ఉట్నూర్, న్యూస్‌లైన్: ఆదివాసీలంతా రాజకీయాలకు అతీ తంగా ఏకమైతేనే అన్ని రకాలుగా అభివృద్ధి సాధించడంతో పాటు హక్కులు, చట్టాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుస్సాడీ గుట్ట ఆవరణలో జిల్లా గోండ్వానా పంచాయత్ రాయ్‌సెంటర్ 27వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆత్రం భీంరావ్, తుకారాం, కొమురం భీమ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయ్‌సెంటర్ అనేది సుప్రీంకోర్టు, హైకోర్టుల వలే అత్యంత ఉన్నతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. దీని పటిష్టతను కాపాడుకోవాలంటే ఆదివాసీలంతా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఇటీవల బోథ్ ఎమ్మెల్యే ఆదివాసీల సమస్యలపై ఐటీడీఏ పీవోను కలవడానికి వచ్చి రెండు గంటల పాటు వేచి చూసినా ఆ అధికారి కలవకపోవడం బాధాకరమన్నారు.
ఓ ప్రజా ప్రతినిధికే కలవని పీవో అడవి బిడ్డల సమస్యలు ఏం పట్టించుకుంటారో అర్థం కావడం లేదన్నారు. అనంతరం రాయ్‌సెంటర్ వ్యవస్థ ప్రారంభికుల్లో ఒకరైన మాజీ జిల్లా మేడి మడావి రాజు, పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల్లో ఐక్యత లేకపోవడంతో జిల్లాలో వలసవాదులు పెరుగుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సభ ప్రారంభానికి ముందు ఇటీవల మృతిచెందిన సోంజీ వా ర్డెన్ ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పా టించారు. జిల్లా రాయ్‌సెంటర్ అధ్యక్షుడు మెస్రం దుర్గు, ప్ర ధాన కార్యదర్శి తొడసం దేవ్‌రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు, సార్‌మేడిలు బొంత ఆశారెడ్డి, వసంత్‌రావ్, పెందూర్ ప్రభాకర్, వెడ్మా బొజ్జు, ఆత్రం తిరుపతి, కనక యాదవ్‌రావ్, సిడాం శంభు, పద్రం జైవంత్‌రావ్, మడావి రాజు, దివాకర్, కోట్నాక సుధాకర్, సిడాం అర్జు, భీంరావ్, జుగ్నాత్‌రావ్, నాగోరావ్, తులసీరాం, మొగిళి, విఠల్‌రావ్ పాల్గొన్నారు.
ఐక్యతతోనే ఆదివాసీల అభివృద్ధి
Published Wed, Jan 1 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement