Sakku
-
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్‌ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉండే దొరలైనా ఆదిలాబాద్‌లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఇవి చదవండి: సీఎం హామీల జల్లు! -
నూనె తాగి.. మొక్కు తీర్చి
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఖందేవ్ జాతర శనివారం ప్రారంభమైంది. పక్షం పాటు జరగనున్న జాతరకు ఉమ్మడి జిల్లాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా త రలి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైన ఖందేవునికి ఏటా పు ష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. ఇందుకోసం తమ ఇళ్లలో తయారుచేసిన నువ్వుల నూనె ను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితి తాలుకా కొద్దిగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి శనివారం ఆల య సన్నిధిలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొ క్కు తీర్చుకుంది. ఇలాచేస్తే సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయ్యారు. కార్యక్రమంలో తొ డసం వంశ పెద్దలు బాపూరావ్ కటోడా, ఆనందరావ్ కటో డా, రాజు, యాదవ్రావ్, బండు, గోపాల్ పాల్గొన్నారు. -
వివాదం.. అగ్గిరాజేస్తున్న ఆధిపత్య పోరు
ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మధ్య పోరు అగ్గిరాజేస్తోంది.. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. వర్గాలు వీడిపోయి ఒకరి పై ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే టార్గెట్ చేయడానికి కారణాలేంటి,? ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీలో కుంపట్లపై సాక్షి టీవీ స్పేషల్ రిపోర్ట్. సాక్షి, ఆదిలాబాద్ : కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గూలాబీ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే అత్రం సక్కు, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే అత్రంసక్కు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోవ లక్ష్మిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత సక్కు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో జైనూర్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి గిరిజనులకు కేటాయించడంతో కోవలక్ష్మి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇద్దరు ఒకే నియోజకవర్గం కావడంతో పార్టీలో పట్టుకోసం వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఆధిపత్యం కోసం వర్గాలను పెంచిపోషిస్తున్నారు. అభివృద్ధి పనులైనా, పదవులైనా అనుచరులకు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. ఒక వర్గానికి అధికారులు పనులు ఇస్తే. తనవర్గానికి పనులు ఇవ్వడం లేదని ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో అధికారులకు అడకత్తేరలో పోకమాదిరిగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఒక వర్గానికి పనులు ఇస్తే.. మరోక వర్గం అధికారులపై కస్సుబుస్సు మంటోది. అదే విధంగా ఎస్సైలు, సీఐలు, మండల పరిషత్ అధికారులు, ఎమ్మార్వోలు ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే, జడ్పీ చైర్మన్‌కు గిట్టడంలేదట. చైర్మన్‌కు అనుకూలంగా ఉంటే ఎమ్మెల్యే సక్కుకు గిట్టడం లేదట. ఇద్దరి ప్రజాప్రతినిధుల పెత్తనం వల్ల అధికారులు నలిగిపోతున్నారట. కొందరు అధికారులు ఈ పెత్తనం వేధింపులు తట్టుకోలేక బదిలీ దారులు వెతుకున్నారట. అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గోయ్యిలా ఉంటే.. కార్యకర్తలది నాయకులది విచిత్రమైన పరిస్థితి. ప్రతి మండలంలో ఎమ్మెల్యే సక్కు వర్గం, జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి వర్గాలుగా విడిపోయారు. చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యేపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం ఉంది. సిర్పూర్ మండలం జడ్పీటీసీగా కోవలక్ష్మి కూతురు విజయం సాధించింది. కోవలక్ష్మి జడ్పీటీసీగా గెలుపొందిన జైనూర్, సిర్పూర్ మండలాల్లో చైర్మన్ అంత జనన కనుసన్నలో నడిపిస్తోందట. జిల్లా పరిషత్ నుంచి కేటాయించే నిధులు తనకు అనుకూలంగా కేటాయిస్తోందట. ఎమ్మెల్యే సక్కు తానేం తక్కువ కాదని ఎమ్మెల్యే కోటా నిధులు తనవర్గానికి కేటాయించి పట్టుపెంచుకున్నారట. చైర్మన్ వర్గాన్ని దూరం పెడుతున్నారని జోరుగా నియోజకవర్గంలో ప్రచారం సాగుతుందట. పైకి ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఉన్నారని కార్యకర్తల్లో చర్చసాగుతుందట. గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ టికెట్‌పై అప్పుడే రచ్చ మొదలైంది. ఓటమి పాలైన వారికి టిఅర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదని.. తనకే టిక్కెట్ దక్కుతుందని సక్కు ప్రచారం చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే టికెట్ దక్కని.. జడ్పీ చైర్మన్ వర్గంలో ఉండటం కన్నా రాజకీయ భవిష్యత్తు కోసం వర్గంలోకి రావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారట. ఆ ప్రచారాన్ని నమ్మి కొందరు కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు చైర్మన్ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి చేరిపోయారట. జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. ఇప్పటికే జైనూర్, సిర్పూర్ మండలాల్లో తన ఆధిపత్యంలో ఉందని.. మిగితా తిర్యాణి, వాంకిడి, నార్నూర్, గాదే గూడ మండలాల ప్రజా ప్రతినిధులు తనవైపు ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారట. అదే విధంగా పార్టీ పెద్దల అండ తనకు టిక్కెట్ దక్కుతుందని సన్నిహితులకు చెప్పకుంటున్నారట. ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యర్థి పార్టీ మాదిరిగా వ్యతిరేక ప్రచారం చేసుకోవడంపై కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఇప్పుడే ఇలా గొడవలు ఉంటే.. మరి ఎన్నికల నాటికి టికెట్ గొడవలు ఎటువైపు ఎక్కడి వరకు పోతాయోనని కార్యకర్తలు అందోళన చెందుతున్నారట. ఈ ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదుర్చాలని కార్యకర్తలు కోరుతున్నారట. పార్టీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
డ్యాన్స్ చేస్తా.. డోలు వాయిస్తా.. : ఎమ్మెల్యే
అధికార దర్పం, ఆడంబరాలకు దూరం ఆ కుటుంబం.. మంది మార్బలం, పెత్తనం చెలాయించే అవకాశమున్నా.. ఏ కోశాన కూడా వాటికి చోటివ్వరు. ప్రతిరోజు ఓ పర్వదినంలా భక్తి భావంతో ఇంటిల్లిపాది గడిపే తత్వం అలవర్చుకున్నారు. రెండుసార్లు (2009, 2018) ఎమ్మెల్యేగా గెలిచినా సొంతిల్లు కూడా లేని నిరాడంబర జీవితం ఆయనది. పదవీలో ఉన్నా లేకున్నా సింపుల్‌గా ఉండడమే తెలుసు వారికి. వారే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలోనూ రాజకీయంగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. అదే బాటలో సాగే ఆయన సతీమణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన తులసి సక్కుకు కొండంత బలం. ఆదివారం పరిషత్ ఎన్నికల హడావేడిలో ఉన్నా ఆత్రం సక్కు ‘పర్సనల్ టైం’లో ‘సాక్షి’ కోసం ఖాళీ సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యేగా ఉంటూ బయటకు కనిపించని రాజకీయేతర కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. ‘సాక్షి’తో ఆయన జరిపిన ఎక్స్‌క్లూజివ్ నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూ.. సాక్షి, ఆసిఫాబాద్: మాది తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీపూర్. నాన్న ఆత్రం రాజు. అమ్మ మన్కుబాయి. అక్క భద్రుబాయి. మారుమూల గిరిజన ప్రాంతం కావడంతో అస్సలు సాగునీటి వసతులు లేక నాన్న రోజు పంట పండించేందుకు ఎంతో చెమటోడ్చేవారు. ఇదంతా చూస్తు పెరిగా. ప్రాథమిక విద్యాభ్యాసం లక్ష్మీపూర్‌లో, ఇంటర్మీడియెట్ లక్సెట్టిపేటలో ముగిసింది. ఆ తర్వాత ఏడాది పాటు వ్యవసాయం చేశాను. 1993లో ఐటీడీఏలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట పోస్టింగ్ తిర్యాణి మండలం గోపెరా ఐటీడీఏ స్కూల్. అప్పట్లోనే మా నాన్న ఐదో తరగతి వరకు చదువుకుని ఉండడంతో మాకు చుట్టూ ఉన్న పరిస్థితులను మాకు చెప్పేవారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేయాలనే వారు. దీంతో చిన్నప్పటి నుంచే సింపుల్‌గా ఉండడం అలవడింది. అప్పట్లో నేనున్న ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం, ఆదివాసీ ఉద్యమాల ప్రభావం నన్ను నిరాడంబర వైపు నెట్టాయి. రెండు రోజులు చెప్పులు వేసుకోను.. నా విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికంగా గడపడం నాకిష్టం. శివుడు, హన్మాన్తో పాటు మా కులదేవత పెర్సపెన్, ఇష్ట దైవం జంగుబాయిని నిత్యం పూజిస్తా. ప్రతి అమవాస్య, పౌర్ణమి రోజున కాళ్లకు చెప్పులు కూడా వేసుకోను. మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ సమయంలో కాళ్లకు చెప్పులు వేయనని నిష్టతో ఉండి మూడేళ్ల పాటు కాళ్లకు చెప్పులే వేసుకోలేదు. ఎమ్మెల్యేగా గెలిచాక మళ్లీ వేసుకున్నా. జంగుబాయి క్షేత్రాన్ని గెలిచినా, ఓడినా సందర్శిస్తాను. ప్రతి శుక్రవారం శివుడికి, మంగళవారం హన్మాన్ ఉపవాసం ఉంటాను. 18 ఏళ్ల క్రితం అరెస్టు అయి జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఈ భక్తి మరింత పెరిగింది. ప్రతిఏడు పుష్యమాసం (జనవరి)లో జై జంగో జై లింగో, హన్మాన్ మాల వేసి నిష్టతో ఉంటా. నా చిన్న కూతురు పేరు నా ఇష్ట దైవం పేరు మీదుగా జంగుబాయి అని నామకరణం చేశా. నా ఆధ్యాత్మిక గురువు కుస్రం హనుమంతరావు. మద్యం అలవాటు లేదు. గతంలో మాంసాహారం తినేవాడిని. ప్రస్తుతం పూర్తిగా మానేశా. పిల్లల పెంపకం ఆమెదే.! నిత్యం ప్రజలతో ఉండడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోతా. 1994లో చిన్ననాటి క్లాస్మేట్, నా తోటి ఉపాధ్యాయురాలైన తులసితో ప్రేమ వివాహం జరిగింది. మాకు ఆరుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. పిల్లల పెంపకం బాధ్యత మొత్తం మా ఆవిడ తులసి చూసుకుంటోంది. పెద్దమ్మాయి దివ్య లక్ష్మీకి వివాహం అయింది. పెద్దబ్బాయి వినోద్‌కుమార్ డిగ్రీ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి అంకిత్ డీఈడీ చేస్తున్నాడు. మూడో అబ్బాయి అన్వేశ్ తొమ్మిదో తరగతి, రెండో అమ్మాయి హిమ బిందు ఏడో తరగతి, చిన్నమ్మాయి జంగుబాయి నాలుగో తరగతి చదువుతోంది. ఆ ఒక్కటే తీరని లోటు చిన్నప్పుడు మా నాన్న చేతనైనంత వరకు తోటి వారికి సాయం చేయాలనే చెబుతుండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక అనేక మందికి సాయం చేస్తున్నా. ఇలా ఎమ్మెల్యేగా ఉండి, పదిమందికి సాయం చేయడం, చేసే భాగ్యం ఆయనకు లేదని నన్ను ఎప్పటికీ బాధ పెడుతుంటుంది. నాన్న బతికుంటే ఎవరికైనా ఏదైనా చేయాలని సూచిస్తే వెంటనే చేసి ఆయనను సంతోషపెట్టేవాడిని. కాని ఆ అవకాశం నాకు లేకుండా పోయింది. అయినా నా దగ్గరికి ఎవరైనా విద్య, వైద్యం, వ్యవసాయం, పెళ్లి, దైవం ఈ ఐదింటిలో ఎవరైనా సాయం కోరి వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇది ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సాయం కొనసాగుతుంది. డ్యాన్స్ చేస్తా.. డోలు వాయిస్తా.. నాకు మా సంప్రాదాయ డోలు వాయించడం అంటే ఇష్టం. తుడుం మోగిస్తా. డ్యాన్స్ కూడా చేస్తాను. పాటలు కూడా పాడతాను. బహిరంగ సభల్లో మాటల కంటే ముందుగా ఓ చిన్న పాటతో నా ప్రసంగం మొదలు పెడుతుంటాను. టీచర్‌గా పనిచేసినప్పుడు క్లాస్ రూంలో పిల్లలకు పాటల రూపంలో పాఠాలు చెప్పే క్రమంలో పాటలు పాడటం మొదలైంది. కొమ్ములు రావు కదా.? ఓ ఎమ్మెల్యే భార్య అయినంత మాత్రాన మాకు కొమ్ములు రావు గదా.? అప్పడు..ఇప్పుడు.. ఎప్పుడూ ఒకేలా ఉండుడే మాకు తెలుసు. మాకు సింపుల్‌గా బతకడమే ఇష్టం. ఉదయం ఎవరైనా స్కూల్‌కి బైక్‌పై తీసుకెళ్తే, సాయంత్రం ఆర్టీసీ బస్సులో తిర్యాణి నుంచి ఆసిఫాబాద్‌కి వస్తా. ప్రభుత్వ టీచర్‌గా నా విధులు నిర్వహిస్తా. కారు వాడడం నాకు ఇష్టం లేదు. ఇంట్లో అంతా భక్తిభావంతో ఉంటాం. దీక్షా సమయంలో అంతా చెప్పులు లేకుండా ఉంటాం. ఇంట్లో మాంసాహారం వండడం పూర్తిగా మానేశాం. 2001 నుంచి భక్తి భావంతో కాళ్లకు పూర్తిగా చెప్పులు వేయడం మానేశా. కుటుంబంతో దూరంగా ఉంటేనే కదా. ఆయన ప్రజలకు దగ్గరగా ఉండేది. కాబట్టి ఆయనను తొందరగా ఇంటికి రావాలని ఎప్పడూ ఇబ్బంది పెట్టను. – ఆత్రం తులసి, సక్కు సతీమణి, ‘‘మొదటిసారిగా 2009లో, రెండోసారి 2018లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా. ఆడంబరాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. కూలీ పనులకు వెళ్లా, అడవిలో తిరిగి తునికాకు కోసిన. పేదరికం, ఆకలి విలువ బాగా తెలుసు. ఆదివాసీల సాధక బాధలు చూస్తూ పెరిగా. పూర్తిగా సాధారణ జీవితం గడపడమే నాకిష్టం. సొంతిల్లు లేదనే బాధ లేదు. ఆస్తులు కూడబెట్టాలనే కోరిక లేదు.’’ ‘‘పెళ్లి అయి ఇన్నాళ్లు అవుతున్నా మేం కలసి ఒక్క సినిమాకు గానీ, షాపింగ్‌కు గాని ఇప్పటి వరకూ వెళ్లలేదు. ఇద్దరికీ సాదాసీదాగా ఉండడమే ఇష్టం.’’ -
ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ కకావికలం.!
సాక్షి, ఆసిఫాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో అప్రతిహతంగా కొనసాగిన హస్తం పార్టీ హవా క్రమేపీ దిగజారుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ అస్తిత్వమే కోల్పోయే ప్రమాదంలో పడింది. పార్టీకి మొన్నటి వరకూ వెలుగు దివ్వెలా ఉన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం గులాబీ గూటికి చేరడంతో దిగువస్థాయి కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది స్థానాల్లో కేవలం ఆసిఫాబాద్ స్థానాన్ని మాత్రమే హస్తం పార్టీ గెలుచుకుంది. సక్కు గెలుపుతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కొంత పటిష్టంగానే ఉన్నట్లు కనిపించినా, ఆయన టీఆర్ఎస్లో చేరికతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. గతమెంతో ఘనం.. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ నియోజవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏళ్ల పాటు తన హవా కొనసాగించింది. ఈ రెండు నియోజకవర్గాల చరిత్రలో ఆసిఫాబాద్‌లో తొమ్మిది సార్లు, సిర్పూర్లో ఆరుసార్లు కాంగ్రెస్ గెలుపొందింది. గ్రామస్థాయిలో బలమైన కేడర్‌తో పాటు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఉండేది. అలాంటి స్థితి నుంచి ప్రస్తుతం మండలాల్లో ద్వితీయశ్రేణి నాయకులు సైతం కాంగ్రెస్‌ను వీడుతున్నారు. ఈనెల 22న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో ఆ ప్రచారంలో కోలాహలం కనిపించడం లేదు. దీంతో వచ్చిన నాయకుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కాకపోతే ఆసిఫాబాద్‌తో పోల్చితే సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసి ఓటమి పాలైన డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు గత కొంత కాలంగా తన కేడర్‌ను కాపాడుకుంటూ నియోజకవర్గంలో పార్టీని బతికిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నాయకులు రేపో, మాపో పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరగుతోంది. ఆసిఫాబాద్‌లో పరిసమాప్తం.! ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయినట్లు కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యే సక్కు పార్టీ మార్పును వ్యతిరేకించడం లేదు. కనీసం ఒక్కసారి కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలకనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. దీనికి తోడు మండలాలు, గ్రామాల్లో ఉన్న కేడర్ సైతం సక్కు వెంటే అంటూ రోజు రోజూ తీర్మానాలు చేస్తుండడంతో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో తీవ్ర నష్టం చేకూరే ప్రమాదముంది. అలాగే మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పే ఇద్దరు, ముగ్గురు నేతలు ఇంకా పార్టీ మారడంపై స్పష్టత కొరవడింది. సక్కు వెంట వెళ్లలేక, కాంగ్రెస్‌లో కొనసాగుదామా.? వద్దా.? అనే ఊగిసలాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా నాయకులు వస్తే అడపదడపా కార్యక్రమాల్లో మాట్లాడడం చేస్తున్నారు కాని చురుకుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకవేళ సక్కు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి కూడా దొరకడం ప్రస్తుత పరిస్థితిలో కష్టమనే చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలు రాకున్నా భవిష్యత్‌లోనూ సక్కు స్థాయి నేత మళ్లీ పార్టీలో ఎదగడం అనేది ఈ పరిస్థితిలో ఊహించడమే కష్టంగా ఉంది. కార్యకర్తలను కలుస్తున్న సక్కు.. కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సక్కు తన నియోజవర్గంలోని కార్యకర్తలను, అభిమానులు, తన వర్గానికి చెందిన వారిని క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పలకరిస్తున్నారు. తన నిర్ణయాన్ని కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లి తను ఎటు వెళితే అటే అన్నట్లు తన అనచరగణాన్ని మలుచుకుంటున్నట్లు ఆయన నిర్వహిస్తున్న సమావేశాల తీరును చూస్తే కనిపిస్తోంది. అలాగే మరోనెల రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థికే తమ మద్దతు ఉండేట్లు తన అనుచరవర్గాన్ని సంసిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరూ కూడా తనను పార్టీ మారడం పట్ల వ్యతిరేకత చూపకుండా వీలైనంత ఎక్కువ మందిని కలసి తన నియోజవర్గ భవిష్యత్ ప్రణాళికను కేడర్‌కు చెప్పి ఒప్పిస్తున్నారు. దీంతో కార్యకర్తలు సైతం ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉండేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ దూకుడును తట్టుకుని కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏమేరకు ఓట్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే. -
అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
సాక్షి, తిర్యాణి: ఆసిఫాబాద్ నియోజక వర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి మారాల్సి వస్తుంద ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు. డిసెంబర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గిరిజన ప్రాంతాలలో ఆభివృద్ధి విషయమై చర్చించామన్నారు. గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, భూమి సమస్యలు కొకొల్లలుగా ఉన్నాయ ని వాటిని పరిష్కరించాలని కోరగా గిరిజన ప్రాంత అభివృద్ధికి తాము కోరిన విధంగా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని, కేసీఆర్ ఇచ్చిన హామీతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నామన్నారు. నియోజకవర్గం, మండలాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూ చించారు. గతంలో టీఆర్ఎస్లో పార్టీ లో ఉన్న కార్యకర్తలంతా కలిసి పనిచేయాలన్నారు. ఇందు లో భాగంగా మండలంలో పర్యటించానని కార్యకర్తల అభిప్రాయాలను పంచుకున్నామన్నారు. తాము టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విధివిధానాలు రూపొందించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడంటే అపుడే పార్టీలో చేరతామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పార్టీ నాయకులు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సక్కు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని కలిసి çపని చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్‌గౌడ్, జెడ్పీటీసీ వెడ్మకమల, సింగిల్ విండో చైర్మన్ చుంచు శ్రీనివాస్, సర్పంచ్ సింధూజ, ఉపసర్పంచ్ తోట లచ్చయ్య, రిటైర్ట్ ఎంఈవో శంకర్, నాయకులు తోట భీమయ్య, పెరుమాండ్ల వెంకటేశం, గాజంగి మల్లేశ్, బుర్రరమేశ్, బ్రహ్మం, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
గులాబీ గూటికి ఎమ్మెల్యే సక్కు
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గులాబీ గూటికి చేరడం ఖరారైంది. ఉమ్మడి జిల్లాలోని ఉన్న పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరికపై గత రెండు మాసాలుగా మంత్రాంగాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్లో చేరునున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఆసిఫాబాద్‌లో 174 ఓట్ల స్వల్ప మెజార్టీతో సక్కు గెలుపొందారు. ఆదివాసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. డీసీసీ అధ్యక్షుడి రేసులో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నా.. ముందు జాగ్రత్తగా పార్టీ వీడకుండా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవి సక్కుకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే సక్కు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆదివాసీ సమస్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన ఒక్కరే సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సక్కు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఆయన డీసీసీ అధ్యక్ష పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆదివారం రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడికి అందజేసి త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెల 22న ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 1997 నుంచి ట్రైబల్ రైట్స్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన సక్కు 2008లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. నవంబర్ 2008లో కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అ సెంబ్లీకి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఎస్టీ వెల్ఫేర్ కమిటీ, ట్రైబల్ అడ్వయిజర్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ కార్యదర్శి, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేసిన సక్కు ఇటీవల ఎమ్మెల్యేగా గెలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిపై 174 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనూ సక్కు పాల్గొన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతోనే.. ఇటీవల సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆదివాసీ సమస్యలతోపాటు పోడు భూముల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాది సమస్యలతోపాటు ఇతర అంశాలపై చర్చించామని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్య అధికారులందరినీ వెంటబెట్టుకొని వచ్చి ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు అన్ని రకాల అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరడానికి నిశ్చయించుకున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరే విషయంపై విధివిధానాలు రూపొందించుకుంటామని, అవసరమైతే శాసన సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, కొత్తగూడెం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షణకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత పదునుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క చోటకూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా విపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే విషయమై అన్ని వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరుగురు పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను గెలుపొందేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాన్ని కూడా చేజిక్కించుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గత నెల 25న ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేలతో ఏజెన్సీ నియోజకవర్గాల సమస్యలపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు భద్రాచలం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ఆత్రం సక్కు హాజరయ్యారు. పినపాక నియోజకవర్గంలో సాగునీరు, మిషన్ భగీరథలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అంశాలపై సీఎంకు రేగా కాంతారావు క్షుణ్ణంగా వివరించారు. పరిష్కార మార్గాలు సైతం సూచించారు. దీంతో 26న ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను పినపాక నియోజవర్గంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ సూచించగా, ఆమె ఎమ్మెల్యే రేగా సమక్షంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే రేగా టీఆర్ఎస్లో చేరే విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా శనివారం రేగాతోపాటు మరో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వారిద్దరూ టీఆర్ఎస్లో చేరేది ఖాయమైపోయినట్లే. నేడు లేదా రేపు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మానుకోట ఎంపీ టికెట్‌పై పీసీసీ నాయకత్వాన్ని నిలదీసిన రేగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గాలైన మహబూబాబాద్, ఆదిలాబాద్‌లకు సంబంధించి ఒక సీటును లంబాడాలకు, మరో సీటును ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే తాజాగా రెండు టికెట్లను లంబాడాలకే ఇవ్వనున్నట్లు తెలియడంతో ఆదివాసీ ఎమ్మెల్యేలు దీనిపై పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆదివాసీ ఎమ్మెల్యేలందరికీ నాయకత్వం వహిస్తున్నది రేగానే కావడం విశేషం. ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడంపై రేగా ఒకింత గట్టిగానే పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నేరుగా ఆదివాసీ ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల విషయమై సమీక్షలు నిర్వహించడం, రేగాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడటంతో పరిణామాలు మరింత వేగంగా మారిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో ప్రాతినిథ్యం లేని టీఆర్ఎస్కు రేగా చేరికతో ఆ లోటు పూడనుంది. ఇదే ఒరవడితో జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంయుక్త ప్రకటన విడుదల చేసిన రేగా, ఆత్రం.. ఇటీవలే తాము కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశామని, ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని పినపాక, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు శనివారం సంయుక్తంగా ప్రకటన చేశారు. పోడు భూముల సమస్య, ఇప్పటికే గిరిజనుల సాగులోఉన్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, వివిధ రకాలుగా జరుగుతున్న అధికారుల వేధింపులు, ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించామని, వీటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామని ప్రకటించారు. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీఆర్ఎస్లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రేపు ఉదయం టీఆర్ఎస్లో చేరబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. పోడు, గిరిజన భూములకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని.. కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని రేగా కాంతారావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలుద్దామనుకున్న కాంగ్రెస్‌కు.. ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాతో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. -
హామీల అమలులో టీఆర్ఎస్ విఫలం
ఆసిఫాబాద్: ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని జన్కాపూర్‌కు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరారు. సక్కు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మా ట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. దళితులకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేజీటు పీజీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చతికిల పడిందన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో సీట్లు అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ నాయకులదేనని ఆరోపించారు. మ ద్యం దుకాణాలకు అనుమతులిచ్చి, పక్కనే పోలీసులతో తనిఖీలు చేయించి కేసులు నమోదు చేయించడం ఎంతవరకు సమజంసమని ప్రశ్నిం చారు. జిల్లాలో ప్రజల కోసం పని చేసే అధికారులు టీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతోపాటు ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎల్డీఎంఆర్సీ కార్యక్రమం కింద జిల్లాలోని తటస్థులను పార్టీలోకి చేర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో జన్కాపూర్‌కు చెందిన శ్యాం, గంగాధర్, కుమార్, వెంకటేశ్, చందు, మహేశ్, ప్రభాకర్‌తోపాటు ఎమ్మార్పీఎస్ నాయకుడు పొ న్నాల నారాయణ, పలువురు యువకులు ఉన్నా రు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొమ్మెన బాలేశ్వర్‌గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇరుకుల్ల మంగ, ఎంపీటీసీ ఫైసల్, నాయకులు ఎత్తేశ్యాం, అసద్, వసంత్‌రావు, కొండ్ర రాజేశ్వర్, శైలేందర్, జాలింషా ఉన్నారు. -
కలప దొంగలను పట్టుకోవాలి
తిర్యాణి: మండలంలోని పంగిడిమాదర గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు లారీలలో అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన సంఘటనలో అధికారులు దోషులను పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలప రవాణాలో అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కలప లారీలు పట్టుబడి రెండు రోజులు గడుస్తున్నా కలప ఎక్కడికి పోతుంది, అది ఎవరిది, అని అధికారులు నిర్ధారించలేకపోతున్నారన్నారు. కలప రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకు తాము ఊరుకునేది లేదని ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక వైపు హరితహారం కార్యక్రమం పెట్టి అడవులను అభవృద్ధి చేయాలని చెపుతున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం అడవులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అవినీతిలో అధికారులు భాగస్వాములు కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహించాలన్నారు. అటవీ సంపద బాహాటంగా తరలిపోతున్నా, అటవీ అధికారులు. పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అడవిలోని వంట చెరుకును తీసుకొస్తేనే అటవీ అధికారులు అమాయకులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో కలప అక్రమంగా తరలిపోతుంటే వారు ఏమి చేస్తున్నట్లన్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి గ్రామ పొలీస్ అధికారిని నియమించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు ఏమి చేస్తున్నట్లన్నారు. అటవీ శాఖామంత్రి ఇలాఖాలోనే కోట్లాది రూపాయల కలప దందా కొనసాగడం శోచనీయమన్నారు. అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న వారు ఎంతటి వారైనా అధికారులు పట్టుకోవాలన్నారు. పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమలో పీసీసీ సభ్యులు విశ్వప్రసాదరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అనిల్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం వెంకటేశం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకంగౌరయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాదిరావు, నాయకులు బ్రహ్మం, మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే..
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు, డీసీసీ ప్రధానకార్యదర్శి విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని వంకులం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రేందాస్తో పాటు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పాటు పడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నేడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకునే వాళ్ల కోసమే తప్పా ప్రజల కోసం పాలన సాగించడం లేదన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్, వైస్ చైర్మన్ వెంకటేశంచారి, కిసాన్ సేత్ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్‌గౌడ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మునీర్ అహ్మద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగ, యువజన అధ్యక్షుడు జగన్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే ఆదివాసీల అభివృద్ధి
ఉట్నూర్, న్యూస్‌లైన్: ఆదివాసీలంతా రాజకీయాలకు అతీ తంగా ఏకమైతేనే అన్ని రకాలుగా అభివృద్ధి సాధించడంతో పాటు హక్కులు, చట్టాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుస్సాడీ గుట్ట ఆవరణలో జిల్లా గోండ్వానా పంచాయత్ రాయ్‌సెంటర్ 27వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆత్రం భీంరావ్, తుకారాం, కొమురం భీమ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయ్‌సెంటర్ అనేది సుప్రీంకోర్టు, హైకోర్టుల వలే అత్యంత ఉన్నతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. దీని పటిష్టతను కాపాడుకోవాలంటే ఆదివాసీలంతా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఇటీవల బోథ్ ఎమ్మెల్యే ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ పీవోను కలవడానికి వచ్చి రెండు గంటల పాటు వేచి చూసినా ఆ అధికారి కలవకపోవడం బాధాకరమన్నారు. ఓ ప్రజా ప్రతినిధికే కలవని పీవో అడవి బిడ్డల సమస్యలు ఏం పట్టించుకుంటారో అర్థం కావడం లేదన్నారు. అనంతరం రాయ్‌సెంటర్ వ్యవస్థ ప్రారంభికుల్లో ఒకరైన మాజీ జిల్లా మేడి మడావి రాజు, పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల్లో ఐక్యత లేకపోవడంతో జిల్లాలో వలసవాదులు పెరుగుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సభ ప్రారంభానికి ముందు ఇటీవల మృతిచెందిన సోంజీ వా ర్డెన్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పా టించారు. జిల్లా రాయ్‌సెంటర్ అధ్యక్షుడు మెస్రం దుర్గు, ప్ర ధాన కార్యదర్శి తొడసం దేవ్‌రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడిలు బొంత ఆశారెడ్డి, వసంత్‌రావ్, పెందూర్ ప్రభాకర్, వెడ్మా బొజ్జు, ఆత్రం తిరుపతి, కనక యాదవ్రావ్, సిడాం శంభు, పద్రం జైవంత్‌రావ్, మడావి రాజు, దివాకర్, కోట్నాక సుధాకర్, సిడాం అర్జు, భీంరావ్, జుగ్నాత్రావ్, నాగోరావ్, తులసీరాం, మొగిళి, విఠల్‌రావ్ పాల్గొన్నారు.