
PC: BCCI/IPL.com
టీమిండియా వెటరన్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్‌లో వంద మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు.. ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా శార్ధూల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు శార్థూల్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చేతిల మీదగా వంద నెంబర్ గల ప్రత్యేక జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆఖరి నిమిషంలో ఎంట్రీ?
వాస్తవానికి శార్థూల్ ఠాకూర్ ఐపీఎల్-2025లో అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... లక్నో మెంటార్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చింది.
లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని శార్ధూల్ అందిపుచ్చుకున్నాడు.
ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన లార్డ్ ఠాకూర్.. 7 వికెట్లు పడగొట్టాడు. శార్ధూల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, లక్నో జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్.. ఐపీఎల్‌లో తొలి కెప్టెన్‌గా అరుదైన ఫీట్
𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 💯
Shardul Thakur steps into his 1️⃣0️⃣0️⃣th #TATAIPL match 👏👏
He receives a momentous jersey from #LSG mentor Zaheer Khan 👌#KKRvLSG | @imShard pic.twitter.com/G7jA3exxvE— IndianPremierLeague (@IPL) April 8, 2025