హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలం | TPCC Leader Criticize On KCR | Sakshi
Sakshi News home page

హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలం

Published Mon, Jul 16 2018 11:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TPCC Leader  Criticize On KCR - Sakshi

కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆత్ర సక్కు

ఆసిఫాబాద్‌: ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని జన్కాపూర్‌కు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. సక్కు వారికి  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మా ట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. దళితులకు భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీటు పీజీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చతికిల పడిందన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో సీట్లు అమ్ముకున్న ఘనత టీఆర్‌ఎస్‌ నాయకులదేనని ఆరోపించారు. మ ద్యం దుకాణాలకు అనుమతులిచ్చి, పక్కనే పోలీసులతో తనిఖీలు చేయించి కేసులు నమోదు చేయించడం ఎంతవరకు సమజంసమని ప్రశ్నిం చారు. జిల్లాలో ప్రజల కోసం పని చేసే అధికారులు టీఆర్‌ఎస్‌ నాయకులకు నచ్చడం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతోపాటు ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎల్‌డీఎంఆర్‌సీ కార్యక్రమం కింద జిల్లాలోని తటస్థులను పార్టీలోకి చేర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జన్కాపూర్‌కు చెందిన శ్యాం, గంగాధర్, కుమార్, వెంకటేశ్, చందు, మహేశ్, ప్రభాకర్‌తోపాటు ఎమ్మార్పీఎస్‌ నాయకుడు పొ న్నాల నారాయణ, పలువురు యువకులు ఉన్నా రు. కార్యక్రమంలో జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు బొమ్మెన బాలేశ్వర్‌గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఇరుకుల్ల మంగ, ఎంపీటీసీ ఫైసల్, నాయకులు ఎత్తేశ్యాం, అసద్, వసంత్‌రావు, కొండ్ర రాజేశ్వర్, శైలేందర్, జాలింషా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement