బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేసీఆర్‌ లాంటి దొరలే..! | CM Revanth Reddy's Satires On Athram Sakku And Nagesh | Sakshi
Sakshi News home page

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కేసీఆర్‌ లాంటి దొరలే..!

Published Tue, Apr 23 2024 9:33 AM | Last Updated on Tue, Apr 23 2024 9:43 AM

CM Revanth Reddy's Satires On Athram Sakku And Nagesh - Sakshi

సక్కు, నగేశ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

బీఆర్‌ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్‌ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు.

అలాగే గోడం నగేశ్‌ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్‌ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు.

ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్‌ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో ఉండే దొరలైనా ఆదిలాబాద్‌లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.

ఇవి చదవండి: సీఎం హామీల జల్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement