
Photo Courtesy: BCCI
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ లేట్‌గా ఐపీఎల్-2025లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ మెగా వేలంలో అన్ సోల్డ్‌గా ఉన్న శార్దూల్‌ను తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. లక్నో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహిసిన్ ఖాన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరం కావడంతో అతనికి ప్రత్యామ్నాయంగా శార్దూల్ ఎంపిక జరిగింది.
శార్దూల్‌ను రిజిస్టర్ అవైలబుల్ ప్లేయర్ పూల్ (RAPP) నుంచి లక్నో ఎంపిక చేసుకుంది. లక్నో అతన్ని బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. శార్దూల్ ఎంపికతో బలహీనంగా ఉన్న లక్నో పేస్ బౌలింగ్ విభాగానికి కొత్త జోష్ వచ్చింది. ఈ సీజన్‌లో లక్నో పేస్ బౌలింగ్ యూనిట్ గాయాలతో సతమతమవుతుంది.
ఆ జట్టు పేస్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్, సీనియర్లు ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్ గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న మయాంక్ ఏప్రిల్ 15 తర్వాత జట్టులో చేరతాడని తెలుస్తుంది. ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్ లక్నో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరతారని సమాచారం.
ఇటీవలికాలంలో దేశవాలీ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన శార్దూల్‌ను ఎందుకో మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. లేట్‌గా అయినా శార్దూల్ ఐపీఎల్ 2025లోకి ఎంట్రీ ఇచ్చాడు. 33 ఏళ్ల శార్దూల్‌కు ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌ల అనుభవం ఉంది. ఇందులో అతను 94 వికెట్లు తీశాడు.
లోయర్ ఆర్డర్‌లో శార్దూల్ ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. ఇటీవలి దేశవాలీ సీజన్‌లో శార్దూల్ బ్యాట్‌తోనూ మెరిపించాడు. శార్దూల్‌కు ఐపీఎల్‌లో ఐదు జట్లకు (పంజాబ్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సీఎస్‌కే, ఢిల్లీ, కేకేఆర్) ఆడిన అనుభవం ఉంది. అతను ఐపీఎల్‌లో రెండు టైటిళ్లలో భాగమయ్యాడు. 2018, 2021లో సీఎస్‌కే విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తమ టైటిల్ వేటను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ సెకెండ్ హోం గ్రౌండ్ అయిన వైజాగ్‌లో జరుగనుంది. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లలో (2022, 2023) మూడో స్థానంలో నిలిచి, గత సీజన్‌లో (2024) ఏడో స్థానానికి పడిపోయింది.
గత సీజన్‌లో లక్నో ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. ఈ కారణంగానే ఆ జట్టు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా దించేసి రిషబ్ పంత్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. పంత్‌ను లక్నో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్..
రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హిమ్మత్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, యువరాజ్ చౌదరీ, షాబాజ్ అహ్మద్, మిచెల్ మార్ష్, అర్శిన్ కులకర్ణి, ఆర్‌ఎస్ హంగార్గేకర్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, ఆర్యన్ జుయల్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆకాశ్‌దీప్, మణిమారన్ సిద్దార్థ్, షమార్ జోసఫ్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రతీ
Comments
Please login to add a commentAdd a comment