
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన క్లాస్ చూపించాడు. కేకేఆర్ బౌలర్లను కింగ్ కోహ్లి ఓ ఆట ఆడేసుకున్నాడు.
విరాట్ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో స్కోర్ బోర్డున పరుగులు పెట్టించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. విరాట్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 55వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన కోహ్లి..
👉విరాట్ కోహ్లికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచ్ లు ఆడిన మూడో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. రోహిత్ శర్మ (448), దినేశ్ కార్తీక్ (412) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్ తరపున 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..ఆర్సీబీ తరపున 268 మ్యాచ్ లాడాడు.
👉ఐపీఎల్‌లో కేకేఆర్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. కేకేఆర్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 28 ఇన్నింగ్స్‌ల్లో 43.72 సగటుతో 1,093 పరుగులు చేశాడు. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 34 ఇన్నింగ్స్‌ల్లో 39.62 సగటుతో 1,070 పరుగులు చేశాడు.
👉ఐపీఎల్ చరిత్రలో నాలుగు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లపై 1000కి పైగా రన్స్ చేశాడు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment