
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం బస్టాండ్ సెంటర్‌లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment