో తీసుకుంటున్నారు. యూపీ, బిహార్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెంది న కార్మికులు వేలల్లో జిల్లాలోని పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. రేషన్ పోర్టబిలిటీ విధానం అందుబాటులోకి వచ్చాక ఈ నిరుపేద కార్మికులు తమ నిత్యవసరాలను ఇక్కడే తీసుకునేందుకు వీలు కలుగుతోంది. దీంతో జిల్లాలో ఉన్న రేషన్‌కార్డుల కంటే ఇతర జిల్లాలు, రాష్ట్రాల రేషన్‌కార్డుదారుల కోసం అదనంగా బియ్యాన్ని కేటాయించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా కార్డులకు సరిపడే బియ్యంతోపాటు, పోర్టబిలిటీకి సరిపడా సన్నబియ్యాన్ని అందుబాటులో ఉంచేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది.ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈ సన్నబియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు మౌఖిక ఆదేశాలు తప్ప..రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శ్రీనివాస్‌రెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
భర్తను చంపేందుకు తార్ కార్‌తో ఢీకొట్టి..
మునిపల్లి(అందోల్): కట్టుకున్న భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర చేసిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన భర్త తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... పెద్దగోపులారం గ్రామానికి చెందిన కొమిశెట్టిపల్లి రవి ఝరాసంగం మండలంలోని దేవరాంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 22న బైక్‌పై వెళ్లి విధులు నిర్వహించుకొని బుదేరా నుంచి గోపులారానికి వస్తున్న క్రమంలో నల్ల రంగు తార్ కార్‌తో రవిబైక్ను ఢీకొట్టి వెళ్లిపోయారు. బైక్‌పై నుంచి కిందడిన రవి అప్రమత్తమై తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ డిటేల్స్ ద్వారా నేరస్తులను గుర్తించారు. హత్య చేయడానికి గల ముఖ్య కారణం రవి భార్య హరితనే తేల్చారు. హరిత సంగారెడ్డికి చెందిన మిర్దొడ్డి సాయి ప్రదీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకొని ప్రియుడుతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో ఏ1గా హరిత, ఏ2 మిరుదొడ్డి సాయి ప్రదీప్, ఏ3 దాసోజీ సాయికిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి జైలుకు పంపించారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్ఐ ఎం. రాజేశ్ నాయక్, కానిస్టేబుల్స్ పాండు, తుకారాం, హనీఫ్, సునీల్‌లను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు. -
ప్రమాదవశాత్తు నలుగురు మృతి
బావిలో పడి రైతు.. మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవ శాత్తు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. వరి పొలానికి వరుస తడి పారించేందుకు వెళ్లిన రైతు బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటన మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై షేక్ మహబూబ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగపల్లి నర్సింహులు(47) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తన పొలంలో సాగు చేసిన వరికి వరుస తడి పారించేందుకు రాత్రి వెళ్లి ఉదయమైనా ఇంటికీ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెళ్లి పొలం వద్ద వెతకగా బావిలో శవమై కనిపించాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో కౌలు రైతు.. పాపన్నపేట(మెదక్): స్టార్టర్ డబ్బా విప్పే క్రమంలో సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా జరిగి ఓ కౌలు రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేటలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టి బాలయ్య (57) ఓ వ్యక్తికి చెందిన పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బోరు మోటర్ కాలిపోవడంతో మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాడు.అనంతరం స్టార్టర్ డబ్బా తీసుకెళ్లే ప్రయత్నంలో దాన్ని ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య కిష్టమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు.. పాపన్నపేట(మెదక్): సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మరణించిన ఘటన పాపన్నపేట మండలంలో ఆదివారం వెలుగు చూసింది. మల్లంపేట గ్రామానికి చెందిన కుర్మ సాయిలు కుమారుడు దుర్గయ్య(12) బడికి వెళ్లకుండా, వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి రెడ్ల చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగాడు. తోటి స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా, శనివారం సాయంత్రం చెరువులో వెతికినప్పటికీ ఆచూకీ దొరక లేదు. దీంతో తిరిగి ఆదివారం చెరువులో గాలించగా, దుర్గయ్య మృతదేహం దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయం చేయబోయి చెరువులో మునిగి.. జగదేవ్‌పూర్(గజ్వేల్): పెంపుడు కుక్కలకు సాన్నం చేయించేందుకు చెరువుకు వెళ్లి బాలుడు నీట మునిగి మృత్యువాత పడిన ఘటన మండలంలోని మందాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నిమ్మల ఆరవింద్(17) అనే బాలుడు పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే పనులు చేస్తున్నాడు. కాగా ఆదివారం పెంపుడు కుక్కలను గ్రామంలోని బతుకమ్మ చెరువులో స్నానం చేయించేందుకు తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామానికి చెందిన లింగాల వెంకటయ్య చేపలు పట్టడానికి చెరువులో వల వేసి ఉంచాడు. వెంకటయ్య చేపల వలను లాగమని అరవింద్‌కు చెప్పడంతో చెరువులోకి దిగి వలను లాగే ప్రయత్నంలో నీటిలో మునిగాడు. వెంటనే గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు చెరువు వద్దకు చేరుకొని అరవింద్‌ను చెరువులో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటయ్య నిర్లక్ష్యం వల్లే తన కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పంటలకు అడవి పందుల బెడద
● లక్షలు ఖర్చు పెట్టి సాగు ● తీవ్రంగా నష్టపోతున్న రైతులు ● దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ● అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకోలు జహీరాబాద్ టౌన్: అడవి పందుల బెడద రోజు రోజుకు అధికమవుతోంది. చేతికి వచ్చిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పాటు మనుషులపై దాడులు చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసిన ఫెన్సింగ్ తీగలు సైతం రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. రైతులు సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం సేద్యం చేసి, లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తున్న అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. విత్తనం నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతన్నలకు అడవి పందులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్లో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో అధికశాతం చెరకు, మొక్కజొన్న, జొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు సాగు చేస్తున్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మరో వైపు పంటలకు అడవి పందులు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో అవి దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. తదితర పంటలను కొరికి నేలపాలు చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
జిన్నారం (పటాన్చెరు): గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డపోతారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. గడ్డపోతారం గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పారిశ్రామిక వాడలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ముత్తావరపు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చెరువులో దూకి గృహిణి ఆత్మహత్య
సంగారెడ్డి క్రైమ్: అనారోగ్య సమస్యలు భరించలేక చెరువులో దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన గూడెం రత్నయ్య, రత్నమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత ఏడాది కుమారుడు చనిపోవడంతో, రత్నమ్మ (40) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో రోజు రోజుకు ఎక్కువ అవ్వడంతో నొప్పిని తట్టుకోలేక పోయింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువులో మృతదేహం బయటకు తేలింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి రత్నమ్మగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై ఉరివేసుకొని.. దుబ్బాకరూరల్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ హరీశ్ కథనం ప్రకారం... సిర్ర ఎల్లయ్య (43) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి మద్యానికి అలవాటు పడి ఇంటికి వచ్చి భార్యతో తరచుగా గొడవ పడు తుండేవాడు. మద్యం తాగవద్దని భార్య చెప్పినా వినేవాడు కాదు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పశువులకు గడ్డి కోసుకువస్తానని ఇంట్లో చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి పొలం దగ్గరకు వెళ్లి చూడగా తాడుతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతు రు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పేద రోగులకు ‘సంజీవని’
సెంట్రల్ క్రైం బ్రాంచ్ డీసీపీ శ్వేత కొండపాక(గజ్వేల్): సత్యసాయి సంజీవని ఆసుపత్రి దేవాలయం లాంటిదని సెంట్రల్ క్రైం బ్రాంచ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని హార్ట్ కేర్ సెంటర్‌ను ఆదివారం ఆమె సందర్శించారు. ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చాక్లెట్స్, గిప్టులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సత్యసాయి ఆసుపత్రి కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నేలా పుట్టిన పసి బిడ్డ నుంచి 18 ఏళ్ళ లోపు వారందరికి రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమన్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లు జరుగుతున్నంత సేపు తల్లిదండ్రులు పడిన బాధను చెబుతుండటాన్ని చూసి చలించిపోయానన్నారు. ఆసుపత్రి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో నవంబరు నుంచి మార్చి వరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు 83 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతం చేశామన్నారు. అనంతరం ఆపరేషన్లు పూర్తయిన చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
జిన్నారం (పటాన్చెరు): గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డపోతారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. గడ్డపోతారం గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45)ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పారిశ్రామిక వాడలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ముత్తావరపు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఎస్సీ రైతులకు ప్రోత్సాహం
రైతు నేస్తం కృషి విజ్ఞాన కేంద్రం●● సాంకేతిక సహాయం, క్షేత్ర పర్యటనలు ● జీవన ఎరువు, నీమ్ ఆయిల్, విత్తనాలు, నారు పంపిణీ ● ప్రకృతి, సేంద్రియ సాగుపై రాయిలాపూర్, తునికి, పోతిరెడ్డిపల్లి అన్నదాతలకు శిక్షణ రైతులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంతోపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. ప్రకృతి, సేంద్రియ సాగులో శిక్షణ అందిస్తూ ఎస్సీ రైతులను ప్రోత్సహిస్తోంది. కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలంలోని తునికి వద్దగల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే రెండు గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి 500 మంది రైతులతో సేంద్రియ సాగు చేయిస్తోంది. మండలంలోని తునికి, రాయిలాపూర్, కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసి ఎస్సీ రైతులకు ప్రత్యేక శిక్షణతోపాటు ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నది. ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ద్వారా ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్) సహకారంతో కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక ఇన్చార్జి, శాస్త్రవేత్త శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్తలు ఎస్సీ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే 40 శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఎస్సీ రైతులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రెతుల ఆర్థికాభివృద్ధికి కృషి ఐసీఏఆర్ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో ఎస్సీ రైతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో రైతులకు సాగుపై ప్రత్యేక శిక్షణతో పాటు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు పూర్తి స్థాయిలో సేంద్రియ, ప్రకృతి సాగుకు ముందుకు రాకపోవడంతో కొద్దికొద్దిగా సాగు చేయిస్తున్నాం. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. – శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక ఇన్చార్జి, శాస్త్రవేత్త సహకారం బాగుంది కేవీకే సహకారం బాగుంది. ఎకరంలో సేంద్రియ సాగు చేస్తున్నా. కేవీకే శాస్త్రవేత్తలు వరి విత్తనాలు, కూరగాయల నా రు, కోడిపిల్లలు అందజేశారు. కేవీకేలో సేంద్రి య సాగు, చీడపీడల నివారణపై శిక్షణ ఇచ్చా రు. పంటలో సమస్యలు వస్తే ఫోన్ చేస్తే స్పందించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రస్తు తం వరితోపాటు కూరగాయలు, ఉల్లిగడ్డ సాగు చేస్తున్నా. –సాయిలు, రైతు, పోతిరెడ్డిపల్లి సాగుపై రైతులకు అవగాహన ఎంపిక చేసిన ఎస్సీ రైతులకు క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి సాగుపై శిక్షణనిస్తున్నారు. కేవీకేలో పలు పంటలను సాగు చేసే విధానం, విత్తనం నాటడం మొదలు పంట కోతకు వచ్చేవరకు జీవామృతం, బీజామృతం తయారీ, జీవన ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, వివిధ ఆకులతో కషాయాల తయారీ, నీమ్ ఆయిల్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్సీ రైతులకు వానాకాలం, యాసంగికి గాను ఎరువులు, వర్మీకంపోస్ట్, కేఎన్ఎం1638 వరి విత్తనాలు, టమాట, మిరప, ఉల్లినారుతోపాటు అదనపు ఆదాయం కోసం ప్రియాబ్రీడ్ నాటుకోడి పిల్లల పంపిణీ, కలుపు తీసే యంత్రం, స్ప్రేయ ర్లు అందజేశారు. అలాగే భూసార పరీక్షలు చేయించి దాని ఆధారంగా ఏ పంట వేయాలి? ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో మెలుకువలు నేర్పి మూడేళ్లుగా ప్రోత్సహిస్తున్నారు. -
ప్రారంభమైన నల్లపోచమ్మ ఉత్సవాలు
హత్నూర (సంగారెడ్డి): హత్నూర మండలం షేర్ఖాన్పల్లి గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వెలసిన పలుగు మీది నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఆలయ ఈవో దేవదానం, పాలకమండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. మధ్యాహ్నం ఎల్లమ్మ కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడురోజులపాటు జరిగే జాతర ఉత్సవాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో విఫలం రాష్ట్ర రైతు సంఘం నాయకుడు దశరథ్ సదాశివపేట(సంగారెడ్డి): రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు దశరథ్ విమర్శించారు. పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం జిల్లా మూడవ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వాలు మారుతున్న రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదికను బీజేపీ ప్రభుత్వం పక్కనపట్టి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. భవిష్యత్తులో రైతుల సమస్యలపై కీలక పోరాటాలు చేయాలని మహాసభలో తీర్మానించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వరూప, విష్ణువర్దన్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు మాణేయ్య తదితరులు పాల్గొన్నారు. మతసామరస్యాన్నిపాటించాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు సదాశివపేట(సంగారెడ్డి): దేశ ప్రజలందరూ మతసామరస్యంతో కలిసిమెలసి ఉండాలని భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య లౌకిక విలువలు ప్రతి ఒక్కరు కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు పేర్కొన్నారు. శనివారం రాత్రి ఎంఆర్ఎఫ్ యూనియన్ మాజీ సంయుక్త కార్యదర్శి హాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఫ్తార్ విందుకు చుక్కా రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కొన్ని శక్తులు దేశంలో ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు ప్రవీణ్‌కుమార్, నర్సింలు, ఎంఆర్ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు. -
భగత్‌సింగ్‌కు ఘన నివాళి
సంగారెడ్డి రూరల్/జహీరాబాద్ టౌన్/సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ 94వ వర్ధంతి వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సంగారెడ్డిలోని భగత్‌సింగ్ విగ్రహానికి ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు, జహీరాబాద్ టౌన్‌లోని శ్రామిక్ భవనంలో భగత్‌సింగ్ చిత్రపటానికి, నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్‌లోని భగత్‌సింగ్ విగ్రహానికి సీపీఎం నాయకులు, సదాశివపేటలోని సిద్దాపూర్ కాలనీలో భగత్‌సింగ్,రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చిత్రపటాలకు డీవైఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ప్రజల సంక్షేమమే మా లక్ష్యం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిడంపింగ్యార్డ్ పనులు చూసి ఆగిన గుండెపటాన్చెరు/పటాన్చెరు టౌన్: నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామానికి చెందిన రాములుకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.2.50లక్షల విలువైన చెక్కును అతని కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు ఇఫ్తార్ విందు రంజాన్ మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా ప్రతీ ఏటా ముస్లిం సహోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి పటాన్చెరు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు పనులు సాగుతుండటం...కూతురు వివాహం కోసం అమ్మకానికి పెట్టిన భూమిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి కారణాలతో మనోవ్యథకు గురైన నల్లవల్లి గ్రామానికి చెందిన నడిమింటి కృష్ణ (37) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా మండలంలో ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న కృష్ణ డంపింగ్‌యార్డ్ ఏర్పాటు పనులు చూసి తట్టుకోలేకపోయాడు. కూతురి పెళ్లి చేయడానికి, అప్పులు తీర్చడానికి వేరే దారిలేక తనకున్న భూమిని అమ్మకానికి పెట్టాడు. అయితే ప్యారానగర్లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుండటంతో భూముల ధరలు తగ్గిపోవడంతోపాటుగా అక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో కృష్ణకు చెందిన భూమిని కొనేందుకు కూడా ఎవరూ రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో ఇంటిదగ్గరే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కృష్ణ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జేఏసీ నేతలు కృష్ణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృష్ణ మరణం వృథా కాకూడదని డంపింగ్‌యార్డ్ ఏర్పాటును కచ్చితంగా రద్దు చేసేలా పోరాటం సాగిస్తామని జేఏసీ నాయకులు వెల్లడించారు. కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నల్లవల్లి గ్రామవాసి మృతి కూతురు వివాహం కోసం అమ్మకానికి పెట్టిన భూమి డంపింగ్‌యార్డ్ ఏర్పాటుతో ఎవరూ ముందుకు రాని వైనం -
పేదల బియ్యం పక్కదారి!
నేరుగా గన్నీబ్యాగుల్లోనే... నారాయణఖేడ్: పేదలకు పంపిణీ కావాల్సిన బియ్యం యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. తరచూ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పోలీసులకు పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించినా, కొనుగోలు, అమ్మకాలు చేపట్టినా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోన్నా ఈ ‘రైస్ ముఠా’కు చీమకుట్టినట్లు కూడా లేదు. పైగా వీరి అక్రమ దందా అధికారుల అండదండలతోనే నడుస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మూడు రోజుల క్రితం కల్హేర్ మండలం మాసాన్‌పల్లి సమీపంలో పట్టుబడ్డ లారీలకు సంబంధించి కేవలం ముందురోజు రెండిటిపైనే, ఆ మరుసటి రోజు మూడో లారీపైనా కేసులు నమోదైన వ్యవహారాలే ఈ ఆరోపణలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక పట్టుబడ్డ లారీలతో అధికారులు కొందరు సెటిల్మెంట్ వ్యవహారం నడిపి అది కుదరకపోవడంతోనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలున్నాయి. కాగా పట్టుబడ్డ ఒక్కో లారీలో 30టన్నుల చొప్పున మూడు లారీల్లో 90 టన్నుల బియ్యం ఉండాలి. కానీ అధికారులు బియ్యం సంఖ్య తక్కువ చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడ కూడా ఇదే ధోరణి! సంగారెడ్డి– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారి నిజాంపేట్ మీదుగా ఉంది. ఈ రహదారిపై హైదరాబాద్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్న ఆరోపణలున్నాయి. నాలుగు నెలల క్రితం నిజాంపేట్ ఫ్లై ఓవర్ వద్ద అధికారులు రెండు లారీలను పట్టుకున్నారు. ఈ లారీలపై కూడా మొదట నాన్చుడు ధోరణి అవలంభించిన పోలీసులు ఆ తర్వాత కేసులు నమోదు చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. పట్టుబడిన బియ్యం లారీల విషయంలో రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి పీడీఎస్ బియ్యం సరఫరాకు సంబంధించి పూర్తి అవగాహన ఉండటంతో అతడే సెటిల్మెంట్ వ్యవహారాలు నడిపిస్తాడని, సెటిల్మెంట్ కాని పక్షంలోనే కేసుల నమోదు అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రైస్ మిల్లులకు సరఫరా... ఐతే! పట్టుబడ్డ బియ్యం కూడా రైసుమిల్లులకే సరఫరా అవుతుంటాయి. కానీ రైస్‌మిల్లులో కాకుండా రహదారిపై పట్టుబడటంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పట్టుబడ్డ మహారాష్ట్రకు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైస్‌మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం, మర ఆడించిన బియ్యం, ఎఫ్‌సీఐకి పంపిన బియ్యం వివరాలు ఏమేరకు ఉన్నాయన్న లెక్కలను సరిచూసిన పక్షంలో అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. సరఫరా అయిన వరి ధాన్యం కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులు దాటించి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి లెవీకింద పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీదర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ ప్రాంతం నుంచి బియ్యంను లారీల్లో నింపి ఢిల్లీ పాసింగ్‌తో తన జీప్‌లో ముందు రూట్ క్లియర్ చేస్తూ రైస్‌మిల్లులకు సరఫరా చేస్తారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు అక్రమ రవాణ టన్నుల కొద్దీ లారీల్లో సరఫరా ‘రైస్ ముఠా’కు అధికారుల అండ! పట్టుబడితే సెటిల్మెంట్.. కాని పక్షంలోనే కేసులు నమోదు బియ్యం రవాణా జరిగే సందర్భాల్లో అక్రమార్కులు కొనుగోలు చేసిన పేదల బియ్యంను తెల్లటి బస్తాల్లో నింపి సరఫరా చేస్తారు. మాసాన్‌పల్లి వద్ద పట్టుబడ్డ బియ్యం బస్తాలు నేరుగా పీడీఎస్ గన్నీ బస్తాల్లోనే సరఫరా చేశారు. గోడౌన్ల నుంచి సరఫరా చేసిన గన్నీ బస్తాలపై ఏ గోడౌన్ నుంచి ఏ ప్రాంతానికి బియ్యం సరఫరా చేశారనే వివరాలు ఉంటాయి. ఈ లెక్కన పేదల బియ్యం లబ్ధిదారుల వద్ద కాకుండా రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేశారా లేక గోడౌన్లోనే కొనుగోలు చేసి తెచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
కంటి దీపాలకు కనుచూపెవరు?
సుగుణమ్మకు ముగ్గురు కుమారులూ అంధులేమెదక్జోన్: ‘పెళ్లయిన మూడేళ్లకు మొదటి సంతానంలో కొడుకు పుట్టాడని ఆనందపడ్డాం. విశ్వనాథం అని కాశీ విశ్వనాథుడి పేరు పెట్టుకున్నాం. బుడిబుడి అడుగులు వేస్తుంటే సంబరపడ్డాం. కానీ.. మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మా కుమారుడికి కళ్లు కనిపించవని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. వరుసగా మరో ఇద్దరు కొడుకులకు సైతం అంధత్వం రావటంతో మా తలరాత ఇంతే అని సరిపెట్టుకున్నాం. చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ పిల్లలను సాదుకుంటుండగా.. విధి పగ బట్టినట్లుగా కేన్సర్ మహమ్మారి నా భర్తను కాటేసింది. ఐదేళ్లకు చిన్నకొడుకు నీటి గుంతలో పడి మరణించాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. ఉన్న ఇద్దరితో ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. నేను పోయాక నా బిడ్డలను ఎవరు చూస్తారో..? తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు’అని ఎనిమిది పదుల వయసులో సుగుణమ్మ ఆందోళన చెందుతుంది. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. మెదక్ పట్టణానికి చెందిన కందుకూరి కృష్ణ, సుగుణమ్మ దంపతులకు ముగ్గురు మగ సంతానం. పెద్ద కొడుకు విశ్వనాథం, రెండో కొడుకు సంతో ష్, చిన్న కొడుకు రాము.. పుట్టిన ముగ్గురు అంధులే కావటంతో తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్, సరోజినిదేవి, చైన్నెలోని శంకర్ నేత్రాలయం లాంటి ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆశలు వదులుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్ ఏర్పాటుచేసి జీవనం సాగించారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో.. 2009లో ఇంటి పెద్ద కృష్ణకు కేన్సర్ సోకింది. ఎలాగైనా బతకాలని.. తనకేమైనా జరగరానిది జరిగితే అంధులైన తన బిడ్డల భవిష్యత్ ఏంటని ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. అయినా ఫలితం లేకపోవటంతో కృష్ణ మరణించాడు. దీంతో కుటుంబ బాధ్యత పూర్తిగా సుగుణమ్మపై పడింది. ఉన్న హోటల్‌ను నడపలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి కిరాణం నడుపుకుంటూ జీవిస్తుండగా.. 2014లో చిన్నకొడుకు రాము ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి స్నేహితుల సహాయంతో వెళ్లాడు. అక్కడ బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి మరణించాడు. పింఛనే పెద్ద ఆసరా ఉన్న ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పెన్షన్‌తో సాదుకుంటోంది సుగుణమ్మ. ప్రస్తుతం ఆమెకు వృద్ధాప్యం మీద పడుతోంది. వయసు 80 ఏళ్లు. శరీరం సహకరించకున్నా అతికష్టం మీద వారికి వంట చేసి పెడుతోంది. తన తదనంతరం బిడ్డల పరిస్థితి ఏంటని మనోవేదనకు గురవుతోంది. తన పెద్ద కొడుకు విశ్వనాథంకు 40 ఏళ్లు ఉండగా.. పెళ్లి చేయాలని ఎంతగానో ఆరాట పడుతోంది. కానీ అంధులైన ఆమె కొడుకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మా నాన్న అతికష్టం మీద పదో తరగతి వరకు చదివించారని.. ప్రస్తుతం జీవనోపాధి కష్టంగా మారింది.. చిన్నపాటి అటెండర్ ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కొడుకు విశ్వనాథం వేడుకుంటున్నాడు. చిన్న కొడుకు నీటిలో పడి మృతి ఇంటి పెద్దను కాటేసిన కేన్సర్ అంధులైన కొడుకులకు పిల్లనివ్వని దైన్యం నేను కనుమూస్తే నా బిడ్డలను దిక్కెవరు.. తల్లడిల్లుతున్న మాతృమూర్తి -
హన్మంత్రావుపేట్కు అండగా...
నాలావద్ద చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న జేసీబీ నారాయణఖేడ్: మండలంలోని హన్మంత్‌రావుపేట్ చేనేత కార్మికుల బతుకు చిత్రం గురించి ‘సాక్షి’ దినపత్రికలో ‘సిరుల దారం.. నిరాధారం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి చేనేత సహకార సంఘం జిల్లా నాయకులు స్పందించారు. ఆదివారం గ్రామాన్ని సంఘం జిల్లా, స్థానిక బాధ్యు లు సందర్శించారు. మార్కండేయ చేనేత సహకార సంఘం దీన స్థితిని తెలుసుకొన్నారు. గ్రామంలోని చేనేత కార్మికులు, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. సేకరించిన సమాచారాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని, మూతబడ్డ సంఘాన్ని తిరిగి ప్రారంభించేలా కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన నాలాలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదివారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రికలో ‘పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు’అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికార యంత్రాంగం స్పందించింది. పట్టణంలోని గడి నుంచి సిద్దేశ్వర ఆలయం వైపు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నాలా నిండిపోయింది. రెండురోజులుగా కురుస్తోన్న వర్షాలకు నాలలో మురికినీరు రోడ్డుపై పారుతుంది. దీంతో ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ అధికారులు జేసీబీ సహయంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. -
ఏఐతో భారత్‌కే అధిక లాభం
బీసీ గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ వర్గల్(గజ్వేల్): ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో అధిక లాభం పొందేది భారతదేశమేనని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల సంస్థల జాయింట్ సెక్రటరీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ అన్నారు. వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ విభాగం అధికారులు ‘మర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ వల్ల కలిగే లాభనష్టాలను వివరించారు. సదస్సులల్లో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. సదస్సులో చైన్నె విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ, ఘట్కేసర్ శ్రీనిధి యూనివర్సిటీ, గవర్నమెంట్ సిటీ కాలేజీ, అరోరా కాలేజీ, సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, హైద్రాబాద్ జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల రీసెర్చ్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంశంపై పరిశోధన పత్రాలు సమర్పించారు. వీటి సారాంశాన్ని సావెనీర్గా రూపొందించారు. సదస్సులో శ్రీనిధి యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మ, రాధిక, సాహెలీ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు, వైస్‌ప్రిన్సిపాల్ గోవిందరావు, ఏటీపీ ఉమామహేశ్వరి, డాక్టర్ నిఖిత, డాక్టర్ రాధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషన్ పేరుతో ఫేక్ కాల్స్ ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్ సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపల్ కమిషనర్ ఉమా పేరుతో సైబర్ కేటుగాళ్లు ఫేక్ కాల్స్ చేయడం కలకలం రేపింది. ట్రేడ్ లైసెస్స్ ఫీజులు చెల్లించాలని రెన్యూవల్ చేసుకోవాలని, మిషన్ భగీరథ బిల్లులు చెల్లించాలని శుక్రవారం ఉదయం నుంచి వ్యాపారులకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేయడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. అనుమానం రావడంతో విషయాన్ని వ్యాపారులు కమిషనర్‌కు చెప్పారు. మున్సిపల్ బిల్ కలెక్టర్లకు గాని మున్సిపల్ అధికారిక ఖాతాలో మాత్రమే బిల్లులు చెల్లించాలని ఇలాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఉమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
అప్పులు భారమై.. మద్యానికి బానిసై
వర్గల్(గజ్వేల్): చేసిన అప్పు లు భారమై, మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. వర్గల్‌కు చెందిన కిస్టనోళ్ల నర్సింలు(58) హమాలీ. భార్య అండాలు, కూతురు, కుమారుడు ఉన్నారు. రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఏడాదిన్నర కిందట కూతురి వివాహం చేశాడు. కాలికి గాయం కావడంతో నాలుగు నెలల నుంచి ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన భర్తను రోజు తాగి వస్తే అప్పు ఎలా తీరుతుందని భార్య మందలించింది. దీంతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కౌలుకు తీసుకున్న పొలంలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి.. శివ్వంపేట (నర్సాపూర్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధి గూడూరు గ్రామానికి చెందిన బోయిని మల్లేశ్ యాదవ్ (45) ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసయ్యాడు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం -
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే..
దుబ్బాక : సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతామని కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయిరమాదేవి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో కోర్టు భవనం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కమిటీ మేర కు కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 4 ఎకరాల స్థలం కేటాయించాలన్నారు. జిల్లా న్యాయ, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ ఇతర అధికారులందరూ కలిసి దుబ్బాకలో కోర్టు నిర్మాణానికి 1.32 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. రెవెన్యూ, సర్వే అధికారులు పూర్తి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. త్వరలోనే స్థల సేకరణ పూర్తిచేసి భవన నిర్మాణం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంపీడీవో భాస్కరశర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. పలు కార్యాలయాల సందర్శన పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ మనుచౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని పరిశీలించారు. ఖాళీగా ఉన్న గదులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించేందుకు సంబంధిత అధికారులతో చర్చించాలని తహసీల్దార్ సంజీవ్‌కు సూచించారు. దుబ్బాక పట్టణంలో కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణం స్థల పరిశీలనలో కలెక్టర్ మనుచౌదరి, జిల్లా జడ్జి సాయి రమాదేవి -
ప్రాణం తీసిన ఈత సరదా
చెరువులో మునిగి విద్యార్థి మృతి రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల గ్రామంలో చోటు చేసకుంది. పోలీసుల కథనం మేరకు.. కాట్రియాల గ్రామానికి చెందిన కాస రాజు కుమారుడు రిస్విత్(12), బాబాయి కుమారుడు రేవంత్, మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి రిస్విత్ మృతి చెందాడు. మృతుని తండ్రి కాస రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రిస్విత్ ఏడవ తరగతి చదువుతుండగా ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. అంగడి వేలం రెండోసారి వాయిదా హుస్నాబాద్: వారాంతపు సంత బహిరంగ వేలం పాట శుక్రవారం మరోసారి వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే.. 17న మొదటి సారి బహిరంగ వేలం పాట నిర్వహించారు. గతేడాది అంగడి వేలం రూ. కోటి 20 లక్షల 26 వేలు పలికింది. దీనికి అదనంగా 5 శాతం కలిపి రూ. కోటి 26 లక్షల 27 వేల 300కు సర్కార్ పాటను ప్రారంభించారు. వేలం పాటను తగ్గించాలని గుత్తేదారులు ఎవరూ పాట పాడకపోవడంతో వేలం వాయిదా వేశారు. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ దృష్టికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తీసుకెళ్లారు. వేలంను తగ్గించేది లేదని నిబంధనల ప్రకారం అంగడి వేలం పాటను నిర్వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మరోసారి నిర్వహించారు. గుత్తే దారులు మెట్టు దిగకుండా వేలం పాటను తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించిన తర్వాతే వేలంలో పాల్గొంటామని వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో రెండోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
‘ఐలా’ ఎన్నికలు రసవత్తరం
● ఏకగ్రీవానికి ఎత్తుకు పైఎత్తులు ● 27న పాలకవర్గ ఎన్నికలు పటాన్చెరువు: పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) పాలకవర్గం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను స్క్రూట్నీ దశలోనే పోటీ నుంచి తొలగించాలనే కుట్రలు ఓ వైపు, అలా చేస్తే తాము కోర్టుకై నా వెళ్తామని ఆశావహులు మరోవైపు పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల రాజకీయాలు మరింత రసకందాయకంలో పడ్డాయి. ఐలా పాలకవర్గానికి మొత్తం 17 పదవులున్నాయి. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులతోపాటు ఇతర సభ్య స్థానాలకు పోటీ జరుగనుంది. ఇందుకు నోటిఫికేషన్ ఈ నెల 5న వెలువడింది. ఈ నెల 19కే నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. స్క్రూట్నీ అభ్యర్థుల ప్రక్రియ శనివారం నాటికి తేలనుంది. ఇంతలోనే కొందరు వ్యక్తులు చక్రం తిప్పి ఐలా పాలక వర్గాన్ని తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని చేస్తున్న రాజకీయాలపై కొందరు పారిశ్రామికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. నేడు పేర్లు ఖరారు శనివారం నాటికి బరిలో నిలిచే వ్యక్తుల పేర్లు ఖరారు కానున్నాయి. ఒక వర్గం తమ అనుచరులు లేదా ప్యానెల్‌కు చెందిన వారే చైర్మన్‌గా ఇతర అన్ని పదవులకు పోటీ చేయాలని ఎన్నికలు ఏకగ్రీవం కావాలని చేస్తున్న ప్రయత్నాలు సాధారణ ఎన్నికల రాజకీయాలకు మించి తలపిస్తున్నాయి. ఇక రెండో వర్గం వారు కూడా కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి నెలకొంది. సభ్యత్వాల నమోదు కూడా లోపభూయిష్టంగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఓటర్ల జాబితా తయారీలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట సభ్యత్వాలు ముందుగానే తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు ఇందుకోసం ఓ వర్గం రూ.1.40లక్షలు సొంత సొమ్మును కట్టి సభ్యుల పేరిట సభ్యత్వాల రశీదులను ఈ నెల 13,14 తేదీల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఒకరు ఆయనతోపాటు మరికొందరు ఒక కోటరీగా ఏర్పడి సభ్యత్వాల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఒక పారిశ్రామికవేత్త ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయనను తప్పించేందుకు ఆయనపై లేనిపోని విమర్శలు చేసి అనర్హుడిగా ప్రకటించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పటాన్చెరు ఐలా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని పారిశ్రామికవేత్తలు చర్చించుకుంటున్నారు.చైర్మన్ పదవి రేసులో ప్రముఖులు చైర్మన్ పదవి రేసులో బాసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి లాంటి ప్రముఖులున్నారు. అయితే అన్ని పదవులకు పోటీ గట్టిగానే ఉంది. ప్రధానంగా అన్ని స్థానాలు ఏకగ్రీవంగా జరగాలని ఒక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐలా పరిధిలో దాదాపు 450 ఇండస్ట్రియల్ ప్లాంట్లు ఉండగా అందులో మొత్తం 379 పారిశ్రామికవేత్తలు తమ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు లేదా అర్హులైన సభ్యులు ఉన్నారు. -
వైద్యం జాడలేదు
నిలువ నీడ లేదు..ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కానరాని వసతులువడదెబ్బతో మహిళా కూలీ మృతి నారాయణఖేడ్: వడదెబ్బతో ఉపాధి హామీ మహిళా కూలీ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఖేడ్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. తోటి కూలీల కథనం మేరకు.. ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ శివారులో ఉపాధి హామీ కింద కొద్ది రోజులుగా కాల్వ తవ్వకం పనులు జరుగుతున్నాయి. రోజూలాగే శుక్రవారం గ్రామానికి చెందిన బోయిని లచ్చవ్వ (52) పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై స్పృహతప్పి కిందపడిపోయింది. తోటి కూలీలు ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త బోయిని భూమయ్య రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. గ్రామాల్లో వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించాలన్నది ఉపాధి హామీ లక్ష్యం. ఈ క్రమంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ప్రతీ ఏటా గ్రామాల్లో ఉపాధి పనులు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా పనులు కల్పిస్తున్నప్పటికీ అదే రీతిలో తగిన వసతులు కల్పించడం లేదు. ఉపాధి కూలీలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్లు, తాగునీటి వసతి, అత్యవసర సమయాలకు ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ సదుపాయాలు జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. – సంగారెడ్డి జోన్/నారాయణఖేడ్ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే వారికి పదేళ్ల క్రితం పనిముట్లు, టెంట్లు పంపిణీ చేశారు. గ్రూపులో ఉన్న నలుగురు సభ్యులకు కలిపి నాలుగు గుంతలు తవ్వేందుకు గడ్డపారలను అందించారు. అప్పటినుంచీ ఇప్పటివరకు తిరిగి ఎలాంటి పనిముట్లు అందించలేదు. దీంతో కూలీలే తాము కొనుగోలు సొంత పనిముట్లు తీసుకువచ్చి పనులు ముగిస్తున్నారు. పనిముట్లకు సంబంధించి ఎలాంటి భత్యం చెల్లించడం లేదని తెలుపుతున్నారు. కనిపించని మెడికల్ కిట్లు పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించేందుకుగాను మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలి. కానీ, ఎక్కడ చూసినా పని ప్రదేశాల్లో మెడికల్ కిట్లు కనిపించడం లేదు. పలుమార్లు ఉపాధి కూలీలకు గాయాలైతే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కూలీలు తెలిపారు. గొలుసుటెంట్లు లేక.. చెట్ల కింద సేద రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రతీ ఒక్కరు జంకుతున్నారు. ప్రతీరోజు ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు పనులు చేస్తున్నారు. పనులు ముగిసిన తర్వాత ఆన్లైన్ విధానంలో కూలీల హాజరు వేస్తుంటారు. ఆ సమయంలో పనులు చేసిన పరిసరాల్లో చెట్లు ఉంటే సేద తీరుతున్నారు. వేడిగా తాగునీరు వేసవిలో ఎక్కువగా నీరు తాగాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. పనులకు వెళ్లిన సమయంలో కూలీలు తమ ఇంటి నుంచి నీటిని బాటిళ్లలో తీసుకు వెళ్తున్నారు. పెరుగుతున్న ఎండలకు ఇంటి నుంచి తీసుకువెళ్లిన తాగునీరు పూర్తిగా వేడిగా మారుతున్నాయని తాగలేకపోతున్నామని ఉపాధి హామీ కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీ పథకంలో రోజురోజుకీ కూలీల సంఖ్య పెరుగుతుంది. జాబ్ కార్డు కలిగి ఉండి అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 1,32,000 మందికి జాబ్ కార్డులు ఉండగా రెండు లక్షల 25 వేల మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 35 వేలకు పైగా మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. కానీ, కూలీలకు వసతులు కల్పి ంచడంలో అధికారులు విఫలం అవుతున్నారు.జిల్లాలో యాక్టీవ్ జాబ్ కార్డులు 1,32,000 రోజూ హాజరయ్యే కూలీలు 35,000లకు పైగా ఏళ్లుగా అందని పరికరాలు అత్యవసర మెడికల్ కిట్లు, టెంట్లు కరువు గాయాలైతే ఆరోగ్య కేంద్రానికి పరుగులు చెట్ల కిందే సేద తీరుతున్న కూలీలు తాగు నీటి వసతి అంతంతే వడదెబ్బకు నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో ఒకరు మృతి నాలుగేళ్లుగా అదనపు భత్యం బంద్ ఉపాధి కూలీలు వేసవిలో చేసే పని ప్రదేశాల్లో భూమి వేడిమి వల్ల గట్టిగా ఉండడం, పొద్ద స్తమానం పని చేయలేని పరిస్థితి ఉండటంతో అదనపు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మార్చిలో 20 శాతం, ఏప్రిల్‌లో 25 శాతం, మేలో 30 శాతం అదనపు కూలి చెల్లించేవారు. కానీ నాలుగేళ్లుగా ఈ అదనపు కూలి చెల్లించడం లేదు. గతంలో రాగాస్ సాఫ్ట్వేర్ ద్వారా నమోదు చేసే సందర్భాల్లో అదనపు చెల్లింపులు నమోదుకు అవకాశం ఉండే. ప్రస్తుతం ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్) సాఫ్ట్వేర్ వాడుతుండడం, కేంద్రం నేరుగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించి వినియోగిస్తుండడంతో అదనపు కూలి చెల్లింపుల నమోదుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో డైవర్షన్ డ్రైన్, రాకళ్ల కట్టలు, ఫీడర్ ఛానెల్, ఎంఐ ట్యాంక్, పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణం, చెక్‌డ్యాం, ఫామ్ ఫండ్, ఫార్మేషన్ రోడ్డు పనులు సాగుతున్నాయి. ఈ పనులన్నీ దాదాపు ఎండపట్టునే చేయాల్సి ఉటుంది. -
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం
నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పక్షం రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో శనగ, జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయియింది. న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ చౌరస్తా వద్ద వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నారాయణఖేడ్/న్యాల్కల్ (జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్/మునిపల్లి : -
హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ టౌన్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి హరీశ్‌రావుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడంతో ఎమ్మె ల్యే మాణిక్‌రావు, జహీరాబాద్ నాయకులు ఆయనను కలిశారు.హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్, ఝరాసంగం మండలాల అధ్యక్షులు తట్టునారాయణ, సంజీవ్‌రెడ్డి, నర్సింలు, వెంకటేశం, నాయకులు మిథిన్రాజ్ తదితరులున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే గూడెం రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉండే పేదల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హామీనిచ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు మరింత మెరుగైన ేవైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ వైద్యులు, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని వివరించారు. ఇక్కడి ప్రజలకు త్వరలో మరింత మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని అందుకు తగిన నిధులను కూడా కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయిత్రీదేవి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి పాల్గొన్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కొల్చారం(నర్సాపూర్): ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం సమీపంలో మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారి లోతు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పిల్లి మల్లేశం(38) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం మెదక్‌కు కారులో వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మండల శివారులోని జాతీయ రహదారి లోతు వాగు మలుపు వద్దకు రాగానే సికింద్రాబాద్ వైపు నుంచి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడంతోపా టు డ్రైవర్ మల్లేశంకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ప్రమాదంలో మహిళ రాయికోడ్ (అందోల్ ): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సింగితం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ కథనం మేరకు.. రేగోడ్ మండలం చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మణెమ్మ (53) రాయికోడ్ మండలం హస్నాబాద్‌లో బంధువుల శుభకార్యానికి గురువారం బొలెరో వాహనంలో కులస్తులతో హాజరయ్యారు. సాయంత్రం తిరుగు ప్రయాణం కాగా సింగితం గ్రామానికి చేరుకోగానే బొలెరో వాహనం అదుపుతప్పింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహన డ్రైవర్ రాములుపై మృతురాలి భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ అదుపుతప్పి కూలీ.. దుబ్బాకటౌన్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి కూలీ మృతి చెందిన ఘటన రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం రాయపోల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం కసాన్ పల్లి గ్రామానికి చెందిన లింగ రమేశ్ (39) వ్యవసాయం, సెంట్రింగ్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతిరోజూ గజ్వేల్ పట్టణానికి సెంట్రింగ్ కూలి పనికి బైక్‌పై వెళ్తుంటాడు. గురువారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఆటో బోల్తా పడి మహిళ.. కొమురవెల్లి(సిద్దిపేట): ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజు కథనం మేరకు.. వరంగల్ కాశీబుగ్గకు చెందిన సబిత(55) కుటుంబంతో కలిసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వేచరేణి కి చెందిన ఆటోలో బయలు దేరారు. మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సబిత మృతి చెందగా, పలువురి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరు మృతి -
ఇఫ్తార్ విందుకు షబ్బీర్ అలీ
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి చంద్రశేఖర్, టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్‌లు మాట్లాడుతూ...ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్, గిరిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు వారాలకే కాత
బీర పంటతో అధిక లాభాలు జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ అక్కన్నపేట(హుస్నాబాద్): విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత అని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో రైతు స్వామిరెడ్డి సాగు చేసిన బీర తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి అన్నారు. అలాగే అధిక డిమాండ్ కల్గి ఉండి తొందరగా చేతికందు పంట బీర అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత పాల్గొన్నారు. నిందితుడి రిమాండ్ ములుగు(గజ్వేల్): ములుగు మండలం బహి లంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పెంటమీది స్వామిని శుక్రవారం అదుపులోకి తీసు కొని గజ్వేల్ కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అత్యాచారా నికి గురైన బాలికకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ సిద్దిపేటఅర్బన్: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు.. వెల్కటూరు శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట వెలికట్టకు చెందిన పెరుగు కిష్టయ్య, పొన్నాలకు చెందిన లెంకల కనకయ్య, మర్పడగకు చెందిన వల్లపు కనకయ్య, దుద్దెడకు చెందిన మహ్మద్ నహీం పట్టుబడ్డారు. నాంచారుపల్లికి చెందిన రాము, వెల్కటూరుకు చెందిన కిషన్, సిద్దిపేటకు చెందిన చారి పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 9480 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీలో బస్తాలను లోడ్ చేస్తూ.. ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి వర్గల్(గజ్వేల్): వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వర్గల్ మండలం శాకారంలో చోటు చేసుకుంది. గౌరా రం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. ఒరిస్సా రాష్ట్రం పార్లకేముండి గ్రామానికి చెందిన బీరా ప్రకాశ్(43) ఉపాధి నిమిత్తం ఆరు నెలల కిందట వచ్చి భార్య, కుమారుడితో కలి సి మేడ్చల్ సమీప ఎల్లంపేట గ్రామంలో ఉంటున్నాడు. శుక్రవారం బీరా ప్రకాశ్ తదితరులు వర్గల్ మండలం శాకారంలోని శ్రీసాయి బిన్నీ మోడ్రన్ రైస్‌మిల్‌లో వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేసేందుకొచ్చారు. లోడ్ చేస్తుండగా లారీ బస్తాల పైన ఉన్న బీరా ప్రకాశ్ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు బీరా హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. మిరుదొడ్డి(దుబ్బాక: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాసులాబాద్లో శుక్రవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ బోయిని పరుశరామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బిట్ల రాములు (75) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2012లో భార్య చనిపోగా ముగ్గురు ఆడపిల్లల వివాహాలు చేశాడు. గురువారం సాయంత్రం రాములు వ్యవసాయ పొలం సమీపంలో చింత చెట్టు ఎక్కి కాయలు తెంపుతున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎర్రరాయి వాహనాలు సీజ్ న్యాల్కల్(జహీరాబాద్):అక్రమంగా ఎర్రరా యి తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలో న్యామతాబాద్, రేజింతల్, గణేశ్‌పూర్ గ్రామ శివారులోంచి లారీ, ట్రాక్టర్లలో ఎర్రరాయి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుస్సెళ్లి సరిహద్దు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఎర్రరాయిని తరలిస్తున్న లారీ, ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 15వ తేదీన గణేశ్‌పూర్ గ్రామ శివారులో ఒక వాహనాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. -
ఉగాదికే సన్నబియ్యం
● అదే రోజు పథకంప్రారంభించనున్న ప్రభుత్వం ● ఏప్రిల్ 1నుంచి అమలు ● జిల్లాలో 3.78 లక్షలకార్డుదారులకు మేలునారాయణఖేడ్: పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యంను ఉగాది నుంచి సరఫరా చేసేందకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా గతంలోనే సన్న బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా సన్న బియ్యం లేని కారణంగా వాయిదా వేసి ఉగాది నుంచి అందజేస్తామని ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యంను అందజేస్తారు. పథకం ద్వారా జిల్లాలో 3.78లక్షల రేషన్ కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 846 రేషన్ దుకాణాల ద్వారా 3.78లక్షల మంది కార్డుదారులకు కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున 8వేల మెట్రిక్ టన్నుల బియ్యంను అందిస్తున్నారు. జిల్లాలోని కార్డుదారులందరికీ సన్న బియ్యం ద్వారా మేలు చేకూరనుంది. సీఎం చేతుల మీదుగా.. ఉగాది పర్వదినం రోజైన ఈనెల 30న సన్న బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిల్లో పథకాన్ని ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తూ రైతులను సన్నాల సాగువైపు మళ్లించాలని సైతం ప్రభుత్వం యోచిస్తోంది. సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ చెల్లించే పథకాాన్ని సైతం అమలు చేస్తోంది. ధాన్యం కనీస మద్దతు ధరపై అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తూ సన్నాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని, ఇందుకు 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం అని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ఇదివరకు సేకరించిన సన్నవడ్ల ద్వారా మరాడించగా 8లక్షల టన్నులు వచ్చిన సన్న బియ్యం ఆయా పౌరసరఫరాల గోడౌన్లలో నిల్వ ఉంచారు. మిల్లుల్లో ప్రస్తుతం మరాడిస్తున్న సన్న బియ్యం వచ్చే నాలుగు నెలల వరకు సరిపోగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సన్న బియ్యం కోసం ఎదురుచూస్తున్న పేదలకు పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది.రీసైక్లింగ్ నిరోధానికే.. పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న దొడ్డుబియ్యం చాలామంది భోజనానికి ఉపయోగించడంలేదని, దళారులు కిలోకు రూ.10 నుంచి రూ.20లోపు వీరి వద్ద కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే రీసైక్లింగ్ అక్రమాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సన్నబియ్యం సాగుచేసి విక్రయించిన రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ కూడా చెల్లిస్తుంది. ఇలా వచ్చిన సన్నవడ్లను మర ఆడించిన సన్నబియ్యంను ఆయా పౌరసరఫరాల గోడౌన్లకు సరఫరా చేసి అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారుకు అందించనున్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
నీడ లేదు.. వైద్యం జాడలేదు ఉపాధి కూలీలకు నిలువ నీడ కరువైంది. ప్రథమ చికిత్స కిట్లు కానరావడం లేదు. వివరాలు 8లో u పరీక్షా సమయంఉద్వేగం.. ఉద్విగ్నంపదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పరీక్షల తొలిరోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. స్నేహితులు ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ కేంద్రంలోపలికి వెళ్లారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాల వద్దే నిరీక్షించారు. ఈ ఘటనలన్నింటికీ నిలువెత్తు దృశ్యాలివి. సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
పత్తి తూకంలో వ్యాపారి మోసాలు
● ఇసుక సంచులు, బాట్లు వేసి ఖాళీ వాహనాన్ని తూకం ● రైతుల అప్రమత్తతతో వెలుగులోకి..వట్పల్లి(అందోల్): రైతులనే బోల్తా కొట్టించబోయిన ఓ దొంగ వ్యాపారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రైతుల కథనం మేరకు.. వట్‌పల్లికి చెందిన అసన్ అనే ఓ వ్యాపారి దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తిని తూకం వేసేందుకు వచ్చాడు. ముందుగా తన ఖాళీ వాహనాన్ని తూకం వేసే సమయంలో రెండు ఇసుక సంచులతోపాటు ఆరు బాట్లను వాహనంలోనే ఉంచి తూకం వేశాడు. దరఖాస్తుపల్లి గ్రామంలో పత్తి తూకం వేసే సమయంలో వాహనంలో ఇసుక బస్తాలను చూసి అవాక్కయ్యారు. వాహనంలో ఇసుక బస్తాలు, బాట్లు వేసి తూకం వేశావని నిలదీశారు. సుమారుగా 4 క్వింటాళ్ల వరకు ఉన్న వాటితో అంతే మొత్తంలో పత్తిని నష్టపోయేవారమని వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వట్పల్లి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో మరికొందరు రైతులు ఇదివరకు ఇదే వ్యాపారికి మమ్మల్ని ఇలానే మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వాహనంతోపాటు ఇసుక బస్తాలు, తూకపు బాట్లను స్టేషన్‌కు తరలించారు. దీంతో వ్యాపారి దిగొచ్చి తన మోసాన్ని ఒప్పుకొని ఓ రైతుకు రూ. 50 వేలు చెల్లించడంతోపాటు మిగితా రైతులకు క్షమాణలు చెప్పడంతో పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. -
నష్టాలపాలు
● రైతుల నుంచి పాలు కొనుగోలు చేయని హాట్సన్ కంపెనీ ● తక్కువ ధర ఇస్తున్న విజయ డెయిరీ ● గిట్టుబాటుకాక పాడి రైతుల ఆందోళన ● భారంగా మారిన పశుపోషణ ● నేడు జహీరాబాద్‌లో ధర్నా జహీరాబాద్ టౌన్: వ్యవసాయ రంగమే కాదు.. పా డి రైతులు కూడా నష్టాలు పాలవుతున్నారు. పశుపోషణ మోయలేని భారంగా తయారవుతుంది. పాలకు గిట్టుబాటు ధర రాక అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు చేయూత అందించడం లేదు. స్థానికంగా ఉన్న హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ కంపెనీ వారు పాలను తీసుకోవడం లేదు. విజయ డెయిరీ పాలలో నాణ్యత లోపం చూపుతున్నారు. వేల రూపాయ లు పెట్టుబడి పెట్టి పాలు ఉత్పత్తి చేస్తూ నష్టపోతున్నామని పాడి రైతులు వాపోతున్నారు. న్యాయం చేయాలన్న డిమాండ్లతో జహీరాబాద్ ప్రాంతంలోని పోరాటం చేయాలని నిర్ణయించారు. నాణ్యత పేరుతో తక్కువ ధర జహీరాబాద్ ప్రాంతంలో సుమారు వంద వరకు డెయిరీ ఫామ్‌లు ఉన్నాయి. పాలు సేకరిస్తున్న డెయిరీలు, ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ, హాట్సన్ ఆగ్రో కంపెనీపై పాడి రైతులు ఆధారపడ్డారు. కానీ హాట్సన్ కంపెనీ వారు జహీరాబాద్ రైతుల నుంచి లీటర్ పాలను కూడా కొనడం లేదు. విజయ డెయిరీ నాణ్యత పేరుతో తక్కువ ధర చెల్లిస్తుంది. ప్రైవేట్ డెయిరీల నిర్వాహకులు తక్కువ ధరకే పాలను కొంటున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. పశువుల ధరలు, పశుగ్రాసం సాగు, దాణా, గేదెల పోషణ, వైద్యం ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలు అమ్మినా గిట్టుబాటుకాక ఆందోళన చెందుతున్నారు. పోషణ భారం మోయలేక పశువులను విక్రయిస్తున్నారు. నేడు పట్టణంలో ధర్నా పలు కారణాలతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు (గురువారం) పట్టణంలో ధర్నా చేపడుతున్నట్లు పాడి రైతు విష్ణు తెలిపారు. జహీరాబాద్ సమీపంలోని హాట్సన్ ఆగ్రో కంపెనీ వారు నిబంధనలు పాటించడంలేదని, డెయిరీలు పాలను సేకరించడంలేదన్నారు. హాట్సన్ కంపెనీకి మహారాష్ట్ర, కర్నాటక నుంచి లక్ష లీటర్ వరకు పాలు వస్తున్నాయన్నారు. కానీ స్థానిక పాడి రైతుల నుంచి కొనుగోలు చేయడంలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. -
చిరుత ఆచూకీ కోసం ట్రాప్ కెమెరాలు
దుబ్బాకటౌన్: చిరుత సంచార ప్రాంతాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ అన్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామ శివారులో గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఆచూకీ కోసం బుధవారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు అనుమానిత ప్రాంతాలను సందర్శించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సందీప్ కుమార్ మాట్లాడుతూ.. చిరుత పులి సంచరిస్తూ.. రైతులకు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కాలి ముద్రలు సేకరించి చిరుత పులివేనని నిర్ధారించామన్నారు. చిరుత పులి ఎప్పుడు ఒకే చో ట నివాసం ఉండదని తరచూ తిరుగుతుంటుందని సూచించారు. రైతులు గొర్రెలు, మేకలు, పశువులను పొలాల వద్ద ఉంచొద్దన్నారు. చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులెవరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో రాయపోల్ ఏఎస్ఐ దేవయ్య, సెక్షన్ ఆఫీసర్లు హైమద్ హుస్సేన్, బీట్ ఆఫీసర్లు జహంగీర్, వేణు, కానిస్టేబుల్ స్వామి, సిబ్బంది తదితరులున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ఏర్పాటు కాలి ముద్రలు సేకరణ రైతులు అప్రమత్తంగా ఉండాలి ఫారెస్ట్ రేంజ్ అధికారి సందీప్ కుమార్ -
చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యం
● సంగారెడ్డిలో జిల్లా వాసులు మృతి ● 17న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యంసంగారెడ్డి క్రైమ్: మహబూబ్ సాగర్ చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పట్టణ సీఐ రమేశ్.. మెదక్ జిల్లాలోని బ్రాహ్మణవీధికి చెందిన ముద్దుల సత్యనారాయణ ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య విజయలక్ష్మి (54), కూతురు మణిదీపిక (27), కుమారుడు మణి దీప్ ఉన్నారు. 17న సోమవారం విజయలక్ష్మి, మణిదీపిక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం మెదక్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం సంగా రెడ్డిలోని మహబూబ్‌సాగర్ చెరువులో తల్లీకూతురు మృతదేహాలై కనిపించారు. చెరువులో గుర్రపుడెక్క తొలగించే ఇన్చార్జి సురేందర్ గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసి వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, బస్సు టిక్కెట్ల ఆధారంగా మృతులు మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బియ్యం పట్టివేత నారాయణఖేడ్: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కల్హేర్ పోలీసులు పట్టుకొ ని ఖేడ్ సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పోరుబందర్‌కు చెందిన లారీ డ్రైవర్ కిషోర్ కాంత్ విజయవాడలో నరేశ్ అనే వ్యక్తి వద్ద పీడీఎస్ బియ్యం కొనుగోలు చేశాడు. 300 క్వింటాళ్లు గుజరాత్‌కు లారీలో తరలిస్తుండగా మాసాన్‌పల్లి వద్ద పట్టుకున్నాం. మంగళవారం మూడు లారీలు పట్టుకోగా రెండు లారీలపై కేసు నమోదు చేశారు. మరో లారీపై బుధవారం కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, బియ్యం అమ్మిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కల్హేర్ పోలీసులు వివరించారు. -
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలి
సిద్దిపేటరూరల్: రాష్ట్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం ఆశాల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గోపాల్ స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు మర్చిపోయిందన్నారు. సమస్యలు పరిష్కారించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఆశాలు అనేక వినతిపత్రాలు అందించారన్నారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందనలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5లక్షలు, చనిపోతే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నర్సయ్య, కొంపల్లి భాస్కర్, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమని, ప్రవీణ చల్లారపు నీరజ, కవిత, భాగ్యలక్ష్మీ, స్వప్న, వరలక్ష్మీ, విజయ, లక్ష్మీ, పద్మ, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
జయం మీదే
భయం వీడితే..5 నిమిషాల నిబంధన అమలులో.. పరీక్ష కేంద్రాలల్లోకి వెళ్లేందుకు విద్యార్థులకు పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే అనుమతి ఉంటుంది. అందువలన విద్యార్థులు ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకొని హాల్లో కూర్చునే అవకాశం ఉంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. 5 నిమిషాల నియమం అమలులో ఉన్నందున పరీక్ష కేంద్రానికి త్వరగా చేరుకోవాలి. హడావిడిగా తీరా సమయానికి పరీక్షకు బయలు దేరితే కేంద్రానికి చేరుకోవడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు గాను విద్యాశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పది పరీక్షలు విద్యార్థుల జీవితాల్లో తొలిమెట్టుగా భావిస్తారు. పరీక్షలు అనగానే విద్యార్థులు హడావిడి, భయం, ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. ఇవన్నీ దూరంగా పెట్టుకుంటేనే ప్రశాంతంగా పరీక్షలు రాయగలుగుతామని, అనుకున్న విజయాన్ని సాధిస్తామని పలురంగాల నిపుణులు విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) జిల్లాలోని ప్రభుత్వ, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 14,124 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితో పాటుగా 1,763 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకోసం జిల్లాలో 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం 79 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 79 చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారులు, నలుగురు ఫ్లయింగ్ స్వ్కాడ్లు, ఏడుగురు రూట్ ఆఫీసర్స్‌లు, 50 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్, 707 మంది ఇ న్విజిలెటర్లు పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే పదవ తరగతి పరీక్ష పేపర్లను జిల్లాలోని 25 స్టోరేజ్ పాయింట్లలో భద్ర పరిచారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. టోల్‌ఫ్రీ నంబర్లు పదవ తరగతి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి వారిని సంప్రదించి సమస్యకు పరిష్కారం పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు 98664 15124, 99088 73455 నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉండ నున్నాయి. ప్రశాంతంగా పది పరీక్షలు రాద్దాం ముందు వచ్చినవి.. తర్వాత రానివి రాయాలి హడావిడి లేకుండా పరీక్ష కేంద్రానికి చేరుదాం జంక్ ఫుడ్ వద్దు.. ద్రవరూప ఆహారమే ముద్దు.. విద్యార్థులకు పలు రంగాల నిపుణులు సూచన పరీక్షలు రానున్న 14,124 మంది163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమలులో ఉంటాయని సిద్దిపేట సీపీ అనురాధ బుధవారం తెలిపారు. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నందున ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పై నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడి ఉండకూడదని, సమీపంలోని అన్ని జీరా క్స్ సెంటర్లను మూసివేసి ఉంచాలని పేర్కొన్నారు. పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ ఆదేశించారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
పురుగు మందు తాగి.. నర్సాపూర్ రూరల్: కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ లింగం కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండ పోచయ్య (50) కుటుంబ కలహాలతో మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడ్డ వ్యక్తి.. మునిపల్లి(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు చెందాడు. బుధవారం ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సతీష కుమార్ (28) ఈ నెల 18న బుదేరా పెట్రోల్ పంపులో షెడ్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
లారీ, వ్యాన్ ఢీ: డ్రైవర్ మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వ్యాన్, లారీ ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్–ఖేడ్–బీదర్ 161బి జాతీయ రహదారిపై ర్యాలమడుగు గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వాజీద్ (35) మినీ వ్యాన్‌లో ఖేడ్‌లో మందులు సరఫరా చేసి తిరిగి వెళ్తున్నాడు. ర్యాలమడుగు సమీపంలోకి రాగానే నిజాంపేట్ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ వాహనంతో పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కను తప్పించబోయి .. స్కూటీపై నుంచి పడి యువకుడు మృతి తూప్రాన్: స్కూటీ నుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లింగరెడ్డిపేట చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన చాకలి బొంతపల్లి కృష్ణ (32) యువకుడు అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి స్కూటీపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో లింగారెడ్డిపేట చౌరస్తా వద్ద రహదారిపై అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడి గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి నర్సాపూర్ రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సాపూర్ – మెదక్ రహదారిలో రెడ్డిపల్లి గేటు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ లింగం కథనం మేరకు.. మేడ్చల్ జిల్లా దుండిగల్ గ్రామానికి చెందిన గడ్డమీది మహేశ్(33) రెడ్డిపల్లి గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్‌పై వెళ్తూ వ్యక్తి.. జగదేవ్‌పూర్(గజ్వేల్): బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన నరేశ్(40) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లోని వినాయకనగర్‌లో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం స్వగ్రామం రామన్నపేట నుంచి బైక్‌పై బియ్యం బస్తా వేసుకొని బయలుదేరాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మునిగడప గ్రామానికి రాగానే బైక్‌పై నుంచి కిందపడి ప్రాణాలు వదిలాడు. గుండెపోటు లేదా వడదెబ్బతో మృతి చెంది ఉన్నట్లు పోలీ సులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఐదు రోజుల వ్యవధిలో అన్నాదమ్ముళ్లు హుస్నాబాద్‌రూరల్: ఐదు రోజుల వ్యవధిలో అన్మాదమ్ముళ్లు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొన్నాల లచ్చవ్వ లింగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా అందరికీ పెళ్లీలు అయ్యాయి. అనారోగ్యంతో 14న పొన్నాల ప్రభాకర్ మృతి చెందగా, బుధవారం పొన్నాల రవీందర్ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు కుమారుల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. రవీందర్ గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తుండగా, ప్రభాకర్ హుస్నాబాద్ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత పోలీసుల అదుపులో ఇద్దరు హత్నూర( సంగారెడ్డి): ఓ ఇంటిపై ఎకై ్సజ్ ఇన్ఫోర్స్మెంట్ పోలీస్ అధికారులు దాడి చేసి నిషేధిత ఆల్ఫాజోలం పట్టుకున్నారు. ఈ ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఏఈ ఎస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్, సిద్దిపేట ప్రాంతానికి చెందిన చిత్తాపూర్ గ్రామానికి చెందిన నర్సాగౌడ్ ఇద్దరూ నిషేధిత ఆల్ఫాజోలం 503 గ్రాములు, డయజోఫామ్ 17 గ్రాములు ఇంట్లో నిల్వ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి సుమారు రూ.5 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు పట్టుకున్నాం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని అందోల్ ఎకై ్సజ్ సీఐకి అప్పగించినట్లు తెలిపారు. -
అర్థరాత్రి వరకు చదవొద్దు
ఆన్సర్ బుక్లెట్ పైన ఎలాంటి పేరు గాని, ఇతర వివరాలు రాయరాదు. ఇన్విజిలేటర్లు చేప్పే ప్రతీ సూచన తప్పకుండా పాటించాలి. ఆన్సర్‌షీట్‌లో కొట్టివేతలు లేకుండా నీట్‌గా జవాబులు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు జవాబుల నుంచి తెలియని ప్రశ్నలకు జవాబులు రాయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. రాత్రి 10 గంటల వరకే చదవాలి, ఉదయం 4.30 గంటలకు నిద్ర లేచి చదవడం మంచిది. అర్థరాత్రి వరకు చదవడం వలన పరీక్ష హాల్లో నిద్ర రావడం, ఇబ్బందికరంగా మారుతుంది. ఘన రూప ఆహారం కాకుండా, ద్రవరూప ఆహారాన్ని తీసుకోవడం మంచిది. –రాధారి నాగరాజు, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ కోచ్, సిద్దిపేట -
విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాభినందనలు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. కొన్నేళ్లుగా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది.. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించండి. జిల్లా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలి. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 జీపీఏలు అధికంగా సాధించే విధంగా పరీక్షలు రాయండి. తల్లిదండ్రుల, గురువుల, పాఠశాలల పేరును నిలబెట్టండి. –శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
జిల్లాకు ఐదు పీహెచ్‌సీలు మంజూరు
● మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం: డీఎంహెచ్ఓ ● నేరడిగుంట పీహెచ్సీ తాత్కాలిక భవనం ప్రారంభం వట్పల్లి(అందోల్): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గాయత్రిదేవి అన్నారు. బుధవారం అందోలు మండలం నేరడిగుంటలో పీహెచ్సీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 30 వేలు, గిరిజన ప్రాంతాల్లో 20వేల జనాభా ప్రాతిపదికన పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలన్న నిబంధనల మేరకు జిల్లాలో కంకోల్, సింగీతం, బర్దిపూర్, నేరడిగుంట, సుల్తాన్పూర్ గ్రామాల్లో నూతనంగా ఐదు పిహెచ్సీలు మంజూరయ్యాయని తెలిపారు. నేరడిగుంట పీహెచ్సీ ఫరిదిలో 40వేల మంది జనాభ ఉందని, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి 11 సబ్‌సెంటర్లు, 25 గ్రామాలు వస్తాయన్నారు. నేరడిగుంట ఆసుపత్రికి వైద్యాధికారిగా డాక్టర్ శంకర్‌తో పాటు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించామని పేర్కొన్నారు. పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.46 కోట్లు కేటాయించిందని, అయితే.. కేటాయించిన స్థలం సరిపోదని మరో 20 గుంటలు అవసరమన్నారు. స్థలాన్ని కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బి.శివరాజ్, ఎంపీఓ సోంనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి, పాల్గొన్నారు. -
ఉపాధిలో జల సంరక్షణకు ప్రాధాన్యం
● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వర్షపు నీరు వృథా కాకుండా చర్యలు సంగారెడ్డి జోన్: వర్షపు నీరు వృథా పోకుండా సంరక్షించుకునేందుకు ప్రభుత్వం చర్యటు చేపట్టింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలను నిర్వహించి వివిధ రకాల పనులను గుర్తించారు. కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు చేపట్టారు. గ్రామ సభల్లో జల సంరక్షణ పనులపై అవగాహన కల్పించారు. గతంలో జల శక్తి అభియాన్, వాటర్ షెడ్‌తో పాటు పథకాలను ప్రవేశపెట్టి పలు రకాల పనులు చేపట్టారు. జల సంరక్షణలో చేపట్టే పనులు జల సంరక్షణలో భాగంగా చేపట్టే పనుల్లో ముఖ్యంగా వ్యవసాయ పంట పొలాల వద్ద నీరు నిలిచి ఉండే విధంగా పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలలో పూడికతీత, బోరు బావులు, చేతి పంపులు, ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఇంటి పై భాగంలో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలు, కందకాలు తవ్వటం, నీటి కుంటల నిర్మాణాలు, నీటి నిలువ కుంటలు, పర్క్యులేషన్ ట్యాంకులు, పొలాల మధ్య కాల్వలు తదితర పనులు చేపడుతారు. 2 లక్షల జాబ్ కార్డులు.. 4 లక్షల మంది ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించడమే లక్ష్యంగా తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 19వేల మందికి జాబ్ కార్డులు మంజూరు చేయగా.. 4 లక్షల 3 వేల మంది కూలీలుగా నమోదు అయ్యారు. అందులో 1,32,000 జాబ్ కార్డులు యాక్టివ్ ఉండగా.. రెండు లక్షల 25 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. -
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా: ఎస్పీ
నారాయణఖేడ్: సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టంగా ఉండాలని ఎస్పీ పంకజ్ పారితోష్ సూచించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి మనూరు, నాగల్గిద్ద పోలీస్ స్టేషన్లను ఎస్పీ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్స్టేషన్లలో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా తీశారు. లాకప్ గదులను పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అయినందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిరోధంపై కఠినంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకట్‌రెడ్డి, నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగ యువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో కోరారు. స్వయం ఉపాధి పథకానికి ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. పథకం ద్వారా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణం అందించినట్లు తెలిపారు. తీసుకున్న రుణంలో 60 నుంచి 80శాతం వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఏదో ఒక అంశాలలో ఎన్నుకొని స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతు రిజిస్ట్రీ అమలు పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి ఎంపిక జహీరాబాద్ టౌన్: రైతు రిజిస్ట్రీ అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి మండలాన్ని ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ ఏడీఏ భిక్షపతి అన్నారు. మొగుడంపల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగా ప్రతీ రైతుకు 11 నంబర్లతో యూనిక్‌కోడ్ (యూసీ)కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమన్యా వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామని, దీని ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయిస్తామన్నారు. రైతులు వ్యవసాయ విస్తీరణ అధికారిని సంప్రదించాలని ఆయన కోరారు. హ్యాట్రిక్ కొట్టాడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయికిరణ్‌రెడ్డి జహీరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్): ప్రస్తు తం ఆధునిక పోటీ ప్రపంచంలో ఒక ప్రైవేట్ ఉద్యోగం సాధించడం అంత సులువైంది కాదు. అందులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అహర్నిశలు కష్టపడి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి ఓపెన్ కాంపిటేషన్‌లో ఉద్యోగం సాధించాలంటే ఎంత శ్రమకోర్చి చదవాలో అది కష్టపడే వారికే తెలుస్తుంది. కానీ న్యాల్కల్ మండలం చీకుర్తి గ్రామానికి చెందిన యువకుడు నాగారం సాయికిరణ్‌రెడ్డి(25) ఓపెన్ కాంపిటేషన్‌లో పోటీపడి ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–4 పరీక్షలో జిల్లాలో మూడవ ర్యాంకు సాధించగా, ఆయనకు మొదటగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం ఆయన సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే విధంగా ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ల కోసం ప్రభుత్వ పోటీ పరీక్షలు నిర్వహించగా అందులో రాష్ట్రంలో 14వ ర్యాంకు రాగా మెరిట్ కోటాలో ఉద్యోగం సంపాదించాడు. అలాగే గ్రూప్–2 పరీక్షలో రాష్ట్రంలో 75వ ర్యాంకు రాగా, మెరిట్ కోటాలో ఉద్యోగం సాధించి సాయికిరణ్‌రెడ్డి తన సత్తాను చాటాడు. ఏడాది కాలంలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తి నింపుతున్నాడు. -
పట్టణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.4,500 కోట్లు కేటాయించింది. జిల్లాలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పడిన విషయం విదితమే. చుట్టు పక్కల గ్రామాలను విలీనం చేస్తూ ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదలను మున్సిపాలిటీలుగా చేసింది. అలాగే కొహీర్ను కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ కొత్త మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కలిసొచ్చే అంశమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడ)ను కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ఈ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ.. దాని ఫంక్షనింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వరలు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ఊసు బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. కానీ పనులు ప్రారంభ దశలోనే ఉండి పోయాయి. ఈసారి కేటాయింపులో ఈ రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు కేటాయింపులు లేవు. ఆరు గ్యారెంటీలతో.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రూ.56 వేల కోట్లు కేటాయించింది. ఈ భారీ కేటాయింపులతో ఆయా పథకాల లబ్ధిదారులకు మేలు జరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు 1.73 లక్షల మంది ఉన్నారు. అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి లబ్ధిదారులు 2.16 లక్షల మంది ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పటి వరకు 1.82 మంది మహిళలు ఉపయోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సూత్రప్రాయంగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 2,170 మందికి మొదటి ఆరు నెలలకు రూ.ఆరు వేల చొప్పున చెల్లించారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రూ.56 వేల కోట్లు కేటాయింపులతో ఈ పథకాల లబ్ధి కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ.14.62 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో కేటాయింపులు రూ.44.85 కోట్లకు పెరిగింది. సింగూరు కాల్వల ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టిన విషయం విదితమే. ప్రధాన కాల్వతో పాటు, డిస్ట్రిబ్యూటరీల సిమెంట్ లైనింగ్ పనులకు రూ.143 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే సుమారు రూ.29 కోట్లు కేటాయింపులు పెరగాయని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సింగూరు ప్రాజెక్టు నిర్వహణకు ఏటా ఇచ్చే కేటాయింపుల్లో మాత్రం కోత పడింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 కోట్లు కేటాయించగా, ఈసారి ఈ నిధులు కేవలం రూ.పది లక్షలతో సరిపెట్టింది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు కూడా కేటాయింపులు తగ్గాయి. గత ఏడాది రూ.9.01 కోట్లు ఉండగా, ఈసారి రూ.5.05 కోట్లకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.4,500 కోట్లు బల్దియాలుగా మారిన కొహీర్, ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన కేటాయింపులు ఊసేలేని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నల్లవాగుకు తగ్గిన కేటాయింపులు -
పదికి పకడ్బందీ ఏర్పాట్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈ నెల 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఐదు నిమిషాల సడలింపు అమలులో ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రతి పరీక్ష కేంద్రం అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. తాగు నీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 22,423 మంది విద్యార్థులు జిల్లాలో 22,423 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలలో రెగ్యులర్ విద్యార్థులు 22,411 కాగా ప్రైవేట్ విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు) 12 మంది ఉన్నారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకై ఏదైనా సమాచారం, సందేహాలపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే 08455–276255, 8979677495ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాదికారి, జిల్లా విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వైద్యశాఖ అధికారి మొబైల్ నంబర్లు డిస్ప్లే చేయాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించరు. ● విద్యార్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ● హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, రైటింగ్ప్యాడ్ను వెంట తీసుకొని రావాలి ● హాల్ టికెట్ అందని, పోగొట్టుకున్న విద్యార్థులు www.bre.teanfana.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ● పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తమ పాఠశాల యూనిఫాంలో కాకుండా ఇతర దుస్తువులో హాజరు కావాలి. రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు.. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి పరీక్షలు రాసేందుకు సంసిద్ధమవుతున్న విద్యార్థులకు ముందుగా బెస్ట్ ఆఫ్ లక్. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడే అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారితో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి -
ఓటరు జాబితా సవరణ
అక్రమ ఇటుక బట్టీల ధ్వంసంజహీరాబాద్ టౌన్: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని ట్రైనీ కలెక్టర్ మనోజ్ కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా ఉండాలన్నారు. బీఎల్ఓలు 18 సంవత్సరాలు పైబడిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు, జాబితాలో సవరణలు చేయడం వంటివి చేపడుతామన్నారు. 6,7,8ల ఫారాల నిర్వహణ పకడ్బందీగా ఈ నెల 23వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుపై వచ్చే దరఖాస్తును ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాంరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్: ‘సాక్షి’ కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు బుధవారం అక్రమంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలపై కొరడా ఝళిపించారు. ఈనెల 16వ తేదీన ‘సాక్షి’లో ‘పంట పొలాల్లో ఇట్టుక బట్టీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బుధవారం జేసీబీ సహాయంతో జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను ధ్వంసం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు 15 వరకు అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చిన్న హైదరాబాద్‌లో ఒకటి, హోతి(బి)లో 7, శేఖాపూర్, కొత్తూర్(బి)లో రెండు, ఆనెగుంట గ్రామాల్లో ఒకటి, హోతి(కె)లో 2, జహీరాబాద్‌లో ఒకటి వంతున అక్రమ ఇటుక బట్టీలు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని అక్రమ ఇటుక బట్టీల వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇటుక బట్టీలకు అనుమతులు పొందాలని, లేనట్లయితే చట్ట పరంగా చర్యలు చేపడుతామని రెవెన్యూ అధికారులు యజమానులను హెచ్చరించారు. స్పందన రాజకీయ పార్టీలు సహకరించాలి ట్రైనీ కలెక్టర్ మనోజ్ -
ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయొద్దు
పీఎం శ్రీతోపాటు మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేటరూరల్: ఐసీడీఎస్‌లను రద్దు చేయాలని తెచ్చిన పీఎం శ్రీపథకంతోపాటు మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయా లని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు పెద్ద ఎత్తున సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ.. దేశంతోపాటు రాష్ట్రంలో ఐసీడీఎస్ ప్రారంభమై 50 ఏళ్లు అవుతుందన్నారు. ఐసీడీఎస్‌ను, సేవలను సంస్థాగతం చేయాలని, ఇందులో పని చేస్తున్న అంగన్వాడీ టీచర్స్, ఆయాలను, మినీ టీచర్లను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు ఆదేశాలిచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అమలు చేయాలని చూడటం అన్యాయమన్నారు. మొబైల్ అంగన్ వాడీ సేవల పేరుతో కొత్త విధానాన్ని తెచ్చి ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయొద్దన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా కోశాధికారి జీ.భాస్కర్, సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీ, పద్మ, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
ఏడుపాయల్లో నీట మునిగి వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆలయం వద్ద మంగళవారం స్నానం చేయడానికి వెళ్లి నీటి మునిగి భక్తుడు మృతి చెందాడు. ఏఎస్ఐ సంగన్న కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరాస్తాకు చెందిన బీరప్ప (45) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఏడుపాయల వచ్చాడు. ఉదయం స్నానం చేయడానికి అక్కడి సమీపంలో ఉన్న నాగ్సాన్పల్లి ఫతేనగర్ కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బీరప్ప నీట మునిగాడు. గమనించిన కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ.. జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కూలీ మృతి చెందిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దిడ్గి గ్రామానికి చెందిన దేవరంపల్లి నర్సింలు(30) సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. పట్టణంలోని ఆర్ఎల్ఆర్ స్కూల్ వెనుకాల భవన నిర్మాణం పనులు జరుగుతుండగా సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఇనుప రాడ్లను భవనం పైకి తీసుకెళ్తున్న క్రమంలో పైనుంచి వెళ్లిన 11 కేవీ కరెంట్ లైన్‌కు తాకింది. దీంతో కరెంట్ షాక్ తగిలి కింద పడ్డాడు. వెంటనే జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు వట్పల్లి(అందోల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన అందోలు మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పాండు కథనం మేరకు.. జోగిపేట పట్టణానికి చెందిన పెద్దబోయిన సాయి(25) బైక్‌పై మంగళవారం రాత్రి చింతకుంట నుంచి జోగిపేటకు వస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
500 క్వింటాళ్లు మహారాష్ట్రకు తరలింపు కల్హేర్(నారాయణఖేడ్): అక్రమంగా మహారాష్ట్రకు పక్కదారి పట్టిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్హేర్ ఎస్ఐ వెంకటేశం కథనం మేరకు.. సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే మీదుగా లారీల్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందింది. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తా సమీపంలో తనిఖీలు నిర్వహించి రెండు లారీల్లో బియ్య గుర్తించాం. మహారాష్ట్రలోని నాందేడ్‌కు బియ్యం తీసుకెళ్తున్నట్టు డైవర్లు తెలిపారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించడంతో సివిల్ సప్లయ్ డీటీ విజయలక్ష్మి, మహేశ్, ఆర్ఐ మల్లేశం వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. రెండు లారీలు, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం నారాయణఖేడ్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. కల్హేర్ తహసీల్దార్ శివ శ్రీనివాస్ బియ్యం తూకం పరిశీలించారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు లారీ యజమానులు అయూబ్ అలీ, మీర్జా, డ్రైవర్లు ఖాజమియా, జుల్ఫీఖర్పై కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశం తెలిపారు. కూచారం శివారులో 300 క్వింటాళ్లు మనోహరాబాద్(తూప్రాన్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను లారీలో శ్రీశైలం రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నాం. రెవెన్యూ ఆర్ఐ దీక్షిత్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ షేక్ షోయబ్, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి లారీని తూప్రాన్‌లోని గోదాముకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఓ ఇంట్లో 25.70 క్వింటాళ్లు నిల్వ చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలో గల శ్రీనివాస్ నివాస గృహంలో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరినాథ్ ఆధ్వర్యంలో దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన 25.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐ నారాయణగౌడ్‌కు సమాచారం అందించి బియ్యం వ్యాపారి శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగింత లారీ యజమానులు, డ్రైవర్లపై కేసు -
చిరుతపులి సంచారం కలకలం
దుబ్బాక : రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల మధ్యనున్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందన్న సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల రైతులకు మంగళవారం గల్వనిచెరువు ప్రాంతంలో చిరుత పులి కనిపించింది. చిరుతపులి తిరుగుతున్న ఫొటోలను పలువురు రైతులు దూరం నుంచి సెల్ఫోన్లో తీసి పలు గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘుపతి వెంటనే అక్కడికి చేరుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతనా..? లేక మరో జంతువా.. అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతపులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చిరుతపులి సంచారం వార్త రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల్లో తీవ్ర కలకలం లేపింది. ఆ ప్రాంతంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి శివారులో చూసిన రైతులు భయాందోళనకు గురవుతున్న ప్రజలు -
గొర్రెలు అమ్మేశారని మనస్తాపంతో..
సిద్దిపేటకమాన్: బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. స్థానిక నర్సాపూర్‌లో నివాసం ఉంటున్న బండారి పోశవ్వ (60) తమకు ఉన్న గొర్రెలను పెద్దవాగు వైపు ప్రతి రోజూ తీసుకెళ్లి మేపేది. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గొర్రెలను అమ్మేయడంతో నిత్యం బాధపడుతుండేది. 16న భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం నర్సయ్య వ్యవసాయ బావిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. గొర్రెలు అమ్మడంతో మనస్తాపానికి గురై తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో వ్యక్తి దుబ్బాకటౌన్ : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం స్థానిక పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూని ఎల్లం (40) వ్యవసాయం, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసై భార్య నవనీతతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రించిన తర్వాత అర్థరాత్రి సమయంలో ఎల్లం ఇంట్లో నుంచి వెళ్లి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు. ఉరేసుకొని యువకుడు నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గర్గుల రాజు, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గర్గుల భాను(17) పదవ తరగతి పూర్తి అయిన తర్వాత గ్రామంలోనే కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లగా భాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలో నుంచి శబ్ధం రాకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న స్నేహితుడు వెళ్లి చూశాడు. తాడుకు వేలాడుతున్న మిత్రుడిని చూసి ఇంటి తలుపులు పగులగొట్టి 108లో దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణం -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
సంగారెడ్డి టౌన్ : మంజీరా గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ కథనం మేరకు.. అందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన మ్యాదరి నరేశ్ (30) కొద్దిరోజులుగా భార్య దుర్గతో కలిసి ఇస్నాపూర్‌లో డ్రైవింగ్ పనిచేస్తూ అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఆదివారం తమ్ముడు నరేందర్, స్నేహితులతో కలిసి మంజీరా డ్యాంలో సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ నరేశ్ ఆవలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులకు యువకుడి మృతదేహం దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి బాలుడు
కౌడిపల్లి(నర్సాపూర్): ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మూడున్నరేళ్ల ధ్రువకరణ్ రెడ్డి చోటు సంపాదించాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు తోట కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం కౌడిపల్లి నివాసం ఉంటూ మండలం పీర్యతండా ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి, ప్రియాంక దంపతులకు కుమారుడు ధ్రువకరణ్ రెడ్డి(మూడున్నరేళ్లు), కూతురు ప్రవస్థ (2) ఉన్నారు. ధ్రువకరణ్ రెడ్డికి తల్లిదండ్రులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వివిధ దేశాల జాతీయ జెండాలు, నాయకుల పేర్లు, ఫ్లాష్ కార్డులు గుర్తింపులో ప్రత్యేక శిక్షణ ఇవ్వగా బొమ్మలు చూపగానే టక్కున గుర్తిస్తున్నాడు. గత నెలలో ధ్రువకరణ్ రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, వాటి రాజధానులను 46.58 సెకన్లలో గుర్తించగా వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. పరిశీలించిన ప్రతినిధులు అతడి వయసు, సమయం ఆధారంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించి సర్టిఫికెట్ పంపిణీ చేశారు. మెడల్, సర్టిఫికెట్ మంగళవారం అందించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి తొగుట(దుబ్బాక): అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీటాఫీసర్ నరేశ్ కథనం మేరకు.. తొగుట పెట్రోల్ పంపు సమీపంలో నెమలి మృతి చెంది ఉందని గ్రామస్తుల ద్వారా సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి నెమలిని పరిశీలించగా మరణించింది. స్థానిక పశు వైద్యాలయానికి తీసుకెళ్లగా పశువైద్యాధికారి రమేశ్ పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి నిర్ధారణ, ఆధారాల కోసం ఎఫ్వైఎస్ఎల్కు పంపించామని అధికారి తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం నిజాంపేట(మెదక్): చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట మండలానికి చెందిన దండు చంద్రవ్వ కుమారుడు పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం నిజాంపేటకు చెందిన ఘడీం చెరువులో ఆత్మహత్యాయత్నం చేసింది. అటుగా వెళ్తున్న కుమార్ అనే వ్యక్తి గమనించి ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే 108కి సమాచారం అందించి రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రంగనాయక సాగర్ వద్ద అగ్ని ప్రమాదం చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయం సమీపంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండుగంట పాటు శ్రమించి మంటలార్పారు. -
ప్రత్యేక గుర్తింపు
దివ్యాంగులకుసదరం సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ కార్డులు జిల్లాలో పెన్షనర్ల వివరాలు దివ్యాంగులు – 13,793 వృద్ధులు – 59,242 వితంతువులు – 55,060 గీత కార్మికులు – 2,942 చేనేత – 2,206 హెచ్ఐవీ –1,034 ఫైలేరియా – 2,441 డయాలసిస్ – 103 ఒంటరి మహిళలు – 3,417 బీడీ కార్మికులు – 45,473 బీడీ టైకేదార్లు – 2,078 మొత్తం పెన్షనర్లు – 1,86,000 ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు ఏడు కేటగిరీల్లో మాత్రమే అందించడం జరిగింది. మరో 14 కేటగిరీలను కలుపుకొని మార్చి నెల నుంచి యూనిక్ డిసెబిలిటీ గుర్తింపు కార్డులు 21 కేటగిరీల వారీగా అందించనున్నారు. యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపునకు హాజరు కావాలి. గతంలో మాదిరిగానే మీసేవా కేంద్రంలో గాని, ఫోన్లో గాని స్లాట్ బుక్ చేసుకొని క్యాంపునకు వెళ్లాలి. అనంతరం నిపుణులైన వైద్యులు పరీక్షల అనంతరం ఆన్లైన్లో దివ్యాంగుల వివరాలు నమోదు చేస్తారు. దరఖాస్తు వివరాలు, వైకల్యశాతం, వైద్యుల లాగిన్‌కు చేరుతుంది. అక్కడ వివరాలు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారి సంతకంతో కూడిన కార్డు మంజూరవుతుంది. 3 రంగుల్లో కార్డులు.. ప్రభుత్వం ప్రతీ శనివారం ఏర్పాటు చేయనున్న సదరం క్యాంపుల్లో వైకల్యం సంబంధించి వైద్యులు పరీక్షిస్తారు. అనంతరం పరీక్షల వివరాలు, లోపాలను ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు, లోపాలను బట్టి వైకల్య శాతం జనరేట్ అవుతుంది. ఈ శాతాన్ని మార్చడానికి వైద్యులకు ఎలాంటి అవకాశం ఉండదు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ రూపొందించడం ద్వారా ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఈ శాతాన్ని అనుసరించి యూ డీఐడీ కార్డులు మూడు రంగుల్లో ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉన్న ధ్రువపత్రం ఉపయోగం సదరం క్యాంపులో భాగంగా వైక్యలం గుర్తించబడి శాశ్వతంగా పెన్షన్ మంజూరీకి ధ్రువపత్రాన్ని పొందిన వారు కూడా ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకొని పర్మినెంట్ యూడీఐడీ కార్డును పొందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ధ్రువపత్రం అన్ని రకాలుగా వినియోగించుకునేందుకు వీలుంది. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్ www. swavlambancard.gov.inలో సంబంధిత వివరాలతో ఆన్లైన్లో గాని, మొబైల్ ఫోన్లో గాని దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్ ప్రకారం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు పరీక్షలు నిర్వహించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఆటోమెటిక్‌గా వైకల్య శాతం జనరేట్ చేసి గుర్తింపు కార్డులు అందించడం జరుగుతుంది. చిరునామా వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా యూడీఐడీ కార్డు పంపించడం జరుగుతుంది. ప్రతీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడూ ఫోన్‌కు సమాచారం అందించడం జరుగుతుంది. ఒక్కసారి కార్డు మంజూరైతే శాశ్వతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ కార్డు పని చేస్తుందని, రైళ్లు, బస్సుల్లో సైతం ప్రాధాన్యంతోపాటుగా పలు రకాల సౌకర్యాలను కూడా పొందవచ్చు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.అర్హులైన దివ్యాంగులను వైకల్య శాతాన్ని బట్టి ఇప్పటివరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. వీటి స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అంగవైకల్య యూడీఐడీ (యూనిక్ డిసెబుల్ ఐడెంటిటీ కార్డు) ను జారీ చేయనుంది. ఈ కార్డులను ఈ నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దివ్యాంగులు యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేస్తున్న వివరాలతోపాటుగా వైద్యులువైకల్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో ఎలాంటి తప్పులు జరిగేందుకు వీలు లేకుండా ఉంటుంది. 21 రకాల వైకల్యం కలిగి ఉన్న అర్హులైన దివ్యాంగులకు ఈ కార్డులను అందించనున్నారు. ఒకే దేశం ఒకే కార్డు విధానంలో ఈ కార్డు దేశం అంతటా పనిచేసేందుకు వీలు ఉండనుంది. – సిద్దిపేటరూరల్ 3 రంగుల్లో అందించనున్న ప్రభుత్వం 21 రకాల వైకల్యం కలిగిన దివ్యాంగులు అర్హులు ఈ నెల నుంచి అమల్లోకి.. పోర్టల్ ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం జిల్లా వ్యాప్తంగా 1,86,000 మంది -
మంజీరా నదిలో కుళ్లిన కోళ్లు
పాపన్నపేట(మెదక్): మంజీరా జలాలు కుళ్లిన కోళ్ల మృతదేహాలతో కలుషితమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి కింది నుంచి ప్రవహించే మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ సంఖ్యలో మృతి చెందిన కోళ్లను పడేశారు. అవి కాస్త కుళ్లిపోయి జలాలు కలుషితమవుతున్నాయి. ఇటీవలె విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి వల్లే కోళ్లు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నీటిని దిగువన మెదక్ పట్టణానికి తాగునీరుగా సరఫరా చేస్తారు. ఇలా కలుషితం చేస్తే ప్రజలు రోగాల బారిన పడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. -
నిమ్జ్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంగారెడ్డిజోన్: నిమ్జ్ ఏర్పాటుతో అక్కడి ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, అందుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, రెవెన్యూ అధికారులతో నిమ్జ్ భూసేకరణపై కలెక్టర్ క్రాంతి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలు, ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయన్నారు. భూములిచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులను ఈనెల 24లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రామ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి రెవెన్యూ, నిమ్జ్ అధికారులతో భూసేకరణపై సమీక్ష -
భరోసా పనితీరు భేష్
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్సంగారెడ్డి జోన్: భరోసా కేంద్రంలోని సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. విధుల్లోగానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చని స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని భరోసా కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అందించిన సేవలను, నిర్వహించిన కౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో కౌన్సిలింగ్ రూమ్, మెడికల్ రూమ్, లీగల్ సపోర్టింగ్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లలో కలియతిరిగారు. అనంతరం కార్యాలయం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...భరోసా కేంద్రం సిబ్బంది బాధిత మహిళలకు వెన్నంటి ఉండి వారికి అసరమైన మెడికో లీగల్ సేవలు సత్వరమే అందించాలన్నారు. అవసరమైన కేసులలో భరోసా సిబ్బంది బాధిత మహిళల ఇళ్లను సందర్శించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మహిళా సంబంధిత నేరాల గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్, భరోసా కో–ఆర్డినేటర్ దేవలక్ష్మి, భరోసా సిబ్బంది తదితరులున్నారు. -
పన్ను వసూళ్లు 86శాతం పూర్తి
న్యాల్కల్ (జహీరాబాద్): జిల్లాలో ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు వసూలు చేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నెలాఖారు వరకు వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. గతంలో వసూలు చేసిన మాదిరిగా పన్నులను నిర్ణీత సమయానికంటే ముందే పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పన్నులు వసూలు చేసేందుకు ఇంటి బాట పట్టారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పన్నులు తప్పకుండా వసూలు చేసేందుకు కార్యదర్శులు ఇళ్లన్నీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 27మండలాలు, 633 గ్రామ పంచాయతీలున్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.23,54,92,355 పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇప్పటివరకు జిల్లాలో రూ.20,45,71,746 (86.87%) పన్నులు వసూలు అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 27 మండలాలు ఉండగా అందులో ఏ ఒక్క మండలంలో కూడా వంద శాతం పన్నులు వసూలు కాలేదు. అందోల్, మనూర్, నాగిల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, అత్నూర, పటాన్చెరువు, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లో 90 శాతానికి పైగా పన్నులు వసూలు అయ్యాయి. వట్పల్లి, అమీన్పూర్, జిన్నారం, సంగారెడ్డి మండలాల్లో ఒక్క గ్రామ పంచాయతీ కూడా వంద శాతం పన్నులు వసూలు చేయలేదు. జిల్లాలో 99.62% పన్నులు వసూలు చేసిన నాగిల్గిద్ద మండలం మొదటి స్థానంలో ఉండగా, 65.56% పన్నులు వసూలు చేసిన కంగ్టి మండలం చివరి స్థానంలో నిలిచింది. గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రజలంతా ఇంటి పన్నుతోపాటు ఇతర పన్నులు తప్పకుండా కట్టాలని, పన్నులు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేస్తున్నారు. ఇళ్లన్నీ తిరిగి వసూలు చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు బ్యాంక్‌ల ద్వారా పంచాయతీల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నారు. వసూలు చేసిన పన్నులతో ఆయా గ్రామాల్లో మంచి నీటి ట్యాంక్‌లు, మురికి కాల్వలను శుభ్రం చేయించడం, పగిలిన పైప్లైన్లకు, లీకేజీల మరమ్మతులు చేయించడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పన్నుల చెల్లింపు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ వాటిని వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పన్నుల వసూలుకు ఇంకా 13 రోజుల సమయం మాత్రమే మిలిగి ఉంది. ఈలోగా పన్నులు వంద శాతం వసూలు అవుతాయా? లేదా వేచి చూడవలసిందే. జిల్లాలో 633 పంచాయతీలు 287 జీపీల్లో పూర్తయిన పన్ను వసూళ్ల ప్రక్రియ నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యం -
ఈ–పంచాయతీ చెల్లింపులు ఎలా?
రాజస్థాన్ ప్రజాప్రతినిధుల ఆరాకొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని తొగర్‌పల్లిలో మంగళవారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు పర్యటించారు. తొగర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు ఈ పంచాయతీ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని అలియాబాద్ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో పంచాయతీ, ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీలతోపాటు యాదాద్రి మోడల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ప్రజాప్రతినిధులు గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీపనులతోపాటు పల్లె ప్రకృతి వనం నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో కూడా గ్రామాలలో ఎలాంటి పథకాలు అమలు చేయాలనే విషయంపై తెలంగాణలో పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు. -
మున్సిపాలిటీలవైపే మొగ్గు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పలు గ్రామాలను ప్రభుత్వం ఇటీవల సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. మరికొన్ని గ్రామాలతో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇలా విలీనమైన గ్రామాలు, కొత్త మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఇకపై మున్సిపాలిటీ శాఖలో పనిచేస్తారా..? లేదా పంచాయతీరాజ్ శాఖలో కొనసాగుతారా? అనే దానిపై నిర్ణయం తెలపాలని మున్సిపల్‌శాఖ ఆప్షన్లు కోరింది. దీంతో ఎక్కువమంది పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీల్లో పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. రెండు విడతలుగా నిర్ణయం.. జిల్లాలో మొదటి విడతలో పటాన్చెరు మండలంలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేసింది. అలాగే అమీన్పూర్ మండలంలోని ఆరు గ్రామాలను అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిపింది. ఇలా మొత్తం 11 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆరు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో ఇస్నాపూర్, గుమ్మడిదల, గడ్డపోతారం గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చుతూ జనవరి మొదటి వారంలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 14 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. మరోవైపు కొహీర్ గ్రామ పంచాయతీ కూడా మున్సిపాలిటీగా మారింది. ఇలా మొత్తం 26 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. అయితే ఈ 25 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు ఇకపై పంచాయతీరాజ్శాఖలోనే కొనసాగుతారా..? మున్సిపాలిటీల్లో ఉంటారా? అనే అంశంపై మున్సిపల్‌శాఖ ఇటీవల ఆప్షన్లను అడిగింది. నలుగురైదుగురు మినహా మిగిలిన వారంతా మున్సిపల్ శాఖ వైపే మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.అర్బన్ ఏరియాల్లో పనిచేసే అవకాశం కోసం.. మున్సిపల్శాఖలోకి వెళితే అర్బన్ ఏరియాలో పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది మున్సిపాలిటీల్లో ఆప్షన్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్శాఖలోకి వెళితే సీనియారిటీ అంశం అటుంచితే కాస్త తొందరగా పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేడ్–1 కార్యదర్శి మున్సిపాలిటీలో మేనేజర్ క్యాడర్ పోస్టు వస్తుంది. ఇది కూడా ఎక్కువ మంది మున్సిపాలిటీ వైపు వెళ్లేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్షణ పదోన్నతుల జాబితాలో ఉన్న అతి కొద్దిమంది మాత్రమే పంచాయతీరాజ్‌శాఖలో కొనసాగాలని భావిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది విలీన గ్రామ పంచాయతీల్లో డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. ఇలా డిప్యూటేషన్లపై కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. విలీన పంచాయతీల కార్యదర్శులకు ఆప్షన్లు అడిగిన మున్సిపల్ శాఖ బల్దియాల్లో పనిచేసేందుకే ఎక్కువమంది ఆసక్తి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లోకి...